
వాషింగ్టన్: ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయులు సమర్పించే హెచ్1బీ వీసా దరఖాస్తులనే అమెరికా ఎక్కువగా తిరస్కరిస్తోందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అనే ఎన్జీవో సంస్థ తెలిపింది. అలాగే రిక్వెస్ట్ ఆఫ్ ఎవిడెన్స్‌ను సమర్పించాలని అమెరికా అధికారులు భారతీయుల్నే ఎక్కువగా కోరుతున్నారని వెల్లడించింది. అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ వివరాలను విశ్లేషించిన అనంతరం ఈ సంస్థ నివేదిక విడుదల చేసింది. 2017 మూడో, నాలుగో త్రైమాసికంలో భారతీయుల హెచ్1బీ దరఖాస్తుల తిరస్కరణ 42% పెరగ్గా, ఇతర విదేశీయులకు సంబంధించి ఇది 40 శాతంగా ఉందంది.