హారిస్‌తో మళ్లీ డిబేట్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన | Trump Says He Will Not Debate Kamala Harris Again | Sakshi
Sakshi News home page

హారిస్‌తో మళ్లీ డిబేట్‌కు వెళ్లను: ట్రంప్‌

Published Fri, Sep 13 2024 7:59 AM | Last Updated on Sat, Oct 5 2024 1:54 PM

Trump Says He Will Not Debate Kamala Harris Again

వాషింగ్టన్‌: డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో మళ్లీ డిబేట్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఓడిపోయిన వాళ్లే మళ్లీ డిబేట్‌ అవసరమని అడుగుతారని కమలాహారిస్‌ను ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ట్రంప్‌ ఒక పోస్టు చేశారు. 

‘కామ్రేడ్‌ హారిస్‌తో డిబేట్‌లో నాదే పైచేయి అని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆమె డిబేట్‌లో ఓడిపోయారు. ఓడిపోయినందునే ఆమె మరో డిబేట్‌ కావాలని అడుగుతున్నారు. ఆమెతో రెండో డిబేట్‌ అనేది ఉండదు’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. కాగా, డిబేట్‌లో తనదే పైచేయి అని ట్రంప్‌ ఉటంకించిన సర్వేలన్నీ పెద్దగా పేరులేని, ఎవరికీ తెలియని సంస్థలు వెల్లడించినవి కావడం గమనార్హం. 

సీఎన్‌ఎన్‌లాంటి ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు మాత్రం హారిస్‌, ట్రంప్‌ డిబేట్‌ వీక్షించిన 63 శాతం మంది ప్రజలు హారిసే విజయం సాధించారని భావిస్తున్నట్లు వెల్లడించడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అభ్యర్థులు ట్రంప్‌, హారిస్‌ల మధ్య మంగళవారం ఫిలడెల్ఫియాలో బహిరంగ చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. 

ఇదీ చదవండి.. మరోసారి ట్రంప్‌తో కమల కరచాలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement