
రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామిని ఆదివారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్మించుకున్నారు.
కీసర(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామిని ఆదివారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కావడంతో అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.