
పటీదార్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్
అహ్మదాబాద్: పటేల్ వర్గీయులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆగస్టు 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు పటీదార్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ప్రకటించారు. తన వర్గీయులకు రిజర్వేషన్లు సాధించడమే తన లక్ష్యమని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కోటా సాధనలో తన ప్రాణాలు పోయినా లెక్కచేయనన్నారు. ‘ఈ పోరాటంలో మీ అందరి మద్దతు కోరుతున్నా. పటీదార్ క్రాంతి దివస్ అయిన ఆగస్టు 25 నుంచి నిరాహార దీక్షకు దిగబోతున్నా. రిజర్వేషన్లు సాధించే వరకు ఆహారం, నీరు ముట్టుకోను’ అన్నారు.