
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ దిగొచ్చాయి. వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు నిన్నటి రోజున భారీగా తగ్గి ఉపశమనం ఇచ్చాయి. నేడు (April 5) కూడా అదే తగ్గుదలను కొనసాగించాయి.
బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 83,100 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,660 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.900, రూ.980 చొప్పున తగ్గాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.90,810 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.83,250 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.980, రూ.900 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.
ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనా
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,660 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.900, రూ.980 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి భారీ పతనం
దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధర కేజీకి రూ.5000 క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,03,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 94,000 వద్దకు దిగివచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)