
చిరంజీవికి ప్రధాని ఫోన్
కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారు. మంత్రి పదవికి చేసిన రాజీనామా ఉపసంహరించుకోవాలని చిరంజీవిని ప్రధాని కోరారు.
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారు. మంత్రి పదవికి చేసిన రాజీనామా ఉపసంహరించుకోవాలని చిరంజీవిని ప్రధాని కోరారు. రాజీనామాపై పునరాలోచన చేయాలని కోరారు. అయితే ప్రధాని విజ్ఞప్తిని చిరంజీవి సున్నితంతా తిరస్కరించినట్టు సమాచారం. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బాధించిందని చిరంజీవి అన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కేంద్ర మానవరుల శాఖ మంత్రి పళ్లంరాజు సమావేశమయ్యారు. సీమాంధ్రలో పరిస్థితులను సోనియాకు ఆయన వివరించారు. ఈ ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్తో పళ్లంరాజు భేటీ అయ్యారు.