
సాక్షి, విజయనగరం : టీడీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లా సాలూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ సంధ్యారాణి, నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ బంజ్‌దేవ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
సాలూరులో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదని సంధ్యారాణి అలకబూనారు. బంజ్‌దేవ్ కావాలనే తన వర‍్గం వారిని పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. కాగా సంద్యారాణిని బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ రంగంలోకి దిగారు. బంజ్‌దేవ్‌తో పాటు సంధ్యారాణి ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంధ్యారాణి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టడం గమనార్హం.