తమిళనాడులో వీడిన ఉత్కంఠ | Palaniswami will be AIADMK's CM Candidate | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఖరారు

Published Wed, Oct 7 2020 10:20 AM | Last Updated on Wed, Oct 7 2020 11:42 AM

Palaniswami will be AIADMK's CM Candidate  - Sakshi

అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి ఎంపికయ్యారు. ఈమేరకు కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది.  ప్రస్తుత సీఎం పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. ఈమేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పన్నీర్‌ సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్‌ సెల్వంకు అప్పగించారు. 

ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై  పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఇక.. 11 మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్‌ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో ఇప్పటి వరకు భారీ ఎత్తున వివాదం నడిచింది. నేనంటే నేనే అంటూ పళనిస్వామి, పన్నీర్ ‌సెల్వం పరోక్షంగా ప్రకటనలిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పళనిస్వామికి అవకాశం దక్కడంతో సస్పెన్స్ వీడింది. 
(చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement