
వైఎస్ జగన్ ను ఎదుర్కొలేకే...
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేకే సీఎం చంద్రబాబు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేకే సీఎం చంద్రబాబు నాయుడు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
టీడీపీ నుంచి మరికొంత మంది నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. టీడీపీలో లూటీ నేతలు ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు.