పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలనముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణలోనే కొనసాగించేలా ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు ఆయా మండలాలలో, గ్రామాలలో దశల వారీగా ఆందోళనలను చేపట్టనున్నట్లు అఖిలపక్షం నాయకులు ప్రకటించారు.
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలనముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణలోనే కొనసాగించేలా ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు ఆయా మండలాలలో, గ్రామాలలో దశల వారీగా ఆందోళనలను చేపట్టనున్నట్లు అఖిలపక్షం నాయకులు ప్రకటించారు. శుక్రవా రం భద్రాచలంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సదస్సులో పోలవరం ముంపు ప్రాంతాలలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేశారు. ఈనెల 30వ తేదీన ముంపు మండలాల్లో బంద్, ఈనెల 31, జూన్ 1వ తేదీలలో ఆయా మండలాలలోని గ్రామాల్లో పాదయాత్రలు, సభలను నిర్వహించటం, జూన్ 2వ తేదీన ముంపు గ్రామాల పంచాయతీ కార్యాలయాల ఎదుట నల్లజెండాలను ఎగురవేయటం, సరిహద్దుల దిగ్బంధనం వంటి ఆందోళనలకు నాయకులు పిలుపునిచ్చారు.
అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సదస్సులో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు.