రేపు మధ్యాహ్నం సీబీఎస్ఈ ఫలితాల విడుదల | tomorrow, cbse results to be released | Sakshi
Sakshi News home page

రేపు మధ్యాహ్నం సీబీఎస్ఈ ఫలితాల విడుదల

Published Fri, May 20 2016 10:04 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

రేపు మధ్యాహ్నం సీబీఎస్ఈ ఫలితాల విడుదల - Sakshi

రేపు మధ్యాహ్నం సీబీఎస్ఈ ఫలితాల విడుదల

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు.

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. 21 వ తేదీ మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా 10.67 లక్షల మంది విద్యార్థులు (ప్లస్ 2) ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత మార్చి 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జేఈఈతో పాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు హాజరైన విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

సీబీఎస్ఈ ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్టు ముందుగా సంకేతాలు ఇచ్చారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ 21 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. ఫలితాలను www.cbseresults.nic.in లో చూసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement