Lok Sabha
-
చైనా అధీనంలో 4 వేల చ.కి.మీ. భూభాగం
న్యూఢిల్లీ: నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు మనం భారత్– చైనా దౌత్య సంబంధాల వజ్రోత్సవాలను జరుపుకొంటున్నామని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ గురువారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కొత్త టారిఫ్‌లు భారత ఆర్థికవ్యవస్థ నడ్డి విరుస్తాయని పేర్కొన్నారు. చైనా దురాక్రమణ, అమెరికా టారిఫ్‌లపై కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘చైనా ఒకవైపు 4,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు కొద్దికాలం కిందట మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చైనా రాయబారితో కలిపి కేక్ కట్ చేశారు. ఇది చూసి నేను నివ్వెరపోయా. చైనా ఆక్రమించిన నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం సంగతేమిటి? అక్కడ ఏం జరుగుతోంది?’ అని రాహుల్ నిలదీశారు. గాల్వాన్ లోయలో ఘర్షణలను ఉటంకిస్తూ 20 మంది భారత జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. ‘ఒకవైపు వీరి త్యాగం.. మరోవైపు కేక్ కట్ చేసి (చైనా రాయబారితో కలిసి) సంబరాలు జరుపుకుంటున్నాం. ఏమిటిది? చైనా తో సరిహద్దుల్లో సాధా రణ పరిస్థితులు నెలకొ నడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ దానికి మునుపు యథా తథస్థితిని పునరుద్ధరించాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొ న్నారు. ‘మొదట మన భూభాగాన్ని తిరిగిపొందాలి. ఆక్రమిత భూభాగానికి సంబంధించి రాష్ట్ర పతి, ప్రధానమంత్రులు చైనాకు లేఖలు రాశారని నా దృష్టికి వచ్చింది. ఈ విషయం మనవాళ్ల ద్వారా తెలియలేదు. భారత్‌లోని చైనా రాయబారి లేఖల విషయాన్ని చెప్పారు’ అని రాహుల్ అన్నారు. సమర్థ విదేశీ విధానం అంటే విదేశాలతో సమాన స్థాయిలో సంబంధ బాంధవ్యాలను నెరపడం. ఒకవైపు చైనా మన 4 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు అమెరికా అకస్మాత్తుగా భారత్‌పై టారిఫ్‌లు విధించింది అని కాంగ్రెస్ నేత పేర్కొ న్నారు. అమెరికా టారిఫ్‌లు భారత్‌కు శరాఘా తమని అభిప్రాయపడ్డారు. మన ఆటోమొబైల్ రంగం, ఫార్మా పరిశ్రమ, వ్యవసాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. -
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
న్యూఢిల్లీ,సాక్షి: లోక్‌సభలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మన భూముని మనం తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ దిగువ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘భారత్ భూభాగంలో ఏం జరుగుతోంది నాకు అర్ధం కావడం లేదు. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమి మనకు వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు .. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు లేఖ రాయాలి. చైనా 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించుకుంది. ఈ విషయం నన్ను మరింత షాక్‌కు గురిచేసింది. మన భూమిని మనం ఎలా తిరిగి స్వాధీనం చేసుకోవాలి? అని ఆలోచించాల్సి ఉంది. అలా చేయడం లేదు. భారత విదేశాంగ కార్యదర్శి చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేస్తున్నారు. చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. చైనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రం సభలో ప్రకటన చేయాలి. భారత్‌పై అమెరికా 26శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి’ అని అన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. రాహుల్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎవరి కాలంలో ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది? డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా అధికారులతో సూప్ తాగిన వ్యక్తులు ఎవరు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనీయుల నుండి డబ్బు ఎందుకు తీసుకుంది?’ అని అడిగారు. అలాంటి వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. భారత్ భూభాగాన్ని చైనా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. ఈ తరహా రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాహుల్‌కు హితువు పలికారు. -
వర్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం
-
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు
-
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
వక్ఫ్. కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయంగా మారిన అంశం. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ అల్లాకు చెందుతాయని భావిస్తారు. కనుక వాటి అమ్మకం, ఇతర ప్రయోజనాలకు వాడకం పూర్తిగా నిషిద్ధం. మసీదులు, మదర్సాలు, శ్మశానవాటికలు, అనాథాశ్రమాల నిర్మాణ నిర్వహణ తదితరాల నిమిత్తం ఉపయోగించాలి. భారత్‌లో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో దిల్లీ సుల్తానుల హయాంలో మొదలైంది. స్వాతంత్య్రానంతరం 1954లో కేంద్ర వక్ఫ్ చట్టం వచ్చింది. దాని స్థానంలో 1995లో తెచ్చిన కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు దఖలు పడ్డాయి. వాటిని అపరిమితంగా పెంచుతూ యూపీఏ ప్రభుత్వం 2013లో మరిన్ని సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా 8.7 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయి! వీటన్నింటికీ కలిపి 9.4 లక్షల ఎకరాలున్నాయి! ఆ లెక్కన వక్ఫ్ బోర్డులు దేశంలో మూడో అతి పెద్ద భూ యజమానులుగా అవతరించాయి. వాటి భూముల మొత్తం విలువ కనీసం రూ.1.2 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటిలో అవినీతి తీవ్ర సమస్యేనని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. 13 వేలకు పైగా ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారమే లేదు! వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేస్తోందని సచార్ కమిటీ ఆక్షేపించింది కూడా. అయితే తీవ్ర వాద వివాదాల నడుమ వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నది విపక్షాల ఆరోపణ. దీన్ని వక్ఫ్ భూములను ముస్లింల నుంచి లాక్కునేందుకు మోదీ సర్కారు కుట్రగా మజ్లిస్ వంటి పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఇందులోని పలు ప్రతిపాదనలు 14, 26, 26, 29 తదితర ఆర్టికల్స్‌కు పూర్తిగా విరుద్ధమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ రగడపై ఇండియాటుడే న్యూస్ చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ బుధవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పార్టీల నేతలు తదితరులు, నిపుణులు వాదనలు విన్పించారు. వక్ఫ్ ఆస్తులు అంతిమంగా పేద ముస్లింల అభ్యున్నతికి దోహదపడాలన్నదే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుండగా అందులోని ప్రతిపాదనలను అంశాలవారీగా విపక్షాలు దుయ్యబట్టాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష ఇండియా కూటమి ఆరోపించగా పారదర్శకత కోసమేనని ప్రభుత్వం సమర్థించుకుంది.న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాడీవేడీగా చర్చ కొనసాగింది. ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు మండిపడ్డాయి. బిల్లును అంగీకరించబోనంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలోనే బిల్లు ప్రతిని చించేశారు. అధికార ఎన్డీయే కూటమి ఎంపీలు బిల్లును సమర్థించారు. విపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలని ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ జరగనుంది. రాజ్యసభలోనూ అధికార ఎన్డీయేకు తగిన మెజార్టీ ఉండడంతో బిల్లు సులువుగా ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.యూపీఏ పాపమే: రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ, వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటముల మధ్య సంవాదం సభను వేడెక్కించింది. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీఏ పక్షాలు పేర్కొనగా, బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. వక్ఫ్ బిల్లు పేరును ఉమ్మీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్–యూఎంఈఈడీ)గా మారుస్తున్నట్టు రిజిజు ప్రకటించారు. అనంతరం చర్చను ప్రారంభించారు. వక్ఫ్ బిల్లుకు తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తే అంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తుల్లో భాగమేనని ఆలిండియా ముస్లిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గతంలో వ్యాఖ్యలు చేశారు. వాటినుద్దేశించే మంత్రి ఇలా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ బిల్లు కేవలం వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయమే తప్ప ముస్లింల మత విశ్వాసాల్లో ఎలాంటి జోక్యమూ చేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేసి అత్యంత సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపాం. జేపీసీ సూచించిన పలు సవరణలకు అంగీకరించాం. అయినా విపక్షాలు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించజూస్తున్నాయి. వక్ఫ్ చట్టానికి యూపీఏ హయాంలో చేసిన మార్పుల వల్ల దానికి విపరీతమైన అధికారాలు దఖలు పడ్డాయి. వక్ఫ్ చట్టాన్ని ఇతర చట్టాలకు అతీతంగా మార్చేశాయి. అందుకే ఈ సవరణలు తప్పనిసరయ్యాయి’’ అని రిజిజు అన్నారు. ఏ మత సంస్థల వ్యవహారాల్లోనూ తమ ప్రభుత్వం వేలుపెట్టబోవడం లేదని చెప్పారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులున్నది భారత్‌లోనే. వాటిని పేద ముస్లింల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలి. అలా జరిగేలా చూడటమే బిల్లు లక్ష్యం. దీనికి మద్దతిస్తున్నదెవరో, వ్యతిరేకిస్తున్నదెవరో దేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది’’ అని చెప్పారు. కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ రిజిజు వాదనను తీవ్రంగా ఖండించారు. బిల్లును రాజ్యాంగ మౌలిక స్వరూపంపైనే దాడిగా అభివర్ణించారు. రిజుజు చర్చకు బదులిచ్చారు. మైనారిటీలకు భారత్‌ను మించిన సురక్షితమైన దేశం ప్రపంచంలోనే లేదన్నారు. అత్యల్ప సంఖ్యాకులైన పార్సీలు కూడా సగర్వంగా నివసిస్తున్నట్టు చెప్పారు.అంతా అంగీకరించాల్సిందే: అమిత్ షా వక్ఫ్ బిల్లు విషయమై దేశంలో అయోమయం సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ముస్లింలను భయపెట్టడం ద్వారా వారిని ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయంటూ దుయ్యబట్టారు. ఈ బిల్లు ముస్లింల మత సంబంధిత అంశాల్లో వేలు పెడుతుందన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ‘‘ఈ సవరణలను మైనారిటీలు ఒప్పుకోరని కొందరంటున్నారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు చేస్తున్న చట్టమిది. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘2014 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు వక్ఫ్ చట్టానికి హడావుడిగా రాత్రికి రాత్రి అడ్డగోలు సవరణలు చేసింది. తద్వారా దాన్ని చట్టాలకు అతీతంగా మార్చింది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుïÙ్టకరణ రాజకీయాలకు ఇది పరాకాష్ట. లేదంటే ఈ సవరణ బిల్లు అవసరముండేదే కాదు’’ అని అమిత్ షా అన్నారు. ‘‘యూపీఏ నిర్ణయం వల్ల ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్లో ఏకంగా 123 ఆస్తులు కేవలం 25 రోజుల వ్యవధిలో వక్ఫ్ ఆస్తులుగా మారిపోయాయి. ఇలాంటి దారుణమైన అవకతవకలను సరిదిద్దడం, వక్ఫ్ భూములు, ఆస్తుల నిర్వహణ పూర్తిగా ప్రజాస్వామికంగా, పారదర్శకంగా జరిగేలా చూడటమే తాజా బిల్లు ఉద్దేశం. అంతేతప్ప ఓటుబ్యాంకు కోసం చట్టాలు చేయడం మోదీ సర్కారుకు అలవాటు లేదు’’ ని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించి తీరతామని చెప్పారు. ‘‘కేవలం వక్ఫ్ ఆస్తి అని ప్రకటించినంత మాత్రాన ఎవరి భూమీ వక్ఫ్ భూమిగా మారకుండా తగిన రక్షణలను ఈ బిల్లు కల్పిస్తుంది’’ అని వివరించారు. అనంతరం బీజేపీతో పాటు విపక్షాల నుంచి పలువురు సభ్యులు బిల్లుపై అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందింది. తర్వాత దానికి విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా అవన్నీ ఒక్కొక్కటిగా వీగిపోయాయి.చర్చకు రాహుల్ గైర్హాజరు సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంక కూడా కీలకమైన వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు, ఓటింగ్‌కు విపక్ష నేత రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. ఆయన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా బుధవారం సభకు హాజరు కాలేదు. బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం సభలో ఆయన పార్టీ ఎంపీలతో చర్చించారు. దాంతో బిల్లుపై కాంగ్రెస్ తరఫున చర్చకు రాహులే సారథ్యం వహిస్తారని భావించారు. కానీ చర్చలో పాల్గొనరాదని రాహుల్ నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ప్రియాంక కూడా చర్చలో పాల్గొనకపోవడం విశేషం. కాంగ్రెస్‌కు కేటాయించిన గంటా 40 నిమిషాల సమయంలో గౌరవ్ గొగొయ్ తదితర పార్టీలే ఎంపీలే మాట్లాడారు. బీజేపీ నయా మత రాజకీయంలౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ: అఖిలేశ్ వక్ఫ్ బిల్లు ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, భారత లౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నయా మత రాజకీయం అని ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో.. ఓట్ల పోలరైజేషన్ కు, తమకు దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాషాయ పార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. అధికార కూటమిలోకి కొన్ని పార్టీలు వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ వాటికీ మనస్ఫూర్తిగా ఇష్టం లేదని తెలిపారు. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశ జనాభాలో ముస్లింలు దాదాపు 15 శాతం ఉన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్స్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని చెప్పారు.‘‘ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 13 స్పష్టం చేసింది. నాన్ ముస్లింలను వక్ఫ్ కమిటీలలో ఎలా చేరుస్తారు. మైనారిటీలు టీడీపీ వాదనలను సమర్థించరు. చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు. వక్ఫ్ విషయంలో ముస్లింలకు అండగా నిలబడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన YSRCP
-
లోక్ సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు
-
వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్ షా
Waqf Bill In Lok sabha Updates..వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్ షావక్ఫ్ సవరణ బిల్లు 2025 గురించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. వక్ఫ్ చట్టం, బోర్డు 1995లో అమల్లోకి వచ్చింది.వక్ఫ్ బోర్డ్‌పై అనేక అపోహలున్నాయి.ముందుగా ముస్లిమేతరులు ఎవరూ వక్ఫ్ పరిధిలోకి రారు.వక్ఫ్ నిర్వహణలో ముస్లిమేతరులను చేర్చాలనే నిబంధనల లేదు.మేం ఆ పనిచేయాలనుకోవడం లేదు.ఈ చట్టం ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటుందని, వారు విరాళంగా ఇచ్చిన ఆస్తిల్లో జోక్యం చేసుకుంటుందనేది ఓ అపోహ.మైనారిటీలలో వారి ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఈ తరహా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు: గౌరవ్ గొగొయ్దేశ ప్రజల్లోని సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నమిదిరాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని నియమాలను సృష్టించుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉందిదానిని పూర్తిగా తొలగించాలని చూస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ#WATCH | Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi, speaks on the Waqf Amendment Bill He says, "Did the Minority Affairs Ministry make this bill, or did some other department make it? Where did this Bill come from?... Today, the condition of minorities in the country… pic.twitter.com/QJPNnwcpyI— ANI (@ANI) April 2, 2025 వక్ప్ భూములపై కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు..వక్ఫ్ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరిస్తున్న కిరణ్ రిజుజుఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇది తెలుసుకోవాలి.మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదు.వక్ఫ్ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడింది.పార్లమెంట్ భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్ బోర్డు అన్నది.వక్ప్ వాదనను ప్రధాని మోదీ అడ్డుకున్నారు.యూపీఏ అధికారంలో ఉండి ఉంటే ఢిల్లీలో 23 కీలక స్థలాలు వక్ఫ్ సొంతం అయ్యేవి.123 విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ వక్ఫ్‌కు కట్టబెట్టింది.2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌కు ఆస్తులు కట్టబెట్టారు.దేశంలో మూడో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ దగ్గర ఉంది.భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్ ఉంది.ఆ భూమిని భారతీయులుంతా వినియోగించుకుంటున్నారు.రెండో స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది.మూడో స్థానంలో ఉన్న వక్ఫ్ భూములను భారతీయులంతా వినియోగించుకోలేరు.ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది.మసీదుల నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.కిరణ్ రిజుజు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం.కేంద్రమంత్రి మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను హెచ్చరించిన స్పీకర్ ఓం బిర్లా..#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "A case ongoing since 1970 in Delhi involved several properties, including the CGO Complex and the Parliament building. The Delhi Waqf Board had claimed these as Waqf… pic.twitter.com/qVXtDo2gK7— ANI (@ANI) April 2, 2025 అమిత్ షా కామెంట్స్..జేపీసీ నివేదికలో ఇచ్చిన సవరణలతో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టాం.జేపీసీ వేయాలని కాంగ్రెస్ సహా విఫక్షాలు కోరాయి.విపక్షాల డిమాండ్ మేరకే జేపీసీ వేశాం.ప్రభుత్వం తెచ్చిన బిల్లులో జేపీసీ సవరణలు సూచించింది.మేము కాంగ్రెస్ లాగా జేపీసీ సవరణలను పట్టించుకోకువడా బిల్లును యథాతథంగా తీసుకురాలేదు. #WATCH | Waqf (Amendment) Bill taken up for consideration and passing in Lok SabhaUnion Home Minister Amit Shah says, "...It was your (opposition) insistence that a Joint Parliamentary Committee should be formed. We do not have a committee like the Congress. We have a… pic.twitter.com/bbKRTuheft— ANI (@ANI) April 2, 2025 కిరణ్ రిజుజు కామెంట్స్..ఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.అన్ని వర్గాల సలహాలను తీసుకున్నాం.మైనార్టీల్లో అనవసర భయాలను సృష్టిస్తున్నారు.బిల్లుపై విస్తృత చర్చ జరిపాం.గతేడాది వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.జేపీసీ నివేదిక తర్వాత వక్ఫ్ బిల్లులో సవరణలు చేసిన ప్రభుత్వం లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో ప్రారంభమైన చర్చలోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజుచర్చ అనంతరం ఓటింగ్ చేపట్టే అవకాశం #WATCH | Parliamentary Affairs Minister Kiren Rijiju introduces Waqf Amendment Bill in Lok Sabha. pic.twitter.com/BukG8RSqBT— ANI (@ANI) April 2, 2025వక్ఫ్ బిల్లుకు ఢిల్లీ మహిళల మద్దతు..ఢిల్లీలో పలువురు ముస్లిం మహిళలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు.వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ ప్రకటన.మోదీకి మద్దతు తెలుపుతూ ఫ్లకార్డుల ప్రదర్శన #WATCH | Women in Delhi come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha https://t.co/Eo2X9nBo9s pic.twitter.com/HGWKHnRwLD— ANI (@ANI) April 2, 2025కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కామెంట్స్..కొంతమంది మత పెద్దలు సహా కొందరు నాయకులు అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి కొందరు వ్యక్తులే సీఏఏ.. ముస్లింల పౌరసత్వ హోదాను తొలగిస్తుందని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు అవసరమని వ్యక్తిగతంగా చెబుతున్నారు. కానీ, వారి ఓటు బ్యాంకు కోసం దానిని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha today Union Minister of Minority Affairs, Kiren Rijiju says, "Union Minority Affairs Minister Kiren Rijiju says, "Some leaders, including some religious leaders, are misleading innocent Muslims... The same… pic.twitter.com/EfzC86vrAC— ANI (@ANI) April 2, 2025రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కామెంట్స్..దేశంలో లౌకిక పార్టీ ఎవరో ఈరోజే నిర్ణయించబడుతుంది.బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి.జేడీయూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, వారు ఎన్నికల్లో ఓడిపోతారు.బీజేపీ దానిని ఆమోదించే అవకాశం పొందడానికి వారు వాకౌట్ చేసే అవకాశం ఉంది.చిరాగ్ పాస్వాన్ కూడా అదే చేయగలరు.ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓటు వేస్తారో చూడాలి#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayRajya Sabha MP Kapil Sibal says "...It will be decided today who is a secular party in this country. There are elections in Bihar, if JDU votes in favour of the Bill, they will lose the elections. It is… pic.twitter.com/F5YnPRmzYh— ANI (@ANI) April 2, 2025కాంగ్రెస్ ఎంపీ నిరసన.. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు.Congress MP Imran Pratapgarhi arrives at the Parliament wearing black attire to protest against the Waqf Amendment Bill, which will be introduced in Lok Sabha today pic.twitter.com/5UdDhZedtH— ANI (@ANI) April 2, 2025 వైఎస్సార్సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. -
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం
-
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీ(యూ) తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు సైతం తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు. బీఏసీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్ వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. విపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు వారు అంగీకరించారు. అయితే, ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం తమ గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే బుధవారం లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియా’ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్, రాంగోపాల్ యాదవ్, సుప్రియా సూలే, కల్యాణ్ బెనర్జీ, సంజయ్ సింగ్. టి.ఆర్.బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, మనోజ్‌కుమార్ ఝా తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను అణచివేయడానికే వక్ఫ్(సవరణ) బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.బిల్లుకు మద్దతు పలుకున్న తెలుగుదేశం, జేడీ(యూ)లకు ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగవిరుద్ధమైన బిల్లును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ బీఏసీ సమావేశం జరిగింది. గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.ఏమిటీ వివాదం? వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి. ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారులు 636 మంది
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 636 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించింది. వీరిలో 341 మంది చార్టెర్డ్ విమానాల్లో, 55 మంది పనామా నుంచి వాణిజ్య విమానాల్లో, మిగతా 240 మంది వేర్వేరు వాణిజ్య విమానాల్లో చేరుకున్నారని లోక్‌సభలో విదేశాంగ శాఖసహాయ మంత్రి కృతి వర్దన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అమెరికాలో ఉంటున్న 18 వేల మంది భారతీయ అక్రమ వలసదారులను వాపసు తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వచ్చిన వార్తలపై టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ప్రశ్నించగా..విదేశాల్లో ఉండే అక్రమ వలసదారులను వెనక్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత సంబంధిత దేశాలదేనని మంత్రి చెప్పారు. భారత్ ఒక్కటే కాదు..అంతర్జాతీయ సంబంధాల్లో అందరూ అంగీకరించిన సూత్రమని చెప్పారు. తమ నిర్బంధంలో ఉన్న మరో 295 మంది వ్యక్తుల సమాచారాన్ని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మన అధికారులకు అందజేసిందని మంత్రి చెప్పారు. వీరు మన జాతీయులేనా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అమెరికా ప్రభుత్వం తిప్పి పంపేవారికి అవసరమైన సాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. -
‘లోక్ సభలో నాకు మైకు ఇవ్వడం లేదు’
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై(Lok Sabha Speaker Om Birla) ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు. నేను మాట్లాడితే ఆయన పారిపోతున్నారని’ ఎద్దేవా చేశారు.లోక్‌సభలో తన ప్రసంగంపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘సభలో స్పీకర్ ఓం బిర్లా తాను మాట్లాడేందుకు అనుమతించడం లేదని, కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదని అన్నారు. ‘ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని ఆయన్ని అభ్యర్థించాను. కానీ అతను (స్పీకర్) పారిపోయాడు. ఇది సభను నడపడానికి మార్గం కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా స్పీకర్ నా గురించి అసత్యాలు మాట్లాడుతున్నారు. సభను వాయిదా వేస్తున్నారు. ఇదంతా ఎందుకు.ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించడానికి అవకాశం ఇవ్వడమే ఈ సమావేశం ఉద్దేశ్యం. నేను లేచి నిలబడినప్పుడల్లా నాకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మేం ఏం చెప్పాలని అనుకుంటున్నామో అది చెప్పాలి. అందుకు మైక్ ఇవ్వాలి కదా. ఇవ్వడం లేదు. నేను ఏం చేయలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాను. అరె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 7-8 రోజులుగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. లోక్‌సభలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోంది. ఆ రోజు కూడా అంతే ప్రధాని మోదీ కుంభమేళా గురించి మాట్లాడారు. ఆ సమయంలో నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నాను. కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ విధానం ఏంటో నాకు తెలియదు. కానీ మమ్మల్ని మాట్లాడటానికి అనుమతించడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. -
ద్రవ్యబిల్లుతో భారీ పన్ను ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు, 2025తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యబిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున బదులిస్తూ నిర్మల సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘ నూతన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లుతో పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం లభించనుంది. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో 13.14 శాతం వృద్ధి అంచనాలు రావడం సంతోషకరం. ఇది వ్యక్తిగత ఆదాయాల పెంపును ప్రతిబింబిస్తుంది. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణతో వస్తూత్పత్తి కర్మాగారాలకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాం.దేశీయ సరకులకు విలువ జోడింపు సాధ్యమవుతుంది. ఎగుమతులూ ఊపందుకుంటాయి. వాణిజ్యం పెరుగుతుంది. దీంతో సాధారణ ప్రజలకూ ప్రయోజనం చేకూరుతుంది’’ అని అన్నారు. 2025–26 ఆర్థికసంవత్సర బడ్జెట్లో వార్షిక ఆదాయపన్ను రిబేట్ పరిమితిని (కొత్త పన్ను విధానం) రూ. 7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం తెల్సిందే. ‘‘శాలరీ తరగతులకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను సైతం లెక్కలోకి తీసుకుంటే వాళ్లకు ఏటా రూ.12.75 లక్షల వరకు పన్ను రిబేట్ రూపంలో భారీ ఉపశమనం లభించనుంది.ఆదాయపన్ను రిబేట్‌ను పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లమేర తగ్గనుంది. ఏటా రూ.12 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారూ కొంతమేర ఉపశమనం పొందొచ్చు. ఇక ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న మధ్యతరగతి వాళ్లను సముచితంగా గౌరవించేందుకే ప్రభుత్వం ఐటీ రిబేట్‌ను ఏకంగా ఒకేసారి రూ.12 లక్షలకు పెంచింది’’ అని నిర్మల అన్నారు.రూ.13.6 లక్షల కోట్ల ఆదాయం‘‘2025–26 ఆర్థికంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.13.6 లక్షల కోట్లకు చేరుకునే వీలుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలు రూ.12.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆన్లైన్ ప్రకటనలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న 6 శాతం ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దుచేయాలనుకుంటున్నాం’’ అని నిర్మల చెప్పారు. దీని కారణంగా గూగుల్, మెటా, ‘ఎక్స్’ వంటి సంస్థలు లబ్ధిపొందే వీలుంది. ‘‘ పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే 7 శాతం కస్టమ్స్ సుంకాలను తొలగిస్తాం. 21 రకాల టారిఫ్ రేట్లు ఉండగా వాటిని ఎనిమిదికి తెచ్చాం. అందులో ‘సున్నా’ టారిఫ్ విభాగం కూడా ఉంది. ముడిసరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించిన కారణంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఇకపై భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకోనున్నాయి’’ అని మంత్రి అన్నారు.వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లు‘‘వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చిస్తాం. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఈ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలిస్తోంది. సెలక్ట్ కమిటీ అధ్యయనం తర్వాత తుది నివేదికను పార్లమెంట్ తదుపరి సెషన్ తొలి రోజునే సమర్పించాల్సి ఉంది. అందుకే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చిస్తాం’’ అని నిర్మల అన్నారు. సాధారణంగా జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల సమావేశాలుంటాయి.35 సవరణలతో ఆర్థిక బిల్లుకు లోక్‌సభలో ఆమోదంపన్ను అధికారులు సెర్చ్ కేసుల్లో బ్లాక్ అసెస్మెంట్ కోసం అసెసీ మొత్తం ఆదాయం కాకుండా కేవలం బయటకు వెల్లడించని ఆదాయాన్నే గుర్తించేందుకు వీలుగా ఆర్థిక బిల్లు, 2025లో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణలకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో 2024 సెప్టెంబర్ 1, ఆ తర్వాత కాలానికి ఇది వర్తించనుంది. సెర్చ్ కేసుల్లో మొత్తం ఆదాయం స్థానంలో వెల్లడించని ఆదాయం అన్న క్లాజును ప్రభుత్వం చేర్చింది. దీంతో సహా మొత్తం 35 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.50.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మోదీ సర్కార్ రూపొందించడం తెల్సిందే. -
పార్లమెంట్‌కు చేరిన ‘నోట్ల కట్టల జడ్జి’ వ్యవహారం
న్యూఢిల్లీ, సాక్షి: అధికారిక బంగ్లాలో కాలిపోయిన నోట్ల కట్టలతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ శర్మ వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. ఈ అంశంపై చర్చ జరగాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ ఘటన న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు కలిగించడంతో పాటు ఆ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్న ఆయన.. సంబంధిత న్యాయ శాఖ మంత్రి నుంచి ఈ వ్యవహారంపై వివరణ ఇప్పించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు లోక్‌సభ కార్యదర్శికి సోమవారమే లేఖ రాశారాయన. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. తీవ్ర అభ్యంతరాల నడుమే ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు కొలిజీయం. అయితే జస్టిస్ వర్మను హైకోర్టులోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని అలహాబాద్ బార్ అసోషియేషన్ నిరసనకు సిద్ధమైంది. నివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువంటూ లేని ఈ కమిటీ విచారణ.. సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది.హోలీ రోజు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం జరగ్గా.. ఓ గదిలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ వీడియోను పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు సమర్పించగా.. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫొటోలు, వీడియోలతో సహా తన వెబ్సైట్లో పెట్టింది. వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు. -
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ తొలగింపు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రకటనలపై విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీని (డిజిటల్ ట్యాక్స్) తొలగించేలా ఆర్థిక బిల్లులో కేంద్రం సవరణ చేసింది. దీనితో గూగుల్, ఎక్స్, మెటాలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అడ్వర్టైజ్మెంట్ సర్వీసులు అందించే సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో ప్రతిపాదిత 59 సవరణల్లో ఇది కూడా ఒకటి. ఈ సవరణ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2016 జూన్ 1న ఈ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార పన్నులు విధిస్తామంటూ హెచ్చరించిన అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకే ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్‌ను భారత్ తొలగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆదాయ పన్ను చట్టాలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఇది దోహదపడుతుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుమీత్ సింఘానియా చెప్పారు. -
పార్లమెంట్‌ను కుదిపేసిన డీకే శివకుమార్ వ్యాఖ్యలు
బెంగళూరు/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు.. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి. డీకేఎస్ వ్యాఖ్యలతో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం బయటపడిందని బీజేపీ విమర్శించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ 2గం.దాకా కార్యకలాపాలకు దూరంగా ఉండగా, లోక్‌సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది.కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ కోటా కింద కాంట్రాక్టులలో నాలుగు శాతం ముస్లింలకు కేటాయించడంపై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలతో పార్లమెంట్‌ను వేడెక్కించాయి. ప్రత్యేకించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా అన్నారు. ‘‘మతం పేరుతో రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదు. మైనార్టీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది. ఇలాంటి చట్టాలను(కర్ణాటక తెచ్చిన చట్టం గురించి ప్రస్తావిస్తూ..), విధానాలను ఉపసంహరించుకోవాలి. బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు’’ అని నడ్డా అన్నారు.అయితే.. నడ్డా వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని.. ఆ మాటకి వస్తే బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతేకాదు.. గతంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.ఈ అంశం ఇటు లోక్‌సభలోనూ దుమారం రేపగా.. సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజ్జు డీకేఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్లతో సభ హీటెక్కింది. మతపరమైన రిజర్వేషన్లు.. ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరం అని శివకుమార్ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను అనలేదని తాజాగా నడ్డా విమర్శల నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నేను JP నడ్డా కంటే ఎక్కువ సెన్సిబుల్, సీనియర్ పొలిటీషియన్ అని అన్నారు. నేను గత 36 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది. వివిధ నిర్ణయాల (కోర్టు ద్వారా) తర్వాత మార్పులు ఉంటాయని క్యాజువల్‌గా చెప్పాను. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని నేను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. మాది జాతీయ పార్టీ. మా పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకువచ్చింది అని అన్నారాయన. -
ఈ వారమే లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వక్ఫ్ సవరణ బిల్లు–2024ను ఈ వారంలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 4వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న దృష్ట్యా, అంతకుముందే ఈ వారంలోనే బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికను ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. వక్ఫ్ బోర్డుల్లో కనీసం నలుగురు ముస్లిమేతరులను చేర్చుకోవచ్చని భూ వివాదాలపై దర్యాప్తు అధికారాన్ని కలెక్టర్ల నుంచి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉండేందుకు వీలు కల్పించడం, కలెక్టర్లకు అదనపు అధికారాల వంటివాటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
Parliament: నినాదాల టీ షర్టుతో ఎంపీ.. స్పీకర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget sessions of Parliament) అధికార, ప్రతిపక్షాల వాదప్రతివాదనల మధ్య కొనసాగుతున్నాయి. ఈ రోజు(గురువారం) లోక్‌సభలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. డీఎంకే ఎంపీ టీ శివ నినాదాలు రాసిన టీ-షర్టు ధరించి, పార్లమెంటకు వచ్చారు. దీనిని చూసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.నినాదాలతో కూడిన టీ షర్టులు(T-shirts) ధరించి రావద్దని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరారు. ఈ నేపధ్యంలో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజు సభా కార్యకలాపాలు ప్రారంభానికి ముందు డీఎంకే ఎంపీ టి శివ ‘న్యాయమైన డీలిమిటేషన్ కోసం తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది’ అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు న్యాయమైన డీలిమిటేషన్ కోసం పట్టుబడుతోందని, ఇది దాదాపు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని, కానీ ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. అందుకే న్యాయమైన డీలిమిటేషన్ డిమాండ్ చేస్తూ మేము మా నిరసనను కొనసాగిస్తున్నామని అన్నారు. #WATCH | Delhi: DMK MP T Siva arrives in Parliament wearing a T-shirt that says, "Fair Delimitation, Tamil Nadu will fight, Tamil Nadu will win."He says, "Tamil Nadu is insisting on fair delimitation. Around 7 states will be affected by this but there has been no response from… pic.twitter.com/LbZseEOp1K— ANI (@ANI) March 20, 2025లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి ‘సభ మర్యాద పూర్వకంగా, గౌరవంగా నడవాలని అన్నారు. సభ్యులు సభ గౌరవాన్ని ఉల్లంఘిస్తున్నారని, సభ నియమాలు, విధానాలను పాటించడం లేదని, ఈ విషయాన్ని తాను కొన్ని రోజులుగా గమనిస్తున్నానన్నారు. సభ్యులంతా నియమం నంబర్ 349 చదవాలని కోరారు. సభ ప్రతిష్టను కాపాడేందుకు ఎలా ప్రవర్తించాలనేది దానిలో రాసివుందున్నారు.నినాదాలు రాసివున్న టీ-షర్టులు ధరించి, ఇక్కడికి (సభలోకి) వస్తే, లేదా నినాదాలు చేస్తే సభా కార్యకలాపాలు నిర్వహించలేమన్నారు. ఎవరైనా సరే సభా మర్యాదలను, సంప్రదాయాలను ఉల్లంఘిస్తే, లోక్‌సభ స్పీకర్‌గా చర్య తీసుకోవడం తన బాధ్యత అని అన్నారు. అనంతరం ఆయన తన సీటు నుండి లేచి సభా కార్యకలాపాలు కొనసాగకూడదనుకుంటే బయటకు వెళ్లిపోవాలని ప్రతిపక్ష సభ్యులకు చెప్పారు. అనంతరం ఆయన సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.ఇది కూడా చదవండి: Bihar: ‘టైగర్ జిందా హై’.. రబ్రీ ఇంటి ముందు హోర్డింగ్ కలకలం -
పోలవరం ఎత్తును తగ్గించవద్దు: లోక్‌సభలో వైఎస్సార్సీపీ
ఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని లోక్‌సభ వేదికగా వైఎస్సార్సీపీ మరోసారి ఖండించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని, ఒరిజినల్ ఎత్తు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభలో జలశక్తి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు పలు ప్రాజెక్టుల అంశాలను కూడా అవినాష్ లేవనెత్తారు.‘ ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం ఈసీని తిరస్కరించింది. రాయలసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం బాబు ప్రభుత్వం తగిన ఒత్తిడి చేయలేదు. వైఎస్ జగన్ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు మెజారిటీ పనులు పూర్తయ్యాయి. రాయలసీమ ఎత్తిపోతలతో 800 అడుగుల వద్ద రోజు మూడు టిఎంసిల నీరు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. లేదంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. ఓవైపు శ్రీశైలంలో 798 అడుగుల వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల వద్ద పాలమూరు- రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారుఈ పరిస్థితుల్లో 880 అడుగుల వరకు నీరు ఎప్పుడు వస్తుంది...రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లెప్పుడు వస్తాయి. గుండ్రేవుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల రిపేర్లు చేపట్టాలి. ఏపీకి జలజీవన్ మిషన్ కింద నిధులను పెంచాలి. నంద్యాల - కల్వకుర్తి మధ్య రివర్ ఓవర్ బ్రిడ్జితోపాటు ఆనకట్ట నిర్మించాలి’ అని అవినాష్ రెడ్డి కోరారు. -
నెగ్గేదెలా?
లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాల దామాషా ప్రాతినిధ్యానికి ముప్పు వాటిల్లబోతోంది. వాటి మెడపై డీలిమిటేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ఉపద్రవం తప్పాలంటే కేంద్రం మెడ వంచాలి. దీనికోసం దక్షిణాది తరఫున తమిళనాడు ముందుండి కేంద్రంపై పోరాటం చేస్తోంది. భారత సమాఖ్య పట్ల ఏకీభావం ప్రతిష్టంభనలో పడింది. ఈ నేపథ్యంలో, డీలిమిటేషన్ మరో 30 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ , ‘వన్ నేషనిజం’ అంటూ బీజేపీ సమస్యను జటిలం చేస్తోంది. భాషావివాదం మీద పార్లమెంటులో మాట్లాడుతూ, తమిళనాడుకు నిజాయితీ లేదని, అనాగరిక రాష్ట్రమని నిందిస్తూ ఆ రాష్ట్రానికి విద్యానిధులు తొక్కిపట్టింది. సమాఖ్య విషయంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత కొరవడింది. కాబట్టే బీజేపీ కూటమి యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమిళనాడు నేతృత్వంలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. డీలిమిటేషన్ చిక్కుముడికి పరిష్కారాలు లేకపోలేదు. రాజ్యసభ స్వరూపం మార్చడం వీటిలో ఒకటి. రాష్ట్రాల సరైన ప్రాతినిధ్యానికి వేదికగా దాన్ని రూపొందించాలి. అలాగే సంఖ్యాపరంగా లోక్‌సభ సైజు పెంచడం ద్వారా, పెద్ద రాష్ట్రాలు అదనపు స్థానాలు పొందినా, ఇతరత్రా ఏ రాష్ట్రం నష్టపోకుండా చూడవచ్చు. అధిక జనాభా ఉన్న యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల సరిహద్దులు మార్చడం మరో మార్గం. ఆర్థిక వృద్ధి అనివార్యతలు, రాష్ట్రాల నడుమ నెలకొన్న సామాజిక ఆర్థిక అంతరాలు సమాఖ్య స్ఫూర్తి పునాదులను బలహీన పరుస్తున్నాయి. రాష్ట్రాల పునర్ విభజన చట్టంతో భాషా సమస్య పరిష్కారమైన పిదప, సమాఖ్య ఏకీభావతకు ఎదురవుతున్న తొలి సవాలు ఇదే. దీన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు కావల్సింది సమాఖ్య సూత్రానికి అన్ని వైపుల నుంచీ బలమైన మద్దతు.విశ్వాసం కల్పించాల్సింది కేంద్రమే!చరిత్ర చూసినట్లయితే, పాలనలోనూ, నిధుల పరంగానూ కేంద్రీకృత విధానాలే ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సైతం ప్రాంతీయ పార్టీలు పాత వ్యవస్థను సవాలు చేయలేదు. దీంతో సమాఖ్య సూత్రం గట్టిగా వేళ్ళూన లేదు. ద్రవ్యపరంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గలేదు. పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు పంచాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రాల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇది రాజకీయ పటా టోపంగానే మిగిలి పోయింది. ఆ రోజుల్లో యథా తథ స్థితిని అనుసరించడమే రాజకీయ సంస్కృతిగాఉండేది. పేద రాష్ట్రాలకు జాతీయ పన్నుల్లో అధిక వాటా లభించడం తరహా సమన్యాయ సూత్రానికి రాష్ట్రాలన్నీ ఇష్టపూర్వకంగానే తలలూ పాయి. ప్రాతినిధ్య అసమానతను అంగీకరించాయి.సమాఖ్య ఏకాభిప్రాయం మీద ఆర్థిక వృద్ధి ప్రభావం పడుతోంది. పన్నుల హేతుబద్ధీకరణ, నియంత్రిత మార్కెట్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించే సేవలు వంటి అవసరాలకు కేంద్రీకృత వ్యవస్థ ఎన్నో రకాలుగా ఉపయుక్తం అవుతుంది. ఇలా జరగడం వల్ల రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కూడా అంతే స్థాయిలో తగ్గుతుంది. నిధుల పంపిణీ పరంగా కొత్త వివాదాలు ఉత్పన్నమవుతాయి.ఈ వివాదాలను విశ్వసనీయంగా పరిష్కరించే శక్తి కేంద్రానికి మునుపటి కంటే ఎక్కువ అవసరమవుతుంది.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం లోకి మారడం వల్ల ఉత్పన్నమైన వివాదాలు ఇందుకు నిదర్శనం. రాష్ట్రాలు తమ పన్ను విధింపు హక్కును వదులుకోవడంతో, పన్ను ఆదాయంలో తమ వాటా ఎంత అన్నది ప్రధానంగా మారింది. రాష్ట్రాల నడుమ ఆర్థిక అంతరం హెచ్చింది. ఆర్థికంగా బలమైన దక్షిణాది రాష్ట్రాలు సమన్యాయాన్ని సవాలు చేయసాగాయి. 16వ ఫైనాన్స్ కమిషన్ ఎదుట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేవనెత్తిన అంశం ప్రస్తావనార్హం: ‘కర్ణాటక సమకూర్చే ప్రతి రూపాయిలో ప్రస్తుత ఫార్ములా ప్రకారం తిరిగి వెనక్కు వచ్చేది కేవలం 15 పైసలు’ అని ఆయన వాపోయారు. తమిళ నాడు కూడా ఇదే వాదన చేసింది. డీలిమిటేషన్ మీద ఆందోళనలు సైతం అదే మాదిరివి.భిన్న ప్రాంతాల నడుమ ఆర్థిక అసమానతలు పెరిగిపోవడమే లక్షణంగా మారిన ఈ దేశంలో ఈ సమదృష్టి సూత్రం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కానప్పుడు, పన్ను ఆదాయాల పంపిణీ ఫార్ములాను సంతులన పరచుకుంటూ అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకూ కలిపి ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయడం వంటి వేరే మార్గాలు కేంద్రానికి లేవా? అలాగే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామన్న విశ్వస నీయ సంకేతం ఇవ్వాల్సిన, కొత్త ఏకాభిప్రాయాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. సమాఖ్య విధానం పట్ల బీజేపీ ఒంటబట్టించుకున్న అసహనం సమస్య పరిష్కారాన్ని జటిలం చేస్తోంది. స్వయంప్రతిపత్తి గల జమ్ము – కశ్మీర్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు గుంజుకుని, వాటిని కేంద్రం పెత్తనం కిందకు తెచ్చుకోవడం వల్ల ఏర్పడిన పరిణామాలు, రాష్ట్రాలకు పన్నుల్లో దక్కాల్సిన వాటాను తనకు మాత్రమే దఖలు పడే సెస్సులు, సర్ చార్జీల విధింపు ద్వారా కుదించివేయడం, అలాగే కేంద్రం సేవలో ఉండేలా కొత్త పాలనా సంస్కృతిని ప్రోత్సహించడం... ఇవన్నీ సమాఖ్య పట్ల కేంద్ర అసహనానికి నిదర్శనాలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు కేంద్రంపై రాజకీయంగా ధ్వజమెత్తడం, రాజీలేని వైఖరి ప్రదర్శించడం మినహా మరేం చేయగలవు? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ హక్కుల కోసం బేరసారాలు జరిపే హక్కు ఎన్ని పరిమితులకు లోబడి ఉందో ప్రస్తుత డీలిమిటేషన్ చిక్కుముడి వెల్లడిస్తోంది. డీలిమిటేషన్‌ను ఎంతకాలం వీలైతే అంతకాలం వాయిదా పడేలా చేయాలన్న స్టాలిన్ ఆలోచన ఫలితమే ప్రస్తుత ప్రతిష్టంభన! ఎంతో కష్టపడి సాధించుకున్న అమూల్యమైన భారత సమాఖ్య ఈ క్రమంలోమరింత బలహీన పడుతుంది.యామినీ అయ్యర్ వ్యాసకర్త బ్రౌన్ యూనివర్సిటీలో విజిటింగ్ సీనియర్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటైందే తప్ప, రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కాదని సీపీఎం నేత, పార్టీ మధ్యంతర సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష లౌకిక పార్టీలతో కూడిన విస్తృత వేదిక ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి విస్తృత కూటమి మాత్రమే ఎన్నికల రాజకీయ ప్రయో జనాలకు పరిమితమై పోకుండా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.శనివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మా ట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సా రథ్యంలోని ఎన్డీఏను దీటుగా ఎదు ర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడటం తెల్సిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని కారత్ వివరించారు. ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందన్నారు. కూటమి పార్టీలకు రాష్ట్రాల్లో తమ సొంత రాజకీయ సమీకరణాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇండియా కూటమి ఏర్పాటు, అన్ని రాష్ట్రాల్లో కాకున్నా కనీసం కొన్ని చోట్లయినా సభ్య పార్టీల్లో సమన్వయం కుదరడంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కోల్పోయేందుకు కారణమైందన్న విషయం మాత్రం వాస్తవమని కారత్ విశ్లేషించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా మహారాష్ట్రలో ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మెరుగైన పనితీరు కనబరిచి, బీజేపీకి షాక్ ఇవ్వగలిగింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి కూటమిలో అనైక్యత కారణంగా ఫలితాలు తారుమారయ్యాయి’అని కారత్ చెప్పారు. ‘జార్ఖండ్‌కు వచ్చే సరికి ఫలితాలు వేరుగా ఉన్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు ఇక్కడ ఐక్యంగా పనిచేసి, బీజేపీని ఓడించాయి.పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఫలితాలు మారుతూ వచ్చాయి’అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష లౌకికవాద పార్టీలు విశాల వేదిక ఏర్పాటు కోసం ముందుగా ఆయా పార్టీల అవసరాలను, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటూ ఒక రూపు తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే, బిహార్, తమిళనాడుల్లో ఇటువంటి కూటములు కొనసాగుతున్నాయని గుర్తు చేసిన ప్రకాశ్ కారత్.. పశ్చిమబెంగాల్, ఢిల్లీల్లో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. బెంగాల్లో టీఎంసీ, సీపీఎంలకు పొసగనట్లే ఢిల్లీలో కూడా కాంగ్రెస్, ఆప్‌లు కలిసి సాగడం సాధ్యం కాని నేపథ్యముందని తెలిపారు.అసలు ఇండియా కూటమి లక్ష్యం ఎన్నికలేనా? అదే అయితే, ఎన్నికల నుంచి ఎన్నికల వరకు ఈ కూటమి కొనసాగుతుందా?అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కారత్ వ్యాఖ్యానించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఇండియా కూటమి వైఖరి ఎంతో సంక్లిష్టంగా తయారవుతుందని చెప్పారు. ‘ప్రతిపక్ష ఐక్య వేదిక పూర్తిగా ఎన్నికలకు సంబంధించింది అనుకోరాదు. మోడీ ప్రభుత్వం, బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల వేదిక ఇది’అని కారత్ తెలిపారు.లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం పరిరక్షణ గురించి ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నట్లయితే ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ఇప్పటికీ అవకాశాలున్నాయని, ఇదే ప్రాతిపదికగా ఈ ఉద్యమాన్ని తీసు కువెళ్లవచ్చునని పేర్కొన్నారు. మోదీ ప్ర భుత్వం, దాని విధానాలకు ప్రత్యామ్నా యమే లక్ష్యమైతే ఆ దిశగా ఇండియా కూ టమిని నిర్మించుకోవాల్సి ఉంటుందని కారత్ తెలిపారు.బెంగాల్లో సీపీఎంను మళ్లీ నిలబెడతాంపశ్చిమబెంగాల్లో సీపీఎంను మళ్లీ బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ప్రకాశ్ కారత్ వివరించారు. ఇందులో భాగంగా, వామపక్ష, ప్రజాస్వామిక శక్తులను బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా ఏకం చేస్తా మన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేసే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని కారత్ వెల్లడించారు.బెంగాల్లో పార్టీ పునాదులు బలహీనమయ్యాయని, అందుకే ఎన్నికల్లో ఫలితాలను సాధించలేక పోతోందని వివరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్దతును తిరిగి కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఈ విషయంలో కొంతమేర ఫలితాలు కనిపించాయన్నారు. అదే సమయంలో కేరళలో అనూహ్యంగా వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి, దీర్ఘ కాలం అధికారంలో కొనసాగడంపై దృష్టి సారించిందని అన్నారు.త్రిభాష సూత్రంపై కేంద్రం మొరటు ధోరణినూతన విద్యా విధానంలోని త్రిభాష సిద్ధాంతం అమలుపై కారత్ మాట్లాడు తూ..‘దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల విష యంలో కేంద్రం సున్నితంగా వ్యవహరించడం లేదు. అన్ని భాషలకు సమాన ప్రా ముఖ్యం ఇవ్వాలే తప్ప, ఒక భాషను బల వంతంగా అమలు చేసేందుకు ప్రయత్నించరాదు’అని కారత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ విషయంలో తమిళనాడు అభి ప్రాయాలకు తగు ప్రాతిపదిక ఉందని చె ప్పారు. హిందీని ప్రోత్సహించాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉందన్నారు. దక్షిణాది రా ష్ట్రాల అభ్యంతరాలకు కారణమిదేనని కార త్ తెలిపారు. విద్యావిధానంపై కేంద్రంతో పాటు రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వా లని ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ విషయంలో కేంద్రం పెత్తనమే కనిపిస్తోందని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ చెప్పారు. -
Dharmendra Pradhan: కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడుతున్న డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్(Privilege motion) ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది తమిళుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నారామె.జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని.. ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ లేకుండా వ్యవహరించిందని ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) మండిపడిన సంగతి తెలిసిందే. ‘‘వాళ్లకు ఏమాత్రం నిజాయితీ లేదు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ సోమవారం బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా లోక్‌సభ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగగా.. సభ వాయిదా పడింది.అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్వి తలపొగరు వ్యాఖ్యలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది తమిళులను అవమానించడమేనని,ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.మరోవైపు.. పీఎం శ్రీ(PM SHRI) పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలకు అంగీకరించి.. ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని.. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎంకే అంటోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయగా.. ఆ తీర్మానాన్నిస్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. -
శశి థరూర్ (లోక్‌సభ ఎంపీ) రాయని డైరీ
పుస్తకాలు చదివితే జ్ఞానం లభిస్తుందా? ఆ జ్ఞానం... ఎవరినైనా, ఏ విధంగానైనా అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుందా? లేదంటే, అర్థం చేసుకోవటాన్ని ఆ జ్ఞానం మరింతగా సంక్లిష్ట పరుస్తుందా? ఢిల్లీ నుండి రాహుల్ ఫోన్! ‘‘మనం ఒకర్నొకరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది థరూర్‌జీ...’’ అంటారాయన! అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని గుర్తించ టానికి ఏదైనా పుస్తకం చదవటం వల్ల సంప్రాప్తించిన జ్ఞానం ఆయనకు దోహదపడి ఉంటుందా? ‘‘కొత్తగా ఏం చదువుతున్నారు రాహుల్జీ...’’ అని అడిగాను. ‘‘కొత్తగా ఏమీ చదవటం లేదు థరూర్‌జీ. కొత్తగా మీ ట్విట్టర్ అకౌంట్ మాత్రం చూస్తున్నాను. ఎవరిదో కోట్ పెట్టినట్లున్నారు... ‘అజ్ఞానం ఆనందదాయకం అయిన చోట, జ్ఞానవంతులుగా ఉండటం మూర్ఖత్వమని’!ఆ కోట్ చూశాకే మీకు ఫోన్ చేశాను... మనం ఒకర్నొకరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని...’’ అన్నారు రాహుల్! ‘‘రాహుల్జీ! మీరు గానీ ఆ కోట్లో... అర్థాలనేమైనా వెతుకుతున్నారా?’’ అన్నాను.‘‘అర్థాలను కాదు థరూర్‌జీ. మిమ్మల్ని వెతుకుతున్నాను. మీ ట్వీట్ చదివాక, మీ పాడ్‌కాస్ట్ విన్నాక, పీయూష్ గోయల్‌తో మీ సెల్ఫీ చూశాక నాకనిపిస్తోంది, కాంగ్రెస్‌లో ఉన్న కారణంగా మీరు మీ జ్ఞానాన్ని చాలా మిస్ అవుతున్నారని...’’ అన్నారు రాహుల్! రాహుల్ ఇంత జ్ఞానగర్భితంగా మాట్లాడటం మునుపెన్నడూ నేను వినలేదు. ‘‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వద్దనుకుంటే మీరేం చేస్తారు?’’ అని పాడ్‌కాస్టర్ నన్ను అడిగినప్పుడు – ‘‘నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి’’ అని నేను చెప్పాను. వేరే ఆప్షన్స్ అంటే నా ఉద్దేశం పుస్తకాలు, ప్రసంగాలు. ఇక పీయూష్ గోయెల్‌తో నేను సెల్ఫీ దిగటమైతే ఎవరి దృష్టిలోనో పడటానికి చేసింది కాదు. గోయెల్ కామర్స్ మినిస్టర్. బ్రిటన్ కామర్స్ మినిస్టర్ ఆయన పక్కన ఉన్నారు. నాకూ కామర్స్‌లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముగ్గురం కలిసి సెల్ఫీ తీసుకున్నాం. ‘‘నా ట్వీట్లో, పాడ్‌కాస్ట్‌లో, సెల్ఫీలో మీరు నన్ను వెతుకుతున్నట్లే, ‘కాంగ్రెస్ పార్టీలో నేనెక్కడ?!’ అని నేనూ నన్ను వెతుక్కుంటు న్నాను రాహుల్జీ...’’ అన్నాను. ‘‘థరూర్‌జీ! దేశానికెంతో చేస్తున్నారని మీరు మోదీజీని కీర్తిస్తున్నారు. కేరళకెంతో చేస్తున్నారని కమ్యూనిస్టులను ఆకాశానికెత్తేస్తు న్నారు. అలాంటప్పుడు మేము మిమ్మల్నిగానీ, మిమ్మల్ని మీరు గానీ కాంగ్రెస్‌లో ఎంత వెతికితే మాత్రం ఎలా మీరు కనిపిస్తారు?! ... ..అంతేకాదు థరూర్‌జీ! మీరు స్టెప్ బై స్టెప్ కింది నుంచి పైకి రాలేదు. ఒకేసారి పైనుండి ప్యారాచూట్లో కాంగ్రెస్‌లోకి వచ్చి పడ్డారు. ప్యారాచూట్ కిందికి దిగటానికే కానీ, పైకి ఎగరటానికి కాదు...’’ అన్నారు రాహుల్!! ‘ఒక జ్ఞానవంతుడి ఆత్మకథ’ అనే పుస్తకమేదో చదువుతున్నట్లుగా ఉంది నాకు, రాహుల్ అలా మాట్లాడుతుంటే వినటం!‘‘పార్టీలో నేనేమిటి?’ అని లోక్‌సభలో మీరు నాకు ఎదురుపడి అడిగినప్పుడే మీ మనసులో ఉన్నదేమిటో నాకు అర్థమైంది థరూర్‌జీ. కేరళకు సీఎం అయితేనే మీరేదైనా అయినట్లు కాదు. జ్ఞానం అన్నది ట్వీట్లకు, పాడ్‌కాస్ట్‌లకు, సెల్ఫీలకు మాత్రమే పనికొచ్చే ఒక మిత్. ఇదుగోండి, ఖర్గేజీ మీతో మాట్లాడతారట...’’ అని, ఆగారు రాహుల్!‘‘హ్యాపీ బర్త్‌డే థరూర్‌జీ...’’ అన్నారు ఖర్గేజీ లైన్లోకి రావటంతోనే!‘‘ఈ ఆదివారం కాదు ఖర్గేజీ... నా బర్త్‌డే. వచ్చే ఆదివారం...’’ అన్నాను నవ్వుతూ. ‘‘మీరు పార్టీలో ఉన్నప్పుడే బర్త్‌డే విషెస్ చెబితే మీకు సౌకర్యంగా ఉంటుంది కదా అని ముందే చెప్పేస్తున్నా థరూర్‌జీ...’’ అన్నారు ఖర్గే!! నేను మళ్లీ మళ్లీ చదువుతుండే మహాభారతాన్ని మళ్లొకసారి బయటికి తీశాను. భారతం జ్ఞానాన్ని ఇవ్వదు! జ్ఞానాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తుంది! -
డీలిమిటేషన్‌తో ఒక్క సీటూ తగ్గదు
కోయంబత్తూరు: దామాషా విధానంలో చేపట్టే పునర్వ్యవస్థీకరణ వల్ల లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గదని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తమిళనాడుకే కాదు, ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి కూడా నష్టం జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తారని చెప్పారు. ఒక్క సీటు కూడా నష్టపోనివ్వరని మంత్రి హామీ ఇచ్చారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదంటూ మోదీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుంచి 31కి తగ్గిపోతుందని సోమవారం సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించడం, దీనిపై చర్చించేందుకు 5న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశామనడం తెల్సిందే. తమిళనాడుకు నిధుల మంజూరు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్టాలిన్ డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం అమిత్ షా కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరువణ్ణామలై, రామనా థపురంలలో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కా ర్యకర్తలు, ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. దేశ వ్యతిరేక ధోరణి పెరిగిందిరాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందంటూ అధికార డీఎంకేపై అమిత్ షా విరుచుకుపడ్డారు. తమిళనాడులో జాతి వ్యతిరేక ధోరణి గరిష్ట స్థాయికి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు. 1998 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, ప్రధాన సూత్రధారి ఎస్ఏ బాషా అంతిమ యాత్రకు తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పించిందని విమర్శించారు. ‘రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మైనింగ్ మాఫియానే ఇక్కడ రాజకీయాలను నడిపిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అవినీతిలో డీఎంకే మంత్రులంతా మాస్టర్స్ డిగ్రీ చేశారు. డీఎంకే నేతలపై ఉద్యోగాలను అమ్ముకున్న కేసులు, మనీలాండరింగ్ ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, రూ.6 వేల కోట్ల కుంభకోణం కేసులున్నాయి. వీటిన్నిటినీ చూస్తే అవినీతికి పాల్పడిన వారికే డీఎంకే సభ్యత్వం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా వాటిని పరిష్కరించడం మానేసిన సీఎం, ఆయన కుమారుడు ఉదయనిధి వారి దృష్టిని మళ్లించేందుకు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.నిధులపై వాస్తవ గణాంకాలివీ..కేంద్రం నుంచి అందిన నిధులపై చేతనైతే సీఎం స్టాలిన్ వాస్తవాలను వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు. ‘మోదీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల వ్యవధిలో తమిళనాడుకు రూ.5,08,337 లక్షల కోట్ల నిధులందాయి. వీటికి తోడు, మౌలిక వనరుల అభివృద్ధి కోసం మరో 1.43 లక్షల కోట్లను అందజేశాం. అదే, యూపీఏ హయాంలో 2004–14 సంవత్సరాల మధ్య కాలంలో తమిళనాడుకు కేవలం రూ.1.52 లక్షల కోట్లే దక్కాయి. అయితే, మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మీరంటున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి యూపీఏ హయాంలో, అప్పటి ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములుగా ఉండగానే అన్యాయం జరిగింది’అని షా చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థినులకు భద్రత కరువైందని ఆరోపించారు. అక్రమ సారాయి విక్రయాలను వ్యతిరేకించిన కాలేజీ విద్యార్థులు దారుణ హత్యకు గురవుతున్నారన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని, మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ సాధించిన గెలుపు కంటే ఇది మిన్నగా ఉంటుందన్నారు. -
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారమే
-
రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేరు: ప్రధాని మోదీ
జేబుల్లో రాజ్యాంగం పెట్టుకొని తిరిగే వారికి మన దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేదు. మేం ముస్లిం సోదరీ మణులకు హక్కులు కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ చట్టం తెచ్చాం. – మోదీ న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు మన రాజ్యాంగాన్ని, దేశ ఐక్యతను ఏనాడూ అర్థం చేసుకోలేరని అన్నారు. కొన్ని పార్టీలు (ఆమ్ ఆద్మీ పార్టీ) యువత భవిష్యత్తుకు ఆపదగా మారాయని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో ఎంతో ప్రజాధనం ఆదా అయ్యిందని పేర్కొన్నారు. జనం సొమ్ముతో తాము అద్దాల మేడలు కట్టుకోలేదని స్పష్టంచేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. పేదల గుడిసెల్లోకి వెళ్లి ఫొటో సెషన్లు పెట్టుకొని సంబరపడే కొందరు నాయకులు అదే పేదల గురించి పార్లమెంట్లో మాట్లాడడం నీరసమైన వ్యవహారంగా భావిస్తున్నారని విమర్శించారు. జేబుల్లో రాజ్యాంగం పెట్టుకొని తిరిగేవారికి మన దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేదని మండిపడ్డారు. ముస్లిం సోదరీమణులకు హక్కులు కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మా పాలనలోనే గరీబీ హఠావో.. తప్పుడు హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం మాకు అలవాటు లేదు. అభివృద్ది చేసి చూపించడమే మాకు తెలుసు. గరీబీ హఠావో నినాదం ఐదు దశాబ్దాలపాటు వినిపించింది. కానీ, జరిగిందేమీ లేదు. మేము అధికారంలోకి వచ్చాక పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. కేవలం ఐదేళ్లలో 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాం. పేదల కష్టాలు ఏమిటో మాకు తెలుసు. ఎందుకంటే మేము స్వయంగా పేదరికం అనుభవించాం. నిరుపేదల అగచాట్లు, సామాన్య ప్రజల బాధలు అర్థం చేసుకోవాలంటే స్పందించే హృదయం ఉండాలి. అది కొందరు నాయకులకు లేదు. రాజ్యాంగం నిర్దేశించినట్లు నడుచుకుంటున్నాం.రాజ్యాంగమే మాకు స్ఫూర్తి. విషపూరిత రాజకీయాలను నమ్ముకోవడం లేదు. 21వ శతాబ్దం కోసం సిద్ధం కావాలంటూ పదేపదే నినదించిన ఓ ప్రధానమంత్రి(రాజీవ్ గాం«దీ) 20వ శతాబ్దపు అవసరాలను సైతం తీర్చలేకపోయారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని కొందరు వ్యక్తులు(సోనియా గాం«దీ) విమర్శించడం దారుణం. దేశ ప్రథమ పౌరురాలిని, పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను కించపర్చడం సహించరానిది. రాజకీయంగా మీరు నిరాశలో ఉండొచ్చు. అంతమాత్రాన రాష్ట్రపతిని అవమానించాలా? ఇదెక్కడి పద్ధతి? మన దేశంలో ఏదైనా ఎస్సీ లేదా ఎస్టీ కుటుంబం నుంచి ఒకేసారి ముగ్గురు ఎంపీలైన సందర్భాలు ఉన్నాయా? పేదల సంక్షేమం గురించి కొందరు మాట్లాడుతున్నారు. వారి మాటలకు, చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోంది. అది భూమికి, ఆకాశానికి.. చీకటికి, వెలుతురు మధ్యన ఉన్నంత వ్యత్యాసం. ప్రజలకు రూ.40 లక్షల కోట్లు బదిలీ కొందరు నాయకులు(అరవింద్ కేజ్రీవాల్) వారి ఖరీదైన ఇళ్లల్లో స్టైల్‌గా ఉండే నీటి షవర్లు, వేడినీటి ఈత కొలనులు ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడితే మేము ప్రతి ఇంటికీ నీరు అందించడంపై దృష్టి పెట్టాం. కొందరు ప్రజల సొమ్ముతో అద్దాల మేడ కట్టుకుంటే మేము పేదలకు ఇళ్లు ఇచ్చాం. పదేళ్ల క్రితం దాకా పత్రికల్లో కుంభకోణాలు, అవినీతిపై నిత్యం వార్తలు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014 నుంచి రూ.లక్షల కోట్లు ఆదా చేశాం. సంక్షేమ పథకాల విషయంలో 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరిపారేశాం. దాంతో రూ.3 లక్షల కోట్లు ఆదా చేశాం. ప్రజల డబ్బును దేశ నిర్మాణం కోసమే ఖర్చుపెడుతున్నాం. వివిధ పథకాల కింద రూ.40 లక్షల కోట్లను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాం. కులం గురించి మాట్లాడడం ఫ్యాషనైపోయింది మా ప్రభుత్వం ఇటీవల అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.2 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండేది కాదు. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.12 లక్షలకు పెంచాం. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించాం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. దీనివల్ల పేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాం. ప్రతి రంగంలోనూ వారికి మరిన్ని అవకాశాలు కలి్పస్తున్నాం. కులం గురించి మాట్లాడడం కొందరికి ప్యాషనైపోయింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కోసం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను భారీగా పెంచాం. వేలాది సీట్లు వారికి అందుబాటులోకి వచ్చాయి. మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుంచి 780కి చేరింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
లోక్‌సభలో రాహుల్‌పై మోదీ విమర్శలు!
ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో పసలేదంటేంటూ సోనియా, అందుకు వంత పాడిన రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ లోక్‌సభలో పరోక్షంగా స్పందించారు. లోక్‌సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు మోదీ ప్రసంగిస్తూ.. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తారు. సభలో అదే పేదల గురించి మాట్లాడితే ఆ నేతలే ఫేస్‌ని విసుగ్గా పెడతారంటూ..కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. నాలుగోసారి దేశ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. నాలుగో సారి దేశ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వికసిత్ భారత్ మా లక్ష్యం.10ఏళ్లలో 25కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు. వికసిత్ భారత్ సాధనే మా లక్ష్యం. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగిస్తాం. ప్రజల కష్టాలు తెలిసిన వారికే అభివృద్ధి సాధ్యమవుతుంది. నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం. 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించాం. ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి సౌకర్యం కల్పించాం. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో మేం ఏ ఒక్క తప్పుడు హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. కొందరు శీష్‌మహల్ కోసం అవినీతి చేస్తారు.ఇప్పుడు నగదు బదిలీద్వారా ప్రజలకు నేరుగా నగదు అందుతుంది.మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యం. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అంటూ స్లోగన్లు మాత్రమే ఇచ్చేవి. మేం 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేంశాం. రాష్ట్ర ప్రసంగం కొంతమందికి బోర్‌గా అనిపించింది. బీజేపీ పాలనలో ఎలాంటి స్కాం జరగలేదు. మా హయాంలో దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం.గతంలో స్కాంలు గురించి వినేవాళ్లం. కానీ ఇప్పుడు స్కాంలు లేవు. కేవలం అభివృద్ధి గురించి మాట్లాడుకుటుంటున్నాం. ప్రపంచ గేమింగ్ రాజధానిగా భారత్ మారుతోంది. కొన్ని పార్టీలు ఎన్నికల వేళ హామీలు ఇస్తున్నాయి. తప్పుడు హామీలు ఇచ్చి యువతను మోసం చేస్తోంది. ప్రలోభాలకు గురిచేస్తోంది. అందుకే హర్యానాలో బీజేపీని మూడోసారి గెలిపించారు. ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని తప్పకుండా నెరవేర్చుంతుంది. రాజ్యంగం అంటే బీజేపీకి ప్రాణం. రాజ్యంగం విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది.కొందరు నేతలు లగ్జరీగా ఉండాలని అనుకుంటారు. ఖరీదైన షవర్లు, బాత్‌టబ్‌లు కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి పేదల గరించి ఏం తెలుస్తోంది. కొంతమందికి బంగ్లాలు కొనుగోలు చేయడంపైనే ఫోకస్ చేస్తారు. మేం ఇంటింటికి నల్లాలు ఇచ్చే దానిపై ఫోకస్ పెట్టాం’’ అని వ్యాఖ్యానించారు. -
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం
-
పార్లమెంట్ సమావేశాలు.. కుంభమేళాపై చర్చకు విపక్షాల ఆందోళన
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష పార్టీల ఎంపీలు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై చర్చకు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో, సభలో నిరసనలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజులు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో భాగంగా మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై ప్రభుత్వం చర్చకు రావాలని విపక్ష పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విపక్ష ఎంపీలు సభను హోరెత్తించారు. దీంతో, ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభ్యులను కోరారు. అనంతరం, రాజ్యసభ నుంచి ప్రతిపక్ష నేతలు వాకౌట్ చేశారు. All Opposition parties' MPs in Rajya Sabha walkout from the House over the issue Prayagraj Mahakumbh stampedePhoto source: Sansad TV/YouTube pic.twitter.com/ekGB0qYIJN— ANI (@ANI) February 3, 2025మరోవైపు.. లోక్‌సభలో సైతం సభ్యులు కుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. ఈ సందర్భంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, విపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ.. నినాదాలు ఆగలేదు. ఈ పరిస్థితుల మధ్యే లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి #WATCH | Opposition MPs in Lok Sabha raise slogans against Uttar Pradesh's Yogi Adityanath government over Maha Kumbh stampede issue (Video source: Sansad TV/YouTube) pic.twitter.com/8Fl2KXlY9a— ANI (@ANI) February 3, 2025 -
పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం.. విపక్ష సభ్యుల ఆందోళన
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఏడాదికి సంబంధించి బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో, విపక్ష నేతల నిరసనల మధ్య నిర్మల.. ప్రసంగిస్తున్నారు. అనంతరం, విపక్ష పార్టీల నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగాన్ని విపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్, పార్టీ సభ్యులు నిరసనలు తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో, స్పీకర్ వారిని నినాదాలు ఆపాలని సూచించారు. అయినప్పటికీ వారు ఆందోళనలను ఆపలేదు. అనంతరం, సభ నుంచి సభ్యులు వాకౌట్ చేసినట్టు తెలుస్తోంది. #WATCH | #UnionBudget2025 | MPs from the opposition parties walk out of Lok Sabha as Finance Minister Nirmala Sitharaman reads her budgetary speechShe began her budgetary speech amid protests by Samajwadi Party MPs including party chief Akhilesh Yadav(Source - Sansad TV) pic.twitter.com/O0qcgw3BS4— ANI (@ANI) February 1, 2025 #WATCH | Union Finance Minister Nirmala Sitharaman begins her budget speech amid protest by Samajwadi Party MPs including party chief Akhilesh Yadav(Source - Sansad TV) pic.twitter.com/8YrrXSRgzR— ANI (@ANI) February 1, 2025 -
మూడో పర్యాయం.. మూడింతల వేగం
న్యూఢిల్లీ: దేశ అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు, విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో వేగంగా మూడు రెట్లు పెరిగిందని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అంకితభావంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ చాంబర్లో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 60 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రగతి ప్రయాణంలో అమృతకాలం నడుస్తోందని, ఇప్పటిదాకా సాధించిన అపూర్వమైన విజయాలతో ప్రభుత్వం దేశానికి నూతన శక్తిని ఇచ్చిందని తెలిపారు. మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో భక్తులు మరణించడం పట్ల రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులరి్పంచారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఆమె మాటల్లోనే... అప్పుడే అభివృద్ధికి సార్థకత శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో వంద రాకెట్ ప్రయోగాలు పూర్తిచేయడం ప్రశంసనీయం. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగన్‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఇక ఎంతోదూరంలో లేదు. కోవిడ్–19 మహమ్మారి, ఇతర దేశాల్లో యుద్ధాలు, తద్వారా అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. మన బలాన్ని ఆర్థిక వ్యవస్థ చాటి చెబుతోంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఒకే దేశం.. ఒకే పన్ను అనే విధానంతో జీఎస్టీని తీసుకొచ్చింది. దీనితో అన్ని రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతున్నాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి సైతం అందాలి. అప్పుడే ఈ అభివృద్ధికి ఓ సార్థకత ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. సౌభాగ్య యోజన కింద 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందజేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో తాము గౌరవంగా జీవించగలమన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తే.. పేదరికాన్ని జయించగలమన్న ధీమా వారిలో పెరుగుతుంది. ప్రభుత్వ కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వారంతా ఒక నూతన మధ్యతరగతి వర్గంగా మారారు. దేశ పురోభివృద్ధికి వారు ఒక చోదకశక్తి. డిజిటల్ విప్లవంలో ముందంజ భారతదేశ సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. భౌతికమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే సామాజిక మౌలిక సదుపాయాల విప్లవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత పదేళ్లలో ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించింది. డిజిటల్ విప్లవంలో మనం ముందంజలో ఉన్నాం. డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఇండియా అతిపెద్ద గ్లోబల్ ప్లేయర్‌గా అవతరించింది. మన దేశంలో ప్రజలకు 5జీ సరీ్వసులు అందుతున్నాయి. ఇక మన డిజిటల్ చెల్లింపులు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో 50 శాతానికి పైగా రియల్–టైమ్ డిజిటల్ లావాదేవీలు మనదేశంలోనే జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి డిజిటల్ టెక్నాలజీని ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంటోంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ‘మహిళల సారథ్యంలో ప్రగతి’ అనేది ప్రభుత్వ విధానం. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోంది. 91 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయా సంఘాలకు రూ.9 లక్షల కోట్లు అందజేసింది. వారు ఆర్థిక స్వాతంత్య్రం గణనీయంగా పెంచుకుంటున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో నారీశక్తి వందన్ అధినియంను ప్రభుత్వం తీసుకొచ్చింది. రైల్వే నెట్వర్క్ ద్వారా కన్యాకుమారితో కశీ్మర్ అనుసంధానమైంది. ఉధంపూర్–బారాముల్లా–శ్రీనగర్ రైలు ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా 71 వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల సమీపంలో 100కుపైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.28,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని కేంద్రం సంకల్పించింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023–14లో దేశంలో రికార్డు స్థాయిలో 322 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు రూ.41,000 కోట్లు అందజేసింది. పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ మన దేశంలోనే ఉంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. రూ.8,000 కోట్లతో అదనంగా 52,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నూతన పరిపాలనా విధానానికి సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి పర్యాయ పదాలుగా మారాయి’’ అని రాష్ట్రపతి ముర్ము స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలపై ముందడుగు‘‘బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అహరి్నశలూ కృషి చేస్తోంది. పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వబోతోంది. గ్రామీణులకు ప్రాపర్టీ కార్డులు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. 70 ఏళ్లు దాటినవారిలో 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం వర్తింపజేస్తోంది. కీలకమైన జమిలి ఎన్నికలతోపాటు వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రభు త్వం ముందడుగు వేసింది. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ మాత్రం ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వంలో ఒక మూలస్తంభంగా నిలిచింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. భారతదేశ బలాలు, విధానాలు, ఉద్దేశాల పట్ల ప్రపంచ దేశాలు విశ్వాసం కనబరుస్తున్నాయి. క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థతోపాటు జీ20లో ఇండియాదే కీలకపాత్ర. సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకంఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసు. తాము ఒంటరిమన్న భావనను వారిలో తొలగించడానికి కృషి చేస్తోంది. ఈశాన్యంలో శాంతి సాధన కోసం పదికిపైగా ఒప్పందాలు కుదిరాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకం. దేశమంతటా అన్ని ప్రాంతాలూ సమానంగా పురోగతి సాధించాలన్నదే కేంద్రం ఉద్దేశం. అండమాన్, నికోబార్ దీవులు, లక్షదీవుల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. అందరికీ నాణ్యమైన వైద్య సేవలుసమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు తక్కువ రుసుముతో నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ చర్యలతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో కొత్తగా 75 వేల సీట్లు రాబోతున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత పదేళ్లలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. వాటిలో నాణ్యత కూడా మెరుగుపడింది.మధ్య తరగతికి సొంత గూడుప్రభుత్వ పథకాలతో దళితులు, గిరిజనులు, బీసీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో వారు భాగస్వాములవుతున్నారు. సొంత గూడు కలిగి ఉండాలన్నది మధ్య తరగతి ప్రజల కల. దాన్ని నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గృహరుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు తావులేకుండా ‘రెరా’ వంటి చట్టాలు తీసుకొచ్చింది. ‘అందరికీ ఇళ్లు’ అనేది ప్రభుత్వ లక్ష్యం. -
పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే
-
పాతిక లక్షల జనాభాకో లోక్ సభ సీటు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోని ప్రధాన దేశాలతో పోల్చితే ఒక లోక్‌సభ (దిగువ సభ) సీటుకు సగటు జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే. మిగిలిన ప్రధాన దేశాల్లో ఒక లోక్‌సభ స్థానానికి సగటు జనాభా అతి తక్కువ అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ఆధారంగా వివిధ దేశాల్లో దిగువ సభకు సీట్లు, ఒక సీటుకు జనాభా, మహిళల ప్రాతినిధ్యం, ఓటింగ్ శాతాలను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. భారత దిగువ సభలో ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా 25.7 లక్షలు ఉండగా.. అమెరికాలో 7.3 లక్షలే ఉన్నట్లు తెలిపింది. ఇండోనేషియాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌లో 1.2 లక్షల జనాభానే ఉందని తెలిపింది. మిగతా దేశాలతో పోల్చితే మన లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని నివేదిక తెలిపింది. అయితే భారత్ సహా ప్రధాన దేశాలన్నింటిలో ఓటింగ్ శాతం దాదాపు సమానంగా ఉన్నట్లు వెల్లడించింది. ఓటింగ్ శాతంలో త్వరలోనే భారత్ ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చేరవచ్చునని తెలిపింది. దిగువ సభ ఓటింగ్ శాతం జర్మనీలో అత్యధికంగా ఉండగా, ఆ తరువాత ఫ్రాన్స్, స్పెయిన్, భారత్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
రాహుల్ గాంధీకి కోర్టు నోటీసులు
లక్నో : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పంకజ్ పాఠక్ అనే వ్యక్తి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో అంత్యర్ధం, విభజన, అశాంతిని ప్రేరేపించే అవకాశం ఉందని, న్యాయపరమైన జోక్యం అవసరమని ఆరోపిస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ముందుగా ప్రత్యేక ఎంపీ,ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తిరస్కరించింది. దీంతో తాజాగా తాను జిల్లా కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు పంపినట్లు పిటిషనర్ తెలిపారు.#WATCH | Uttar Pradesh: Bareilly District Court issues notice to Lok Sabha LoP and Congress MP Rahul Gandhi over his statement on caste census. Petitioner, Pankaj Pathak says "We felt that the statement given by Rahul Gandhi during the elections on caste census was like an… pic.twitter.com/Es8rxilbTU— ANI (@ANI) December 22, 2024 హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోహైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ గాందీ మాట్లాడారు. బీజేపీపై విమర్శులు గుప్పిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని చెప్పారు. “ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), మైనారిటీలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి మొదట దేశవ్యాప్త కుల గణనను నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తాం’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పిటిషనర్ కోర్టుకు వెళ్లినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
లోక్ సభ నిరవధికంగా వాయిదా
-
లోక్‌సభ నిరవధిక వాయిదా
ఢిల్లీ : లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. విపక్ష నేతల నిరసనకు పోటా పోటీగా ఎన్డీయే కూటమి నేతలు సైతం ప్లకార్డ్‌లతో ఆందోళనకు దిగారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. Lok Sabha adjourned sine die pic.twitter.com/5jgpBbnNjn— ANI (@ANI) December 20, 2024నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశం మొదటి వారంలో పలు మార్లు వాయిదా పడింది. రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై డిబేట్,బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం, ప్రియాంక గాంధీ లోక్‌సభ అరంగేట్రం వంటి అనేక అంశాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన చర్చకు దారి తీశాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం తొలి వారంలో గౌతమ్ అదానీపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేయడంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో నిరసనలకు దారి తీసింది. ఈ సెషన్లోనే 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుపై చర్చ జరిగింది. జమిలి ఎన్నికలపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఇవాళ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లోక్ సభ పంపంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం వీగింది. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, 14 రోజుల నోటీసు లేకపోవడం,డ్రాఫ్టింగ్‌లో లోపాలతో సహా విధానపరమైన కారణాలతో అవిశ్వాస తీర్మానాన్ని పక్కన పెట్టారు. -
లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
లోక్‌సభలో జమిలి బిల్లులు
కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఏక కాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు జమిలి బిల్లులను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. మోదీ సర్కారుది ఫక్తు నియంతృత్వ ధోరణి అంటూ మండిపడ్డాయి.అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి వ్యవహారం ఓటింగ్ దాకా వెళ్లింది. జమిలి బిల్లులపై జేపీసీలో కూలంకషంగా చర్చిద్దామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తెలిసీ మోదీ సర్కారు విఫలయత్నం చేస్తోందని ఎద్దేవా చేశాయి.న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ రాజ్యాంగ (129వ సవరణ) సవరణ బిల్లును సభ ముందుంచారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అంటూ కాంగ్రెస్ తదితర విపక్షాలు దుయ్యబట్టాయి. వాటి అభ్యంతరాలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రాలు అనుభవిస్తున్న ఏ అధికారాలనూ ఈ బిల్లు తగ్గించబోదని స్పష్టం చేశారు.దాదాపు 90 నిమిషాల పాటు అధికార, ప్రతిపక్షాల నడుమ వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, తృణమూల్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), మజ్లిస్ తదితర పార్టీలు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిపై ఓటింగ్‌కు పట్టుబట్టాయి. దాంతో ఎల్రక్టానిక్, పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ జరిగింది. 269 మంది అనుకూలంగా ఓటేయడంతో బిల్లులను ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా ఏకంగా 198 మంది ఓటేయడం విశేషం. నూతన పార్లమెంటు భవనంలో ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి. కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టారు.పుదుచ్చేది, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభతో పాటే నిర్వహించేందుకు వీలు కల్పించడం దీని ఉద్దేశం. ప్రతిపాదిత బిల్లులు మౌలిక నిర్మాణ సూత్రానికి గొడ్డలిపెట్టన్న విపక్షాల ఆరోపణలు నిరాధారాలని మేఘ్వాల్ అన్నారు. రాజ్యాంగ సార్వభౌమత్వం, దాని సమాఖ్య–లౌకిక స్వభావాలు, కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, న్యాయసమీక్ష వంటి కీలక సూత్రాలకు ఈ బిల్లుల ద్వారా అణుమాత్రం కూడా మార్పులు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. విపక్షాల ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశపూరితాలని విమర్శించారు.వాటిని విపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. బిల్లుపై తమ అభ్యంతరాలను వారంతా సభ ముందుంచారు. వాటిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. జమిలి బిల్లుపై ప్రతి దశలోనూ లోతైన చర్చ జరగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని తెలిపారు. ‘‘జమిలి బిల్లులు కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చినప్పుడు మోదీ అదే చెప్పారు. లోతైన చర్చ నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపాలని అభిప్రాయపడ్డారు’’ అని మంత్రి వెల్లడించారు. డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు కూడా వాటిపై జేపీసీ పరిశీలన కోరారని గుర్తు చేశారు.‘‘రాజ్యాంగ (129వ సవరణ) బిల్లుపై జేపీసీలో విస్తృతంగా చర్చ చేపట్టవచ్చు. అనంతరం జేపీసీ ఇచ్చే నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. తదనంతరం బిల్లుపై పార్లమెంటులో మరోసారి మనమంతా చర్చించుకోవచ్చు’’ అని విపక్షాలకు సూచించారు. రెండు బిల్లులను జేపీసీకి నివేదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెడతానని మేఘ్వాల్ ప్రకటించారు. ఆ మేరకు బుధవారం తీర్మానం లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశముంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సాధారణ మెజారిటీ చాలు.కానీ అవి గట్టెక్కాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రస్తుతం రెండు సభల్లోనూ అంతటి మెజారిటీ లేదు. జమిలి ఎన్నికలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ముందు 32 పార్టీలు ప్రతిపాదనకు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించడం తెలిసిందే.మూడొంతుల మెజారిటీ ఏదీ?జమిలి బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలిందని కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ అన్నారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? ఇందులో ఏమన్నా అర్థముందా?’’ అని ప్రశ్నించారు. సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోదీ సర్కారు ప్రయతి్నంచిందని మనీశ్ తివారీ మండిపడ్డారు. ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. పాలనలో స్థిరత్వానికే: కేంద్రంజమిలి ఎన్నికలు భారత్‌కు కొత్తేమీ కాదని కేంద్రం పేర్కొంది. 1951 నుంచి 1967 దాకా అన్ని రాష్ట్రాల శాసనసభలకూ లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. ‘‘పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువుకు ముందే రద్దవడం వల్ల 1968, 1969 నుంచి జమి లికి బ్రేక్ పడింది’’ అని మంగళవారం ఉదయం లోక్‌సభలో జమిలి బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నాలుగో లోక్‌సభ కూడా 1970లో గడువుకు ముందే రద్దయింది. దాంతో 1971లో సాధారణ ఎన్నికలు జరిగి ఐదో లోక్‌సభ కొలువుదీరింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో దాని గడువును ఆర్టీకల్ 352 సాయంతో 1977 దాకా పొడిగించారు.అనంతర కాలంలో ఆరో, ఏడో, తొమ్మిదో, 11వ, 12వ, 13వ లోక్‌సభలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి. ‘‘పలు రాష్ట్రాల్లో శాసనసభలకూ అదే పరిస్థితి ఎదురవుతూ వస్తోంది. దాంతో తరచూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొంది. దాంతో పార్టీలు, నేతలు, చట్టసభ్యులు, అధికారులు పాలనను పక్కన పెట్టి ఎన్నికలను ఎదుర్కోవడంలో గడపాల్సి వస్తోంది. అందుకే కోవింద్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా దేశ ప్రయోజనాల రీత్యా జమిలి ఎన్నికలను తిరిగి పట్టాలపైకి తేవాలని సంకల్పించాం. పాలనలో స్థిరత్వానికి అది వీలు కల్పిస్తుంది’’ అని కేంద్రం వివరించింది. రాజ్యాంగంపై దాడి: కాంగ్రెస్జమిలి బిల్లులను రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడిగా కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ అభివర్ణించారు. వాటిని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని ఆయన గుర్తు చేశారు. ‘‘జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణిత కాలావధి కల్పించే ఆర్టీకల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుంది. కనుక సమాఖ్య వ్యవస్థ మౌలిక లక్షణమైన ప్రజాస్వామ్య నిర్మాణపు పునాదులనే ఈ బిల్లులు కదిలిస్తాయి’’ అని వాదించారు. దేశంలో నియంతృత్వాన్ని తేవడమే బీజేపీ ఉద్దేశమని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు.అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును న్యూనతపరచడమేనని తృణమూల్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. తమకు నచి్చన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని టీఆర్ బాలు గుర్తు చేశారు. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదన్నారు. బిల్లులపై మాట్లాడేందుకు అధికార పక్ష సభ్యులకే స్పీకర్ ఓం బిర్లా ఎక్కువగా అవకాశమిస్తున్నారని విపక్ష సభ్యులు అభ్యంతరం వెలిబుచ్చడం ఉద్రిక్తతకు దారితీసింది.‘‘పార్లమెంటుకు మీరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారా? ఆ హక్కు ప్రతి పార్టీకీ ఉంది’’ అంటూ రిజిజు దుయ్యబట్టారు. బిల్లులకు బేషరతుగా మద్దతిస్తున్నట్టు బీజేపీ మిత్రపక్షాలు శివసేన (షిండే), టీడీపీ ప్రకటించాయి. బిల్లులను జేపీసీకి పంపాలని సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్పీ) కోరారు. ఈ బిల్లులు ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమని అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్) ఆరోపించారు. -
లోక్‌సభలో ‘జమిలి ఎన్నికల’ బిల్లు.. సొంత పార్టీ ఎంపీలకు బీజేపీ నోటీసులు
ఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలపై బీజేపీ అధిష్టానం ఫైరయ్యింది. సుమారు 20మంది ఎంపీలకు బాధ్యతారాహిత్యం కింద నోటీసులు జారీ చేసింది.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. ఎన్డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే, లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో 20మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యారు.గతంలోనే, జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో లోక్‌సభ సభ్యులు సభకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీలు చర్చలో పాల్గొనలేదు. BIG BREAKING NEWS 🚨 One Nation One Election Bill accepted in Lok Sabha despite MASSIVE opposition by Opposition Parties.269 votes in favour and 198 votes against it.According to the bill, the “appointed date” will be after the next Lok Sabha elections in 2029, with… pic.twitter.com/xRBHnXGEBA— Times Algebra (@TimesAlgebraIND) December 17, 2024రాజ్యాంగాన్ని సవరించి ఏకకాలంలో పార్లమెంటరీ, రాష్ట్రాల ఎన్నికలను అనుమతించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాదు. కానీ, ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. జమిలి ఎన్నికలు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని, అందుకు ఆ 20 మంది బీజేపీ ఎంపీల తీరేనని ఆరోపిస్తోంది. నియమావళి ప్రకారం బిల్లులు సాధారణ మెజారిటీతో ఆమోదం లభించింది. 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు -
బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన 149 మంది సభ్యులు
-
జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ
-
జమిలి బిల్లుకు వేళాయే..వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ
-
నేడు లోక్‌సభలో జమిలి బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటిని లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు. 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.ఆ సదుపాయమూ ఉందిజమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా రాష్ట్ర శాసనసభకు లోక్‌సభతో పాటుగా ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎదురైతే ఎలా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సదరు అసెంబ్లీకి లోక్‌సభ అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ బిల్లులో సెక్షన్ 2, సబ్ క్లాజ్ 5లో నిబంధన పొందుపరిచారు. -
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో... రాజ్యసభపై లోక్‌సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. -
లోక్ సభలో కాంగ్రెస్ పై మోదీ ఫైర్
-
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. గాంధీ-నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగ రక్తాన్ని కళ్లజూసిందని మండిపడ్డారు.
-
మోదీ ప్రసంగం... యమా బోరు: ప్రియాంక
న్యూఢిల్లీ: లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం విసుగు తెప్పించిందని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని ప్రసంగంలో కొత్త విషయం ఒక్కటీ లేదు. అన్నీ దశాబ్ధాల నాటి పాత విషయాలు. రెండు గణితం క్లాసులు ఒకేసారి విన్నంత బోర్‌గా ఫీలయ్యా’’ అన్నారు. ‘‘మోదీ ప్రసంగం చూసి జేపీ నడ్డా చేతులు నలుపుకున్నారు. అమిత్ షా తలపట్టుకున్నారు. పీయూష్ గోయెల్ నిద్రమత్తులోకి వెళ్లారు. ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. మోదీ కొత్త అంశాలను ఆసక్తికరంగా చెప్పి ఉండాల్సింది’’ అన్నారు. ‘‘విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సభలో ఎందుకు లేరు? అవినీతిని ఉపేక్షించమంటూ చెప్పే ప్రభుత్వం అదానీ అంశంపై చర్చకు ఎందుకు అంగీకరించడం లేదు’’ అని ఆమె ప్రశ్నించారు. -
నెహ్రూ, గాంధీ కుటుంబ పాలనలో... రాజ్యాంగానికి గాయం
కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘అవి దేశ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు వంటి విషపు విత్తనాలు నాటాయి. దేశ ఐక్యతనే దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన నెహ్రూ–కుటుంబాన్ని ఓడించి ఇంటిబాట పట్టించాం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని అన్నారు. ‘‘2014 నుంచి మా నిర్ణయాలు, విధానాలన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన బాటలో నడుస్తున్నాం. దేశ శక్తి సామర్థ్యాలను, ఐక్యతను పెంపొందించాలన్నదే మా ఆశయం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు రాజ్యాంగాన్ని దెబ్బకొట్టడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం ఎన్నో కుట్రలు చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ ప్రధానులుగా రాజ్యాంగాన్ని దెబ్బ తీయాలని చూశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా రాజ్యాంగాన్ని నెహ్రూ సవరించారు. ఇక ఆయన కుమార్తె ఇందిర ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. పదవులు కాపాడుకోవడానికి రాజ్యాంగంలో సవరణ చేశారు. న్యాయ వ్యవస్థ గొంతు కోశారు. దేశాన్నే జైలుగా మార్చేశారు. ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ చెరిగేది కాదు. ఆమె కుమారుడు రాజీవ్ కూడా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టానికి సవరణలు తెచ్చారు. నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన తర్వాతి తరమూ రాజ్యాంగంపై అదే ఆట ఆడుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఓ అహంకారి (రాహుల్) ఏకంగా చించిపారేశారు. యూపీఏ హయాంలో సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించింది. ప్రధాని మన్మోహన్‌ను మించిన అధికారులు చలాయించింది. దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని మతం, విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనను రాజ్యాంగ రూపకర్తలు పరిగణనలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాత్రం అధికార యావతో, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది’’ అంటూ తూర్పారబట్టారు. ఆ నినాదం.. అతిపెద్ద మోసం కాంగ్రెస్ ఇచి్చన గరీబీ హఠావో నినాదాన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఆ నినాదం లేకుండా కాంగ్రెస్ బతకలేదు. నాలుగు తరాలుగా దాన్నే నిత్యం వినిపిస్తున్నారు. కానీ ఆ నినాదంతో కాంగ్రెస్ రాజకీయంగా లాభ పడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. మా ప్రభుత్వం వచ్చాక మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాం. కాంగ్రెస్ నాయకులు పేదలను, పేదరికాన్ని కేవలం టీవీల్లో, పేపర్లలో చూసుంటారంతే. అసలైన పేదలు, అసలైన పేదరికం అంటే ఏమిటో వారికి తెలియదు’’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగమే ఐక్యతా సాధనం సాధారణ కుటుంబాల్లో జని్మంచిన తనవంటి ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరారంటే రాజ్యాంగ బలమే కారణమని మోదీ అన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక దేశం ముక్కలవుతుందన్న భయాలుండేవి. వాటిని అధిగమించి ఐక్యంగా ఈ స్థాయికి చేరామంటే ఆ ఘనత రాజ్యాంగానిదే. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాక దేశ ప్రయాణం అద్భుతంగా, అసాధారణంగా సాగింది. మన ప్రాచీన ప్రజాస్వామ్య మూలాలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మన అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే తల్లి వంటిది. మన ఐక్యతకు నిస్సందేహంగా రాజ్యాంగమే ఆధారం. మహిళలకు ఓటు హక్కు రాజ్యాంగం వల్లే వచ్చింది. మహిళల ఆధ్వర్యంలోనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది’’ అని ఉద్ఘాటించారు. ‘‘నేను గుజరాత్ సీఎంగా ఉండగా రాజ్యాంగ 60 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాం. రాజ్యాంగ ప్రతిని ఏనుగుపై ఊరేగించాం. రాజ్యాంగ ఔన్నత్యాన్ని గౌరవిస్తూ చెప్పుల్లేకుండా ఏనుగు వెంట నడిచా’’ అని గుర్తు చేసుకున్నారు. 11 తీర్మానాలు ప్రధాని మోదీ లోక్‌సభలో 11 తీర్మానాలు ప్రతిపాదించారు. 1. ప్రతి ఒక్కరూ సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలి. అధికార యంత్రాంగం విధులకు కట్టుబడి ఉండాలి. 2. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకృతాభివృద్ధికి కృషి చేయాలి. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. 3. అవినీతిని తిరస్కరించాలి. దానిపై యుద్ధం చేయాలి. అవినీతిపరులకు సమాజంలో స్థానం లేదు. 4. మన చట్టాలను, నియమ నిబంధనలను గర్వకారణంగా భావించాలి. దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న చట్టాలను అంతా గౌరవించాలి. 5. వలసవాదానికి తలవంచే మనస్తత్వం నుంచి బయటకు పడాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం మనకు గర్వకారణం. 6. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. పాలనలో బంధుప్రీతిని పక్కనపెట్టి ప్రతిభావంతులకే అవకాశం కలి్పంచాలి. 7. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదు. 8. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు. మతాధారిత రిజర్వేషన్లకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలి. 9. లింగ సమనత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. 10. ప్రాంతీయాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇదే మన మంత్రం. 11. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్. దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండాలి. ప్రజలంతా కలిసుంటేనే భారత్ గొప్పదేశంగా మారుతుంది. -
సావర్కర్‌ను ప్రశంసించిన ఇందిరా గాంధీ: బీజేపీ
న్యూఢిల్లీ: సావర్కర్‌పై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సావర్కర్‌ను ఇందిరాగాంధీ కూడా ప్రశంసించారని పేర్కొంది. సావర్కర్ స్వాతంత్య్ర పోరాటం గురించి తెలియాలంటే అండమాన్‌లోని సెల్యూలార్ జైలును రాహుల్ సందర్శించాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఎన్డీఏ భాగస్వామి శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా లోక్‌సభలో ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘రాహుల్ నాన్నమ్మ ఇందిర కూడా సావర్కర్‌ను భారతదేశపు గొప్ప పుత్రుడంటూ పొగిడారు. సావర్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు’’ అన్నారు. సావర్కర్‌ను కొనియాడుతూ పండిట్ బాఖ్లేకు ఇందిర రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. సావర్కర్‌ను ప్రశంసించినందుకు ఇందిర కూడా కాంగ్రెస్ లెక్క ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకి అవుతారా అని ప్రశ్నించారు. సావర్కర్‌పై విమర్శలు రాహుల్‌కు అలవాటుగా మారాయని మండిపడ్డారు. -
మనుస్మృతి మద్దతుదారులు!
న్యూఢిల్లీ: ‘‘బీజేపీకి, ఆరెస్సెస్‌కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. అవి కేవలం మనుస్మృతినే చట్టంగా భావిస్తున్నాయి. దానికే మద్దతిస్తున్నాయి’’ అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది తప్ప మనుస్మృతి ప్రకారం కాదని తేలి్చచెప్పారు. ‘‘పాలక పక్షానికి సుప్రీం నేత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు. అందులో భారతీయతే లేదన్నారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా వారి సుప్రీం లీడర్‌ను నవ్వులపాలు చేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో రెండో రోజు శనివారం రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పేదలను కాపాడుతున్న రాజ్యాంగంపై బీజేపీ నిత్యం దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. బ్రిటిషర్లతో రాజీపడ్డ సావర్కర్ బీజేపీ సుప్రీం లీడర్ సావర్కర్ మాటలతోనే ప్రసంగం ప్రారంభిస్తానని రాహుల్ అన్నారు. ‘‘వేదాల తర్వాత అత్యంత ఆరాధనీయ గ్రంథం మనుస్మృతి అని సావర్కర్ చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలకు మనుస్మృతే ఆధారమన్నారు. మన ఆధ్యాతి్మక, దైవిక మార్గాన్ని అది నిర్దేశించిందని చెప్పారు. మను స్మృతి ఆధారంగానే దేశం నడుచుకోవాలంటూ రచనలు, పోరాటం చేశారు. ఇప్పుడు మీరేమో (బీజేపీ) రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడు తున్నారు. అంటే మీ నాయకుని బోధలకు మద్దతిస్తున్నట్టా, లేదా? మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటమంటే సావర్కర్‌ను మీరు అవమానిస్తున్నట్లే. హేళన చేస్తున్నట్టే. కించపరుస్తున్నట్టే. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సావర్కర్‌ను ప్రశంసించారంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి సావర్కర్ బ్రిటిషర్లతో రాజీపడ్డారని ఇందిర ఆరోపించారు. గాం«దీజీ, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ లేఖ రాసి మరీ జైలు నుంచి బయటపడ్డారని అప్పట్లో ఇందిర విమర్శించారు’’ అని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా నేడు దేశంలో రెండు పక్షాలు ఇరువైపులా మోహరించాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే పక్షం. మరొకటి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న పక్షం. మేం ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే, అంబేడ్కర్, గుజరాత్లో గాంధీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ను సందర్శించా. సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించా. బాధిత కుటుంబం అవమానంతో ఇంటికి పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? అది కేవలం మీ (బీజేపీ) పుస్తకంలోనే రాసుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సురక్షితమైన చోటికి మార్చకపోతే మేమే ఆ పని చేస్తాం. సంభాల్ హింసాకాండలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. కులం, మతం, వర్గం పేరిట ప్రజలను విడగొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.బలహీన వర్గాల బొటనవేళ్లు నరికేస్తున్నారు ‘‘ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమరి్పంచాడు. నేడు మోదీ ప్రభుత్వం యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదల బొటన వేళ్లను నిస్సిగ్గుగా నరికేస్తోంది. వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘‘అగి్నపథ్ తెచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తెచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ఆరోపించారు. మోదీ దన్నుతో అదానీ సామ్రాజ్యం దేశంలో కీలక రంగాల్లోకి విస్తరించిందన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణన నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
ఏపీలో రెడ్ బుక్ పాలన.. రాజ్యాంగంపై చర్చలో ఎంపీ గురుమూర్తి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోందని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున ఆయన పాల్గొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతోందని.. కూటమి ప్రభుత్వం కేవలం వట్టి మాటలకే పరిమితమైందన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, పారదర్శకతకు అద్దం పట్టిందన్న గురుమూర్తి.. జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత లాంటి పథకాలు అణగారిన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.ఈ పథకాలు ఆయా వర్గాలను పైకి తీసుకొచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, వారి అభివృద్ధికి పాటుపడ్డారు. రాజ్యాంగం ఒక జీవన పత్రం. అసమానతలను తగ్గించే ఒక సాధనం రాజ్యాంగం. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సోదర భావనకు రాజ్యాంగం పెద్దపీట వేసింది. కేశవానంద భారతి కేసు రాజ్యాంగం పునాదులను మరోసారి నిర్వచించింది. 75 ఏళ్ల ఈ రాజ్యాంగ ప్రయాణంలో ఎంతో ప్రగతి సాధించాం.’’ అని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. అనేక కోట్ల మంది ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మన రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని ప్రకటించారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ ఎకానమీ నుంచి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది.ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట..అక్షరాస్యతలో 74 శాతం సాధించాం. జీవన స్థాయి 70 ఏళ్లకు పెరిగింది. వాతావరణం మార్పులు జీ-20 విషయాల్లో భారత ప్రపంచం నాయకత్వం వహిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక సమానతలు ఇంకా సవాలుగానే పరిణమిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, లింగ అసమానత్వాన్ని రూపుమాపితేనే నిజమైన సమానత్వం వస్తుంది’’ అని ఎంపీ గురుమూర్తి చెప్పారు. -
పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్‌సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్‌కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
జస్టిస్ చంద్రచూడ్‌పై మొయిత్రా విమర్శలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం లోక్‌సభలో చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. అంతేగాక విమర్శించే గొంతుకలన్నింటినీ నొక్కేయడమే లక్ష్యంగా దేశంలో సర్వ వ్యవస్థలనూ మోదీ సర్కారు చెరబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రత్యేక కోర్టు జడ్జి బి.హెచ్.లోయా మృతి అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో సభలో దుమారం రేగింది. లోయాది అత్యంత అకాల మరణమన్న మొయిత్రా వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అత్యంత తీవ్ర ఆరోపణలివి. దీనిపై కచ్చితంగా తగిన రీతిలో పార్లమెంటరీ చర్యలుంటాయి. మొయిత్రా తప్పించుకోలేరు’’ అన్నారు. మొయిత్రా ప్రసంగ రికార్డులను స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమెపై మరోసారి అనర్హత వేటు తప్పదంటున్నారు. నోటుకు ప్రశ్నల ఆరోపణలపై గత లోక్‌సభలో మొయిత్రా సభ్యత్వం రద్దవడం తెలిసిందే. లోయా 2014లో రాజకీయంగా సొహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసును విచారిస్తుండగా వివాదాస్పద రీతిలో మృతి చెందారు. దాని వెనక బీజేపీ హస్తముందనేలా విపక్షాలు ఆరోపించాయి. ఆయనది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది.సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయతి్నస్తోందంటూ మొయిత్రా తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు చేతిలో వెయ్యి కత్తి పోట్లతో రాజ్యాంగం నిలువెల్లా రక్తమోడుతోందన్నారు. ఈడీ, సీబీఐ వంటివాటిని చివరికి వసూళ్ల సంస్థలుగా, ఈసీ వంటివాటిని జేబు సంస్థలుగా మార్చుకుందని ఆక్షేపించారు. ఆ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాల సమగ్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని పణంగా పెట్టేందుకు ప్రయతి్నంచారు! తాజా మాజీ సీజేఐ హయాంలో కొందరికే బెయిళ్లు మంజూరయ్యాయి. ఒక వర్గం వారికి మొండిచెయ్యి చూపారు. వారికి ఆయన అక్షరమాలలో స్థానమే లేకుండా పోయింది. ఆ మాజీ సీజేఐ ప్రవర్తన చివరికి సుప్రీంకోర్టు రాజకీయ ప్రతిపక్షంలా వ్యవహరించరాదనే వ్యాఖ్యలకూ కారణమైంది. విపక్ష పాత్ర పోషించేందుకు మేమున్నాం. అందుకు సుప్రీంకోర్టు అవసరమేమీ లేదు’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన నివాసంలో గణేశ్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీని ఆహా్వనించడాన్ని మొయిత్రా తీవ్రంగా తప్పుబట్టారు. మోదీని దేవునితో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తులు తీర్పులు రాసేందుకు తర్కం, చట్టం, రాజ్యాంగానికి బదులు ఇలా దేవునితో ప్రైవేట్ సంభాషణలపై ఆధారపడే పరిస్థితిని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించి కూడా ఉండరు. మాజీ, ప్రస్తుత సీజేఐలందరికీ నాదో సలహా. ఇలా దేవుడి నుంచి సూచనలు అందుకోవడం మానేయండి. వ్యక్తిగత వేడుకలకు రాజకీయ పెద్దలను అతిథులుగా పిలిచి వాటిని టీవీ సర్కస్లుగా మార్చకండి. మీ ఏకైక అతిథి రాజ్యాంగమే. అది మాత్రమే మీ ఇంట్లో కొలువుదీరే దేవుడు కావాలి. మీరు మిగల్చబోయే వ్యక్తిగత వారసత్వం గురించి ఆందోళన పడటం ఆపేయండి. ఎందుకంటే అలా వ్యక్తిగత గుర్తింపు కోరుకునే వాళ్లు ఎలాంటి వారసత్వమూ మిగల్చలేరు. మౌలిక హక్కులను పరిరక్షించేవారు మాత్రమే గుర్తుండిపోతారు’’ అన్నారు. -
సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అంటే సంఘ్ విధానం కాదన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. భారత్ కా సంవిధాన్ సంఘ్ కా విధాన్ కాదని తేల్చిచెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె శుక్రవారం లోక్‌సభలో 32 నిమిషాలపాటు హిందీ భాషలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేచ్చకు రాజ్యాంగం ఒక రక్షణ కవచమని ఉద్ఘాటించారు. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రియాంక ఇంకా ఏం మాట్లాడారంటే... నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు ‘‘ఆర్థిక న్యాయానికి, రైతులకు, పేదలకు భూములు పంపిణీకి చేయడానికి మన రాజ్యాంగమే పునాది వేసింది. బీజేపీ నేతలు తరచుగా జవహర్లాల్ నెహ్రూను వేలెత్తి చూపుతున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నెహ్రూపై నిందలు వేస్తున్నారు. దేశం కోసం మీరేం చేస్తున్నారో చెప్పకుండా నెహ్రూను విమర్శిస్తే లాభం లేదు. గతంలో అది జరిగింది, ఇది జరిగింది అని బీజేపీ సభ్యుల విమర్శలు చేస్తున్నారు. రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. డబ్బు బలంతో ప్రభుత్వాలను పడగొట్టింది మీరు కాదా? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యాంగం అమలు కాలేదు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు అసలు నిజం ఏమిటో బయటపడుతుంది. మోదీకి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు గతంలో రాజులు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లేవారని చదువుకున్నాం. తమ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజులు స్వయంగా తెలుసుకొనేవారట. తమపై ప్రజల ఆరోపణలు ఏమిటో గ్రహించేవారట. ఇప్పటి రాజు(నరేంద్ర మోదీ) వేషాలు మార్చేయడంలో ఆరితేరిపోయారు. కానీ, ప్రజల్లో వెళ్లే ధైర్యం గానీ, ఆరోపణలు వినే ధైర్యం గానీ ఆయనకు లేదు. మన ప్రధానమంత్రి రాజ్యాంగం ఎదుట తలవంచి నమస్కరించారు. రాజ్యాంగానికి నుదురు తాకించారు. సంభాల్, హథ్రాస్, మణిపూర్‌లో న్యాయం కోసం ఆక్రోశించినప్పుడు ఆయన మనసు చలించలేదు. ఆయన నుదుటిపై చిన్న ముడత కూడా పడలేదు. రాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోలేదు.భయాన్ని వ్యాప్తి చేసినవారు భయంతో బతుకుతున్నారు దేశంలో కుల గణన జరగాలన్నదే ప్రజల అభిమతం. అందుకోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించాలి. కేవలం ఒక్క బిలియనీర్(గౌతమ్ అదానీ) కోసం దేశ ప్రజలంతా కష్టాలు అనుభవించాలా? దేశంలో అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగానే నేడు భయం అంతటా ఆవహించింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాం«దీజీ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకవైపు, బ్రిటిషర్లతో అంటకాగిన భావజాలం కలిగిన వ్యక్తులు మరోవైపు ఉన్నారు. భయానికి ఒక లక్షణ ఉంది. భయాన్ని వ్యాప్తి చేసేవారే ఆదే భయానికి బాధితులవుతారు. ఇది సహజ న్యాయం. నేడు దేశంలో భయాన్ని వ్యాప్తి చేసినవారు అదే భయంతో బతుకున్నారు. చర్చకు, విమర్శకు భయపడుతున్నారు’’ అని ప్రియాంక అన్నారు. -
రాజ్యాంగం కన్నా... అధికారమే మీకు మిన్న
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్‌సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది. జేబులో పెట్టుకోవడమే నైజం రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్‌నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి. వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో! భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్‌కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్‌గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు. -
ఇటు ఎమర్జెన్సీ.. అటు రాజ్యాంగ పరిరక్షణ!
న్యూఢిల్లీ, సాక్షి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. ప్రత్యేక సమావేశాలతో అధికార-ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను వేడెక్కించబోతున్నాయి. ఎన్డీయే సర్కార్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలంటూ విపక్ష కూటమి.. అలాగే ఎమర్జెన్సీ అంశంతో బీజేపీ.. ఒకరినొకరు కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది.రాజ్యాంగంపై చర్చ కోసం శుక్రవారం మధ్యాహ్నాం లోక్‌సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ, రేపు రాజ్యాంగంపై ప్రజాప్రతినిధుల సభ చర్చించనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే కూటమి తరఫున 12 నుంచి 15 మంది ఈ చర్చలో భాగమవుతారని తెలుస్తోంది. ఇందులో జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జతిన్ మాంజీ, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే (ఏక్నాథ్ షిండే) పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చివరిరోజు.. అంటే రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో(సమాధానంతో) ఈ చర్చ ముగియనుంది.స్వతంత్ర భారతావనిలో నూతనంగా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించగా.. 1950 నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగ పరిణామం, ప్రాముఖ్యతతో మొదలయ్యే చర్చ.. రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరనివ్వకుండా ప్రతిపక్షాలు అవాంతరం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఎన్డీయే.. అలాగే వివిధ అంశాలతో కేంద్రంపై ఇండియా కూటమి పరస్పరం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.కాంగ్రెస్సే లక్ష్యంగా..లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన ఫలితం రాలేదు. ఇండియా కూటమి.. ప్రత్యేకించి కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు దక్కాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మిశ్రమ ఫలితాలే దక్కుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ సహించలేకపోతోంది. వీటన్నింటికి తోడు.. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చ ద్వారానే కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం భావిస్తోంది.ఆర్నెల్ల కిందట.. ఎమర్జెన్సీకి 49 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ప్రస్తావించి మరీ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనని(కాంగ్రెస్‌ను ఉద్దేశించి.. ).. నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి అంటూ విసుర్లు విసిరిరాయన. దీంతో మరోసారి ఎమర్జెన్సీ అంశం రాజ్యాంగ చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశమూ లేకపోలేదు.కౌంటర్‌కి ఇండియా కూటమి రెడీ..రాజ్యాంగంపై చర్చలో భాగంగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. విపక్షాల తరఫున.. డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి మహువా మెయిత్రా-కల్యాణి బెనర్జీ పేర్లు ఖరారు కాగా.. మిగతావాళ్ల పేర్లు వెలువడాల్సి ఉంది. అలాగే రాహుల్ ఇవాళ మాట్లాడతారా? రేపా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎన్డీయే కూటమి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అదానీ అంశం ప్రధానంగా పార్లమెంట్‌ను దద్దరిల్లిపోయేలా చేసింది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ చర్చను కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంభల్ హింసతో పాటు రైతుల నిరనల, మణిపూర్ హింస తదితర అంశాలను కూడా ప్రస్తావించి రాజ్యంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్లో గట్టిగా నినదించాలని భావిస్తున్నయి.అటు పెద్దల సభలోనూ.. ఇవాళ, రేపు దిగువ సభలో మాత్రమే రాజ్యంగంపై చర్చ జరుగుతుంది. ఆదివారం పార్లమెంట్‌కు సెలవు. రాజ్యసభలో సోమ, మంగళవారం ఇదే తరహాలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మూడు లైన్ల విప్‌ను ఆయా ఎంపీలకు సదరు పార్టీలు జారీ చేశాయి. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు. -
Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ నేటితో (2024 డిసెంబర్ 12) 84 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శరద్ పవార్ 1940, డిసెంబర్ 12న జన్మించారు. ఆయన తన రాజీకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయితే కాంగ్రెస్‌ను వీడి సొంతంగా పార్టీ వ్యవస్థాపించడం ఆయన జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు అంశాలు కనిపిస్తాయి. నాడు 12వ లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఫ్రంట్‌లో గందరగోళం ఏర్పడిందని ప్రముఖ రచయిత రాజ్‌కమల్ ప్రకాశన్ ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం.. అప్పటికేప్పటికే పవార్, సోనియా గాంధీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పవార్ లోక్‌సభలో పార్టీ నేతగా ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం పవార్ స్వయంగా సోనియా గాంధీతో చర్చించి, ఆమె ఆమోదం తీసుకున్నారు. జాబితాను లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. మర్నాడు నాటి స్పీకర్ జిఎంసీ బాలయోగి.. పవార్‌కు ఫోన్ చేసి.. ‘నాకు ఇప్పుడొక సమస్య ఏర్పడింది. మీ పార్టీ నుంచి నాకు రెండు జాబితాలు అందాయి. కాంగ్రెస్ చీఫ్ డైరెక్టర్ పీజే కురియన్ నాకు మరో జాబితా పంపారు. ఈ రెండు జాబితాల్లోనూ పేర్లు వేర్వేరుగా ఉన్నాయి’ అని అన్నారు.లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకునిగా ఉన్నందున, కమిటీ సభ్యుల జాబితాను స్పీకర్‌కు సమర్పించడంపై శరద్ పవార్‌కు హక్కు ఉంది. అయితే దీనిని అతిక్రమిస్తూ మరో జాబితా విడుదలైంది. రెండో జాబితా ఫోటోకాపీ అందిన తర్వాత పవార్ వివరాలు తెలుసుకునేందుకు కురియన్ను సంప్రదించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి సూచనల మేరకే రెండో జాబితాను సిద్ధం చేసినట్లు వారి మాటల్లో వెల్లడైంది. వెంటనే పవార్ స్వయంగా సోనియాను కలిశారు. సోనియాతో మీరు రూపొందించిన జాబితాను ఉపసంహరించుకోవాలని పవార్‌ను కోరారు.1999 మే 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆమె విదేశీయురాలనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశంలో అర్జున్ సింగ్, ఏకే ఆంటోనీ, గులామ్‌నబీ ఆజాద్, అంబికా సోనీ తదితరులు సోనియాపట్ల తమ విధేయతను ప్రకటించారు. అయితే పీఏ సంగ్మా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. సంగ్మాకు శరద్ పవార్, తారిఖ్ అన్వర్ మద్దతు పలికారు. కొద్దిరోజుల తరువాత పార్టీ ఈ ముగ్గురినీ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. అనంతరం ఈ ముగ్గురూ మరికొందరు నేతల సహాయంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. సమాధానమివ్వనున్న మోదీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై లోక్‌సభలో డిసెంబర్ 14న జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్‌సభలో శుక్రవారం, శనివారం (డిసెంబర్ 13, 14) రెండు రోజులపాటు రాజ్యాంగంపై చర్చలు జరగనున్నాయి. అటు రాజ్యసభలోనూ డిసెంబర్ 16, 17వ తేదీల్లో చర్చ జరగనుంది. డిసెంబరు 16న ఎగువ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో చర్చ జరగనుంది.కాగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉభయసభల్లో రాజ్యాంగంపై చర్చించాలని ప్రతపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రాథమిక స్థాయిలో మార్చేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో గతవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో రాజ్యాంగంపై చర్చలకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించాయి -
చట్టాలంటే ప్రజలకు గౌరవం లేదు, భయం లేదు
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆక్షేపించారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, తన కాలు నాలుగుచోట్ల విరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30 వేల మందిమృత్యువాత పడుతున్నారని తెలిపారు. జరిమానాలు పెంచినా... ఈ ఏడాది ఇప్పటివరకు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గడ్కరీ వివరించారు. మృతుల్లో 60 శాతం మంది యువతీ యువకులే ఉండడం బాధాకరమని చెప్పారు. జరిమానాలు పెంచుతున్నా ప్రజలు లెక్కచేయడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో తన కళ్లెదుటే ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి వెళ్లిందని అన్నారు. మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో చాలాచోట్ల రోడ్లపై బ్లాక్స్పాట్లు ఉన్నాయని, వీటిని సరి చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
రాహుల్ ఉన్నతస్థాయి ద్రోహి: బీజేపీ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్షం ముసుగులో రాహుల్.. ఉన్నతస్థాయి దేశ ద్రోహిలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. అమెరికాకు చెందిన ఏజెన్సీలు, బిలియనీర్ జార్జ్ సోరోస్లతో రాహుల్‌ను పోల్చుతూ బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నవేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారని, దేశాన్ని అస్థిరపర్చేందుకు వారు కుట్రలు పన్నుతున్నారని సాంబిత్ పాత్రా మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్, ఆయన మద్దతున్న ఓసీసీఆర్పీ మధ్య ఓ ముక్కోణపు బంధం ఉందని విమర్శించారు. రాహుల్ దేశానికి ద్రోహం చేస్తున్నాడని, సోరోస్ స్క్రిప్ట్ ఇక్కడ అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు.బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర‘త్రిభుజానికి ఒకవైపు అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్, అమెరికాకు చెందిన కొన్ని ఏజెన్సీలు, మరోవైపు సొరేస్ మద్దతున్న OCCRP పేరుతో పెద్ద న్యూస్ పోర్టల్ ఉన్నాయి. త్రిభుజం చివరి మూలలో రాహుల్ గాంధీ, ‘ఉన్నత స్థాయి ద్రోహి’ అని అనడానికి నేను భయపడను. లోక్‌సభలో ప్రతిపక్ష నేతను దేశద్రోహి అనడానికి తనకు ఎలాంటి సందేహం లేదు. సోరోస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఓసీసీఆర్పీ ఆదేశాలను పాటిస్తున్నారు. రాహుల్, సోరోస్ ఇద్దరూ ఒకటే. ఒకరు బాధ పడితే మరొకరు కలత చెందుతారు. తన అజెండాలను నెరవేర్చుకోవాలని ఆ బిలియనీర్ కోరుకుంటున్నారు. ఆయనకు రాహుల్ సాయం చేస్తున్నారు. దేశ ప్రయోజనాలకు ముప్పుతేవడమే వారిద్దరికీ కావాలి. దేశాన్ని విభజించాలని చూసేవారు ప్రగతిని చూడలేరు.’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
Parliament Session Updates: లోక్‌సభ శుక్రవారానికి వాయిదా
న్యూఢిల్లీ, అప్డేట్స్: రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ చేసిన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసననిషికాంత్ దూబే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్విదేశీ పెట్టుబడిదారుడికి, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మధ్య సంబంధాలు ఉన్నాయన్న నిషికాంత్ దూబేమోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతిని అణగదొక్కడానికి అంతర్జాతీయ కుట్ర పన్నారని ఆరోపణదూబే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతి లోక్‌సభ రేపటికి(శుక్రవారానికి) వాయిదాస్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం జీరో అవర్‌ను ప్రారంభించగా.. విపక్ష సభ్యులు లేచి నిలబడి, సంభాల్ హింసాత్మక పరిస్థితులపై సభలో చర్చించాలని పట్టుబట్టారు.దూబే తన ప్రజెంటేషన్‌ను పూర్తి చేసిన తర్వాత సంభాల్ సమస్యను పరిష్కరించడానికి ప్రతిపక్షాలకు అనుమతి ఇస్తామని స్పీకర్ బిర్లా హామీ ఇచ్చారు.అయినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేస్తునన్నట్లు ప్రకటించారు.ప్రతిపక్ష పార్టీల తీరుతో చాలా బాధపడ్డాను: కిరన్ రిజుజుశీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల తీరుతో చాలా బాధపడ్డాను.తొలి రోజు నుంచే బిల్లులు, రాజ్యాంగంపై చర్చ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించాం. కానీ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎందుకు నిరసన చేస్తున్నాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించి పార్లమెంట్ వెలుపల ఎందుకు నాటకాలాడుతున్నారు. ఇదనే సభ నడిచే తీరు; పార్లమెంట్ హౌస్ అంటే చర్చలు జరగాలి. కానీ వారు రంగురంగుల బట్టలు వేసుకుని పార్లమెంట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు.భారతదేశం వెలుపల కొన్ని గ్రూపులు పన్నిన కొన్ని కుట్రల గురించి, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత ప్రయోజనాలపై దాడి చేయడంపై నేడు మన ఎంపీలలో కొందరు చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. ఇవి చాలా తీవ్రమైన విషయాలుకానీ ప్రతిపక్షాలు భారత ప్రభుత్వానికి సంబంధం లేని మరికొన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఏదో సమస్యలను లేవనెత్తుతూ పార్లమెంటు ఆవరణ చుట్టూ తిరుగుతున్నారు. నేను ప్రతిపక్ష పార్టీలతో చాలా బాధపడ్డాను’ అని రిజుజు అన్నారు. సంభాల్ హింసాకాండ, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై గందరగోళం మధ్య లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.ప్రతిపక్షాలు అన్ని చోట్లా ఓడిపోతాయి: బీజేపీ ఎంపీ రవికిషన్‘హర్యానాలో ఓడిపోయారు. మహారాష్ట్రలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఓడిపోతారు. అందుకే వారి బాధ ఇక్కడ చూపిస్తున్నారు’ అని కిషన్ అన్నారు.మధ్యాహ్నం 12 వరకు రాజ్యసభ వాయిదాపార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం రోజు ప్రారంభమయ్యాయి. అదానీ వ్యవహారంపై లోక్‌సభ రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ విచారణ జరపలేరని అన్నారు. ఎందుకంటే అలా చేయాలంటే తనను తాను దర్యాప్తు చేసుకున్నట్లే అవుతుందని విమర్శించారు.మోదీ ఔర్ అదానీ ఏక్ హై. దో నహీ హై, ఏక్ హై(మోదీ, అదానీ ఒకటే.. ఇద్దరు కాదు)అని పేర్కొన్నారు.#WATCH | Delhi: Opposition MPs, including LoP Lok Sabha Rahul Gandhi protest over Adani matter, at the Parliament premises. pic.twitter.com/BuBDGDnT7f— ANI (@ANI) December 5, 2024కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ గురువారం లోక్‌సభలో ‘ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ప్రాథమిక హక్కుల తిరస్కరణ’పై చర్చను కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ.. ఇది ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఠాగూర్ పేర్కొన్నారు.మరోవైపు నేడు లోక్‌సభ రైల్వేస్ (సవరణ) బిల్లు, 2024పై చర్చను కొనసాగించనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు, 2024, విపత్తు నిర్వహణ చట్టం, 2005ని సవరించడానికి ముందుకు తీసుకురానున్నారు. ఇక భారతీయ వాయుయన్ విధేయక్, 2024పై రాజ్యసభలో చర్చ జరగనుంది. -
నలుగురు నామినీలు.. కీలక మార్పులు..
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభ ఆమోదించింది. ప్రధానంగా బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలకు గరిష్టంగా నలుగురు నామినీలను కలిగి ఉండేలా ఈ బిల్లు అనుమతిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది."ప్రతిపాదిత సవరణలు బ్యాంకింగ్ రంగంలో పాలనను బలోపేతం చేస్తాయి. నామినేషన్, డిపాజిట్‌దారుల రక్షణకు సంబంధించి కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి" అని సీతారామన్ బిల్లును ప్రవేశ పెడుతూ చెప్పారు. బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం బ్యాంకులో ఖాతాదారు గరిష్టంగా నలుగురు నామినీలను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరిని ఒకేసారి కానీ, వివిధ సందర్భాల్లో గానీ చేర్చుకోవచ్చు. ఎవరెవరికి ఎంత వాటా అన్నది కూడా ఖాతాదారు పేర్కొనవచ్చు.పాలనా ప్రమాణాలను మెరుగుపరచడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ్యాంకులు నివేదించడంలో స్థిరత్వాన్ని అందించడం, డిపాజిటర్లకు, ఇన్వెస్టర్లకు మెరుగైన రక్షణ కల్పించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడం, నామినీల విషయంలో కస్టమర్ సౌలభ్యాన్ని పెంచడం, సహకార బ్యాంకుల్లో డైరెక్టర్ల పదవీకాలం పెంచడం వంటి వాటికి సంబంధించి 19 సవరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు.ప్రతిపాదిత కీలక మార్పులుబ్యాంకు ఖాతాలకు నామినీల సంఖ్య పెంపుతోపాటు మరికొన్ని కీలక మార్పులు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024లో ఉన్నాయి.బ్యాంకులకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు, షేర్, వడ్డీ లేదా బాండ్ల రిడెమ్షన్ను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF)కి బదిలీ చేస్తారు. సంబంధిత వ్యక్తులు ఎకరైనా ఉంటే అక్కడి నుంచి క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.డైరెక్టర్షిప్స్కు సంబంధించి సబ్‌స్టాన్షియల్ ఇంట్రస్ట్ పరిమితి రూ.2 కోట్లకు పెరుగుతుంది. ఇది ప్రస్తుత రూ.5 లక్షలుగా ఉంది. దీన్ని సుమారు 6 దశాబ్దాల కిందట నిర్ణయించారు.సహకార బ్యాంకుల డైరెక్టర్ల (ఛైర్మన్, ఫుల్‌టైమ్ డైరెక్టర్ మినహా) పదవీ కాలం ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెరుగుతుంది.కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరు రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులో కూడా సభ్యుడిగా ఉండేందుకు అనుమతి. -
లోక్‌సభలో ప్రియాంక సీటింగ్ ఖరారు.. మోదీ, రాహుల్ స్థానాలు కూడా!
18వ లోక్‌సభలో ఎంపీల సీటింగ్ ఏర్పాట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీటులో ఎలాంటి మార్పు లేదు. గతంలో మాదిరి ఆయన ముందు వరుసలోని తొలి సీట్లో కూర్చోనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండో స్థానంలో, హోంమంత్రి అమిత్ షా మూడో సీట్ నెంబర్లో కూర్చోనున్నారు. గతంలో సీటు నెంబర్ 58లో కూర్చొనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై 4వ స్థానానికి మారారు. ఇక వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో స్థానం కేటాయించారు. ఈ మేరకు సోమవారం సవరించిన సీటింగ్ జాబితాను విడుదల చేశారు.గతంలో సీట్ నెంబర్ 4, 5 ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వేరే వారికి కేటాయించారు. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వంటి కీలక మంత్రులకు స్థిరమైన సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి.రాహుల్ గాంధీ 498వ స్థానంలో..వీరితోపాటు సీనియర్ ప్రతిపక్ష నేతల సీట్లు మొదటి వరుసలో ఉంటాయి. కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 498వ స్థానంలో కూర్చుంటారు., సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 355వ స్థానంలో కూర్చోనున్నారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయకు 354వ సీటు కేటాయించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ పక్కనే సీటు నంబర్ 497 కేటాయించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కు లోక్ సభ రెండో వరుసలో స్థానం కల్పించారు. ఫైజాబాద్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు సీటు నంబర్ 357లో కూర్చుంటారు. డింపుల్ యాదవ్ 358 సీటులో అతని పక్కన కూర్చుంటారు. ఇకప ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో 517వ సీట్లో కూర్చోనున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేరళకు చెందిన అదూర్ ప్రకాష్, అస్సాంకు చెందిన ప్రద్యుత్ బోర్డోలోయ్ పక్కన ఆమె కూర్చుంటారు. -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
ప్రతిష్టంభనకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ ఫలించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాజ్యాంగ దిన వజ్రోత్సవాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రాజ్యాంగంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య అంగీకారం కుదిరింది. ఆ మేరకు డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16, 17ల్లో రాజ్యసభలో చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటించారు. సోమవారం అన్ని పారీ్టల పార్లమెంటరీ పక్ష నేతలతో స్పీకర్ భేటీ అనంతరం ఆయన మీడియాకు ఈ మేరకు తెలిపారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ అంగీకరించాయన్నారు.దీన్ని భేటీలో పాల్గొన్న విపక్షాల నేతలు కూడా ధ్రువీకరించారు. విపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సంభాల్ హింస, మణిపూర్ కల్లోలం తదితరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా నిబంధనలకు లోబడి ఏ అంశాన్నైనా సభల్లో లేవనెత్తవచ్చని రిజిజు బదులిచ్చారు. అదానీ, మణిపూర్ కల్లోలం తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో నవంబర్ 25న పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ఉభయ సభల్లో రోజూ వాయిదాల పర్వం సాగుతుండటం తెలిసిందే. దీనికి తెర దించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయతి్నస్తున్నారు.వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించనున్నట్టు సమాచారం. తాము డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కారు ఎట్టకేలకు అంగీకరించిందని కాంగ్రెస్ పేర్కొంది.అదానీ, సంభాల్ తదితర అంశాలపై పార్లమెంటులో చర్చకు భయపడి తప్పించుకుంటోందని దుయ్యబట్టింది. ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతున్న అదానీ అంశంపై చర్చకు అధికార పక్షం అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో ఇతర విపక్షాలేవీ కాంగ్రెస్‌కు దన్నుగా నిలవడం లేదు. ప్రతి సమావేశాల్లోనూ పార్లమెంటును అధికార బీజేపీ హత్య చేస్తూ వస్తోందని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియాన్ దుయ్యబట్టారు.అవే ఆందోళనలు.. ఉభయసభలూ నేటికి వాయిదాఅదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా సహా పలు అంశాలపై సోమవరం పార్లమెంటు అట్టుడికింది. వాటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం కూడా ఉభయ సభలూ కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమవగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. అదానీపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా వాయిదా పడింది.తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. అదానీ సహా పలు అంశాలపై విపక్షాలిచి్చన 20 వాయిదా తీర్మానాలను చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆందోళనల నడుమ సభ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం.. అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా లోక్‌సభలో సంభాల్ అంశంపై మాట్లాడేందుకు సమాజ్‌వాదీ పార్టీకి, బంగ్లాదేశ్ పరిస్థితులపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే వారం రాజ్యాంగంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో,16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంట్ వెలుపల విలేకరులతో చెప్పారు. ‘పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. రేపటి నుంచి పార్లమెంట్ సజావుగా జరిగేలా మనమందరం చేసుకున్న ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్ష నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని రిజిజు పేర్కొన్నారు.అయితే అన్ని అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి. నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంబాల్ హింస, పెరుగుతున్న ధరలు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాని అంశంపై బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరాయి.కాగా గతవారం (నవంబర్25) ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. విపక్షాల డిమాండ్లతో రోజూ సభ ప్రారంభం కావడం, వాయిదా పడటం పరిపాటిగా మారింది. అదానీ అవినీతి వ్యవహారం, సంభాల్ హింస, మణిపూర్ అంశం వంటి విషయాలపై చర్చించాలని విపక్షాలు నిరసనలు చేస్తుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. -
లోక్ సభ ఎంపీగా ప్రియాంక వాద్రా ప్రమాణస్వీకారం
-
Parliament Session: ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి. అటు లోక్‌సభ, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అదాని గ్రూప్ అవినీతి ఆరోపణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను వాయిదావేశారు. పార్లమెంట్ ఉభయ సభలు 12గంటల వరకూ వాయిదా పడ్డాయి.లోక్‌సభ స్పీకర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. #WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, " I am delighted as we had campaigned for her. I am happy that she won...as you can see, she is appropriately dressed in a Kerala saree" pic.twitter.com/MFoJPaf4dj— ANI (@ANI) November 28, 2024 కాగా తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ నాలుగు లక్షలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనుండగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29న గడువును పొడిగిస్తూ ప్రతిపాదనను సమర్పించనుంది.ఇక నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజు నుంచి స్తంభిస్తూనే ఉన్నాయి. ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతున్నాయి. మణిపూర్ హింస, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి. -
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు ప్రముఖుల హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓంబిర్లా కుమార్తె అంజలీ బిర్లా ప్రముఖ వ్యాపారవేత్త అనీష్ రజనీల వివాహం ఈనెల 12న జరగ్గా సోమవారం ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.దీనికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, ప్రసాద్, బాలశౌరి, ఉదయ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
బీజేపీ నేతలు ప్రజానుబంధం ఏనాడో తెంచుకున్నారు
వయనాడ్: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శలను పెంచారు. ఆదివారం నైకెట్టి, సుల్తాన్ బతేరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారర్యాలీల్లో గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ ఇక్కడున్న పెద్దవాళ్లలో చాలా మందికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాగా తెలిసే ఉంటుంది. గిరిజనులతో ఆమెకు ఎంతో అనుబంధం ఉండేది. ఇక్కడి భూమి, అడవులు, నేల, నీరుతో గిరిజనులు అవినాభావ సంబంధం ఉంది. పేదల అభ్యున్నతి కోసమే అటవీ చట్టం, గ్రామీణ ఉపాధ హామీ పథకం, విద్యాహక్కుచట్టం తెచ్చాం. అదే బీజేపీ నేతలు సొంతవాళ్లనే పట్టించుకుంటూ గిరిజనులను, జనాలను గాలికొదిలేసింది. అసలు బీజేపీ నేతలు ప్రజలతో బంధాన్ని ఏనాడో తెంచుకున్నారు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. -
Priyanka Gandhi: సొంతబిడ్డల్లా సంరక్షిస్తా
వయనాడ్(కేరళ): కేరళలో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యరి్థగా బరిలో దిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. పిల్లల ఆలనాపాలనా తల్లి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా చూస్తుందో అదేరీతిలో తాను పౌరుల బాగోగులను పట్టించుకుంటానని ప్రియాంక వ్యాఖ్యానించారు. మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలాంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అకంపదం, పొథుకల్లు పట్టణాల్లో ప్రియాంక ప్రసంగించారు. ‘‘గెలిపించి నాకొక అవకాశం ఇస్తే మీ సమస్యలపై ఒక్క పార్లమెంట్లోనేకాదు వేర్వేరు సందర్భాల్లో ప్రతి ఒక్క భిన్న వేదికపై పోరాడతా. గతంలో గెలిపించిన రాహుల్‌పై వయనాడ్ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నన్ను గెలిపిస్తే నా కుటుంబానికి ఇంత మద్దతుగా ఉన్న మీకందరికీ సాయపడతా’’అని ఓటర్లునుద్దేశించి అన్నారు. ‘‘మోదీ ప్రభు త్వం సాయం అందక వయనాడ్‌లోని కొండలు, గ్రామీణ ప్రాంత రైతులు, చిరువ్యాపారులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలే ఇందుకు కారణం’’అని అన్నారు. వయనాడ్ స్థానానికి నవంబర్ 13వ తేదీన పోలింగ్ జరగనుంది. -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం: రాహుల్
వయనాడ్: దేశంలో నేడు ప్రధానమైన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆగ్రహం, విద్వేషంతో కాకుండా ప్రేమ, ఆప్యాయత, వినయంతో రాశారు. అంతటి విశిష్టమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పౌరులుగా మనం పొందుతున్న రక్షణ, దేశ ఔన్నత్యం తదితరాలకు రాజ్యాంగమే కారణభూతం’’ అన్నారు. కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మనాంథావాడీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంకా గాంధీ కోసం ప్రచారం చేశారు. ‘‘ప్రేమకు, విద్వేషానికి ఆత్మవిశ్వాసానికి, అభద్రతకు మధ్య నేడు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో నెగ్గాలంటే విద్వేషాన్ని, ఆగ్రహావేశాలను హృదయం నుంచి తొలగించుకోవాలి. ప్రేమ, అనురాగం, వినయాలను నింపుకోవాలి’’ అని సూచించారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రియాంక కోసం తాను ఓట్లు అభ్యరి్థంచడం ఇదే తొలిసారని రాహుల్ గుర్తు చేశారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోదోషి అయిన నళినిని ఆప్యాయంగా హత్తుకున్న మంచి మనస్సు తన చెల్లిదన్నారు. ప్రేమ, సానుభూతి, మానవత్వంతో కూడిన ఇలాంటి రాజకీయాలే మనకు కావాలని ఉద్ఘాటించారు. రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. ‘‘మోదీ గురించి చెప్పీ చెప్పీ బోరు కొట్టేసింది. అందుకే ఆయన ప్రస్తావన తేవడం లేదు’’ అన్నారు. అనంతరం రాహుల్ అరీకోడు పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.సంపన్న మిత్రుల కోసమే ఆరాటంప్రధాని మోదీపై ప్రియాంక మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. సంపన్న మిత్రుల సేవలో ప్రధాని తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనాంథావాడీలో సభలో ఆమె ప్రసంగించారు. ‘‘పేదలకు మంచి చేయాలన్న ఆలోచన మోదీకి అస్సలు లేదు. ప్రజలకు మంచి విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం లేదు. దేశ ప్రజల మధ్య మోదీ సర్కారు చిచ్చుపెడుతోంది. వారిని విభజిస్తోంది. హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తోంది’’ అని ధ్వజమెత్తారు. -
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
జనగణన... వచ్చే ఏడాదే
న్యూఢిల్లీ: నాలుగేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత ఎట్టకేలకు దేశ జనాభా గణన జరగనుంది. ‘‘2025 తొలినాళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 2026 కల్లా ఇది ముగియనుంది. దాని ఆధారంగా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను సవరిస్తారు. అనంతరం తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అదే జరిగితే ఆ ప్రక్రియ 2028 నాటికి పూర్తి కావచ్చు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. కులగణన చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే జనగణనలో భాగంగా కులగణన కూడా ఉంటుందా అన్న కీలక అంశంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. జనగణనలో భాగంగా పౌరులను అడిగేందుకు 31 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. జనగణనలో మత, సామాజిక వర్గీకరణతో పాటు, జనరల్, ఎస్సీ, ఎస్టీ గణనే గాక జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలోని ఉప విభాగాల సర్వేలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. జనగణనను సరైన సమయంలో చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత ఆగస్టులో చెప్పడం తెలిసిందే. ఈసారి కార్యక్రమం పూర్తిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌గా జరుగుతుందని ఆయన వెల్లడించారు.మారిపోనున్న జనగణన సైకిల్: భారత్‌లో తొలి జనగణన 1872లో జరిగింది. స్వాతంత్య్రానంతరం 1951 నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి జరుగుతూ వస్తోంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో జరగాల్సిన జనగణనకు కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. అప్పటినుంచీ పెండింగ్‌లోనే ఉంది. ఈ ఆలస్యం కారణంగా జనగణన సైకిల్ కూడా మారనుంది. ఇకపై 2025–35, 2035–45... ఇలా కొనసాగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ డిప్యుటేషన్‌ను 2026 ఆగస్టు దాకా కేంద్రం పొడిగించింది. 2011 జనగణనలో భారత్‌లో 121 కోట్ల పై చిలుకు జనాభా ఉన్నట్టు తేలింది. అంతకుముందు పదేళ్లతో పోలిస్తే 17.7 శాతం వృద్ధి రేటు నమోదైంది.కులగణన జరపాల్సిందేనన్న కాంగ్రెస్: కులగణనకు కేంద్రం నిరాకరించడం ఓబీసీ వర్గాలకు ద్రోహం చేయడమేనని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. మోదీ సర్కారు రాజకీయ అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడతాయా, లేదా మౌనంగా ఉంటాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.లోక్‌సభ సీట్లు తగ్గుతాయేమో!జనాభా లెక్కల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఉత్తరాదితో పోలిస్తే ఆ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉండటం తెలిసిందే. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా నూతన జనగణన గణాంకాల ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరిగే పోంలో తమ లోక్‌సభ స్థానాల్లో బాగా కోత పడే ఆస్కారముండటం వాటిని కలవరపెడుతోంది. ఇది రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని బాగా తగ్గిస్తుందని ఆ రాష్ట్రాలు అనుమానిస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అయితే 2026 అనంతరం చేపట్టే తొలి జనగణన తాలూకు ఫలితాలు అందుబాటులోకి వచ్చేదాకా లోక్‌సభ నియోజకవర్గాల తదుపరి పునర్ వ్యవస్థీకరణ జరగరాదని రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ నిర్దేశిస్తోంది. ఆ లెక్కన తాజా జనగణన 2025లో మొదలయ్యే పక్షంలో వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టడానికి వీలుండదు. అలాగాక వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరపాలంటే 82వ ఆర్టికల్‌ను సవరించాల్సి ఉంటుంది. కనుక ఆ క్రతువును మొదలుపెట్టే ముందు ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
మదర్ థెరిసా మా ఇంటికి వచ్చారు: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు. .. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్రూమ్లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.చదవండి: రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ -
ఎన్నికల్లో పోటీ చేయడమే కొత్త.. ప్రజా పోరాటాలు కొత్త కాదు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ప్రజా పోరాటాలు తనకు కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి తరఫున ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం పోరాటం సాగించానని, అదే తన జీవితానికి కేంద్ర బిందువు అని వెల్లడించారు. ఈ మేరకు వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ప్రియాంక శనివారం విడుదల చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ వారికి ప్రతినిధిగా వ్యవహరించారని తెలియజేశారు. వయనాడ్ ప్రజలతో కలిసి పనిచేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని వయనాడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ప్రజా సేవకురాలిగా తన ప్రయాణానికి వయనాడ్ ప్రజలే మార్గదర్శకులు, గురువులు అని ప్రియాంక స్పష్టంచేశారు. తన సోదరుడు రాహుల్ గాం«దీపై చూపిన ప్రేమానురాగాలే తనపైనా చూపించాలని కోరారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, అరుదైన వనరులను బహుమతిగా పొందిన వయనాడ్‌కు ప్రజాప్రతినిధి కావడం తన అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. -
ప్రియాంక నామినేషన్
వయనాడ్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం రాత్రి కేరళకు చేరుకున్న ప్రియాంక బుధవారం వయనాడ్ జిల్లా కేంద్రమైన కాల్పెట్టా నగరంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా హాజరైన జన వాహినిని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు. మొదటిసారిగా 1989లో 17 ఏళ్ల వయసులో తన తండ్రి రాజీవ్ గాం«దీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నానని తెలిపారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నేతల కోసం ప్రచారం చేశానని వెల్లడించారు. తన విజయం కోసం తాను ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఉద్ఘాటించారు. వయనాడ్‌లో పోటీ చేసే అవకాశం కలి్పంచిన మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు. ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు. వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా, గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మొత్తం ప్రపంచమంతా తన సోదరుడు రాహుల్ గాం«దీకి వ్యతిరేకంగా మారిన సమయంలో వయనాడ్ ప్రజలు మాత్రం ఆయనకు అండగా నిలిచారని చెప్పారు. తన కుటుంబమంతా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. వయనాడ్‌ను విడిచి వెళ్తున్నందుకు రాహుల్ బాధపడుతున్నారని వెల్లడించారు. రాహుల్‌కు, ప్రజలకు బంధాన్ని తాను మరింత బలోపేతం చేస్తానన్నారు. వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు: రాహుల్ తన చెల్లెలు ప్రియాంక బాగోగుల మీరే చూసుకోవాలి అంటూ వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇచి్చనట్లుగానే తన సోదరికి సైతం ఇవ్వాలన్నారు. వయనాడ్‌కు తాను అనధికారిక ఎంపీనని, ప్రియాంక అధికారిక ఎంపీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్లో వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు ఉంటారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ప్రియాంకా గాం«దీని ఆశీర్వదించాలని వయనాడ్ ఓటర్లను కోరారు. రోడ్ షో అనంతరం ప్రియాంకా గాంధీ వయనాడ్ కలెక్టరేట్‌కు చేరుకొని, నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కె.సి.వేణుగోపాల్ ఉన్నారు. నామినేషన్ తర్వాత ప్రియాంక, రాహుల్ పుత్తుమల శ్మశాన వాటికను సందర్శించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులరి్పంచారు. ప్రియాంక గాంధీ ఆస్తులు రూ.12 కోట్లు తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ను బుధవారం ఎన్నికల అధికారికి సమరి్పంచారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు. అలాగే రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లుగా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సొంతంగా కొన్న ఇంటి విలువను రూ.5.63 కోట్లుగా ప్రస్తావించారు. అలాగే రూ.15.75 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రియాంకా గాం«దీపై గతంలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటవీ శాఖ నుంచి ఆమెకు నోటీసు అందింది. భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
తిరువనంతపురం : వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ దిగుతున్నట్లు కొద్ది సేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ,కేరళ వయనాడ్.. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూన్‌లో ప్రకటించారు. తాజాగా, అధికారికంగా ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే, ప్రస్తుత పార్లమెంట్లో గాంధీ కుటుంబం నుంచి ఆమె మూడో ఎంపీ. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. -
లోక్‌సభలో ప్రతిపక్షనేతగా 100 రోజులు.. రాహుల్ ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టి నేటికి(శుక్రవారం) 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయాన్ని పునరుద్దరించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. మరింత న్యాయబద్దంగా, ఆర్థికంగా సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి మనం కలిసి పని చేస్తున్న సమయంలో ఈ సూత్రాలే తనకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు.కాగా ప్రతిపక్ష నాయకుడిగా అవతరించిన తర్వాత గాంధీ.. ఎన్నో గుర్తుండిపోయే ప్రసంగాలు, బీజేపీపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు చేశారు. పార్లమెంటులో ఎన్నో సమస్యలపై ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హింసాత్మక మణిపూర్ వంటి అనేక సంఘటనలు జరిగిన ప్రాంతాలను సందర్శించి, అక్కడి వారితో సమావేశమయ్యారు. అంతేగాక జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించి ప్రచారం నిర్వహించారు.ఇదిలా ఉండగా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్షనేత పదవిని పొందేందుకు అర్హత లభించింది. దీంతో ఆ పదవిని రాహుల్ గాంధీకి ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జూన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నకల్లో వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీ నుంచి 3.5 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన అనంతరం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. -
బీజేపీ అబద్ధాలను వ్యాపింపజేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పేమైనా ఉందా అని సిక్కులను ప్రశ్నించారు. ఎలాంటి భయాలు లేకుండా ప్రతీ ఒక్క భారతీయుడు నచి్చన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ భారత్‌లో ఉండకూడదా? అని రాహుల్ అన్నారు. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే బీజేపీ తన నోరు మూయించేందుకు విఫలయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటిలాగే బీజేపీ అబద్ధాలను ఆశ్రయిస్తోంది. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక నిరాశతో నా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్‌ను నిర్వచించే విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ.. గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను’ అని రాహల్ పేర్కొన్నారు. అమెరికాలో సిక్కును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. -
One Nation One Election: ఆచరణ సాధ్యమేనా?
జమిలి. ప్రస్తుతం దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న పదం. అయితే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగైదు అసెంబ్లీలకు మాత్రమే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా అసెంబ్లీలకు విడిగా, వేర్వేరుగానే ఎన్నికలొస్తున్నాయి. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు పలు అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం, కొన్నింటిని పొడిగించడమో, లేదంటే గడువు తీరాక సుప్త చేతనావస్థలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనన్న అభిప్రాయముంది. లేదంటే లోక్‌సభ కొత్తగా తొలిసారి కొలువుదీరిన తేదీని ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆ తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీల అన్నింటి గడువూ.. వాటి ఐదేళ్ల కాలపరిమితితో సంబంధం లేకుండా.. లోక్‌సభతో పాటే ముగిసే ప్రతిపాదనను అమలు చేయాలి. ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందని, ఇక అప్పటి నుంచి జమిలి ఎన్నికలే ఉంటాయని కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందులో ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులున్నాయన్నది నిపుణుల మాట. అంతేగాక అసలు ఈ ప్రతిపాదన రాష్ట్రాల అధికారాల్లో అవాంఛిత జోక్యమే తప్ప మరోటి కాదని పలు పార్టీలు వాదిస్తున్నాయి. పైగా లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయాంశాలే తెరపైకి వస్తాయని, రాష్ట్రాల్లోని స్థానికాంశాలు పక్కకు పోతాయని ప్రాంతీయ పారీ్టలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా డీఎంకే వంటి పలు పారీ్టలు జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం కూడా చేశాయి. పైగా హంగ్, అవిశ్వాస తీర్మానం నెగ్గడం వంటి ఏ కారణంతో అయినా గడువుకు ముందే చట్టసభ రద్దయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సభ ఐదేళ్లు కాకుండా రద్దయిన సభలో మిగిలిన కాలావధి పాటు మాత్రమే కొనసాగాలని కోవింద్ కమిటీ సూచించింది. అలాగైతే జమిలి ప్రక్రియకు భంగం కలగకుండా ఉంటుందని పేర్కొంది. కానీ దీనిపైనా పలు పారీ్టలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజాతీర్పు కోరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు కొనసాగరాదనడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని వాదిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకం: ఖర్గే ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక మన దేశంలో ఆచరణ సాధ్యం కాదు. ఇలాంటి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్తకొత్త ఎత్తుగడలు వేయడం బీజేపీకి అలవాటే. ప్రజాస్వామ్య విరుద్ధమైన జమిలి ఎన్నికలను దేశ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరు’’ అది సంఘ్ పరివార్ రహస్య అజెండా ‘‘ఒకే దేశం–ఒకే ఎన్నిక అనేది దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఇది సంఘ్ పరివార్ రహస్య అజెండాలో ఒక భాగమే. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థను మార్చేసి అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని తీసుకురావాలన్నదే సంఘ్ పరివార్ అసలు కుట్ర. భారత పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనను మానుకోవాలి’’. – పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి ప్రజలంతా వ్యతిరేకించాలి సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నిర్మాణాన్ని దెబ్బతీసే జమిలి ఎన్నికలను ప్రజలంతా వ్యతిరేకించాలి. ఒకే దేశం–ఒకే ఎన్నిక ద్వారా ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ కుతంత్రాలు సాగిస్తోంది. ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే ఏం చేస్తారు? – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా వేణుగోపాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖర్చులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం పేర్కొంది. అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలుసహా 4 కొత్త కమిటీలకు చైర్మన్లుగా బీజేపీ నేతలను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికసంబంధాలకు సంబంధించి పీఏసీ, అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్రభుత్వ చేస్తున్న ఖర్చులు, ప్రభుత్వరంగ సంస్థల సమర్థ నిర్వహణ వ్యవహారాలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి. ఓబీసీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత గణేశ్ సింగ్, ఎస్సీఎస్టీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత ఫగాన్ సింగ్ కులస్తే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అంచనా కమిటీకి బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్, ప్రభుత్వ సంస్థల కమిటీకి చైర్మన్‌గా బీజేపీ నేత బైజయంతీ పాండాను నియమించారు. -
Banking Laws Amendment Bill: ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టింది. ఒక బ్యాంకు ఖాతాకు నామినీల ఎంపికను ప్రస్తుతమున్న ఒకటి నుండి నలుగురికి పెంచడంసహా పలు కీలక అంశాలకు సంబంధించిన ఈ బిల్లును లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ, సేవల విస్తృతి బిల్లు ప్రధాన లక్ష్యం. అన్‌క్టైమ్డ్ డివిడెండ్లను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదలాయించడం, బ్యాంకింగ్ పరిపాలనా, ఆడిట్ వ్యవహారాల్లో మరింత మెరుగుదలకూడా ఈ బిల్లు దోహదపడనుంది. డైరెక్టర్íÙప్లకు సంబంధించిన వడ్డీ పరిమితిని పునరి్నర్వచించటానికి సంబంధించిన అంశం బిల్లులో మరో కీలకాంశం. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచడం దీని ఉద్దేశం. 2024–25 వార్షిక బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ఈ బిల్లును గత వారం క్యాబినెట్ ఆమోదించింది. -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
వక్ఫ్ సవరణ బిల్లు.. 21 సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ ) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు. ఈ కమిటీలో దిగువసభ నుండి ప్రభుత్వ, ప్రతిపక్షం నుండి 21 మంది సభ్యులు ఉంటారని ప్రకటించారు . అదనంగా, ఈ కమిటీలో రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు కూడా ఉంటారని తెలిపారు. లోక్‌సభ నుంచి జేపీసీకి చెందిన 21 మంది సభ్యుల జాబితా ఇలా ఉంది. 1. జగదాంబిక పాల్2. నిషికాంత్ దూబే3. తేజస్వి సూర్య4. అపరాజిత సారంగి5. సంజయ్ జైస్వాల్6. దిలీప్ సైకియా7. అభిజిత్ గంగోపాధ్యాయ8. డీకే అరుణ9. గౌరవ్ గొగోయ్10. ఇమ్రాన్ మసూద్11. మహ్మద్ జావేద్12. మౌలానా మొహిబుల్లా నద్వీ13. కళ్యాణ్ బెనర్జీ14. ఎ రాజా15. లావు శ్రీ కృష్ణ దేవరాయలు16. దిలేశ్వర్ కమైత్17. అరవింద్ సావంత్18. సురేష్ గోపీనాథ్19. నరేష్ గణపత్ మ్హస్కే20. అరుణ్ భారతి21. అసదుద్దీన్ ఒవైసీ21 MPs from Lok Sabha who will be members of the JPC are - Jagdambika Pal, Nishikant Dubey, Tejasvi Surya, Aparajita Sarangi, Sanjay Jaiswal, Dilip Saikia, Abhijit Gangopadhyay, DK Aruna, Gaurav Gogoi, Imran Masood, Mohammad Jawed, Maulana Mohibullah Nadvi, Kalyan Banerjee, A… https://t.co/CFOYj0tjY6— ANI (@ANI) August 9, 2024 -
లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ మెంబర్ బిల్లు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లకు ఆమోదం తెలపాలని బిల్లులో ప్రతిపాదించారు. ఏపీ విభజన చట్టంపై సెక్షన్ 90ఏ చేర్చాలని బిల్లులో పేర్కొన్నారు.కాగా, లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు. -
వక్ఫ్ బోర్డు బిల్ పై కేంద్రం కీలక నిర్ణయం
-
జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వక్ఫ్ సవరణ బిల్లు... లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమిత్ షా Vs అఖిలేష్.. స్పీకర్ చైర్‌పై కామెంట్స్
ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీపై అఖిలేష్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ అని విమర్శించారు. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.కాగా, పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నేడు సభలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణలన్నీ కూడా కేవలం ఒక సాకు మాత్రమే. కేంద్రంలోని బీజేపీ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ప్రయోజనాల కోసం పథకం అనే దాంట్లో ఇది మరో లింక్ మాత్రమే. వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.#WATCH | Samajwadi Party MP Akhilesh Yadav speaks in Lok Sabha on Waqf (Amendment) Bill, 2024 "Yeh bill jo introduce ho raha hai woh bahut sochi samjhi rajneeti ke tehat ho raha hai...Speaker sir, I heard in the lobby that some of your rights are also going to be taken away and… pic.twitter.com/sy7PRW6I04— ANI (@ANI) August 8, 2024ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లాపై కూడా అఖిలేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మా హక్కులు, స్పీకర్ హక్కుల కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. బీజేపీ నేతలు స్పీకర్ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి జడ్డీగా వ్యవహరించే మీ హక్కులు కూడా వారే తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు. ఇక, అఖిలేష్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటరిచ్చారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ఇది స్పీకర్ చైర్‌ను అవమానించడమే. స్పీకర్ హక్కులు ప్రతిపక్షానికి చెందవు. సభ మొత్తానికి చెందుతాయి. ఇష్టానుసారం మాట్లాడకండి. మీరు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. చైర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదన్నారు. -
లోక్‌సభ ముందు వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు.. ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న మిథున్‌రెడ్డి
-
విపక్షాల తీవ్ర ఆందోళన.. జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి(జేపీసీ) పంపింది.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో గురువారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి.బిల్లును సమర్ధించుకున్న రిజిజుమైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వక్ఫ్ చట్టంలోని సమస్యలను పరిష్కరించలేకపోయినందున తమ ప్రభుత్వం సవరణలు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. ‘మీకు చేతకాకపోవడంతో ఈ సవరణలు తీసుకురావాల్సి వచ్చింది. మేం ఎన్నికైన ప్రజాప్రతినిధులం, ఈ బిల్లుకు మద్దతివ్వండి, కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందుతారు.. కొందరు వక్ఫ్ బోర్డులను కబ్జా చేశారు. సామాన్య ముస్లింలకు న్యాయం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చాం. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు మాఫియాగా మారాయని చాలామంది ప్రతిపక్ష నాయకులు నన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పారు. నేను వారి పేర్లను బహిరంగంగా చెప్పి వారి రాజకీయ జీవితాన్ని నాశనం చేయలేను’ అని రిజిజు తెలిపారు.ఇది రాజ్యాంగ విరుద్ధ బిల్లు: కాంగ్రెస్ఇది క్రూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కేంద్రం మత స్వేచ్చను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాలనే నిబంధనను ఆయన వ్యతిరేకించారు. ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి: వైఎస్సార్సీపీ ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.రాజకీయ కుట్రతోనే సవరణ బిల్లు: ఎస్పీరాజ్యంగ స్పూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. రాజకీయ కోణంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టినట్లు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. బోర్డులో సభ్యులను ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించారు. ఏ మత సంస్థలలోనూ తమ కమ్యూనిటీకి చెందని వ్యక్తులు భాగస్వామ్యంగా ఉండరని, వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతరులను చేర్చడంలో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. అంతకముందు వక్ఫ్ బోర్డులకు చెందిన భూములను సవరణల ముసుగులో విక్రయించాలని బీజేపీ భావిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘వక్ఫ్ బోర్డ్ సవరణలన్నీ కేవలం ఒక సాకు మాత్రమే. రక్షణ, రైల్వే, నాజుల్ భూముల మాదిరి వక్ఫ్ భూములను విక్రయించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు.స్టాండింగ్ కమిటీకి పంపాలి: ఎన్సీపీబిల్లును సభకు తీసుకురావడానికి ముందు ప్రభుత్వం సమగ్ర సంప్రదింపులు జరపలేదని ఎన్సీపీ(శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఇత ఉన్నపళంగా కేంద్రం ఈ బిల్లు తీసుకురావడానికి వక్ఫ్ బోర్డులో అకస్మాత్తుగా ఏమి జరిగింది అని ప్రశ్నించారు.ఇది మైనారిటీ వర్గానికి వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి విమర్శించారు. హిందూ దేవాలయాలను నిర్వహించడం క్రిస్టియన్, ముస్లింలకు సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ బషీర్, సిపిఎంకు చెందిన కె రాధాక్రిష్ణ్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు మత స్వేచ్ఛకు భంగం: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారుకాగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దీనిని తీసుకువచ్చారు. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలిపాయి. బిల్లుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయిరాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారులు, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణలు తొలగింపుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడడమే ఈ చట్టం లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్లను సవరించాలని కోరుతూ కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని, వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. అంతేగాక వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలో వివాదాస్పద అంశంగా మారింది. -
Lok Sabha: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు.కాగా, ఈరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్..వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు
ఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించే వక్ఫ్ బోర్డ్‌ల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ (ఆగస్ట్8న) కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇది కూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కేంద్రం మత స్వేచ్ఛ ఉల్లంగిస్తోందని తెలిపారు. వక్ఫ్ చట్టసవరణ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, మజ్లిస్, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించగా.. టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు ఇచ్చాయి. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును తీర్చిదిద్దింది.దీంతో పాటు సరైన ఆధారాలు లేకుండానే ఆస్తులు తమ వేనని ప్రకటించే వక్ఫ్ బోర్డు ఏకపక్ష అధికారాలకు స్వస్తి పలకనుంది. కాగా, ఒకవైపు ఈ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీయే అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా మరోవైపు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. BIG BREAKING NEWS 🚨 Union Minister Kiren Rijiju will withdraw the Waqf Properties 2014 Bill, tomorrow at 12 pm.The Bill was introduced in Rajya Sabha on 18th February 2014 during UPA-2 Govt.This will allow Modi Govt to pass new Waqf bill that strips the Board of powers to… pic.twitter.com/xOrbdA1bBg— Times Algebra (@TimesAlgebraIND) August 7, 2024 -
వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్
ఢిల్లీ: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అర్ధరాత్రి వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా, ఆకస్మిక ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.ఇక, రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ..‘వయనాడ్‌లో విషాదకర ఘటన జరిగింది. వరదల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని నేను సందర్శించాను. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది ఆచూకీ తెలియలేదు. వారి మృతదేహాలు కూడా దొరకలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. Wayanad is facing a terrible tragedy, and I urge the Union government to take the following actions:1. Support a comprehensive rehabilitation package for the affected communities2. Enhance the compensation for bereaved families3. Declare the Wayanad landslides a 'National… pic.twitter.com/TFy0IF0ZIU— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2024 వరదల కారణంగా వయనాడ్‌లో కీలక రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి, బాధితులకు పునరావాసాన్ని కల్పించాలి. ప్రకృతి విపత్తు సంక్షోభ సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో వయనాడ్‌లో సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులను ప్రశంసించారు. ఆపదలో అండగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా అభినందించారు. -
Vinesh Phogat Row: రాజకీయ రగడ
ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత అంశం.. రాజకీయ రగడకు దారి తీసింది. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్షాలు అభ్యంతరం చెబుతూ సభ నుంచి వాకౌట్ చేశాయి.వినేశ్ ఫోగట్ అనర్హతపై కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘అనర్హత అంశంలో తగు చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషాను ప్రధాని మోదీ ఆదేశించారు. ఈరోజు ఆమె బరువు 50 కిలోలు 100 గ్రాములు ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు పడింది. భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష పారిస్‌లో ఉన్నారు. ప్రధాని మోదీ ఆమెతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు’అని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆమెకు వ్యక్తిగత సిబ్బందితో సహా ప్రతి సౌకర్యాన్ని అందించిందని చెప్పారు. మరోవైపు.. క్రీడామంత్రి వివరణ ఇస్తున్న సమయంలో ఈ అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. అనంతరం నిరసనలు తెలుపుతూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.#WATCH | Union Sports Minister Mansukh Mandaviya speaks on the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024He says, "…Today her weight was found 50 kg 100 grams and she was disqualified. The Indian Olympic Association has lodged a strong… pic.twitter.com/7VkjoQQyIM— ANI (@ANI) August 7, 2024మరోవైపు.. రాజ్యసభలో కూడా వినేశ్ ఫోగట్ అనర్హత అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపట్టారు. ఇదీ చదవండి: వినేష్ ఫోగట్ అనర్హత.. కుట్రా? కఠిన వాస్తవమా?ఫోగట్‌కు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. అనంతరం రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.#WATCH | Delhi | INDIA bloc MPs stage protest at Makar Dwar of Parliament seeking justice for wrestler Vinesh Phogat after disqualification from Paris Olympics pic.twitter.com/8qZ6GqjbeT— ANI (@ANI) August 7, 2024కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు ఏం చేశారు: పంజాబ్ సీఎంవినేశ్ ఫోగట్ అనర్హతపై పంజాబ్ సీఎంభగవంత్ మాన్ సింగ్ స్పందించారు. ఆమె బరవును చెక్ చేయాల్సిన పని కోచ్, ఫిజియోథెరపిస్టులది. ఇప్పుడు అనర్హత పడింది. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులకు లక్షల్లో జీతం ఇస్తున్నారు. వారేమైనా సెలవుల కోసం అక్కడికి వెళ్లారా?’ అని మండిపడ్డారు.#WATCH | Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification, Punjab CM Bhagwant Mann says," To check her weight was the work of her coaches and physiotherapists. Now, the decision has come. This injustice should have been stopped...Did they (The Centre) fix anyone's… pic.twitter.com/0UmPHc7s4Q— ANI (@ANI) August 7, 2024 వినేశ్‌పై అనర్హత విచారకరం: రాహుల్ గాంధీ ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన వినేశ్ భారత్‌కు గర్వకారణం. సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం విచారకరం. భారత ఒలింపిక్ సంఘం ఈ నిర్ణయాన్ని గట్టిగా సవాలు చేస్తుందని ఆమెకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం’అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో అన్నారు. పట్టు వదలకుండా ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందనే నమ్మకం ఉంది. వినేశ్ దేశం గర్వించేలా చేశావు. దేశం మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోంది తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హావినేశ్ ఫోగట్ చాలా అర్హత నిబద్ధత గల క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళ. ఆమె ఒక ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించారు. ఫైనల్స్‌లో మరొక ప్రపంచ ఛాంపియన్‌తో బరిలోకి దిగాల్సింది. ఆమె అనర్హత భారతీయులందరికీ, వినేష్ ఫోగట్ మద్దతుదారులందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని అన్నారు.#WATCH | On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, TMC MP Shatrughan Sinha says, "She is a very deserving and committed athlete. She became the first Indian woman to reach the wrestling finals in the Olympics. She defeated a world champion and… pic.twitter.com/3dFMnLKOAT— ANI (@ANI) August 7, 2024అనర్హత వేటు నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. భారత దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొంటున్నారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. వినేశ్. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి. ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.వినేశ్ ఫోగట్ అనర్హత విషయంలో ఆమెకు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలు అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.సంబంధిత వార్త: వినేశ్ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ కీలక ఆదేశాలు -
కేంద్రం ఏపీకి ఇచ్చింది అప్పే.. గ్రాంట్ కాదు : మహవా
ఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర మాట్లాడారు.కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రజలను ఫూల్స్ చేయొద్దన్నారు. ఏపీకి ఇచ్చేది అప్పేనని గ్రాంట్ కాదని అన్నారు. డాలర్ల లోను కట్టాల్సిన బాధ్యత ఏపీ భవిష్యత్తు తరాలదేనని అన్నారు టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర.ఇక ఉత్తరాంధ్ర,రాయలసీమ, ప్రకాశం వంటి వెనుకబడి జిల్లాలకు గ్రాంట్లు ఇస్తామని, కానీ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవని సూచించారు. తెలివైన ఏపీ ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారంటూ ఫైరయ్యారు. -
ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్రం నిలబెట్టుకోవాలి: ఎంపీ అవినాష్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చలో భాగంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నోసార్లు ప్రధాని నరేంద్ర మోదీని కోరారని తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్న విభజన చట్టంలోని హామీని అమలు చేయాలని కోరారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను వెంటనే ప్రారంభించాలివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ అవినాష్ కోరారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతున్నా పేదలు-ధనికుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని అన్నారు. పేదలు ధనికులుగా మారినప్పుడే ఇది అర్థవంతంగా ఉంటుందన్నారు. 10 శాతం మంది ధనికుల చేతుల్లో 77 శాతం దేశ సంపద ఉంటే.. 90% జనాభా చేతిలో 23% సంపద మాత్రమే ఉందని తెలిపారు. ఈ అంతరాలను తొలగించేందుకు ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.‘దేశంలో ఆదాయపు పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భీమా 25 వేలకే ఐటిడి కింద పరిమితం చేశారు. కానీ రోజురోజుకు వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్య బీమాను లక్ష రూపాయల వరకు మినహాయించాలి. కొత్త పన్ను విధానం వల్ల ప్రజలు ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. చేనేతకారులు ఉపయోగించే ముడి సరుకులపై ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలి. ఫిషింగ్ నెట్స్ పై జిఎస్టిని రద్దు చేయాలి. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ యంత్రాలపై జిఎస్టిని మినహాయించాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా లపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించాలి’ అని తెలిపారు. -
పార్లమెంట్లో వర్షపు నీరు లీకేజీ!.. కాంగ్రెస్ వాయిదా తీర్మానం
పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీకేజీ కావడం.. ఆ వీడియోలు కాస్త నెట్టింటకు చేరడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వానకు రాష్ట్రపతి ఛాంబర్ దగ్గరి లాబీలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. అయితే.. ఈ లీకేజీపై పార్లమెంట్ నిర్వాహణ అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు కిందటి ఏడాది మే నెలలో సన్సద్ భవనం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ భవనం.. అందులో హంగుల కోసం 1,000 కోట్ల రూపాయల్ని వెచ్చించారు. అయితే.. ప్రస్తుతం వాటర్ లీకేజీ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ వాటర్ లీకేజీ అంశాన్ని సభలో చర్చించాలని భావిస్తోంది. ఈ మేరకు.. వాటర్ లీకేజీ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ విప్ మాణిక్కం ఠాగూర్.. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. Paper leakage outside, water leakage inside. The recent water leakage in the Parliament lobby used by the President highlights urgent weather resilience issues in the new building, just a year after completion. Moving Adjournment motion on this issue in Loksabha. #Parliament pic.twitter.com/kNFJ9Ld21d— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 1, 2024 -
ప్రధానిపై సభాహక్కుల తీర్మానం
న్యూఢిల్లీ: విపక్షనేత రాహుల్ గాందీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం మరో మలుపు తీసుకుంది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. సభా నియమావళి రూల్–222 కింద ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇస్తున్నట్లు చన్నీ తెలిపారు. మంగళవారం అనురాగ్ ఠూకూర్ లోక్‌సభలో మాట్లాడుతూ.. తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. దీనిపై విపక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ‘నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలిగించిన వ్యాఖ్యలను ప్రచురించడం సభాహక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు కూడా దీన్నే ధృవకరించింది’ అని చన్నీ తెలిపారు. ‘ అయితే అనురాగ్ తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని అన్నపుడు ఎవరి పేరునూ తీసుకోలేదని, ఈ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించలేదని, దీని ఆధారంగా చన్నీ ఇచ్చే నోటీసు పరిగణనకు రాకపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌లో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ‘తప్పకుండా వినాల్సినది. వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని కితాబిచ్చారు. అనురాగ్ వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. -
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో బుధవారం శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌధరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల తరగతుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి భారీగా పెరిగిపోతుంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదు అని వెల్లడించారు.గతంలో ఎంపీల కోటాలో భాగంగా కేవీల్లో ఒక ఎంపీ గరిష్ఠంగా 10మంది పిల్లలను సిఫార్సు చేయొచ్చు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికి కలిపి 7880 మంది విద్యార్ధులను కేవీల్లో చేర్పించే అధికారం ఉండేది. ఇలా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది. -
కుల గణన: అఖిలేష్ విమర్శలకు అనురాగ్ ఠాకూర్ కౌంటర్
ఢిల్లీ: లోక్‌సభలో కులగణనపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇతరు కులాన్ని ఎలా అడుగుతారు? అని మండిపడ్డారు. కులం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదని విమర్శలు చేశారు.తాజాగా అఖిలేష్ యాదవ్ విమర్శలను బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తిప్పికొట్టతారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా గతంలో అఖిలేష్ మాట్లాడిన రెండు వీడియోలు పోస్ట్ చేసి విమర్శలు చేశారు. రెండు వీడియోల్లో ఒకటి.. ఓ జర్నలిస్ట్‌ను అఖిలేష్.. అతని కులం ఏంటి? అని అడుగుతారు. మరో వీడియోలో లోక్‌సభలో కులం అంశంపై ప్రసంగిస్తారు. ఈ వీడియోలకు మీరు(అఖిలేష్ యాదవ్) ఎలా కులం గురించి అడుగుతారు? అని అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేశారు.जाति कैसे पूछ ली अखिलेश जी ? pic.twitter.com/uaFujlDWrD— Anurag Thakur (@ianuragthakur) July 31, 2024 లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బుధవారం సైతం లోక్‌సభలో గందరగోళం చోటు చేసుకుంది. అనురాగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నినాదాలు చేశారు. మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’వ్యాఖ్యలను మంగళవారం ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు.. రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. -
Parliament Session: లోక్‌సభలో కులకలం
న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’ వ్యాఖ్యల తాలూకు వేడి లోక్‌సభలో మంగళవారం కూడా కొనసాగింది. ప్రభుత్వం తరఫున మాట్లాడిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వాటిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ తన ప్రసంగం పొడవునా ఆరితేరిన వక్తనని నిరూపించుకునేందుకు పాకులాడారని ఎద్దేవా చేశారు. ‘‘అందుకోసం అంకుల్ శామ్ (కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా) నుంచి తెచ్చుకున్న అరువు జ్ఞానాన్ని ప్రదర్శించారు. రాహుల్ రియల్ పొలిటీషీయన్ కాదు. కేవలం వీడియోల కోసమే ప్రసంగాలిచ్చే రీల్ పొలిటీషియన్. బహుశా విపక్ష నేత (ఎల్ఓపీ) అంటే దు్రష్పచార సారథి (లీడర్ ఆఫ్ ప్రాపగాండా) అని అపార్థం చేసుకున్నట్టున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కొందరు పేరుకు మాత్రమే హిందువులు. మహాభారతంపై వారికున్నది కూడా మిడిమిడి జ్ఞానమే’’ అంటూ రాహుల్‌ను ఠాకూర్ ఎద్దేవా చేశారు. ఆ క్రమంలో ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేగింది. అవి రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ఒక వ్యక్తి కులం గురించి ఎలా మాట్లతాడతారంటూ సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఠాకూర్ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. దాంతో ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తర్వాత రాహుల్ మాట్లాడు తూ ఠాకూర్ వ్యాఖ్యలు తనకు ఘోర అవమానమన్నారు. ‘‘దళితులు, వెనకబడ్డ వర్గాల హక్కుల కోసం ఎవరు పోరాడినా ఇలాంటి అవమానాలు భరించాల్సిందే. అందుకే నన్నెంత తిట్టినా, అవమానించినా పట్టించుకోను. క్షమాపణలూ కోరబోను. అర్జునుడు పక్షి కన్నుపైనే దృష్టి పెట్టినట్టు నా దృష్టినంతా కులగణనపైనే కేంద్రీకరించాను. పోరు ఆపబోను. విపక్ష ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా కులగణన చేయించి తీరుతుంది’’ అని ప్రకటించారు. మీకో వైఖరే లేదు దళితులు, ఓబీసీల వెనకబాటుకు 1947 నుంచి దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెసే కారణమని ఠాకూర్ ఆరోపించారు. ఎన్ (నెహ్రూ), ఐజీ (ఇందిరాగాంధీ), ఆర్జీ1 (రాజీవ్‌గాం«దీ) అంటూ గాంధీ కుటుంబానికి చెందిన మాజీ ప్రధానులందరిపైనా విమర్శలు చేశారు. కాంగ్రెస్ దృష్టిలో ఓబీసీలు అంటే ఓన్లీ బ్రదర్–ఇన్–లా కమీషన్ అంటూ రాహుల్ బావ రాబర్ట్ వద్రాను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు. ‘‘కులగణనపై కాంగ్రెస్‌కు ఓ వైఖరంటూ ఉందా? రాహుల్ కులగణన కావాలంటున్నారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ మాత్రం ఓబీసీలకు రిజర్వేషన్లను వ్యతిరేకించారు. బోఫోర్స్ మొదలుకుని కామన్వెల్త్ క్రీడలు, 2జీ, గడ్డి, యూరి యా, బొగ్గు, నేషనల్ హెరాల్డ్... ఇలా కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలకు అంతే లేదు’’ అంటూ దుయ్యబట్టారు. -
మోదీ చక్రవ్యూహంలో దేశం. అంబానీ, అదానీలకే దోచిపెడుతోందని లోక్‌సభలో రాహుల్ గాంధీ ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బీజేపీ విప్‌గా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. డాక్టర్ సంజయ్ జైస్వాల్‌ను పార్టీ చీఫ్ విప్‌గా నియమించగా.. విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మొత్తం 16 మందికి లోక్‌సభలో విప్‌లుగా అవకాశం కలి్పంచారు.ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి డాక్టర్ శివ్ శక్తినాథ్ బక్షి సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందజేశారు. -
ఏపీకి అప్పులు కాదు... అభయం ఇవ్వండి
-
బీజేపీ ప్రభుత్వం వల్ల అంబానీ,అదానీలకే లాభం : రాహుల్ గాంధీ
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ బడ్జెట్‌పై ప్రసంగించారు. కురుక్షేత్రంలో అభిమన్యుడిని బంధించి చంపారు. పధ్మవ్యూహలాంటి కమలం పార్టీ రూపంలో దేశంలో అధికారంలో ఉందని వ్యాఖ్యానించారు. కాబట్టే రైతులు కార్మికులు భయపడుతున్నారు. వారే కాదు.. దేశంలోని అన్నీ వర్గాలను బీజేపీ బయపెడుతోందని వ్యాఖ్యానించారు.అప్పుడు ఫద్మవ్యూహాన్ని ఆరుగురు కంట్రోల్ చేశారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే రాహుల్ ప్రసంగంపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా సైతం రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడాలంటూ అభ్యంతరం తెలిపారు. #WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "My expectation was that this Budget would weaken the power of this 'Chakravyuh', that this Budget would help the farmers of this country, would help the youth of this country, would help the labourers, small business of this country. But… pic.twitter.com/t5RaQn4jBq— ANI (@ANI) July 29, 2024రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే 👉రాజకీయ ఏకస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది. 👉ట్యాక్స్ టెర్రరిజం ఆపేందుకు కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు.👉బీజేపీ ప్రభుత్వం వల్ల అదానీ, అంబానీలకే లాభం👉ఇంటర్న్‌షిప్‌ల వల్ల యువతకు ఒరిగేదేం లేదు.👉కాళ్లు విరగొట్టి బ్లాంకెట్ వేసినట్లుంది👉అగ్నివీరులను కేంద్రం మోసం చేస్తోంది👉బడ్జెట్లో అగ్నివీర్ల పెన్షన్‌కు బడ్జెట్లో ఒక్కరూపాయి కేటాయించలేదు. 👉రైతు సంఘాలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు👉రైతులు పంటలకు కనీస మద్దతు కావాలను కోరుతున్నారు.. రైతుల విషయంలో ఇప్పటికీ కేంద్రం స్పష్టతలేదు👉కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల్ని పట్టించుకోవడం లేదు👉పదేళ్లలో 70 సార్లు ప్రశ్న పత్రాన్ని లీక్ చేశారు👉పేపర్ లీకేజీతో యువత నష్టపోయారు👉విద్య పైన కేవలం అతి తక్కువగా 2.5% బడ్జెట్ మాత్రమే కేటాయించారు 👉ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేవు -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో రచ్చ.. కేంద్రమంత్రి రిప్లై
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మృతి అంశం లోక్‌సభను కుదిపేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ప్రమాదంలో యూపీఎస్సీ విద్యార్ధుల మరణాలను ప్రస్తావిస్తూ దేశంలో కోచింగ్ సెంటర్లు ఓ మాఫియాలా తయారయ్యాయని మండిపడ్డారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల పట్ల వివక్ష చూపడం కలిగిస్తోందన్నారు.‘2023లో రాజ్యసభలో ఓ మంత్రి పెరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యపై సమాధానం ఇచ్చారు, 2018 నుంచి 2022 వరకు ఐఐటీలు, ఐఐఎంలతో సహా ఉన్నత విద్యాసంస్థల్లో సుమారు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇందుకు అక్కడ నెలకొన్న కుల వివక్ష ప్రధాన కారణాలలో ఒకటి.. దీనీనీ తక్షణమే పరిశీలించాలి.దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లలో భద్రత, నియంత్రణ సమస్యలను వేణుగోపాల్ ప్రస్తావించారు. నిన్నగాక మొన్న న్యూఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ కోచింగ్ సరైన అనుమతి, తగిన సౌకర్యాలు లేకుండా పనిచేస్తోందని మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. కొన్ని కోచింగ్ సెంటర్లు 'మాఫియా'లుగా మారాయి. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా?’’ అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా వారి శారీరక- మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవినెత్తిన ఈ ప్రశ్న నేటి చర్చకు సంబంధించినది కాదు. కానీ కోచింగ్ సెంటర్, పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, ఇన్స్టిట్యూట్లు ఇలా విద్యార్ధులు ఎక్కడ చదువుతున్నప్పటికీ వారి శారీరక, మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను అని పేర్కొన్నారు.కాగా కోచింగ్ సెంటర్లకు సంబంధించి కేంద్రం జనవరిలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు సమగ్రమైన, వివరణాత్మక మార్గదర్శకాలు అందించింది. అయితే రాజస్థాన్, బీహార్, గోవా మొదలైన రాష్ట్రాలు తమ సొంత నిబంధనలను కలిగి ఉన్నాయి. కాగా ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నిర్వహిస్తున్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్‌లోని ఓ భవనం బేస్మెంట్లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద చేరడంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. -
Parliament: కోచింగ్ వ్యాపారంగా మారిపోయింది: రాజ్యసభ చైర్మన్
Updatesరావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా విషాదకరం.ఒక తెలివైన అభ్యర్థి సివిల్స్ సాధించి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వస్తారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు చాలా కలలు కంటారు. కానీ, ఇలాంటి ఘటనలు వారి హృదాయాన్ని ముక్కలు చేస్తాయి. నష్టపరిహాం ఇచ్చే విషయమే అయినా.. ఎంత నష్టం పరిహారం ఇచ్చినా అభ్యర్థులు కోల్పోయిన జీవితానికి తిరిగి ఇవ్వలేం. ఇటవంటి ఘటనలు జరగకుండా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. భవనం కోడ్లు, అగ్నిమాపక భద్రత, వరద భద్రత వంటి విషయాల్లో ప్రాథమిక నిబంధనల ఉల్లంఘిస్తున్నారు.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, Congress MP Shashi Tharoor says, "It's a shocking situation and I have to say that when you have a brilliant student all the dreams of serving the nation through the UPSC exam have been shattered and the hopes… pic.twitter.com/gAv9wTJGsu— ANI (@ANI) July 29, 2024 రావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. ఈ ఘటనకు ప్లాన్, ఎన్ఓసీ ఇచ్చిన అధికారులే బాధ్యత వహించాలి. దీనంతటికీ అసలు ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారులుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఒకే అక్రమం భవనం కాదు. యూపీలో అక్రమ భవనాలను బుల్డోజర్తో కూల్చటం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఢిల్లీలో బుల్డోజర్తో చర్యలు చేపడుతుందా? లేదా?అని ప్రశ్నించారు.#WATCH | Old Rajinder Nagar incident | "It's a painful incident. It's the responsibility of the officers to plan and provide NOCs, the question is who all are responsible and what actions are being taken against them. It's not just a single case of illegal building, we are seeing… pic.twitter.com/JH7gXphzGg— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ భానుశ్రీ స్వరాజ్ మాట్లాడారు. సివిల్స్ ప్రివేర్ అవుదామని ఢిల్లీకి వచ్చిన అభ్యర్థుల మృతికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ పాలన యంత్రాంగం నిర్లక్ష్యంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. వరదల విషయంలో రాజేంద్ర నగర్ ప్రాంత ప్రజలు ఎన్నొసార్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై హోం మంత్రిత్వ శాఖ ఓ కమిటి ఏర్పాటు చేసిన దర్యాప్తు చేయలని కోరుతున్నా.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, BJP MP Bansuri Swaraj says, "...Those students were in Delhi for the preparation of IAS examinations, but sadly I have to say that due to criminal negligence of Delhi govt, those students have lost their… pic.twitter.com/2alk7SPBDH— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. నాకు రూల్ 267 కింద నోటీసులు అందాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల విషాద మరణంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.‘‘కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయి. ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయి. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నాం. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్‌ఛాంబర్ మీటింగ్ ఏర్పాటుచేయాలి’’ అని ధన్‌ఖడ్ అన్నారు. #WATCH | Delhi's Old Rajinder Nagar incident | Rajya Sabha to have a discussion on the death of 3 UPSC aspirants. Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I have received notices under Rule 267...They have demanded a discussion on the tragic death of UPSC… pic.twitter.com/MyEezLrlKh— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో శివసేన(యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ నోటీసులు ఇచ్చారు. మహారాష్ట్రలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు.Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi gives Suspension of Business notice under Rule 267 in Rajya Sabha, over alleged rampant corruption in infrastructure projects in Maharashtra. pic.twitter.com/VS3wL6XRXO— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ ఘటనపై దద్దరిల్లనున్న పార్లమెంట్కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని, సభలో వివరణ ఇవ్వాలని కోరారాయన. Congress MP Dr Amar Singh moves Adjournment Motion in Lok Sabha 'demanding accountability for death of IAS aspirants in Delhi’s coaching centre' pic.twitter.com/4k1cdh4nB9— ANI (@ANI) July 29, 2024 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో జమ్ము కశ్మీర్ అప్రోప్రియేషన్ (నం 3) బిల్లును ఇవాళ ప్రవేశపెట్టనున్నారుNirmala Sitharaman to move J-K Appropriation (No 3) Bill in Lok Sabha; Budget discussion to continue in Parliament todayRead @ANI Story | https://t.co/WKrumWYWrp#BudgetSession #NirmalaSitharaman #LokSabha pic.twitter.com/zDkjVNcTpA— ANI Digital (@ani_digital) July 29, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి, భారీ వాణిజ్య లోటుపై చర్చను డిమాండ్ చేశారు.#ParliamentMonsoonSession | Congress MP Manish Tewari gives adjournment motion notice in Lok Sabha, demands discussion on "the border situation and huge trade deficit with China." pic.twitter.com/G7VJolxgx0— ANI (@ANI) July 29, 2024 నేడు లోక్‌సభ, రాజ్యసభ బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చలో ఇవాళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. జూలై 22న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. -
స్పీకర్‌కు లేఖ.. ప్రతిపక్ష ఎంపీలపై బెదిరింపు వ్యాఖ్యలు: గౌరవ్ గోగొయ్
ఢిల్లీ: ప్రతిపక్షనేతలపై మంత్రులు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విసయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మంత్రుల పార్లమెంటరీ ప్రవర్తన ప్రమాణాలు దిగజారాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రవ్నీత్ సింగ్ బిట్టు అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపు దోరణితో వ్యహరించారని ఆరోపణలు చేశారు. ఈవిషయంలో లోక్‌సభ స్పీకర్ వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పార్లమెంట్ సభ్యులపై చేస్తున్న పలు అభ్యంతరకమైన సేట్మెట్లు చేసస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.‘ ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లోని ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచుగా అధికార మంత్రులే ప్రతిపక్ష పార్టీల సభ్యులపై అన్‌పార్లమెంటరీ, అభ్యంతరకర, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కాని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై జూలై 26న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. జూలై 25న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు అన్ పార్లమెంటరీ భాషలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే సభలో మతపరమైన భాష ఉపయోగిస్తూవ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ సంఘటనలు జరిగినప్పుడు తన సభ్యులను అదుపు చేయలేదు అని లేఖలో పేర్కొన్నారు. -
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్‌సింగ్ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
చట్టబద్ధత కోసం తీవ్ర ఒత్తిడి తెస్తాం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సాధన కోసం మోదీ సర్కార్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తామని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. బుధవారం పార్లమెంట్ భవన కాంప్లెక్స్‌లో రాహుల్‌ను రైతు సంఘాల నేతలు కలిశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన 12 మంది రైతునేతల బృందం రాహుల్‌తో సమావేశమై రైతాంగ సమస్యలపై చర్చించారు. ‘‘ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. పూర్తిస్థాయి సమీక్ష తర్వాతే ఇది ఆచరణ సాధ్యమని చెప్పాం. ఈ విషయమై రైతునేతలతో కాంగ్రెస్ చర్చించింది. ఇక ‘ఇండియా’ కూటమి నేతలతో సమాలోచనల జరిపి ఎంఎస్పీ చట్టబద్ధత కోసం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తాం’ అని భేటీ తర్వాత రాహుల్ చెప్పారు. -
Parliament Budget Session 2024: కేంద్ర బడ్జెట్‌పై సభా సమరం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై అధికార, విపక్షాల తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. సమాఖ్య స్ఫూర్తికి, పేదలకు బడ్జెట్ ఫక్తు వ్యతిరేకంగా ఉందంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. అధికార ఎన్డీఏ కూటమి భాగస్వాములను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ సర్కారు పరిమితమైందని ఆరోపించాయి. రాజ్యసభ, లోక్‌సభ సమావేశం కాగానే బడ్జెట్ కేటాయింపులపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. సభాపతులు అందుకు నిరాకరించడంతో ఉభయ సభల నుంచీ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. కుర్చీ కాపాడుకునే బడ్జెట్! ‘‘బడ్జెట్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు పకోడా, జిలేబీ దక్కాయి. మిగతా రాష్ట్రాలన్నింటికీ మోదీ మొండిచేయి చూపారు’’ అంటూ రాజ్యసభలోవిపక్ష నేత ఖర్గే దుయ్యబట్టారు. ఇతర కార్యకలాపాలను పక్కన పెట్టి ముందుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ నోటీసులిచ్చారు. వాటన్నింటినీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ‘కేవలం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన బడ్జెట్’, ‘కురీ్చని కాపాడుకునే బడ్జెట్’ అంటూ నినాదాలకు దిగారు. బడ్జెట్ కేటాయింపులు విపక్షపూరితమంటూ విపక్ష ఎంపీలు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ అంశాన్నే ముందు చర్చకు చేపట్టాలంటూ సభలో పదేపదే డిమాండ్ చేశారు. వారి తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహించారు. బైఠాయించి ఎవరినీ లోనికి రానీయకపోవడం ఏం పద్ధతని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బి.మహతాబ్ బడ్జెట్‌పై చర్చ ప్రారంభించారు. నయా మధ్యతరగతిని సాధికారతకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్న ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యురాలు కుమారి సెల్జా తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్ ఎవరి కోసమో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ‘ఇది వికసిత్ బడ్జెట్ కాదు, విచలిత్ బడ్జెట్’ అంటూ ఎద్దేవా చేశారు. తుమ్మితే ఊడేలా ఉన్న సంకీర్ణానికి మోదీ సారథ్యం వహిస్తున్నారంటూ తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు. అందుకే కీలక ఎన్డీఏ భాగస్వాములను తృప్తి పరిచేందుకు బిహార్, ఏపీలకే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలు తృణమూల్ పాలిత పశి్చమబెంగాల్కే వర్తిస్తాయంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. దయానిధి మారన్ (డీఎంకే), సుప్రియా సులే తదితరులు బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. విపక్ష సభ్యులనుద్దేశించి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన విమర్శలు వివాదమయ్యాయి. దాంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల నిరసన కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. దేశ సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్ సహా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.నిర్మల మాతాజీ! ఖర్గే సంబోధన కూతురన్న ధన్‌ఖడ్ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సంబోధనల సంవాదం జరిగింది. చాలా రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరణ ఇచ్చేందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. దాంతో ఖర్గే ఆగ్రహించారు. నిర్మలను ఉద్దేశించి, ‘‘మాతాజీ! మీరు మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు. కానీ ముందుగా దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి’’ అన్నారు. మాతాజీ సంబోధనపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆర్థిక మంత్రికి 64 ఏళ్లు. మీకు 82. ఆమె మీకు మాతాజీ కాదు, కూతురి వంటిది’’ అన్నారు. అనంతరం ఖర్గే చర్చను కొనసాగిస్తూ నిర్మల కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున బడ్జెట్లో ఆ రాష్ట్రానికి ఎంతో ఇస్తారనుకుంటే అసలేమీ ఇవ్వలేదంటూ ఎత్తిపొడిచారు. -
వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్..
-
‘హిందీయేతర ప్రసంగాలపై వివక్ష’.. ఖండించిన సంసద్ టీవీ
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను ప్రసారం చేసే ‘సంసద్ టీవీ’ హిందీలో మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సోమవారం ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై తాజాగా సంసద్ టీవీ స్పందించింది.‘ఎంపీ సుప్రియా సూలే చేసిన ఆరోపణలు సత్యం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలను ఎంపీలు మాట్లాడిన భాషలోనే ప్రసారం చేస్తున్నాం. అయితే వినేవారి సౌలభ్యం కోసం హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ భాషల్లో వినే ఆప్షన్ కల్పించాం. ఎంపీలు కూడా సభలో కూర్చొని.. పార్లమెంట్ కార్యకలాపాలను వినవచ్చు’అని ‘ఎక్స్’లో పేర్కొంది.సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రరంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల ప్రచారంలో సంసద్ టీవీ హిందీ మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపణలు చేశారు.‘పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ తొలి సెషన్లోనే సంసంద్ టీవీ ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలను హిందీ వాయిస్ ఓవర్ ఇస్తోంది. ఇలాంటి భయంకరమైన చర్యలకు సంసద్ టీవీ పాల్పడుతోంది. సంసద్ టీవీ హిందీలో ప్రసంగించని ఎంపీలపై వివక్ష చూపుతోంది. ఇతర భాషలతో పోల్చితే.. ఒక భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలా చేయటం భారత సమాఖ్యవాదాన్ని సవాల్ చేయటమే...ప్రాంతీయ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలకు హిందీ వాయిస్ ఓవర్ ఇవ్వటం, సెన్సార్షిప్ విధించటం వల్ల హిందీ మాట్లాడనివారి హక్కులను కాలరాయటమే. ప్రభుత్వం వెంటనే ఇలా ప్రసారం చేయటాన్ని నిలిపివేయాలి. ఇది పూర్తి వివక్ష, సమాఖ్యవాద వ్యతిరేక విధానం’అని ఆరోపణలు చేశారు.2023లో కూడా సంసద్ టీవీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడే క్రమంలో అధిక శాతం స్పీకర్‌ను చూపించారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వంగా విపక్షాల స్క్రీన్ టైంను సంసద్ టీవీ తగ్గించి ప్రసారం చేసినట్లు ఆరోపణులు చేశారు. -
కేరళ విదేశాంగ కార్యదర్శి నియామకంపై రాజకీయ దుమారం
ఢిల్లీ: కేరళ ప్రభుత్వం నియమించిన విదేశాంగ కార్యదర్శి వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటంపై బీజేపీ ఎంపీ పీపీ చౌదరీ సోమవారం లోక్‌సభలో విమర్శలు చేశారు.‘కేరళ రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటం రాజ్యాంగ విరుద్ధం. ఇలా చేయటం కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కేరళ ప్రభుత్వం తమను మాకు ప్రత్యేక దేశంగా భావిస్తోందా?. విదేశాంగ శాఖ సహకారం, సమన్వయం అంటే వివిధ దేశాలతో సంబంధాలు పెంచుకోవటం. ..కేంద్ర జాబితాలో భాగంగా విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు, మిషన్లుతో సత్సంబంధాలతో ఏర్పర్చుకునే విధులు. కేరళ ప్రభుత్వం విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటం కేంద్ర ప్రభుత్వానికి, యూనియన్ జాబితాకు కేటాయించిన అంశాలను ఉల్లఘించినట్లు అవుతుంది’అని విమర్శలు చేశారు.జూలై 15న కేరళ ప్రభుత్వం లేబర్, స్కిల్స్ డిపార్టుమెంట్ సెక్రటరీకి విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ చీఫ్ తీవ్రంగా ఖండించారు.చదవండి: ‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు -
Rahul Gandhi: ధనికులైతే చాలు పరీక్ష విధానాన్నే కొనేయొచ్చు
న్యూఢిల్లీ: ధనికులైతే చాలు పరీక్షా విధానాన్నే కొనేయొచ్చంటూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా విపక్షనేత రాహుల్‌గాంధీ ప్రభుత్వం తీవ్ర విమర్శలుచేశారు. గత ఏడేళ్లలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఆధారాలు లేవంటూ లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడంతో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ నీట్ పేపర్ లీకేజీ ఉదంతంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వీయతప్పిదాన్ని ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరిపై నిందలేస్తూ తప్పుబడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే కనీస అవగాహన కూడా ఆయనకు లేనట్లుంది. వరస లీకేజీలతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిందని కోట్లాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో పరీక్షల నిర్వహణ అనేది ఒక మోసపూరిత వ్యవహారమని అభ్యర్థులు ఒక నిర్ణయానికొచ్చారు. ధనికులైతే చాలు పరీక్షావిధానాన్నే కొనేయొచ్చు అనే పరిస్థితి నెలకొంది. ఈ తప్పు వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు మీ వంతుగా ఎలాంటి కృషిచేస్తున్నారు?’ అని మంత్రిని రాహుల్ నిలదీశారు. దీంతో మంత్రి ప్రధాన్ మాట్లాడారు. ‘‘ మొత్తం పరీక్ష విధానమే నిష్పలం అన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరం. ఏడేళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ చెబుతున్నదంతా అబద్ధం. నిజానికి ఎన్టీఏను స్థాపించాక 240కిపైగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాం. ఐదు కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకున్నారు. 4.5 కోట్ల మంది వివిధ పరీక్షలు రాశారు’’ అని మంత్రి చెప్పారు. దీంతో ఠాకూర్ కలగజేసుకుని ‘‘ పేపర్ లీకేజీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ఎలాంటి నిర్ణయాలు ఆచరణలో పెడుతున్నారో మంత్రి చెప్పాలి. లేదంటే రాజీనామా చేయాలి’ అని అన్నారు. దీంతో మంత్రి స్పందించారు. ‘‘ ఇక్కడ మాలో ఏ ఒక్కరో జవాబుదారీ కాదు. ఏం జరిగినా ప్రభుత్వం మొత్తం జవాబుదారీగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ‘‘పేపర్ లీకేజీల విషయంలో మోదీ సర్కార్ రికార్డ్ సృష్టించనుంది. ఒకే చోట రాసిన వారిలో ఎక్కువ మందికి అత్యధిక మార్కులు వచ్చిన పరీక్షకేంద్రాల జాబితాను విడుదలచేయాలి’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్‌చేశారు. అనంతరం టీఎంసీ, డీఎంకే సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. -
పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య: రాహుల్ గాంధీ
-
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి
న్యూఢిల్లీ: ఆధార్ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్డీఏ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్‌ను సోమవారం విచారించింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్ లోక్‌సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్‌లో సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. ఆధార్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
సభాపతులే పక్షపాతం ప్రదర్శిస్తే..!
స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను తెంచుకోవడం ద్వారా స్పీకర్ స్థానానికి విఠల్‌భాయ్ పటేల్ ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ఇచ్చారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు, జి.వి. మావలంకర్ ‘కాంగ్రెస్‌వాడిని అయినప్పటికీ... నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’ అన్నారు. 1956లో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎం.ఏ. అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1970ల నాటికి లోక్‌సభ స్పీకర్ నిష్పాక్షికత బలహీనపడటం మొదలైంది. ఇక ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.స్పీకర్ అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం నిష్పక్షపాతంగా ఉంటారు. అన్ని అంశా లను నిర్ణయించే ముఖ్యమైన న్యాయపరమైన విధులను స్పీకర్‌కు సభ వదిలివేయవచ్చు.– సర్ ఐవర్ జెన్నింగ్స్,పార్లమెంట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 195718వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 24న సమావేశమైనప్పుడు, బీజేపీ మెజారిటీని కలిగి ఉన్న 16వ, 17వ లోక్‌సభలలో రాజకీయ పార్టీలు విడిచిపెట్టిన చోట నుండే పక్షపాతం తిరిగి ప్రారంభమైంది. సహజంగానే, లోక్‌సభ స్పీకర్‌కు పోటీ, ‘ఎన్నిక’, సభ తదుపరి కార్యకలాపాల నిర్వహణ వంటివి ‘నిష్పక్షపాతానికి’ చాలా దూరంగా ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంట్ గురించిన తన విశిష్ట అధ్యయనంలో సర్ జెన్నింగ్స్ ఇలాంటి స్థితి గురించి వివరంగా నమోదు చేశారు.వాస్తవానికి, రాజ్యాంగానికి తగిన గౌరవం ఇవ్వకపోగా, దాని సంప్రదాయాన్ని కూడా పక్కనపెట్టి, పార్లమెంటును తన కట్టడిలోనే పనిచేసేలా చూస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నొక్కి చెప్పింది. లోక్‌సభ, శాసనసభలలో రాజ్యాంగం అమలైనప్పటినుండి కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి, సభలోని అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే వెస్ట్‌మినిస్టర్ నమూనాకి చెందిన పురాతన సంప్రదాయానికి ఈసారి తిలోదకాలు ఇచ్చేశారు. సంప్రదాయం ప్రకారమైతే ఆ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీకి కేటాయించాల్సి ఉండింది. కానీ ఈసారి పార్లమెంటులో బీజేపీకి చెందిన రెండో సీనియర్ సభ్యునికి ప్రొటెం స్పీకర్ పీఠం దక్కింది. సహజంగానే, ‘మా ఎంపికను అంగీకరించడమే ఏకాభిప్రాయం’ అనే రాజకీయ ప్రకటనలో, ఏకాభిప్రాయం కోసం ఏదైనా ప్రతిపక్ష సూచనను ఆశించే, ఆమోదించే అవకాశమే లేదు. ఈ ఏడాది లోక్‌సభలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సంపూర్ణ మెజారిటీని ప్రజలు లాక్కుని ఆ పార్టీ బలాన్ని 303 సీట్ల నుంచి 240కి తగ్గించారు. ఎన్నికలకు ముందు ఎన్ డీఏ ఏర్పర్చుకున్న కొత్త మిత్రుల దన్నుతో 293 మంది ఎంపీలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 99 సీట్లతోనూ, విస్తృత ప్రాతిపదికన ‘ఇండియా’ కూటమి 234 సీట్లతోనూ తిరిగి రావడం వల్ల, తమను తాము నొక్కి చెప్పు కోగల ప్రతిపక్షంతో, ట్రెజరీ బెంచ్‌లను సర్దుబాటు చేసే కథను పూర్తి చేశాయి. ప్రతిపక్ష నేత కార్యాలయం రాహుల్ గాంధీని ముందుకు నడిపింది.ఏది ఏమైనప్పటికీ, స్పీకర్ పదవికి పోటీని మొదట ప్రతిపాదించినప్పటికీ, భారతదేశం ఎక్కువగా అనుసరించే వెస్ట్‌మిన్ స్టర్ సంప్ర దాయం ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయి స్తారని ఆశించిన ఇండియా కూటమి... ఎన్డీఏ ఎంపిక మేరకు (మోదీ ఎంపిక అని భావించాలి) మునుపటి స్పీకర్ ఓం బిర్లాకు మద్దతు ఇచ్చింది. కానీ ప్రతిపక్షాలకు ఈ ప్రత్యేక పదవిని నిరాకరించడానికి, పదేళ్లపాటు ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. దీనిపై ఇప్పటికీ మౌనం కొనసాగించడం అరిష్టదాయకం అనే చెప్పాలి.హౌస్ ఎక్స్–అఫీషియో ఛైర్మన్ అయిన భారత ఉపరాష్ట్రపతిని ఒక వ్యవస్థ ఎన్నుకున్నప్పుడు రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారి ఎవరనే ప్రశ్న పరిష్కరించబడుతుంది. దీనిని తప్పనిసరి చేసే ఆర్టికల్ 89, సభ్యుల నుండి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను కూడా తప్పనిసరి చేస్తుంది. ప్రతిపక్షా లకు ఈ పదవిని కల్పించేందుకు రాజ్యాంగపరమైన నిబంధన కానీ, సంప్రదాయం కానీ లేవు. అయితే, 1952 నుండి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష ఎంపీ ఈ పదవిని అలంకరించారు.‘ఒకసారి స్పీకర్‌ను నియమించిన తర్వాత, ఆయన తన పార్టీ స్వభావానికి దూరంగా ఉంటాడనీ, అలాగే తనను నియమించిన వారిని సమర్థించకుండా ఉంటాడనీ’ బ్రిటన్ సంప్రదాయాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను విఠల్‌భాయ్ పటేల్ తెంచుకున్నప్పుడు, 1926లో తన పార్టీ శాసనసభ్యులతోపాటు వాకవుట్ చేయడానికి నిరాకరించినప్పుడు వెస్ట్ మినిస్టర్ వ్యవస్థ సంప్రదాయా లకు కట్టుబడి భారతదేశం ఆరోగ్యకరమైన అభ్యాసాన్ని ప్రారంభించింది. విఠల్‌భాయ్ పటేల్ 1927లో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు, జి.వి.మావలంకర్ ఇలా అన్నారు: ‘‘కాంగ్రెస్‌వాడిని అయినప్పటికీ, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’’. 1956 మార్చిలో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎంఏ అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సర్దార్ హుకుమ్ సింగ్ (1962 నుండి 1967 వరకు లోక్‌సభ స్పీకర్) కూడా తనకు తానుగా ఆరోపణలకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ స్పీకర్ పదవికి ఎన్నిక కావడానికి, అధికారంలో ఉన్న లేదా మెజారిటీ పార్టీపై ఆధారపడటం వల్ల పాలక పార్టీల ఆజ్ఞలకు అతడు/ఆమె కట్టుబడాల్సి ఉంటుందనే విషయాన్ని ఆయన గమనించారు. అందుకే 1970ల నాటికి లోక్‌సభ స్పీకర్ నిష్పాక్షికత కాస్త బలహీనపడటంలో ఆశ్చర్యం లేదు. సోమనాథ్ ఛటర్జీ (2004–09) తన నిష్పాక్షికతతో స్పీకర్ కార్యాలయాన్ని ఉన్నతీకరించగా, బలి రామ్ భగత్, బలరామ్ జాఖడ్ వంటి కొందరు స్పీకర్ బాధ్యతలు ముగిసిన తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చేరి పనిచేశారు.ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ స్పీకర్ కుర్చీ వద్దకు ఓం బిర్లాను తీసుకువెళ్లినప్పుడు, ఆయన మోదీ ముందు వంగి కరచాలనం చేయడం, తరువాతి ప్రతిపక్ష నేత వద్ద నిటారుగా నిలబడటం ద్వారా తన విధేయత ఎవరి పట్ల ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. జూన్ 27న శశి థరూర్ ‘జై సంవిధాన్’ అని చెప్పడం ద్వారా ఎంపీగా తన ప్రమాణ స్వీకారం ముగించినప్పుడు ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కీర్తిస్తూ ప్రమాణం చేయ డానికి అభ్యంతరం ఎందుకు అని దీపేందర్ హుడా అడిగినప్పుడు, బిర్లా ఆయన్ని ఆక్షేపించి కూర్చోవాల్సిందిగా కోరారు. ఇది స్పష్టంగానే నిశ్చితమైన పక్షపాతానికి సంకేతం.స్పష్టంగా ప్రధానమంత్రి సూచనల మేరకు, 1975 నాటి ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా చేసిన తీర్మానం, ఆయన పార్టీ విధేయతకు తిరుగులేని సంకేతం. లోక్‌సభకు సంబంధించిన రూల్స్ అండ్ ప్రొసీజర్‌లోని రూల్ 380 కింద ప్రధాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను కూడా ఆయన తొలగించారు. కొన్ని వివాదాస్పద బిల్లులను అడ్డంకులు లేకుండా ఆమోదించడం కోసం 17వ లోక్‌సభలో 100 మంది ప్రతిపక్ష ఎంపీలను బహిష్కరించిన ఈ వ్యక్తి, అధికార పక్షానికి తన విధేయ తను ప్రదర్శించారు.ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా ద్వంద్వ పాత్రను పోషిస్తూ, గత పార్లమెంటులో బిల్లులను ఆమోదించడం కోసం 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడటానికి సమ యం నిరాకరించడం, వారు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని అడ్డు కోవడం ద్వారా ధన్‌ఖడ్ రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో పక్షపాత వైఖరిని కొనసాగిస్తున్నారు. పార్లమెంటులోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.అజయ్ కె మెహ్రా వ్యాసకర్త రాజకీయ శాస్త్రవేత్త(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘ప్రమాణ స్వీకారం తర్వాత అందుకే నినాదాలు చేశా’
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల 18వ లోక్‌సభలో నగీనా ఎంపీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపీగా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసిన తర్వాత ‘జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై మండల్, జై జోహార్, జై జవాన్, జై కిసాన్’ అని నినాదాలు చేశారు. అయితే తాజాగా ఆయన ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం తర్వాత నినాదాలు చేయటానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘‘ఆ నినాదాలు గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉన్నాయి. 'జై భీమ్', 'జై భారత్' మా గుర్తింపును తెలియజేస్తాయి. మండల్ కమిషన్ అమలులోకి వచ్చాక వెనుకబడిన వర్గాలకు పలు అవకాశాలు లభించాయి. ఆయన వల్లే వెనకడిన వర్గాలు ముందుకు సాగుతున్నాయి. భారత ప్రజాస్వామ్యానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే నేను లోక్‌సభలో ప్రమాణం చేసిన సమయంలో ఓ ఎంపీ అది నచ్చక ఈరోజే మొత్తం స్పీచ్ ఇస్తావా అంటూ వెక్కిరించారు. నేను ఇక్కడికి స్పీచ్ ఇవ్వడానికే వచ్చానని బదులు ఇచ్చా. నేను మాట్లాడటానికి వచ్చాను. మీరు వినాల్సి ఉంటుందన్నా’’ అని ఆజాద్ తెలిపారు. తమ హక్కులను లాగేసుకున్నవారు లోక్‌సభలో మత గళాన్ని వినడం అలవాటు చేసుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ 1,51,473 ఓట్ల మెజార్టీతో బీజేపీకి చెందిన ఓం కుమార్‌పై విజయం సాధించారు. -
పోస్టుమార్టం ప్రారంభించిన కాంగ్రెస్ కురియన్ కమిటీ
-
పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ, సాక్షి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. వైయస్సార్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలి. ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదే నిజమైన నివాళి. పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాధికారత కోసం వైఎస్ఆర్ తన జీవితాంతం పనిచేశారు అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. -
వాళ్లు ఓటు వేస్తే.. 40 సీట్లు గెలిచేవాళ్లం: సీఎం ఏక్నాథ్ షిండే
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమికి సీట్లు తగ్గటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సీఎం ఎక్నాథ్ షిండే పాల్గొని మాట్లాడారు. ‘‘లోక్‌సభ పోలింగ్ రోజు మహారాష్ట్రలో మా కుటమికి అనుకూలంగా ఓటువేసే సంప్రదాయ ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు రాకుండా హాలీడే తీసుకున్నారు. అందుకే మహారాష్ట్రలో మహాయుతి కుటమికి సీట్లు తగ్గాయి. దేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండటం వల్ల ఎన్డీయే కూటమి 400 సీట్ల మార్క్‌ను దాటలేకపోయింది. ఇలా జరగకపోతే ఎన్డీయే 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకుని ఉండేది. ఈ నష్టం మమ్మల్ని భవిష్యత్తులో మరింత వ్యూహాత్మకంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. పోలింగ్‌లో 60 శాతం ఓటర్లు పాల్గొని ఉంటే మేము కచ్చితంగా 40 సీట్లు గెలిచేవాళ్లం. లోక్‌సభ ఎన్నికల అనుభవాన్ని సమీక్షించుకుంటున్నాం’’ అని అన్నారు. అదే ర్యాలీలో పాల్గొన్న డిప్యూటీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారు. సీఎం ఎక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూటమి వ్యాప్తి చేసిన అసత్య ప్రచారాన్ని తమ కూటమి నేతలు పట్టించుకోలేదని అన్నారు. దానివల్ల కూడా తమకు సీట్లు తగ్గినట్లు అభిప్రాయపడ్డారు.మొత్తం 48 సీట్లలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ఇక.. మహాయుతిలోని బీజేపీ 9, శివసేన(షిండే) 7 సీట్లు మాత్రమే సాధించిగా.. ఎన్సీపీ ఖాతా కూడా తెరవలేదు. -
Amritpal Singh-Engineer Rashid: జైలు నుంచి గెలుపు.. ఎంపీలుగా ప్రమాణం
జైలు నుంచి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే నేత అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.. తనతో పాటు జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ కూడా ఇవాళ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.అమృత్‌పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు నుంచి పెరోల్‌పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక రషీద్ ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించచారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. -
‘ప్రధాని ప్రసంగంలో తప్పులున్నాయ్.. తొలగించండి’
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో విపక్ష నేత, ఇతర నేతల ప్రసంగాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రతిపక్ష రాహుల్ గాంధీ ప్రసంగాన్ని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించారు. అయితే దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ కౌంటర్ దాడికి దిగింది. ప్రధాని మోదీ ప్రసంగమే తప్పుల తడకగా సాగిందని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో తప్పుదోవ పట్టించే అంశాలున్నాయని పేర్కొంటూ చాలా భాగాన్ని రికార్డుల నుంచి తొలగించారు. ఈ పరిణామంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పందిస్తూ.. ‘‘సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే ఏ సభ్యుడైనా సులభంగా తప్పించుకోలేరు. నియమాలు వాళ్లను అడ్డుకుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. అయితే దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ ఇప్పుడు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే క్రమంలో ప్రధాని మోదీ ప్రసంగంలో చాలా తప్పులు, అసత్యాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసింది.‘‘2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు వరకు భారత రక్షణ దళాల్లో సరిపడా ఆయుధ సంపత్తి లేదని.. యుద్ధ విమానాలు అసలే లేవని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ, జాగ్వార్, మిగ్ 29, ఎస్‌యూ-30, మిరేజ్ 2000 లాంటి ఫైటర్ జెట్లు అప్పటికే ఉన్నాయి. అలాగే.. న్యూక్లియర్ బాంబులు, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్, బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి.. పదేళ్లలో 25 కోట్ల మంది దారిద్ర్యపు రేఖ దిగువ నుంచి పైకి తీసుకొచ్చినట్లు ప్రధాని ప్రకటించుకున్నారు. దీనిని కూడా మేం సవాల్ చేస్తున్నాం. అలాగే.. 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు షేర్ పడిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. హిమాచల్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది. కాంగ్రెస్‌పార్టీ మహిళలకు ప్రతీ నెలా రూ.8,500 ఇస్తుందనే తప్పుడు హామీ ఇచ్చిందని మోదీ మాట్లాడారు. కానీ, అది హామీ మాత్రమే. గెలిచి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అది నేరవేర్చాల్సిన విషయం. అలాంటప్పుడు అది అసత్య ప్రచారం ఎలా అవుతుంది?.కేవలం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రసంగంలోనూ తప్పులు ఉన్నాయని కాంగ్రెస్ ఆ లేఖలో ప్రస్తావించింది. ఈ మేరకు.. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ పేరిట ఈ లేఖ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వెళ్లింది. 115(1)వ ఆదేశం అమలు చేసి.. ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాల్లోని తప్పులు, తప్పుదోవ పట్టించే ప్రకటనల్ని తొలగించేలా చూడాలని మాణిక్కం ఠాగూర్ లేఖలో కోరారు.115(1) ఆదేశాల ప్రకారం.. మంత్రులుగానీ, ఇతర ఎంపీలుగానీ సభలో అసత్య ప్రకటనలు చేస్తే.. అభ్యంతరం వ్యక్తం చేసే సభ్యులు స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. చర్చ జరిపిన తర్వాత ఆ ప్రకటనలు తప్పని నిరూపిస్తే.. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తారు. మోదీ, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాల విషయంలో 115(1)ని అమలు చేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ స్పీకర్‌కు లేఖ రాశారు. -
‘సభలో అసత్య ఆరోపణలు చేస్తే.. తప్పించుకోలేరు’
ఢిల్లీ: లోక్‌సభను ఏ సభ్యుడైనా తప్పుదోవ పట్టించాలని చూస్తే.. సభ నియమ, నిబంధనల నుంచి తప్పించుకోలేరని పార్లెమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగంలో అన్నీ అసత్య ఆరోపణలు ఉన్నాయని స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కిరణ్ రిజిజు వ్యాఖ్యలను ప్రాధాన్యత సంతరించుకుంది.‘‘లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చాం. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నాం. సభలో అందరీకి సమానమైన నియమాలు ఉంటాయి. స్పీకర్ కంటే ఎవరూ పెద్ద కాదు. సభ నియమాలను నుంచి ఏ సభ్యుడు తప్పించుకోలేరు. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు భావిస్తే.. సభలో అటువంటి ప్రాధాన్యతలు ఉండవు. ఎవరైనా సభను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తే.. వాళ్లు సభ నియమాలను నుంచి తప్పించుకోలేరు’’ అని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.సోమవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పలు అంశాల్లో బీజేపీ, మోదీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై సభలో ప్రధానితో సహా మంత్రులు అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రభుత్వం, బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు.చదవండి: PM Narendra Modi: ప్రశాంతంగా మణిపూర్ -
అమృత్‌పాల్ సింగ్‌కు పెరోల్.. జులై 5న ఎంపీగా ప్రమాణం
ఖలిస్థానీ ఉగ్రవాది, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని డిబ్రూగఢ్‌లో జైల్లో ఉన్న అమృత్‌పాల్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్సా హిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారానికి బుధవారం స్పీకర్‌ను కలిసి అనుమతి కోరినట్లు ఫరీద్‌కోట ఎంపీ సరభ్‌జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. లోక్‌సభలో కాకుండా.. స్పీకర్ ఛాంబర్లో జులై 5న ప్రమాణం చేసేందుకు ఓం బిర్లా అనుమతి ఇచ్చారని తెలిపారు. అతడికి ఐదవ తేదీ నుంచి నాలుగురోజులకు పేరోల్ లభించినట్లు చెప్పారు. ఇక అదే రోజు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో నిందితుడిగా ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది. -
7 రోజులు 34 గంటలు.. ముందుగానే వాయిదా!
ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నిరవధిక వాయిదాతో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన రెండు రోజుల చర్చకు మంగళవారం ప్రధాని మోదీ బదులిచ్చాక సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది.The First Session of the 18th Lok Sabha, which commenced on 24 June, 2024, concluded on July 2. Speaker Om Birla informed that the First Session comprised 7 sittings and lasted for about 34 hours. He informed that Lok Sabha recorded 103% productivity during the Session: Lok Sabha…— ANI (@ANI) July 3, 2024 ఈ సమావేశాలు మొత్తం 7 రోజుల్లో 34 గంటల పాటు చర్చలు జరిగాయి. 103 శాతం ఉత్పాదకత(productivity) నమోదైనట్లు స్పీకర్ ఓ బిర్లా తెలిపారు. జూన్ 24న మొదలైన పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం బుధవారం దాకా జరగాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేశారు.Speaker Om Birla informed the House that the discussion on the Motion of Thanks to the President's Address on 27 June lasted for more than 18 hours and 68 Members participated in the discussion. In addition, 50 Members laid their speeches. The discussion concluded with the reply…— ANI (@ANI) July 3, 2024‘రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జూన్ 27న 18 గంటలపాటు చర్చ జరిగింది. ఈ చర్చలో 68 మంది పాల్గొన్నారు. 50 మంది సభ్యులు మాట్లాడారు. మంగళవారం ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పటంతో చర్చ ముగిసింది’ అని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. -
రాహల్వి పిల్ల చేష్టలు. సానుభూతి కోసం సభలో వెక్కిళ్లు. రాహుల్‌పై ప్రధాని వాగ్బాణాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నిండు సభలో రాహుల్ పిల్ల చేష్టలు!: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: విపక్ష నేత రాహుల్‌గాందీపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లోక్‌సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సభలో చేసిన ప్రసంగంలో ఆయన ఆద్యంతం సానుభూతి కోసమే పాకు లాడారంటూ ఆక్షేపించారు. ‘‘నిండు సభలో రాహుల్ పిల్ల చేష్టలకు పాల్పడ్డారు. పచ్చి అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించారు’’ అని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం బదులిచ్చారు. రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగంలో విపక్ష నేతను అంశాలవారీగా ఏకిపారేశారు. కేంద్రం ఉసిగొల్పినందుకే తనపై క్రిమినల్ కేసులు పెట్టారన్న రాహుల్ అభియోగాలను ప్రస్తావిస్తూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘‘తనను అలా కొట్టారు, ఇలా కొట్టారంటూ రాహుల్ నిండు సభలో ఏడుపు లంకించుకున్నారు. సానుభూతి కోసం కొత్త డ్రామాకు తెర తీశారు. వెక్కిళ్లు పెట్టి రోదించారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్‌ది చిన్న పిల్లాడి బుద్ధి. పలుమార్లు ఎంపీగా ఎన్నికైనా పిల్ల చేష్టలు పోలేదు. ఏ విషయాన్నీ సరిగా విడమర్చి చెప్పే సామర్థ్యం లేదు. వ్యవహార జ్ఞానమూ శూన్యం. దీనికి తోడు ఆయనలో తరచూ పిల్ల చేష్టలు శ్రుతి మించుతుంటాయి. అలాంటప్పుడు నిండు సభలో ఎవరిని పడితే వారిని కౌగిలించుకుంటారు. సభలో కూర్చుని కన్ను కొడతారు’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘ఓబీసీలను దొంగలన్నందుకు దోషిగా తేలి శిక్షకు గురైన వ్యక్తి రాహుల్. స్వాతంత్య్ర యోధుడు వీర్ సావర్కర్‌ను అవమానించినందుకు, దేశంలోనే అతి పెద్ద పార్టీ అధ్యక్షున్ని హంతకుడన్నందుకు, మరెందరో నేతలు, అధికారులు, సంస్థలపై అబద్ధాలు చెప్పినందుకు పరువు నష్టం దావాలు ఎదుర్కొంటున్న వ్యక్తి. ఏకంగా సర్వోన్నత న్యాయస్థానానికే బాధ్యతారహితమైన వాంగ్మూలమిచ్చి, అందుకు క్షమాపణలు చెప్పిన చరిత్ర రాహుల్‌ది. వేలాది కోట్ల అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్నారు’’ అంటూ దుమ్మెత్తిపోశారు. పిల్ల చేష్టలను పోగొట్టి రాహుల్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుతున్నట్టు చెప్పారు. అయితే, ‘‘రాహుల్ తీరును బాల్య చేష్టలుగా భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోరాదు. సభలో ఆయన ప్రవర్తన వెనక తీవ్ర దురుద్దేశాలున్నాయి. సాటిలేని మన దేశ పరంపరకు అవి చెరగని మచ్చ’’ అంటూ విమర్శలు గుప్పించారు. వీటిపై దేశ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ‘‘మీరు సహృదయులు. అవమానాలను కూడా నవ్వుతూ సహిస్తారు. కానీ సభలో నిన్నటి దారుణాలను సీరియస్‌గా తీసుకుని వాటికి అడ్డుకట్ట వేయాల్సిందే. అప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలం. సభ గొప్పదనాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. సభలో రాహుల్, కాంగ్రెస్ నేతల అబద్ధాల పరంపరపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశమంతా కోరుతోంది’’ అన్నారు. మోదీ ప్రసంగం పొడవునా విపక్ష నేతలు నిరసనలతో హోరెత్తించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడుతూనే ‘మణిపూర్’, ‘మణిపూర్’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పదేపదే నిలువరించినా వారు వెనక్కు తగ్గలేదు. కాంగ్రెస్ బతుకంతా అబద్ధాలే దేశంలో ఆర్థిక అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు.‘‘ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మరోసారి సుస్థిరతకు పట్టం కట్టారు. మా పదేళ్ల పాలన చూసిన మరోసారి ఆశీర్వదించారు. కాంగ్రెస్‌కు వరుసగా మూడో లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 100 సీట్లు కూడా దాటలేదు. ఇంత దారుణమైన ఓటమి మూటగట్టుకున్నా ఇంకా అహంకారమే ప్రదర్శిస్తోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏను ఓడించామన్న భావనను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది’’ అన్నారు. అబద్ధాలన్నే కాంగ్రెస్ తన రాజకీయ ఆయుధంగా మార్చుకుందంటూ ఆక్షేపించారు. రాజ్యాంగంపై, రిజర్వేషన్లపై కూడా కాంగ్రెస్ నిత్యం అబద్ధాలు చెబుతూ వస్తోందన్నారు. ‘‘నిజాలను దేశ ప్రజల ముందు ఉంచుతున్నా. ఎమర్జెన్సీ సందర్భంగా దేశంపై కాంగ్రెస్ రాచరికాన్ని రుద్దింది. వ్యవస్థలన్నింటినీ క్రూరంగా అపహాస్యం చేసింది. ప్రభుత్వాలను కూలదోసింది. మీడియాను అణిచేసింది. రాజ్యాంగానికీ తూట్లు పొడిచింది. మనిషి రక్తం రుచి చూసిన పులి మాదిరిగా కాంగ్రెస్ నోటికి అబద్ధాల రక్తం నిండుగా అంటింది. ఈవీఎంలపై అబద్ధాలు. రాజ్యాంగంపై అబద్ధాలు. రిజర్వేషన్లపైనా అబద్ధాలు. గతంలో రాఫెల్ ఒప్పందంపైనా అబద్ధాలు. ఎల్ఐసీపైనా అబద్ధాలు. బ్యాంకులపైనా అబద్ధాలు. ఉద్యోగులను కూడా ప్రభుత్వంపై రెచ్చగొట్టే ప్రయత్నాలు. చివరికి అగ్నివీర్ పథకంపైనా నిన్న నిండుసభలో రాహుల్ పచ్చి అబద్ధాలు చెప్పారు. రైతులకు కేంద్రం కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి బాధ్యతారహిత చేష్టలతో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంతో చెలగాటమాడుతున్నారు. ఇది దారుణం. 60 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీ, అనుభవజు్ఞలైన నేతలెందరో ఉన్న పార్టీ ఇలా అబద్ధాలకు తెగబడుతుండటం, ఇంతటి తప్పుదారిలో వెళ్తుండటం దేశానికి చాలా ప్రమాదకరం’’ మోదీ అన్నారు. సైన్యాన్ని బలహీనపరిచే కుట్రలు యువత సైన్యంలో చేరకుండా చూసేందుకు, సైనిక దళాలను బలహీనపరిచేందుకు రాహుల్ కుట్ర పన్నుతున్నారని మోదీ ఆరోపించారు. అందుకే అగ్నిపథ్ పథకంపై పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఆయన ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘మన సైన్యం బలోపేతం కావడాన్ని కాంగ్రెస్ ఎన్నడూ భరించలేదు. ఆ పార్టీ హయాంలో కాలానుగుణంగా సంస్కరణలకు నోచుకోలేక సైన్యం ఇక్కట్లు పడింది’’ అని ఆరోపించారు. ‘‘భద్రతాపరంగా సున్నితమైన ఈ విషయంపై బహిరంగంగా ఇంతకంటే చెప్పలేం. అందుకే నా నోటికి తాళం పడింది’’ అని మోదీ అన్నారు. హిందువులపై భారీ కుట్రలు రాహుల్ వ్యాఖ్యలపై మోదీ ధ్వజం వాటిని దేశం ఎప్పటికీ మరవబోదు హిందూ మతాన్నే కించపరిచే ప్రయత్నం హిందువులంటే కాంగ్రెస్‌కు నిలువెల్లా విద్వేషం హిందువులను హేళన చేయడం ఫ్యాషనైంది: ప్రధాని రాహుల్ ‘హిందూ’ వ్యాఖ్యలపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులంటే కాంగ్రెస్‌కు చెప్పలేనంత విద్వేషమని ఆరోపించారు. అందుకే వారిపై ఆ పార్టీ భారీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరికీ స్పష్టంగా చెప్పదలచానన్నారు. ‘‘హిందువులు సహనానికి మారుపేరు. అలాంటి వారిని హింసావాదులంటారా? ఇదా మీ సంస్కారం? ఇదేనా మీ చరిత్ర? ఇదేనా మీ భావజాలం? హిందువుల పట్ల మీకింతటి విద్వేషమా?! హిందువులపై రాహుల్ విద్వేషపు వ్యాఖ్యలను దేశం వందల ఏళ్లు గడిచానా మర్చిపోదు. వారిని ఎన్నటికీ క్షమించబోదు’’ అంటూ మండిపడ్డారు. ‘‘విపక్షాలు కొత్తగా హిందూ ఉగ్రవాదం అనే మాటలను తెరపైకి తెచ్చాయి. హిందూ ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చాయి. పైగా అందుకు చప్పట్లు చరుచుకున్నాయి’’ అంటూ దుయ్యబట్టారు. హిందూ పరంపరను, హిందూ సమాజాన్ని, హిందూ వారసత్వాన్ని, సంస్కృతిని కించపరిచేందుకు, తక్కువ చేసి చూపించేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ ఆరోపించారు. ‘‘ఆ క్రమంలోనే హిందువులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారు. సభలో ప్రధాని ప్రసంగాన్ని వింటున్న రాహుల్‌గాంధీ హిందువులను కించపరచడం, హేళన చేయడం వీళ్లకు ఫ్యాషన్‌గా మారింది’’ అంటూ మండిపడ్డారు. ‘‘హిందువులపై విపక్ష నేత చేసిన అవమానకర వ్యాఖ్యలు యాదృచ్ఛికమేనా, లేక ఏదైనా భారీ కుట్రలో భాగమా? దీనిపై హిందూ సమాజం కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది’’ అని అభిప్రాయపడ్డారు. రాహుల్ సోమవారం సభలో శివుని చిత్రపటాన్ని ప్రదర్శించడాన్ని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘హిందూ సంస్కృతిలో ఈశ్వరారాధన కేవలం దర్శనం కోసం మాత్రమే తప్ప స్వార్థం కోసమో, ఇలా ప్రదర్శన కోసమో కాదు. కానీ కాంగ్రెస్ వాళ్లేమో మన దేవీ దేవతలను ఇలా అవమానిస్తున్నారు. స్త్రీ శక్తిని దేశంలో అనాది నుంచి పూజిస్తూ వస్తున్నాం. అలాంటి శక్తిని వినాశనం చేస్తామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో మొత్తం దేశ ప్రజల మనసులనే గాయపరిచారు. వీరిని దేశం ఎన్నటికీ క్షమించబోదు!’’ అన్నారు. అంబేడ్కర్‌పై నెహ్రూ కుట్రలు... రిజర్వేషన్లకు కాంగ్రెస్ బద్ధ విరోధి దేశంలోని దళిత, వెనకబడ్డ వర్గాలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని మోదీ విమర్శించారు. దీన్ని సహించలేకే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ అప్పట్లో నెహ్రూ కేబినెట్‌కు రాజీనామా చేశారన్నారు. ‘‘దళితులకు నెహ్రూ చేసిన అన్యాయాలను అంబేడ్కర్ ఏకిపారేశారు. వెనకబడ్డ వర్గాలపై నెహ్రూ ప్రభుత్వ ఉపేక్షను భరించలేకే రాజీనామా చేస్తున్నట్టు స్పష్టంగా ప్రకటించారు. దాంతో అంబేడ్కర్‌పై నెహ్రూ కక్షగట్టారు. ఆయన రాజకీయ జీవితాన్నే సర్వనాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కుట్రపూరితంగా అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించారు. ఆయన ఓటమికి నెహ్రూ పండుగ చేసుకున్నారు. ఆ ఆనందాన్ని ఒక లేఖలో స్పష్టంగా రాసుకొచ్చారు. మరో దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌కు కూడా కాంగ్రెస్ తీరని అన్యాయమే చేసింది. ఎమర్జెన్సీ తర్వాత జగ్జీవన్‌రామ్‌కు ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఇందిరాగాంధీ మోకాలడ్డారు. ‘‘ఏదేమైనా ఆయన ప్రధాని కావడానికి వీల్లేదు. లేదంటే ప్రధాని పదవిని జీవితాంతం వదలబో’రన్నారు. ఇది ఒక పుస్తకంలో స్పష్టంగా ఉంది. చౌదరీ చరణ్సింగ్తోనూ ఇందిర ఇలాగే వ్యవహరించారు. వెనకబడ్డ వర్గాలకు చెందిన సీతారాం కేసరిని తీవ్రంగా అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది’’ అంటూ సోదాహరణంగా చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఆది నుంచీ బద్ధ విరోధేనని మోదీ ఆరోపించారు. ‘‘రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నెహ్రూ అప్పట్లో సీఎంలకు లేఖలు రాశారు. మండల్ కమిషన్ నివేదికను ఇందిర ఏళ్లపాటు తొక్కిపెట్టారు. రాజీవ్‌గాంధీ కూడా విపక్ష నేతగా రిజర్వేషన్లను నిండు సభలోనే బాహాటంగా వ్యతిరేకించారు’’ అన్నారు. నీట్ లీకేజీపై... నీట్ తరహా లీకేజీలు పునరావృతం కాకుండా కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని మోదీ చెప్పారు.‘‘ లీకేజీ బాధ్యులను వదిలేది లేదు. విద్యార్థుల భవితతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోం. దేశమంతటా అరెస్టులు కొనసాగుతున్నాయి. దోషులపై ఇప్పటికే కఠినమైన కొత్త చట్టం కింద అభియోగాలు మోపాం. అవినీతిని ఉపేక్షించేది లేదని 2014లో తొలిసారి గెలిచినప్పుడే స్పష్టంగా చెప్పాం. అందుకు కట్టుబడి ఉన్నాం’’ అన్నారు. మోదీ మాటల తూటాలు రాహుల్‌పై... – అనగనగా ఒక బాలుడు. తనకు 99 మార్కులు వచ్చాయంటూ అందరికీ మిఠాయిలు పంచుతున్నాడు. టీచర్ వచ్చి నీకు 99 వచ్చింది 100కు కాదు, 543కు అని చెప్పినా ఆగడం లేదు! ఫెయిలవడంలో కూడా ప్రపంచ రికార్డు సృష్టించాడని ఆ పిల్లాడికి అర్థమయ్యేలా ఎవరు చెప్పాలి!? – ‘‘తుమ్ సే నా హో పాయెగా (కాంగ్రెస్‌ను గెలిపించడం ఇక నీ తరం కాదు)’’ అని ఎన్నికల తీర్పు ద్వారా దేశమంతా రాహుల్‌కు స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్‌పై... – కాంగ్రెస్ ఓ పరాన్నజీవి! ఈ ఎన్నికల్లో అది గెలిచిన 99 లోక్‌సభ సీట్లలో అత్యధికం భాగస్వామ్య పార్టీల ఓట్ల పుణ్యమే! గణాంకాల ఆధారంగా ఈ మాట చెబుతున్నా. ఒంటరిగా పోటీ చేసిన 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు శాతం దారుణంగా తగ్గిపోయింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 66 సీట్లలో పోటీ చేస్తే నెగ్గింది కేవలం రెండు! బీజేపీతో నేరుగా తలపడ్డ చోట్ల కాంగ్రెస్ విజయ శాతం కేవలం 26! కానీ బలమైన ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టిన రాష్ట్రాల్లో మాత్రం పోటీ చేసిన సీట్లలో ఏకంగా సగం గెలిచింది! కనుక ఇకపై కాంగ్రెస్‌కు ‘పరాన్నజీవి పార్టీ’ అనే పేరు స్థిరపడటం ఖాయం. దీనిపై కాంగ్రెస్ భాగస్వాములు ఇప్పటికైనా విశ్లేషణ చేసుకున్నారో లేదో! ఈ ఎన్నికల ఫలితాలు వాటికి కూడా ఓ సందేశం. – వాస్తవాలిలా ఉన్నా కాంగ్రెస్ నేతల స్టేట్మెంట్లు మాత్రం షోలే సినిమాలో కామెడీ సీన్‌ను మించిపోతున్నాయి. వరుసగా మూడుసార్లు ఓడినా నైతిక విజయం తమదేనంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. 13 రాష్ట్రాల్లో జీరో సీట్లొచ్చినా హీరోలమని చెప్పుకు తిరుగుతున్నారు. మొత్తంగా పార్టీని నిండా ముంచి కూడా, ఇంకా ఊపిరితోనే ఉంది లెమ్మంటూ సంబరపడుతున్నారు! – మహిళలకు ప్రతి నెలా రూ.8,500 ఇస్తామంటూ కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పింది. ఆ డబ్బులొచ్చాయా వాళ్లు జూలై 1న తమ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకున్నారు. ఆ మహిళల శాపనార్థాలు కాంగ్రెస్‌ను సర్వనాశనం చేయనున్నాయి. జూలై 1ని దేశమంతా ఖటాఖట్ దినంగా జరుపుకుంది. -
నీట్ పేపర్ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ లోక్‌సభలో తొలిసారి స్పందించారు. ‘నీట్ పేపర్ లీకేజీపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. లక్షలాది విద్యార్ధుల కష్టాన్ని వృథా పోనివ్వం. ప్రశ్నాపత్రాలను లీక్ చేసే వారిని వదిలిపెట్టం’ అని మోదీ హెచ్చరించారు. యువత భవిష్యత్‌ను ఆడుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న ఆయన.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని నీట్ విద్యార్ధులకు భరోసా ఇచ్చారు. -
లోక్‌సభలో ‘నీట్’ రగడ.. మోదీ ప్రసంగంపై విపక్షాల ఆందోళన
సాక్షి,న్యూఢిల్లీ : రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా గందర గోళం నెలకొంది. మణిపూర్ అల్లరు,నీట్ లీకేజీపై స్పందించాలని డిమాండ్ చేస్తూ మోదీ ప్రసంగానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ మోదీ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 👉రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ లక్ష్యాలను వివరించారు.👉దేశానికి మార్గదర్శకం చేసిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు.👉ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసినా విపక్షాలు ఓడిపోయాయి.👉ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు తమకు మూడోసారి అధికారం కట్టబెట్టారు.👉మా పదేళ్ల ట్రాక్ రికార్డ్ చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారు.👉మాకు నేషన్ ఫస్ట్. మేం ఏ పనిచేసినా ఇదే అంశంపై కట్టుబడి ఉంటాం.👉కొంత మంది బాధని నేను అర్ధం చేసుకోగలను అసత్య ప్రచారం చేసినా ఓడిపోయారు.👉పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు.👉పదేళ్లలో భారత్ ఖ్యాతిని మరింత పెంచాం.👉ఈ దేశంలో ఏదీ మారదని 2014ముందు ప్రజలు అనుకునే వారు.👉కాంగ్రెస్ హయాంలో ఎక్కడా చూసినా అంతా అవినీతి మయమే.. పత్రికల్లో ఎక్కడ చూసినా ఆ వార్తలే.👉స్కామ్‌లకు చెల్లింది.👉కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదలైతే 15పైసలు మాత్రమే సామాన్యులకు అందేవి.👉2014కు ముందు ఉగ్రవాదులు భారత్‌లో ఎక్కడ పడితే అక్కడే దాడులు జరిగేవి. ప్రభుత్వాలు నోరుమెదిపేవి కావు.👉కానీ 2014 తర్వాత ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేశాం.👉దేశ భద్రతకోసం మేం ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళ్తాం. ఏ నిర్ణయమైనా తీసుకుంటాం.👉కాంగ్రెస్ హయాంలో బొగ్గు స్కాం జరిగితే.. మా హయాంలో రికార్డ్ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.👉కాంగ్రెస్ హయాంలో బ్యాంకుల్లో స్కాంలు జరిగితే 2014 తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి తెచ్చాం.👉ఆర్టికల్ 370తో అక్కడి ప్రజలు హక్కుల్ని లాక్కున్నారు. జమ్ము కశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయనిచ్చేవారు కాదు.👉ఆర్టికల్ 370 రద్దుతో రాళ్ల దాడులు ఆగిపోయాయి.👉స్మార్ట్ ఫోన్ తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.👉మా పాలనలో మహిళలలను లక్షాదికారులుగా మార్చాం.👉భారత్ ఐదో ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూడో స్థానానికి ఎదిగేందుకే మా కృషి.👉మూడో టర్మ్‌లో ట్రిపుల్ స్పీడుతో అత్యత్తమ ఫలితాలు సాధిస్తాం.👉చిల్లర రాజకీయాలతో దేశం నడవదు. అదే సమయంలో విపక్షాల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్‌లోకి పంపించడంతో సరైన పద్దతి కాదని మండిపడ్డారు. అయినప్పటికీ నీట్ లీకేజీ, మణిపూర్ అల్లర్లపై స్పందించాలని విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. విపక్షాల నినాదాల మధ్య కొనసాగుతున్న మోదీ ప్రసంగం -
లోక్‌సభ: చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఫైర్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఈడీ, సీబిఐ ఎందుకు అరెస్టు చేయలేదు.. ఆయన అవినీతిపరుడు కాదా ? అంటూ ప్రశ్నించారు. ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? అంటూ నిలదీశారు.ప్రభుత్వం ఏర్పాటు కోసం అవినీతిపరులతో చేతులు కలిపారు. చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లాంటివారు బీజేపీతో చేతులు కలిపితే వారిపై కేసులను వాషింగ్ మిషన్‌లో వేసినట్లేనా?. బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన నిజాయితీపరులుగా మారిపోయారా ?’’ అంటూ దుయ్యబట్టారు.‘‘బీజేపీకి 400 సీట్లు దాటుతాయని ప్రచారం చేసి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రచారం చేశారు. టీడీపీ అగ్రనేత ఒకేరోజులో రూ.521 కోట్ల రూపాయలు సంపాదించారు.ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలి’’ అని కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. -
స్పీకర్‌కు రాహుల్ లేఖ.. ‘వ్యాఖ్యలు తొలగించటంపై షాక్‌కు గురయ్యా’
ఢిల్లీ: లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించటంలో తనను షాక్‌కు గురిచేసిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో నీట్, హిందుత్వ, అగ్నిపథ్ వంటి అంశాలపై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాహుల్ స్పీచ్‌లో మాటలను రికార్డుల నుంచి తొలగించినట్ల స్పీకర్ ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తాను మాట్లాడిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్‌కు లేఖ రాశారు.Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored. The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc— ANI (@ANI) July 2, 2024 ‘నేను నిన్న లోక్‌సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యా. నా మాటాలను పునురుద్ధరించండి. నా ప్రసంగంలోని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం’అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సవాల్లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. గత ఎన్డీయే పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కట్టిన నిర్మాణాలన్నీ కూలిపోతున్నాయన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. బీజేపీ పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్‌పోర్టుల రూఫ్‌లు కూలిపోయాయని అన్నారు. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు రూఫ్ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.#WATCH | Delhi: In the Lok Sabha, Congress MP KC Venugopal says, "... Delhi Airport roof collapsed, Jabalpur Airport roof collapse, Rajkot Airport canopy collapse, conditions of roads in Ayodhya is bad, leakage in Ram Mandir, cracks in Mumbai Harbour link road, three new bridges… pic.twitter.com/CtYCzhLp3E— ANI (@ANI) July 2, 2024 .. రామ మందిరంలో నీరు లీక్ అయింది. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. బీజేపీ పాలనలో బిహార్‌లో మూడు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇవాన్ని కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. -
లోక్‌సభలో అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో.. ఎన్డీయే కూటమిపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మంగళవారం లోక్‌సభలో ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్.. యూపీ ఫలితాలతో పాటు పేపర్ లీక్, ఈవీఎంల అంశం గురించి మాట్లాడారు.‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని అన్నారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు యూపీలో 80కి 80 లోక్‌సభ సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక నీట్ అవకతవకలపై మాట్లాడుతూ.. ‘‘అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’’ అని మండిపడ్డారు. -
రాహుల్లా ఎవరూ ప్రవర్తించకండి: ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) తొలిసారి సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మిత్రపక్ష ఎంపీలను ఉద్ధేశించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు. ఎన్డీయే కూటమి ఎంపీలు పార్లమెంట్ నిబంధనలను పాటించాలని, సభలో వారి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీపై మోదీ విమర్శలు గుప్పించారు. వరుసగా మూడోసారి కాంగ్రేసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని మండిపడ్డారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని.. ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సూచించారు.సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. దేశసేవ చేసేందుకు ఎంపీలంతా పార్లమెంట్‌కు రావాలని మోదీ సూచించారని తెలిపారు. సభలో ఎలా నడుచుకోవాలో కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. తమ నియోజకవర్గానికి చెందిన అంశాలను పార్లమెంట్లో రెగ్యులర్‌గా ప్రస్తావించాలని, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.‘నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానించారు. రాహుల్‌గా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది.పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’ అని ప్రధాని ఎంపీలకు సూచించినట్లు రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ మోదీ ఇస్తారని, ఆ సందేశం ప్రతి ఒక్కర్నీ ఉద్దేశించి ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. -
NDA ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది
-
లోక్‌సభలో నా మాటలన్నీ వాస్తవాలే: రాహుల్ గాంధీ
ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన స్పీచ్ నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు మంగళవారం లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. తన స్పీచ్‌లోని వ్యాఖ్యలు తొలగించటంపై రాహుల్ గాంధీ స్పందించారు.‘మోదీ ప్రపంచంలో మాత్రమే నిజాన్ని తొలగిస్తారు. కానీ, వాస్తవ ప్రపంచంలో నిజం ఎప్పుడూ తొలగించబడదు. నిన్న లోక్‌సభలో నేను చేసిన వ్యాఖ్యలు అన్నీ నిజాలు, అసత్యాలు. వాళ్లు తొలగించుకోవాలనుకుంటే.. తొలగించుకోవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.పార్లమెంట్ సమావేశాలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నీట్, అగ్నిపథ్ పథకాలు, బీజేపీ వ్యవహరిస్తున్న హిందుత్వ విధానాల తీరుపై సోమవారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అధికర ఎన్డీయే అభ్యంతరం తెలిపింది. రాహుల్ గాంధీ హిందు సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం పేర్కొంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు అడగరు?: వైఎస్సార్సీపీ ఎంపీ తనుజారాణి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ తనుజారాణి కోరారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. సోమవారం లోక్‌సభలో ఎంపీ తనుజారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి అని గత పది సంవత్సరాలుగా మా వైయస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తూనే ఉంది.-గుమ్మ తనూజా రాణి, వైయస్ఆర్ సీపీ ఎంపీ pic.twitter.com/pwE9xTfMqS— YSR Congress Party (@YSRCParty) July 1, 2024 ‘‘టీపీపీ బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా ఆ పార్టీ అడగడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, పార్టీ ఆఫీసులపై టీడీపీ దాడులు మానుకోవాలి. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్యాబోధనకు గిరిజనేతర టీచర్లు రావడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని గత పదేళ్లుగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తునే ఉంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ’’ అని ఆమె అన్నారు.ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉన్న నితీశ్ కుమార్ జేడీయూ(12), బీహార్ ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం సైతం పాస్ చేసింది. కానీ, 16 సీట్లతో రెండో స్థానంలో టీడీపీ మాత్రం ఇప్పటివరకైతే టీడీపీ ఏ ఊసు ఎత్తడం లేదు. -
ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించండి: కేసీ వేణుగోపాల్
Updatesఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు.లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.బీజేపీలో పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్‌పోర్టుల రూఫ్‌లు కూలిపోయాయని అన్నారు. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు రూఫ్ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగాఉన్నాయి. రామ మందిరంలో నీరు లీక్ అవుతోంది. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. బీజేపీ పాలనలో బిహార్‌లో మూడు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇవాన్ని కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా అని అన్నారు.#WATCH | Delhi: In the Lok Sabha, Congress MP KC Venugopal says, "... Delhi Airport roof collapsed, Jabalpur Airport roof collapse, Rajkot Airport canopy collapse, conditions of roads in Ayodhya is bad, leakage in Ram Mandir, cracks in Mumbai Harbour link road, three new bridges… pic.twitter.com/CtYCzhLp3E— ANI (@ANI) July 2, 2024 లోక్‌సభ స్పీకర్‌కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖతను నిన్న లోక్‌సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యా.తన మాటాలను పునురుద్ధరించాలని స్పీకర్‌కు ఓం బిర్లాకు లేఖ రాసిన రాహుల్తన వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored. The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc— ANI (@ANI) July 2, 2024 రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైఎస్సాసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.విశాఖ, చెన్నై కోస్టల్ కారిడార్‌పై రాజ్యసభలో ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలిఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కాదు, అది ప్రజల హక్కుఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం టీడీపీకి ఉందిరాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం పార్టీప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలిఅన్యాయంగా విభజించడం వల్ల ఏపీ నష్టపోయిందిప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందివిభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలిటీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు వారాల్లోనే వైఎస్సార్సీపీ శ్రేణులపై దారుణంగా దాడులు చేస్తుందిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలివిశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలిఏపీలో శాంతిని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలిఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను మాజీ సీఎం వైఎస్ జగన్ స్థాపించారు.తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టారుఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారురైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండిగ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలిరైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలిరైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలిభద్రత చర్యలను వెంటనే అప్‌గ్రెడ్ చేయాలిరైల్వే జోన్‌కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించిందినడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలివైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలిభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలివిశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే వ్యవహరిస్తున్న తీరును ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తప్పుపట్టారు. ప్రతిసారి రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవపరచలేరు. దేశ చరిత్రలో రాజ్యసభ కార్యకలాపాల్లో సభ ఛైర్మన్ పట్ల ఇంత నిర్లక్ష్యం ఎప్పుడూ జరగలేదు.తాను ఎప్పుడూ ప్రతిపక్ష సభ్యుల గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది.గత ఎన్నికల ఇండియా కూటమి నైతిక విజయం సాధించింది: ఎంపీ అఖిలేష్ యాదవ్బీజేపీ 400 సీట్ల నినాదం విఫలమైంది.జూన్ 4 నుంచి మత రాజకీయాలకు విముక్తి లభించింది400 సీట్లు గెలుస్తామని ప్రచారం చేసుకున్నారు.వర్షాలు వస్తే ఉత్తరప్రదేశ్‌లో నగరాలు చెరువులయ్యాయి. 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది.ఎన్డీయే నడిచే సర్కార్ కాదు.. పడిపోయే ప్రభుత్వం: ఎంపీ అఖిలేష్ యాదవ్ #WATCH | Speaking on the paper leaks issue in Lok Sabha, Samajwadi Party MP Akhilesh Yadav says," Why are paper leaks happening? The truth is that this is being done by the government so that it doesn’t have to give jobs to youth." pic.twitter.com/9EC1y8kUgi— ANI (@ANI) July 2, 2024 జులై 1వ తేదీన లోక్‌సభలో రాహుల్ స్పీచ్ నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం పేర్కొంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు.పార్లమెంట్లో ఎంపీలంతా నిబంధనలను పాటించాలి: మోదీలోక్సభ ఎంపీల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలి.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలా వ్యవహరించవద్దుఎంపీలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు.సమావేశాలు జరగుతున్నప్పడు ఎక్కువ సమయం సభలోనే ఉండాలిప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు.#WATCH | PM Modi welcomed by NDA leaders at the NDA Parliamentary Party meeting in Delhi pic.twitter.com/dRZnJ7yHzv— ANI (@ANI) July 2, 2024 ప్రధాని మోదీ నేతృత్వలో జరిగినే ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొనడానికి పలువురు ఎంపీలు పార్లమెంట్‌కు చేరుకుంటున్నారు.Delhi | NDA leaders Giriraj Singh, Milind Deora, Kangana Ranaut and Jayant Chaudhary arrive for NDA parliamentary party meeting in Parliament premises pic.twitter.com/eWnafFv0yN— ANI (@ANI) July 2, 2024 ఢిల్లీ: పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సోమవారం ఉభయ సభల్లో వాడీవేడీగా సాగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. నీట్, అగ్నిపథ్ వంటి అంశాలపై మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తూర్పారపట్టారు. హిందుత్వ, అగ్నిపథ్ పథకాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చేప్పాలని హోంశాఖ మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ఇవాళ జరిగే లోక్‌సభ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సాయంత్రం మాట్లాడానున్నారు. సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చడంతో ఇవాళ ధీటైన సమాధానం ఇచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.లోక్‌సభలో ప్రసంగానికి ముందు ఎన్డీయే కూటమి పార్లమెంట్ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్‌లో ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అధికారంలోకి వచ్చాక.. ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించిన మోదీ తొలిసారి ప్రసంగించనున్నారు. ఇవాళ కూడా లోక్‌సభలో వాడీవేడీగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మాటలు యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు. -
నీట్ మంటలు.. విపక్షాల వాకౌట్..
-
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే ఆలోచన అదేనా!
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని బీజేపీ యోచిస్తుండగా... మరోవైపు విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఫైజాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన అవధేశ్ ప్రసాద్‌కు ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు పలికింది.అయితే డిప్యూటీ స్పీకర్ నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ.. ఈ విషయంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు లేనట్లు సమాచారం, డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విమర్శిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా 2019 నుంచి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. గతంలో ఎక్కువ శాతం ప్రతిపక్షమే ఈ పదవిని కేటాయించారు. అయితే ఇది ఎల్లప్పుడూ కొనసాగదని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఉండటంతో.. తమ ఎంపీలలో ఒకరికి డిప్యూటీ పదవి దక్కాలని డిమాండ్ చేస్తోంది. కాగా 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈసారి కూడా . అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఆ పదవిపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది.. ఇక స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించి రెండవసారి స్పీకర్ పదవిని చేపట్టారు. -
లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్
ఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో సోమవారం ‘నీట్’ మంటలు పుట్టాయి. సభలో ఒకరోజు నీట్‌పై చర్చజరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్‌పై చర్చ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవటంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.లోక్‌సభ ప్రారంభం అయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. సభ ప్రారంభమైన తర్వాతే గందరగోళం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుపట్టాయి. ఎన్టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ చేయటంపై స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. స్పీకర్‌పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.ఒకరోజు నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్‌ను కోరారు. ‘విద్యార్థులకు పార్లమెంట్ వేదికగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు నీట్‌పై చర్చించాలి. ఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తర్వాత అయినా ఒక రోజు నీట్‌పై చర్చ జరపాలి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధి చెప్పిన అంశంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. నీట్ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నీట్‌పై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.దీనికంటే ముందు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ముందు రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మాణంపై చర్చించాలన్నరు. తర్వాత అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. లోక్ సభ రూల్స్ ప్రకారం నడుస్తోందని, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదన్నారు. -
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన... వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్... ఉభయ సభలు పలుమార్లు వాయిదాట.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కావచ్చు, కానీ: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించి జూన్ 26కు 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఈ అంశం తాజాగా లోక్‌సభ సమావేశాలను కుదిపేస్తోంది. ముందుగా దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం, స్పీకర్ ఓం బిర్లా దీనిపై తీర్మానం చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ నాటి అత్యయిక స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కావచ్చు. కానీ, రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు.ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెంగోల్‌ను భర్తీ చేయడం, నీట్ పేపర్ లీక్‌లు వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే ఎమర్జెన్సీపై మోదీ, రాష్ట్రపతి, స్పీకర్ చేసిన వ్యాఖ్యలను థరూర్ తప్పుబట్టారు. 49 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనను ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చి, చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ‘ఎమర్జెన్సీని నేను విమర్శిస్తా. ఆ చర్యను నేను సమర్థించడం లేదు. గర్వించదగ్గ విషయమనీ చెప్పట్లేదు. అత్యయిక స్థితి సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమనే భావిస్తున్నా. అయితే, అది వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు. దేశంలో అంతర్గత ఎమర్జెన్సీని విధించేందుకు రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ పరిధిలోనే ఉంది. రాజ్యాంగ విరుద్ధమైన దాడి, రాజ్యాంగంపై దాడి అని రాష్ట్రపతి అనడం చట్టపరంగా సరికాదు' అని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం 1975 లేదా 2047 గురించి మాట్లాడుతోంది కానీ.. వర్తమాన అంశాలను ప్రస్తావించట్లేదని మండిపడ్డారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ సర్కారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్ వివాదం, నిరుద్యోగం సమస్యలు, మణిపుర్ అల్లర్ల వంటి కీలక అంశాలపై వారు దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలుపొందారు.