
స్వాతంత్ర్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన వీరుడి జయంతి సందర్భంగా..
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు.
స్వాతంత్ర్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘననివాళి అని ట్వీట్ చేశారాయన. మరోవైపు ఏపీ సహా దేశవ్యాప్తంగా బోస్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
స్వాతంత్ర్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘననివాళి.#SubhashChandraBoseJayanti pic.twitter.com/u3hDesmO1j
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2023
జనవరి 23, 1897లో కటక్‌లో జన్మించారు సుభాష్ చంద్రబోస్. గాంధీజీ సహా పలువురు అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే.. బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టడానికి యత్నించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణ త్యాగం చేశారు!.