
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రెండేళ్ల విరామం తర్వాత ఆదివారం తన నివాసంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వేడుకల్లో ఒక అపశ్రుతి చోటుచేసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీపాలతో ముస్తాబైన బిగ్‌బీ నివాసం జల్సాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ మేనేజర్ అర్చన సదానంద లెహెంగాకు అనుకోకుండా నిప్పంటుకుంది. దీనిని గుర్తించిన షారుఖ్ ఖాన్ వెంటనే స్పందించి.. ఆమెకు పెద్దప్రమాదం కాకుండా కాపాడారు. ఐశ్వర్యకు అర్చన సదానంద్‌కు చాలా కాలంగా మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఆమె లెహంగాకు దీపం అంటుకుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన షారుక్ ఖాన్ వెంటనే తన జాకెట్‌తో ఆమె లెహెంగాకు అంటుకున్నమంటలను ఆర్పాడు.
ఈ ప్రమాదంలో అర్చనకు చేతులకు, కుడి కాలికు 15శాతం గాయాలయ్యాయి. షారుక్‌కు కూడా స్వల్ఫ గాయాలయ్యాయి. ఎటువంటి ఇన్ఫెక‌్షన్లు దారి చేరకుండా ఉండేందుకు ఆమెను ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బిగ్ బీ ఇంట్లో అతికొద్ది గెస్ట్‌లు మాత్రమే ఉన్నారు. పార్టీ సుమారుగా ముగియడంతో మేనేజర్ అర్చన తన కుమార్తెతో కలిసి బయట ప్రాంగణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంతో పార్టీలోని వారు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. అయితే, అక్కడే ఉన్న షారుఖ్ రియల్ హీరోగా స్పందించి అర్చనను కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
— Farah Khan (@TheFarahKhan) October 30, 2019