నగరంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అదే వరస. ఎవరెంతగా ప్రచారం నిర్వహించినా.. ఓటరు నమోదులో ఎంతో స్పందన కనిపించినా..
- ఓట్ల నమోదుకు అనూహ్య స్పందన
- ఓటేయడంపై మాత్రం అనాసక్తి
- 40 శాతం పోలింగ్‌కూ నోచని వైనం
- మెజారిటీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అదే వరస. ఎవరెంతగా ప్రచారం నిర్వహించినా.. ఓటరు నమోదులో ఎంతో స్పందన కనిపించినా.. తీరా పోలింగ్ దగ్గరకు వచ్చేప్పటికి గతమే పునరావృతమైంది. నగరంలోని ఏ నియోజకవర్గంలోనూ చెప్పుకోదగ్గ పోలింగ్ జరగలేదు. పలు నియోజకవర్గాలు 40 శాతం పోలింగ్‌కు కూడా నోచుకోలేదు. గత ఎన్నికల్లో ఇలా తక్కువ పోలింగ్ జరిగిన కేంద్రాలపై ఈసారి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆయా కేంద్రాల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఓటుహక్కుపై ప్రచారం నిర్వహించారు. ఓటును త ప్పనిసరిగా వినియోగించుకోవాలని హితోపదేశం చేశారు. పలు సంక్షేమ పథకాలు పొందాలన్నా ఓటు వేయాలని పరోక్షంగా హెచ్చరికల స్వరం సైతం వినిపించారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ ఓటేయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినా ప్రయోజనం కానరాలేదు. నగరంలోని పలు నియోజకవర్గాల్లో 40 శాతం కన్నా తక్కువే పోలింగ్ నమోదైంది. వాటిలో మచ్చుకు కొన్ని..