
మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
ముంబై రవాణా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు వచ్చేనెల 2న ముంబైకి అధికారుల బృందాన్ని పంపుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ముంబై రవాణా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు వచ్చేనెల 2న ముంబైకి అధికారుల బృందాన్ని పంపుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ముంబై తరహా రవాణా వ్యవస్థను హైదరాబాద్ లో అమలు చేయాలన్న ప్రతిపాదనపై బుధవారం ఆయన అధికారులతో చర్చలు జరిపారు. ఆర్టీసీ పోలీస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన చర్చకు రాలేదని సమావేశం ముగిసిన తర్వాత మంత్రి తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదన పరిశీలిస్తామని చెప్పారు. ముంబైలో ప్రయాణికులు బస్సెక్కేందుకు పాటిస్తున్న ‘క్యూ’ పద్ధతిని హైదరాబాద్‌లోనూ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.