
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇనుప ఖనిజ మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ.. కొత్త చైర్మన్, ఎండీగా అమితవ ముఖర్జీని నియమించింది. సీఎండీగా ముఖర్జీ గురువారం(6) నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2025 మార్చి 6 నుంచి బోర్డు సీఎండీగా ఎంపిక చేసినట్లు ఎన్‌ఎండీసీ వెల్లడించింది. వయసురీత్యా 2028 ఫిబ్రవరి 29 వరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేటంతవరకూ ముఖర్జీ పదవిని నిర్వహించనున్నట్లు తెలియజేసింది. 2018 నవంబర్‌లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా కంపెనీలో చేరిన ముఖర్జీ 2023 మార్చి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.