
కటౌట్ చూసి ఉరకాలి డ్యూడ్.. ఇది మీరట్‌లో కనిపిస్తున్న పరిస్థితి.
కటౌట్‌లంటే రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు భారీ ప్రచారమనే విషయం చెప్పనక్కర్లేదు. కానీ, వైవిధ్యమైన ఆలోచనలు ఎప్పుడూ జనాల ఆసక్తిని తమ వైపు మళ్లించుకుంటాయి. ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా అలాంటి దృశ్యమే ఒకటి కనిపించింది.
యూపీ మీరట్‌లో కోతులను తరిమేందుకు అటవీ అధికారులు.. కొండముచ్చుల (కొండెంగల) కటౌట్‌లను ఉంచారు. మరి ఈ ఐడియా ఫలితం ఇచ్చిందా?..
ఇచ్చిందనే అంటున్నారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజేశ్ కుమార్. ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందని, చిన్నచిన్న మార్పులతో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. కోతుల బెడదతో ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టేందుకే జనాలు వణికిపోయిన రోజులున్నాయి. ఈ తరుణంలో అధికారులు ఇలా కటౌట్‌ల ప్రయోగంతో కోతుల్ని తరమడం విశేషం.
ఇదివరకు లక్నో మెట్రో స్టేషన్‌లో ఇలా కొండముచ్చుల Langoor Cutouts కటౌట్లతో ఫలితం రాబట్టారు అధికారులు. అదే చూసే మీరట్ అధికారులు ఈ పని చేశారు. అఫ్‌కోర్స్.. ఇదేం కొత్త ఐడియా కాదు.. చాలా చోట్ల చూసే ఉంటారు.