అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. కదిరి పట్టణం మారుతీనగర్కు చెందిన భారత్ గ్యాస్ ఏజన్సీ నిర్వాహకుడు కిరణ్‌కుమార్ ఇంట్లో చోరీ జరిగింది.
కదిరి: అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. కదిరి పట్టణం మారుతీనగర్కు చెందిన భారత్ గ్యాస్ ఏజన్సీ నిర్వాహకుడు కిరణ్‌కుమార్ ఇంట్లో చోరీ జరిగింది.
కిరణ్ కుటుంబసభ్యులతో కలసి నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.5.40 లక్షల నగదుతోపాటు ఆరు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం చోరీని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. సీఐ శ్రీనివాసులు, పట్టణ ఎస్సై సాగర్ సంఘటన స్థలిని పరిశీలించారు. దొంగతనం తెలిసిన వారిపనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.