తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచక పాలన చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.
సాక్షి, మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచక పాలన చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన మెదక్ జిల్లాలోని రామాయంపేటలో శనివారం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ గురించి అడిగిన మందకృష్ణపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్భంధించారన్నారు.
చెరుకు ఫ్యాక్టరీలను తెరిచేవరకు రైతులకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాలు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.