
న్యూఢిల్లీ: ఆధార్‌కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) కీలక సూచన చేసింది. పదేళ్ల క్రితం ఆధార్ నంబర్ తీసుకున్న వారు వెంటనే తమ గుర్తింపు, నివాస రుజువులతో వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. అప్‌డేషన్‌ను ఆన్‌లైన్‌లో మైఆధార్ పోర్టల్ నుంచి లేదా ఆధార్ సేవా కేంద్రాల నుంచి చేసుకోవచ్చని సూచించింది.
పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని, తర్వాతి కాలంలో ఒక్కసారి కూడా అప్‌డేట్ చేసుకోనివారు.. తమ తాజా వివరాలను అందించాలని కోరింది. ‘‘గత పదేళ్ల కాలంలో వ్యక్తుల గుర్తింపునకు ఆధార్ కీలకంగా మారింది. వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలకు ఆధార్ నంబర్‌ను వినియోగిస్తున్నారు. ఎటువంటి అవాంతరాల్లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను అందుకోవాలంటే, వ్యక్తులు తమ ఆధార్ డేటాను అప్‌డేట్ చేసుకోవాలి’’అని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.