చెన్నై వరదలపై గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ప్రకటన చేశారు. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా చెన్నైలో వర్షపాతం నమోదైనట్లు తెలిపిన ఆయన ఇప్పటి వరకు వర్షాలతో 269 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. తమిళనాడులో 30 ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు ఆర్మీ, నేవీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.