
ఈ రోబో కీటకాన్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించారు. తేనెటీగలు ఎగిరే తీరును గమనించి, దీనిని రూపొందించారు. ఇది ఎలాంటి ఇరుకైన ప్రదేశాల్లోకైనా తేలికగా చొరబడగలదు. దీని ముందు రెక్కలు వెనుక రెక్కల కంటే భిన్నమైన వేగంతో ప్రకంపిస్తాయి.
(ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!)
రెండువైపుల రెక్కలనూ కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. భూకంపాల వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల అట్టడుగున చిక్కుకున్న వారిని కనుగొనడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇరుకిరుకు ప్రదేశాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు, వాటికి అనుగుణమైన చర్యలు చేపట్టేందుకు దోహదపడుతుంది.