Top Stories
ప్రధాన వార్తలు

‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘భారత్‌లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి. పాక్ పౌరులను భారత్‌లోకి అనుమంతించేది లేదు. పహల్గాం దాడి వెనుక పాక్ హస్తం ఉంది. అందుకు మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి’ అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీ నివాసంలో రెండున్నర గంటల పాటు భద్రత వ్యవహారాల కేబినేట్ కమిటీ (Cabinet Committee on Security) సమావేశం కొనసాగింది. అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను విక్రమ్ మిస్రీ వెల్లడించారు. #WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "Recognising the seriousness of this terrorist attack, the Cabinet Committee on Security (CCS) decided upon the following measures- The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan… pic.twitter.com/WsRKE39vEO— ANI (@ANI) April 23, 2025👉ఇండస్ వాటర్ ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భద్రత వ్యవహారాల కేబినేట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి స్వస్తి పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేత కొనసాగుతుంది. 👉అటారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు తక్షణమే మూసివేతఅటారి చెక్‌పోస్టును తక్షణమే మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చట్టబద్ధమైన డాక్యుమెంట్లతో ఆ మార్గం గుండా భారత్‌కు వచ్చిన పాకిస్తానీయులు మే 1వ,2025 తేదీ లోపు తిరిగి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. 👉పాక్ పౌరులకు SAARC వీసా మినహాయింపు నిలిపివేతSAARC Visa Exemption Scheme (SVES) ద్వారా పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు ఈ వీసాతో భారత్‌లో ఉన్న వారు 48 గంటల్లో దేశాన్ని విడిచిపెట్టాలని సూచించింది.👉 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సైనిక సలహాదారులకు 'పర్సోనా నాన్ గ్రాటా'విధింపు భారత్‌లో ఉన్న పాక్ రక్షణ, నౌకా, వాయుసేన సలహాదారులపై ''persona non grata' విధించింది. ఒక వారంలోగా వారందరూ భారత్ విడిచిపెట్టాలి.👉 ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి సైనిక సలహాదారుల ఉపసంహరణపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌లోని ఇస్లామాబాద్ హైకమిషన్ నుండి భారత రక్షణ, నౌకా,వాయుసేన సలహాదారులను ఉపసంహరించింది.

పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్‌లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.

పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్.. అప్డేట్స్భారత్లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి: విక్రమ్ మిస్రీవిదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంపాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదుపహల్గాం దాడివెనుక పాక్ హస్తం ఉందిమా దగ్గర పూర్తి ఆధారాలున్నాయిఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాంఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపేస్తున్నాంఅటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును మూసివేస్తున్నాంపాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులుసుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారంఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులుజమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్‌సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీపాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం పాక్ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు ఎయిర్ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ మరికాసేపట్లో ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్‌కి వచ్చిన అధికారి ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the #Pahalgam terror attackThe couple got married on April 16. 💔💔 pic.twitter.com/a83lpg3A40— Venisha G Kiba (@KibaVenisha) April 23, 2025జమ్ములో అత్యధికంగా ఎల్ఈటీ ఉగ్రవాదులు! జమ్ము కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్ఈటీ విభాగం అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా గుర్తింపు ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్? ముజాహిదీలు కశ్మీర్లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్ సాయంత్రం కేబినెట్ కీలక సమావేశంపహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాసాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంకేబినెట్ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్‌నాథ్‌ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్ విధానం : రాజ్‌నాథ్‌ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్‌నాథ్‌పహల్గామ్ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E— ANI (@ANI) April 23, 2025 ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్.. ఆరేళ్లలో తొలిసారి బంద్! పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం శ్రీనగర్ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో తొలిసారి బంద్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భద్రత కట్టుదిట్టం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం పాకిస్థాన్ హైకమిషన్ వద్ద గట్టి సెక్యూరిటీ పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ట్వీట్ జమ్మును వీడుతున్న పర్యాటకులుపహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులుఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లుకాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లుఆరు గంటల్లో కశ్మీర్‌ను వీడిన 3,300 మంది పర్యాటకులుపర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాIt’s heartbreaking to see the exodus of our guests from the valley after yesterday’s tragic terror attack in Pahalgam but at the same time we totally understand why people would want to leave. While DGCA & the Ministry of Civil Aviation are working to organise extra flights,… pic.twitter.com/5O3i5U1rBh— Omar Abdullah (@OmarAbdullah) April 23, 2025 భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్‌ను వదిలి పాక్ వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్‌ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్లో చొరబడినట్లు అనుమానంఅదిల్, అషన్ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్ బ్లాక్ రేంజ్లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్ మౌంటెడ్ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్ కవ్వింపు చర్యలుపాక్ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్ ఐఎస్ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానంఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్ కశ్మీర్ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్‌గర్ల్స్ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్ కంట్రోల్ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయ భేరి మోగించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది.ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు.

కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
కష్టపడితే సాధించలేనిది లేదు అని కొందరు చెబుతారు, మరికొందరు నిరూపిస్తారు. అలా నిరూపించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామిక వేత్త 'ధీరూభాయ్ అంబానీ' ఒకరు. గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని.. చోర్వాడ గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఈయన, అంత గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు?, ఆయన మరణించే సమయానికి ఆయన సంపద ఎంత?, కుమారులకు ఇచ్చిన ఆస్తులు ఏమిటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.రూ.300 జీతానికిసాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. నిజాయితీగా పనిచేస్తూ.. అతి తక్కువ కాలంలోనే అక్కడే మేనేజర్ అయ్యారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చేసారు.భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. ధీరూభాయ్ అంబానీ ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది.ప్రపంచంలో 138వ ధనవంతుడిగారిలయన్స్ సంస్థ ఓ పెద్ద సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత.. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. అప్పటికి ఈయన సంపద ఎంత అనేదానికి సంబంధించిన గణాంకాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. కాగా రిలయన్స్ విలువ రూ. 60,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ లక్షల కోట్లు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి.. రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయితవారసులకు ఏమిచ్చారు?ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, అధికారిక వీలునామా లేకపోవడంతో గ్రూప్ భవిష్యత్తు నాయకత్వం గురించి అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఆయన ఇద్దరు కుమారులు ఆస్తులను పంచుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వం వహించారు.ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, తరువాత టెలికాం ఉన్నాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ మొదలైనవి తీసుకున్నారు.

అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
సాక్షి, సంగారెడ్డి: చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌లోనూ ఉంచలేమంటూ అధికారులు తేల్చి చెప్పారు. అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు.. లింగ నిర్థారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. మరో వైపు, సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరీ అరుపులతో హడావుడి చేశాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు.పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో మోకిలా పోలీసులు.. అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్- మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నగరానికి తీసుకువచ్చారు. మోకిలా పోలీసులు. అఘోరీతో పాటు వర్షిణిని కూడా నగరానికి తరలించారు. ఏపీకి చెందిన వర్షిణి.. అఘోరీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించిన ఈ జంట.. ఓ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది.

ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
ఐదేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya). సరిగమప లిటిల్ ఛాంప్స్ రియాలిటీ షోలో విజేతగానూ నిలిచింది. చిన్నతనంలోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది. తెలుగు, తమిళ భాషల్లో పలు రియాలిటీ షోలలో పాల్గొంది. ఇటీవల మరోసారి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తనపై జడ్జిలు సునీత, కీరవాణి, చంద్రబోస్ వివక్ష చూపించారని ఆరోపించింది. సింగింగ్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌తననొక చీడపురుగులా చూస్తూ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. షో నిర్మాతలు కూడా కొన్నిసార్లు సరైన డ్రెస్సులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవారంది. షోలో జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన తనకు ఇక భవిష్యత్తు ఉండదని అర్థమై గాయనిగా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాటలంటే ప్రాణమున్న నువ్వు సంగీతాన్ని విడిచిపెట్టొద్దని.. సింగర్‌గా కొనసాగాలని గాయని మాళవిక (Singer Malavika) అభ్యర్థించింది. కష్టమంతా బూడిదపాలుఅందుకు ప్రవస్తి స్పందిస్తూ.. నాపై విషం కక్కుతూ ఉంటే ఇంకా ఈ ఫీల్డ్‌లో ఎలా కొనసాగగలను? మీరందరూ నేను పాడాలని కోరుకుంటున్నారు. కానీ నా కష్టం, ప్రతిభ అంతా బూడిదలో కలిసిపోతుంటే ఎలా తట్టుకోగలను? వివక్ష చూపిస్తుంటే ఎలా భరించగలను? అని ప్రశ్నించింది. మరోవైపు ప్రవస్తిపై సింగర్ హారిణి ఇవటూరి (Harini Ivaturi) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ డ్రామాలు చాలు.. ప్రశంసల కోసం పాకులాడినప్పుడు విమర్శలు స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి. చదవండి: 'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీఇంకా ఎంతవరకు లాగుతావ్?పాడుతా తీయగా షోలో చాలా ఎపిసోడ్లు చూశాను. కొన్ని చోట్ల నిన్ను నువ్వు ఇంకా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ పొరపాట్లను సరిదిద్దుకోవడం మానేసి అనుభవజ్ఞులైన జడ్జిలను ప్రశ్నిస్తున్నావా? నీకేదైనా అన్యాయం జరిగిందంటే అది షోలోనే తేల్చుకోవాలి. షో అయిపోయాక ఇలా పబ్లిక్‌లో మాట్లాడటం సరికాదు. జడ్జిల క్యారెక్టర్లను తప్పుపట్టడం అన్యాయం. నువ్వు నిరాశలో ఉన్నావని... దాన్ని ఇలా లాగుతూనే ఉంటావా? నీకు నిజంగా దమ్ముంటే వారితోనే నేరుగా మాట్లాడతావ్.టాలెంట్‌తోనే ఆన్సర్..ఇంత రచ్చ చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నీకంత బాధ ఉంటే నీ టాలెంట్‌తోనే సమాధానం చెప్పాలి. నా సొంత అనుభవమే చెప్తా.. ఒకసారి చివరి నిమిషంలో నేను పాడాల్సిన పాట మార్చేశారు. అయినా సరే దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పాడా.. బెస్ట్ పర్ఫామెన్స్ గెలుచుకున్నా! ఛాలెంజ్‌లు లేకుంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. రియాలిటీ షోలలో ఒత్తిడి భరించలేకపోతున్నావంటే అవి నీకు సెట్టవవు. నీకేదైనా డ్రెస్ నచ్చలేదంటే అప్పుడే ముక్కుసూటిగా చెప్పేయాలి. అప్పుడే పోరాడాల్సిందిఅంతేకానీ ఇప్పుడెందుకు చెప్పడం? నీ ఎలిమినేషన్ అప్పుడు మీ తల్లి.. జడ్జిలతో ఎంత గట్టిగా మాట్లాడిందో.. నీకు జరుగుతున్న బాడీ షేమింగ్ గురించి మేనేజ్మెంట్ దగ్గర అంతే గట్టిగా చెప్పాల్సింది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న ధైర్యం అప్పుడేమైంది. పబ్లిక్‌గా వాళ్లను విమర్శించడం దేనికి? అని ఆగ్రహించింది. ఈ పోస్ట్‌పై ప్రవస్తి స్పందిస్తూ.. అక్కా, దయచేసి నా బాధను డ్రామా అని పిలవొద్దు. నేను పిరికిదాన్ని అని కూడా అన్నారు. నిజంగా పిరికిదాన్నయితే పవర్ఫుల్ వ్యక్తుల గురించి మాట్లాడను. నేరుగా మాట్లాడొచ్చుగా అని ఇంకో పాయింట్ అన్నారు.నాకు ఛాన్స్ ఇస్తేగా!వాళ్లు నాకు అవకాశం ఇస్తే కదా నేరుగా మాట్లాడేది. స్టేజీ మీద ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకు వాళ్లు ఏ సమాధానం చెప్పలేదు. నిజంగా పిరికిదాన్నయితే మీరందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారని తెలిసి కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా! అని కౌంటర్ ఇచ్చింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనకు జరిగిన ఓ మంచిని సైతం పొందుపరిచింది. ఇండస్ట్రీలో చెడు ఉన్నట్లే మంచి కూడా ఉందని పేర్కొంది. సంగీత దర్శకుడు తమన్ 'బ్రో' మూవీలో ఇతర సింగర్స్‌తో కలిసి వెనకాల కోరస్ పాడే అవకాశం ఇచ్చారని పేర్కొంది. View this post on Instagram A post shared by Harini Ivaturi (@hariniivaturi)చదవండి: ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే

పహల్గాం దాడికి దీటుగా బదులిస్తాం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడుల వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.‘పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యతో అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ దుర్ఘటన నన్ను కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఉగ్రవాదంపై దేశం సంకల్పాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నాను. భారత్‌ను ఎవరూ భయపెట్టలేరు. ప్రభుత్వం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాదు, తెరవెనుక ఉన్న ఎంతటివారినైనా ఉపేక్షించబోం. ప్రతీకారం తీర్చుకుంటాం’అని హెచ్చరించారు. #WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "We lost many innocent lives in the cowardly act in Pahalgam. We are deeply distressed. I express my condolences to the families who lost their loved ones... I want to repeat India's resolve against… pic.twitter.com/OhuX8rkghy— ANI (@ANI) April 23, 2025ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా.. వారి వెనుక ఎవరున్నా ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు త్రివిధ దళాదిపతులతో రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎకె సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా.. వారి వెనుక ఎవరున్నా విడిచి పెట్టమంటూ ఘాటుగా స్పందించారు.సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలతో కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్? చేపట్టేందుకు సిద్ధమైందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ,రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు వరుస సమావేశాలు నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.ఇప్పటికే కశ్మీర్ పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని మోదీకి వివరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు.కేంద్రం ఆదేశాల అమలుకు త్రివిధ దళాధిపతులు సిద్ధమనే సంకేతాలిచ్చారు.పహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బాగాయత్లో ఏర్పాటు చేసిన శిబిరం.. వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. వెయ్యి రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు.. 700 ఆయిల్ కాస్ట్ అంటూ హరీశ్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్, వినోద్, రాజశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాతబస్తీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వకీల్ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్ పేరుతో కటింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.వకీల్ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్‌ను బట్టతలపై రాసేవాడు. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు.

మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
దుబాయ్‌కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్‌లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు మస్క్‌తోపాటు, మస్క్ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్‌ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్‌డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్‌లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్ టైకూన్ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్‌ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
పహల్గాం ఘటనను ఖండించిన హీరో కృష్ణసాయి
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
యాపిల్, మెటాకు భారీ వేలకోట్లు జరిమానా
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
సంచలన విజయం దిశగా జింబాబ్వే
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
గన్నవరం విమానాశ్రయం రికార్డు
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఇక చాలు.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
యాపిల్, మెటాకు భారీ వేలకోట్లు జరిమానా
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
3 నిమిషాల్లో హతమార్చేశారు!
టర్కీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజల పరుగులు
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
నాకు నువ్వు వద్దు!
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ
పహల్గాం దాడికి దీటుగా బదులిస్తాం
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
పహల్గాం ఘటనను ఖండించిన హీరో కృష్ణసాయి
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
ఏడాది పాటు డైట్ చేశా.. బురద సీన్ సవాల్‌గా అనిపించింది: విజయశాంతి
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో?
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
చైనాలో 10జీ నెట్వర్క్..!
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
తిరుమలలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన భక్తులు
ఓటీటీలోకి కామెడీ మూవీ 'బ్రొమాన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
ఏటా 80 లక్షల ఉద్యోగాలు
విశ్వసనీయ మిత్రదేశం
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
సినిమా హిట్.. 10 రోజులు తాగుతూనే ఉన్నాం!
'అజిత్' అభిమానులకు గూస్బంప్స్ తెప్పించిన సాంగ్ విడుదల
కటాఫ్టైమ్లో సెబీ మార్పులు
Pahalgam: ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్ని పిండేసే వీడియోలు
నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా
సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం
పహల్గాం ఉగ్రదాడి.. అధికారికంగా 26 మంది మృతుల వివరాలు విడుదల
టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
పహల్గాం ఘటనను ఖండించిన హీరో కృష్ణసాయి
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
యాపిల్, మెటాకు భారీ వేలకోట్లు జరిమానా
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
సంచలన విజయం దిశగా జింబాబ్వే
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
గన్నవరం విమానాశ్రయం రికార్డు
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఇక చాలు.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
యాపిల్, మెటాకు భారీ వేలకోట్లు జరిమానా
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
3 నిమిషాల్లో హతమార్చేశారు!
టర్కీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజల పరుగులు
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
నాకు నువ్వు వద్దు!
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ
పహల్గాం దాడికి దీటుగా బదులిస్తాం
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
పహల్గాం ఘటనను ఖండించిన హీరో కృష్ణసాయి
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
ఏడాది పాటు డైట్ చేశా.. బురద సీన్ సవాల్‌గా అనిపించింది: విజయశాంతి
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో?
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
చైనాలో 10జీ నెట్వర్క్..!
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
తిరుమలలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన భక్తులు
ఓటీటీలోకి కామెడీ మూవీ 'బ్రొమాన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
ఏటా 80 లక్షల ఉద్యోగాలు
విశ్వసనీయ మిత్రదేశం
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
సినిమా హిట్.. 10 రోజులు తాగుతూనే ఉన్నాం!
'అజిత్' అభిమానులకు గూస్బంప్స్ తెప్పించిన సాంగ్ విడుదల
కటాఫ్టైమ్లో సెబీ మార్పులు
Pahalgam: ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్ని పిండేసే వీడియోలు
నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా
సొంతూరికి రామ్ చరణ్ డైరెక్టర్.. గ్రామస్తులతో కలిసి భోజనం
పహల్గాం ఉగ్రదాడి.. అధికారికంగా 26 మంది మృతుల వివరాలు విడుదల
టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
సినిమా

ఓటీటీలోకి కామెడీ మూవీ 'బ్రొమాన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాల్ని డబ్ చేసి నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తుంటారు. అలా దాదాపు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలో కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) 'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాతో మనకు పరిచయమైన సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్ తో పాటు అర్జున్ అశోకన్, మహిమ నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'బ్రొమాన్స్'. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఫిబ్రవరి 14న రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దాదాపు రెండున్నర నెలల తర్వాత అంటే మే 1 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) 'బ్రొమాన్స్' విషయానికొస్తే.. బింటో (మాథ్యూ థామస్) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంటాడు. ఇతడి అన్నయ్య షింటో (శ్యామ్) కొచ్చిలో జాబ్ చేస్తూ అక్కడే ఉంటాడు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోస బింటో.. కూర్గ్ వెళ్లగా.. అన్నయ్య కనిపించకుండా పోయాడనే విషయం తెలుస్తుంది.దీంతో అన్నయ్యని వెతికేందుకు బింటో ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇతడికి షబీర్, ఐశ్వర్య, హరిహరసుధాన్, కొరియర్ బాబు అని నలుగురు వ్యక్తులు కలుస్తారు. వీళ్లందరూ కలిసి షింటోని వెతికుతుంటారు. మరి చివరకు షింటో దొరికాడా? ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) Chaos, comedy, and a gang you’ll never forget. Watch #Bromance streaming from May 1 on SonyLIV pic.twitter.com/mjgYqjnDok— Sony LIV (@SonyLIV) April 23, 2025

ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో(OTT Movie) మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వాటి ఒరిజినల్ వెర్షన్స్ కొందరు చూస్తుంటారు. కానీ చాలామంది తెలుగు ఆడియెన్స్ మాత్రం తెలుగులో డబ్ చేస్తే చూద్దామని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ క్యూట్ లవ్ స్టోరీ మూవీ వచ్చేసింది. గతేడాది మార్చిలో మలయాళంలో రిలీజైన సినిమా 'జననం 1947 ప్రణయం తుడరున్'. 70 ఏళ్ల వయసున్న ఓ మహిళ, పురుషుడు ప్రేమలో పడితే అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. దీన్ని దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత తెలుగులో ఇప్పుడు రిలీజ్ చేశారు. ఒరిజినల్ అమెజాన్ ప్రైమ్ లో ఉండగా.. ప్రస్తుతం ఆహాలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) '1947 ప్రణయం'(1947 Pranayam Movie) పేరుతో దీన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సినిమా విషయానికొస్తే.. శివ(జయరాజ్ కొజికోడ్) ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంటాడు. అక్కడే ఉంటున్న గౌరీ అనే రిటైర్డ్ టీచర్.. శివని చూసి ఇష్టపడుతుంది. అతడితో కలిసి ఉండాలనుకుంటుంది. దీనికి అనుమతి దక్కడంతో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తారు. మరి ఓల్డేజ్ ప్రేమకథ చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూద్దామనుకుంటే మాత్రం ఈ వీకెండ్ కి ఇది మంచి ఆప్షన్ కావొచ్చు. మరోవైపు ఈ వారం థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా సినిమాలు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఎల్ 2 ఎంపురాన్, వీరధీరసూర చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)

'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో?
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా నా సినిమాలు ఉంటాయి' అంటున్నాడు దర్శకుడు, నటుడు సుందర్.సి. ఈయన ఇటీవలే మదగజరాజ సినిమాతో హిట్టందుకున్నాడు. నిజానికి ఇది 2012లో రావాల్సిన సినిమా. కానీ ఎందుకో విడుదలకు నోచుకోలేదు. విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 12న విడుదలై విజయం సాధించింది.డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవ్ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సుందర్. సి (Sundar C) మాట్లాడుతూ.. నా సినిమా ప్రతి ఒక్కరూ చూసేలా ఉండాలని కోరుకుంటాను. అందుకే డబుల్ మీనింగ్ డైలాగులు రాయను. ఒకవేళ ఏవైనా ద్వంద్వార్థాలు ఉండే డైలాగ్స్ కనిపించాయంటే అవి కేవలం ప్రేక్షకులు ఊహించుకుంటున్నవే కానీ నేను మాత్రం ఆ ఉద్దేశంతో రాయలేదు.ఐటం సాంగ్స్ ఉండవ్స్క్రిప్టు రాసే దగ్గరి నుంచి షూటింగ్ వరకు ఎక్కడా డబుల్ మీనింగ్స్కు, అసభ్యతకు చోటు లేకుండా జాగ్రత్తపడతాను. అలా అని నా సినిమాల్లో గ్లామర్ లేకుండా ఉండదు. కాకపోతే ఆ గ్లామర్‌ను ఎలా చూపిస్తున్నానన్నది ముఖ్యం. ఉదాహరణకు చీరకట్టుకున్న అమ్మాయిని రకరకాల యాంగిల్స్‌లో ఇంకోలా చూపించొచ్చు. నేను మాత్రం అలాంటి పని చేయను. నేను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వీలుగా విజువల్స్ ఉండాలని భావిస్తాను. అలాగే నా సినిమాల్లో ఐటం సాంగ్స్ ఉండవు.. నా చిత్రాలు ఫ్యామిలీ ఫ్రెండ్లీలా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.మరి ఇదేంటి సార్?ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెట్టారు. అతడు రాసిన డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ను, కాస్త ఓవర్‌డోస్‌గా ఉన్న సన్నివేశాలను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలు తీస్తే.. అరణ్మనై మూవీ (Aranmanai Movie)లో స్విమ్మింగ్ పూల్ సీన్ దేనికుందో మరి?, అంబాలా మూవీలో మద్రాస్ టు మధురై ఐటం సాంగ్ ఉందిగా.. అరణ్మనైలో తమన్నా, రాశీలతో డ్యాన్స్ చేయిస్తూ క్లోజ్ షాట్స్‌లో చిత్రీకరించావుగా.. అంటూ పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమాఇకపోతే సుందర్.. మెట్టుకుడి, అరుణాచలం, అంబే శివం, లండన్, రెండు, అరణ్మనై (నాలుగు భాగాలు), యాక్షన్, కాఫీ విత్ కాదల్, మదగజరాజ వంటి పలు సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు కొన్నింటిలో నటించాడు కూడా! ఈయన ప్రస్తుతం దర్శకుడిగా, నటుడిగా గ్యాంగర్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కమెడియన్ వడివేలు, కేథరిన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న విడుదల కానుంది. 🤣pic.twitter.com/bOWN7aANH1— Prakash Mahadevan (@PrakashMahadev) April 20, 2025 I love Sundar C glamour but I can't digest the fact he is not accepting. He has the most naughtiest frames in Kollywood but carefully escaping— 𝐒𝐔𝐍𝐈𝐋 𝐓𝐇𝐈𝐋𝐀𝐊 (@sunil_thilak) April 20, 2025చదవండి: RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్

ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
పలు కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అర్చన కొట్టిగె(Archana Kottige) పెళ్లి చేసుకుంది. తన రాష్ట్రానికి చెందిన శరత్ అనే క్రికెటర్ తో కొత్త జీవితం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2018 నుంచి ఇండస్ట్రీలో ఉన్న అర్చన.. డియర్ సత్య, యెల్లో గ్యాంగ్స్, విజయానంద్, హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే తదితర సినిమాల్లో నటించింది. ఈమె వయసు ప్రస్తుతం 28 ఏళ్లే. అయితేనేం కర్ణాటక తరఫున క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బీఆర్(Sharath Br)ని పెళ్లి చేసుకుంది. బుధవారం ఉదయం సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి(Heroine Wedding) జరిగింది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)ఇకపోతే మంగళవారం రాత్రి అర్చన-శరత్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగ్గా.. కాంతార హీరోయిన్ సప్తమి గౌడతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలానే శరత్ కోసం కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ, యష్ దయాల్, దేవదత్ పడిక్కల్ తదితరులు హాజరయ్యారు.కర్ణాటక తరఫున అండర్-23 ఆడిన శరత్.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. గతేడాది ఐపీఎల్ లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. కనీస ధర రూ.20 లక్షలకు ఇతడిని టీమ్ దక్కించుకుంది. కానీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకోవడంతో సినీ, క్రికెట్ సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్)
న్యూస్ పాడ్‌కాస్ట్

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం
క్రీడలు

ఇక చాలు.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ క్రీడా లోకం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. అందుకు బాధ్యలైన వారికి తగిన గుణపాఠం చెప్పాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి తీవ్రంగా స్పందించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని అతడు బీసీసీఐకి లేఖకు రాశాడు. ఇందుకు సంబంధించిన లెటర్‌ను తన ఎక్స్ ఖాతాలో గోస్వామి పోస్ట్ చేశాడు."ఈ విషాదకర ఘటన సమయంలో నేను ఒక విషయం చెప్పాలనకుంటున్నాను. ఇకపై పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం మానేయాలి. ఇప్పుడే కాదు పాక్‌తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును పాకిస్తాన్‌కు పంపనందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు కొంతమంది ఏదో ఏదో మాట్లాడారు.ఆటను రాజకీయాలను కలపొద్దంటూ లేనిపోని మాటలు చెప్పారు. వారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు. అమాయక భారతీయులను హత్య చేయడమే వారి జాతీయ క్రీడలా కనిపిస్తోంది. బ్యాట్లు, బంతులతో కాకుండా వారి బాషలోనే మనం కూడా సమాధానం చెప్పాలి" అని గోస్వామి తన నోట్లోపేర్కొన్నాడు. కాగా ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఐపీఎల్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన శ్రీవత్స్ గోస్వామి, ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో కలిసి భారత్ అండర్-19 జట్టుకు గోస్వామి ఆడాడు.

పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన భారత క్రికెటర్లు..
పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచాక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఈ టెర్రర్ ఎటాక్‌పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని 140 కోట్ల మంది భారతీయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉగ్రదాడి ఘటనను భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మృతుల కుటంబాలకు సంతాపం తెలియజేశారు."పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ఆ బలాన్ని చేకూర్చాలని ఆ దేవుడును ప్రార్థిస్తున్నాను"- విరాట్ కోహ్లి2 Virat Kohli pic.twitter.com/eAUtXo8hYZ— Virushka🫶❤️ (@KohliTheGOAT18) April 23, 2025"పహల్గామ్లో జరిగిన దాడి గురించి తెలిసిన వెంటనే నా హృదయం బరువెక్కిపోయింది. బాధితుల కుటంబాలకు ఆ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ఇలాంటి హింసకు మన దేశంలో చోటు లేదు"- శుబ్‌మన్ గిల్"కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలలకు బలం చేకూరాలని ఆ దేవడును ప్రార్థిస్తున్నాను"-కేఎల్ రాహుల్"బాధిత కుటుంబాల కోసం మనమంతా అండగా నిలుద్దాం. ఎవరైతే ఈ దుశ్చర్యకు బాధ్యులో వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. తప్పకుండా భారత్ స్ట్రైక్ అవుతుంది"-గౌతం గంభీర్👉భారత కెప్టెన్ రోహిత్ శర్మ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.👉పెహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, మంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్‌ను చీర్‌లీడర్స్ లేకుండా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాణాసంచా కూడా పేల్చవద్దు అని నిర్ణయించారు

బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు వారి సొంతగడ్డపై పసి కూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. సిల్హాట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (52) టాప్ స్కోరర్‌గా నిలవగా..బెన్ కుర్రాన్(44) పరుగులతో రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహాది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు వికెట్లు సాధించాడు. కాగా ఇది జింబాబ్వేకు నాలుగేళ్ల తర్వాత దక్కిన తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో తమ బౌలర్లు చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది.జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. న్యాయుచి, మదెవెరె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్‌కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) పర్వాలేదన్పించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లా బ్యాటర్లు తీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 255 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శాంటో(60), జాకీర్(58), మోమినల్(47) మినహా మిగితా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి పర్యాటక జట్టు చేధించింది. బంగ్లాపై జింబాబ్వేకు ఇది రెండో టెస్టు విజయం. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఏప్రిల్ 28 నుంచి ఛటోగ్రామ్ వేదికగా జరగనుంది.

సంచలన విజయం దిశగా జింబాబ్వే
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న జింబాబ్వే క్రికెట్ జట్టు.. సిల్హెట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో సంచలన విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలుపుకు మరో 57 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే ఆరేళ్ల తర్వాత బంగ్లా గడ్డపై విజయం సాధించినట్లవుతుంది. చివరిగా జింబాబ్వే 2018 నవంబర్‌లో బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్.బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్‌కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.82 వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చి 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే అద్భుతంగా ఆడుతూ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు టీ విరామం సమయానికి జింబాబ్వే గెలుపుకు 57 పరగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే స్కోర్ 117/2గా ఉంది. బ్రియాన్ బెన్నెట్ (52), సీన్ విలియమ్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
బిజినెస్

అప్పుడు పనిగంటలు.. ఇప్పుడు సెలవులు
పనిగంటలపై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే మరుగున పడుతున్న సమయంలో.. తాజాగా సెలవుల సంస్కృతికి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఒక్క నెలలోనే (ఏప్రిల్ 2025) ఏకంగా 17 సెలవులు ఉన్నాయంటూ.. క్లీన్రూమ్స్ కంటైన్మెంట్స్ వ్యవస్థాపకులు & సీఈఓ 'రవికుమార్ తుమ్మలచర్ల' చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశ సాంస్కృతి, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని మనం ఎంతో గౌరవిస్తున్నాము. వారాంతాలతో కలిపి ప్రభుత్వ సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ కారణంగా.. పనులు వాయిదా పడుతున్నాయి. ఏప్రిల్ 2025లో, మాకు 10 కంటే ఎక్కువ సెలవులు వచ్చాయి. సెలవులు అధికం కావడంతో ముఖ్యమైన ఫైల్స్ ఆఫీసుల్లో కదలకుండా నిలిచిపోతున్నాయి.మేము భారతీయ.. పాశ్చాత్య సంప్రదాయాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అయితే ఇదే సమయంలో ఉత్పాదకతను కోల్పోకుండా చూసుకోవాలి. ఉత్పాదకత తగ్గితే.. అది దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వేగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే చైనా 60 సంవత్సరాలు ముందుంది.భారతదేశంలో మనం మాత్రం వేగవంతమైన ప్రక్రియల కోసం విదేశాలకు వలసపోతాము. కాబట్టి మన సెలవు సంస్కృతిని పునరాలోచించాలి. మెరుగైన సమతుల్యతను సాధించాలి. ఇదే సరైన సమయం అంటూ.. సెలవుల జాబితాను రవికుమార్ తుమ్మలచర్ల సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ప్రభుత్వ సంస్థలను ట్యాగ్ చేశారు.ఇదీ చదవండి: ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!రవికుమార్ తుమ్మలచర్ల షేర్ చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈయన అభిప్రాయంపై ఏకీభవిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి పోస్టులు ఎప్పుడు యజమాని నుంచే వస్తాయి. ఉద్యోగి ఎప్పుడూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటాడు అని చెబుతున్నారు. సెలవులు అంటే ఆర్థిక కార్యకలాపాలలో విరామం మాత్రమే కాదు, అవి ఉద్యోగులు రీఛార్జ్ అవ్వడానికి తగిన సమయం అని కూడా ఇంకొందరు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
టెక్ పరిశ్రమలో అనిశ్చితులు ఇప్పట్లో కుదటపడేలా కనిపించడం లేదు. టాప్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. తమ వర్క్ ఫోర్స్‌లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోన్న ఇంటెల్ ఈ వారంలోనే లేఆఫ్‌లను ప్రకటించబోతోంది.గత మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ నాయకత్వంలో ఇంటెల్ కంపెనీ ఈ వారం 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో 19 బిలియన్ డాలర్ల నష్టంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంటెల్, ఈ కోతలతో అధికారిక వ్యవస్థను తగ్గించి, నిర్వహణను సరళీకరించి, ఇంజనీరింగ్-ఆధారిత సంస్కృతిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదే మొదటిసారి కాదు...ఇంటెల్ తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉద్యోగాల కోతలను చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో కంపెనీ మొత్తం సంఖ్య 1,08,900కు చేరింది. అంతకుముందు సంవత్సరం 2023లో ఇంటెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 124,800 ఉండేది.రోజుకు 450 మంది తొలగింపు2025లో 257 టెక్ కంపెనీలు రోజుకు సగటున 450 మంది చొప్పున 50,372 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. 2024లో 1,115 కంపెనీల్లో 2,38,461 మంది ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. ఇంటెల్ మాత్రమే కాకుండా గూగుల్ 2025 ఏప్రిల్‌లో తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ యూనిట్ (ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్)లో వందలాది మందిని తొలగించింది. అంతకు ముందు క్లౌడ్, హెచ్ఆర్ విభాగాల ఉద్యోగుల సంఖ్యలో కోత విధించింది.మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా వచ్చే మే నెలలో తొలగింపులకు సిద్ధమవుతోంది. ఇంజనీర్-టు-మేనేజర్ నిష్పత్తులను పెంచడానికి మిడిల్ మేనేజర్లు, తక్కువ పనితీరు కనబరిచేవారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా దాని భద్రతా విభాగంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 2025 ఫిబ్రవరిలో 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి పనితీరు ఆధారిత తొలగింపులపై దృష్టి సారించింది.

భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price Drop: దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) నేడు (ఏప్రిల్ 23) భారీగా దిగివచ్చాయి. అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను మార్క్‌ను దాటేసిన పసిడి ధర ఈరోజు అత్యంత భారీగా తగ్గి రూ.లక్ష దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 23 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి. 👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,500- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,300ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,11,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

తొలి ఐపీవో వచ్చేస్తోంది..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 25న షేర్లను ఆఫర్ చేయనుంది.ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. అంతేకాకుండా రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్స్చేంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మూన్ బెవరేజెస్ ఐపీవో యోచన గ్లోబల్ పానీయాల దిగ్గజం కోక కోలా బాట్లర్ మూన్ బెవరేజెస్ (Moon Beverages IPO) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో భారీగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఎంఎంజీ గ్రూప్ కంపెనీ వైస్‌చైర్మన్ అనంత్ అగర్వాల్ తెలియజేశారు. రానున్న మూడు, నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా ఇప్పటికే రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.వెరసి కొత్త ప్లాంట్లు, సామర్థ్య విస్తరణ, కొత్త మార్కెట్లలో ప్రవేశం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. మరోవైపు పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. అస్సామ్‌లోని గువాహటి, ఒడిషాలోని రూర్కెలాలో ఏర్పాటవుతున్న ప్లాంట్లపై మరిన్ని పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలియజేశారు. దీంతో నిమిషానికి 7,000 బాటిళ్ల సామర్థ్యం జత కలవనున్నట్లు తెలియజేశారు.ఐపీవోకు కాంటినుమ్ గ్రీన్క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ( Continuum Green Energy IPO) పబ్లిక్ ఇష్యూకి అనుమతించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్స్ రూ. 2,400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ లిస్టింగ్ ద్వారా రూ. 3,650 కోట్లు సమీకరించనుంది. 2024 డిసెంబర్లో కంపెనీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,100 కోట్లు అనుబంధ సంస్థలు తీసుకున్న కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటి అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ తదితరాలను చేపడుతోంది. 2023–24లో కంపెనీ ఆదాయం 33 శాతం ఎగసి రూ. 1,294 కోట్లను తాకింది.
ఫ్యామిలీ

5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్
సినీ నటులు సెలబ్రిటీలను ఈ మధ్య కాలంలో తమ శరీర బరువును తగ్గించుకుంటున్నారు. పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని మార్చుకోవడం లాంటి సాహసాలతోపాటు, నిజజీవితంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, తీవ్ర కసరత్తుల ద్వారా స్లిమ్‌గా తయారవుతున్నారు. ముఖ్యంగా బాగా బరువు తగ్గి వార్తల్లో నిలిచిన వారిలో విద్యాబాలన్, ఖుష్బూ, జ్యోతిక లాంటి హీరోయిన్లు ఉన్నారు. అలాగే బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్ కూడా ఇటీవలి కాలంలో బాగా బరువుతగ్గి బక్కచిక్కినట్టు కనిపించారు. అయితే కరణ్ జోహార్ ఓజెంపిక్ లాంటి ఇంజక్షన్లు తీసుకున్నారనే పుకార్లు జోరుగా వినిపించాయి. వాటిని కరణ్ తీవ్రంగా ఖండించారు. ఆహార మార్పులు, జీవన శైలి మార్పుల ద్వారానే బరువు తగ్గానని స్పష్టం చేశారు. ఇపుడు ఈ కోవలో టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ వార్తల్లో నిలిచాడు. అయితే కఠినమైన డైట్‌తో తన రాబోయే చిత్రం ‘డ్రాగన్’ కోసం భారీగా బరువుగా తగ్గడం విశేషంగా నిలిచింది.అలనాటి అందాలహీరో దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లో వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ‘బాల రామాయణం’ సినిమాలో బాలనటుడిగా అద్భుతమైన నటనతో తానేంటో నిరూపించుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తరువాత రాఖీ, ఆది లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమాల్లో బొద్దుగా కనిపించి. ఉన్నట్టుంటి ఎన్టీఆర్ స్మార్ట్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అటు అభిమానులను, ఇటు విమర్శలను దిగ్భ్రాంతికి గురి చేశాడు. అప్పటినుంచి అదే బాడీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డ్రాగన్ మూవీకోసం ఇంత బరువు అంటే..5 నెలల్లో 18 కిలోలు తగ్గాడట. ఆయన ఎలాంటి ఇంజెక్షన్లు వాడలేదని, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లుక్ కోసమే తారక్ బాగా డైటింగ్ చేశాడని అతని టీం స్పష్టం చేసింది. వ్యాయామం, కఠినమైన ఆహారం ఫలితంగా అతని లుక్‌లో మార్పు అని వెల్లడించింది. నేటి (ఏప్రిల్ 22) నుంచి ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. సముద్ర తీరంవద్ద దగ్గర జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ఉన్న అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి రేగింది. ఈ ప్రాజెక్ట్‌ను కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తుండగా, నిర్మాతలు ఇప్పటివరకు ఇతర తారాగణం సాంకేతిక సిబ్బంది వివరాలను గోప్యంగా ఉంచారు.ఓజెంపిక్ ఇంజెక్షన్లుఅయితే గతంలో బరువు తగ్గినపుడు లైపోసక్షన్ చేయించుకున్నాడనే పుకార్లు జోరుగా వినిపించాయి. తాజగా ఎన్టీఆర్ బరువు తగ్గడంపై కూడా సెలబ్రిటీలు ఎక్కువగా వాడుతున్న ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకున్నాడని వదంతులు వ్యాపించాయి. అయితే తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని, తిండి మానేస్తే చాలు ఎవరైనా వెయిట్ తగ్గొచ్చు అని గతంలోనే స్పష్టం చేశాడు. అయితే తన పాత్ర కోసం బాడీని మార్చుకోవడం ఎ న్టీఆర్‌కు కొత్తేమీ కాదంటున్నారు అభిమానులు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీలోని కొమరం భీమ్ పాత్ర కోసం సెలబ్రిటీ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌తో కలిసి, ఐదు నెలల్లో 18 కిలోలు బరువు తగ్గిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రోజుకు మూడు గంటలు వ్యాయామం, కార్డియో, వెయిట్ ట్రైనింగ్, హై-ప్రోటీన్, జీరో-ఫ్యాట్ డైట్ ఇందులో భాగం.

బెట్టింగ్ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ వైరల్
బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కృషిచేస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం ఎంత సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే.బెట్టింగ్ యాప్స్ మోజులో అనేకమంది యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు సజ్జనార్. ఈ పోరు భాగంగానే తాజాగా ‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు అంటూ ఒక చక్కటి గీతాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.మన్మథుడు సినిమాలోని ‘వద్దురా.. పెళ్లొద్దురా ’ అనే సాంగ్ తరహాలో వద్దురా.. సోదరా.. బెట్టింగ్ జోలికి పోవద్దురా అంటూ ఇద్దరు గాయనీ మణులు ఒక పేరడీ సాంగ్‌ను పాడారు. దీన్ని సజ్జనార్ ట్వీట్ చేశారు.‘‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి. #SayNoToBettingApps @Cyberdost… pic.twitter.com/9DU8NNpCkv— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 22, 2025 ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. బెట్టింగ్ యాప్స్ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి’’ అంటూ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడిన అనేక ఘటనలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలకలం రేపాయి.

మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్‌లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్‌లోని దోహాలోని ది పెర్ల్‌లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్ అని కూడా తెలిపారు. ఖతార్‌లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల ఖతార్‌లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైఫ్ తెలిపాడు. అందమైన ప్రదేశాలతో, పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా దోహాపై ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆ దేశం తనను సురక్షితంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేసిందన్నాడు. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ, ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్లో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది, మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న మరో ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని, త్వరలోనే పిల్లల్నీ,ఫ్యామిలీని అక్కడికి తీసుకెళతానని పేర్కొన్నాడు.లగ్జరీ జీవన శైలి, ఆస్తులు హైప్రొఫైల్ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన కార్లు, వాచెస్.. లగ్జరీ ఇల్లు ఇదీ జీవన శైలి. సైఫ్ తన భార్య, సినీ నటి కరీనాకపూర్‌తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు. ఇది కాకుండా సైప్, కరీనా జంటకు స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు సైఫ్ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా. బెంజ్ ఎస్ క్లాస్‌కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వింటికి సైఫ్ కార్లు. పర్ఫ్యూమ్స్, ఫుట్‌వేర్, హోమ్ డెకార్ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఒక్కో సినిమాకు సైఫ్ రెమ్యూనరేషన్ సినిమాకు రూ.10-15 కోట్లు ద ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సతీమణి కరీనా సంపాదన కూడా తక్కువేమీ కాదు.కత్తిపోట్లు ఘటనకత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ కత్తి పోట్లుకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని లీలావతి ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'జువెల్ థీఫ్' తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సైఫ్ ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు. కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు.

క్రేజీ.. కరెన్సీ నెంబర్లు : ఫ్యాన్సీ కరెన్సీ నంబర్ల గురించి తెలుసా?
చార్మినార్ ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల మాదిరిగానే.. కరెన్సీ నోట్ల ఫ్యాన్సీ నెంబర్లకూ ప్రజల్లో క్రేజ్ ఉంది. కేవలం క్రేజ్ మాత్రమే కాదు.. ప్రత్యేకంగా ఉన్న ఫ్యాన్సీ నెంబర్లకు గణనీయమైన ఆఫర్లు.. రేట్లు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటికి ఖరీదు ఎక్కువ. పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూఘర్‌లో అంతర్జాతీయ పురాతన నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది. పది లక్షల నోట్లలో ఒకటి, రెండు ఫ్యాన్సీ నోట్లు ఉంటాయని.. ఇవి అరుదుగా లభిస్తుండడంతో మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే 000786, 786786 నెంబర్లతో పాటు 444444, 666666 నెంబర్లకు భారీ డిమాండ్ ఉందన్నారు. వీటి ఖరీదు వేలల్లో ఉందని, ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకూ కొనసాగనుందని తెలిపారు. తమ వద్ద పురాతన నాణేలు, కరెన్సీని ఎగ్జిబిషన్లో విక్రయించవచ్చని.. అదే విధంగా ఖరీదు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. నోరూరించే.. మ్యాడ్ ఓవర్ డోనట్స్ డోనట్స్ ప్రియులకు 24 రకాల ఎగ్‌లెస్ డోనట్స్ అందుబాటులోకి వచ్చాయి. సోమవారం కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్లో మ్యాడ్ ఓవర్ డోనట్స్ స్టోర్‌ను ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, సీఈఓ తారక్ భట్టాచార్య ప్రారంభించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డోనట్లలో మ్యాడ్ ఓవర్ డోనట్స్ (ఎంఓడీ) ఒకటి. బబుల్టీ, బ్రైనీలు, బైట్స్‌తో పాటు చేతితో తయారు చేసిన 24 రకాల ఎగ్‌లెస్ డోనట్లను రుచి చూడవచ్చు. పుట్టిన రోజులు, ప్రమోషన్లు, స్నేహితుల కలయికకు ఎంఓడీ వేదిక కానుంది. సర్కిల్ ఆఫ్ హ్యాపీనెస్లో చేరడానికి ఆహ్వానిస్తున్నట్లు తారక్ భట్టాచార్య ప్రకటించారు.
ఫొటోలు


SRH Vs MI : ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. తారల సందడి (ఫొటోలు)


పహల్గాం ఉగ్ర దుశ్చర్య.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ(ఫొటోలు)


పెద్దమ్మ తల్లి గుడిలో బుల్లితెర జంట దావత్.. ఎందుకంటే? (ఫోటోలు)


హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న విష్ణుప్రియ (ఫోటోలు


నెత్తురోడిన కశ్మీర్ మినీ స్విట్జర్లాండ్.. చూపు తిప్పుకోనివ్వని పహల్గాం బైసరన్ వ్యాలీ ప్రకృతి అందాలు (ఫొటోలు)


'సోదరా' మూవీ హీరోయిన్ ఆరతి గుప్తా (ఫొటోలు)


ప్రేమలు హీరో 'జింఖానా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)


హీరోయిన్ ప్రణీత కొడుకు బారసాల వేడుక (ఫొటోలు)


ఓ ఈవెంట్లో సందడి చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)
అంతర్జాతీయం

జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో ఒక సింహం జనావాసాల్లోకి వచ్చి దాడి చేసిన ఘటనలో యువతి ప్రాణం కోల్పోయింది. నేషనల్ జూ పార్క్ నుంచి తప్పించుకు వచ్చిన ఆ సింహం.. జనావాసాల్లోకి వచ్చింది. అయితే దీన్ని గమనించని ఇద్దరు యువతులు వస్తున్న సమయంలో సింహం అమాంతం దాడి చేసింది. ఇందులో ఒక యువతిపై పంజా విసిరి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. చివరకు యువతి మృతదేహాన్ని మాత్రమే కనుగొన్నారు. ఆమె వెనుక భాగంలో తీవ్ర గాయాల పాలైన ఆ యువతి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జనావాసాలు ఉండే ప్రాంతానికి నైరోబీ నేషనల్ పార్క్ కేవలం 10 కి.మీ దూరంలోనే ఉంది. అక్కడ నుంచి తప్పించుకుని ఉంటుందని భావిస్తున్న సింహం.. ఇలా దాడి చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. ఆ నేషనల్ పార్క్ అనేది క్రూర మృగాలకు ఆవాసం. సింహాలు, పులులు, చిరుత పులులు తదితర జంతువులు ఉంటాయి.

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
వాటికన్ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్ ఫ్రాన్సిస్.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Talking Tree: చెట్టుకే మాటలొస్తే.. వినాలని ఉందా?
దాదాపు వందేళ్లక్రితం జగదీశ్ చంద్రబోస్ అనే వృక్షశాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించారు. అవి ఎండనుంచి శక్తిని. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సయిడ్ ను తీసుకుని ఆకులతో శ్వాసించి మనకు ప్రాణాలు నిలిపే ఆమ్లజనిని విడుదల చేస్తాయని నిరూపించారు. అంతేకాకుండా మొక్కలు తమకు హానికారక రసాయనాలను చూసి ఎలర్జీ ఫీలవుతాయని.. వాటిలోనూ మనుషులకు ఉన్నట్లే నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. ఆ తరువాత కొంతమంది శాస్త్రవేత్తలు మొక్కలు తమలోతాము సంభాషించుకుంటాయని.. భావాలు కూడా షేర్ చేసుకుంటాయని పరిశోధించి వివరించారు.. అంటే కొంపదీసి మొక్కలు కూడా మనలా మాట్లాడతాయా ఏందీ అంటూ కొంతమంది అత్యుత్సాహకులు ఆనాడే కామెంట్లు చేసారు.. అయితే అవును మొక్కాలు మాట్లాడతాయి.. ఇదిగో కావాలంటే వినండి అంటూ డబ్లిన్(Dublin)లోని శాస్త్రవేత్తలు మనకు వినిపిస్తున్నారు.మాట్లాడే చెట్టు (టాకింగ్ ట్రీ ) అంటూ ట్రినిటీ కాలేజీలో రూపొందించిన ఈ సరికొత్త ప్రయోగం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అసలు చెట్లు.. వృక్షాలు మొక్కలు తీగలు మనతో మాట్లాడితే బావుణ్ణు.. అసలివి మనతో ఏం మాట్లాడతాయి అంటారు.. ఏమో.. అసలు మనతో మాట్లాడితే కదా... ఇలాంటి ఉత్సుకత మనలో చాలామందిలో ఉంటుంది. మన ఉత్సాహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ కాలేజీ ప్రాంగణంలోని ఓ చెట్టుతో సంభాషించే అవకాశాన్ని.. కలిగించారు.. దీనికి అధునాతన సాంకేతికతను జోడించారు.కాలేజీలోని ఇరవయ్యేళ్ళ వయసున్న లండన్ ప్లేన్ చెట్టుతో ముఖాముఖి సంభాషించే అవకాశం కలిగించారు. డ్రోగా5 టెక్నాలజీ సంస్థ మరియు బ్రిటన్‌లోని ఏజెన్సీ ఫర్ నేచర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును రూపొందించాయి. శాస్త్రవేత్తలు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ... కృత్రిమ మేధస్సు ఇంకా సెన్సర్లను చెట్టుకు అనుసంధానించి చెట్టుకు గొంతును ఇచ్చారు. ఈ సెన్సార్లు చెట్టు అడుగున ఉన్న మట్టి .. దానిలోని తేమ, వాతావరణ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి లోని తీవ్రత.. గాలి స్వచ్ఛత వంటివి అంచనావేసి ఆర్టిఫీషియల్ భాషా నమూనాకు అనుసంధానిస్తారు. అవి చెట్టుకు లింక్ చేస్తారు.. అప్పుడు చెట్టు ఎలా ఫీలవుతుందన్నది అట్నుంచి మళ్ళీ మాటల రూపంలో మనకు వినిపిస్తారు. అంటే చెట్టుకు నీళ్లు లేకపోతె.. వేళ్ళు దాహంతో అల్లాడే పరిస్థితి ఉంటే బహుశా.. దాహం.. దాహం.. కాసిన్ని నీళ్లు పోయండర్రా అంటుందేమో చెట్టు! ఆకలేస్తోంది.. ఎవరైనా ఓ గంపెడు ఎరువు తెచ్చి వేసి పుణ్యం కట్టుకోండర్రా అని చెట్టు మ్రాన్పడిపోతుందేమో!.అంతేకాకుండా చెట్లకు కాలజ్ఞానం ఉంటుందని విశ్వసిస్తున్న శాస్త్రవేత్తలు.. అడవుల్లో ప్రజ్వరిల్లే కార్చిచ్చు వంటివాటిని ముందుగానే మనకు తెలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెట్టుతో సంభాషన అనంతరం కొందమంది విద్యార్థులు మాట్లాడుతూ.. మనం సహచరులతో మాట్లాడడం సహజం.. కానీ ఇలా ప్రకృతితో సంభాషణ అనేది వింతగా ఉంది.. చెట్టు చెబుతున్న భావాలు వింటుంటే అద్భుతంగా ఉందని అబ్బురపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా తాజాగా.. తన మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ఆయా దేశాలపై ప్రతీకార చర్యలు కఠినంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా..‘బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం లభించదు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదు. స్వల్పకాలిక లాభాల కోసం వెళితే.. అది ఎప్పటికైనా మనకే హాని చేస్తుందన్న విషయాన్ని దేశాలు గుర్తుంచుకోవాలి. చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యపరంగా, ఆర్థికంగా ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించబోం. మా నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి తాత్కాలికంగా, స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం.. పులి చర్మం కోసం దాంతోనే డీల్ చేసుకోవడం లాంటిది’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చింది.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే చైనా సహా పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేశారు. అయితే, చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటించారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. ఈ మేరకు ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. BREAKING: China warns it will hit back at any country that sides with the US in ways that hurt its interests."Deals at China's expense won't be accepted. Expect countermeasures" says Min of Commerce.During Trump’s #Tariffwar - China didn’t stay silent then, won’t now either. https://t.co/3U3Vv4KTAP pic.twitter.com/jz1WrTDOGh— Amit Bhawani 🇮🇳 (@amitbhawani) April 21, 2025
జాతీయం

పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్.. అప్డేట్స్భారత్లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి: విక్రమ్ మిస్రీవిదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంపాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదుపహల్గాం దాడివెనుక పాక్ హస్తం ఉందిమా దగ్గర పూర్తి ఆధారాలున్నాయిఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాంఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపేస్తున్నాంఅటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును మూసివేస్తున్నాంపాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులుసుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారంఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులుజమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్‌సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీపాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం పాక్ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు ఎయిర్ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ మరికాసేపట్లో ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్‌కి వచ్చిన అధికారి ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the #Pahalgam terror attackThe couple got married on April 16. 💔💔 pic.twitter.com/a83lpg3A40— Venisha G Kiba (@KibaVenisha) April 23, 2025జమ్ములో అత్యధికంగా ఎల్ఈటీ ఉగ్రవాదులు! జమ్ము కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్ఈటీ విభాగం అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా గుర్తింపు ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్? ముజాహిదీలు కశ్మీర్లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్ సాయంత్రం కేబినెట్ కీలక సమావేశంపహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాసాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంకేబినెట్ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్‌నాథ్‌ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్ విధానం : రాజ్‌నాథ్‌ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్‌నాథ్‌పహల్గామ్ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E— ANI (@ANI) April 23, 2025 ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్.. ఆరేళ్లలో తొలిసారి బంద్! పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం శ్రీనగర్ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో తొలిసారి బంద్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భద్రత కట్టుదిట్టం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం పాకిస్థాన్ హైకమిషన్ వద్ద గట్టి సెక్యూరిటీ పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ట్వీట్ జమ్మును వీడుతున్న పర్యాటకులుపహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులుఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లుకాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లుఆరు గంటల్లో కశ్మీర్‌ను వీడిన 3,300 మంది పర్యాటకులుపర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాIt’s heartbreaking to see the exodus of our guests from the valley after yesterday’s tragic terror attack in Pahalgam but at the same time we totally understand why people would want to leave. While DGCA & the Ministry of Civil Aviation are working to organise extra flights,… pic.twitter.com/5O3i5U1rBh— Omar Abdullah (@OmarAbdullah) April 23, 2025 భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్‌ను వదిలి పాక్ వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్‌ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్లో చొరబడినట్లు అనుమానంఅదిల్, అషన్ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్ బ్లాక్ రేంజ్లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్ మౌంటెడ్ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్ కవ్వింపు చర్యలుపాక్ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్ ఐఎస్ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానంఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్ కశ్మీర్ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్‌గర్ల్స్ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్ కంట్రోల్ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రదాడి ఘటన వేళ బారాముల్లాలో తాజాగా ఎన్కౌంటర్ జరిగింది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.వివరాల ప్రకారం.. బారాముల్లలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భారత సరిహద్దుల నుంచి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ సందర్బంగా ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. దీంతో, యూరి సెక్టార్లో కూంబింగ్ కొనసాగుతోంది. J&K | Heavy exchange of fire between security forces and terrorists, two terrorists have been eliminated, infiltration bid foiled by the security forces in the ongoing Operation in Baramulla. Large quantity of weapons, ammunition and other war-like stores have been recovered from… pic.twitter.com/OS3opx8lLg— ANI (@ANI) April 23, 2025

ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు.. పెళ్లైన 15 రోజులకే..
లక్నో: ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో రకరకాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు ఎక్కువగా సంఖ్యలో బయటకు వస్తున్నాయి. భర్త, భార్యలను హత్య చేసిన ఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి.తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి జరిగిన రెండు వారాలకే సదరు వ్యక్తి.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి ముగ్గురు పిల్లలు ఉండటం, ఆమె కానిస్టేబుల్ కావడం. ఈ నేపథ్యంలో మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. యూపీలోని రసూల్పూర్ గ్రామానికి చెందిన నేహాకు గజల్‌పుర్ వాసి నవీన్‌తో ఫిబ్రవరి 16న వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్ కానిస్టేబుల్ నిర్మలతో నవీన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది. నిర్మలతో కలిసి ఉండాలని నవీన్ భార్యపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. దీంతో, చేసేదేమీ లేక.. అనంతరం మార్చి ఒకటో తేదీన నిర్మలతో నవీన్ రెండోపెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న రాత్రి మొహల్లా సాకేత్ కాలనీలోని నవీన్-నిర్మల ఏకాంతంగా ఉన్న సమయంలో వీరిద్దరినీ పట్టుకుంది నేహా. ఈ క్రమంలో నేహా వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. తర్వాత.. ఏప్రిల్ 17న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలను హఫీజ్‌పుర్ పోలీస్‌స్టేషనుకు అటాచ్ చేశారు. ప్రస్తుతం నవీన్, నిర్మల పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరి ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. కాశ్మీర్లో ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా పర్యటన అర్థాంతరంగా ముగించుకుని భారత్‌కు పయనమయ్యారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రస్తుత పరిస్థితి వివరించారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనున్నారు. ఇక, ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టులోనే కశ్మీర్ ఉగ్రదాడిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేడు పహల్గాంకు అమిత్ షాఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా ఉన్నారు. బుధవారం అమిత్ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ. వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Prime Minister Narendra Modi arrives in Delhi after cutting short his Saudi Arabia visit in view of the #PahalgamTerroristAttack in Kashmir.NSA Ajit Doval accompanies him. (Source - ANI/DD) pic.twitter.com/PeA7CWRAes— ANI (@ANI) April 23, 2025
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.

హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?

వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాçపురం(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాçపురం(కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్యఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. నిందితుల అరెస్ట్..ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్‌ను స్వా«ధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు..సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు.

పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!
హైదరాబాద్: నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న భారీ చోరీ జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోయారు. వీరిని అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులు పని వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదేపదే సూచించారు. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని కాచిగూడ వాసి, పారిశ్రామిక వేత్త హేమ్ రాజ్ కుటుంబం నేపాలీలను ఎలాంటి ఆధారాలు లేకుండా పనిలో పెట్టుకుంది. ఫలితం... ఆదివారం రాత్రి రూ.2 కోట్ల సొత్తుతో ఆ నేపాలీలు ఉడాయించారు. ఈ కేసును ఈస్ట్‌జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపిన డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పథకం ప్రకారం పనిలో చేరిన నేపాలీలు... కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో హేమ్ రాజ్ తన భార్య మీనా దుగ్గర్, కుమారుడు, కోడలు, మనుమళ్లతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి వద్ద నేపాల్‌కు చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆ ఇంటి వ్యవహారాలు పూర్తిగా తెలిసిన ఆమె అదును చూసుకుని కొల్లగొట్టాలని పథకం వేసింది. త్వరలో తాను పని మానేసి తన స్వదేశానికి వెళ్లిపోతానంటూ ఇటీవల ఆ మహిళ చెప్పింది. తన స్థానంలో పని చేయడానికి తమ దేశం నుంచే వచి్చన మరో మహిళ సిద్ధంగా ఉందని దాదాపు నెల రోజుల క్రితం చేర్చింది. హేమ్రాజ్ ఇంట్లో ప్రస్తుతం రెన్నోవేషన్ పని నడుస్తోంది. దీంతో ఆ పనిలో సహకరించడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి మరో మనిషి కావాలంటూ పది రోజుల క్రితం కొత్త పని మనిషికి చెప్పారు. ఆ పని చేయడానికి తన పరిచయస్తుడు ఉన్నాడని చెప్పిన ఈ కొత్త పనిమనిషి మరో నేపాలీని ఆ ఇంటికి తీసుకువచ్చింది. నేపాలీలు అంతా కలిసి అదును చూసుకుని... ఇలా కొత్తగా పనిలో చేరిన ఇద్దరి ఫొటోలు, వివరాలను హేమ్ రాజ్ కుటుంబం తీసుకోలేదు. కనీసం వాళ్లు చెప్పిన పేర్లు నిజమా? కాదా? అనేది పరిశీలించలేదు. వేసవి సెలవుల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హేమ్రాజ్ కుమారుడి కుటుంబం విదేశాలకు వెళ్లింది. వృద్ధ దంపతులే ఇంట్లో ఉండటంతో ఆ ఇంటిని కొల్లగొట్టడానికి ఇదే సరైన సమయమని ఇరువురు నేపాలీలు నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఆహారంలో మత్తుమందు కలిపారు. వీళ్లు మత్తులో ఉండగా... అల్మారాలు, లాకర్లు పగులకొట్టిన నేపాలీ ద్వయం బంగారం, వజ్రాభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.2 కోట్ల విలువైన సొత్తు కాజేశారు. ఇంటిని బయట నుంచి తాళం వేసి యజమాని కారులోనే సంతో‹Ùనగర్ వరకు వెళ్లిన ఇరువురూ వాహనం అక్కడ వదిలేశారు. ఆపై ఆటోలో శంషాబాద్ వైపు ఉడాయించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన ఫాల్స్ సీలింగ్ వర్కర్లు ఎంత పిలిచినా యజమానల నుంచి స్పందన లేకపోవడంతో సమీపంలో ఉండే బంధువులకు సమాచారం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు... ఈ నేరంపై పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యజమానుల దగ్గర నేపాలీల పేర్లు తప్ప వారి వివరాలు, చిరునామాలు, ఫొటోలు లేకపోవడం దర్యాప్తును సంక్లిష్టం చేసింది. పాత పనిమనిíÙతో పాటు కొత్త పని వాళ్లు ఇద్దరి ఆచూకీ కోసం రాష్ట్రం చుట్టపక్కల ఉన్న సాధారణ, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ప్రత్యేక బృందాలు ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాయి. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టునూ అప్రమత్తం చేశారు. శంషాబాద్ నుంచి నేపాలీలు ఎటు వెళ్లారనేది గుర్తించడానికి వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు అనుభవం నేపథ్యంలో ఈ నేరగాళ్లు దేశం దాటకముందే పట్టుకోవాలనే లక్ష్యంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


Pahalgam Terror Attack: తాడేపల్లి YSRCP కేంద్ర కార్యాలయంలో క్యాండిల్ ర్యాలీ


KTR: తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్..


వినయ్ మృతదేహం వద్ద బోరున విలపించిన భార్య హిమాన్షి


ఉగ్రదాడికి ప్రతీకారం.. భారత్ భారీ ఆపరేషన్


Asaduddin Owaisi: పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రమూకకు గుణపాఠం చెప్పాలి


నారా లోకేష్ బినామీలు, ఫేక్ కంపెనీలు సృష్టించి భూములు కొట్టేస్తున్నారు


Margani Bharat: కూటమి పాలనలో స్కీమ్ లు కాదు.. స్కామ్‌లు పెరిగాయి


రఘురామ కృష్ణంరాజు పై సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు


Pahalgam Attack: ఎవరీ సైఫుల్లా కసూరి?


Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ రియాక్షన్