నరేంద్ర మోదీ ప్రభుత్వం రేండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రకటనల ఖర్చుపై విమర్శలు కురిపించారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం రేండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రకటనల ఖర్చుపై విమర్శలు కురిపించారు. ఇప్పటి వరకు కేంద్ర సర్కారు ప్రకటనలకోసం రూ.1000 కో్ట్లని ఖర్చు చేసిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వ యేడాదికి రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రికల్లో పూర్తి పేజీ ఆడ్ ఇవ్వడాన్నిఆయన తప్పు పట్టారు.
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇటీవల ప్రకటనల కోసం రూ.526 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన విషయం తెలిసిందే. కాగా ఈ యేడాది ఫిబ్రవరి, మే నెలల్లో ఆప్ ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రూ.14.5 కోట్లు కేవలం టీవీ, పత్రికలు ,హోర్డింగ్ ల కోసమే ఖర్చు చేసిందని ,పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే.