
కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని భద్రతా దళాలు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రియాజ్ నైకూను దిగ్బంధం చేశాయి. పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే బేగ్‌పుర గ్రామంలో ఉగ్రవాది రియాజ్ ఉన్నట్లు గుర్తించారు. హిజ్‌బుల్ ముజాయిద్దీన్ కమాండర్ అయిన రియాజ్ తలపై 12 లక్షల రివార్డు ఉంది. కాగా ఈ ప్రాంతంలో ఉన్న టెర్రరిస్టు గ్రూపులకు రియాజ్ పెద్ద దిక్కుగా ఉన్నాడని భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఒకవేళ రియాజ్‌ను అరెస్టు చేసినా లేక హతమార్చినా.. ఇది స్థానికంగా ఉన్న ఉగ్రమూకలకు పెద్ద దెబ్బగా చెప్పచ్చు. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ ఆపరేషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఉగ్రవాదులను మట్టుబెట్టుడానికి కాల్పులు జరుగుతున్నట్లు చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి సీనియర్ అధికారులు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. రియాజ్ సొంత ఊరైన బేగ్‌పురాకు హిజ్‌బుల్ కమాండర్ వచ్చినట్లు సమాచారం రావడంతో.. ఆ ప్రాంతాన్ని రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, స్పెషనల్ ఆపరేషన్స్ గ్రూప్ దళాలు చుట్టుముట్టాయి. ఆ గ్రామానికి చెందిన అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసివేసి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Contact established in the third operation at #Beighpors #Awantipur. Top terrorist commander is trapped. Exchange of fire on. Details shall follow.. https://t.co/umZv0JgVbs
— J&K Police (@JmuKmrPolice) May 6, 2020