Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu TDP alliance Govt Sand Mafia AP Statewide1
ఇసుక తోడేళ్లు!

చూడు నాగిరెడ్డి..! నేను ఎన్నికల్లో రూ.10 లక్షలు ఖర్చు చేశా. మా ఊరి నుంచి ఇసుక నేనే తవ్వుకుంటా. ఎవరూ అడ్డు రావద్దు..! నేను ఎమ్మెల్యే (జయనాగేశ్వర­రెడ్డి)­కి చెప్పి ఇసుక తోలుతున్నా. సీఐకి రూ.50 వేలు ఇచ్చినా..! నా టిప్పర్‌తోనే ఇసుక తోలుతా. ఇసుక బండి ఆపేదెవడు? దమ్ముంటే రమ్మను!- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం టీడీపీ నేతలు గురజాల జయరాముడు, రాయచోటి నాగిరెడ్డి ఫోన్‌ సంభాషణ ఇదీ!నాకు తెలియకుండా మట్టి తోలుతున్నావ్‌..! నాకు చెప్పాలి కదా..? బండ్లు మనయే ఉన్నాయ్‌..!రామలింగారెడ్డి (ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కుడి భుజం)తో మాట్లాడా..! ఎమ్మెల్యే.. తహసీల్దార్‌కు కూడా చెప్పాడు. మట్టి శాంపిల్‌ కూడా తీశా. మనమే ఒకటిగా లేకుంటే ఎట్టా...? వచ్చే డబ్బులో రామలింగారెడ్డి వాటా ఆయనకు పోతాది. వైఎస్సార్‌సీపీ వాళ్లు బండ్లు ఆపుతున్నారు..ఆపోజిట్‌ వాళ్లు ఎవడైనా బండి ఆపితే టిప్పర్‌తోనే కొడతా..! రమ్మను..!- శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో టీడీపీ నేతలు క్రాంతి కుమార్, శ్రీనివాసులు ఫోన్‌ సంభాషణ ఇదీ!!మీ ఓనర్‌కు ఫోన్‌ చేసి రెండు నెలలైంది.. ఎమ్మెల్యే వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పినా కలవలేదు. మీ ఓనర్‌ వచ్చి మాట్లాడే దాకా లారీ స్టేషన్‌లోనే ఉంటుంది..-లారీ డ్రైవర్‌ లంకన్నకు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పీఏ నాగరాజు గౌడ్‌ బెదిరింపులు!ఉచిత ఇసుక పేరుతో పచ్చ ముఠాలు ఏ స్థాయిలో బరి తెగించి సామాన్యులపై రౌడీయిజం చేస్తున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే! టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు నదులు, వాగు­లు, వంకల్లో ఇసుకను యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం అండతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని వాటాలు పంచుకు తింటున్నారు. ఆరు లారీలు.. మూడు ట్రాక్టర్లు అనే రీతిలో ఈ అక్రమాల పర్వం రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీలు లాంటి భారీ యంత్రాలతో నదీ గర్భాలను గుల్ల చేస్తున్నారు. పేరుకు ఫ్రీ అంటున్నా ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. 18 టన్నుల లారీ ఇసుకను రూ.30 వేల నుంచి 60 వేల వరకూ అమ్ముతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీఎత్తున ఇసుక నిత్యం అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. కమీషన్లు కరకట్ట బంగ్లాకు ఠంచనుగా చేరిపోతున్నాయి. ముఖ్యనేతకు కప్పం కట్టి ఎక్కడికక్కడ నదులు, వాగులను కొల్లగొట్టేస్తూ రూ.వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.– సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌తెలంగాణకు అక్రమ రవాణాఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఇసుక దందాలో ఆరితేరిపోయారు. పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం, శనగపాడు గ్రామాల నుంచి రాత్రిళ్లు తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆళ్లూరుపాడు ఇసుక క్వారీ నుంచి పొక్లెయిన్‌లు, జేసీబీలతో లోడు చేసి లారీ లోడు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అనుచ­రులు ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా లారీకి రూ.10 వేలు చొప్పున వసూలు చేసి ఎంత కావాలన్నా సై అంటున్నారు. మున్నేరు నుంచి ఇసుక అక్రమంగా వైరా, మధిర తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. నిషేధిత జాబితాలో ఉన్న యనమలకుదురు, హైకోర్టు స్టే పరిధిలో ఉన్న పెదపులిపాక, సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన చోడవరం క్వారీల్లో సైతం యంత్రాలతో పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.అమరావతిలో యథేచ్చగా అక్రమాలుగుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండ­పాడు, అబ్బురాజుపాలెం గ్రామాల్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేసి రాత్రి పూట బయట ప్రాంతాలకు చేరవేస్తున్నారు. మంత్రి లోకేశ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని గొడవర్రులో పొక్లెయిన్‌లతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. గుండిమెడ, పాతూరు, చినరావూరులో అనుమతులు లేకపోయినా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తోడేస్తున్నారు. కొల్లిపర, తెనాలి, చెరుకుపల్లి మండలాల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతు­న్నా­యి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మల్లాది గ్రామం, అచ్చంపేట మండలం చింతపల్లి నుంచి ఇసుక అక్రమంగా కూటమి నేతలు తరలిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీని­వా­సరావు కనుసన్నల్లో ఇసుక హైదరాబాద్‌కు తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో పెసర్లంక, గాజుల్లంక, వోలేరు ప్రాంతాల్లోని కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు రేయి పగలు తేడాలేకుండా యంత్రాలతో తోడేస్తున్నారు.నెల్లూరు.. అందరూ అందరే..నెల్లూరు జిల్లాలో పెన్నానదిలోని సంగం, సూరాయపాలెం, పోతిరెడ్డిపాలెం డీ సిల్టింగ్‌ పాయింట్లకు గడువు పూర్తయినా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సూరాయపాలెంలో ఓ అధికార పార్టీ నేత నేరుగా నదిలోకి రహదారి ఏర్పాటు చేసి హిటాచీతో 12 టైర్ల టిప్పర్లకు లోడింగ్‌ చేస్తున్నారు. పల్లిపాడులో ఓపెన్‌ రీచ్‌లో యంత్రాలు ఉపయోగించి లోడింగ్‌ జరుగుతోంది. ఆత్మకూరు, వెంకటగిరి, కోవూరు, నెల్లూరు రూరల్, సిటీ నియోజక­వర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో భారీ యంత్రాలతో పెన్నా నదిలోకి బాటలు వేసి ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. రోజుకు 200కు పైగా టిప్పర్లు చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. లోకేశ్‌ టీమ్‌ పేరుతో మన్నేరు నుంచి టీడీపీ నాయకులు భారీగా ఇసుకను తరలిస్తున్నారు. కరేడు అటవీ భూము­ల్లో టీడీపీ నాయకుడు పోలుబోయిన శ్రీనివాసులు ఇసుకను హేచరీలకు తరలించారు.ప్రకాశంలో ఇష్టారాజ్యం ప్రకాశం జిల్లాలో ఇసుక మాఫియా చెప్పిందే వేదంగా నడుస్తోంది. అన్నిచోట్లా టన్నుకు రూ.200 నుంచి రూ.500 వరకు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైంబోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య ఆధ్వర్యంలో అక్రమ రవాణా జరుగుతోంది. కొండపి నియోజకవర్గం నుంచి ఒంగోలుకు ఇసుక తరలించే విషయంలో దామచర్ల సోదరుల వర్గీయుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. దామచర్ల అనుచరుల ప్రైవేటు సైన్యం వేధింపులు భరించలేక టిప్పర్ల యజమానులు కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగారు. దర్శిలో టీడీపీ ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి, గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కనుసన్నల్లో మాఫియా చెలరేగుతోంది. మార్కాపురంలో కూటమి నాయకుల నేతృత్వంలో ఇసుక విక్రయాలు సాగుతున్నాయి.పశ్చిమలో ఎడాపెడా బాదుడుపశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు రీచ్‌లు, ఐదు డీసిల్టేషన్‌ పాయింట్లు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ పరిధిలోకి వెళ్లడంతో మూసివేసినందున ఇసుక దొరకడంలేదు. దీంతో తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, జొన్నాడ, గోపాలపురం తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ లారీకి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ర్యాంపు నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు. భీమవరానికి లారీ ఇసుక చేరవేసేందుకు రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాకు రోజుకు 500 నుంచి 600 ట్రిప్పుల వరకు ఇసుక రవాణా జరుగుతుండగా.. అదనపు వసూళ్ల రూపంలో జిల్లాలోని వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోంది.గోదావరి గుల్ల గుల్ల.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరిని గుల్ల చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో సైతం తవ్వకాలు జరుగుతున్నాయి. కోటిలింగాల, కొవ్వూరు ర్యాంపుల్లో నిషేధిత డ్రెడ్జింగ్‌ అడ్డగోలుగా సాగుతోంది. ఒక్కో ర్యాంపు నుంచి రోజుకు 50కి పైగా లారీల్లో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ (18 టన్నులు) ఇసుకను రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ విక్రయిస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై రోడ్‌ కమ్‌ రైల్వే వంతెన, గామన్‌ వంతెనల సమీపంలో ఇసుక తవ్వకాలను నిషేధించారు. బ్రిడ్జిలు దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున అక్కడ ఇసుక తవ్వకూడదని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. అయినా కూటమి నేతలు లెక్క చేయకుండా రెండు బోట్ల ద్వారా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అనుమతి లేకుండానే పలు ప్రాంతాల్లో యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్విన గోతుల్లో ఇటీవల కొత్తపేట గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు దుర్గాప్రసాద్‌ స్నానానికి దిగి మునిగిపోయి మరణించాడు.సిక్కోలులో మంత్రులకు వాటాలు!శ్రీకాకుళం జిల్లాలో అంబళ్లవలస, బట్టేరు, అంగూరు, బూరవల్లి, గార, గోపాల పెంట, కాఖండ్యాంలోని రీచ్‌లను కూటమి నేతలు తమకు కావాల్సిన వారికి ఇప్పించుకుని ద­ర్జాగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపి­డీలో సైలెంట్‌గా ఓ సెంట్రల్‌ మినిస్టర్‌.. వయలెంట్‌గా మరో మినిస్టర్‌ వాటాలు వసూలు చేసుకుంటు­న్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తన బినామీలతో రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఆమదాలవలసలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అనుచరులు బూర్జ మండలం నారాయణపురం, చిన అంకలాం వద్ద భారీ లారీల్లో ఇసుక తరలించేస్తున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇసుక రీచ్‌లను సొంత జాగీర్లుగా మార్చుకుని రాజ్యమేలుతున్నారు. పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇసుక వ్యాపా­రాన్ని ఇష్టానుసారం సాగిస్తున్నారు. ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇసుక తన సరిహద్దు దాటాలంటే లారీకో రేటు ఫిక్స్‌ చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో ఇసుక డంపింగ్‌ కేంద్రాలు పెట్టించి తన కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులకు ఇసుకలో వాటాలు ఇస్తున్నారు.చిత్తూరు టు కర్ణాటక, తమిళనాడు తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నది, అరుణానదిలోని ఇసుకను ఒక ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు భారీ యంత్రాలతో తోడి కర్ణాటక, తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్‌ ఇసుక రూ.60 వేల చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల అనుచరులు, బంధువులే కీలక పాత్రపోషిస్తున్నారు. నాయుడుపేట మండలం అన్నమేడు, మర్లపల్లి, భీమవరంలో స్వర్ణముఖి నదినుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తండ్రి పేరుతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. చిత్తూరు రూరల్‌ మండల పరిధిలో బీఎన్‌ఆర్‌పేట రీచ్‌ను టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు అనుచరులు అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారానికి తెర తీశారు. పలమనేరు నియోజక వర్గ పరిధిలోని కౌండిన్య నది, జీడిమాకనపల్లి, పెద్దచెరువులో కేటిల్ఫాం నుంచి వైయస్సార్‌ జలాశయం దాకా ఇసుకను ట్రాక్టర్లలో తోడి నిల్వ చేస్తున్నారు.కర్నూలులో దర్జాగా దందాకర్నూలు జిల్లాలోని కర్నూలు, కల్లూరు మండలాల పరిధిలో తుంగభద్ర, హంద్రీ నదుల్లో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. సుంకేసుల, మునగాలపాడు, నిడ్జూరు, పంచలింగాల తదితర గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గ్రామానికి ఒకరిని నియమించుకుని దర్జాగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా మునగాలపాడు సమీపంలో తుంగభద్ర నదీ తీరంలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్న అక్రమార్కులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు హైదరాబాద్‌కు తరలి వెళుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.10 వేలు చొప్పున పోలీసు అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. రీచ్‌ల వద్ద అదనంగా రూ.1,000 వసూలు చేస్తున్నారు. టిప్పర్‌కు రూ. 15 వేలు ఇవ్వాల్సిందే. ఈ డబ్బంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు చేరుతోంది. వైఎస్సార్‌ జిల్లాలో పచ్చ నేతల చేతివాటంవైఎస్సార్‌ జిల్లాలో కొండాపురం మండలం బెడుదూరు నుంచి స్థానిక టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పెండ్లిమర్రి, కమలాపురం మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరులు అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. నాగావళిని చెరబట్టిన ఇసుకాసురులు విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో టీడీపీ నాయకులు నాగావళిని చెరబట్టారు. జావాం సమీపంలో రెండు పొక్లెయినర్లతో రాత్రీపగలు తవ్వుతున్నారు. బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పెంట, అలజంగి, కారాడ గ్రామాల వద్ద వేగావతీ నదీతీరంలో ప్రభుత్వ ఇసుక రీచ్‌ లేకపోయినా వేలం పాట నిర్వహించి మరీ ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో నాగావళి నదీతీరం వెంబడి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కనుసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి.వేదవతిని ఊడ్చేస్తున్న తమ్ముళ్లు..అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గంలో ఇసుక అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్, రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో వేదావతి హగరి నది చుట్టూ కర్ణాటక సరిహద్దు ఆనుకుని ఉంది. టీడీపీ నాయకులు చీకటి పడగానే జేసీబీలతో టిప్పర్లలో ఇసుక లోడ్‌చేసి బళ్లారి, బెంగళూరు, తుమకూరు, చిత్రదుర్గం, సండూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇసుక అడ్డగోలుగా అక్రమ రవాణా జరుగుతోంది. చిత్రావతి, పెన్నా, కుముద్వతి, జయమంగళి నదులను జేసీబీలతో తోడేస్తున్నారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నాటకకు భారీగా ఇసుక తరలిస్తున్నారు. రొద్దం, చిలమత్తూరు, పుట్టపర్తి, గోరంట్ల, హిందూపురం నుంచి రాత్రింబవళ్లు ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిపోతోంది.

Donald Trump announces 90-day pause on tariffs for most countries2
టారిఫ్‌లకు ట్రంప్‌ బ్రేక్‌

ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రకంపనల నేపథ్యంలో ట్రంప్‌ వెనక్కు తగ్గారు. భారత్‌తో పాటు 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాతో మాత్రం అమెరికా టారిఫ్‌ల పోరు బుధవారం మరింత తీవ్రరూపు దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైనా చైనా అంతే మొత్తం బాదింది. అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్‌ తీవ్రంగా కన్నెర్రజేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104 శాతానికి చేరిన సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు యూరోపియన్‌ యూనియన్‌ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి ఝుళిపించింది. 23 బిలియన్ల విలువైన యూఎస్‌ ఉత్పత్తులపై దశలవారీగా అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొంది. బీజింగ్‌/వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నట్టుండి వెనక్కు తగ్గారు. తన ఎడాపెడా టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలవడమే గాక ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తడంతో పునరాలోచనలో పడ్డారు. చైనా మినహా 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ‘‘ఆ దేశాలు చైనా మాదిరిగా మాపై తిరిగి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. పైగా టారిఫ్‌లపై మాతో చర్చలకు ముందుకొస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో భారత్‌ సహా ఆయా దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. భారత్‌పై ట్రంప్‌ 26 శాతం అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. లెసొతో (50 శాతం), మడగాస్కర్‌ (47), వియత్నాం (46), తైవాన్‌ (32), దక్షిణ కొరియా (25), జపాన్, ఈయూ (20) తదితర దేశాలపైనా భారీగా వడ్డించారు. బుధవారం అమల్లోకి వచ్చిన ఈ సుంకాలు 24 గంటలు కూడా గడవకముందే వాయిదా పడ్డాయి. అయితే ఆ దేశాలన్నింటిపైనా 10 శాతం బేస్‌లైన్‌ టారిఫ్‌ మాత్రం కొనసాగుతుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. చైనాపై మాత్రం ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మాపట్ల, ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా ఏమాత్రమూ గౌరవం చూపలేదు. పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుకు పోయింది’’ అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. చైనాపై ఇప్పటికే విధించిన 104 శాతం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. అవి తక్షణం అమల్లోకి వచ్చాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒక దేశంపై అమెరికా విధించిన అత్యధిక సుంకాలు ఇవే కావడం విశేషం! ట్రంప్‌ దూకుడుపై తామేమీ చేతులు ముడుచుకు కూచోబోమన్న డ్రాగన్‌ దేశం అన్నంత పనీ చేసింది. అమెరికాపై మరో 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పటికే ప్రకటించిన 34 శాతంతో కలిపి గురువారం నుంచి అమెరికా ఉత్పత్తులన్నింటి మీదా 84 శాతం సుంకాలు వసూలు చేస్తాం. అవి గురువారం నుంచే అమల్లోకి వస్తాయి’’ అని పేర్కొంది. దాంతో పెద్దన్నల పోట్లాట కాస్తా ముదురు పాకాన పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం మేరకు వాటా ఉండే అమెరికా, చైనా టారిఫ్‌ల యుద్ధం తారస్థాయికి చేరింది. మరోవైపు అమెరికా దిగుమతి చేసుకునే అన్నిరకాల ఆటో ఉత్పత్తులపైనా గత గురువారం నుంచే 25 శాతం టారిఫ్‌ అమల్లోకి వచి్చంది. ఇది ప్రస్తుతానికి కార్లపై మాత్రమే వసూలవుతున్నా మే 3 నుంచి ఆటో విడిభాగాలకూ వర్తించనుంది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఆటో ఉత్పత్తులపై బుధవారం నుంచే 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు కెనడా కూడా ప్రకటించింది. తగ్గే ప్రసక్తే లేదు: చైనా అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామని, ఈ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టింది. ఆ దేశంపై సుంకాలను 84 శాతానికి పెంచుతున్నట్టు చైనా కస్టమ్స్‌ టారిఫ్‌ కమిషన్‌ను ఉటంకిస్తూ అధికార వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించింది. అంతేకాదు, ‘‘ఇప్పటికే ప్రకటించినట్టు మరో 12 యూఎస్‌ కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేరుస్తున్నాం. వీటితో పాటు మా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తైవాన్‌కు ఆయుధాల విక్రయం వంటి చర్యలకు దిగిన ఆరు అమెరికా సంస్థలను అనుమానాస్పద జాబితాలో చేరుస్తున్నాం’’ అని కమిషన్‌ ప్రకటించింది. అమెరికాది ఫక్తు ఏకపక్ష పోకడ అని దుయ్యబడుతూ చైనా శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇరుదేశాల కీలక ప్రయోజనాలను పరస్పరం గౌరవించుకుంటూ సాగాల్సింది పోయి మతిలేని నిర్ణయాలు తీసుకుంటోందంటూ తూర్పారబట్టింది. అమెరికా టారిఫ్‌లను తీవ్ర తప్పిదంగా అభివరి్ణంచింది. అవి చైనా హక్కులను, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయంటూ దుయ్యబట్టింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో బుధవారం అదనపు దావా కూడా వేసింది.హాలీవుడ్‌ సినిమాలపై నిషేధం అమెరికాపై మరిన్ని ప్రతీకార చర్యలకు చైనా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా హాలీవుడ్‌ సినిమాలపై కూడా నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే వందలాది కోట్ల డాలర్ల విలువైన చైనా మార్కెట్‌ హాలీవుడ్‌కు దూరమవుతుంది. ఆ పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బే’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద సినీ మార్కెట్‌ చైనాయే. దీనితోపాటు అమెరికాపై చైనా పరిశీలనలో ఉన్న ఇతర ప్రతీకార చర్యలు... → చైనాతో వ్యాపారం చేస్తున్న అమెరికా సేవా రంగ సంస్థలపై ఆంక్షలు, నిషేధాలు → సోయాబీన్‌ తదితర అమెరికా వ్యవసాయోత్పత్తులపై భారీ సుంకాలు → చైనాలో ఉన్న అమెరికా కంపెనీలపై అనుచిత మేధో సంపత్తి లబ్ధి అభియోగాలపై విచారణ ఈయూ అదనపు టారిఫ్‌లు బ్రసెల్స్‌: అమెరికాకు యూరోపియన్‌ యూనియన్‌ కూడా మరో సుంకాల షాకిచ్చింది. ఈయూ స్టీల్, అల్యుమినియం దిగుమతులపై ట్రంప్‌ విధించిన 25 సుంకాలకు ప్రతీకార చర్యలు ప్రకటించింది. ఏకంగా 2,300 కోట్ల డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు బుధవారం పేర్కొంది. ఇవి దశలవారీగా అమల్లోకి వస్తాయి. ఉత్పత్తుల పేర్లు చెప్పకపోయినా, కొన్నింటిపై ఏప్రిల్‌ 15 నుంచి, మరికొన్నింటిపై మే 15, ఇంకొన్నింటిపై డిసెంబర్‌ 1న సుంకాల వసూలు మొదలవుతుందని వివరించింది. ‘‘ఈయూపై అమెరికా సుంకాలు అన్యాయం ఇరుపక్షాలకే గాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే హానికరం కూడా’’ అంటూ ఈయూ ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ దుయ్యబట్టింది. అమెరికా, ఈయూ వార్షిక వర్తక విలువ ఏకంగా 1.8 లక్షల కోట్ల డాలర్లు కావడం విశేషం! ఈ నేపథ్యంలో ట్రంప్‌కు హెచ్చరికగా మాత్రమే తాజా సుంకాలను ప్రకటించినట్టు భావిస్తున్నారు. ఈయూ ఉత్పత్తులన్నింటిపైనా ట్రంప్‌ 20 శాతం సుంకాలు విధించడం తెలిసిందే.దేశాలన్నీ కాళ్ల బేరానికి: ట్రంప్‌ తన టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయని ట్రంప్‌ చెప్పుకున్నారు. ‘‘టారిఫ్‌లను తప్పించుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధమంటున్నాయి. దయచేసి ఒప్పందం చేసుకుందామంటూ కాళ్లబేరానికి వస్తున్నాయి’’ అంటూ గొప్పలు పోయారు. ఆ క్రమంలో ఓ బూతు పదాన్నీ అధ్యక్షుడు ఉపయోగించారు!

Rasi Phalalu: Daily Horoscope On 10-04-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.త్రయోదశి రా.1.01 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పుబ్బ ప.12.57 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.8.44 నుండి 10.29 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ఉ.6.10 నుండి 7.53 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.51, సూర్యాస్తమయం: 6.10. మేషం..పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థుల కృషి వృథా కాగలదు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొంత ఇబ్బంది తప్పదు.వృషభం....కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.మిథునం...దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. కళాకారులకు ఆహ్వానాలు.కర్కాటకం...బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.సింహం...పరపతి పెరుగుతుంది. పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. వాహనయోగం. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత.కన్య...బంధువిరోధాలు. దూరప్రయాణాలు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం.తుల.....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తారు. విందువినోదాలు.వృశ్చికం.....కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.ధనుస్సు...వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు.మకరం..... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. ఆరోగ్యభంగం.దైవదర్శనాలు.కుంభం....ఇంటర్వ్యూలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.మీనం.....చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు. వస్తులాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

CM Revanth Reddy Fires On BJP Leaders And PM Modi4
బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్‌: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకరమైన వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వాళ్లను తరిమి కొట్టినట్లే రాహుల్‌గాంధీ నాయకత్వంలో మనమంతా దేశంలో బీజేపీని ఓడించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌గాంధీ నేతృత్వంలో ముందుకు తీసుకుని వెళ్తుంటే.. ప్రధానమంత్రి మోదీ మాత్రం దేశ వ్యాప్తంగా గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్‌’లో బుధవారం సీఎం ప్రసంగించారు.వల్లభాయ్‌ పటేల్‌తో హృదయపూర్వక బంధం‘గుజరాత్‌ ప్రజలతో, వల్లభాయ్‌ పటేల్‌ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది. దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు. అప్పుడు మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్‌ పటేల్‌తో మాకు హృదయపూర్వక బంధం ఉంది. వల్లభాయ్‌ పటేల్‌ మాకు స్వాతంత్య్రం ఇస్తే.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. వల్లభాయ్‌ పటేల్‌ భూమి నుంచి నేను ఒకటే చెబుతున్నా. మేము బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం..అడ్డుకుంటాం. వారిని ఎవరూ క్షమించరు’ అని రేవంత్‌ అన్నారు.మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే..‘రాహుల్‌గాంధీ తెలంగాణలోని రైతులకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 10 నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసి చూపించింది. మరో హామీ అయిన కులగణనను కూడా పూర్తి చేశాం. కేంద్రం జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌పై లోక్‌సభలో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వకుండా రాహుల్‌గాంధీని మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని గాలికి వదిలేశారు. రెండు కోట్ల మందికి రాకపోయినా మోదీ, అమిత్‌షాలకు మాత్రం పదవులు వచ్చాయి. రైతులు కనీస మద్దతు ధర, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలపాటు ఆందోళన చేసినా మోదీ ప్రభుత్వం కనీసం వారితో చర్చలు కూడా జరపలేదు. మోదీ మణిపూర్‌లో మంటలు రాజేశారు. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం చేశారు. మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే. కానీ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో పేరిట 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.బీజేపీ ఓటమికి కంకణబద్ధులై వెళ్లాలిదేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఎన్నో ఆందోళనలు చేసినా.. ఆయనపై ఏనాడూ లాఠీ ఎత్తలేదు. కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోనే గాడ్సేలు తూటాలు పేల్చి ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, మోదీ ఆలోచన విధానాన్ని అడ్డుకునేందుకే మనమంతా ఇక్కడ ఏకమయ్యాం. ఇక్కడకు వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రతిచోటా ఓడించేలా కంకణబద్ధులై వెళ్లాలి. గాడ్సే భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీని, బీజేపీని అడ్డుకుని దేశాన్ని రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Cricket betting mafia is rampant in country5
జీవితాలే బెట్‌.. మాఫియా క్రికెట్‌

ఫోర్‌ కొడితే చప్పట్లు.. సిక్స్‌ కొడితే కేకలు.. వికెట్‌ పడితే అరుపులు.. గెలుపు ఓటములపై ఉత్కంఠ..! ఇవీ సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లో ఆస్వాదించే అంశాలు.. అయితే, ఇదంతా తెర ముందు దృశ్యం..! మరి తెరవెనుకో..? టాస్‌కు ముందు.. పరుగు తీస్తే.. ఫోర్‌ కొడితే.. సిక్స్‌ బాదితే.. మ్యాచ్‌లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్దీ బెట్టింగ్‌..! బెట్టింగ్‌..! అంతగా ఈ మాఫియా వికటాట్టహాసం చేస్తోంది. చివరికి ఏ టీమ్‌ మ్యాచ్‌ గెలిచినా ఓడేది మాత్రం కచి్చతంగా పందెం కాసినవారే. అది ఎంతగా అంటే..? బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.. అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోతున్నాయి. కొన్నిసార్లు ఒక్క మ్యాచ్‌ తోనే జీవితం తలకిందులైపోతోంది. సాక్షి, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐపీఎల్‌ సందడితో పాటు.. దేశంలో క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా ఇన్నింగ్స్‌ కూడా మొదలవుతోంది. ఆట పట్ల సగటు భారతీయుడి వ్యామోహమే పెట్టుబడిగా ఊబిలోకి లాగుతోంది. చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి దిగజారుస్తోంది. డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ తాజా నివేదిక ప్రకారం ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లోనే దేశంలో వంద బిలియన్‌ డాలర్ల (రూ.8,500 కోట్లు పైగా) బెట్టింగ్‌ దందా సాగుతోంది. గత 17 సీజన్లను విశ్లేషించి ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఏటా బెట్టింగ్‌ దందా 30 శాతం చొప్పున పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుత 18వ సీజన్‌లో బెట్టింగ్‌ అత్యంత గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసింది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఖాయమని స్పష్టం చేసింది. ఏటా ఐపీఎల్‌ సీజన్‌లో 34 కోట్లమంది బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని ఇండియా ఛేంజ్‌ ఫోరం అనే సంస్థ పేర్కొంది. ప్రధాన బెట్టింగ్‌ యాప్‌ల డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది.ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్లుదేశంలో వ్యవస్థీకృతమైన మాఫియా పకడ్బందీగా బెట్టింగ్‌ దందా సాగిస్తోంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా పల్లెలకు కూడా ఈ రాకెట్‌ విస్తరించింది. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ లేని ఉత్సుకతను పెంచేలా దందాను నడుపుతోంది. టాస్‌తో మొదలుపెట్టి.. బంతి బంతికి బెట్టింగ్‌ నిర్వహిస్తోంది. ఒక్కో పందెం రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఉంటోంది. కొన్నేళ్ల క్రితం క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, లాడ్జిలలో ముందుగా డబ్బులు పెట్టి బెట్టింగ్‌ కాసేవారు. డిజిటల్‌ చెల్లింపుల యుగంలో బెట్టింగ్‌ దందా మరింత సులభతరమైంది.అత్యాధునిక టెక్నాలజీ..బెట్టింగ్‌ మాఫియా 5జీ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతూ యాప్‌లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. స్పోర్ట్స్‌ రాడార్, బెట్‌ 365 వంటివి మ్యాచ్‌ల రియల్‌ టైమ్‌ డేటా ఫీడ్‌ను సెకనులో వెయ్యో వంతు (మిల్లీ సెకన్‌) సమయంలో అప్‌డేట్‌ చేస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ టూల్స్‌తో బెట్టింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు. తద్వారా ప్రతి బాల్‌కు దేశవ్యాప్తంగా అత్యంత వేగంతో భారీగా బెట్టింగులు కాసేలా చేస్తున్నారు.పుట్టుగొడుగుల్లా యాప్‌లు.. సోషల్‌ మీడియాతో వలదందా టర్నోవర్‌కు తగ్గట్టే దేశంలో బెట్టింగ్‌ యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగాక బెట్టింగ్‌ మాఫియా దందాకు అడ్డే లేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్‌లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలు ముంచెత్తుతున్నాయి. మెగాపరి, మోస్ట్‌బెల్, పరిసేస, పర్‌ మ్యాచ్, బీసీ డాట్‌గేమ్, 22 బెట్స్, 10సీ సీఆర్‌ఐసీ, మెల్‌బెట్, మేట్‌బెట్, 1 ఎక్స్‌బెట్, రాజా బెట్స్, స్టేక్‌ డాట్‌కామ్, డఫ్పా బెట్‌ ఇలా ఎన్నో యాప్‌ల ప్రకటనలు వరదలా వచ్చి పడుతున్నాయి. కొన్నయితే ఇన్‌ఫ్లుయెన్సర్లతో వల విసరుతున్నాయి. రూ.100 పెడితే రూ.వేయి ఇస్తాం అంటూ.. కొత్త కస్టమర్లకు రూ.100 నుంచి రూ.500 వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఊబిలోకి గుంజుతున్నాయి. ఐపీఎల్‌ సీజన్‌లో దాదాపు 75 యాప్‌లు బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నట్టు డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ వెల్లడించింది.కమీషనే రూ.వెయ్యి కోట్లుభారీగా డబ్బు రొటేషన్‌ అవుతుంది తప్ప.. ఐపీఎల్‌ బెట్టింగ్‌ల ద్వారా సామాన్యులు డబ్బు సంపాదించిన దాఖలాలు లేవన్నది నిజం. నిర్వాహకులు మాత్రం పందెం మొత్తంపై కనీసం 10 శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్‌ దండుకుంంటున్నారు. ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌ దందా టర్నోవర్‌ రూ.10 వేల కోట్లు అనుకుంటే యాప్‌ల నిర్వాహకులు కమీషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లు వెనకేస్తున్నారు.అంతా మనోళ్లే.. చూసీ చూడనట్లు పొండిప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌ మాఫియా చెలరేగుతోంది. ఎంపిక చేసిన హోటళ్లు, లాడ్జీలు, అపార్టుమెంట్ల కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తోంది. టీడీపీ కూటమిలోని కీలక నేతల ప్రధాన అనుచరులే జిల్లాల్లో బెట్టింగ్‌ దందాకు సూత్రధారులు. ⇒ గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి, వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేల కార్యాలయాలు బెట్టింగ్‌ మాఫియాకు అనుకూలంగా పోలీసులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.⇒ విజయవాడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ టీడీపీ నేత పోలీసులకు ఫోన్‌ చేసి ‘అదంతా మనవాళ్లదే’ అని చెప్పడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. ⇒ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూటమి ప్రజాప్రతినిధి సోదరుడే బెట్టింగ్‌ మాఫియాకు కింగ్‌ పిన్‌.⇒ ఏలూరు జిల్లాలో కోడి పందేల నిర్వాహకుడిగా గుర్తింపు పొందిన టీడీపీకి చెందిన సీనియర్‌ ప్రజాప్రతినిధి వర్గం ప్రస్తుతం బెట్టింగ్‌ దందాను సాగిస్తోంది.⇒ వైఎస్సార్‌ కడప జిల్లాలోఅత్యంత వివాదాస్పదుడైన కూటమి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు బెంగళూరులోని బెట్టింగ్‌ రాకెట్‌తో మిలాఖత్‌ అయి.. జిల్లాలో దందా నడుపుతున్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో రూ.500 కోట్ల దందా వీరి లక్ష్యం కావడం గమనార్హం.పందెంరాయుళ్లు కాదు.. బాధితులేక్రికెట్‌ బెట్టింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపారుల నుంచి మెకానిక్‌లు, హోటళ్లలో పనిచేసే యువకులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు చివరకు కనీస సంపాదన లేని విద్యార్థులు కూడా బాధితులే. చేతిలోని డబ్బే కాదు.. అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని మరీ బజారున పడుతున్నారు. బెట్టింగ్‌ కోసం కాల్‌ మనీ రాకెట్‌ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి, తీర్చలేక తీవ్ర అవమానం, ఇబ్బందులు పడుతున్నవారూ భారీగా ఉన్నారు.n మార్చి నెలలో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో అన్నదమ్ములు సూర్యనారాయణ, ఉమామహేశ్‌ రూ.45 లక్షలు కోల్పోయారు. అప్పులు తీర్చలేమని గ్రహించి వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించారు. సూర్యనారాయణ చనిపోగా అపస్మాకర స్థితిలో ఉన్న ఉమామహేశ్‌ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.n హైదరాబాద్‌లో బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.n బిహార్‌లో వ్యాపారి బెట్టింగ్‌లో రూ.2 కోట్ల విలువైన విల్లాను కోల్పోయాడు.n కర్ణాటకలో ఓ వ్యక్తి రూ.కోటి నష్టపోగా.. అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంది.n తమిళనాడు కోయంబత్తూరులో రూ.90 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి జీవితాన్నే బలి తీసుకున్నాడు.బలహీన చట్టాలతో చెలరేగుతున్న మాఫియాదేశంలో జూదం, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో అధికారికంగా, అనధికారికంగా బరి తెగిస్తున్న మాఫియాను కట్టడి చేసేందుకు సరైన చట్టాలు లేవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. n వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను నిషేధించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల నుంచి నిర్వహణ సాగిస్తున్న మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్రమే ఏకీకృత చట్టం చేయాల్సిన అవసరం ఉంది.జూదానికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో ఉన్న చట్టాలు.. వాటి లోపాలు..జూద కార్యకలాపాల నిరోధక చట్టం–1867: బ్రిటీష్‌ కాలంలో చేసిన ఈ చట్టం జూద గృహాలను నిషేధిస్తోంది. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా చట్టాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఆన్‌లైన్‌ జూదాలు, ఇతర అంశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి రావు.రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు: సిక్కిం, గోవా, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలు కొన్ని జూదానికి అనుమతిస్తూ ప్రత్యేక చట్టాలు చేశాయి. ఈ రాష్ట్రాల్లో లైసెన్సు తీసుకుని దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ దందా నడిపిస్తున్నారు. దీంతో కట్టడి చేసేందుకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.ఐటీ చట్టం 2000: సైబర్‌ నేరాలను నిరోధించేందుకు ఉద్దేశించినది. దీంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను నిరోధించడం సాధ్యమా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ సైబర్‌ నేరాల పరిధిలోకి వస్తాయా రావా అని స్పష్టత లేకపోవడమే అందుకు కారణం.బెట్టింగా..!? స్కిల్‌ గేమా...!?ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అన్నది జూదమా కాదా అన్న అంశంపై దేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. ‘గేమ్‌ ఆఫ్‌ స్కిల్‌’ అన్నది ఒక క్రీడగా భావించాలి తప్ప జూదంగా కాదని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకులు వాదిస్తున్నారు. ఆ మేరకు ‘గేమ్‌ ఆఫ్‌ స్కిల్‌’గా పేకాట క్లబ్బులకు అనుమతిస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కిల్‌ గేమ్‌ అని వాదిస్తూ తమపై నిషేధం చెల్లదని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను నిరోధించే అంశం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. కఠిన చట్టమే పరిష్కార మార్గం...ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణం సమగ్ర చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ‘బెట్టింగ్‌– గ్యాంబ్లింగ్‌ రెగ్యులేషన్‌ బిల్లు’ పెండింగులో ఉంది. దీనిపై మరింత న్యాయ సలహాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ నిర్వచనం, బిల్లులోని అంశాల పరిధి, న్యాయ సమీక్షకు నిలవడంపై మరింత లోతుగా సమాలోచనలు జరపాలని చూస్తోంది. పకడ్బందీ చట్టంతోనే బెట్టింగ్‌ మాఫియాకు అడ్డుకట్ట సాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Sakshi Editorial On Dilsukhnagar bomb blasts death penalty to guilty6
సరైన న్యాయం!

పుష్కరకాలం క్రితం ఒక మునిమాపు వేళ హైదరాబాద్‌ నగరంలో 18 మంది అమాయకుల ప్రాణాలు తీసిన బాంబు పేలుళ్ల ఉదంతాల్లో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులకూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు మాత్రమే కాదు, ఉగ్రవాద ఘటనలను వ్యతిరేకించే వారందరికీ ఊరటనిస్తుంది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో రెండుచోట్ల జరిగిన ఈ పేలుళ్లలో మరో 131 మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలామంది ఈనాటికీ ఆ గాయాలు కలిగించిన శారీరక, మానసిక క్లేశాల నుంచి కోలుకోలేకపోతున్నారు. మరణశిక్ష పడిన వారిలో రియాజ్‌ భత్కల్‌ అనే ఉగ్రవాది ఇప్పటికీ పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. ఈ పేలుళ్లకు పథకం పన్నడంతోపాటు అందుకు కావల్సిన నిధుల సమీకరణ, పేలుడు పదార్థాలు, మనుషుల్ని సమకూర్చుకోవటం వగైరాలకు సూత్రధారి రియాజే. ఏవో కొన్ని ఉగ్రవాద ఘటనల ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించవచ్చని, దేశాన్ని బలహీనపరచవచ్చని ఈ బాపతు ఉగ్రవాదులు కలలుగంటారు. ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. అది ఎప్పుడు ఎక్కడ తన విషపుకోరలు చాస్తుందో... ఎవరిని కాటేస్తుందో అంచనా వేయటం కూడా అసాధ్యం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అక్కడి సైన్యం, దాని గూఢచార విభాగం ఐఎస్‌ఐ సహకారంతో శిక్షణ శిబిరాలు నిర్వహించటం, యువకులను తప్పుడు మార్గానికి మళ్లించటం, సాధారణ ప్రజానీకానికి హాని కలిగించగల చర్యలకు ప్రేరేపించటం దశాబ్దాలుగా సాగుతోంది. ఆ సంస్థల ప్రేరణతో సొంతంగా ఉగ్రవాద సంస్థలను నెలకొల్పి భయోత్పాతాన్ని సృష్టించటం భత్కల్‌ లాంటివారికి లాభసాటి వ్యాపారంగా కూడా మారిందని దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఉదంతంపై చేసిన దర్యాప్తులో వెల్లడైంది. మంగళూరు సమీప ప్రాంతాల్లో రియాజ్‌ భత్కల్‌ భారీయెత్తున రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నిర్వహించాడని, జిహాద్‌ పేరుతో దేశంలోనూ, వెలుపలా లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడని కూడా బయటపడింది.తమను తాము మత సంరక్షకులుగా చిత్రించుకోవటం, జిహాద్‌ చేస్తున్నామని మభ్యపెట్టడం భత్కల్‌ లాంటివారికి రివాజు. వీరి వలలోపడి అనేకమంది యువకుల జీవితాలు నాశనమయ్యాయి. జనసమ్మర్దంగల ప్రాంతాల్లో బాంబులుంచి సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించటం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి. ఈ పన్నెండేళ్ల కాలంలోనూ వీరు తమ చర్యలకు పశ్చాత్తాపం ప్రకటించటంగానీ, ఇకపై సత్ప్రవర్తనతో మెలుగుతామని గానీ ఎక్కడా చెప్పలేదు. వీరిలో పరివర్తనకూ లేదా సంస్కరణకూ అవకాశమే లేదని నిర్ధారణ కొచ్చినట్టు ఉన్నత న్యాయస్థానం చెప్పిందంటే ఈ నేరగాళ్లు ఎంత కరుడు గట్టిపోయారో అర్థమవుతుంది. ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకోవచ్చుగానీ ఏ మతమూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఉగ్రవాదానికి అసలు మతం ఉండదు. ఇలాంటి నేరగాళ్ల చర్యల వల్ల మాత్రమే మతం సురక్షితంగా మనుగడ సాగించగలదని అందులోని వారెవరూ విశ్వసించరు కూడా! కానీ అమాయకులను నమ్మించటానికి వీరు మతాన్ని సాధనంగా వాడుకుంటారు. వారిని మభ్యపెట్టడం కోసం ఆధ్యాత్మి కతను ప్రబోధిస్తారు. క్రమేపీ తమ దురాలోచనను వారి మెదళ్లలోకి ఎక్కిస్తారు. అప్పటికల్లా ఆ యువకులు వీరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతారు. ఇలాంటివారికి చివరకు మిగిలేదేమిటో, వారి మానసిక, శారీరక స్థితిగతులు ఎలా దిగజారతాయో తెలియటానికి జాతీయ న్యాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు కొందరు వారితో మాట్లాడి రూపొందించిన నివేదికే సాక్ష్యం. భిన్న వర్గాల ప్రజల మధ్య చిచ్చురేపి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికీ, సమాజాన్ని భయభ్రాంతపరచటానికీ వీరు పాల్పడిన చర్యల వల్ల ఎక్కడెక్కడి నుంచో పొట్టకూటి కోసం ఈ మహానగరాని కొచ్చిన సాధారణ ప్రజానీకం బలయ్యారు. అందులో అన్ని మతాలవారూ ఉన్నారు. ఇంకా అమ్మ కడుపులోనే ఉన్న శిశువు మొదలుకొని స్త్రీలు, పిల్లలు కూడా వీరి మతిమాలిన చేష్టలకు బలైపోయారు. అనేకమంది జీవితాలు అనిశ్చితిలో పడ్డాయి. మనుషులైవుండి తోటి మనుషుల పట్ల ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా వ్యవహరించటం ఊహకందనిది. ఇలాంటి ఉదంతాల్లో ఆచూకీ దొరక్కుండా సులభంగా తప్పించుకోవచ్చని, నేర నిరూపణ అసాధ్యమని నేరగాళ్లు భావిస్తుంటారు. కానీ సాంకేతికత బాగా పెరిగిన ఈ కాలంలో అదేమంత కష్టం కాదని పకడ్బందీ దర్యాప్తు ద్వారా ఎన్‌ఐఏ నిరూపించింది. అయితే ఇలాంటి కేసుల్లో ఇమిడివుండే సంక్లిష్టతల వల్ల కావొచ్చు... మన న్యాయస్థానాలకు ఉండే పెండింగ్‌ కేసుల భారం వల్ల కావొచ్చు విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. ఈ ఉదంతం చోటుచేసుకున్ననాటినుంచీ చూస్తే ఇప్పటికి పన్నేండేళ్ల సమయం పట్టింది. త్వరితగతిన విచారించి శిక్షించే వ్యవస్థ ఉంటే అలాంటి బాటలో పోయేవారికి అదొక హెచ్చరికగా పనికొస్తుంది. ఈ తరహా భయోత్పాత చర్యలకు ఒక నిరోధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉదంతంలో అయిన వారిని కోల్పోయినవారికీ, ప్రాణాలతో బయటపడి భారంగా బతుకీడుస్తున్నవారికీ ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందలేదంటే మనసు చివుక్కుమంటుంది. కాళ్లూ చేతులూ కోల్పోయి, చూపు, వినికిడి దెబ్బతిని, కనీసం మందులు కొనే శక్తిలేక అనేకులు కష్టాలు పడుతుండటం కలచివేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.

Jainism played invaluable role in building India identity7
జైన మతంతో భారత్‌కు గుర్తింపు 

న్యూఢిల్లీ: భారతదేశ గుర్తింపును నిర్మించడంలో జైన మతం అమూల్యమైన పాత్ర పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, యుద్ధాలు, ధ్వంసమవుతున్న పర్యావరణం వంటి పెను సవాళ్లకు అసలైన పరిష్కార మార్గాలు జైన ధర్మంలో ఉన్నాయని ఉద్ఘాటించారు. ‘నవకర్‌ మహామంత్ర దివస్‌’ సందర్భంగా బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. జైన మతంతో ముడిపడి ఉన్న ప్రాచీన కట్టడాలు, జైన గురువుల బోధనలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పార్లమెంట్‌ భవనంలో జైన తీర్థంకరుల విగ్రహాలకు స్థానం కలి్పంచినట్లు తెలిపారు. జైన మత ప్రభావం మన పార్లమెంట్‌లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటూ శాంతియుతంగా జీవించాలని జైనిజం బోధిస్తున్నట్లు గుర్తుచేశారు. హింసను ఎంతమాత్రం అంగీకరించదని పేర్కొన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణను బోధించే జైనమత సూత్రాలు అందరికీ ఆచరణీయమని పిలుపునిచ్చారు. భారత ఆధ్యాతి్మక వైభవానికి జైన సాహిత్యం వెన్నుముకగా నిలుస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు. జైన సాహిత్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్‌ చేసే పథకం తీసుకొచ్చామని తెలిపారు. పాళీ, పాకృత బాషలను ప్రాచీన భాషలుగా గుర్తించామని వివరించారు.మనమంతా తొమ్మిది ప్రతిజ్ఞలు చేద్దామని మోదీ సూచించారు. అవేమిటంటే... 1. నీటిని సంరక్షించుకుందాం.. జల సంరక్షణ మనందరి బాధ్యత 2. మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటుదాం 3. పరిశుభ్రతను ప్రోత్సహిద్దాం 4. స్థానిక ఉత్పత్తులనే ఉపయోగిద్దాం 5. దేశంలో పర్యటిద్దాం.. పర్యాటకాన్ని ప్రోత్సహిద్దాం.. పేదలకు సాయం అందిద్దాం 6. రసాయనాలకు తావులేకుండా ప్రకృతి వ్యవసాయం చేద్దాం7. ఆహారంలో భాగంగా తృణధాన్యాలు స్వీకరిద్దాం.. తద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుందాం.8. వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకుందాం9. క్రీడలు, యోగాను మన నిత్యజీవితంలో ఒక భాగంగా మార్చుకుందాం

3500 crore dues have accumulated even under Aarogyasri8
‘ఆసరా’కూ వంచన

సాక్షి, అమరావతి: పీ4తో పేదరికాన్ని నిర్మూలిస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. పాలనలో మాత్రం అడుగడుగునా పెత్తందారీ పోకడలతో పేదలను వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తా.. సంక్షేమం అమలుచేస్తాననే కల్లబొల్లి కబుర్లతో గద్దెనెక్కి ఇప్పుడు పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏడాది కూడా తిరగకుండానే అనారోగ్యంతో చికిత్సలు పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు విశ్రాంత సమయంలో అందించే ఆసరా సాయాన్ని అటకెక్కించారు. ఇందులో భాగంగా గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 4 లక్షల మందికి పైగా బాధితులకు రూ.203 కోట్ల మేర ఆసరా సాయం ఎగ్గొట్టేశారు. ఇదేకాక.. ఆరోగ్యశ్రీ కింద రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా.. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నగదు రహిత వైద్యసేవలు అందించడంలేదు. వాస్తవానికి.. పేదలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసి, చికిత్సానంతరం బాధితులకు అండగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో జీవన భృతి మొత్తాన్ని రోగి/కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రూ.203 కోట్లు బకాయిపడ్డ బాబు సర్కారుకానీ, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకోగానే ఆరోగ్యశ్రీని బీమా రూపంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య ఆసరాకు పూర్తిగా మంగళం పాడేశారు. దీంతో.. గతేడాది జూన్‌ నుంచి ఆసరా చెల్లింపులను ప్రభుత్వం నిలిపివేసింది. రోగులు ఆసరా సాయం కోసం చేసుకున్న దరఖాస్తులను ఆరోగ్యవిుత్రలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సాయం విడుదల చేయడంలేదు. ఇలా గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 4 లక్షల మందికి పైగా బాధితులకు రూ.203 కోట్లు చెల్లించలేదు. కానీ, గత ప్రభుత్వం మాత్రం ఆ­లస్యం లేకుండా రోగుల ఖాతాల్లో డబ్బు జమ చేయ­డానికి ఆరోగ్య ఆసరాను గ్రీన్‌ ఛానల్‌లో ఉంచింది.2025–26 బడ్జెట్‌లో కేటాయింపుల్లేవుఇదిలా ఉంటే.. ఆసరాకు చరమగీతం పాడేసి 2025–26 ఆర్థిక సంవత్సరానికి చంద్రబాబు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించలేదు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆసరా కోసం కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు. తద్వారా ఆసరాను అమలుచేయబోమని బాబు సర్కారు తేల్చేసింది. మరోవైపు.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలును గాలికి వదిలేసింది. దీంతో.. ఇటీవల ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి.చర్చల పేరిట ప్రభుత్వ పెద్దలు యాజమాన్యాలను పిలిచి వారితో బెదిరింపు ధోరణిలో వ్యవహరించి సమ్మె విరమింపజేయించారు. రూ.3,500 కోట్ల బకాయిలు ఉండడంతో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నగదు రహిత వైద్యసేవలకు విముఖత వ్యక్తంచేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పేరెత్తగానే రోగులను బయటకు వెళ్లగొడుతుండగా, మరికొందరు అదనంగా డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్న దుస్థితి నెలకొంది.జగన్‌ పాలనలో ఇలా.. నిజానికి.. 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 1,059 ప్రొసీజర్లను 3,257కు పెంచింది. అంతేకాక.. వైద్యసేవల పరిమితిని దేశంలో ఎక్కడా లేనట్లుగా రూ.25 లక్షలకు పెంచారు. పైగా.. బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా ద్వారా అండగా నిలిచింది. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోజే వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లించింది.

 RBI governor Sanjay Malhotra announces 25 bps repo rate cuts9
ఇక రుణాలు మరింత చౌక!

రుణగ్రహీతలకు మరోసారి ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలు మరింత చౌకగా లభించేలా.. ఈఎంఐల భారం ఇంకాస్త దిగొచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకపక్క ముదురుతున్న ట్రంప్‌ టారిఫ్‌ వార్‌.. మరోపక్క దిగజారుతున్న వృద్ధి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తూ... వరుసగా రెండోసారి కీలక పాలసీ రేట్లను తగ్గించింది. అంతేకాదు, సమీప భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న సంకేతాలివ్వడం విశేషం! ఆర్‌బీఐ చర్యలకు అనుగుణంగా కొన్ని బ్యాంకులు కూడా తక్షణం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పరపతి సమీక్షలోనూ వడ్డీ రేట్ల కోతకు ఓకే చెప్పింది. అమెరికా టారిఫ్‌ల దెబ్బకు ఆర్థిక వ్యవస్థకు గట్టిగానే సెగ తగిలే అవకాశం ఉండటంతో కీలక పాలసీ రేటు.. రెపోను వరుసగా రెండోసారి తగ్గించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గనుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సారథ్యంలోని పరిపతి విధాన కమీటీ (ఎంపీసీ) సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఓటేశారు. దీంతో బ్యాంకుల రుణ రేట్లు కూడా దిగిరానున్నాయి. ప్రతీకార సుంకాల్లో భాగంగా దాదాపు 60 దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌లు విధించడం తెలిసిందే. భారత్‌పై కూడా 26 శాతం సుంకాలు వడ్డించారు. మరోపక్క, అమెరికాతో అమీతుమీ అంటూ చైనా కూడా దీటుగా సుంకాలతో విరుచుపడుతుండటంతో వాణిజ్య యుద్ధం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో వృద్ధికి మరింత దన్నుగా నిలిచేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు బాటలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి సమీక్షలో దాదాపు ఐదేళ్ల తర్వాత (2020 మే) తొలిసారి రెపో రేటును పావు శాతం తగ్గించింది. ఇప్పుడు మరో పావు శాతం కోతతో రెపో రేటు 2022 నవంబర్‌ స్థాయికి దిగొచ్చింది.వృద్ధి రేటు అంచనాలు డౌన్‌... ట్రేడ్‌ వార్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశి్చతుల ప్రభావంతో మన ఎగుమతులు, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరోపక్క, మాంద్యం ఆందోళనలు, ఆర్థిక మందగమనం కారణంగా అంతర్జాతీయంగా చమురు రేటు దిగొస్తుండటంతో ద్రవ్యోల్బణం అంచనాలను కూడా 4.5 శాతానికి కుదించింది. ఇతర ముఖ్యాంశాలు... → పరపతి విధాన స్థితిని ఇప్పుడున్న ‘తటస్థం’ నుంచి ‘సానుకూలానికి’ తగ్గించింది. అంటే, ఎలాంటి తీవ్ర ప్రతికూలాంశాలు లేకపోతే, రాబోయే సమీక్షల్లో రేట్ల తగ్గింపు లేదా యథాతథ స్థితిని కొనసాగించడం జరుగుతుంది. → పర్సన్‌–టు–మర్చంట్‌ (పీ2ఎం) పేమెంట్‌లకు సంబంధించి యూపీఐ లావాదేవీ పరిమితిని పెంచడానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కి అనుమతించింది. ప్రస్తుతం పర్సన్‌–టు–పర్సన్‌ (పీ2పీ), పీ2ఎం పరిమితి రెండూ రూ. లక్షగా ఉంది. అయితే, పీ2ఎంలో కొన్ని నిర్దిష్ట వినియోగాలకు రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు ఇలా అధిక పరిమితులకు మినహాయింపు ఉంటోంది. అయితే, ఇప్పుడు ఆర్‌బీఐ అనుమతితో పీ2ఎంపై ఉన్న రూ. లక్ష పరిమితిని యూజర్ల అవసరాలకు అనుగుణంగా పెంచడానికి ఎన్‌పీసీఐకి అవకాశం లభిస్తుంది. పీ2పీ పరిమితి మాత్రం రూ. లక్షగానే కొనసాగుతుంది. → బంగారు రుణాలపై నిబంధనలను కఠిన తరం చేస్తూ ముసాయిదా మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. రుణాల మంజూరు సమయంలో తనఖాగా పెట్టే పసిడి స్వచ్ఛత, బరువు లెక్కింపు ఇతరత్రా పద్ధతులకు సంబంధించి గోల్డ్‌ లోన్‌ పరిశ్రమలోని రుణదాతలంతా ఇకపై ఒకే విధమైన డాక్యుమెంటేషన్‌ను అనుసరించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అన్ని బ్రాంచీల్లోనూ ఒకే ప్రామాణిక విధానం అమలు చేయాలని ముసాయిదాలో పేర్కొంది. → తదుపరి పాలసీ సమీక్ష 2025 జూన్‌ 4 నుంచి 6 వరకు జరుగుతుంది.4 బ్యాంకులు బోణీ...ఆర్‌బీఐ రెండోసారి రెపో తగ్గింపు ప్రకటనతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు బోణీ చేశాయి. ఇందులో ఇండియన్‌ బ్యాంక్‌ అత్యధికంగా రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌బీఎల్‌ఆర్‌)ను 35 బేసిస్‌ పాయింట్లు (0.35%) తగ్గింంచి 8.7%కి చేర్చింది. శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్‌బీఎల్‌ఆర్‌లో పావు శాతం కోతతో ఇప్పుడున్న 9.1% నుంచి 8.85 శాతానికి తగ్గించాయి. ఇవి వెంటనే అమల్లోకి వచ్చాయి. యూకో బ్యాంక్‌ గురువారం నుంచి అమలయ్యేలా ఆర్‌బీఎల్‌ఆర్‌ను 8.8%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గను న్నాయి. ఇతర బ్యాంకులు కూడా త్వరలోనే ఇదే బాట పట్టే అవకాశం ఉంది.నేను భారతంలో సంజయుడిని కాదు... వడ్డీ రేట్లు ఏ స్థాయికి చేరుతాయో చెప్పలేను. నేను భారతంలో సంజయుడిని కాదు. సంజయ్‌ని మాత్రమే. నాకు అలాంటి దివ్య దృష్టి ఏదీ లేదు. పాలసీ నిర్ణయం కస్టమర్లకు బదిలీ అయ్యేందుకు తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ)ను అందిస్తాం. తాజా ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. ముడిచమురు ధరలు దిగొస్తున్నాయి. దీంతో సెంట్రల్‌ బ్యాంకులు తమ దేశీ ప్రాధాన్యతలను అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. – సంజయ్‌ మల్హోత్రా, ఆర్‌బీఐ గవర్నర్‌గృహ రుణాలపై ఊరట ఇలా... ఆర్‌బీఐ వరుసగా రెండో సారీ రెపో రేటును పావు శాతం తగ్గించడంతో గృహ రుణగ్రహీతలకు మరింత ఊరట లభించనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు రూ.50 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 8.75% వడ్డీ రేటుతో తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.44,186 చొప్పు న నెలవారీ వాయిదా(ఈఎంఐ) పడు తుంది. బ్యాంకులు ఈ పావు శాతం కోతను నేరు గా కస్టమర్లకు బదలాయిస్తే... వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గు తుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ. 43,391కి దిగొస్తుంది. అంటే నెలకు రూ.795 చొప్పున మిగిలినట్లు లెక్క. మిగతా రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పులు జరగకుండా అదే వడ్డీ రేటు కొనసాగితే మొత్తం వడ్డీ రూ. 1,90,649 ఆదా అవుతుంది. అయితే, రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ నెలవారీ చెల్లించే ఈఎంఐని ఇంతకుముందు లాగే (రూ.44,186 చొప్పున) కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఎకానమీకి దన్ను... రెపో రేటు తగ్గింపుతో పాటు పరపతి విధాన స్థితిని తటస్థం నుంచి సానుకూలానికి మార్చడం అనేది దేశీ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. టారిఫ్‌ ప్రభావం నుంచి ఎకానమీకి చేదోడుగా నిలిచేందుకు ఈ చర్యలు తోడ్పడతాయి. – సీఎస్‌ శెట్టి, ఎస్‌బీఐ చైర్మన్‌వాహన పరిశ్రమకు సానుకూలం... ఆర్‌బీఐ రెపో తగ్గింపుతో వాహన కొనుగోలుదారులపై భారం తగ్గుతుంది. దీనివల్ల మళ్లీ అమ్మకాలు పుంజుకుని ఆటోమొబైల్‌ రంగంలో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంటుంది. – శైలేష్‌ చంద్ర, సియామ్‌ ప్రెసిడెంట్‌వృద్ధికి ఊతం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రెపో కోతతో పాటు పరపతి విధానాన్ని సానుకూలానికి మార్చడం మన ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద ప్లస్‌. దీనికి ప్రభుత్వ సానుకూల ఆర్థిక విధానం కూడా తోడవ్వడంతో వృద్ధి పుంజుకుంటుంది. – చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయ్‌... రియల్టీ రంగంలో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్‌ నింపేలా సరైన సమయంలో రేట్ల కోత నిర్ణయం వెలువడింది. దీనివల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొచి్చ... మధ్య ఆదాయ, అందుబాటు ధర ఇళ్ల విభాగాల్లో అమ్మకాలు పుంజుకుంటాయి. – బొమన్‌ ఇరానీ, క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు

Fourth consecutive win for Gujarat team10
టైటాన్స్‌ జైత్రయాత్ర

ఐపీఎల్‌లో మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ జోరు కొనసాగుతోంది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాతి నుంచి చెలరేగుతున్న జట్టు వరుసగా నాలుగో విజయంతో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో పోరులో సాయి సుదర్శన్‌ అండ్‌ టీమ్‌ మెరుపు బ్యాటింగ్‌తో ముందుగా భారీ స్కోరు నమోదు చేసి... ఆ తర్వాత సొంత మైదానంలో దానిని విజయవంతంగా నిలబెట్టుకోగలిగింది. పేలవ బౌలింగ్‌ తర్వాత బ్యాటింగ్‌లోనూ బలహీనంగా కనిపించిన రాయల్స్‌ ఓటముల ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. ఛేదనలో హెట్‌మైర్, సామ్సన్‌ పోరాటం సరిపోక జట్టు చేతులెత్తేసింది. అహ్మదాబాద్‌: శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ మరోసారి సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. బుధవారం జరిగిన ఐపీఎల్‌ 18వ సీజన్‌ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆధిక్యం కనబర్చిన టైటాన్స్‌ 58 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా... జోస్‌ బట్లర్‌ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుఖ్‌ ఖాన్‌ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచారు. అనంతరం రాజస్తాన్‌ 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. హెట్‌మైర్‌ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ సామ్సన్‌ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, ప్రసిధ్‌ కృష్ణకు 3 వికెట్లు దక్కాయి. కీలక భాగస్వామ్యాలు... ఆర్చర్‌ బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (2) ఆరంభంలోనే వెనుదిరిగినా... సుదర్శన్, బట్లర్‌ భాగస్వామ్యంలో జట్టు కోలుకుంది. వీరిద్దరు చక్కటి షాట్లతో స్కోరుబోర్డును నడిపించారు. తుషార్‌ దేశ్‌పాండే ఓవర్లో సుదర్శన్‌ 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 80 పరుగులు జోడించిన తర్వాత బట్లర్‌ వెనుదిరిగాడు. మరోవైపు సుదర్శన్‌ 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు.తీక్షణ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టి షారుఖ్‌ కూడా జోరు ప్రదర్శించాడు. అయితే తీక్షణ తర్వాతి ఓవర్లో అతను అవుట్‌ కావడంతో 62 పరుగుల (34 బంతుల్లో) మూడో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. రూథర్‌ఫర్డ్‌ (7) విఫలం కాగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో సుదర్శన్‌ సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. చివర్లో తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రషీద్‌ ఖాన్‌ (4 బంతుల్లో 12; 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో టైటాన్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది. హైదరా బాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించిన సుందర్‌ను గుజరాత్‌ ఈసారి ఆడించకపోగా... వ్యక్తిగత కారణాలతో హసరంగ మ్యాచ్‌కు దూరం కావడం రాజస్తాన్‌ బౌలింగ్‌ను బలహీనపర్చింది. టపటపా... ఛేదనలో ఏ దశలోనూ రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ గొప్పగా సాగలేదు. ఆరంభం నుంచి చివరి వరకు బ్యాటర్లలో తడబాటు కనిపించింది. గుజరాత్‌ బౌలర్లంతా సమష్టి ప్రదర్శనతో రాయల్స్‌ను కట్టడి చేశారు. రెండు పరుగుల వ్యవధిలో జైస్వాల్‌ (6), నితీశ్‌ రాణా (1) వెనుదిరగ్గా... సామ్సన్, రియాన్‌ పరాగ్‌ (14 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. తాను ఆడిన తొలి 8 బంతుల్లోనే 3 సిక్స్‌లు కొట్టిన పరాగ్‌ ఎక్కువసేపు నిలవలేకపోగా, ధ్రువ్‌ జురేల్‌ (5) విఫలమయ్యాడు. 47 బంతుల్లో 102 పరుగులు చేయాల్సిన స్థితిలో సామ్సన్‌ను ప్రసిధ్‌ అవుట్‌ చేయడంతో రాయల్స్‌ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో హెట్‌మైర్‌ చేసిన ప్రయత్నం ఏమాత్రం సరిపోలేదు. స్కోరు వివరాలు గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) సామ్సన్‌ (బి) దేశ్‌పాండే 82; గిల్‌ (బి) ఆర్చర్‌ 2; బట్లర్‌ (ఎల్బీ) (బి) తీక్షణ 36; షారుఖ్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) తీక్షణ 36; రూథర్‌ఫర్డ్‌ (సి) సామ్సన్‌ (బి) సందీప్‌ 7; తెవాటియా (నాటౌట్‌) 24; రషీద్‌ (సి) జైస్వాల్‌ (బి) దేశ్‌పాండే 12; అర్షద్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–14, 2–94, 3–156, 4–163, 5–187, 6–201. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–30–1, ఫారుఖీ 4–0–38–0, దేశ్‌పాండే 4–0–53–2, సందీప్‌ 4–0–41–1, తీక్షణ 4–0–54–2. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) రషీద్‌ (బి) అర్షద్‌ 6; సామ్సన్‌ (సి) సాయికిషోర్‌ (బి) ప్రసిధ్‌ 41; నితీశ్‌ రాణా (సి) ఖెజ్రోలియా (బి) సిరాజ్‌ 1; పరాగ్‌ (సి) బట్లర్‌ (బి) ఖెజ్రోలియా 26; జురేల్‌ (సి) సుదర్శన్‌ (బి) రషీద్‌ 5; హెట్‌మైర్‌ (సి) సాయికిషోర్‌ (బి) ప్రసిధ్‌ 52; శుభమ్‌ దూబే (ఎల్బీ) (బి) రషీద్‌ 1; ఆర్చర్‌ (సి) గిల్‌ (బి) ప్రసిధ్‌ 4; తీక్షణ (సి) సుదర్శన్‌ (బి) సాయికిషోర్‌ 5; దేశ్‌పాండే (సి) రషీద్‌ (బి) సాయికిషోర్‌ 3; సందీప్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 159. వికెట్ల పతనం: 1–10, 2–12, 3–60, 4–68, 5–116, 6–119, 7–144, 8–145, 9–150, 10–159. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–30–1, అర్షద్‌ 2–0–19–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0–24–3, ఖెజ్రోలియా 3–0–29–1, రషీద్‌ 4–0–37–2, సాయికిషోర్‌ 2.2–0–20–2.ఐపీఎల్‌లో నేడుబెంగళూరు X ఢిల్లీ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement