'సుందర్ పిచాయ్' రోజూ చూసే వెబ్‌సైట్‌ ఇదే.. | Google CEO Sundar Pichai Day Start Visiting Techmeme Website | Sakshi
Sakshi News home page

'సుందర్ పిచాయ్' రోజూ చూసే వెబ్‌సైట్‌ ఇదే..

Published Fri, Feb 9 2024 8:28 PM | Last Updated on Fri, Feb 9 2024 8:35 PM

Google CEO Sundar Pichai Day Start Visiting Techmeme Website - Sakshi

సాధారణంగా చాలా మందికి రోజు ఎలా ప్రారంభమవుతుందంటే.. ఇష్టమైన పనులు చేయడంతో ప్రారంభమవుతందని చెబుతారు. కానీ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ సీఈఓ 'సుందర్ పిచాయ్' రోజు మాత్రం వార్తాప‌త్రిక‌ల‌ను తిర‌గేయ‌డం, సోష‌ల్ మీడియాను చెక్ చేయ‌డం మాదిరిగా కాకుండా ఒక 'వెబ్‌సైట్‌' చూడటంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

సుందర్ పిచాయ్ ప్రతి రోజూ నిద్ర లేవ‌గానే 'టెక్‌మీమ్' అనే వెబ్‌సైట్‌లో లేటెస్ట్ టెక్ న్యూస్ చ‌ద‌వ‌డంతో ప్రారంభ‌మ‌వుతుందని సమాచారం. టెక్‌మీమ్ అనే వెబ్‌సైట్‌ 2005లో గేబ్ రివెరా స్థాపించారు. ఇందులో చిన్న సారాంశాలతో సేకరించిన హెడ్‌లైన్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి యాడ్స్ ఇబ్బంది లేకుండా కీలక అంశాలను త్వరగా చూసేయొచ్చు.

టెక్‌మీమ్ వెబ్‌సైట్‌ను సుందర్ పిచాయ్ మాత్రమే కాకుండా.. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సేరితో పాటు మరికొంత మంది సీనియర్ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఈ వెబ్‌సైట్‌ తరచుగా సందర్శిస్తుంటారు.

టెక్‌మీమ్ అనేది ప్రత్యేకించి టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ల కోసం రూపొందించినట్లు సమాచారం. ఇందులో ప్రముఖ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కోరుకునే ఎగ్జిక్యూటివ్ సారాంశాలు మాత్రం అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఈ వెబ్‌సైట్‌లో ఎలాంటి క్లిక్‌బైట్స్, పాప్‌అప్‌లు, వీడియోలు లేదా అనుచిత ప్రకటనలు కనిపించవు.

ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై త్వరలో నిర్ణయం - ఇదే జరిగితే పదేళ్లలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement