
సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామాకృష్ణా రెడ్డి. చంద్రబాబు, నిమ్మగడ్డ కుయుక్తులను ప్రజలు గమనించారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కూడా టీడీపీ కార్యకర్తలా పనిచేశారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి ప్రవర్తించడం అందరూ చూశారు. ఎస్‌ఈసీ అధికార దుర్వినియోగంపై చర్చ జరగాలి అన్నారు సజ్జల.