‘దిశ’ మౌలిక వసతుల కోసం రూ.4.50 కోట్లు | AP govt has sanctioned Rs 4 and half crore for infrastructure development for Disha system | Sakshi
Sakshi News home page

‘దిశ’ మౌలిక వసతుల కోసం రూ.4.50 కోట్లు

Published Wed, Jul 7 2021 4:35 AM | Last Updated on Wed, Jul 7 2021 10:11 AM

AP govt has sanctioned Rs 4 and half crore for infrastructure development for Disha system - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా భద్రత కోసం ఏర్పరచిన దిశ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. కేసుల సత్వర విచారణకు దిశ ల్యాబ్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన 7 రకాల పరికరాల కొనుగోలుకు ఈ నిధులను వెచ్చిస్తారు.

ఈ నిధులతో గ్యాస్‌ క్రోమటోగ్రఫీ పరికరాలు 2, ఫోరెన్సిక్‌ అనాలిసిస్‌ కోసం స్పెస్టోక్సోపీ పరికరాలు 3, హైయండ్‌ ఫోరెన్సిక్‌ వర్క్‌ స్టేషన్లు 2, ఫోరెన్సిక్‌ హార్డ్‌వేర్‌రైట్‌ బ్రాకర్‌ కిట్‌ ఒకటి, యూఎఫ్‌ఈడీ పీసీ ఒకటి, డీవీఆర్‌ ఫోరెన్సిక్‌ ఎగ్జామినర్‌ ఒకటి, ఫోరెన్సిక్‌ ఆడియో ఎనాలిసిస్, స్పీకర్‌ ఐడెంటిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఒకటి కొనుగోలు చేస్తారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement