
సాక్షి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించగా టీఆర్‌ఎస్ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి వేదికపైకి వెల్లకుండా ప్రజల్లో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.