
శనివారం ఉదయం 9గంటలకు బస్సు యాత్ర ప్రారంభం
కావలి హైవే వద్ద సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ
జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 9వ రోజు శనివారం (ఏప్రిల్ 6వ తేదీ) షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్‌ఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం 3గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు.