
సాక్షి, తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు సత్యం బృందం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(రెంరోజు) సత్యం బృందం గోదావరిలో 1000 మీటర్లకు పైగా ఐరన్ రోప్‌ను దింపి ప్రొక్లైయిన్ సహాయంతో వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఐరన్ రోప్ బండరాయికి తగిలి తెగిపోయింది. దీంతో యాంకర్లు వేసి బోట్ ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రెండో రోజు ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు కొద్ది పాటి ఆటంకం ఏర్పడింది.