
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ తొలగింది. డెత్‌వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు నిరాకరించింది. దీంతో రేపు(మార్చి 3) ఉదయం 6గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మరోవైపు తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. దీంతో నలుగురు దోషులకు రేపు తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు అయ్యే అవకాశం ఉంది.
(చదవండి : మార్చి 3న ఉరితీయండి )
అయితే పవన్‌కి ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మరో వైపు ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అన్నీ అడ్డంకులు తొలిగిపోవడంతో రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురు నిందితులను తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు.