Boat capsizes
-
Nigeria: పడవ ప్రమాదం.. 100 మంది గల్లంతు
అబుజా: ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పడవలో వ్యాపారులు నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ (ఎన్‌ఐడబ్ల్యూఏ)ప్రతినిధి మకామా సులేమాన్ మీడియాతో మాట్లాడుతూ పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ తెలిపారు. ప్రయాణికులెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం కారణంగానే ప్రాణనష్టం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.తరచూ ప్రమాదాలుఘటనా స్థలంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. బోటులో ఎక్కువగా మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బోటులో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు తదితర అంశాలు ఇటువంటి ఘటనలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని జీలం నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయంలో జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన పడవలో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అధికంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సముద్రం మధ్యలో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో డ్రైవర్, ఇద్దరు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో స్పందించిన లైఫ్ గాడ్స్.. వారిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. టూరిస్టులను పెందుర్తి, మధురవాడకు చెందిన రవి, సురేష్‌గా గుర్తించారు.. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. ఆ తల్లి ఏం చేసిందంటే..? వీడియో వైరల్.. -
గ్రీస్‌లో పడవ మునక.. 79 మంది జలసమాధి
గ్రీస్: ఏథెన్స్: బతుకుదెరువు కోసం వలసపోతున్న డజన్లకొద్దీ శరణార్థుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. దక్షిణగ్రీస్ సముద్రజలాల్లో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 79 మంది జలసమాధి అయ్యారు. డజన్లకొద్దీ జనం జాడ గల్లంతయ్యింది. పెలోపోన్నీస్ ప్రాంతం నుంచి తీరానికి 75 కిలోమీటర్లదూరంలో సముద్రంలో మంగళవారం రాత్రివేళ జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 104 మంది కాపాడామని అధికారులు తెలిపారు. విషయం తెల్సుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కాపాడిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్న వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. 78 మంది మరణించారని అధికారులు చెబుతున్నా ఇంకా ఎంతమంది మరణించి ఉంటారనేది తెలియట్లేదు. ఆరు తీర గస్తీ నౌకలు, ఒక నావికాదళ యుద్ధనౌక, ఒక సైనిక రవాణా విమానం, వాయుసేన హెలికాప్టర్, ఇంకా కొన్ని ప్రైవేట్ పడవలు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు. తూర్పు లిబియా దేశంలోని తోబ్రక్ ప్రాంతం నుంచి ఈ శరణార్థుల పడవ బయల్దేరి ఇటలీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశానికి ఇలా ఒక వలసదారుల పడవ వస్తోందని ముందే గ్రీక్ అధికారులకు ఇటలీ అధికారులు సమాచారం ఇచ్చారు. వలసదారులను కలామటా నౌకాశ్రయానికి తరలించి అక్కడ ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ఏర్పాటుచేసిన శిబిరాల్లో ప్రథమ చికిత్స అందించారు. లిబియా అదుపులో వేలాది మంది శరణార్థులు అక్రమంగా ఇలా ప్రయాణం సాగిస్తున్న వారిపై గతంలోనే లిబియా సర్కార్ తన అప్రమత్తతను కనబరిచింది. ఈజిప్ట్, పాకిస్తాన్, సిరియా, సూడాన్ తదితర దేశాలకు వేలాది మంది శరణార్థులు సముద్ర జలాల్లో అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుంది. ఈజిప్ట్‌కు చెందిన వారిని వెంటనే భూమార్గంలో తిరిగి వారి దేశానికి పంపేసింది. లిబియా దక్షిణ ప్రాంతంలో చూస్తే రాజధాని ట్రిపోలీసహా పలు ప్రాంతాల్లోని శరణార్థి హబ్‌లలో సోదాలు చేసి దాదాపు 1,800 మందిని అదుపులోకి తీసుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ తెలిపింది. మధ్యధరా సముద్ర జలాల్లో స్థానిక తీర గస్తీ పెట్రోలియం దళాల కంటపడకుండా ఉండేందుకు చాలా మంది స్మగ్లర్లు పెద్ద సైజు పడవలను సమకూర్చుకుని అంతర్జాతీయ జలాల వెంట అక్రమంగా శరణార్థులను తరలిస్తున్నారు. ఆదివారం ఇదే మధ్యధరా సముద్ర జలాల్లో తమను కాపాడండంటూ అమెరికా తయారీ పడవలో వెళ్తున్న 90 మంది శరణార్థులు అత్యవసర సందేశం ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
Kerala Boat Capsizes : కేరళలో ఘోర ప్రమాదం.. టూరిస్ట్ బోటు బోల్తా (ఫొటోలు)
-
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 76 మంది దుర్మరణం
లాగోస్: వరదలతో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో వెళ్తున్న పడవ మునిగి 76 మంది దుర్మరణం చెందారు. ఈ విషాదం సంఘటన నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో జరిగింది. వరద నీటిలో పడవ మునకపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి. నైగెర్ నది వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. పడవలో దాదాపు 85 మంది ప్రయాణించారని, ఓవర్ లోడ్ కారణంగా మునిగిపోయినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ‘రాష్ట్రంలోని ఓగుబరూ ప్రాంతంలో సుమారు 85 మందితో వెళ్తున్న పడవ వరదలతో ఉప్పొంగిన నదిలో మునిగిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మొత్తం 76 మంది మరణించినట్లు అత్యవసర సేవల విభాగం ధ్రువీకరించింది. బాధితులకు అత్యవసర సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.’ అని తెలిపారు అధ్యక్షుడు బుహారి. భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగినట్లు అత్యవసర విభాగం వెల్లడించింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కఠినంగా మారినట్లు తెలిపింది. సహాయ చర్యల కోసం నౌకాదళ హెలికాప్టర్ సాయం కోరామని పేర్కొంది. ఇదీ చదవండి: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఆరుగురు మృతి -
యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 20 మంది మృతి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాందా జిల్లాలోని యమునా నదిలో గురువారం ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మార్కా గ్రామంలోనే మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్‌కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. పడవలోని మహిళా ప్రయాణికులు రక్షాబంధన్ కోసం వెళ్తున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు. ‘మార్కా గ్రామం నుంచి ఫతేపూర్ వెళ్తుండగా యమునా నదిలో పడవ బోల్తా పడింది. బోటులో ఎంతమంది, ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.’ అని బాందా పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం? -
అర్ధరాత్రి ఘోరం.. వలసదారుల పడవ బోల్తా పడి 17 మంది మృతి!
నసౌ: వలసదారులతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయి 15 మంది మహిళలు సహా మొత్తం 17 మంది మృతి చెందారు. వారంతా హైతీకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఈ విషాద ఘటన ఆదివారం కరేబియన్ దీవి బహమాస్‌లో జరిగింది. పడవలోని మరో 25 మందిని కాపాడినట్లు బహమాస్ భద్రతా దళాలు తెలిపాయి. న్యూప్రోవిడెన్స్‌కు ఏడు మైళ్ల దూరంలో బోటు ప్రమాదానికి గురైందని.. ఎంత మంది ఉన్నారనేదానికి స్పష్టత లేదని పేర్కొన్నాయి. మృతుల్లో 15 మంది మహిళలు, ఓ వ్యక్తి, ఓ చిన్నారి ఉన్నట్లు బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ప్రకటించారు. ప్రమాదంలో కాపాడిన వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ట్విన్ ఇంజిన్ స్పీడ్ బోట్ సుమారు 60 మందితో రాత్రి ఒంటిగంటకు బయలుదేరినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఆ పడవ మియామీకి వెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు. మానవ అక్రమ రవాణా అనుమానాలతో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ‘ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బహమాస్ ప్రజలు, ప్రభుత్వం తరఫున సంతాపం తెలుపుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి యాత్రలపై హెచ్చరిస్తూనే ఉంది.’ అని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు హైతీ ప్రధాని అరియెల్ హెన్రీ. ఈ దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దేశం విడిచి ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. గత ఏడాది జులైలో హైతీ అధ్యక్షుడు జెవెనెల్ మోయిస్ హత్యకు గురైన క్రమంలో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో పడింది. దీంతో ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో అపశృతి
-
చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రాజోలు మండలం సోంపల్లి దగ్గర బోటు దిగుతుండగా బరువు ఎక్కువై నీటిలో బోల్తా కొట్టింది. దీంతో బోటులో ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు.. అందర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. చదవండి: పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ లైఫ్ జాకెట్లు లేకుండా.. అధికారులు చెప్పినా టీడీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. లైఫ్ జాకెట్లు లేకుండా బోటులో ప్రయాణించారు. చంద్రబాబుతో సహా సేఫ్టీ చర్యలను టీడీపీ నేతలు పాటించలేదు. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ,రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడిపోయారు. -
భారీ వర్షాలు: మునిగిన 12 పడవలు..
Gujarat 12 Boats Sink in Sea Near Gir Somnath: గుజరాత్లో పెను విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 12 పడవలు మునిగిపోయాయి. వీటిల్లో 23 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటి వరకు 11 మందిని కాపాడగ.. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ గుజరాత్లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గుజరాత్ వ్యాప్తంగా పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో అరేబియా సముద్రం సమీపంలోని గిర్-సోమ్‌నాథ్ ప్రాంతంలో, బలమైన గాలులు వీచాయి. ఆ సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన 12 మత్స్యకారుల పడవలు మునిగిపోయాయి. (చదవండి: విషాదం నింపిన విహారయాత్ర) వాతావరణ మార్పుల గురించి అధికారులు మంగళవారం సాయంత్రం నుంచే హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లవద్దని పదే పదే హెచ్చరించారు. కానీ మత్స్యకారులు వాటిని పట్టించుకోకుండా వేటకు వెళ్లి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. బుధవారం ప్రమాదం జరగడానికి కొంత సమయం ముందు కూడా అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం లోపలికి వెళ్లవెద్దని అధికారులు హెచ్చరించారు. దాంతో చాలా మంది మత్స్యకారలు వెనక్కి వచ్చేశారు. గల్లంతయిన వారు కూడా తిరిగి వస్తుండగా.. బలమైన గాలులు వీచడం.. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరంతా గల్లంతయ్యారు. ప్రస్తుతం నేవీ అధికారులు, రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. (చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు) దక్షిణ గుజరాత్ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉన్నట్లుండి మూడు డిగ్రీలకు దిగజారింది. ఈ క్రమంలో డయ్యూ ప్రాంతంలో కూడా పడవ మునిగిపోవడం కారణంగా ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. చదవండి: దొంగతనం: 3 నెలలుగా ఒంటిపూట భోజనం.. 10 కేజీలు బరువు తగ్గి మరీ -
బందరువానిపేట తీరంలో విషాదం.. పడవ బోల్తా
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గార మండలం బందరువానిపేట తీరంలో విషాదం చోటుచేసుకుంది. వేకువజామున చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడింది. పడవలో మొత్తం ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ముగ్గురు మత్స్యకారులు గల్లంతు అవ్వగా, ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
లిబియాలో ఘోర పడవ ప్రమాదం
-
లిబియాలో ఘోర పడవ ప్రమాదం; 57 మంది మృతి!
ట్రిపోలీ: లిబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది మృతి చెందినట్లు భావిస్తున్నామని యూఎన్ మైగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. పడవ పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం బయలుదేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వారున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలోనే పడవ ఆగిపోయిందని, ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోల్తాపడిందని తేలింది. ఐరోపాలో మెరుగైన జీవితం కోసం వలసదారులు, శరణార్థులు మధ్యధరా సముద్రం మీదుగా పడవల్లో వలస వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. మరో 500 వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకొని లిబియాకు తరలించారు.. 18 మందిని ఈదుకుంటూ వచ్చి సోమవారం ఒడ్డుకు చేరుకున్నట్లు మెహ్లీ తెలిపారు. -
స్వాభిమాన్ జలాశయంలో నాటు పడవ బోల్తా
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జలాశయంలో నాటు పడవ బోల్తాపడి ముగ్గురు గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి. సమితిలోని ఓండ్రాపల్లి పంచాయతీ ఓరపొదర్ గ్రామానికి చెందిన 8 మంది వ్యక్తులు, అదే పంచాయతీ దామోదర బేడ గ్రామానికి చెందిన గోపాల్ ముదులి (45), కుమార్తె జమున ముదులి, మూడేళ్ల మనుమడు కోరుకొండ సమితిలోని నక్కమమ్ముడి పంచాయతీ భకులి గ్రామానికి నాటు పడవలో వస్తున్నారు. అయితే పడవలో బరువు ఎక్కువ కావడంతో జలాశయం మధ్యలో బోల్తాకొట్టింది. దీంతో గోపాల్ ముదులి, జయ ముదులి, మూడేళ్ల బాలుడు గల్లంతయ్యారు. పడవలో ఉన్న మిగిలిన 8 మంది ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరిన వారి సమాచారం అగ్నిమాక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. చీకటి పడడంతో వారి ఆచూకీ తెలియరాలేదు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు ఉండడంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. -
ట్యునీషియా తీరంలో బోటు మునక: 50 మంది గల్లంతు
ట్యునిస్: ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా తీరంలో వలసదారులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో అందులోని సుమారు 50 మంది గల్లంతయ్యారు. మరో 33 మందిని సమీపంలోని చమురు సంస్థ సిబ్బంది కాపాడారు. ఎస్‌ఫాక్స్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుందని ట్యునీషియా రక్షణ శాఖ తెలిపింది. సురక్షితంగా బయటపడిన వారంతా బంగ్లాదేశీయులేనని అంతర్జాతీయ వలసదారుల సంస్థ పేర్కొంది. లిబియాలోని జవారా రేవు నుంచి బయలుదేరిన ఈ పడవలో 90 మంది వరకు ఉంటారని తెలిసిందని ప్రకటించింది. యూరప్ వెళ్లాలనుకునే వలసదారులు లిబియా మీదుగా ప్రమాదకరమైన ఈ మధ్యదరా సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చదవండి: ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు, ప్రతిదాడులు -
బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 26 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో అత్యంత వేగంగా వెళుతున్న బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మరణించారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మదారిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇసుకను తీసుకెళ్లే కార్గో పడవను ప్రయాణికులతో వెళుతున్న బోటు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అనుభవం లేని ఓ బాలుడు దాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. బుధవారం వరకూ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని పాటించకుండా ఒకే పడవలో 30 మందిని ఎక్కించారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. మొత్తం 26 మృతదేహాలను నీటి నుంచి వెలికి తీశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చదవండి: భారత్‌కు ఈయూ చేయూత -
విషాదం నింపిన విహారయాత్ర
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం విహారయాత్ర పెనువిషాదాన్ని నింపింది. విహారయాత్రకని వెళ్లిన 20 మంది బాలికల బృందంలోని ఇద్దరు పడవలో ప్రయాణిస్తూ అదుపు తప్పి నీటిలో పడి గల్లంతయ్యారు. బీజాపూర్ జిల్లాలోని జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. 20 మంది బాలికల బృందం బీజాపూర్ జిల్లాలోని మింగాచల్ నదికి విహారయాత్రకని వచ్చారు. వారిలో ఇద్దరు బాలికలు సరదాగా పడవ ఎక్కారు. అయితే కాసపటికే ప్రమాదవశాత్తు పడవ నదిలో బోల్తా పడడంతో ఇద్దరు బాలికలు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన మిగతా బాలికలు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. -
ఇంద్రావతి నదిలో ప్రమాదం
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఇంద్రావతి నదిలో రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని అతుకుపల్లిలో ఓ శుభకార్యానికి పది మంది పురుషులు, ఐదుగురు మహిళలు నాటు పడవల్లో ఇంద్రావతి నది దాటి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చీకటి పడడంతో వరద ఉధృతిని అంచనా వేయలేక నది దాటే క్రమంలో రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా సోమన్‌పల్లి వాసులు 15 మంది నీటిలో కొట్టుకుపోయారు. కొంత మందికి ఈత రావడంతో సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: పడవ ప్రమాదంలో 32 మంది మృతి! మిగతా వారు పెద్ద బండలను పట్టుకొని స్థానికులు వచ్చేవరకు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు మంగళవారం రాత్రి నీటిలో చిక్కుకున్న వారిని కాపాడారు. అయితే ఇద్దరు మహిళల ఆచూకీ మాత్రం లభించలేదు. బుధవారం ఉదయం అటవీ, పోలీసు శాఖ అధికారులు గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. గల్లంతైన వారిని సోమన్పల్లికి చెందిన కాంత ఆలం, శాంత గావుడేలుగా గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతం భూపా లపల్లి జిల్లా పలిమెల మండలానికి సమీపంలో ఉంటుంది. మంజీరాలో చిక్కుకున్న నలుగురు సాక్షి, మెదక్: చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు మంజీర నదిలో చిక్కుకోగా.. అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే. కాగా, పైనుంచి నీటి ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. ప్రవాహం తగ్గడంతో మెదక్ పట్టణానికి చెందిన ఆర్నే కైలాశ్, రాజబోయిన నాగయ్యతోపాటు కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుంపల ఎల్ల, సాదుల యాదగిరి మంగళవారం పొద్దుపోయాక చేపలవేటకు అవసరమైన సామగ్రితో పాటు ఆహార పదార్థాలను తీసుకుని హనుమాన్ బండల్ వద్ద నది దాటారు. రాత్రంతా అక్కడే వలలు వేసి చేపల వేట కొనసాగిస్తూ నిద్రపోయారు. బుధవారం ఉదయం లేచే సరికి నదీ ప్రవాహం పెరగడంతో అక్కడి నుంచి అవతలి ఒడ్డుకు వచ్చే పరిస్థితి లేకపోయింది. దీంతో వారు తమ బంధువులకు ఫోన్ల ద్వారా విషయం చెప్పగా, వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ ప్రదీప్, డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ ఇన్చార్జి ఆర్డీఓ సాయిరాం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశంతో సాయంత్రం మెదక్ మత్స్య సహకార సంఘానికి చెందిన గజ ఈతగాళ్లు అగి్నమాపక దళం సహకారంతో ఆవలి ఒడ్డుకు చేరుకుని అక్కడ చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రవాహ ఉధృతి దృష్ట్యా అటువైపు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరించారు. దీనికి సంబంధించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. -
పడవ ప్రమాదంలో 32 మంది మృతి!
ఢాకా: సోమవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బురిగాంగ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇప్పటివరకు 32 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలతో బయటపడిన వారు తెలిపిన వివరాల ప్రకారం, ఓల్డ్ ఢాకాలోని శ్యాంబజార్ ప్రాంతం వెంట సోమవారం ఉదయం 9:15 గంటలకు యమ్ ఎల్ మార్నింగ్ బర్డ్ అనే పడవ మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. (కరోనా: బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి మృతి) "ఎంఎల్ మార్నింగ్ బర్డ్ మరొక పడవ మోయూర్ -2 ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని వల్ల నీరు పడవలోకి చేరుకుంది’ అని ఢాకా ట్రిబ్యూన్ అగ్నిమాపక సేవా ప్రధాన కార్యాలయం అధికారి రోజినా అఖ్టర్ తెలిపారు. “డిజైన్ ప్రకారం, సామర్థ్యం కొద్ది ఆ పడవలో 45 మంది ప్రయాణికులను తీసుకెళ్లాలి కానీ మరికొంత మంది ప్రయాణికులను అధికంగా ఎక్కించుకోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. వేరొక పడవను ఢీ కొట్టడం వలన ఈ ఘటన చోటు చేసుకుంది ” అని కమాండర్ గోలం సాడేక్ తెలిపారు. మృతదేహాలను వెలికి తీసినందు వల్ల ఇప్పుడు పడవను పైకి తీసేందుకు ప్రయత్నింస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విచారం వ్యక్తం చేశారు. (బంగ్లాదేశ్‌లో కివీస్ పర్యటన వాయిదా) -
పడవ మునక : ఆరుగురి మృతి
లక్నో : గంగా నదిలో పడవ మునిగిపోవడంతో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మరణించిన ఘటన యూపీలోని చందోలిలో వెలుగుచూసింది. శనివారం సాయంత్రం పడవ నీట మునిగిన సమాచారం అందడంతో వారణాసి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 40 మంది కూలీలతో ప్రయాణిస్తున్న పడవ తిరుగు ప్రయాణంలో గంగా నదిని దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుందని చందోలి ఎస్పీ హేమంత్ కుతియాల్ తెలిపారు. నది మధ్యలో పడవ బోల్తా పడటంతో ప్రమాదం జరిగిందని 35 మంది క్షేమంగా బయటపడగా ఐదుగురు మహిళలు సహా ఆరుగురి ఆచూకీ గల్లంతైందని ఎస్పీ వెల్లడించారు. -
‘శవాలు కొట్టుకుపోతున్నా ఏం చేయలేకపోయాం’
వెల్లింగ్టన్: దాదాపు నెలరోజుల పాటు పసిఫిక్ మహా సముద్రంలో కొట్టుమిట్టాడిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. కార్టెరెట్ ఐలాండ్‌లో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనేందుకు మొత్తం 12 మంది వెళ్లగా అందులో ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు బుధవారం పేర్కొంది. వివరాలు... పాపువా న్యూ గినియాలోని బౌగన్‌విల్లే ప్రావిన్స్‌కు చెందిన ఓ బృందం డిసెంబరు 22న కార్టెరెట్ ఐలాండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడగా.. ఏడుగురు మునిగిపోయారు. ఓ చిన్నపాపతో పాటు మరో నలుగురు బోటును గట్టిగా పట్టుకుని వేలాడుతూ.. అందులోని నీళ్లు తొలగించి.. ప్రాణాలతో బయటపడ్డారు. అయితే సరైన ఆహారం లేకపోవడంతో చిన్నపాప మరణించగా.. ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, పన్నెండేళ్ల బాలిక మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో వీరంతా సముద్ర తీరంలో దొరికిన కొబ్బరికాయలు తింటూ.. వర్షపు నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆఖరికి చేపల వేటకు బయల్దేరిన ఓ సమూహం వీరిని గుర్తించి సాయం అందించడంతో సముద్రం నుంచి బయటపడ్డారు. ఈ విషయం గురించి బాధితుడు డొమినిక్ స్టాలీ మాట్లాడుతూ... ‘‘ఎంతో సంతోషంగా బయల్దేరాం. కానీ మా ప్రయాణం విషాదంగా ముగిసింది. బోటు మునిగిపోయినపుడు మృతదేహాలను ఎలా తీసుకురావాలో.. వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అవి కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. చనిపోయిన వారిలో ఓ జంట కూడా ఉంది. వారి చిన్నారిని కొన్నాళ్లపాటు రక్షించగలిగాం గానీ తర్వాత తను చనిపోయింది. ఎన్నో పడవలు మమ్మల్ని దాటుకుని వెళ్లాయి. కానీ ఎవరూ మమ్మల్ని గుర్తించలేదు. ఆఖరికి వేటకు వచ్చిన కొంతమంది జనవరి 23న మమ్మల్ని బయటకు తీసుకువచ్చారు. హోనియారాలో మమ్మల్ని డ్రాప్ చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు పాపువా న్యూ గినియాకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గతంలో కూడా ఓ వ్యక్తి ఇలాగే మెక్సికో పశ్చిమ తీరంలో దాదాపు 13 నెలల పాటు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పచ్చి చేపలు, పక్షుల మాంసం, తాబేలు రక్తం, తన ద్రవ విసర్జనాలు తాగి ప్రాణాలు నిలుపుకొన్నాడు. తొలుత అతడి గురించి వచ్చిన కథనాలను అందరూ కొట్టిపారేసినా పాలిగ్రాఫ్ పరీక్షలో అతడు చెప్పినవన్నీ నిజాలని తేలాయి. -
టూరిజం బోటింగ్ పునఃప్రారంభం
సాక్షి, విశాఖ: టూరిజం బోటింగ్ పున:ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండ, హార్బర్ వద్ద నిర్వహిస్తున్న టూరిజం బోటింగ్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం రుషికొండ బీచ్ వద్ద బోటింగ్‌ను పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. పర్యాటకులకు స్వర్గధామమైన విశాఖలోని రిషికొండలో నాలుగు పర్యాటక బోట్లను మంత్రి ప్రారంభించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. పర్యాటక బోట్ల నిర్వాహకులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. స్పీడ్, జెట్ స్కీ బోట్లు, లైఫ్ గార్డుల శిక్షణ, పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు, బీమా సౌకర్యంతో జల విహారాన్ని ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు నేటి నుంచి జల విహారం అందుబాటులోకి వచ్చింది. కాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు పడవ ప్రమాదం తర్వాత బోట్ల రాకపోకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. -
వారి కుటుంబాల్లో వేదనే మిగిలింది
వరుస ప్రమాదాలు ఈ ఏడాది ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గతేడాదితో పోల్చుకుంటే 2019లో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగి దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి యావత్ భారతాన్ని శోక సంద్రంలో ముంచింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు ఆహూతయ్యారు. గోదావరి బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదన్ని మిగిల్చింది. ఇక రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచిన నల్గొండ రహదారి ప్రజల రక్తం తాగేసింది. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ప్రమాదాలను ఓ సారి పరిశీలిద్దాం..! అయ్యప్ప దర్శనం కోసం వెళ్లి.. తమిళనాడులో జనవరి 6న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకోట్టై జిల్లా తిరుమయం వద్ద అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న వ్యాన్, మరో కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శబరిమలై అయ్యప్పను దర్శించి, రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న ఈ భక్తులు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా, అతివేగంగా దూసుకొచ్చిన ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి మంటల్లో ఎగ్జిబిషన్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనవరి 30 రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న400 స్టాళ్లను బూడిద చేశాయి.ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు యాభైవేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం రూ. వందల కోట్లలో జరిగింది. పూర్తి వార్తకోసం క్లిక్ చేయండి పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి బీహార్‌లో ఫిబ్రవరి 3న ఘోర రైలు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతి చెందారు. దాదాపుగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాట్నాకు 30కి.మీ దూరంలో ఫిబ్రవరి 3న ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేసింది. నకిలీ మద్యానికి 34 మంది బలి (ఫిబ్రవరి 8) : ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోని ఇరుగుపొరుగు జిల్లాల పరిధిలో కల్తీ మద్యం తాగి 34 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లో 16 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా ఝాబ్రెరా ప్రాంతం బాలుపూర్ గ్రామస్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్ పూర్ జిల్లాలో మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు ఫిబ్రవరి 7న వెళ్లారు. ఆతర్వాత కల్తీ మద్యం తాగారు. ఈ ఘటనలో 16మంది మృతి చెందారు. హోటల్లో మంటలు.. 17 మృతి రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో ఫిబ్రవరి 12న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవంతి నుంచి దూకి మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఉద్యోగి కూడా ఉన్నారు. కరోల్‌బాగ్‌లోని హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఉలిక్కిపడ్డ భారతావని (ఫిబ్రవరి 14-26) : జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఫిబ్రవరి14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి దెబ్బకు దెబ్బ పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను చావు దెబ్బతీసింది. . 2016 నాటి సర్జికల్ దాడుల్ని గుర్తుకు తెస్తూ, పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో జైషే నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు, వారి శిక్షకుల్ని మట్టుపెట్టింది. నెత్తురోడిన నల్లగొండ రహదారి నల్లగొండ జిల్లాలో రహదారి నెత్తురోడింది. మార్చి 6న హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న టాటా ఏసీ మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బస్సు కూడా వేగంగా ఉండటంతో టాటాఏసీ వాహనాన్ని 20అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషాదం మిగిల్చిన విమానం ఇథియోపియాలో మార్చి10న జరిగిన ప్రమాదంలో విమానం కూలిపోయింది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం..బయలుదేరిన కాసేపటికే కుప్పకూలింది. 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. మొత్తం 157 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కెన్యా, ఇథియోపియా, కెనడా, చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఈజిప్టు, నెదర్లాండ్, స్లొవేకియా, భారత్‌కు చెందినవారు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి పాదాచారులను మింగిన వంతెన ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) నుంచి అంజుమన్ కాలేజీ, టైమ్స్ ఆప్ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం మార్చి 12న రాత్రి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. కసబ్ బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెనపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ వంతెనకి కసబ్ బ్రిడ్జి అనేపేరు స్థిరపడిపోయింది. ఛత్తీస్‌లో మావోల ఘాతుకం (ఏప్రిల్ 9) : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చి పోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ పేల్చారు. వెంటనే చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దుర్భటనలో ఎమ్మెల్యే మాండవి(40)తో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి (ఏప్రిల్ 9) : నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ శివార్లో మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి చెందారు. వీరంతా ఉపాధి హామీ కూలీలు. ఎండ ఎక్కువ ఉండడంతో నీళ్లు తాగేందుకు గుట్ట నీడ కిందికి వెళ్లారు. అదే సమయంలో ఓ చిన్న మట్టిపెళ్ల బోయిని మణెమ్మ అనే కూలీ మీద పడింది. వెంటనే తేరుకున్న ఆమె గుట్ట కూలేటట్టు ఉందని మిగతా కూలీలను అప్రమత్తం చేస్తుండగానే.. ప్రమాదం ఉప్పెనలా వచ్చింది. ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలడంతో పది మంది మట్టికింద సమాధి అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయడం రాములవారి కల్యాణానికి వెళ్లి.. (ఏప్రిల్ 14) : సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢికొట్టి ఏడుగురు దుర్మరణం చెందారు. కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అకాల వర్షాలకు 53 మంది బలి రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలనే భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. ఏప్రిల్ 16న కురిసిన భారీ వర్షాలకు నాలుగు రాష్ట్రాలతో కలిపి 53 మంది మరణించారు. వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్‌లో 25 మంది, మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు. ఈస్టర్ ప్రార్థనలపై ఉగ్రదాడులు.. 215 మంది మృతి ఈస్టర్ పండుగరోజు(ఏప్రిల్ 21) శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేశారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. ఈ ప్రమాదంతో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500మందికితీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు సహా 33మంది విదేశీయులు మృతి చెందారు. ఇదే నెల 27న మరోసారి ఉగ్రవాదు రెచ్చి పోయారు. శ్రీలంక భద్రతాబలగాలపై కాల్పులు జరిపి తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో ఆత్మహుతి బాంబర్లతో సహా 15మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి రెచ్చిపోయిన మావోలు.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్తులు విసిరిన పంజాలో 15 మంది పోలీసులు మృతిచెందారు. కూబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. మే1న జరిగిన ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీసు విభాగం క్విక్‌రెస్పాన్స్ టీం యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసుల వాహనం తునాతునకలైంది. కాగా 2018 ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో భాగంగా 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. విషాదం మిగిల్చిన పెళ్లి చూపులు కర్నూల్ జిల్లా వెల్దుర్తి వద్ద మే11న జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వచ్చిన బస్సు ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి అవతలివైపు వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. ఓ పెళ్లి సంబంధం కుదుర్చుకొని తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసకుంది. మృతులంతా 25-40 ఏళ్లలోపే వారే. 15 మంది దుర్మరణం మహారాష్ట్రలోని పుణెలో గోడకూలి 15 మంది దుర్మరణం పాలయ్యారు. కుంద్వా ప్రాంతంలోని బడాతలావ్ మసీదు సమీపంలో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఎడతెరపి లేని కుండపోత వర్షాలకు నేల కుంగడంతో దాదాపు 22 అడుగుల రక్షణ గోడ కూలి షెడ్లపై పడింది. అక్కడే కార్లు పార్క్ చేయడంతో తీవ్రత మరింత పెరిగింది. అక్కడే నిద్రిస్తున్న 15 మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. కార్మికుంతా బిహార్ నుంచి వలస వచ్చినవారే. జూన్ 31న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన బస్సు.. జమ్మూకాశ్మీర్‌లో జులై1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కేశవాన్ నుంచి కిష్టావర్ ప్రాంతానికి బయలుదేరిన మినీ బస్సు సిర్గ్వారి ప్రాంతంలో బస్సు మలుపు తీసుకుంటుండగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో పాటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి అగ్నికి ఆహుతి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది మృతిచెందగా, మరో 27 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బటాలా ప్రాంతంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో సెప్టెంబర్ 4న భారీ పేలుడు సంభవించింది. బటాలా-జలంధర్ రహదారిలోని హన్సాలీ పుల్ వద్ద ఉన్న రెండస్తుల ఫైర్‌క్రాకర్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోయింది. నానక్ దేవ్ పెండ్లి మహోత్సవంతో పాటు పలు పండుగల నేపథ్యంలో కర్మాగారంలో కొన్ని రోజులుగా టపాసులు నిల్వ చేశారు. భారీగా నిల్వచేసిన పటాసులు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివాసాలకు కూడా మంటలు వ్యాపించాయి. విషాదం మిగిల్చిన విహార యాత్ర తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న పెను విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 77 మందితో ప్రయాణిస్తున్న బోటు నదిలో బోల్తా పడడంతో 51 మంది మరణించారు. మరో 26 మందిని స్థానికులు రక్షించారు. ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగి 38 రోజుల తీవ్రంగా శ్రమించి బోటును, బోటులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి పుణ్యక్షేత్రాలకు వెళ్లి.. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో అక్టోబర్15 న జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుపల్లి- చింతూరు ఘాట్రోడ్లో వాల్మీకి కొండ వద్ద వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. రెండు ప్రైవేట్ టెంపో ట్రావెల్స్ వాహనాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన 24 మంది తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు బయలుదేరారు. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ప్రమాదకర మలుపులో అదుపుతప్పి బోల్తాపడింది. 25 అడుగుల ఎత్తు నుంచి వ్యాన్ కిందపడడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. భారీ పేలుడు.. మృతదేహాలు ఛిద్రం మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో అక్టోబర్31 న భారీ పేలుడు సంభవించింది. శిరపూర్ సమీపంలోని వాఘూడీ గ్రామ సమీపంలో ఉన్న రుమిత్ కెమికల్ కంపెనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 65 మంది గాయపడ్డారు. పేలుడు శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల దూరం వినిపించాయి. పేలుడు తీవ్రతకు కొన్ని మృతదేహాలు కూడా ఛిద్రం అయ్యాయి. భారీ అగ్ని ప్రమాదం దేశ రాజధాని ఢిల్లీలోని అనాజ్‌మండీలో ఉన్న ఫాక్టరీలో డిసెంబర్ 8న జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే జరగరాని నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భవనం రెండో అంతస్తు నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వస్తువులు నిల్ల ఉండడంతో మంటలు వెనువెంటనే వ్యాపించాయి. - శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్ -
‘ఆటు’బోట్లకు చెక్
గోదావరి విహారం ఎంత ఆనందం కలిగిస్తుందో.. పరిస్థితి విషమిస్తే అంతలోనే విషాదం మిగులుస్తుంది. దీనికి నిస్సందేహంగా ఒక నిర్దిష్ట పర్యాటక విధివిధానాలు లేకపోవడమే కారణం. అందుకే పుట్టగొడుగుల్లా టూరిజం ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయి. శిక్షణ లేని సురంగుల సారథ్యంలో లైసెన్సులు లేని బోట్లు తిప్పుతూ.. పర్యాటకుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా జల పర్యాటక ప్రాంతాల్లో బోట్ల నిర్వహణను నియంత్రించాలని తలంచింది. దీనికోసం ప్రత్యేక విధివిధానాలు రూపొందించింది. జంగారెడ్డిగూడెం: నదీ పర్యాటకానికి సురక్షిత ప్రయాణమే ఆయువు పట్టు. ఇటీవల చోటు చేసుకున్న బోటు ప్రమాదం పర్యాటకాన్ని కుదిపేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పర్యాటకులు సైతం నదీ పర్యాటకానికి భయపడుతున్నారు. దీంతో బోటు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఎక్కడికక్కడ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గోదావరి నదీ తీరాన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఐదు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్కదానికి రూ.1.62 కోట్లు ఖర్చుచేయనుంది. ప్రతి పడవకూ మళ్లీ లైసెన్స్.. ఇకపై ప్రతి బోటుకూ కచ్చితంగా లైసెన్సులు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకు బోట్లు, పడవల పర్యవేక్షణ ధవళేశ్వరం బోటు సూపరింటెండెంట్ పరిధిలో ఉంది. తాజాగా నిబంధనలు మార్చి బోట్ల పర్యవేక్షణ బాధ్యతను కాకినాడ పోర్టు అధికారికి ప్రభుత్వం అప్పగించింది. పట్టిసీమ, నరసాపురం తదితర ప్రాంతాల్లోనూ బోట్లు, పడవలు నడుస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం బోటు, పడవల లైసెన్సులతో పాటు నడిపే చోదకులకు కూడా లైసెన్సులు ఉండాలి. ప్రయాణికుల భద్రతకు అవసరమైన లైఫ్ జాకెట్లు ఉండాలి. బోటు సామర్థ్యాన్ని బట్టి ఇంజిన్ సామర్థ్యం ఉండాలి. వచ్చే నెల 10 నుంచి బోట్ల లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈలోగా సరంగులు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 40కిపైగా ప్రయాణ పడవలు, పాపికొండలకు వెళ్లే లాంచీలు 63 ఉన్నాయి. వీటన్నింటికీ తిరిగి లెసెన్సులు పొందాలి. బోటు ఫిట్నెస్తోపాటు నదులు, జలవనరుల రూట్ సర్వే, సరంగుల డ్రైవింగ్ శిక్షణ తప్పనిసరి. సరంగులకు ప్రత్యేకంగా 18 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తయిన తరువాతే లైసెన్సులు జారీ చేస్తారు. వచ్చేనెల 10న కాకినాడలో సరంగుల పరీక్షలు నిర్వహించనున్నారు. బోటును ఆపరేట్ చేయడానికి రూటు పర్మిట్ ఇరిగేషన్ శాఖ నుంచి కచ్చితంగా తీసుకోవాలి. తొలిదశలో 9 చోట్ల కంట్రోల్ రూమ్‌లు బోటు ప్రమాదాల నివారణ కోసం తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక వద్ద బోటు కంట్రోల్ రూమ్‌కు ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి రూ.70 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఇదిలా ఉంటే గోదావరి తీరంలో ఏర్పాటు చేయనున్న ఒక్కొక్క కంట్రోల్‌రూమ్‌ను రూ.1.62 కోట్లతో నిర్మించనున్నారు. ప్రతి కంట్రోల్‌రూమ్‌లో 13 మంది సిబ్బంది ఉంటారు. దీనిలో టూరిజం, పోలీసు, జలవనరులు, రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది పనిచేస్తారు. తొలిదశలో తొమ్మిదింట్లో పశ్చిమగోదావరి జిల్లాలో సింగన్నపల్లి, పేరంటాళ్ల పల్లి వద్ద కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పోచవరం, గండిపోచమ్మ గుడి వద్ద, రాజమండ్రి పద్మావతి ఘాట్ వద్ద గోదావరి నది తీరాన కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గోదావరి తీరం వెంబడి మొత్తం ఐదు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. మిగతావి కృష్ణానది విజయవాడ పున్నమిఘాట్లో, విశాఖ రిషీకొండ బీచ్‌లో శ్రీశైలం పాతాళగంగ, నాగార్జున సాగర్ వద్ద ఈ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. కార్యాచరణ ఇదే.. బోటు ప్రమాదాల నివారణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ ప్రకటించారు. కంట్రోల్ రూమ్‌లకు తహసీల్దార్ ఇన్చార్జ్గా ఉంటారు. 13 మంది సిబ్బందితో కంట్రోల్ రూమ్ నిర్వహణ ఉంటుంది. వీరిలోముగ్గురు పోలీసులు కచ్చితంగా ఉండాలి. పడవ ప్రయాణ మార్గాలు, వాటి కదలికలు, వరద ప్రవాహంపై సమగ్ర సమాచారం ఈ కంట్రోల్ రూమ్‌లకు ఉండాలి. పడవ ప్రయాణాలను పర్యవేక్షించాల్సిన పూర్తి బాధ్యత కంట్రోల రూమ్ సిబ్బందిదే. మద్యం సేవించి పడవ నడపకుండా శ్వాస పరీక్షలు నిర్వహించాలి. పడవలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలి. కంట్రోల్ రూమ్ పరిధిలోని బోట్లు, జెట్టీలు ఉండాలి. పడవ ప్రయాణానికి టికెట్ల జారీ అధికారం కూడా వీటికే అప్పగించాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడగలిగితే కంట్రోల్ రూమ్ సిబ్బందికి 2 నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలి. రెండేళ్ల వ్యవధిలో జరిగిన పడవ దుర్ఘటనలు ఇవీ.. ►కృష్ణా నదిలో 2017లో జరిగిన బోటు ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ►2018 మే 11న గోదావరిలో బోటు ప్రమాదం జరిగింది. ప్రాణనష్టం జరగలేదు. ►2018 మే 15న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో 19మంది మృత్యువాతపడ్డారు. ►2018 సెప్టెంబర్ 15న గోదావరిలో వశిష్ట రాయల్ బోటు ప్రమాదంలో 51 మంది మృతిచెందారు. -
ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్
సాక్షి, తూర్పు గోదావరి: కచ్చులురు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలిసి తీసిన ధర్మాడి సత్యంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్మానించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన సత్యం, ఆయన బృందానికి సీఎం వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. బోటు వెలికి తీసినందుకు సీఎం అభినందించారు. కాగా సత్యం బృందాన్ని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే. బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీశారు. -
బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా వ్యవస్థను నియంత్రించడం ద్వారా బోటు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. బోటు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత కోసం 8 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జలవనరులు, పోలీసు, పర్యాటక, రెవెన్యూ తదితర శాఖల సిబ్బందిని ఈ కంట్రోల్ రూమ్‌ల్లో నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి కంట్రోల్ రూమ్‌లో 13 మందిని నియమించాలని, అందులో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ నెల 21వ తేదీన ఎనిమిది ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయానికొచ్చారు. ఈ కంట్రోల్ రూమ్‌లను 90 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం సమీపంలో సెప్టెంబరు 15న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై విచారణకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను బుధవారం సీఎం వైఎస్ జగన్‌కు అందజేసింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్గత జల మార్గాలు.. బోట్ల కదలికలు, వరద ప్రవాహాలు, వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేలా కంట్రోల్ రూమ్‌లను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. తద్వారా బోట్ల నిర్వహణను సులభంగా పర్యవేక్షించవచ్చని చెప్పారు. బోట్లలో జీపీఎస్ తప్పనిసరి కంట్రోల్ రూమ్‌కు ఎమ్మార్వో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. బోట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్ రూమ్లకే కట్టబెట్టాలన్నారు. బోట్లలో జీపీఎస్‌ను తప్పనిసరిగా అమర్చాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోట్లలో మద్యం వినియోగించే అవకాశం ఇవ్వకూడదని స్పష్టంచేశారు. బోటు బయలుదేరడానికి ముందే సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్షలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడగలిగితే.. ఆ మేరకు గ్రేడింగ్ ఇచ్చి, కంట్రోల్ రూమ్‌ల సిబ్బందికి రెండు నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలని సూచించారు. మరోసారి తనిఖీ చేశాకే అనుమతి రాష్ట్రంలో బోట్లన్నింటినీ మరోసారి తనిఖీ చేసి.. వాటి ఫిట్నెస్ను ధ్రువీకరించాకే అనుమతి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు. సారంగి, బోటు సిబ్బందికి శిక్షణ, అనుభవం ఉంటేనే లైసెన్సు ఇవ్వాలన్నారు. ఆపరేటింగ్ స్టాండర్ట్ ప్రొసీజర్(ఎస్ఓపీ) రూపొందించాలన్నారు. కంట్రోల్ రూమ్‌లలో సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆదేశించారు. బోట్లను క్రమం తప్పకుండా తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు లేని బోటు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
బోటు ప్రమాదాలపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో జలవనరులు, టూరిజం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బోటు ప్రమాదాలు, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. బోటు ప్రమాదాల నివారణ, భద్రత కోసం ఎనిమిది చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఏర్పాటుకానున్న ఈ కంట్రోల్ రూమ్‌లలో జలవనరులశాఖ, పోలీసులు, టూరిజం తదితర విభాగాలనుంచి సిబ్బందిని నియమిస్తారు. ప్రతి కంట్రోల్ రూంలో కనీసం 13 మంది సిబ్బంది ఉంటారు. ప్రతి కంట్రోల్ రూమ్‌లోనూ ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు తప్పనిసరి. నవంబర్ 21న ఈ ఎనిమిది కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 90 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వరద ప్రవాహాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని.. బోట్లు ప్రయాణించాల్సిన మార్గాలు, బోట్ల కదలికలపై నిరంతర సమాచారాన్ని సేకరిస్తూ.. వాటి ప్రయాణాలను పర్యవేక్షించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. బోట్లలో ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ వినియోగం ఉండకూడదని, అలాగే సిబ్బందికీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని తేల్చి చెప్పారు. బోట్లకు జీపీఎస్ కూడా పెట్టాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా కంట్రోల్ రూమ్స్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. కంట్రోల్ రూమ్స్ పరిధిలో బోట్లు, జెట్టీలు ఉండాలని, బోట్లపై ప్రయాణించేవారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్ రూమ్స్‌కే ఇవ్వాలని చెప్పారు. కంట్రోల్ రూమ్‌కు ఎమ్మార్వోనే ఇన్చార్జి అని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ రూం చూడగలిగితే.. గ్రేడింగ్ ప్రకారం వారికి కనీసం 2 నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలని సీఎం తెలిపారు. బోట్లలో వాకీటాకీలు, జీపీఎస్‌లు తప్పనిసరిగా ఉండాలని, మరోసారి బోట్లన్నీ తనిఖీచేసిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని, ఆపరేటింగ్ స్టాండర్డ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ఆధారంగా బోట్లు నడువాలని ఆదేశించారు. నదిలో ప్రవాహాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్‌రూమ్‌లకు అందజేయాలని, కంట్రోల్ రూంలోని సిబ్బంది నదిలో ప్రయాణాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలని అన్నారు. కంట్రోల్ రూమ్స్ సిబ్బందిని రిక్రూట్ చేశాక వారికి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని, వీరిని త్వరగా రిక్రూట్ చేయాలని అధికారులకు సూచించారు. బోట్లలో పనిచేసేవారికి కూడా శిక్షణ ఇవ్వాలని, శిక్షణ పొందినవారికే పనిచేయడానికి అనుమతి ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. ప్రస్తుతం లైసెన్స్‌లు, బోట్లను తనిఖీ చేస్తున్నామన్న అధికారులు.. తనిఖీలు చేసిన తర్వాతనే బోట్లకు అనుమతి ఇస్తామని తెలిపారు. దీనికోసం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. -
ధర్మాడి సత్యంకు డీఐజీ ప్రశంసలు
సాక్షి, కాకినాడ లీగల్: గోదావరిలో దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును సవాలుగా తీసుకొని వెలికి తీసి ధర్మాడి సత్యం బృందం రాష్ట్రానికి, జిల్లాకు, ప్రభుత్వానికి కీర్తి తెచ్చిందని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్‌ఖాన్ అన్నారు. ధర్మాడి సత్యం బృందాన్ని కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం డీఐజీ ఏఎస్ ఖాన్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అభినందించి, సత్కరించారు. డీఐజీ మాట్లాడుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సుడులు తిరుగుతున్నాయి. ఇక్కడ బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీశారని కొనియాడారు. తమవారి మృతదేహాలను కడసారిగా చూడలేమని బంధువులు భావిస్తున్న తరుణం లో బోటును వెలికితీసి మృతదేహాలను అప్పగించారన్నారు. ధర్మాడి చేసిన కృషి మరువలేమని డీఐజీ ఖాన్ పేర్కొన్నారు. ఆ గిరిజనులనూ అభినందిస్తాం రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగిన వెంటనే కచ్చులూరు గ్రామస్తులు వెంటనే స్పందించి 26 మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడారని రేంజి డీఐజీ ఖ>న్ అన్నారు. తాము కచ్చులూరు గ్రామం వెళ్లి వారిని ప్రత్యేకంగా అభినందిస్తామన్నారు. ధర్మాడి సత్యం బృందానికి రూ. 50 వేల రివార్డు, సభ్యులందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. బోటు వెలికి తీసిన సమయంలో శవాలను బయటకు తీసిన ఐదుగురు తోటీలకు ప్రత్యేకంగా రూ. 10 వేలు ధర్మాడి సత్యానికి ఇచ్చి వాటిని ఆ తోటీలకు అందజేయాలని కోరారు. అడిషినల్ ఎస్పీ ఎస్వీ శ్రీధర్‌రావు, ఓఎస్డీ ఆరిఫ్ హఫీజ్, ఏఆర్ అడిíÙనల్ ఎస్పీ వీఎస్ ప్రభాకర్‌రావు, ఎస్పీ డీఎస్పీలు ఎస్.మురళీమోహన్, ఎం.అంబికా ప్రసాద్, కాకినాడ సబ్ డివిజన్ డీఎస్పీ కరణం కుమార్, కాకినాడ క్రైం డీఎస్పీ వి.భీమరావు, ఏఆర్ డీఎస్పీ ఎస్.వెంకట అప్పారావు, ఎస్పీ సీఐ ఎస్.రాంబాబు, డీసీఆర్బీ సీఐ వైఆర్కే శ్రీనివాస్, జిల్లా పోలీసు అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.బలరామమూర్తి, అధ్యక్షుడు పి.సత్యమూర్తి , సంఘ ప్రతినిధులు, సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
‘చంద్రబాబు.. మీరెందుకు పరామర్శించలేదు’
సాక్షి, తూర్పుగోదావరి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో తెలియని అయోమయస్థితిలో ఉన్నారన్నారు. 'చదవేస్తే ఉన్న మతిపోయిందని' అన్న చందంగా చంద్రబాబు పరిస్ధితి తయారైందన్నారు. బోటును వెలికితీసిన ధర్మాడి సత్యంను టీడీపీ సన్మానించడంలో తప్పులేదు. కానీ.. చంద్రబాబు ధర్మాడికి లేఖ రాసి ఆ లేఖలో ప్రభుత్వాన్ని సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు. ‘ధర్మాడి సత్యం లాంటి వ్యక్తి మా కాకినాడలో ఉండడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అసలు బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యంకు అప్పగించింది మా ప్రభుత్వం కాదా..?’ అని ప్రశ్నించారు. మీరు ధర్మాడికి రాసిన లేఖ సరైనదని భావిస్తే.. ఇంకెప్పుడూ రాజధాని కట్టానని, హైటెక్‌సిటీ కట్టానంటూ గొప్పలకు పోవద్దన్నారు. రాజధాని, హైటెక్‌సిటీ కట్టింది కాంట్రాక్టర్, తాపీ మేస్త్రీలు అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ‘బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలను బాధ్యతగల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎందుకు పరామర్శించలేకపోయారు..? మీ పార్టీ తరపున బోటు భాధితులకు సహాయక చర్యలు అందించారా..? గతంలో మీ హయాంలో జరిగిన పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి కారకులు మీరు కాదా’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
'వశిష్ట 'వీరులు.. ప్రమాదమైనా.. సై
ఉప్పొంగిన గోదావరి ఉన్మత్త రూపంతో విరుచుకుపడి నిండు ప్రాణాలను కబళిస్తే... గుండెలోతుల్లోంచి ఉప్పొంగిన మానవత్వం ఆ ఉగ్ర గోదారితోనే పోరాడింది. ఉరకలేసే ఉత్సాహంతో తన ఒడిలోకి వచ్చిన బిడ్డలను నదీమాత పొట్టన పెట్టుకుంటే.. గుండెల్లో ధైర్యం నిండిన మత్స్యకారుల సాహసం.. ఆ అభాగ్యుల పార్థివ దేహాలను ప్రాణాలకు తెగించి మరీ వెలికి తీసింది. నిండుగా ప్రవహించే నది ఎన్నో కుటుంబాల జీవితాల్లో కన్నీటి సుడులు సృష్టిస్తే.. సాటివారికి చేతనైనంతగా సాయపడాలన్న విద్యుక్త ధర్మం.. ఆ కుటుంబాలకు తమ ఆప్తులను కడసారి దర్శించే భాగ్యాన్ని కలిగించింది. పాపికొండల దారిలో.. గోదారి లోతుల్లో మునిగిన ‘వశిష్ట’ బోట్‌ను మన విశాఖకు చెందిన విశిష్ట సాహసికుల బృందం వెలికితీసి వేనోళ్ల ప్రశంసలు అందుకుంది. అందరూ అసాధ్యమనుకున్న ఈ అసాధారణ ఘట్టాన్ని సాధ్యం చేసిన మనోళ్ల సాహసం అందరి మన్ననలను అందుకుంది. ప్రాణాలను పణంగా పెట్టి.. ఇదంతా కొన్ని కుటుంబాల ఆశను తీర్చడానికేనని వినమ్రంగా చెప్పే ఈ సాహసికుల ధీరత్వాన్ని ‘సాక్షి’ మీ కళ్లముందుంచుతోంది. డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వశిష్ట విషాదం.. కన్నీటి కెరటం! శోకాశ్రు సాగరం! ఆనందం కోసం అందాల పడవెక్కి.. అద్భుతాల గోదారిని తనివితీరా చూస్తూ.. పాపికొండల తీరం చేరాలన్న ఆరాటంతో బయల్దేరిన వారిని తల్లిలాటి గోదావరి అమాంతం మింగేస్తే.. ఎన్నో కుటుంబాలను ఉప్పెనలా ముంచేసిన కొండంత.. కడలంత.. దారుణం. ఈ ఘటన రాష్ట్రాన్నే కాదు..యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నో కుటుంబాలను కన్నీటి సుడిగుండంలోకి నెట్టింది. ఆ ఘటనలో కొందరి మృతదేహాలే మొదట లభ్యమయ్యాయి. బోట్ గోదారి గర్భంలోనే ఉండిపోయింది. అందులో మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉండడంతో దానిని వెలికితీయాలన్న సంకల్పంతో ప్రభుత్వం.. దాన్నో సవాలుగా తీసుకుంది. రోజుల తరబడి ఎన్నో సంస్థలు.. నావికాదళ నిపుణులు ప్రయత్నించినా.. అది దుస్సాధ్యమైంది. చివరికి ధర్మాడి సత్యం అనే అపార అనుభవజ్ఞుడి నేతృత్వంలో పనిచేసిన ఓ బృందం.. చిట్టచివరి ప్రయత్నం చేయడానికి సంకల్పించింది. ఈ లక్ష్య సాధనకు విశాఖలోని ఓం శ్రీ శివ శక్తి డైవింగ్ సర్వీసెస్ సాయం తీసుకుంది. ఆ సంస్థకు చెందిన గజ ఈతగాళ్లు.. నిపుణులైన మత్స్యకారులు.. ప్రాణాలకు తెగించి.. శాయశక్తులా శ్రమించడంతో గోదావరి నదీగర్భంలోని రాయల్ వశిష్ట బోట్ ఉనికిని తెలసుకోవడం సాధ్యమైంది. ఈ సాహసికుల బృందం నానా పాట్లు పడి.. ఎట్టకేలకు పడవను గట్టుకు చేర్చగలిగింది. దాంతో పాటు దాదాపు 38 రోజుల పాటు కనిపించకుండా పోయిన 12 మంది పార్థివదేహాలను గట్టెక్కించి.. సంబంధిత కుటుంబాలకు కనీసం తమ వారిని కడసారి చూశామన్న సాంత్వనను కలిగించింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో మునిగిన పడవను విశాఖలోని బురుజుపేటకు చెందిన ఓం శ్రీ శివ శక్తి డైవింగ్ సర్వీసెస్ సిబ్బంది కనబరిచిన మానవతా దృక్పథం అందరి మన్ననలు అందుకుంది. బోటు వెలికితీతకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ వారిని కలిసినప్పుడు తమది ఓ ప్రయత్నమని వినమ్రంగా చెబుతూనే.. ఆ సంఘటన గురించి వివరించారు. ఇలా ప్రారంభం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం.. బోటు తీసేందుకు ముందుకొచ్చి.. దాదాపు 20 రోజులకు పైగా ఎన్నో విధాలుగా యత్నించారు. యాంకర్లు వేశారు. రోప్‌లు కట్టారు. కొంతమేరకు తీయగలిగినా చివరకు తమకు సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. ఈ అసాధ్యాన్ని సాధించగలవారెవరని ప్రయత్నించి చివరకు విశాఖ వచ్చారు. విశాఖలో గల పలు డైవింగ్ సంస్థలను ఆశ్రయించారు. ఎవరూ సంసిద్ధత వ్యక్తం చేయని పరిస్థితుల్లో.. చివరగా వన్‌టౌన్‌లోని బురుజుపేటలో గల ఓం శ్రీ శివ శక్తి డైవింగ్ సర్వీసెస్‌ను ఆశ్రయించారు. అక్కడి సిబ్బంది మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. వరదపై ఉన్న గోదావరిలో.. దాదాపు 100 అడుగుల లోతులో ఉన్న బోటును వెలికి తీయడం అసాధ్యమని తెలిసి కూడా.. మునిగిపోయిన బోటును వెలికి తీస్తే.. తమవారిని కడసారైనా చూడాలని తపిస్తున్న వారి కోరిక తీర్చవచ్చని భావించారు. దాంతో సవాలుకు సై అన్నారు. ఎనిమిది దిక్కులా యత్నం ఎనిమిది మంది ఈతగాళ్ల బృందం ఒక్కొక్కరూ ఒక్కో వైపుగా బోటు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చీకటి పడింది. మొదటి రోజు సమయం మించిపోయింది. రెండో రోజు ఉదయం మళ్లీ యత్నించారు. బోటుకు చుట్టుపక్కలా పేరుకుపోయిన బురదను నానా కష్టాలు పడి తొలగించారు. మూడు వైపులా రోప్ వేశారు. బోటు లోపల ఉండిపోయిన 12 మృతదేహాలు(డికంపోజ్ అయిన బాడీలు) ఒక్కొక్కటిగా తీశారు. ఎన్నెన్నో కష్టాలు ఓ వైపు దుర్వాసన..మరొవైపు చిమ్మ చీకటి.. ఇంకో వైపు నీటి ప్రవాహం జోరు.. కెరటాల ఒరవడి... ఇవన్నీ వారికి అవరోధంగా నిలిచాయి. అయినా పట్టు వదలని వీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. అంతా మత్స్యకారులే.. ఆపరేషన్ బోట్లో పాల్గొన్న వారంతా మత్స్యకారులే. వీరు పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి వేటే వీరి జీవనాధారం. వీరిలో చాలామందికి స్విమింగ్‌లో 10 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉంది. డైవింగ్ సంస్థ ద్వారా ఏమైనా పనులు ఉంటే..రోజుకి రూ.1500 నుంచి రూ.2వేలు మాత్రమే(ప్రాణాలు ఫణంగా పెట్టి) సంపాదిస్తుంటారు. మిగిలిన రోజుల్లో కూలీ పనులు చేస్తుంటారు. వీరంతా ఫిషింగ్ హార్బర్ పరిధిలోని వారే. బతుకుతెరువు కోసం..ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉండేందుకు వేటే జీవనాధారంగా ఎంచుకున్నారు. ప్రమాదమైనా.. సై తమ ప్రయత్నం ఎంత ప్రమాదకరమైనదో వారికి తెలుసు. గోదావరి ప్రవాహాన్ని.. సుడి గుండాన్ని దాటి.. దాదాపు వంద అడుగుల లోతులో కూరుకుపోయిన బోటును బయటకు తీయాలంటే తలకు మించిన పని అన్నది పూర్తిగా తెలుసు. పైగా 38 రోజుల పాటు ఆ బోటులో చిక్కుకొని పాడైన మృతదేహాలను గుర్తించి.. బయటకు తీయడం ఎంతో కష్టమని తెలిసినా... వారు సిద్ధపడ్డారు. ఓం శ్రీశివ శక్తి డైవింగ్ సర్వీసెస్‌కు చెందిన మారుపిల్లి దాసు, గనగల రాజాబాబు, కదిరి ఎల్లారావు, పిళ్లా ఎల్లాజీ, గనగల అప్పలరాజు, వాసుపల్లి మురళి, ఒలిశెట్టి కోటేశ్వరరావు, పొనమండ రమణ, బడే ఎల్లాజీ, పేర్ల నల్లరాజు, మారుపిల్లి సతీష్‌కుమార్ గత ఆదివారం ఉదయం బోటు మునిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడి సిబ్బంది అనుమతించలేదు. ఆ తర్వాత ఎనిమిది మంది డైవర్లు (మారుపిల్లి దాసు, గనగల రాజాబాబు, కదిరి ఎల్లారావు, పిళ్లా ఎల్లాజీ, గనగల అప్పలరాజు, వాసుపల్లి మురళీ, ఒలిశెట్టి కోటేశ్వరరావు, పొనమండ రమణ) నీటిలోకి దిగారు. దాదాపు 80 అడుగుల లోతుకి వెళ్లారు. అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ కాళ్లకు బోటు పరికరాలు తగులుతూ ఉండడంతో.. అక్కడ బోటు ఉన్నట్టు గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆక్సిజన్‌ను అంచనా వేసుకుంటూ ఓ ఇనుప తీగ వేశారు. పైనుంచి లాగే ప్రయత్నంలో ఆ రోప్ తెగిపడింది. మళ్లీ నీటిలో ఉన్న వారు మరో రోప్ కట్టారు. ముందుగా బోటు కేబిన్‌ను (ఇంజన్ ప్రాంతం) బయటకు తీయగలిగారు. దీంతో బోటును తీయగలమన్న నమ్మకం కలిగింది. ఓం శ్రీశివశక్తి తోడ్పాటు 2012 ఆగస్టులో బురుజుపేటలో ఈ సంస్థ ప్రారంభమైంది. ఇక్కడ 30 మంది పనిచేస్తున్నారు. గతంలో నర్మదా నదిలో మునిగిన విమానాన్ని వెలికితీయడానికి నేవల్ డైవర్స్ నిస్సహాయత వ్యక్తం చేయగా.. ఈ సంస్థ సిబ్బంది వారం రోజుల్లోనే విమానాన్ని బయటకు తీయగలిగారు. కేరళ, ముంబై, పారాదీప్, చెన్నై, కాకినాడ, కోల్‌కత, హల్దియా, విశాఖపట్నంలో ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొన్నారు. చేశారు. గోదావరి తీరంలో భద్రాచలం, గోవిందపల్లి వద్ద... విశాఖలో తాటిపూడి రిజర్వాయర్‌లో వెలికితీతకు సంబంధించి బాధ్యతలు నెరవేర్చారు. -
వారిని గోదారమ్మ మింగేసిందా?
సాక్షి , విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు సమీపాన గత నెల 15న గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో జిల్లాకు చెందిన 17మంది గల్లంతయ్యారు. ఆ దుర్ఘటనలో గల్లంతైన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. ఘటన జరిగిన రోజు నుంచి చేపట్టిన గాలింపు చర్యల్లో 13మంది మృతదేహాలను గుర్తించి జిల్లాకు తీసుకువచ్చారు. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి కుమార్తెలైన వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏడాదిన్నర), రామలక్ష్మీ కాలనీకి చెందిన దివంగత మధుపాడ రమణబాబు. అరుణకుమారిల కుమారుడు అఖిలేష్(9), గాజువాకకు చెందిన దివంగత మహేశ్వరరెడ్డి, స్వాతిల కుమారుడు విఖ్యాత్‌రెడ్డి(6).. మొత్తంగా ఈ నలుగురు చిన్నారుల ఆచూకీ మాత్రం లభించలేదు. గోదావరిలో వరద ఉధృతి కారణంగా నెల కిందట గాలింపు చర్యలు నిలిపివేసిన దరిమిలా.. మళ్ళీ రెండు రోజుల కిందట ఏకంగా బోటును ఒడ్డుకు తీసుకువచ్చి దాంట్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తూ వచ్చారు. ఇందులో గాజువాకకు చెందిన విఖ్యాత్‌రెడ్డి మృతదేహం మాత్రం లభ్యమైంది. విఖ్యాత్‌రెడ్డి తల్లిదండ్రులు మహేశ్వరరెడ్డి, స్వాతిలతో పాటు సోదరి హన్సిక కూడా అదే బోటు ప్రమాదంలో మృతిచెందారు. వారి మృతదేహాలను గత నెల 23వ తేదీన బంధువులకు అప్పగించారు. ఇద్ద రు పిల్లలతో సహా మహేశ్వరరెడ్డి కుటుంబం మొత్తం బోటు ప్రమాదానికి బలైపోయిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ ముగ్గురూ అంతేనా.. కనీసం విఖ్యాత్‌రెడ్డి చివరిచూపైనా దక్కిందనుకుంటే మిగిలిన ముగ్గురు చిన్నారుల జాడ కానరాకపోవడంతో వారి రక్తసంబంధీకులు తల్లిడిల్లిపోతున్నారు. ఇప్పటికీ ఆచూకీ తెలియని అఖిలేష్(9) తల్లిదండ్రులు మధుపాడ రమణబాబు. అరుణకుమారి, సోదరి కుశాలి.. ఈ ముగ్గురూ ఆ బోటు ప్రమాదంలో మృతిచెందారు. అఖిలేష్ ఆచూకీ కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నాం... పోనీ బాడీ దొరికినా చాలని అనుకుంటున్నాం... అని అతని చిన్నాన్న రామకృష్ణ గద్గదస్వరంతో అన్నారు. ఆ ముగ్గురికీ దహన సంస్కారం చేశాం.. చివరికి అఖిలేష్‌కి ఆ కర్మక్రియలు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందంటూ విలపించారు. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మిలది నిజంగా గుండెలు పిండే విషాదం. ఇద్దరు ఆడపిల్లలు వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏడాదిన్నర)లను రెండు కళ్ళల్లా అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చారు. నానమ్మ అప్పలనర్సమ్మ, బంధువులతో కలిసి ఆ రోజు గోదావరి బోటు షికారుకు వెళ్ళారు. అప్పలనర్సమ్మ మృతదేహం బయటపడినా పసి పిల్లల ఆచూకీ మాత్రం నేటికీ తెలియలేదు. మా కంటిపాపలు కానొస్తే చాలు.. మేమే పాపం చెయ్యలేదు. కానీ భగవంతుడు ఎందుకు ఇంత విషాదం కలిగించాడో.. అర్థం కావడం లేదు. 30 రోజులకు పైగా మా మరిది శ్రీనివాస్ గోదావరి ఒడ్డునే ఉంటున్నాడు. ఎక్కడైనా కానొస్తారేమో లేదా.. పోనీ.. పోయిన ప్రాణాలతోనైనా కనిపిస్తారేమోనని అక్కడే పడిగాపులు కాస్తూ వచ్చాడు. కానీ.. ఇక కడచూపు ఆశ కూడా దక్కనట్టేనని అనిపిస్తోంది.. అని ఆ చిన్నారుల తల్లి భాగ్యలక్ష్మి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పింది. చదవండి : కడసారి చూపు కోసం.. చదవండి : ఏడు మృతదేహాలు మార్చురీకి తరలింపు -
ధర్మాడి సత్యం బృందంపై కలెక్టర్ ప్రశంసలు
సాక్షి, తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు ఒడ్డుకు చేరుకుంది. బోటును ఒడ్డుకు చేర్చేందుకు నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్ వశిష్ట సక్సెస్’ అయింది. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మంగళవారం మధ్యాహ్నం బోటును ఒడ్డుకు తరలించింది. కాగా, ఎన్నో సవాళ్లతో కూడుకున్న బోటు ఆపరేషన్‌లో పాల్గొన్న ధర్మాడి సత్యం బృందం, స్కూబా డ్రైవర్ల బృందంపై జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి సత్యంకు శాలువ కప్పి స్వీట్ తినిపించారు. దాంతో పాటు రూ.20 లక్షల చెక్కు అందజేశారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్ డైవర్లు కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. గోదావరిలో రాయల్ వశిష్ట బోటు 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని సాంకేతిక పరిఙ్ఞానం ద్వారా తొలుత గుర్తించిన సంగతి తెలిసిందే. (చదవండి : ఒడ్డుకు ‘వశిష్ట’) -
కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత
సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమించి బయటకు తీసిన సంగ తెలిసిందే. బోటు వెలికితీయగా అందులో 8 మృతదేహాలు లభించాయి. అందులో వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ, ప్రర్యాటకులు.. వరంగల్ జిల్లాకు చెందిన బసికి ధర్మారాజు, నల్గొండ జిల్లాకు చెందిన సురభి రవీందర్, వరంగల్ అర్బన్ జిల్లా కొమ్మల రవి, నంద్యాలకు చెందిన బసిరెడ్డి విఖ్యాత రెడ్డిల మృతదేహాలను కుటుంబీకులు గుర్తుపట్టారు. దీంతో 7 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. బోటులో దొరికిన మరో మృతదేహం ఎవరిదో గుర్తించాల్సి ఉంది. బోటు ప్రమాదంలో జల సమాధి అయిన మరో 5 గురు పర్యాటకుల మృతదేహాలు ఆచూకీ ఇంకా దొరకలేదు. కాగా, సెప్టెంబర్ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. అందులో ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు. మొత్తంగా ఆచూకీ తెలియాల్సిన మృతుల వివరాలు.. 1. తలారి గీతా వైష్ణవి(4), విశాఖపట్నం జిల్లా 2. తలారి ధాత్రి అనన్య(6), విశాఖపట్నం జిల్లా 3. మధుపాడ అఖిలేష్(6), విశాఖపట్నం జిల్లా 4. కారుకూరి రమ్యశ్రీ(25), మంచిర్యాల 5. కోడూరి రాజ్‌కుమార్, వరంగల్ 6. కొండే రాజశేఖర్, వరంగల్ -
బోట్ వెలికితీతతో బయటపడ్డ మృతదేహాలు
-
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు
సాక్షి, రాజమండ్రి: రాయల్ వశిష్ట బోటు ప్రమాద బాధితుల కోసం హెల్ప్ డెస్క్‌ఏర్పాటు చేశారు. పోలీసులు...బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో బంధువులకు సమాచారం ఇచ్చారు. బాధితులకు సమాచారం అందించడంతో వారంతా తమవారిని గుర్తించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తల్లిదండ్రుల ఆవేదన నిలువరించడం ఎవరి తరం కావడం లేదు. అలాగే నల్గొండకు చెందిన రవీందర్‌రెడ్డి తల్లిదండ్రులు కూడా మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు. కాగా 41వ రోజుల అనంతరం మునిగిపోయిన బోటును ఎట్టకేలకు గోదావరి నుంచి బయటకు తీశారు. బోటు వెలికితీసిన అనంతరం అందులో 8 మృతదేహాలు దొరికాయి. ఆ మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మార్చరీలో భద్రపరిచారు. మృతేహాలు బోటులోని ఓ గదిలో ఉండిపోవడంతో గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అయితే వరంగల్‌కు చెందిన కొమ్ముల రవి ఆధార్ కార్డు లభించడంతో మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. వరంగల్ కు చెందిన బస్కే ధర్మరాజును గుర్తించారు. అలాగే రాయలు వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహాలను కూడా కుటుంబీకులు గుర్తుపట్టారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాలను అప్పగిస్తారు. సెప్టెంబర్ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. మరోవైపు ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు. ధర్మాడి సత్యం బృందం తిరుగు పయనం ఆపరేషన్ రాయల్ వశిష్టను పూర్తి చేసుకుని ధర్మాడి సత్యం బృందం తిరుగుపయనం అయింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులు ఉన్నా...తీవ్రంగా శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చామన్నారు. గతంలో చాలా బోట్లు వెలికి తీశామని, అయితే రాయల్ వశిష్ట బోటు వెలికితీయడం చాలా కష్టంతో కూడుకుందని అన్నారు. ప్రవాహంతో ఉన్న నదిలో నుండి బోటును ఒడ్డుకు తీయడం మాటలు కాదని, రెండు గంటల్లో మునిగిపోయిన బోటునుఒడ్డుకు తీసేస్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ చెప్పిన మాటలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించడం విచారకరమన్నారు. అతని వద్ద ఓ తాడు లేదు... సిబ్బంది లేరని ధర్మాడి సత్యం పేర్కొన్నారు. లాంచీలోనే పడుకుని ఉదయం ఆరు గంటలకు లేచి, సాయంత్రం వరకూ బోటు వెలికితీతకు శ్రమించినట్లు చెప్పారు. -
కడసారి చూపు కోసం..
సాక్షి, కాజీపేట(వరంగల్) : పాపికొండలు విహారయాత్రకు వెళ్లి బోటు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన కడిపికొండ వాసులు ముగ్గురి కుటుంబీకులు తమ వారి మృతదేహాలనైనా చివరిసారి చూసుకుంటామా, లేదా అనే ఆందోళనలో ఇంతకాలం గడిపారు. తాజాగా మంగళవారం బోటును వెలికితీయడం, అందులో ఏడు మృతదేహాలు లభించడంతో తమ వారు, ఉన్నారా లేదా అనే సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి చేరుకోవడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున కుటుంబ సభ్యులు రావాలని అక్కడి అధికారులు సమాచారం ఇవ్వడంతో రాజమండ్రికి బయలుదేరారు. సుదీర్ఘ నిరీక్షణ గత నెల 14వ తేదీన పాపికొండలు విహార యాత్రకు కడిపికొండ వాసులు 14 మందితో పాటు న్యూశాయంపేటకు చెందిన ఒకరు వేర్వేరుగా వెళ్లారు. వీరు యాత్రకు ఎంచుకున్న వశిష్ట బోటు 15వ తేదీన గోదావరిలో ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సురక్షితంగా బయటపడా.. ఆ తర్వాత ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక కొండూరి రాజ్‌కుమార్, కొమ్ముల రవి, బస్కే ధర్మరాజు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఎప్పుడు.. ఏ రోజు.. ఏం సమాచారం అందుతుందోనని రోదిస్తూ గడిపారు. తాజాగా మంగళవారం బోటును వెలికితీయడం.. అందులో ఏడు మృతదేహాలు బయటపడడంతో తమ వారి మృతదేహాలు ఉన్నాయా అని ఆరా తీశారు. తల లేని మృతదేహం గత కొద్ది రోజులుగా కచ్చులూరులో బోటు వెలికితీత పనులు చేపడుతుండగా గత ఆదివారం తల లేని మొండెంతో కూడిన మృతదేహం బయటపడింది. ఈ మృతదేహం ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతుండగానే మంగళవారం మరో ఏడు మృతదేహాలు లభించాయి. ఇందులో ఐదుగురు పురుషులు, ఓ చిన్నారి ఉండగా.. మరో మృతదేహం ఎవరిదనేది తేలలేదు. ఇక 38 రోజులుగా నీటిలో నానడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి చేరగా.. గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలకు రావాలని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ముగ్గురి కుటుంబ సభ్యులు రాజమండ్రికి మంగళవారం సాయంత్రం బయలుదేరారు. -
ఏడు మృతదేహాలు మార్చురీకి తరలింపు
సాక్షి, రాజమహేంద్రవరం : బోటు ప్రమాదం జరిగి 41వ రోజు మంగళవారం మరో ఏడు మృతదేహాలను గోదావరి నది నుంచి బయటకు తీశారు. కచ్చులూరు సంఘటన స్థలం నుంచి ఈ మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి రాత్రి 8.45 గంటల సమయంలో రెండు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. పోలీసుల సమక్షంలో వాటిని మార్చరీలో భద్రపరిచారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాత మృతదేహాలను వారికి అప్పగిస్తారు. మృతదేహాలు బోటులోని ఒక రూమ్‌లో ఉండిపోవడంతో కుళ్లిపోయాయి. బోటు అడుగు భాగాల్లో గాలింపు రంపచోడవరం: కచ్చులూరు మందం వద్ద బోటును వెలికితీసిన తరువాత ఏడు మృతదేహాలు లభ్యమైనట్లు ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్ తెలిపారు. మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ బృందాలు బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇంకా లభించాల్సిన మృతదేహాలు కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారని తెలిపారు. -
ఆపరేషన్ వశిష్ట సక్సెస్
-
ఒడ్డుకు ‘వశిష్ట’
సాక్షి, కాకినాడ/దేవీపట్నం/రంపచోడవరం: నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న అన్వేషణకు తెరదించుతూ రాయల్ వశిష్ట బోటు మంగళవారం ఒడ్డుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మధ్యాహ్నం సమయంలో ఒడ్డుకు తరలించింది. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్ డైవర్స్ కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. నీట మునిగిన రాయల్ వశిష్ట బోటులో 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆపరేషన్ ఇలా .. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి వెలికి తీసేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ నిర్వాహకుడు ధర్మాడి సత్యానికి రాయల్ వశిష్ట వెలికితీత పనులను రూ. 22.70 లక్షలకు అప్పగించారు. ప్రమాదానికి గురైన సమయంలో గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కచ్చులూరు మందం వద్ద ఆ సమయంలో గోదావరిలో 300 అడుగుల లోతు నీరు ఉంది. ధర్మాడి బృందం 25 మంది సభ్యులతో సంప్రదాయ పద్ధతిలో బోటు వెలికితీత పనులు ప్రారంభించింది. బోటు లంగరుకు చిక్కినట్టే చిక్కి జారిపోయినా పట్టు వీడలేదు. పలు దఫాలు విఫలమైనా ప్రయత్నాలు కొనసాగించింది. ధ్వంసమైన బోటు... మట్టి, ఒండ్రులో చిక్కుకుపోవడంతో సోమవారం బోటు పైకప్పు మాత్రమే ఊడి వచ్చింది. దీంతో మంగళవారం మరోసారి ప్రయత్నించారు. బోటు పంటుకు ఇనుప తాడు కట్టారు. ఆరుగురు గజ ఈతగాళ్లు బోటు చుట్టూ తిరిగి వెనుక భాగంలో ఉన్న ఫ్యాన్‌కు లంగరు వేశారు. అనంతరం పొక్లెయిన్ సాయంతో భారీ ఇనుప తాడు ద్వారా రాయల్ వశిష్ట బోటును గోదావరి నుంచి గట్టుకు తీసుకురాగలిగారు. అయితే ప్రమాదానికి గురైన బోటు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న మృతదేహాలు పూర్తిగా పాడైపోవడంతో దుర్వాసన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ధర్మాడి సత్యంతోపాటు కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ కచ్చులూరు వద్దే ఉండి బోటు వెలికితీత పనులును పర్యవేక్షించారు. దారి కూడా లేని చోటుకు భారీ యంత్రాలు.. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి వెలికితీత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయ పద్ధతులను వినియోగించారు. సీఎం జగన్ స్వయంగా ప్రతి రోజూ సహాయక చర్యలపై ఆరా తీస్తూ వచ్చారు. మంత్రులను పంపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. దారి కూడా లేని కచ్చులూరు మందానికి భారీ క్రేన్ తరలించే ఏర్పాట్లు చేశారు. సీఎం వచ్చి మృతులకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు. చివరి మృతదేహం లభ్యమయ్యే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను సైతం వెంటనే సమకూర్చారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులను పలకరించి కొండంత ధైర్యాన్నిచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించి ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించారు. ఘటనపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. కష్టమే అయినా సమష్టిగా సాధించాం ‘ఆరంభంలో రాయల్ వశిష్ట బోటు వెలికితీత కష్టంగా అనిపించింది. తొలుత ఐరన్ రోప్ గోదావరిలో తెగిపోయింది. లంగర్లు, ఐరన్ రోప్‌లతో ఉచ్చు వేసి పలుమార్లు లాగడంతో నది అడుగు భాగంలో ఉన్న బోటు కొద్దికొద్దిగా ఒడ్డు వైపు వచ్చింది. గోదావరి ఉధృతి పెరగడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. తరువాత చేపట్టిన ఆపరేషన్‌లో ప్రైవేట్ డైవర్లను రంగంలోకి దించాం. మూడు రోజుల పాటు నదిలోకి దిగి బోటుకు రోప్ కట్టడంలో విజయం సాధించాం. బోటు ఆపరేషన్‌కు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించింది. అధికారులు, బృందం సభ్యులు, విశాఖ డైవర్ల సమష్టి కృషి ఫలితంగా బోటును ఒడ్డుకు తీసుకు రాగలిగాం’ – ధర్మాడి సత్యం (బాలాజీ మెరైన్స్ యజమాని) ఇప్పటిదాకా 46 మృతదేహాలు లభ్యం రాయల్ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 51 మంది గల్లంతయ్యారు. అందులో 39 మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. తాజాగా బోటు వెలికితీత సమయంలో 7 మృతదేహాలు లభించాయి. మరో ఐదు మృతదేహాల ఆచూకీ తెలియాల్సి ఉంది. శభాష్ కలెక్టర్.. మురళీధర్‌రెడ్డిని అభినందించిన సీఎం రాయల్ వశిష్ట బోటు వెలికితీత, సహాయక చర్యల పర్యవేక్షణలో చురుగ్గా వ్యవహరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఈ మేరకు సీఎం మంగళవారం కలెక్టర్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించిందన్నారు. ఆ నిర్ణయమే కీలకం! రంపచోడవరం: గతంలో పలు చోట్ల నీట మునిగిన బోట్లను వెలికి తీసిన అనుభవం ఉన్న ధర్మాడి సత్యం బృందం రాయల్ వశిష్ట బోటు వెలికితీతను సవాల్‌గా తీసుకుంది. వెలికితీత ఆపరేషన్ 13 రోజులు కొనసాగింది. గోదావరిలో నీటిమట్టం తగ్గడం బోటు వెలికితీతకు అనుకూలంగా మారింది. 50 అడుగుల లోతులో ఉన్న బోటును ఐరన్ రోప్‌తో లాగే ప్రయత్నం తొలుత సఫలం కాకపోవడంతో విశాఖపట్నం నుంచి డైవర్స్‌ను రప్పించారు. డైవర్స్ నదీ గర్భంలోకి వెళ్లి బోటు అడుగు భాగంలో ఇనుప రోప్‌లు కట్టాలని ధర్మాడి సత్యం బృందం నిర్ణయించడం ఫలితాన్ని ఇచ్చింది. ఆపరేషన్ ఇలా... - సెప్టెంబర్ 15: రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయింది. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్ సహాయ చర్యలకు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హెలికాప్టర్లు, నేవీ, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. - సెప్టెంబర్ 16: ప్రమాద స్థలాన్ని సీఎం వైఎస్ జగన్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతులకు నివాళులు అర్పించి క్షతగాత్రులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. - సెప్టెంబర్ 18: కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం దేవీపట్నం చేరుకుని బోటులో కచ్చులూరు మందం వద్ద గోదావరి పరిస్థితిని పరిశీలించింది. గోదావరి వడి ఎక్కువగా ఉండడంతో బోటు వెలికితీత ప్రక్రియకు దిగలేదు. - సెప్టెంబర్ 30: బోటు వెలికితీతకు ఆపరేషన్ రాయల్ వశిష్టను ప్రారంభించారు. భారీ ఇనుప తాళ్లు, లంగర్లు సిద్ధం చేసుకున్నారు. - అక్టోబరు 4: బోటు ఉందని గుర్తించిన ప్రాంతంలో 4 రోజులపాటు లంగర్లు వేసి తెగిపోతున్నా ప్రయత్నం కొనసాగించారు. గోదావరి ఉధృతి పెరగడంతో ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. - అక్టోబర్ 15: ధర్మాడి బృందం తిరిగి దేవీపట్నం చేరుకుంది. ఈనెల 16న రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ –2 తిరిగి ప్రారంభించి ఆచూకీ గుర్తించారు. మొదటి రోజు ఐరన్ రోప్ ఖాళీగా రావడంతో రెండో రోజు బోటు మునిగిన ప్రాంతంలో ఐరన్ రోప్‌ను ఉచ్చుగా వేశారు. - అక్టోబర్ 18: బోటు ముందు భాగంలోని రైలింగ్ ఊడి వచ్చింది. - అక్టోబర్ 19: బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించిన రోప్ జారిపోయింది. నదీ గర్భంలో బోటుకు బలమైన రోప్‌ను బిగిస్తేగానీ వెలికి తీసే పరిస్ధితి లేదని ధర్మాడి నిర్ధారణకు వచ్చారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్ వాటర్ సర్వీస్‌కు చెందిన పది డైవర్స్‌ను రంగంలోకి దింపారు. - అక్టోబర్ 20: బోటు ముందు భాగం ఒడ్డువైపునకు 40 అడుగులు, వెనుకభాగం నదివైపు 70 అడుగుల లోతులో పక్కకు ఒరిగి ఒడ్డు ప్రాంతానికి 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు డైవర్స్ గుర్తించారు. - అక్టోబర్ 21: బోటుకు ఐరన్ రోప్ కట్టి ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేయగా ముందు భాగం కొద్దిగా మాత్రమే ఊడి వచ్చింది. - అక్టోబర్ 22: బోటు కింది భాగానికి రోప్‌లు వేసి లాగి ఒడ్డుకు చేర్చారు. -
‘బోటు ఆపరేషన్‌తో ప్రభుత్వం చిత్తశుద్ధి రుజువైంది’
సాక్షి, అమరావతి: ఆపరేషన్ రాయల్ వశిష్టతో ప్రభుత్వం చిత్తశుద్ధి రుజువైందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘గత నెల 15న దేవిపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు మునిగిపోయింది. 250 అడుగుల లోతులో ఉన్న బోటును బయటకు తీయించాం. బోటు నుంచి 7 మృతదేహాలను బయటకు తీసారు. చివరి మృతదేహం దొరికే వరుకూ మనదే బాధ్యత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. బోటు ప్రమాదం జరిగిన రోజునే సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ మృతుల కుటుంబాలకు కూడా సాయం అందించాలని సీఎం ఆ రోజే చెప్పారు. బాధిత కుటుంబాలకు సాయం అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి పేర్కొన్నారు. రాయల్ వశిష్ట బోటును బయటకు తీసిన దర్మాడి సత్యం బృందాన్ని మంత్రి కన్నబాబు అభినందించారు. బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేసారని..ఇప్పుడేం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. బోటు ప్రమాదాల నివారణకు ఉన్నతాధికారులతో కమిటీ వేసామని వెల్లడించారు త్వరలోనే కమిటీ నివేదిక ఇవ్వనుందని తెలిపారు. ప్రమాదాల నివారణకు శాశ్వత విధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఆపరేషన్ రాయల్ వశిష్టలో భాగస్వాములైన అధికారులను కూడా మంత్రి అభినందించారు. -
బోటు వెలికితీత.. అత్యంత బాధాకరం
-
కచ్చులూరు వద్ద బోటు వెలికితీత
-
బోటు వెలికితీత.. హృదయ విదారక దృశ్యాలు
సాక్షి, దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీశారు.అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో బోటును బయటకు తీశారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. కొద్దిసేపటి క్రితమే ధర్మాడి బృందం బోటును ఒడ్డుకు చేర్చింది. బోటును వెలికితీయడంతో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతున్నాయి. (చదవండి : కచ్చులూరు వద్ద బోటు వెలికితీత) ప్రమాదం జరిగి 38 రోజు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. బోటు పూర్తిగా ధ్వంసమైంది. బోటు శిథిలాల్లో మృతదేహాలు చిక్కిపోయాయి. ఎముకల గూళ్ల మాదిరిగా ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు,కుటుంబ సభ్యులు విచారంలో మునిగారు. దుర్వాసన వస్తుండంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆచూకీ లభించనివారి వివరాలు: కర్రి మణికంఠ, తండ్రి నరసింహారావు, పట్టిసీమ పోలవరం.. మధుపాడ కుశాలి, తండ్రి రమణబాబు, విశాఖపట్నం మధుపాడ అఖిలేష్ (5), తండ్రి రమణబాబు, విశాఖపట్నం తలారి గీతా వైష్ణవీ (5), తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం,. తలారి ధాత్రి (18నెలల) తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6), తండ్రి,మహేశ్వరరెడ్డి, నంద్యాల.. సంగాడి నూకరాజు (58), (బోటు డ్రైవర్) తండ్రి కామరాజు, జగన్నాధపురం, కాకినాడ పోలాబత్తుల సత్యనారాయణ (50) (డ్రైవర్), తండ్రి, అప్పారావు, కాకినాడ, చిట్లపల్లి గంగాధర్ (35), తండ్రి సత్యనారాయణ, నర్సాపురం.. కొమ్ముల రవి (40), తండ్రి శామ్యూల్, కడిపికొండ వరంగల్ కోడూరి రాజకుమార్(40), తండ్రి గోవర్ధన్, కడిపికొండ, వరంగల్ బస్కీ ధర్మరాజు, తండ్రి కొమరయ్య, వరంగల్.. కారుకూరి రమ్యశ్రీ (22), తండ్రి సుదర్శన్, నన్నూరు మంచిర్యాల్. సురభి రవీందర్ (25), తండ్రి వెంకటేశ్వరరావు, హాలీయా నల్గొండ -
రాయల్ వశిష్ట బోటు వెలికితీత
సాక్షి, దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో బోటును పూర్తిగా బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు. రోప్ సాయంతో బయటకు తీశాం : ధర్మాడి సత్యం రోప్‌ల సాయంతోనే బోటును బయటకు తీశామని ధార్మడి సత్యం అన్నారు. బోటు బయటకు తీయడంలో తన బృందంతో పాటు అధికారుల కష్టం కూడా ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
రోప్‌తో పాటు ఊడొచ్చిన బోటు పైభాగం..
-
రోప్‌తో పాటు ఊడొచ్చిన బోటు పైభాగం..
సాక్షి, తూర్పుగోదావరి: దేవిపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి టూరిజం బోటు వెలికితీత పనులు కీలక దశకు చేరుకున్నాయి. బోటు వెలికితీత ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం రెండు రోప్‌ల ద్వారా బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేయగా.. బోటు పైభాగం రోప్‌తో పాటు ఊడొచ్చింది. ధర్మాడి సత్యం బృందం మరోసారి బోటు చుట్టూ రోప్ వేసి బోటు వెలికితీతకు ప్రయత్నాలు చేయనుంది. మైరన్ డైవర్లు గర్భంలోకి ఆక్సిజన్ తో దిగి బోటు వెనుక భాగానికి ఐరన్ రోప్ కట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నం సఫలమైతే బోటును ఫొక్లైన్ తో బయటకు లాగొచ్చని భావిస్తున్నారు. ఆదివారం ధర్మాడి సత్యం బృందం ఐరన్ రోప్‌ల ద్వారా ఉచ్చు, లంగరు వేసి బోటు వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విశాఖ నుంచి మైరన్ డ్రైవర్లను రప్పించారు. 16 రోజులుగా బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం శ్రమిస్తోంది. వెలికితీత పనుల్లో పురోగతి కనిపించడంతో బోటును తప్పకుండా తీస్తామని ధర్మాడి బృందం, మైరన్ డ్రైవర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: బోటు చిక్కుతోంది.. పట్టు తప్పుతోంది) -
ఆ మృతదేహం ఎవరిది..?
సాక్షి, వరంగల్ : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో గత నెల 15న చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో ఆదివారం మరో తల లేని మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఆ మృతదేహానికి రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి బంధువులకు అప్పగించనున్నట్లు తెలిసింది. అయితే కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 14 మంది గత నెల 14న పాపికొండల టూర్ నిమిత్తం బయలుదేరి 15న జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న విషయం విధితమే. ఘటనలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఐదుగురు సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఆదివారం లభించిన తల లేని మొండెం ఎవరిదనే ఉత్కంఠ కడిపికొండకు చెందిన ఆచూకి లభించని మూడు కుటుంబాల్లో నెలకొంది. -
బోటు వెలికితీత నేడు కొలిక్కి!
రంపచోడవరం/దేవీపట్నం/కాకినాడ రూరల్: దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనులు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి వచ్చిన మెరైన్ డైవర్లు ఆదివారం నదీ గర్భంలో చిక్కుకున్న బోటు వద్దకు పలుమార్లు వెళ్లి వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి ప్రమాద ప్రాంతంలో పైకి తేలింది. నల్ల జీన్ ప్యాంట్, తెల్ల టీషర్ట్‌తో ఉన్న ఆ మృతదేహం ఎవరిదనేది గుర్తించాల్సి ఉంది. ఇదిలావుంటే.. నదీ గర్భంలోకి వెళ్లిన మెరైన్ డైవర్లు నీటి అడుగున బోటు ఏ పరిస్థితిలో ఉంది, ఎంత లోతులో ఉందనే విషయాలను కనుగొని అధికారులకు, ధర్మాడి సత్యం బృందానికి వివరించారు. నీటి అడుగున 40 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. బోటు ముందు భాగం 35 అడుగుల లోతున నదీ ప్రవాహానికి అడ్డంగా ఉందని, వెనుక భాగం 70 అడుగుల లోతులో ఉందని మెరైన్ డైవర్స్ అంచనా వేశారు. బోటు ముందు భాగం కొంతమేర బురదలో కూరుకుపోయినట్లు గుర్తించారు. బోటు మునిగిన ప్రాంతమైన కచ్చులూరు మందం నుంచి దాదాపు వంద మీటర్ల దిగువకు కొట్టుకెళ్లిందని తెలిపారు. బోటు వెలికితీత పనులు చేపట్టిన ప్రతిసారి కచ్చులూరు మందం వద్ద భారీగా వర్షం పడుతుండటంతో వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది. నదీ గర్భంలోని బోటుకు ముందు భాగంలో ఐరన్ రోప్ చుట్టేందుకు ఆదివారం మెరైన్ డైవర్లు ప్రయత్నించగా.. వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. భారీగా వర్షం కురవడంతో సాయంత్రం 5 గంటలకు పనులను నిలిపివేశారు. తిరిగి సోమవారం పనులు ప్రారంభిస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సోమవారం బోటును వెలికితీసే పని పూర్తవుతుందని ధర్మాడి సత్యం బృందం, మెరైన్ డైవర్లు చెప్పారు. బోటు వెలికితీతలో ప్రగతి రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీతలో ప్రగతి కనిపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కాకినాడ ఏపీఎస్పీలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. గోదావరిలో వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం, భారీ సుడిగుండాల వల్ల బోటును బయటకు తీయడం సాధ్యం కాలేదని చెప్పారు. ధర్మాడి సత్యం బృందం 15 రోజులుగా దీనిని వెలికితీసేందుకు శ్రమిస్తోందన్నారు. ఎంత ఖర్చయినా బోటును వెలికితీయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సత్యం బృందానికి బోటు ఆనవాళ్లు లభించాయని, విశాఖ నుంచి మెరైన్ డైవర్లను రప్పించి బోటుకు లంగర్లు అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. బోటును తప్పకుండా బయటకు తీస్తామన్నారు. -
బోటు చిక్కుతోంది.. పట్టు తప్పుతోంది
-
బోటు చిక్కుతోంది.. పట్టు తప్పుతోంది
దేవీపట్నం (రంపచోడవరం): తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొలిక్కి రావడం లేదు. ఆదివారం కూడా బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. తీరానికి అతి సమీపంలో బోటు ఉండటంతో డీప్ వాటర్ డ్రైవర్లతో బోటుకు యాంకర్లు బిగించి ధర్మాడి సత్యం బృందం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం నిన్న కూడా విఫలయత్నం చేసింది. బోటు ఆచూకీ గుర్తించి అయిదు రోజులు గడిచిపోగా.. గురు, శుక్ర, శనివారాల్లో బోటును ఒడ్డు వైపునకు 70 అడుగుల మేర చేర్చారు. శనివారం మూడుసార్లు వృత్తాకారంలో ఐరన్ రోప్‌ను బోటు ఉన్న ప్రాంతంలో నదిలోకి విడిచిపెట్టి ఉచ్చు మాదిరిగా బిగించి బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయితే, ఖాళీ రోప్ మాత్రమే బయటకు వచ్చింది. బోటు ఉన్న ప్రాంతంలో నదీగర్భం ‘వి’ ఆకారంలో ఉండటం వల్ల బోటు బయటకు రావటం కష్టంగా మారిందని చెబుతున్నారు. రోప్‌తో లంగరు వేసినప్పటికీ బోటుకు సరిగా తగులుకోకపోవడంతో జారిపోతోంది. శనివారం బోటుకు సంబంధించి లైఫ్‌బాయ్ (నీటిలో ప్రయాణికుల రక్షణకు ఉపయోగించే ట్యూబు లాంటి పరికరం) ఒకటి బయటకు వచి్చంది. ఐరన్ రోప్‌ను పొక్లెయిన్ సాయంతో లాగుతున్న సమయంలో బోటుకు తగిలించిన రెండు లంగర్లకు కట్టిన తాడు తెగిపోయి లంగర్లు గోదావరి పాలయ్యాయి. 38 అడుగుల లోతులో.. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగులు లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉందని వెలికితీత పనులకు నాయకత్వం వహిస్తున్న పోర్టు అధికారి కెపె్టన్ ఆదినారాయణ చెప్పారు. బోటును మరో ఇరవై మీటర్లు మేర ఒడ్డు వైపునకు తీసుకొస్తే బోటును సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చని తెలిపారు. ఇదిలావుంటే.. బోటు వెలికితీత పనులు కొలిక్కి రాకపోవడంతో అండర్ వాటర్ సరీ్వస్ కారి్మకుల(దుబాస్)ను కచ్చులూరు తీసుకొచ్చేందుకు ధర్మాడి సత్యం విశాఖపట్నం వెళ్లారు. మరోవైపు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి బంధువులు నిన్న కచ్చులూరు చేరుకుని వారి ఆచూకీ కోసం ఎదురు చూశారు. ఇదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. -
పట్టు జారిన లంగరు
రంపచోడవరం/దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వప్రయత్నం చేస్తోంది. శుక్రవారం ఉదయం పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసేందుకు లంగరు, ఐరన్ రోప్‌ను ఉచ్చు మాదిరిగా గోదావరిలోకి వదిలి పొక్లెయిన్ సాయంతో లాగారు. అయితే, లంగరు బోటుకు తగులుకుని పట్టు జారిపోయింది. సాయంత్రం మరోసారి లంగరును నీటిలోకి వదిలి ఐరన్ రోప్‌ను రెండుసార్లు బోటు చుట్టూ గోదావరిలో విడిచిపెట్టారు. అదే సమయంలో వర్షం కురవడంతో వెలికితీసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. శనివారం తిరిగి పనులు ప్రారంభించనున్నారు. రెండు రోజులపాటు చేపట్టిన ఆపరేషన్‌లో పలుమార్లు లంగరు, ఐరన్ రోప్ బోటుకు తగులుకోవడంతో.. పట్టు జారినప్పటికీ నదీగర్భం నుంచి సుమారు 70 అడుగుల మేర ఒడ్డు వైపునకు బోటు జరిగినట్లు పోర్టు అధికారి తెలిపారు. లంగరు, రోప్ లాగుతున్న సమయంలో బోటు ఉన్న ప్రాంతంలో బుడగలతో కూడిన డీజిల్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, దుర్వాసన వస్తోందని తెలిపారు. బోటులో ఉన్న డిస్పోజబుల్ గ్లాసుల కట్ట శుక్రవారం పైకి తేలింది. ప్రస్తుతం బోటు 40 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. నది ఒడ్డు నుంచి సుమారు 250 అడుగుల దూరంలో బోటు ఉన్నట్లు తెలిపారు. మరో పది మీటర్లు ఒడ్డు వైపు చేర్చగల్గితే బోటును సునాయాసంగా వెలికితీయవచ్చని చెబుతున్నారు. లంగరు వేసిన ప్రతిసారి బోటు ఇంచుమించు పది నుంచి ఇరవై మీటర్లు మేర ముందుకు వస్తోందని, బోటు ఆపరేషన్‌లో జాప్యం జరుగుతోంది తప్ప, దానిని వెలికి తీయడం తథ్యమని ధర్మాడి సత్యం చెప్పారు. బోటుకు లంగరు తగిలించే పని చేసేందుకు విశాఖపట్నానికి చెందిన అండర్ వాటర్ సర్వీస్ బృందాన్ని ధర్మాడి సత్యం సంప్రదించగా>.. నదిలో దిగేందుకు ఆ బృందం విముఖత వ్యక్తం చేసింది. -
బయటపడ్డ రాయల్ వశిష్ట బోటు ఆనవాళ్లు
సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. బోటు వెలికితీతకు యత్నిస్తున్న ధర్మాడి సత్యం బృందం బోటు ఆచూకీని కనుగొంది. ఈ క్రమంలోనే సత్యం బృందం వేసిన యాంకర్‌కు బోటు రెయిలింగ్ తగిలింది. యాంకర్ లాగడంతో బోటు రెయిలింగ్ బయటకు వచ్చింది. దీంతో సత్యం బృందం మరోసారి తన ప్రయత్నించింది. దేవుడిగొంది ఇసుక తిన్నె వద్ద ఒడ్డు నుంచి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో బోటు ఉన్నట్టు గుర్తించామని సత్యం బృందం తెలిపింది. అయితే చీకటి పడటంతో మూడో రోజు బోటు వెలికితీత పనులను నిలిపివేశారు. మరోవైపు కాకినాడు పోర్ట్ అధికారులు బోటు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ధర్మాడి సత్యం బృందాన్ని అడిగి బోటు ఆచూకీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కచ్చులూరు బోటు వెలికితీత అప్డేట్
సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. గోదావరిలో వరద ఉధృతి తగ్గడంతో బోటు వెలికితీత పనులను ముమ్మరం చేసింది. ఇందుకోసం భారీ లంగరు, 3 వేల అడుగుల ఐరన్ రోప్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం బోటు మునిగిన ప్రాంతంలో వేసిన ఐరన్ రోప్‌కు బలమైన వస్తువు తగలడంతో.. దానిని సత్యం బృందం బోటుగా భావించింది. భారీ నైలాన్ తాడుతో పొక్లెయిన్ సాయంతో బోటును వెలికితీసేందకు ప్రయత్నించారు. అయితే బలంగా లాగడంతో లంగరు జారిపోయినట్టగా సత్యం బృందం వెల్లడించింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి బోటు ముందకు వచ్చినట్టు సత్యం బృందం తెలిపింది. బోటుకు సంబంధించిన తెల్లని రంగు నీళ్లపై కి తేలిందని పేర్కొంది. కొద్ది రోజుల కిందట సత్యం బృందం బోటు వెలికితీత పనులు ప్రారంభించినప్పటికీ గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో పనులను నిలిపివేసింది. -
బోటు ప్రమాదంపై దిగజారుడు రాజకీయాలు
కాకినాడ సిటీ: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం మానవ తప్పిదమని, ప్రభుత్వ వైఫల్యం కాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. అయితే ఈ బోటు ప్రమాదంపై టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గురువారం రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియం వద్ద మంత్రి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎన్నో బోటు ప్రమాదాలు జరిగాయని, అప్పుడే నిబంధనలు కఠినతరం చేసి ఉంటే ఇప్పుడీ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. నిమ్మకు నీరెత్తినట్లు పరిపాలన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి కారణమైన చంద్రబాబు కనీసం ఆ కుటుంబాలకు సంతాపం తెలపలేదని, చుక్క కన్నీరు కార్చలేదన్నారు. పుష్కరాల్లో తొక్కిసలాటకు కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అలాంటివారు ఇప్పుడు విమర్శలు చేయడం శోచనీయమన్నారు.ప్రమాదంలో నీట మునిగిన బోటును వెలికి తీయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. బోటును వెలికితీయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియో రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున సంబంధిత కలెక్టర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇంకా ఆచూకీ లభించని వారికి ఎక్స్‌గ్రేషియో చెల్లింపుతోపాటు మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశించామన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి బీమా చెల్లింపుకోసం ప్రత్యేక జీవో కూడా ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. -
బోటు ప్రమాదాలు జరగకుండా కఠిన నిబంధనలు
సాక్షి, తూర్పుగోదావరి : భవిష్యత్తులో బోటు ప్రమాదాలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని మంత్రి అవంతీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం బోటు ప్రమాదంలో మరణించిన విశాఖపట్నం, అనకాపల్లి, పెందుర్తి, గోపాలపట్నం, మహారాణిపేటలకు చెందిన తొమ్మిది కుటుంబాలకు రూ.10 లక్షల చెక్‌లను మంత్రి పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి గుడివాడ అమర్ నాథ్, ధర్మశ్రీ, అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేలతో పాటు కలేక్టర్ వినయ్ చంద్, విఎం చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరగటం చాలా దురదృష్టకరమని, మృతిచెందిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన వారు 17మంది ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ. 10 లక్షల చొప్పున రూ. 90 లక్షలు ఎక్సగ్రేషియా అందించామని పేర్కొన్నారు. అలాగే బోటును బయటకు తీయడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నామని, బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇవ్వడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజులలో బోటు ప్రయాణాలపై నిర్థిష్ట ప్రమాణాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనున్నదని మంత్రి వెల్లడించారు. -
పడవ నుంచి అమాంతం పడిపోయిన ఎంపీ..!
పట్నా: చుట్టూ భారీగా వరద నీరు.. ఈ వరద నీటిలో ట్యూబులతో తయారుచేసిన తాత్కాలిక పడవలో ప్రయాణించి.. వరద బాధితులను పరామర్శించాలని ఓ ఎంపీ ప్రయత్నించారు. కానీ, వరదనీరు భారీగా ఉండటంతో ఎలాంటి రక్షణలు లేని తాత్కాలిక బోటులో ప్రయాణించాలని చూసిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ట్యూబులో తయారుచేసిన బోటులో ఎక్కువమంది ఉండటంతో.. అది అమాంతం మునిగిపోయింది. ఎంపీతోపాటు ఆయన వెంట ఉన్నవారు నీళ్లలో పడిపోయారు. సమయానికి అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడంతో ఎంపీ సురక్షితంగా బటయపడ్డారు. ఈ ఘటన బిహార్ పాట్నా జిల్లా మసౌర్హిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ ఎంపీ రాంకృపాల్ యాదవ్ తాత్కాలిక బోటులో ప్రయాణించి.. వరద బాధితులను పరామర్శించేందుకు ప్రయత్నించారు. అయితే, ఎలాంటి రక్షణలు లేకుండా ఈ బోటు ప్రమాదకరంగా ఉండటం, దానిపై ఐదారుగురు ప్రయాణించడంతో నీళ్లలో కొద్దిదూరం వెళ్లకముందే.. ఇది అదుపుతప్పి నీళ్లలో మునిగిపోయింది. దానిపై ఉన్నవారంతా అమాంతం నీళ్లలో పడిపోయారు. సమయానికి అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడంతో ఈ ప్రమాదం నుంచి ఎంపీతోపాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
మూడోరోజు కూడా నిరాశే...
సాక్షి, తూర్పుగోదావరి : కచ్చలూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు మూడోరోజు కూడా విఫలమయ్యాయి. మంగళవారం(రెండోరోజు) సత్యం బృందం గోదావరిలో 1000 మీటర్లకు పైగా ఐరన్ రోప్‌ను దింపి ప్రొక్లైయిన్ సహాయంతో బోటును వెలికి తీసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐరన్ రోప్ బండరాయికి తగిలి తెగిపోయింది. దీంతో యాంకర్లు వేసి బోట్ ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం నుంచి బోటు వెలికితీత పనుల్లో నిమగ్నమైన సత్యం బృందానికి వర్షం అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడా భారీ వర్షం కురవడంతో ఆపరేషన్‌కు అంతరాయం కలిగింది. గోదావరిలో నీటి స్థాయి మూడు అడుగులు పెరిగినట్లుగా భావించడంతో ప్రస్తుతానికి వెలికితీత పనులను నిలిపివేశారు. కాగా పాపికొండల విహారానికి బయల్దేరిన ఎన్నో కుటుంబాలకు పడవ ప్రమాదం విషాదం మిగిల్చిన విషయం విదితమే. -
చిక్కినట్టే చిక్కి.. అంతలోనే పట్టు తప్పి..
దేవీపట్నం (రంపచోడవరం): కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన ప్రైవేట్ టూరిజం బోటు రాయల్ వశిష్ట పున్నమిని ధర్మాడి సత్యం బృందం బయటకు తీసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆశనిరాశల మధ్య రెండోరోజు బోటు వెలికితీత పనులు కొనసాగాయి. గోదావరి ప్రవాహం ఉరుకులు తగ్గి సాఫీగా సాగిపోతున్నా కచ్చులూరు మందం నుంచి బోటు వెలికి తీసుకురావడం ధర్మాడి బృందానికి పెనుసవాల్‌గా మారింది. జిల్లా యంత్రాంగం బాలాజీ మెరైన్స్ సంస్థకు బోటు వెలికితీత పనులు అప్పగించిన తరువాత రెండో రోజు ఆ బృందం సభ్యులు రంగంలోకి దిగారు. 900 మీటర్ల ఐరన్ రోప్‌తో వెలికితీసే ప్రయత్నం కచ్చులూరు మందంలో గల్లంతైన బోటును వెలికితీసేందుకు ధర్మాడి బృందం సోమవారం రెండు వేల మీటర్ల ఐరన్ రోప్‌ను గోదావరిలో బోటు ఉన్న ప్రాంతంగా భావిస్తున్న ప్రాంతంలో వలయకారంలో ఉచ్చుగా చేశారు. ఐరన్ రోప్ రెండు కొనలను పొక్లెయిన్‌తో లాగే ప్రయత్నం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభించారు. గోదావరి నుంచి ఒడ్డుకు తీసుకువచ్చిన ఐరన్ రోప్‌ను సులభంగా లాగేందుకు కప్పీలను అమర్చారు. గోదావరిలో ఐరన్ రోప్ మునిగిన బోటుకు తగిలింది అనే అంచనాలో బోటు పైకి వస్తుందనే ప్రయత్నాల్లో ఐరన్ రోప్ ఒక్కసారిగా తెగిపోయింది. పది నిమిషాల పాటు రోప్ తెగకుండా ఉంటే గోదావరిలో జత చేసి ఉన్న బలమైన ఐరన్ రోప్ పొక్లెయిన్ లాగే అవకాశం వచ్చేది. ఐరన్ రోప్ తెగిపోవడంతో ధర్మాడి సత్యం బృందం ప్రయత్నం విఫలమైంది. పొక్లెయిన్ లాగేందుకు ఉపయోగించిన ఐరన్ రోప్ సుమారు 50 టన్నుల బరువును లాగేందుకు ఉపయోగపడుతోంది. గోదావరిలో మునిగిన బోటు 24 టన్నులు కాగా మరో 25 టన్నులు అదనపు బరువును లెక్కించి ఐరన్ రోప్‌ను ఉపయోగించినా వారి అంచనా తప్పింది. రోప్ బండరాయికు తగులుకోవడంతో తెగిపోయినట్టు సత్యం వెల్లడించారు. అప్పటికే సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావడంతో మరో వ్యూహంతో తమ వద్ద అందుబాటులో ఉన్న 900 మీటర్ల ఐరన్ రోప్‌తో ఆపరేషన్ తిరిగి ప్రారంభించారు. 900 మీటర్ల ఐరన్ రోప్‌కు చివర లంగరు కట్టి బోటు ఉన్నట్టు భావిస్తున్న ప్రాంతంలో వదిలి పెట్టి ఒడ్డుకు ఐరన్ తీసుకువచ్చారు. లంగరుకు ఎక్కడా బలమైన వస్తువు తగల్లేదు. ఖాళీ లంగరును బయటకు లాగారు. కొనసాగనున్న వెలికితీత పనులు కచ్చులూరు మందం వద్ద మూడో రోజు మునిగిన బోటును వెలికితీసే ప్రక్రియ కొనసాగుతుంది. బాలాజీ మెరైన్స్ సంస్థ యాజమాని ధర్మాడి సత్యం మాట్లాడుతూ బోటు ఉన్న ప్రాంతంలో గోదావరిలో దుర్గంధం వస్తోంది. ఐరన్ రోప్ బండరాయి, బోటుకు కలిపి తగలడంతో రోప్ తెగిపోయింది. బోటును వెలికి తీసేందుకు బుధవారం మరో ప్రయత్నం జరుగుతుందన్నారు. -
యాంకర్లు వేసి బోటు ఆచూకీ కనుగోనే యత్నం
సాక్షి, తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు సత్యం బృందం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(రెంరోజు) సత్యం బృందం గోదావరిలో 1000 మీటర్లకు పైగా ఐరన్ రోప్‌ను దింపి ప్రొక్లైయిన్ సహాయంతో వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఐరన్ రోప్ బండరాయికి తగిలి తెగిపోయింది. దీంతో యాంకర్లు వేసి బోట్ ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రెండో రోజు ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు కొద్ది పాటి ఆటంకం ఏర్పడింది. -
గోదావరి: కొనసాగుతున్న లాంచీ వెలికితీత ప్రక్రియ
సాక్షి, రాజమండి: తూర్పుగోదావరిజిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిన లాంచి వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. రెండోరోజు ఉదయాన్నే బోటు మునిగిన ప్రాంతంలో మరోసారి ఐరన్ రోప్‌ను నదిలో దించారు. దానిని ప్రొక్లైయిన్‌కు కట్టి లాంచీ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి బోటు ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకుంటే బయటకు తీసుకురావచ్చని బాలాజీ మెరైన్ సంస్థ భావిస్తోంది. ఒకటి రెండురోజుల్లో లాంచి ఆచూకీ తెలుసుకున్నాక, బయటకు తీస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..
సాక్షి, కాకినాడ: రెండు వారాల క్రిందట గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు ఆదివారం నుండి ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడ నుండి కచ్చులూరుకు సరంజామా తీసుకుని బాలాజీ మెరైన్ సంస్ధ బయలు దేరింది. మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని బాలజీ మెరైన్ యాజమాని ధర్మాడి సత్యం తెలిపాడు. గత పది రోజులుగా కచ్చులూరులో గోదావరి ఒరవడిపై అవగాహన వచ్చిందన్న అతడు....బోటుకి యాంకర్ తగిలించి తాళ్ల సాయంతో జేసీబీతో లాగుతామని, 25మంది బృందంతో ఆపరేషన్ చేపడుతున్నట్లు సత్యం పేర్కొన్నాడు. కాగా రాయల్ వశిష్ట పున్నమి బోటు, గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో దేవీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి యథావిధిగా బోటులో బయల్దేరి ప్రమాద స్థలం వద్ద గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77మంది ఉండగా 26 మంది సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఇప్పటివరకూ బోటు ప్రమాదానికి సంబంధించి 38 మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన 13మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. -
‘ప్రయాణికులను కాపాడిన స్థానికులకు ఆర్థిక సాయం’
సాక్షి, అమరావతి : గోదావరి బోటు ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే బోటును బయటకు తీసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. బోటు ప్రమాదం జరిగిన సమయంలో పలువురు పర్యాటకులను కాపాడిన స్థానికులకు రూ. 25వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ట పున్నమి ప్రైవేట్ బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మంత్రి కన్నబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 300 అడుగుల లోతులో కూరుకుపోయిన బోటును వెలికి తీయడం పెద్ద టాస్క్‌గా మారిందని అన్నారు. బోటును వెలికితీసేందుకు నేవీ తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం దక్కలేదన్నారు. గోదావరిలో ఇంకా వరద కొనసాగుతుందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా గాలింపు చేపడుతున్నాయని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, ముంబై, కాకినాడ నుంచి నిపుణులను తీసుకొచ్చినా.. బోటును వెలికితీయలేకపోయామని చెప్పారు. లాంచీ వెలికితీతకు ప్రైవేటు వ్యక్తులు వస్తే అధికారులను సంప్రదించాలని సూచించారు. 2018లో ఇచ్చిన జీవోలో స్పష్టత లేదని.. అందులో బోటింగ్ నిర్వహణ ఎవరి పరిధిలోకి వస్తుందో చెప్పలేదని అన్నారు. -
ఎన్డీఆర్ఎఫ్ బోటుకు తప్పిన ప్రమాదం
సాక్షి, తూర్పు గోదావరి: దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరిలో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. గత రెండురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తాజాగా మళ్లీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లుగా వాతావారణ శాఖ హెచ్చరించింది. బోటు ప్రమాద మృతులను గాలిస్తున్న క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బోటు మునిగిపోయింది. కాగా అందులో ఉన్న సిబ్బంది లైఫ్ జాకెట్ ధరించడంతో వారికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సెప్టెంబర్ 15వ తేదీన 71 మంది ప్రయాణికులతో వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన విషయం విదితమే. లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని వెలికితీయడానికి 10 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
రమ్యానే పిలిచినట్టు అనిపిస్తోంది..
తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం): డాడీ! అని ఎవరు పిలిచినా మా అమ్మాయే పిలిచినట్టు అనిపిస్తోందని బోటు ప్రమాదంలో గల్లంతైన మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ పేర్కొన్నారు. ఈనెల 15న దేవీపట్నం మండలం కుచ్చులూరులో జరిగిన బోటు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన విద్యుత్‌శాఖ ఏఈ కారుకూరి రమ్యశ్రీ గల్లంతైంది. పది రోజులుగా ఆమె ఆచూకీ కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు, ఎంతకీ లభ్యం కాపోవడంతో మృతదేహం దొరకకుండానే, మరణించిందని భావించి ఆమె ఆత్మశాంతి కోసం 11వ రోజైన బుధవారం రాజమహేంద్రవరం కోటిలింగాల రేవులో గోదానం చేసి, కర్మకాండలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ మాట్లాడుతూ 10 రోజులుగా మృతదేహం కోసం ఎదురుచూశామని, దొరికిన మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉన్నాయన్నారు. తన కుమార్తె మృతదేహం వస్తుందో! రాదో! తెలియని అయోమయ పరిస్థితుల్లో 11వ రోజు కర్మకాండ నిర్వహించకపోతే ఆమె ఆత్మకు శాంతి చేకూరదని పండితులు చెప్పడంతో ఆమె ఆత్మశాంతి కోసం కర్మకాండ నిర్వహించామని తెలిపారు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తుండేదని తెలిపారు. బోటు దిగిన తరువాత ఫోన్ చేస్తానంటూ మెసేజ్ పెట్టిందని, కడసారి చూపు కూడా చూడకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోందని రమ్యశ్రీ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి కర్మకాండలు ముగిసినా తన కుమార్తెను తలచుకుంటూ కోటిలింగాల రేవులోనే ఎక్కువ సమయం ఉండిపోయారు. మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు వాడపల్లి వద్ద మంగళవారం లభించిన పురుషుడి మృతదేహం తమదంటే తమదని ఇరుకుటుంబాల బంధువులు అంటున్నారు. కాకినాడకు చెందిన బోటు డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ(60) మృతదేహంగా అతడి కుమారుడు పొతాబత్తుల కుమార్ చెబుతుండగా, బోటులో సహాయకుడిగా పనిచేస్తున్న పాత పట్టిసీమకు కర్రి మణికంఠ మృతదేహంగా అతడి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి గురువారం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మృతదేహాల కోసం ఎదురుచూపులు.. తమ కుటుంబ సభ్యులు, బంధువుల మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు ఎదురు చూపులు చూస్తున్నారు. రమ్యశ్రీ మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు, బోటు డ్రైవర్లు పోతాబత్తుల సత్యనారాయణ, నూకరాజు మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అంకం పవన్‌కుమార్, అతడి భార్య వసుంధరా భవానీ మృతదేహాల కోసం అతడి మేనమామ మట్టా రాజేంద్ర ప్రసాద్ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరని మహిళ మృతదేహం బుధవారం రాత్రి సీతానగరం ఎస్సైకు మహిళ మృతదేహం అప్పగించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తారని మృతుల కుటుంబాల వారు ఎదురుచూసినా రాత్రి వరకు రాకపోవడంతో నిరాశ చెందారు. ఆ మృతదేహం బోటు ప్రమాదంలో మృతిచెందిన వారిది కాదేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
రమ్యశ్రీ కడసారి చూపు కోసం..
కన్నతండ్రి ఎదురు చూపులు నేడు కోటిలింగాలఘాట్లో రమ్యశ్రీ కర్మకాండ మరో రెండు మృతదేహాలు లభ్యం మృతుల వస్తువులైనా అప్పగించాలని వేడుకోలు తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కన్న కూతురి కడసారి చూపు కోసం కన్న తండ్రి పది రోజులుగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలకు చెందిన కాకునూరి రమ్యశ్రీ(24) కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైంది. ఆ యువతి జాడ కోసం కన్న తండ్రి సుదర్శన్ పది రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షిస్తున్నాడు. తొలిరోజు 50 మంది కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన పది రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు 16 మంది రాజమహేంద్రవరంలో మకాం వేసి ఆమె ఆచూకీ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఒక మృతదేహం వాడపల్లి వద్ద, రెండో మృతదేహం సీతానగరం మండలం ఇనుగంటివారిపేట లంకభూమి వద్ద గుర్తించారు. అయితే వాడపల్లి వద్దకు మృతుల బంధువులను బస్సులో తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. తీరా ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉండిపోయారు. మృతదేహం మార్చురీకి తీసుకురాగా, దాని గుర్తింపు కోసం అక్కడికి బంధువులను తీసుకువచ్చారు. ఆ మృతదేహం మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీదిగా భావించారు. రమ్యశ్రీ తండ్రి, బంధువులు మార్చురీకి వద్ద మృతదేహంపై ఉన్న పచ్చబొట్టు, ఇతర వస్తువులు ఉన్నాయేమోనని చూసుకున్నారు. ఆ మృతదేహంపై పూర్తిగా మట్టిపేరుకుపోయి, దుస్తులు లేకపోవడం, పూర్తిగా ఎముకల గూడులా ఉండడంతో మట్టిని శుభ్రం చేసి చూసిన తరువాత ఆ మృతదేహం పురుషుడిదని గుర్తించారు. కానీ మృతుడు ఆచూకీ లభించకపోవడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని మృతుల బంధువులు కోరారు. నేడు రమ్యశ్రీ కర్మకాండ నిర్వహణకు ఏర్పాట్లు రమ్యశ్రీ మృతదేహం కోసం పది రోజులుగా నిరీక్షించిన మృతురాలి తండ్రి సుదర్శన్, తల్లి భూలక్ష్మి, ఇతర బంధువులు మంగళవారం వరకు చూసి మృతదేహం లభిస్తే బుధవారం తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని, లేకుంటే వెళ్లిపోయి 11వరోజు కర్మకాండ నిర్వహించాలని అనుకున్నారు. మంగళవారం మ«ధ్యాహ్నం చానళ్లలో మహిళ మృతదేహం లభ్యమైనట్టు స్క్రోలింగ్‌లు రావడంతో చూసి రాజమహేంద్రవరంలోనే ఆగిపోయారు. మృతదేహం పరిశీలించిన అనంతరం మహిళ మృతదేహం కాకపోవడంతో 11వ రోజు బుధవారం రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్‌లో కర్మకాండ ఏర్పాట్లలో ఉన్నారు. ఏరోజు చేయాలా అనేది తర్జనభర్జన పడుతున్నారు. పదకొండో రోజు కర్మకాండ నిర్వహించి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు రమ్యశ్రీ మేనమామ వెంకటేష్ చెప్పారు. గుర్తుపట్టలేని విధంగా.. హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన అంకం పవన్ కుమార్, అతడి భార్య వసుంధర భవానీ మృతదేహాల కోసం మేనమామ మట్టా రాజేంద్ర ప్రసాద్ పది రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురు చూస్తున్నాడు. మంగళవారం మృతదేహం లభించంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టేందుకు వీలు లేకపోవడంతో డీఎన్ఏ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 10 రోజులుగా నీటిలో ఉండిపోయిన మృతదేహాలు గుర్తు పట్టేందుకు వీలు లేకుండా పోతున్నాయని, దొరికిన వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇనుగంటివారిపేట వద్ద మరో మృతదేహం సీతానగరం (రాజానగరం): కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని మంగళవారం ఇనుగంటివారిపేట లంకభూమికి అవతల వైపున పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ఎదురుగా లంకభూమి వద్ద గుర్తించారు. తాళ్లపూడి ఎస్సై సతీష్ తన సిబ్బందితో లంకభూమి వద్ద ఉన్న మృతదేహం వద్దకు సాయంత్రం ఆరు గంటలకు చేరుకున్నారు. అయితే రాత్రి అయినందున వెనక్కి తరలివెళ్లారు. బుధవారం మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని ఎస్సై సతీష్ వెల్లడించారు. ఇప్పటి వరకూ లభించిన మృతదేహాలు 38 దేవీపట్నం మండలం కచ్చులూరులో ప్రైవేటు టూరిజం బోటు ప్రమాదంలో మంగళవారం వరకు 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13 లభించాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గుర్తించ లేని మూడు మృతదేహాలు ఉన్నాయి. బోటు ప్రమాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభం కాకినాడ సిటీ: దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాద సంఘటనపై ప్రాథమిక విచారణ ప్రారంభించామని జాయింట్ కలెక్టర్, మెజిస్ట్రీయల్ ఎంక్వైరీ అధికారి జి లక్ష్మీశ తెలిపారు. మంగళవారం విచారణాధికారిగా తొలిసారి జాయింట్ కలెక్టర్ తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో విచారణ చేపట్టారు. విచారణలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, పోర్టు డైరెక్టర్ ధర్మపాస్థ, అడిషనల్ ఎస్పీ వి.జిందాల్, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ ఎన్.కృష్ణ, ఫిషరీస్ జేడీ పి.జయరాజు, బోటు సూపరింటెండెంట్ కె.దొరయ్య, టూరిజం డివిజనల్ మేనేజర్ ప్రకాశ్‌తో పాటు రంపచోడవరం ఆర్డీవో కార్యాలయపు డీఈవో, దేవీపట్నం తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌లను తమ, తమ పరిధిలో జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి విచారణ త్వరలో సంబంధిత అధికారులతో చేపట్టనున్నట్టు లక్ష్మీశ తెలిపారు. బోటు ప్రమాదానికి సంబంధించి ఎవరైనా వ్యక్తిగతం, లిఖిత పూర్వకంగా తనను సంప్రదించవచ్చని లక్ష్మీశ తెలిపారు. -
ఆ ఐదు రోజులు మరచిపోలేను..
కాజీపేట అర్బన్ : జిల్లాలోని కాజీపేట మండలంలోని కడిపికొండ, న్యూశాయంపేటకు చెందిన 14 మందితోపాటు జనగామ జిల్లా చిన్న పెండ్యాలకు చెందిన ఓ యువకుడు మొత్తం పదిహేను మంది పాపికొండల విహార యాత్ర కు వెళ్లి అక్కడ బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు సురక్షితంగా బయటపడగా.. మిగతా వారు గల్లంతయ్యారు. ఆ తర్వాత గాలింపుల్లో ఏడుగురి మృతదేహాలు లభించినా ఇంకా ముగ్గురి ఆచూకీ తేలలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్లిన బృందంలో కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఉన్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉన్న అధికారుల బృందం మృతదేహాల ఆచూకీ కోసం జరిగిన గాలింపు చర్యల్లో పాల్గొనడంతో పాటు బాధిత కుటుంబాలకు సమచారం ఇస్తూ, ఓదార్చారు. ఇటీవలే రాజమండ్రి నుంచి వచ్చిన ఆయన అక్కడి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు తహసీల్దార్ మాటల్లోనే... హుటాహుటిన సంఘటనా స్థలానికి.. పాపికొండలు టూర్‌కు వెళ్లిన జిల్లా వాసులు తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపాన గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ఘ టన గత ఆదివారం(ఈనెల 15వ తేదీన) మ ధ్యాహ్నం 1.15 గంటలకు జరిగింది. ఈ మేరకు సమాచారం మాకు సాయంత్రం 4 గంటలకు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక వాహనంలో కాజీపేట ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్, ఆర్ఐ సురేందర్, వీఆర్వో జోసెఫ్‌తో కలిసి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట నుండి బయలుదేరాం. సుమారు 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు రాజమండ్రికి చేరుకున్నాం. త్వరగా వెళ్లాలనే తపనతో కేవలం ఒంటి మీద బట్టలతోనే వెళ్లాం. అక్కడకు వెళ్లాకే మా అవసరాలు గుర్తుకొచ్చాయి. దుస్తులు, సబ్బులు, టూత్‌పేస్ట్ తదితర వస్తువులన్నీ అక్కడే కొనుగోలు చేశాం. మంత్రులు, ఎమ్మెల్యేల ఏరియల్ సర్వే కచ్చులూరు సమీపంలో బోటు బోల్తా పడగా తె లంగాణ వాసులు చిక్కుకున్నారని తెలియగానే రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పు వ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూరి ద యాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా వచ్చారు. అక్కడ ఘటనా స్థలం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులకు భరోసానందిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి వెనక్కి.. ప్రమాదంలో గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ గురు, శుక్రవారం వరకు కూడా లభించలేదు. దీంతో ఇక్కడి మండల ప్రజలకు సేవలందించడంలో అవాంతరాలు ఎదురుకాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి బయలుదేరాం. శనివారం ఇక్కడకు చేరుకున్నాం. మరిచిపోలేని ఘటన కలెక్టర్ ఆదేశాలతో రాజమండ్రికి వెళ్లిన మేం గత సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు సంఘటన స్ధలానికి దగ్గరలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సేవలందించాం. ఓ పక్క సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బాధితులకు సమాచారం ఇచ్చాం. మృతదేహాలను ఘటనా స్థలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం బ్యారేజి, 120 కిలోమీటర్ల దూరంలోని యానాంలో రెస్క్యూటీం బృందాలు గుర్తించాయి. ఆ వెంటనే మృతులు బంధువులతో మాట్లాడడంతో పాటు ఆధార్‌కార్డు, బోటులో ప్రయాణం ప్రారంభించే సమయంలో దిగిన సెల్ఫీలతో గుర్తుపట్టేందుకు బయలుదేరాం. ఆ సమయంలో బంధువుల ఆర్తనాదాలు, మావారి ఆచూకీ చెప్పండయ్యా అంటూ కాళ్ల మీద పడి రోదిస్తుండడం కలిచివేసింది. మృతదేహాలను గుర్తుపట్టాక బంధువులు రోదించిన తీరు మాకు కూడా కన్నీళ్లు తెప్పించింది. ఆ ఐదు రోజులు తిండి సైతం మరిచిపోయి బాధితుల కోసం పడిన కష్టం మరిచిపోలేను. ఇదంతా జరిగిన పది రోజులు కావొస్తున్నా బాధితుల ఆర్తనాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నా బ్యాచ్‌మేట్ సహకారంతో.... నేను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లగా రాజమండ్రి అర్బన్ తహసీల్దార్‌గా నా స్నేహితుడు సుస్వాగత్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయనే మాకు బస ఏర్పాటుచేశాడు. అలాగే, అక్కడికి వచ్చిన బాధితుల బంధువులకు రాజమండ్రిలోని రత్న హోటల్లో వసతి ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించాడు. కాగా, నేను తహసీల్దార్‌గా ఆరేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. నా పరిధిలోని ఒకే గ్రామానికి చెందిన 14 మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఎప్పుడూ జరగలేదు. 14 మంది వివరాలు పంపించాం.. ప్రమాదం జరిగిన రోజు బోటులో ప్రయాణించిన కడిపికొండ, న్యూశాయంపేట, చిన్నపెండ్యాలకు చెందిన 14 మంది బాధితులు, మృతులు, ఆచూకీ లభించని వారి పూర్తి వివరాలను రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మంగళవారం పంపించాం. అలాగే, వారి బంధువుల వివరాలు, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ల వివరాలను సమర్పించాం. ఆ వివరాల ఆధారంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం అందనుంది. -
కొత్త లాంచీలే కొంప ముంచుతున్నాయ్
కొత్త లాంచీలే పర్యాటకుల ప్రాణాల్ని హరిస్తున్నాయా. నిండు గోదారిలోనూ దశాబ్దాల తరబడి సాఫీగా ప్రయాణించిన పాత లాంచీ డిజైన్లను పక్కనపెట్టి.. కొత్త డిజైన్లతో రూపొందించటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయా.. అవుననే సమాధానమిస్తున్నారు సీనియర్ సరంగులు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఇటీవల జరిగిన ప్రమాదానికి లాంచీ బరువు, డిజైన్ కూడా ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. వేలేరుపాడు (పశ్చిమ గోదావరి జిల్లా): రహదారి వ్యవస్థ లేనికాలంలో.. 1986 వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లాంచీలే ప్రజల రవాణా అవసరాలు తీర్చేవి. భద్రాలం నుంచి రాజమండ్రి (150 కిలోమీటర్లు), కూనవరం నుంచి రాజమండ్రి (100 కిలోమీటర్లు), కూనవరం నుంచి భద్రాచలం (50 కిలోమీటర్లు), కూనవరం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుంట (15 కిలోమీటర్లు) మధ్య లాంచీలు పెద్దఎత్తున తిరిగేవి. అప్పట్లో ప్రతి లాంచీలో 200 మంది ప్రయాణికులతోపాటు విత్తనాలు, ఎరువులు, కిరాణా సామగ్రి, నిత్యావసర సరుకుల వంటివి టన్నుల కొద్దీ రవాణా చేసేవారు. అధిక లోడు ఉన్నప్పుడు ఫుట్ బోర్డును సైతం గోదావరి నీరు తాకుతూ ఉండేది. అయినా ఏనాడూ ప్రమాదాలు సంభవించలేదు. ఆ‘రామ్’గా వెళ్లొచ్చేవారు.. 1917లో ఆయిల్ ఇంజిన్‌తో నడిచే ‘శ్రీరామ’ అనే లాంచీ ఉండేది. ఆ తర్వాత చాలా లాంచీలు గోదావరిలోకి వచ్చాయి. వీటిలో ప్రధానమైనవి ఝాన్సీరాణి, ఉదయ భాస్కర్, శ్రీరాములు, రాజేశ్వరి, ముద్దుకృష్ణ, మురళీకృష్ణ, సావిత్రి, విజయలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి పేర్లతో లాంచీలు నడిచేవి. గోదావరిలో సుడిగుండాలు కొత్త కాదు. పాత లాంచీలు ఉన్నప్పుడు ఏనాడూ సుడిగుండాల ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరగలేదు. ఇప్పుడు ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కళ్లు మూసుకుని కొత్త బోట్లకు అనుమతి అధికారులు కళ్లు మూసుకుని కొత్త బోట్లకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త బోటు తయారు చేయించేటప్పుడు సదరు యజమాని పోర్టు అధికారులకు దరఖాస్తు చేయాలి. బోటు డిజైన్‌ను పోర్టు అధికారులు పరిశీలించి అనుమతి ఇవ్వాలి. కానీ.. ఎలాంటి డిజైన్ ఉన్నా గుడ్డిగా అనుమతులు ఇస్తున్నారు. బోటు బరువు ఎంత ఉండాలన్నది చెప్పడం లేదు. ఫలితంగా పర్యాటకుల ప్రాణాలు గంగ పాలవుతున్నాయి. మారిన డిజైన్లతో కొత్త చిక్కులు పూర్వం లాంచీలు ‘యూ’ ఆకారంలో ఉండేవి. వాటి ముక్కు సూదిగా ఉండేది. లాంచీ తయారీకి ఎక్కువగా టేకు. ఇనుము తక్కువగా వినియోగించేవారు. రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చాక లాంచీలన్నీ పర్యాటక రంగానికే పరిమితమయ్యాయి. వీటి డిజైన్లు మారిపోయాయి. ఇప్పటి బోట్లు, లాంచీల ఎత్తు భారీగా పెంచారు. లాంచీపై మరో అంతస్తు నిర్మిస్తున్నారు. పర్యాటకులు లాంచీ పైభాగంలో కూర్చుని సుందర ప్రదేశాలను తిలకించేందుకు వీలుగా సిట్టింగ్ సౌకర్యం కల్పించారు. దిగువ భాగంలో ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో వాటి బరువు భారీగా ఉంటోంది. ఎత్తు పెరగడం వల్ల బ్యాలెన్స్ లేకుండా పోతోంది. ఎటు బరువు పెరిగితే అటు ఒరిగే పరిస్థితి తలెత్తుతోంది. పాత లాంచీల బరువు 15 నుంచి 20 టన్నులకు మించి ఉండేవి కావు. ప్రస్తుత లాంచీలు 35 నుంచి 40 టన్నుల వరకు బరువుంటున్నాయి. సరంగు నిర్లక్ష్యం.. డిజైన్ లోపాలే కారణం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన లాంచీని అనుభవం లేని సరంగు నడిపాడు. అతడి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. లాంచీ డిజైన్ లోపం కూడా ప్రమాదానికి మరో కారణం. ఆ లాంచీకి తల బరువు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రమాద ప్రాంతంలో రెండు కొండలు దగ్గరగా ఉంటాయి. అక్కడ నదిలో నీటి వడి ఎక్కువ. సరంగు ఈ విషయాలను గమనించకుండా నడపడం వల్లనే లాంచీ పల్టీ కొట్టింది. పాత లాంచీలు బరువు తక్కువ కావటం వల్ల సునాయాసంగా ప్రయాణిస్తాయి. 1986, 1990 సంవత్సరాల్లో సంభవించిన వరదల్లో వేల కుటుంబాలను పాత లాంచీలతోనే కాపాడాం. – చవ్వాకుల ప్రకాశరావు, సీనియర్ సరంగు, కూనవరం -
బోటు ప్రమాదం: మరో మహిళ మృతదేహం లభ్యం
సాక్షి, తూర్పుగోదావరి : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మంటూరు సమీపంలో ఉన్న వాడపల్లి గొంది వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని దేవిపట్నంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రాయల్ వశిష్ట లాంచీ మునిగి మంగళవారానికి పదిరోజులు అవుతోంది. అయినప్పటికీ ఇంకా 14 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది. ప్రమాదం సంభవించి పదిరోజులు కావడం వల్ల నీటిలో ఉన్న మృతుల శరీరంలో అవయవాలన్ని మెత్తగా మారిపోయి ఉంటాయని వైద్యులు తెలిపారు. వాడపల్లి గొందె వద్ద లభించిన మహిళ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ దేవిపట్నంకు తరలించారు. జుట్టు లేకుండా ఉన్న మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు రాయల్ వశిష్ట లాంచీ ప్రమాదంలో 38 మృతదేహలు గోదావరిలో లభ్యం కాగా ఇంకా 13 మంది పర్యాటకుల ఆచూకీ కోసం రక్షణ సిబ్బంది గాలిస్తున్నారు. -
కనిపించని కనుపాపలు!
చిట్టితల్లి వైష్ణవికి రోజూ గోరుముద్దలు తినిపించేది ఆ తల్లి.. అమ్మానాన్నా అంటూ ముద్దుముద్దుగా పిలుస్తుంటే మురిసిపోయేది.. చెల్లెలితో కలిసి ఇల్లంతా కలియదిరుగుతూ సందడి చేస్తుంటే ఇంటిల్లిపాదీ సంబరపడిపోయేవాళ్లు.ఇప్పుడా ఇళ్లలో ఆ సందడి లేదు.. దాని స్థానంలో విషాదం అలుముకుంది.అదీ ఓ విషాద ఘటనలో గల్లంతయ్యారు. అన్వేషణ సాగుతున్నా.. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ దొరక్కపోవడంతో తమ కంటిపాపలు కడచూపుకైనా దక్కవేమోనన్న బాధ ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది. గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన విశాఖ జిల్లాకు చెందిన 17 మందిలో 13 మంది నిర్జీవంగానే దక్కారు. మిగిలిన నలుగురూ చిన్నారులే.. పెద్దవారు విగతజీవులుగానైనా దక్కారు. వారి పిల్లలైనా దక్కుతారని.. వారిలో చనిపోయినవారిని చూసుకుందామనుకుంటూ.. వారి ఆచూకీయే ఇంతవరకు లభించక.. అసలు వారు సజీవంగా ఉన్నారో.. లేదో.. అర్థంకాక నగరంలోని ఆరిలోవ, రామలక్ష్మి కాలనీ, గాజువాక ప్రాంతాలకు చెందిన వారి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. –సాక్షిప్రతినిధి, విశాఖపట్నం సాక్షి, విశాఖ సిటీ: పోయినవారు ఎలాగూ పోయా రు.. చిన్నారులైనా దక్కుతరని ఆశపెడితే.. గో దారమ్మ ఆ ఆశలను చిదిమేస్తోందన్న ఆవేదనతో నగరానికి చెందిన మూడు కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఆరిలోవ దుర్గాబజార్ ఏ ఎస్ఆర్ కాలనీకి చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు తమ పిల్లలు వైష్ణవి, ధాత్రి అనన్య ఆచూకీ లభించక తల్లడిల్లిపోతున్నారు. వీరితో పాటు గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన నగరంలోని రామలక్ష్మికాలనీలో ఉంటున్న మధుపాడ అఖిలేష్, గాజువాక కు చెందిన విఖ్యాతరెడ్డి కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లలో వత్తులేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు. 15న గోదావరి నదిలో రాయల్ విశిష్ట బోటు ప్రమాదంలో నగరానికి చెందిన 17 మంది గల్లంతు కాగా వారిలో 13 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా జాడ తెలియని ఆ నలుగురూ తొమ్మిదేళ్లలోపు చిన్నారులే. కంటతడి ఆరలేదు.. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భా గ్యలక్ష్మి దంపతుల కుమార్తెలైన వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏదాదిన్నర)లు నాన్నమ్మ అప్పలనర్శమ్మతో కలిసి ఈ నెల 15న గోదావరి నదిలో విహార యాత్రకు వెళ్లిన సంగతి తెలి సిందే. ఆ రోజు జరిగిన ప్రమాదంలో అప్పలనర్శమ్మ మృతి చెందగా.. వైష్ణవి, అనన్యల ఆచూకీ లభించలేదు. ఓ వైపు ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న అప్పలనర్శమ్మను కన్నుమూయడం, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తెల జాడ లేకుండా పోవడంతో దంపతులిద్దరూ తల్లడిల్లిపోతున్నారు. పిల్లలను తలచుకంటూ ‘పెద్దది ఈ సమయంలో ఇలా చేసేది.. చిన్నది అలా అల్లరి పెట్టేది’ అని తలచుకుంటూ కుమిలిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే గత తొమ్మిది రోజులుగా ఆ దంపతుల కంటతడి ఆరలేదు. పిల్లలు వస్తారు అంటూ వారు వెళ్లిన దారివైపు ఆశగా ఎదురుచూడటం గమనిస్తున్న స్థానికుల గుండెలు చెమ్మగిల్లుతున్నాయి. వారసులొస్తారా.. మరోవైపు అదే బోటులో విహారయాత్రకు వెళ్లి మృత్యువాత పడిన రామలక్ష్మి కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబానిది ఇంతకుమించిన విషాదం. ఆ రోజు విహారయాత్రకు రమణబాబు కుటుంబంతో పాటు వెళ్లిన అనకాపల్లిలోని బంధువులు, వేపగుంటలోని సోదరి, ఆమె కుమార్తె సహా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ దుర్ఘటనలో రమణబాబు, ఆయన భార్య అరుణకుమారి సహా కుమార్తె కుశాలి కూడా కన్నుమూశారు. ప్రమాదంలో చిక్కుకున్న రమణబాబు కుమారుడు అఖిలేష్(9) జాడ ఇంకా తెలియరాలేదు. ఇదే ప్రమాదంలో గాజువాకలో నివాసం ఉంటూ యాత్రకు వెళ్ళిన మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి, కుమార్తె హన్సిక మరణించిన సంగతి విదితమే. వారితో పాటు ప్రమాదంలో చిక్కుకున్న విఖ్యాత్‌రెడ్డి(6) అనే బాలుడి ఆచూకీ లభించలేదు. కుటుంబ పెద్దలు కనుమరుగైనా వారి వారసులైనా ప్రాణాలతో తిరిగి వస్తారన్న కోటి ఆశలతో వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. -
బోటు ప్రమాదం; మృతుల కుటుంబాలకు బీమా
సాక్షి, రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన లాంచీని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ హష్మి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 77 మంది ప్రయాణించారని తెలిపారు. 26 మంది సురక్షితంగా బయటకు వచ్చారని, 36 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. మరో 15 మృతదేహల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. లైఫ్ జాకెట్స్ వేసుకున్నారా లేదా తనిఖీలు చేసిన తరువాతే బోటు ప్రయాణానికి అనుమతిచ్చారని వెల్లడించారు. సహాయక చర్యలు ముగిసే వరకు దేవీపట్నంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారంతో దీనికి సంబంధం లేదన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మృతుల బంధువులు నేరుగా ఇక్కడకు వచ్చి సంబంధిత పత్రాలు సమర్పించి బీమా డబ్బు పొందవచ్చన్నారు. న్సూరెన్స్ కంపెనీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సహకరిస్తారని ఎస్పీ తెలిపారు. బీమాకు సంబంధించిన సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించవచ్చు ♦ రజనీకుమార్ సిఐ: 9440796395 ♦ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ప్రకాష్: 9700001818 ♦ ల్యాండ్ లైన్ నెంబరు: 08854 254073 ఇన్సూరెన్స్ కోసం సమర్పించాల్సిన పత్రాలు ♦ ఎఫ్ఐఆర్ కాపీ ♦ మరణ ధ్రువీకరణ పత్రం ♦ పోస్ట్‌మార్టమ్ నివేదిక ♦ బ్యాంకు ఖాతా వివరాలు ♦ వారసుల సర్టిఫికెట్ -
‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ
సాక్షి , రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం సంబంధిత బంధువులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆర్తనాదాలతో ప్రభుత్వాసుపత్రిలో ఆవరణలో ఇంకా విషాద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎటునుంచి ఏ ప్రభుత్వ వాహనం వచ్చినా అందులో తమవారి మృతదేహం వచ్చిందేమోనని ఆశతో పరుగులు తీయడం పలువురిని కలచి వేస్తోంది. ‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతురాలు మంచిర్యాల గ్రామానికి చెందిన కాకునూరు రమ్యశ్రీ ఇంజినీర్ చదివి హైదరాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా పని చేస్తోంది. తండ్రిపై ప్రేమతో తన చేతిపై ‘డాడీ’ అంటూ పచ్చబొట్టు పొడిపించుకుంది. దీనిని తలుచుకుంటూ రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఉద్యోగం వచ్చింది కదా డాడీ...అమ్మ మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుతున్నానని’ చెప్పిన తన చిట్టి తల్లి విహార యాత్రకు వచ్చి కనీసం కడచూపుకు కూడా నోచుకోకుండా చేస్తుందని అనుకోలేదని రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ బోరున విలపిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి, తండ్రి దర్శన్, కలసి కంటతడిపెట్టుకున్నారు. తమ కుమార్తె మృతదేహం కోసం ఎనిమిది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షిస్తునే ఉన్నారు. చదవండి: రమ్య కోసం ఎదురుచూపులు నా తండ్రి ఆచూకీ తెలపండి బోటు డ్రైవర్ నూకరాజు కుమారుడు ధర్మారావు, బంధువులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విలపిస్తున్నారు. తన తండ్రికి బోటు నడపడంలో నైపుణ్యం ఉందని, ఇలా జరిగిందని, తమ తండ్రి మృతదేహం ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటున్నారు. మరో డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ కుటుంబీకులు కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారు. మా మేనల్లుడేడండీ బోటు ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచీ హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే 70 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటున్నాడు. తన మేనల్లుడు అంకెం పవన్ కుమార్, అతని భార్య అంకెం భవానీల ఆచూకీ తెలియజేయాలంటూ వేడుకుంటున్నాడు. ఆదివారం రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి రోదిస్తుండగా అక్కడకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, దుఖాన్ని దిగమింగుకోవాలని సముదాయించిన తీరు అక్కడున్నవారికి కన్నీళ్లను రప్పించింది. మా కుమారుడి ఆచూకీ చెప్పరూ బోటులో సహాయకుడిగా పని చేసిన పాతపట్టి సీమకు చెందిన మణికంఠ ఆచూకీ చెప్పరూ అంటూ అతని తండ్రి నరసింహారావు, బాబాయిలు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. అంబులెన్స్ వచ్చిందంటే దానిలో మృతదేహాలు ఉంటాయేమో అని పరుగులు తీసుస్తున్నారు. మేనల్లుడి కోసం... విహారయాత్రలో కుటుంబం మొత్తం గల్లంతుకాగా అందులో బావమరిది, అతని భార్య, కుమార్తెల మృతదేహాలు లభ్యమైనా మేనల్లుడు కర్నూల జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి(6) మృతదేహం ఇప్పటివరకూ దొరకలేదని అతని మేనమామ చంద్రశేఖరరెడ్డి ఎదురుచూస్తున్నాడు. ఇంటి నుంచి తన మామ అస్తమానూ ఫోన్ చేస్తున్నాడని ఏమి సమాధానం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
బోటు ప్రమాదంతో మైలపడింది..గోదారమ్మకు దూరంగా!
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: జీవనది గోదావరి. ఉభయగోదావరి జిల్లాల ప్రజల జీవితాలు దానితోనే ముడిపడి ఉంటాయి. ఆ నదీమ తల్లి అంటే ఎంతో పవిత్రమైనదిగా వారు భావిస్తారు. జూన్ మొదటి వారంలో గోదావరి నుంచి కాలువలకు నీరు విడుదల చేసే సమయంలో ఈ ఏడాది సిరులు కురిపించమ్మా అంటూ దారిపొడవునా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేయడం ఇక్కడి మహిళల్లో సంప్రదాయంగా వస్తోంది. అటువంటి గోదావరి నీటిని ఇప్పుడు ఆ పరీవాహక గిరిజన గ్రామాలు ముట్టుకోవడానికి ఇష్టపడటంలేదు. ఎందుకంటే.. దేవీపట్నం మండలం తున్నూరు గ్రామ పంచాయితీ కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయి 36 మంది మృతిచెందాక ఆ గిరిజన గ్రామాలన్నీ గోదావరి నీరును వినియోగించడం మానేశారు. బోటు మునిగిపోయిన ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న కచ్చులూరు గ్రామంతో పాటు మండల కేంద్రం దేవీపట్నం సహా గోదావరి దిగువన ఉన్న 10–12 గ్రామాల్లో పరిస్థితిని ‘సాక్షి బృందం’ పరిశీలించగా గోదావరి నీటి వినియోగాన్ని వదిలేశారనే విషయం స్పష్టమైంది. ఇక్కడ సుమారు 100–150 వరకు కుటుంబాలున్నాయి. వంటా, వార్పుతోపాటు దైనందిన కార్యక్రమాలన్నిటికీ ఈ నీటిపైనే వీరంతా ఆధారపడే వారు. ఈ నీటిలో తీపిదనం ఉంటుందని, అందుకే ఆ నీటితో వండి వారుస్తామని గిరిజనులు పేర్కొంటారు. కొత్త నీరు బురదగా ఉన్నప్పటికీ అటవీ ప్రాంతంలో లభించే ఇండుగ పిక్కలు లేదా, స్పటికను వినియోగించి నీటిని శుద్ధిచేసుకుని మరీ గోదావరి నీటిని వినియోగిస్తారు. ఈ నీటికి ఇంత ప్రాధాన్యతనిస్తున్న ఇక్కడి గిరిజనులు ఇప్పుడు దానిని ముట్టుకోవడానికి కూడా ముందుకు రావడంలేదు. మహిళలు దూరాభారమైనా బోర్లు లేదా కొండలపై నుంచి వచ్చే చల్ధికాలువ, ఎర్రగొండ కాలువ, కొండజల కాలువ వరకూ వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆ గ్రామాల్లో ఎవరిని కదిపినా ఒకటే సమాధానం చెబుతున్నారు. గోదావరమ్మ మైలపడింది.. గోదావరిలో ఉన్న మృతదేహాలన్నీ బయటకు తీసిన తరువాతనే శుద్ధిచేసే వరకూ చుక్క నీటిని కూడా ముట్టమంటున్నారు. కాగా, 2018 మే 15న మంటూరు వద్ద ప్రమాదం జరిగి 19మంది మృతిచెందినప్పుడు కూడా వీరు ఇదేరకంగా గోదావరిని దూరం పెట్టారు. -
హర్షకుమార్‌పై మాజీ ఎంపీ రవీంద్ర ఫైర్
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌పై అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు ఫైర్ అయ్యారు. ఇటువంటి విషాద ఘటనలను రాజకీయ నిరుద్యోగులు ప్రచారానికి వాడుకోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాదం మృతుల కుటుంబాలకు పండుల రవీంద్ర తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎంపీ అయిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. చనిపోయిన వారు అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకే లాంచీలో వెళ్లారనడం తప్పు అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో మృతుల కుటుంబాలు మనోవేదనకు గురవుతాయన్నారు. ‘మీపై గౌరవం ఉంది. మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి’ అని హర్షకుమార్‌ను పండుల డిమాండ్ చేశారు. బోటు ప్రమాదం ఘటనను సంచలనాలకు, రాజకీయాలకు వాడకూడదని హితవు పలికారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం చేయాల్సిదంతా చేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ ఉద్యోగం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకుని.. హర్షకుమార్ నైతిక విలువలు దిగజార్చుకున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావుపైన పండుల రవీంద్ర మండిపడ్డారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు.. మీకు కళ్లు పోయాయా అని ఆయనను ప్రశ్నించారు. దళితులను చింతమనేని దుర్భాషలాడినప్పుడు మీరు ఏమైపోయారని నిలదీశారు. బుద్ధుడి పేరుతో భూములు ఆక్రమించే గొల్లపల్లి సూర్యారావుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు. -
బోటు యజమాని వెంకట రమణ అరెస్ట్
సాక్షి, రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కల్లూరు వద్ద గోదావరిలో బోటు బోల్తా ప్రమాద ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. రంపచోడవరం ఏఎస్పీ వకుళ్ జిందాల్ మాట్లాడుతూ...‘ఈ కేసులో బోటు యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. లాంచీ యజమానుల్లో ప్రధానంగా ఏ-వన్ గా ఉన్న కోడిగుడ్ల వెంకటరమణతో పాటు ఏ-2 ఎల్లా ప్రభావతి, ఏ-3 అచ్యుతమణిని అరెస్ట్ చేశాం. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ...దానిపై విచారణ చేస్తున్నాం. చదవండి: ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’ గోదావరి ప్రవాహ ఉధృతిని బోటు డ్రైవర్ అంచనా వేయలేకపోవడం, సుడులు తిరుగుతున్న నీటి నుండి తప్పించుకుని, సురక్షిత మార్గంలో బోటును ముందుకు తీసుకువెళ్లే విషయంలో బోటు డ్రైవర్‌కు సరైన అవగాహన, అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎడమ పక్కకు వెళ్లాల్సిన బోటును గోదావరి మధ్యలో నడిపారు. ఇందులో పోలీసుల తప్పిదం లేదు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు బోటులోని వారంతా లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. పోలీసులు వెళ్లగానే లైఫ్ జాకెట్లు తీసేయవచ్చని బోటు సిబ్బంది చెప్పారు. బోటులో మొత్తం 64మంది పెద్దవాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 8మంది బోటు సిబ్బంది సహా 75మంది ఉన్నారు. బోటును బయటకు తీసుకు వచ్చేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ 34 మృతదేహాలు వెలికి తీశాం’ అని తెలిపారు. -
తప్పని ఎదురుచూపులు..
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): చిన్ననాటి నుంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించిన కన్నపేగు ఇన్నాళ్లు తమ మధ్య ఉంటూ నిత్యం నవ్వులతో ఆనందంగా ఉండే కన్నబిడ్డ జాడ కరువయ్యింది. మొన్నటి వరకు సంతోషాల మధ్య సాగిన ఆ కుటుంబంలో అంతుచిక్కని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్లితే... హాజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్–భూలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె రమ్య(23), కుమారుడు రఘు ఉన్నారు. సుదర్శన్ విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇక కుమార్తె రమ్య బీటెక్ పూర్తి చేసి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సబ్ ఇంజినీర్‌గా ఉద్యోగం మొదటి నెల జీతం కూడా తీసుకుంది. విధుల నిమిత్తం వరంగల్ వెళ్లి అక్కడి నుంచి పాపికొండలు విహార యాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ విహార యాత్రలో భాగంగా 15వ తేదీ ఆదివారం పాపికొండలు గోదావరిలో పడవ మునిగి అంతా గల్లంతయ్యారు. నాటి నుంచి రమ్య ఆచూకీ మాత్రం లభించలేదు. రోజు రోజుకూ గోదావరిలో లభిస్తున్న మృతదేహాల్లో తమ రమ్య మృతదేహం ఉందేమోనని ఆందోళన ఒకవైపు... రమ్య ఆచూకీ తెలియడం లేదని మరోవైపు రమ్య తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నేటికి ఆరు రోజులైనా కన్నబిడ్డ జాడ లేదు సరికదా ఏం జరిగిందోనని అంతుచిక్కని ఆవేదనలో పెడుతున్న కన్నీరు మున్నీరు అవుతున్న వారి తీవ్ర ఆవేదన ప్రతీ ఒక్కరిని కలిచివేస్తుంది. ఏది ఏమైనా రమ్య ఆచూకీ గురువారం రాత్రి వరకు తెలియరాలేదు. ఇంకా దాదాపు పది మంది వరకు గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. రమ్య గల్లంతు ఇంత వరకు తెలియక పోవడంతో ఇటు నంనూర్‌లో తల్లి భూలక్ష్మి తీవ్ర ఆవేదనలో ఉండగా సంఘటనా స్థలంలో తండ్రి సుదర్శన్, సోదరుడు రఘులు దయనీయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా గల్లంతైన రమ్య ఆచూకీ త్వరగా లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. -
ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం : పదుల సంఖ్యలో నిండు ప్రాణాలను బలిగొన్న రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆ బోటు కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బోటు కచ్చులూరు వద్ద గోదావరిలో 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని గుర్తించి ఆ ప్రాంతాన్ని కంప్యూటరైజ్డ్ మార్కింగ్ చేశారు. ఉత్తరాఖాండ్‌కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందంలోని ఒక నిపుణుడిని ఆక్సిజన్ సిలెండర్ల సాయంతో బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రదేశానికి పంపించారు. అయితే 40 అడుగులకు వెళ్లేసరికి గోదావరి ఉధృతిని అధిగమించలేని పరిస్థితుల్లో వెనుదిరిగి బయటకు వచ్చేశారు. 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్టుగా గుర్తించిన సోనార్ కెమెరా సహజంగా ఎన్డీఆర్ఎఫ్ వద్ద 10, 20, 40 అడుగులకు వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సిలెండర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ గోదావరి ఉధృతితో పాటు సుడిగుండాలు ఎదురవుతుండటంతో అంతకు మించి లోతుకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నామని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. తమ కెరీర్లో ఇంతటి చాలెంజింగ్‌తో కూడుకున్న టాస్క్‌ను మునుపెన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. ముంబైకి చెందిన మెరైన్ మాస్టర్స్ అనే మల్టీనేషనల్స్ కంపెనీ నుంచి గౌర్ బక్సీ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వచ్చి కచ్చులూరులో పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లింది. బోటును వెలికితీసేందుకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక రూట్‌మ్యాప్ రూపొందించే పనిలో ఉంది. బక్సీ బృందం ముంబై నుంచి శుక్రవారం కచ్చులూరుకు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అంబులెన్స్‌లో తమ వారి మృతదేహం ఉందేమోనని చూస్తున్న కుటుంబ సభ్యులు కీలకంగా ఉత్తరాఖాండ్ నివేదిక.. గోదావరి అడుగున ఉన్న బోటును గుర్తించి సోనార్ స్కానర్ కెమెరా తీసిన చిత్రాలను పరిశీలన కోసం ఉత్తరాఖండ్‌కు పంపించారు. ఆ నివేదిక సైతం శుక్రవారం చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ నివేదిక బోటు వెలికితీత ఆపరేషన్‌లో కీలకంగా కనిపిస్తోంది. రంగంలోకి ధర్మాడి బృందం... లోతైన జలాల్లో సంప్రదాయ పద్ధతుల్లో మునిగిపోయిన బోట్లను వెలికితీయడంలో దిట్ట అయిన కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. ముందుగా బోటు మునిగిపోయినట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్ధారించిన కచ్చులూరు మందం వద్ద భారీ లంగరు వేసింది. అయితే దురదృష్టవశాత్తు లంగరు తెగిపోయింది. దీంతో గురువారం మరోసారి ఇదే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవ్వగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ ప్రాంతంలో వర్షం పడటంతో ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడింది. ధర్మాడి బృందానికి సేఫ్టీ మెజర్స్పై శుక్రవారం క్లియరెన్స్ లభించనుంది. అవి చేతికి వచ్చాక కాకినాడ పోర్టు అధికారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టనుంది. భారీ ఇనుప గొలుసులు సిద్ధం బోటు బరువు 25 టన్నులు ఉన్నప్పటికీ గోదావరిలో ఉన్న సుడిగుండాలతో బోటు బయటకు తీసుకువచ్చేటప్పుడు దాని బరువు రెట్టింపు అయిపోతుందని చెబుతున్నారు. ఇందు కోసమే ముందస్తుగా 100 టన్నుల బరువును అవలీలగా బయటకు తీయగలిగే సామర్థ్యం ఉన్న భారీ ఇనుప తాళ్లను సిద్ధం చేశారు. అలాగే నాలుగు అంగుళాల మందం కలిగిన నైలాన్ తాడు, 22 మిల్లీ మీటర్ల మందం కలిగిన ఇనుప గొలుసు, కాకినాడ పోర్టులో ఓడల్లో ఎగుమతి, దిగుమతులకు వినియోగించే బలమైన తాళ్లు, యాంకర్లు, డీలింక్లను అక్కడికి చేర్చారు. వెలికి తీసే ప్రక్రియ ఇలా... బోటును వెలికితీసేందుకు రంగంలోకి దిగే ధర్మాడి బృందం తొలుత ఇనుప తాళ్లకు యాంకర్లను కడుతుంది. ఆ తాళ్లను బోటు ఉన్నదని నిర్థారించిన ప్రాంతంలో వలలా గోదావరిలోకి విడిచిపెడతారు. 214 అడుగుల దిగువున ఉన్న బోటుకు యాంకర్లు తగిలిన వెంటనే భారీ క్రేన్ల ద్వారా బోటును బయటకు లాగుతారు. ఇందుకోసం కొంత శ్రమ అయినా కచ్చులూరు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపైకి క్రేన్లను తీసుకువస్తున్నారు. -
బోటు ప్రమాదంపై విచారణ కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సభ్యులుగా ఉంటారు. బోటు ప్రమాదంపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కమిటీని ఆదేశించారు. 45 రోజుల్లో లాంచీ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో బోటు మునిగిపోయి పలువురు ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. -
బోటు ప్రమాదాలపై మంత్రి అవంతి సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదాల నివారణపై ఉత్తరాంధ్ర అధికారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో నేవీ, పర్యాటక శాఖ, పోలీసు, ఫిషరీస్, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. మూడు జిల్లాల్లో అధికారిక.. అనధికారికంగా కొనసాగుతున్న బోట్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అనుమతులు పొందిన బోట్ల సామర్ధ్యాన్ని పరీక్షించాలన్నారు. నదులు, జలపాతాలు వద్ద ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. బోటు వినియోగంపై త్వరలో కొత్త పాలసీ తీసుకువస్తున్నామని మంత్రి అవంతి తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రమాదకర నదీ, సముద్ర తీరాలను గుర్తించి.. జలపాతాల వద్ద ఈతగాళ్ల నియామిస్తామని చెప్పారు. -
లాంచీ ప్రమాదం: ఐదవ రోజుకు రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, తూర్పు గోదావరి : ఐదవ రోజు గోదావరి నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం ఎదుర్లంక వద్ద పరశవేది కృష్ణ మోహన్ అనే వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణ మోహన్ ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్ చూసి భార్య, బంధువులు అతడ్ని గుర్తుపట్టారు. ఆదివారం ఉదయం గణేష్ నిమజ్జనమంటూ కొవ్వూరులోని తమ ఇంటి నుండి బయలు దేరాడని భార్య పూర్ణిమ కన్నీరు పెట్టుకుంది. ఇప్పటివరకు మొత్తం 35 మృతదేహాలను బృందాలు వెలికితీశాయి. మిగిలిన 17 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గోదావరిలో 250 అడుగుల లోతులో ఉన్న లాంచీని సైడ్ స్కాన్ సోనర్ సహాయంతో గుర్తించారు. లాంచీని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ముంబైకి చెందిన నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. -
బోటు యజమాని.. జనసేనాని!
సాక్షి, విశాఖ సిటీ: గోదావరి నదిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై గతంలోనూ అనేక కేసులున్న విషయం వెలుగుచూసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తొలి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. ముఖ్యంగా స్వగ్రామంలో భూ దందాలకు సంబంధించి 2009 నుంచి 2017 వరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సరిపల్లి గ్రామంలో సర్వేనం. 148/15లో 400 గజాల స్థలంపై తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు అమ్మిన ఘటనపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో 308/2017 చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. అలాగే 238/2009లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కొట్లాట కేసు నమోదు కాగా 2013 మే నెలలో కోర్టులో రాజీ పడ్డారు. గ్రామంలో సర్వే నెంబర్ 267లోని ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నారన్న ఆరోపణలపై 117/2011లో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా మరో కేసులో ఇదే పోలీస్‌స్టేషన్‌లో 147/2019 ద్వారా వెంకటరమణతో పాటు మరి కొందరిపై బైండోవర్ నమోదుచేశారు. నిబంధనలంటే లెక్కలేదు.. 2012 నుంచి రాజమండ్రిలో బోటు ద్వారా జలరవాణా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వెంకటరమణ కొద్దిరోజులకే కుటుంబంతో సహా అక్కడికి మకాం మార్చాడు. గోదావరి నదిలో కేవీఆర్ ట్రావెల్స్ పేరుతో రెండు లాంచీలు నడుపుతున్నాడు. అయితే రెండింటికీ ప్రభుత్వ శాఖల తరపున ఎలాంటి అనుమతులూ లేవు. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో అంటకాగడంతో వెంకటరమణ వ్యాపారానికి అడ్డే లేకుండా పోయింది. కాగా గత ఎన్నికల్లో జనసేన క్రియాశీల సభ్యుడిగా వెంకటరమణ ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. రాజమండ్రితో పాటు సొంత ప్రాంతం విశాఖలో కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సంబంధిత కథనాలు : నిండు గోదారిలో మృత్యు ఘోష 30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత కన్నీరు మున్నీరు అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే కృష్ణా నదిలో బోట్లు నడిపితే కఠిన చర్యలు -
బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి విచారణా ధికారిగా తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. బోటు ప్రమాదానికి గల కారణాలు, వైఫల్యాలు, అసలు ఏం జరిగిందనే దానిపై వాస్తవ పరిస్థితులు విచారణ చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సుడులతో పోరాడి ప్రాణాలను పట్టుకొచ్చారు!
అంతటి గోదావరి సుడిలో దిగితే ఏటికి ఎదురీదినట్టే! అక్కడి లోతు 300 అడుగుల పైనే ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతటి గజ ఈతగాడికైనా ప్రాణాలు నీట కలిసిపోతాయి. కానీ ఆ గిరిజనులు గోదావరి సుడిని, లోతును చూసుకోలేదు. కళ్లెదుట మునిగిపోతోన్న బోటు, అందులో ఆర్తనాదాలు చేస్తోన్న పర్యాటకులు మాత్రమే వారికి కనిపించారు. ఆ క్షణాన వారికి వేరే ఏమీ గుర్తుకు రాలేదు. అందరిదీ ఒకటే లక్ష్యం. బోటులో మునిగిపోతున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడం. అనుకున్నదే తడువుగా కచ్చులూరు గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు మూడు బోట్లలో ఒక్క ఉదుటున గోదావరి వడిని లెక్క చేయకుండా ముందుకు కదిలారు. మునిగిపోతున్న రాయల్ వశిష్ట పున్నమి బోటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే నదిలో పడిపోయి కొట్టుకుపోతోన్న వారిని ఒడిసి పట్టుకుని బోట్లలో వేసుకుని ఒడ్డుకు చేర్చారు. ఒక్కో బోటులో ఆరుగురు వంతున మూడు బోట్లలో వెళ్లిన పద్దెనిమిది మంది గిరిజనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, చేతికి అందినవారిని అందినట్లుగా బయటకు తీసుకువచ్చారు. అలా మొత్తం 24 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. – సాక్షి ప్రతినిధి బృందం, దేవీపట్నం తెలిసినా తెగించాం కచ్చులూరు వద్ద గోదావరి ఒడ్డున ర్యాంపు ఉంది. బోటు ప్రమాదం జరిగే సమయంలో సుమారు ముప్ఫై మందిమి ఒడ్డున కూర్చొని ఉన్నాం. ఆ సమయంలో బోటు ఒక పక్కకు ఒరిగిపోవడం గమనించాం. చూస్తుండగానే కళ్లెదుటే బోటు మునిగిపోతోంది. మునిగిపోతున్న వారిని రక్షించాలని ప్రాణాలు లెక్కచెయ్యకుండా వెళ్లాం. ప్రమాదకరమని తెలిసినా వారి ప్రాణాలు కాపాడాలనే అనుకున్నాం. – నేసిక లక్ష్మణ్‌రావు కొందరినే రక్షించగలిగాం నదిలో తేలుతున్న వారు రక్షించాలంటూ కేకలు వేశారు. మా ప్రాణాలు ఫణంగా పెట్టయినా వారిని రక్షించాలని అనుకున్నాం. వెంటనే బోట్లు తీసుకుని ప్రమాద స్థలానికి వెళ్లాం. అయితే నీటిపై తేలుతున్న వారిని మాత్రమే రక్షించగలిగాం. బోటు గోదావరిలోకి మునిగిపోయినప్పుడు లైఫ్ జాకెట్లు వేసుకోని వాళ్లు నీటిలో మునిగిపోయారు. ఉన్నవారిని రక్షించలేకపోయాం. – కొణతల బాబూరావు ఉండలేక లోపలికి వెళ్లాం బోటు ప్రమాదం జరిగే సమయంలో గోదావరి సుడులు తిరుగుతోంది. ఆ సమయంలో గోదావరిలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ నదిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించాలనే తపనతో లోపలికి వెళ్లాం. నదిపై తేలుతున్న వారిని కాపాడటానికి చాలా సాహసం చేశాం. – నెరం కృష్ణ చాలా కష్టపడాల్సి వచ్చింది వారు మాకేమీ రక్తసంబంధీకులు కారు. వారెక్కడి వారో అసలు తెలియనే తెలియదు. ఆ క్షణాన వారి ఆర్తనాదాలే మమ్మల్ని కదిలించాయి. బోటు ప్రమాదం జరిగిన పావుగంటలోనే గోదావరిలోకి బయలుదేరి వెళ్లాం. నది ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. అయినా ప్రాణాలకు తెగించాం. కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము వెళ్లిన బోటులో ఆరుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. – నేసిక చినబాబు మనసుకు బాధేసింది మా గ్రామం గోదావరి నది ఒడ్డునే కావడంతో చిన్నప్పటి నుంచి గోదావరిలో ఈత కొట్టడం అలవాటు. ఈత రావడంతో బోటు ప్రమాదం జరిగిన వెంటనే బోటులో వెళ్లి గోదావరిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు నా వంతు ప్రయత్నించాను. కొందరైతే కళ్లెదుటే కొట్టుకుపోయారు. అప్పుడు మనసుకు బాధేసింది. కానీ ఏమీ చేయలేకపోయాను. నేను లైఫ్ జాకెట్లు వేసుకున్న ఇద్దర్ని మాత్రమే ఒడ్డుకు చేర్చాను. నాతో పాటు వచ్చిన వారు కూడా కొట్టుకుపోతున్న వారిని రక్షించడం చూసి మనసు కుదుటపడింది. – కానెం నాగార్జున కళ్ల ముందే ఒరిగిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది. అప్పుడే భోజనాలు చేసి ఎప్పటి మాదిరిగానే గోదావరి ఒడ్డుకు చేరి కబుర్లు చెప్పుకుంటున్నాం. పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా గోదావరిలో ఏదో బోటు వెళుతుండటం చూస్తున్నాం. ఇంతలోనే బోటులో హాహాకారాలు వినిపించాయి. అప్పటి వరకూ గ్రామంలో కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్న మేమంతా ఒక్కసారిగా గోదావరి వెంట పరుగుపెట్టి మెకనైజ్డ్ బోట్లు తీసుకుని బయలుదేరాం. చూస్తుండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి బోటు ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే మా వద్ద ఉన్న మూడు ఇంజిన్ బోట్లలో గోదావరిలోకి వెళ్లాం. లైఫ్ జాకెట్లు వేసుకుని పైకి తేలుతున్న వారందరినీ రక్షించి ఒడ్డుకు చేర్చాం. – కానెం రామస్వామి మరిచిపోలేని రోజు ఎన్నో ఏళ్లుగా ఆ నది గట్టున కూర్చుంటున్నాం. కానీ ఏనాడూ ఇటువంటి సంఘటన చూస్తామని, మా చేతులతో ఇంతమంది ప్రాణాలు కాపాడతామని అనుకోలేదు. కచ్చులూరు మందంలో బోటు ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇక్కడ గోదావరి నది లోతు సుమారు మూడొందల అడుగులు ఉంటుంది. బోటు డ్రైవర్లు ఇక్కడకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటారు. దురదృష్టవశాత్తూ బోటు ప్రమాదం జరిగింది. కొందరినైనా రక్షించగలిగాం. మా జీవితంలో మరిచిపోలేని రోజు అది. – నేసిక చినలక్ష్మణ్రావు మా ప్రాణాల కంటే ముఖ్యమనుకున్నాం బోటు ప్రమాదం జరిగిన తరువాత గోదావరి నదిలో మునిగిపోతున్న వారు రక్షించాలంటూ కేకలు వేశారు. ప్రమాద సమయంలో గోదావరిలో నీరు ఉద్ధృతంగా ఉంది. ప్రమాద స్థలంలో నీరు సుడులు తిరుగుతోంది. నదిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడాలని తెగించి మూడు బోట్లు తీసుకుని నదిలోకి వెళ్లాం. కొంత మందిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. నదిలో కొట్టుకుపోతున్న ఓ మహిళను చెయ్యి పట్టుకుని కాపాడి బోటులోకి చేర్చాను. – సంగాని శ్రీనివాస్ -
చివరి మృతదేహం దొరికే వరకూ గాలింపు చర్యలు
సాక్షి, తూర్పు గోదావరి : గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీలో గల్లంతైన వారి సంఖ్య పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సంఘటన స్థలంలో చర్యలను బుధవారం సాయంత్రం మంత్రులు కురసాల కన్నబాబు, విశ్వరూప్ పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం మేరకు లాంచీలో ప్రయాణించిన 73 మందిని గుర్తించినట్లు వారిలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. 34 మృతదేహాలను గుర్తించారని తెలిపారు. కాగా ఈ రోజు మరో ఐదుగురు కనిపించడం లేదని వారి బంధువులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారని అన్నారు. దీనిని బట్టి చూస్తే బోటులో ఇంకా 18 మంది గల్లంతైన వారి ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. లాంచీ మునిగిన ప్రాంతంలో గోదావరి ప్రమాదకరంగా ఉందని, బురద ఉండడంతో సైడ్ సోనార్ స్కానర్ పంపించినా లాంచీ చిత్రాలు లభించలేదని అన్నారు. కచ్చులూరు నుంచి సముద్ర మొగ వరకు మిగిలిన 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని, ఘటన జరిగిన ప్రాంతం నుంచి లాంచీ ఎలా తీయలనే దానిపై నిపుణులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దీని కోసం ముంబై, జార్ఖండ్, విశాఖ, కాకినాడ నుంచి పలు బృందాలు లాంచీ వెలికితీసేందుకు పనిచేస్తున్నాయన్నారు. లాంచీలో ఏ ఒక్క మృతదేహం లభించినా తమకు ముఖ్యమేనని, చివరి మృతదేహం దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సంఘటన ప్రాంతంలో కొనసాగుతున్న చర్యలపై ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. -
బోటును ఒడ్డుకు తీసుకురాలేం: కలెక్టర్
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటును బయటకు తీసేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఇక గోదావరిలో మునిగిపోయిన లాంచీని బయటకు తీసేందుకు..రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గతంలో బలిమెల రిజర్వాయర్‌తో పాటు నాగార్జున సాగర్‌లో మునిగిపోయిన బోటును వెలికి తీసిన టీమ్‌ను ఇందుకోసం రప్పించారు. ముంబై నుంచి వచ్చిన నిపుణుల బృందం అదే పనిలో ఉన్నట్లు చెప్పారు. బరువు అధికంగా ఉండటంతో బోటును ఒడ్డుకు తీసుకు రాలేమని, ఏదైనా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో 700మంది సిబ్బంది పని చేస్తున్నారని, ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ప్రమాదానికి గురైన ప్రైవేట్ పర్యాటక బోటు రాయల్ వశిష్ట పున్నమి-2 ఆచూకీ లభించింది. కచ్చులూరు మందం గ్రామం వద్ద గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. కాగా మునిగిపోయిన బోటులో మొత్తం 73మంది ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన రోజే బోటు నుంచి 26మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మరోవైపు లాంచీ ప్రమాద ఘటనలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, నేవీ బృందాలు గోదావరిని జల్లెడ పడుతున్నాయి. బుధవారం ఆరు మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. సహాయక చర్యలపై సీఎం జగన్ ఆరా రెస్క్యూ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయని, గల్లంతు అయిన 13మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించైనా సంబంధిత కుటుంబీకులకు అప్పగిస్తామని మంత్రి పేర్కొన్నారు. -
లాంచీ ప్రమాదం: మరో 5 మృతదేహాల లభ్యం
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మరో ఐదు మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు 33 మృతదేహాలను బృందాలు వెలికితీశాయి. మరో 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు గోదావరిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గోదావరిలో దాదాపు 300 అడుగుల లోతులో ఉన్న లాంచీని వెలికి తీసేందుకు ఎన్టీఆర్ఎఫ్, నేవీ, అగ్నిమాపక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇందుకోసం ఉత్తరాఖండ్‌కు చెందిన సైడ్ స్కాన్ సోనర్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మూడవ రోజు 20 మృతదేహాలు లభ్యం
దేవీపట్నం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి బృందం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మృతదేహాల వెలికితీత ఓ కొలిక్కి వస్తోంది. బోటును వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ కొనసాగిస్తోంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తోంది. ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకోగా మూడో రోజు మంగళవారం గోదావరి పరివాహక ప్రాంతాల్లో 20 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొదటి రోజు ఆదివారం సాయంత్రానికే 8 మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. విశాఖపట్నం నావికాదళం, డైరెక్టరేట్ ఆఫ్ కాకినాడ పోర్టు సాంకేతిక సిబ్బంది కూడా గోదావరి పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. గల్లంతైన మరో 18 మంది ఎక్కడున్నారో? మునిగిపోయిన బోటులో మొత్తం 72 మంది ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన జరిగిన రోజే బోటు నుంచి 26 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మంగళవారం దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 14 మృతదేహాలు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పరివాహక ప్రాంతంలో 3 మృతదేహాలు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటి, ఆత్రేయపురం పరిధిలోని ర్యాలీ బ్యారేజీ వద్ద ఒకటి, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 11 మంది, తెలంగాణకు చెందినవారు 8 మంది ఉన్నారు. యానాం వద్ద లభించిన బాలిక మృతదేహం ఎవరిది అనేది గుర్తించాల్సి ఉంది. ఇప్పటిదాకా లభ్యమైన మృతదేహాల సంఖ్య 28కు చేరుకుంది. గల్లంతైన మరో 18 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం.. బంధువులకు అప్పగింత బోటు ప్రమాదంలో మొదటి రోజు లభ్యమైన 8 మృతదేహాలకు ఇప్పటికే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం లభ్యమైన 20 మృతదేహాల్లో 18 మృతదేహాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మృతదేహాలు ఒకేసారి రావడంతో వారి బంధువులు ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం, స్వస్థలాలకు తరలించే ప్రక్రియను ఏమాత్రం జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రెవెన్యూ, పోలీసు శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాల పోస్టుమార్టం వేగంగా పూర్తి చేశారు. వెంటనే మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆస్పత్రి వద్దనే ఉండి అధికారులకు సహకరించారు. 214 అడుగుల లోతున బోటు ప్రమాదానికి గురైన ప్రైవేట్ పర్యాటక బోటు రాయల్ వశిష్ట పున్నమి–2 ఆచూకీ లభించింది. కచ్చులూరు మందం గ్రామం వద్ద గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. బోటు ఉన్న ప్రాంతం చుట్టూ గోదావరి నీటిపై వలయాకారాలతో కూడిన రంగుల రబ్బర్ ట్యూబులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. బోటు లోపలి పరిస్థితిని తెలుసుకునేందుకు ఉత్తరాఖండ్ నుంచి రప్పించిన ఆల్కార్ స్కానర్ కెమెరాను గోదావరి అడుగు వరకూ తీసుకెళ్లారు. కెమెరా చిత్రీకరించిన దృశ్యాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందం ద్వారా ఉత్తరాఖండ్‌కు పంపించారు. మంగళవారం లభించిన మృతదేహాల వివరాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 1) వలవల రఘురామ్(39), నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా 2) గన్నాబత్తుల ఫణికుమార్(28), నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా 3) అబ్దుల్ సలీమ్(24), వీలేరు, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా 4) భూసాల పూర్ణ(11), గోపాలపురం, అనకాపల్లి మండలం, విశాఖ జిల్లా 5) బాచిరెడ్డి హాసికారెడ్డి(4), నంద్యాల, కర్నూలు(ప్రస్తుతం విశాఖపట్నం గాజువాక) 6) దుర్గం సుబ్రహ్మణ్యం(51), వేపనపల్లి గ్రామం, తిరుపతి, చిత్తూరు జిల్లా 7) మధుపాటి రమణబాబు(34), విశాఖపట్నం 8) బొండా పుష్ప(13), వేపగుంట, విశాఖ జిల్లా 9) మూల వీసాల వెంకట సీతారామరాజు(51), బాజీ జంక్షన్, విశాఖపట్నం 10) బాచిరెడ్డి స్వాతిరెడ్డి(32), నంద్యాల, కర్నూలు(ప్రస్తుతం విశాఖపట్నం గాజువాక) 11) భూసాల సుస్మిత(4), గోపాలపురం, విశాఖ జిల్లా 12) గుర్తు తెలియని బాలిక(యానాం వద్ద లభ్యం) తెలంగాణకు చెందిన వారు 1) గెడ్డమీద సునీల్(29), చినపెండ్యాల, జనగాం జిల్లా 2) వీరం సాయికుమార్(24), మాదాపూర్, హైదరాబాద్ 3) బసికి వెంకట్రామయ్య(65), ఖాజీపేట, వరంగల్ జిల్లా 4) గొర్రె రాజేంద్రప్రసాద్(55), కడిపికొండ, ఖాజీపేట మండలం, వరంగల్ జిల్లా 5) పాడి భరణికుమార్(25), హయత్‌నగర్, పోచయ్య బస్తీ, రంగారెడ్డి జిల్లా 6) పాసం తరుణ్‌కుమార్‌రెడ్డి(36), రామడుగు, నల్లగొండ జిల్లా 7) కోదండ విశాల్(23), హయత్‌నగర్, పోచయ్య బస్తీ, రంగారెడ్డి జిల్లా 8) లేపాకుల విష్ణుకుమార్(32), నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా మొదటి రోజు ఆదివారం ఆచూకీ లభించిన మృతులు 1) మందపాక కృష్ణకిశోర్(30) నులకపేట, తాడేపల్లి మండలం, గుంటూరు 2) తటారి అప్పల నరసమ్మ(45), ఆరిలోవా, విశాఖపట్నం 3) బొండా లక్ష్మి(35) వేపగుంట, విశాఖపట్నం 4) అంకెం శివజ్యోతి(48) స్వరూప్ నగర్, హైదరాబాద్ 5) దుర్గం హాసినీ(21), తిరుపతి 6) బసిక ఆవినాశ్(21) కడిసికోన, ఖాజీపేట 7) బసికి రాజేంద్ర(55) కడిసికోన, ఖాజీపేట 8) బొడ్డు లక్ష్మణ్(26) కర్రలమామాడి, మంచిర్యాల జిల్లా -
బతికి వస్తామనుకోలె..!
కాజీపేట అర్బన్: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఆదివారం బోటు బోల్తా పడిన ఘటనలో కడిపికొండ గ్రామానికి చెందిన 14 మందిలో ఐదుగురు సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఈ మేరకు అక్కడి రంపచోడవరం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆ ఐదుగురిని అధికారులు హన్మకొండ తీసుకొచ్చి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం చికిత్స చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిలో ఒకరైన బస్కే దశరథంను మంగళవారం ఉదయం ‘సాక్షి’పలకరించగా ప్రమాద ఘటన వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కడిపికొండ నుంచి 14 మంది శుక్రవారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి రాజమండ్రి చేరుకున్నాం. ఆది వారం ఉదయం పోచమ్మగుడి వద్ద నుంచి పాపికొండల సందర్శనకు బయలుదేరాం. మొదట్లోనే బోటు నిర్వాహకులు లైఫ్ జాకెట్లు ఇచి్చనా.. ఉక్కపోతగా ఉందని చెప్పడంతో ‘పర్వాలేదు తీసివేయండి.. డేంజర్ జోన్ రాగానే చెబుతాం.. అప్పుడు వేసుకోవచ్చు’అన్నారు. పోచమ్మ గుడి నుంచి కొంత దూరం ప్రయాణం చేయగానే పోలీసు అధికారులు రావడంతో తిరిగి లైఫ్ జాకెట్లు వేసుకున్నాం. వారు వెళ్లగానే తీసివేశాం. ఇంతలో బోటు కచ్చులూరు సమీపంలోని డేంజర్ జోన్‌కు చేరుకుంది. ఆ విషయాన్ని బోటు నిర్వా హకులు చెప్పలేదు. తీరా ఘటనా స్థలం రాగానే అనౌన్స్ చేస్తుండగానే బోటు బోల్తా కొట్టింది. మాకు లైఫ్ జాకెట్లు దొరికాయి బోటు ఒక్కసారిగా నీట మునగడంతో నీళ్లలో పడిన మాపై బోటు పైభాగంలో ఉన్న కూర్చున్న వారు, చైర్లు ఒక్కసారిగా మీదపడ్డాయి. అలాగే, అందరూ పక్కన పెట్టిన లైఫ్ జాకెట్లు కూడా పడటంతో మేం దొరకపట్టుకున్నాం. బోటుకు ఓ వైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటం.. మరో వైపు 60 నుండి 70 మీటర్ల దూరంలో ఒడ్డు ఉండటంతో లైఫ్ జాకెట్ల సాయంతో నాతోపాటు బస్కే వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, ధర్శనాల సురేష్, అరెపల్లి యాదగిరి ఈదడం మొదలుపెట్టాం. మాతో పాటు టూర్‌కు వచ్చిన బస్కే అవినాష్‌ను దర్శనాల సురేష్ లైఫ్ జాకెట్ సాయంతో కాపాడాలని యత్నించాడు. కానీ అప్పటికే బోటు బోల్తా పడి నీళ్లలో పడిన ఆందోళనతో అవినాష్ నీళ్లు తాగడంతో మా నుంచి దూరమయ్యాడు. లైఫ్ జాకెట్ దొరకడంతో బస్కే రాజేందర్‌కు అందించాను. నడుముకు ట్యూబ్ కట్టుకుని వెళ్లూ అని అరుస్తున్నా ఈత రాకపోవడంతో గోదావరిలో మునిగిపోయాడు. నా సునీల్ అల్లుడు చాలా మంచి ఈత గాడు. అయినా లైఫ్ జాకెట్ లేకపోవడం.. వరద ఉధృతంగా ఉండడంతో మునిగిపోయాడని ఆరెపల్లి యాదగిరి చెప్పాడు. అవినాష్ అంతిమయాత్రలో రోదిస్తున్న తల్లి వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులను విషాదఛాయలు వీడలేదు. తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న బోటు దుర్ఘటనలో కడిపికొండకి చెందిన 14 మంది చిక్కుకోగా వారిలో ఐదుగురు బయటపడ్డారు. ఐదుగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మేరకు బస్కె అవినాష్ బస్కే రాజేందర్ మృతదేహాలు సోమవారం అర్ధరాత్రి చేరుకోగా మంగళవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. అలాగే, సిద్ది వెంకటస్వామి, గడ్డమీది సునిల్, గొర్రె రాజేందర్ మృతదేహాలు మంగళవారం రాత్రికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
నరసాపురానికి ఈవో రఘురామ్ మృతదేహం
సాక్షి, పశ్చిమగోదావరి : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆదివారం జరిగిన టూరిజం బోటు ప్రమాదంలో మృతి చెందిన అమరేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ఈవో వలవల రఘురామ్ పార్ధీవ దేహాన్ని ఆయన నరసాపురం తరలించారు. ఆయన పార్థీవదేహానికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నివాళులర్పించారు. ఈవో ఉద్యోగాన్ని రఘురామ్ భార్యకు వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వలవల రఘురాం భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేవరకు రఘురామ్ మృతి చెందిన విషయం ఇంట్లో వాళ్లకి తెలియనివ్వలేదు. చిన్న ప్రమాదం జరిగిందని, రఘురాం వచ్చేస్తారని నాగజ్యోతికి బంధువులు నచ్చచెబుతూ వచ్చారు. టీవీ చూడకుండా, పేపర్లు కూడా ఆమె కంట పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రఘురామ్ తల్లికి గుండె సంబంధిత జబ్బు ఉండడంతో ఆమెకు కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. ఇంట్లో రఘురామ్ మృతదేహాన్ని చూసి నాగజ్యోతి కన్నీరుమున్నీరయ్యారు. -
మధులతను పరామర్శించిన డీజీపీ
సాక్షి, అమరావతి : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో కూతురు, భర్తను కోల్పోయిన మధులత(తిరుపతి)ను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూతురిని తలచుకుంటూ గుండె పగిలేలా రోదిస్తున్న మధులతను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకోలేదన్నారు. వినోద కార్యక్రమం జరుగుతున్నందున అందరూ లైఫ్ జాకెట్లు తీసేసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు. బోటుకు అనుమతి లేదన్న విషయం తమకు తెలియదన్నారు. బోటులో అందరూ విద్యావంతులే ఉన్నారని, బోటుకు పర్మిషన్ లేదన్న విషయం తెలిస్తే ఒక్కరు కూడా బోటు ఎక్కేవాళ్లు కాదన్నారు. బోటు బోల్తా పడిన వెంటనే భర్త సుబ్రహ్మణ్యం తనను నీళ్లలో నుంచి పైకి నెట్టి కాపాడరని చెప్పారు. ఆదే సమయంలో తన కాళ్లు పట్టుకున్న కుమార్తె హాసినిని పైకి నెట్టి రక్షించేందుకు ప్రయత్నించి ఆయన నీటిలో ముగినిపోయారని తెలిపారు. బిడ్డ తన కాళ్లను పట్టుకున్నా కాపాడుకోలేకపోయానంటూ మధులత ఆవేదన చెందారు. (చదవండి : ‘నేను రాను డాడీ.. జూ పార్క్‌కు వెళ్తా’) కాగా,తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం తన తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి పాపికొండలు విహారయాత్ర వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా... మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు. ( చదవండి : మీరొచ్చి నాలో ధైర్యం నింపారు: మధులత) కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26 మృతదేహాలను సిబ్బంది వెలికితీసింది. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. లభించిన 26 మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఏడు మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీలైనంత త్వరగా లాంచీని వెలికి తీస్తాం : డీజీపీ ప్రమాదానికి గురైన లాంచీని వీలైనంత త్వరగా వెలికి తీస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇందుకోసం దేశంలో ఏ అత్యాధునిక టెక్నాలజీ అయినా వినియోగిస్తామని చెప్పారు. లాంచీ బయటకు వస్తే మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని డీపీపీ సవాంగ్ చెప్పారు. -
బోటు ప్రమాదం : 26 మృతదేహాలు లభ్యం
సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో గల్లంతైన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 26 మృతదేహాలను సిబ్బంది వెలికితీసింది. వాటిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లభించిన 26 మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఏడు మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. (చదవండి : మరో 14 మృతదేహాలు లభ్యం) మృతుల వివరాలు మూలవెంకట సీతారామరాజు(బాజీ జంక్షన్-విశాఖపట్నం), అబ్దుల్ సలీమ్ (బాపులపాడు మం. పీలేరు, కృష్ణా జిల్లా), బండ పుష్ప(విశాఖ, వేపకొండ), గన్నాబత్తుల బాపిరాజు(నరసాపురం, పశ్చిమగోదావరి), కుసాల పూర్ణ(గోపాలపురం, విశాఖ), మీసాల సుస్మిత(గోపాలపురం, విశాఖ), దుర్గం సుబ్రహ్మణ్యం(తిరుపతి), మధుపాడ రమణబాబు(మహారాణిపేట, విశాఖ), గడ్డమీద సునీల్( చినపెండ్యాల, జనగామ), బస్కి వెంకటయ్య(ఖాజీపేట, వరంగల్), పాశం తరుణ్‌కుమార్ రెడ్డి( రామడుగు, నల్లగొండ), వీరం సాయికుమార్(హైదరాబాద్), గొర్రె రాజేంద్రప్రసాద్(ఖాజీపేట, వరంగల్), రేపకూరి విష్ణు కుమార్ (నేలకొండపల్లి, ఖమ్మం), పాడి ధరణి కుమార్(హయత్‌నగర్, రంగారెడ్డి) -
ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది: ఎర్రబెల్లి
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి) : బోటు ప్రమాదంలో గల్లంతైన మృతదేహాలను వెలికితీయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రస్తుతం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్ అక్కడే ఉండి పరిస్థితులను గమనిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గోదావరి అడుగున 315 అడుగుల లోతులో గుర్తించిన లాంచీని ఆధునాతన పరికరాల ద్వారా వెలికితీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన తెలిపారు. అయితే లాంచీని బయటకు తీయడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనికోసం ఇతర రాష్ట్రాలనుంచి నైపుణ్యాలను ఏపీ ప్రభుత్వం రప్పిస్తోందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గంటగంటకు సహాయక చర్యలపై పర్యవేక్షిస్తున్నారని అన్నారు. గత రెండు రోజులుగా తాము సంఘటన ప్రదేశంలోనే ఉండి ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణకు చెందిన మృతదేహాలను వారి స్వస్థలానికి పంపించేందుకు అంబులెన్సులు సిద్దంగా ఉన్నాయని, వాటిని వారి ఇళ్లకు పంపేవరకు ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. జరిగిన దుర్ఘటన చాలా బాధకరమని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. లాంచీ కింద భాగంలో కూడా మృతదేహాలు ఇరుక్కుపోయి ఉంటాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. -
నా బంగారు తల్లీ.. నేనూ మీతో వస్తా..
‘నాన్నంటే ఇష్టం కదా తల్లి. అందుకే ఆయనతో వెళ్లిపోయావా అమ్మా. మరి నాన్నను తీసుకురాలేదే. నేను మీతో పాటే వస్తా నా బంగారు తల్లి’ అంటూ మధులత గుండె పగిలేలా రోదిస్తున్న తీరు ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. తన కూతురి శవపేటికపై పడి.. ‘అమ్మ లేకుండానే నిద్రపోయావా బంగారం. భయం వేయడం లేదామ్మా’ అని ఆ తల్లి విలపిస్తున్న దృశ్యాలు మనసును ద్రవింపజేస్తున్నాయి. పాపికొండల విహారానికి బయల్దేరిన ఎన్నో కుటుంబాలకు పడవ ప్రమాదం విషాదం మిగిల్చిన విషయం విదితమే. వీరిలో తిరుపతికి చెందిన మధులత కుటుంబం కూడా ఒకటి. తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు బయల్దేరిన భర్త సుబ్రహ్మణ్యం.. తనతో పాటు భార్య మధులత, కుమార్తె హాసినిని కూడా వెంట తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా... మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు. (చదవండి :‘పాపికొండలు రాను డాడీ.. పార్క్‌కు వెళ్తా’ ) ఇక గోదావరి పడవ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. పట్టిసీమలో ఒకటి, ధవళేశ్వరం వద్ద రెండు, అనుగులూరు కాఫర్ డ్యాం వద్ద రెండు, పోలవరం వద్ద ఒకటి, ఆత్రేయపురం దిగువ ప్రాంతంలో రెండు, తాళ్లపూడి వద్ద ఒక మృతదేహాన్ని మంగళవారం రక్షణా బృందాలు వెలికితీశాయి. కాగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పడవ ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి : సీఎం జగన్ ఎదుట కన్నీరుమున్నీరైన మధులత) -
అయ్యో..! హాసిని.. ప్రయాణం వాయిదా వేసుంటే..
సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు భార్య, కూతురితో ఈనెల 13వ తేదీ రాత్రి రాజమండ్రికి బయలుదేరారు. హాసిని చదువుతున్న పాఠశాల విద్యార్థులు 14వ తేదీ జూపార్కును సందర్శించారు. తోటి విద్యార్థులతో కలసి తాను కూడా వెళ్లాలనుకుంది. ఆ విషయం తన తండ్రితో చెప్పింది. అయితే ముందుగా రాజమండ్రికి వెళ్లాల్సిందేనని తండ్రి సుబ్రమణ్యం తేల్చి చెప్పారు. ఒకవేళ వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. హాసిని లాంటి ఓ మంచి విద్యార్థినిని కోల్పోవడం బాధాకరమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. సాక్షి, తిరుపతి:భయపడినట్లే.. జరిగింది.. పాపికొండల ప్రయాణం ప్రాణాలు తీసింది. గోదావరి నది పడవ ప్రమాదం తిరుపతికి చెందిన సుబ్రమణ్యం కుటుంబాన్ని చిదిమేసింది. చిట్టిపొట్టి పలుకులతో, అల్లరి చేష్టలతో నిత్యం ఉత్సాహంగా ఉండే హాసిని.. నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పుణ్యం కోసం గోదారమ్మ ఒడ్డుకెళ్తే.. పుట్టెడు సోకం మిగిలిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. గోదావరి బోటు మునక ప్రమాదంలో గల్లంతైన తిరుపతికి చెందిన సుబ్రమణ్యం(45), మధులత(40) దంపతుల కుమార్తె హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఈ ఉదయం దేవీపట్నం సమీపంలోని కచ్చలూరు వద్ద నౌకాదళ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, స్థానిక మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. అయితే నదీ ప్రవాహవేగం, లోతు, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా తిరుపతికి చెందిన సుబ్రమణ్యం తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలసి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం పాపికొండల అందాలను వీక్షించేందుకు అందరూ బోటులో బయలుదేరారు. అయితే దేవీపట్నం వద్ద గోదావరిలో బోట్ బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి మధులత బయటపడగా.. సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. హాసిని మృతదేహం బయటపడింది. సుబ్రమణ్యం వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాళ్లు పట్టుకున్నా కాపాడలేకపోయా! ‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా భర్త సుబ్రమణ్యం నన్ను నీటిలో నుంచి పైకి నెట్టి కాపాడారు. అదే సమయంలో నా కాళ్లు పట్టుకుని ఉన్న నా కుమార్తె హాసినిని కూడా పైకి నెట్టి రక్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. నన్ను కాపాడి నా కళ్లముందే ఆయన నీటిలో మునిగిపోయారు. నా బిడ్డ నా కాళ్లు పట్టుకున్నా.. నేను కాపాడుకోలేకపోయాను’’ – మధులత శ్రీకాళహస్తి : పుణ్యనది గోదావరిలో తండ్రి అస్థికలను నిమజ్జనం చేసి, ఆఖరి క్రతువును నిర్వహించి, తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించాలని వెళ్లిన తిరుపతికి చెందిన సుబ్ర మణ్యం కుటుంబానికి అంతులేని దుఃఖమే మిగిలింది. బోటు మునక ప్రమాదంలో ఆయన తన కుమార్తె హాసినితో పాటు గల్లవంతవగా, ఆయన భార్య మధులత ప్రమాదం నుంచి బైటపడటం విదితమే. హాసిని మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు. సుబ్రమణ్యం కోసం ఇంకనూ గాలిస్తున్నారు. దుర్గం సుబ్రమణ్యం తిరుపతిలో కుటుంబంతో కలిసి వినాయకసాగర్ రాధేశ్యామ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నా రు. సుబ్రమణ్యం (45)కు శ్రీకాళహస్తి, చిత్తూరులో పెట్రోల్ బంకులున్నాయి. శ్రీకాళహస్తి పెట్రోల్ బంకు బాధ్యతలను ఆయన సతీమణి మధులత చూసేది. హాసిని (12) తిరుపతి స్ప్రింగ్‌డేల్ స్కూలులో 7వ తరగతి చదువుతోం ది. 3నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం భార్య, కుమార్తెతో కలిసి సుబ్రమణ్యం రాజమహేంద్రవరం వెళ్లారు. బోటు మునక ప్రమాదంలో తండ్రీ, తనయ గల్లంతవగా, మధులత బైటపడింది. ఈ ఘటన శ్రీకాళహస్తి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బందికి విషాదం మిగిల్చింది. వారి జ్ఞాపకాల తడితో వారి కళ్లు చెమ్మగిల్లాయి. పాప కళ్ల ముందే కదలాడుతోంది ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో పాప హాసినితో మా యజమాని సుబ్రమణ్యం, మధులత వచ్చేవారు. హాసిని మాతో కాసేపు మొబైల్ వీడియో గేమ్ ఆడేది. మా యజమాని మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే వారు. హాసిని మా కళ్లలోనే కదలాడుతోంది. ఆ పాప చనిపోయిందని టీవీలలో న్యూస్ వస్తూంటే దుఃఖం ఆగడం లేదు. చాలా బాధగా ఉంది.–సుమన్, పెట్రోల్ బంక్ మేనేజర్ ప్రమాద ఘటన కలిచి వేసింది గోదావరిలో బోటు మునిగి పోయిందని టీవీలో ఉదయమే చూసాను. అయితే కొంతసేపటికే దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా యజమాని బంధువులు ఫోన్ చేసి మా యజమాని సుబ్రమణ్యం, పాప హాసినితో ప్రమాదంలో గల్లంతయ్యారని చెప్పగానే షాక్ గురయ్యాం. ఆయన ఫోన్ నంబర్లకు ప్రయత్నించాం. కానీ సమాధానం లేదు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.– మురళి, పెట్రోలు బంక్ క్యాషియర్ చాలా బాధ కలిగించింది రెండేళ్లుగా పనిచేస్తున్నా. మా యజమాని సుబ్రమణ్యం చాలా మంచివారు. బంకు దగ్గరికి వస్తే అందరికీ భోజనం తెప్పించేవారు. కూర్చుని అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఆయన ప్రమాదంలో గల్లంతయ్యారని, హాసిని మృతదేహాన్ని వెలికి తీశారని టీవీలలో చూశాక దుఃఖం ఆగడం లేదు. – చెంగయ్య, పెట్రోలు బంకు ఉద్యోగి శోక సంద్రమైన స్కూలు తిరుపతి ఎడ్యుకేషన్ : ఎత్తైన కొండలు...వాటి మధ్య గలగల పారే గోదావరి. పాపికొండల్లో బోటు ప్రయాణం మధురానుభూతి. కొండకోనల అందాలను ఆస్వాదించేలోపే ఓ దుర్ఘటన. నది మధ్యలో బోటు కుదుపులకులోనై మునిగింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో 37మంది గల్లంతయ్యారు. వారిలో తిరుపతిలోని స్ప్రింగ్‌డేల్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న డి.హాసిని ఈ ప్రమాదంలో తండ్రితో పాటు గల్లంతయ్యింది. తిరిగి రాని లోకాలకు చేరుకుంది. ఆ నవ్వుల హాసిని ఇక లేదని తెలియడంతో ఆ చిన్నారి చదువుతున్న స్కూలు శోకసంద్రమైంది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ పాఠశాల ఈ విషాదంతో మూగబోయింది. ఆ పాఠశాల ప్రిన్సిపల్ కెఆర్.ఆనురాధ గోపాల్, క్లాస్ టీచర్ ఎస్.లత హాసిని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విచలితులయ్యారు. వారి మాటల్లోనే...‘‘ హాసిని తండ్రి సుబ్రమణ్యంకు రాచగున్నేరి వద్ద పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. హాసిని ఏకైక సంతానం కావడంతో తల్లిదండ్రులు సుబ్రమణ్యం, మధులత ప్రేమగా చూసుకునేవారు. చదువు, ఇతరత్రా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రెండో తరగతిలో హాసిని స్ప్రింగ్‌డేల్ స్కూల్లో చేరింది. అప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటోంది. చదువులోనూ బాగా రాణించేది. తనకు చిత్రలేఖనం, నృత్యం అంటే చాలా ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. తన మంచి తనంతో తోటి విద్యార్థులు, టీచర్లను కట్టిపడేసేది. దీంతో హాసినీ అంటే అందరికీ ఇష్టం’’. అని చెప్పారు. ఇక, హాసిని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎన్నో విషయాలు పంచుకున్నారు. హాసిని మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. వేపనపల్లెలో విషాద ఛాయలు పూతలపట్టు (యాదమరి): గోదావరి నదిలో బోటు మునక ప్రమాదం సంఘటన పూతలపట్టు మండలం వేపనపల్లెలో విషాదం నింపింది. తిరుపతిలో నివసిస్తున్న సుబ్రమణ్యం కుటుం బాని కి గ్రామంతో సుదీర్ఘ అనుబంధం ఉం ది. వేపనపల్లె గ్రామానికి చెందిన గంగి శెట్టి, రాజమ్మలకు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. వీరికి సుబ్రమణ్యం, సురేంద్ర ఇద్దరు కుమారులు. భార్య మరణంతో గంగిశెట్టి అత్తగారిల్లు అయిన తిరుపతికి 3 దశాబ్దాల క్రితం వెళ్లిపోయారు. అక్కడే చిల్లర దుకాణం పెట్టుకుని తన కుమారుల అభ్యున్నతి కోసం శ్రమించారు. కాలక్రమంలో సుబ్రమణ్యం పెట్రోల్ బంకులు లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. తమ్ముడు సురేంద్ర వెల్డింగ్ వర్క్ చేసేవారు. తండ్రి అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య, కుమార్తెతో వెళ్లిన సుబ్రమణ్యం బోటు మునకతో గల్లంతయ్యారనే వార్తలు టీవీలో రావడం చూసి గ్రామంలో విషాదం అలుముకుంది. వారి తాలూ కు బంధువర్గం హుటాహుటిన రాజమండ్రికి బయల్దేరింది. -
మొరాయిస్తున్నా.. మారరా?
ఏళ్లు గడుస్తున్నాయి.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రమాదం జరిగినప్పుడల్లా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. అయినా పరిస్థితి మారదు.. ప్రమాద సమయంలోనే అంతా హడావుడి.. ఆ తర్వాత యథావిధి తంతు.. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ తీరు.. ముఖ్యంగా సంస్థకు అధికంగా ఆదాయం తెచ్చిపెట్టే బోటింగ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. కాలం చెల్లిన బోట్లకే రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించి తిప్పుతున్నారు తప్ప కొత్తవి కొనే ఆలోచన చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. భవానీపురం(విజయవాడ పశ్చిమం): కాలం చెల్లిన బోట్లతో కాలక్షేపం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఉన్నతాధికారుల వైఖరి ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతోంది. టూరిజం అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకునే అధికారులు ఆదాయాన్ని తెచ్చిపెట్టే బోట్ల కొనుగోలుపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఏపీటీడీసీ నడుపుతున్న బోట్లన్నీ దాదాపు 15 నుంచి 20 ఏళ్లకు పూర్వం కొనుగోలు చేసినవే. విజయవాడలో బోటింగ్ ఇలా.. విజయవాడ బరంపార్కు నుంచి భవానీ ద్వీపానికి రోజూ బోట్ సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో బరంపార్క్ నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీలోగల పవిత్ర సంగమం వరకు బోట్లు నడిచేవి. వాటికి జలవనరుల శాఖ కూడా అనుమతించింది. 2017లో పవిత్ర సంగమం దగ్గర ఒక ప్రైవేట్ బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడటంతో ఆ మార్గంలో బోట్లు నడిపేం దుకు జలవనరుల శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో పవిత్ర సంగమానికి బోట్లు నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానంతరం దిగువనున్న దుర్గాఘాట్ దగ్గర ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన బోట్ల ద్వారా భవానీ ద్వీపం వెళ్లేవారు. ఇక్కడి నుంచి రోజూ నాలుగైదు సర్వీసులు నడిచేవి. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో కొంత కాలంగా సర్వీసులు నిలిచాయి. అన్నీ కాలం చెల్లిన బోట్లే ♦ ఏపీటీడీసీ విజయవాడ డివిజన్లోని భవానీపురం బెరంపార్క్‌లోగల బోటింగ్ పాయింట్లో ఉన్న 17 బోట్లలో ఒకటీ రెండు మినహా అన్నీ కాలం చెల్లినవే. ♦ బరంపార్క్ నుంచి భవానీ ద్వీపానికి రెగ్యులర్‌గా తిరిగే బోట్లలో భవానీ బోటు ఒకటి. దీనిని 2006లో వైజాగ్‌లోని సీకాన్ సంస్థ నుంచి కొనుగోలు చేశారు. దీనిని కొని 13 ఏళ్లు కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతోంది. ♦ ముంబై పోర్ట్‌లో తయారైన కృష్ణవేణి, ఆమ్రపాలి బోట్లను 1998లో కొన్నారు. ఇవి కూడా మరమ్మతులకు గురవుతూనే ఉంటాయి. డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ బోట్లన్నీ 50 మంది కెపాసిటీ కలిగినవే. ♦ అడపాదడపా బయటకుతీసే (పార్టీలు, ఫంక్షన్ల కోసం) బోధిసిరి బోటుకూ మరమ్మతులు షరా మామూలే. ఇదీ డీజిల్ ఇంజిన్‌తోనే నడుస్తుంది. దీనికి సిబ్బంది పెట్టిన ముద్దు పేరు వైట్ ఎలిఫెంట్. దీని కెపాసిటీ 100 మంది. ఏసీ సౌకర్యం ఉన్న దీనిని 2004లో కొన్నారు. రూ.1.20కోట్ల ఏసీ బోటు నిరుపయోగం గత ఏడాది మార్చిలో రూ.1.20 కోట్లతో కొనుగోలు చేసిన ఏసీ (పలనాడు) బోటు నిరుపయోగంగా ఉంది. 36 సీటింగ్ కలిగిన ఈ బోటుకు చార్జిని రూ.120గా నిర్ణయించడంతో సందర్శకులు ఆసక్తి చూపడం లేదు. ఈ బోటు ఖర్చుతో మూడు మంచి సాధారణ బోట్లు వస్తాయని సిబ్బంది చెబుతున్నారు. ♦ ధరణి అనే బోటును రూ.25లక్షలతో కొనుగోలు చేశారు. దీని సీటింగ్ కెపాసిటీ 10 మంది మాత్రమే. దీనికి కూడా రూ.120లు చార్జీ వసూలు చేస్తున్నారు (15 నిముషాలపాటు రౌండ్ ట్రిప్) పర్యాటకులు ఆసక్తి చూపకపోవడంతో దీనినీ పక్కన పడేశారు. ఈ రెండు లగ్జరీ బోట్లను గంట సేపు అద్దె తీసుకుంటే రూ.5,900లు చార్జిగా నిర్ణయించారు. ప్రైవేటు సంస్థలు ఇలా.. ద్వీపంలో మూడు ప్రైవేట్ సంస్థలు (అమరావతి బోటింగ్ క్లబ్, చాంపియన్ యాచెట్ క్లబ్, సింపుల్ వాటర్ స్పోర్ట్స్) వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాయి. ద్వీపానికి వచ్చిన సందర్శకులను వివిధ రకాల బోట్ల ద్వారా నదిలో తిప్పుతారు. ఇవి బరంపార్క్ వరకు వచ్చి సందర్శకులను ద్వీపంకు తీసుకువెళ్లవు. ఈ మేరకు ఆయా సంస్థలతో ఏపీటీడీసీ ఒప్పందం చేసుకుంది. నెలకు రూ.30 లక్షల ఆదాయం.. 4 పోలీక్రాప్స్ స్పీడ్ బోట్లు, మూడు జెట్స్కీ బోట్లు తరచూ రిపేర్లకు గురవుతూనే ఉన్నాయి. ఇవన్నీ పెట్రోలు ఇంజిన్లతో నడిచేవే. వీటి మరమ్మతుల కోసం రూ.లక్షలు వెచ్చించే ఏపీటీడీసీ ఉన్నతాధికారులు కొత్త బోట్లు కొనుగోలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొత్తానికి బోట్ల ద్వారా ఏపీటీడీసీకి నెలకు సుమారు రూ.20 నుంచి రూ.30లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. అంత ఆదాయం లభించే బోటింగ్ వ్యవస్థపై నిర్లక్ష్యం వహించడంపై అటు ప్రజలు, ఇటు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాత్రంతా జాగారం చేసిన కడిపికొండ
సాక్షి, కాజీపేట: ఏడ్చీ ఏడ్చీ ఇంకిపోయిన కన్నీళ్లు.. తమ వారేమయ్యారోనని అంతు లేని ఎదురుచూపులు.. సురక్షితంగా బయటపడిన వారు ఎలా ఉన్నారోనని ఆవేదన.. వచ్చివెళ్లే వారి పరామర్శలు.. రాత్రి మొత్తం జాగారం.. ఇదీ కడిపికొండ గ్రామంలోని పరిస్థితి! పాపికొండల విహారయాత్రకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు 14 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఇంకో ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాయి. కాగా, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ పాపికొండలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వారిలో న్యూశాయంపేట వాసి హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో గల్లంతైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా, బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు సోమవారం అర్ధరాత్రి 2.30 గంటలకు స్వస్థలానికి చేరగా కుటుంబీకులకు అప్పగిం చారు. దీంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. అలాగే, సురక్షితంగా బయటపడిన ఐదుగురికి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స చేసిన అనంతరం అంబులెన్స్‌లో ఇక్కడకు పంపించగా మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సోమవారం ఉదయం వరకు రంపచోడవరం చేరుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లు అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ మృతదేహాల తరలింపు, గల్లంతైన వారి గాలింపు చర్యలను సమీక్షించారు. కాజీపేట మండలంలోని కడిపికొండ కన్నీటి సంద్రంగా మారింది.. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. ‘అంతు’చిక్కని తమ వారి ఆచూకీ కోసం రోదనలు.. మృతి చెందినట్లు తేలిసిన వారి కుటుంబాల్లో మిన్నంటిన ఆర్తదానాలు.. సురక్షితంగా బయటపడిన వారి బంధువులు తమ వారు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూనే.. సహచరులు గల్లంతు కావడంపై ఆవేదన... ఇదీ గ్రామంలో సోమవారం నెలకొన్న పరిస్థితి! తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో కడిపికొండకు చెందిన 14 మంది చిక్కుకుకోవడం తెలిసింది. ఇందులో ఐదుగురు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరి మృతదేహాలు ఆదివారం రాత్రే బయటపడ్డాయి. ఇక మిగిలిన ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు టీవీలు చూస్తూ.. పరామర్శకు వచ్చిన వారిని ఆరా తీస్తూ రాత్రంగా గడిపారు. వెలగని పొయ్యి గల్లంతైన వారితో పాటు మృతి చెందిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అలాగే, సురక్షితంగా బయటపడిన వారి కుటుంబీకులు తమ వారి కోసం ఎదురుచూడడం కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు గ్రామంలోని వారి గృహాల్లో పొయ్యి వెలగలేదు. మిగతా గ్రామస్తులు ముందుండి వంటలు చేయించి భోజనాలు పెట్టిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. పాండవుల గుట్టల్లో పాపికొండలు ప్లాన్ కడిపికొండకు చెందిన బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, సివ్వి వెంకటస్వామి, బస్కే రాజేంద్రప్రసాద్, బస్కే అవినాష్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్, కొండురి రాజ్‌కుమార్, కొమ్ముల రవి, గొర్రె ప్రభాకర్, బస్కే ధర్మరాజు, బస్కే రాజేందర్, బస్కే వెంకటస్వామి ఐదేళ్లుగా వాకింగ్ చేస్తున్నారు. వీరిలో సివ్వి వెంకటస్వామి, బస్కే వెంకటస్వామి రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు కాగా గొర్రె ప్రభాకర్ రైల్వే బుకింగ్ క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా వారిలో కొందరు టీఆర్ఎస్లో కొనసాగుతుండగా.. ఇంకొందరు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతీరోజూ కడిపికొండ నుండి రాజీవ్‌గృహ కల్ప సముదాయం వరకు వాకింగ్ చేయడం ఆనవాయితీ. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మాదిగ మహరాజ్ కుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ సంఘం ద్వారా పాపికొండల టూర్‌కు వెళ్లాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నప్పటికీ ఆ సమయంలో భారీ వర్షాలు కురవడంతో టికెట్లు రద్దు చేసుకున్నారు. అయినా విహారయాత్రకు వెళ్లాలనే కాంక్షతో పాండవుల గుట్టకు వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడే మాట్లాడుకునే క్రమంలో ఎలాగైనా పాపికొండలు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మళ్లీ టూర్‌ను ప్లాన్ చేసుకుని సరదాగా వెళ్లి వచ్చారు. అనంతరం పాండవుల గుట్ట టూర్ నుండి పాపికొండల టూర్‌కు ప్లాన్ వేసారు. ఇటీవల వాతావరణం అనుకూలించగా రైల్వే బుకింగ్ క్లర్క్ గొర్రె ప్రభాకర్ 14 మందికి రైలు టికెట్లు బుక్ చేశారు. కంటిమీద కునుకులేదు.. కడిపికొండకు చెందిన 14 మంది పాపికొండల టూర్‌కు వెళ్లి బోటు ప్రమాదంలో చిక్కుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తమ వారి ఆచూకి లభిం చిందా లేదా.. మృతి చెందారా, ఏదైనా సమాచారం అందుతుందా అంటూ ఆదివారం రాత్రంతా జాగారం చేశారు. వీరికి తోడు కడిపికొండ వాసులు కూడా ఉండడంతో ఊరంతా జాగారం చేసినట్లయింది. మృత్యుంజయులు పాపికొండల విహారయాత్రకు వెళ్లిన కడిపికొండకు చెందిన 14 మందిలో సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, ఆరెపల్లి యాదగిరి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్‌ను రంపచోడవరం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందజేయగా... సోమవారం ఉదయకల్లా అక్కడకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూని దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. తక్షణ వైద్యఖర్చుల నిమిత్తం రూ.10వేలు అందజేయడంతో పాటు వైద్యులు మాట్లాడారు. అనంతరం వరంగల్ నుంచి వెళ్లిన కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ అజయ్ తదితరులు అంబులెన్స్‌లో తీసుకురాగా.. సోమవారం రాత్రి 11.30 గంటలకు హన్మకొండకు చేరుకోగానే మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. టూర్సాగిందిలా.. కాజీపేట నుంచి శుక్రవారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరిన వారు శనివారం ఉదయం 5.45 నిమిషా లకు రాజమండ్రి చేరుకున్నారు. ఓ లాడ్జిలో సేద తీరి.. గైడ్ సాయంతో రూ.3వేల టూర్ ప్యాకేజీ మాట్లాడుకున్నారు. శనివారం ఉదయం రాజమండ్రి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు దేవిపట్నం ప్రాంతానికి చేరుకుని బోటులో పాపికొండల టూర్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 12.35 నిమిషాలకు కచ్చులూరుకు బోటు చేరుకోగా గోదావరి ఉగ్రరూపానికి మునిగిపోయింది. దీంతో లైఫ్ జాకెట్లు ధరించిన ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారు గల్లంతు కాగా.. బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రమాద ఘటనలో న్యూశాయంపేట వాసి గోదావరిలో బోటు మునిగిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మరొకరు కూడా ఉన్నట్లు సోమవారం సాయంత్రానికి తెలిసింది. హన్మకొండ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటకు చెందిన దోమల హేమంత్ గల్లంతైన వారిలో ఉన్నట్లు సమచారం. హైదరాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో విధులు కొనసాగిస్తున్న హేమంత్ స్నేహితులతో కలిసి పాపికొండలు టూర్‌కు వెళ్లాడు. బోటు ముగినిపోయినట్లు తెలియడంతో హేమంత్ తండ్రి భూమయ్య, తల్లి పద్మావతి కన్నీరుమున్నీరయ్యారు. కాగా, భూమయ్య టైలరింగ్ వృత్తి కొనసాగిస్తూ ముగ్గురు కుమారులను చదివించారు. ఇప్పుడు హేమంత్ గల్లంతైనట్లు తెలియడంతో ఆయన రోదిస్తున్నారు. బస్కే అవినాష్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి ; బస్కే రాజేందర్ కుటుంబీకులు రెండు మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృత దేహాలు కూడా కడిపికొండకు చేరుకున్నాయి. ఈ మేరకు రంపచోడవరం ఆస్పత్రిలో పోస్టుమార్టం కార్యక్రమాలు త్వరగా పూర్తయ్యేలా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఆతర్వాత అంబులెన్స్‌లో కడిపికొండకు తీసుకురాగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలు చేరుకోగానే కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పరామర్శించిన మంత్రులు గోదావరి నదిలో బోటు ప్రమాదంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరధం, బస్కే వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులు సమీక్షిచేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించిన సమయంలో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు. ఇక కాజీపేట ఇన్స్పెక్టర్ అజయ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకన్నారు. రెండు శాఖలు 13 మంది ఇంజనీర్లు.... వరంగల్: పాపికొండల విహార యాత్రకు రెండు ప్రాంతాలు, రెండు శాఖలకు చెందిన 13 మంది ఇంజనీర్లు వెళ్లిన ట్లు తెలిసింది. ఇందులో హైదరాబాద్ పోలీసు హౌజింగ్ శాఖకు చెందిన ఏఈలు ఏడుగురు ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు విద్యు త్ శాఖ ఏఈలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ హౌజింగ్ ఏఈల్లో ప్రమాదం నుంచి నలుగురు బయట పడగా ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో హన్మకొండ న్యూశాయంపేటకు చెందిన హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఐదు అంబులెన్స్‌లు... అధికారులు తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న జిల్లా వాసులను అండగా నిలిచేందుకు ఇక్కడి నుంచి అధికారులు ఆదివారం రాత్రే వెళ్లారు. జిల్లా నుంచి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ అజయ్ వెళ్లారు. ఈ మేరకు ఓ అంబులెన్స్‌లో బస్కె రాజేందర్, బస్కె అవినాష్ మృతదేహాలతో పాటు సురక్షితంగా బయటపడిన మరో ఐదుగురికి ఇంకో అంబులెన్స్‌లో పంపించారు. నదిలో పడ్డాక లైఫ్ జాకెట్ దొరికింది.. రాజమండ్రి నుంచి పాపికొండలు.. అక్కడి నుంచి భద్రాచలం వెళ్లాలన్నది మా ప్లాన్. బోటు ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా కుదిపినట్లు అయ్యింది. అందులో ఉన్నవారంతా కేకలు పెడుతుండగానే బోటు మనిగిపోయింది. మునిగిన బోటు ఒక్కసారిగా పైకి లేచింది. ఆ క్షణంలోనే నాతో పాటు కొందరం బయటపడ్డాం. అప్పటి వరకు నాకు లైఫ్ జాకెట్ లేదు. బోటులో ఉన్న కొన్ని జాకెట్లు నీటిపై తెలియడుతుండగా ఒక్కటి వేసుకుని ఈదడం మొదలు పెట్టాను. సుమారు 15 నిమిషాల తరువాత స్థానిక జాలర్లు నన్ను రక్షించారు. అలా నేను బతికి బయట పడ్డాను. నదిలో పడ్డాక మళ్లీ ఈ లోకాన్ని చూస్తాననని ఊహించ లేదు. – బస్కే వెంకటస్వామి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సంబంధిత వార్తలు... నిండు గోదారిలో మృత్యు ఘోష -
గోదారి ఘటన:మరో 12 మృతదేహాలు లభ్యం
-
విషాద యాత్రలు
-
అమ్మా మాట్లాడమ్మా.. చెల్లి ఎక్కడుందమ్మా..?
పెందుర్తి: ‘అమ్మా లెగమ్మా.. మాట్లాడమ్మా.. నా చెల్లెలు ఏదమ్మా.. ఇప్పుడు నాకు తోడెవరమ్మా.. నెనెవరితో ఆడుకోవాలమ్మా.. ఎవరితో గిల్లికజ్జాలు పెట్టుకోవాలమ్మా.. చెల్లెప్పుడు వస్తాదమ్మా.. మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోయావమ్మా.. నాన్నకు నాకు దిక్కెవరమ్మా’ అంటూ వేపగుంటకు చెందిన బొండా లక్ష్మి పెద్దకుమార్తె రమ్య తల్లి మృతదేహం వద్ద విలపించిన తీరు ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. పాపికొండలు విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన బొండా లక్ష్మి(37) మృతి చెందింది. ఆమెతోపాటు వెళ్లిన చిన్నకుమార్తె పుష్ప(13) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్న బంధువులు లక్ష్మి మృతదేహాన్ని గుర్తించడంతో సోమవారం ఉదయం రామమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో లక్ష్మి మృతదేహాన్ని వేపగుంటకు తరలించారు. శనివారం సాయంత్రం ఇంటిలో అందరికీ జాగ్రత్తలు చెప్పి యాత్రకు బయలుదేరిన లక్ష్మి విగతజీవిగా కనిపించడంతో భర్త శంకరరావు, పెద్ద కుమార్తె రమ్య తల్లడిల్లిపోయారు. లక్ష్మి అత్తామామ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు లక్ష్మి మృతదేహం వద్ద బోరున విలపించారు. శంకర్, రమ్యలను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వేపగుంట శ్మశానవాటికలో లక్ష్మి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ లక్ష్మి నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. మాకు దిక్కెవరమ్మా.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన బొండా శంకరరావు, లక్ష్మి దంపతులు ఇద్దరు ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. శంకర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమార్తె రమ్య తొమ్మిదో తరగతి కాగా.. చిన్న కుమార్తె పుష్ప ఎనిమిదో తరగతి చదువుతుంది. రమణబాబు కటుంబంతో కలిసి ఆదివారం వేకువజామున రాజమండ్రి రైలులో చేరుకుని బోటు షికారుకు విశిష్ట బోటు ఎక్కారు. ఆ బోటు ప్రమాదంలో మధుపాడ రమణబాబు కుటుంబసభ్యులు సహా లక్ష్మి, పుష్ప గల్లంతయ్యారు. లక్ష్మి మృతదేహాన్ని ఆదివారం అర్ధరాత్రి గుర్తించారు. ఇంకా పుష్ప ఆచూకీ లభించలేదు. ఓ వైపు లక్ష్మి మృతి.. మరోవైపు పుష్ప గల్లంతు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమకు దిక్కెవరంటూ శంకర్, రమ్య రోదిస్తున్నారు. ఈ ఘటనతో వేపగుంటలో తీవ్ర విషాదం అలముకుంది. -
పాపం ఎవరిది?
-
బోటు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు
-
అంతులేని విషాదం
-
బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు
సాక్షి, నంద్యాల(కర్నూలు) : తూర్పు గోదావరి జిల్లా కట్టలూరు గ్రామ సమీప గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు గల్లంతయ్యారు. పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సీనియర్ లాయర్ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బోటు ప్రమాదంలో అదృశ్యమైనట్లు బంధువులు తెలిపారు. రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మహేశ్వరరెడ్డి భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. శుక్రవారం తండ్రి రామకృష్ణారెడ్డికి ఫోన్‌చేసి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్తునట్లు చెప్పాడు. గోదావరి నదిలో ఆదివారం బోటు ప్రమాదం జరిగినట్లు వార్తలు రావడంతో రామకృష్ణారెడ్డి ఆందోళనకు గురయ్యాడు. మహేశ్వరరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా..సెల్ పనిచేయకపోవడంతో విశాఖపట్టణం గాజువాకలోని వారి బంధువులకు విషయం తెలియజేశాడు. బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి, మహేశ్వరెడ్డికి చెందిన కారు పార్కింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మహేశ్వరెడ్డి జాడ తెలియడం లేదని రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయడంతో హుటాహుటిన ఆయన సోమవారం మధ్యాహ్నం దేవిపట్నానికి బయలుదేరాడు. (చదవండి : నిండు గోదారిలో మృత్యు ఘోష) -
ముమ్మరంగా గాలింపుచర్యలు
-
చాలా బాధనిపించింది..
-
‘పాపికొండలు రాను డాడీ.. పార్క్‌కు వెళ్తా’
భయపడినట్లే.. జరిగింది.. పాపికొండల ప్రయాణం ప్రాణాలు తీసింది. గోదావరి నది పడవ ప్రమాదం తిరుపతికి చెందిన సుబ్రమణ్యం కుటుంబాన్ని చిదిమేసింది. చిట్టిపొట్టి పలుకులతో, అల్లరి చేష్టలతో నిత్యం ఉత్సాహంగా ఉండే హాసిని.. నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పుణ్యం కోసం గోదారమ్మ ఒడ్డుకెళ్తే.. పుట్టెడు సోకం మిగిలిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. గోదావరి బోటు మునక ప్రమాదంలో గల్లంతైన తిరుపతికి చెందిన సుబ్రమణ్యం(45), మధులత(40) దంపతుల కుమార్తె హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఈ ఉదయం దేవీపట్నం సమీపంలోని కచ్చలూరు వద్ద నౌకాదళ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, స్థానిక మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. అయితే నదీ ప్రవాహవేగం, లోతు, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా తిరుపతికి చెందిన సుబ్రమణ్యం తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలసి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం పాపికొండల అందాలను వీక్షించేందుకు అందరూ బోటులో బయలుదేరారు. అయితే దేవీపట్నం వద్ద గోదావరిలో బోట్ బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి మధులత బయటపడగా.. సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. హాసిని మృతదేహం బయటపడింది. సుబ్రమణ్యం వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయ్యో..! హాసిని ‘నేను రాను డాడీ.. స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి జూ పార్క్‌కు వెళ్తా’నని దుర్గం హాసిని (12) మారాం చేసింది. తాత అస్థికల్ని నిమజ్జనం చేయడానికి అందరం వెళ్లాలని తండ్రి సుబ్రహ్మణ్యం బలవంతం చేయడంతో తల్లిదండ్రులతో కలసి బయలుదేరింది. ఆ మరునాడు పడవ ప్రమాదంలో హాసిని ప్రాణాలు కోల్పోగా.. తండ్రి సుబ్రహ్మణ్యం గల్లంతయ్యాడు. ప్రమాదం నుంచి బయటపడిన మధులతకు కుమార్తె హాసిని మృత్యువాత పడిన విషయం సోమవారం తెలిసింది. కుమార్తె ఇక లేదని తెలిసి తల్లి మధులత గుండెలు బాదుకుంటూ తల్లడిల్లుతోంది. తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం సొంతూరు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేపనపల్లి. ఆ చిన్నారి తిరుపతి స్ప్రింగ్ డేల్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరినీ శనివారం జూ పార్క్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు తమతో కలిసి జూ పార్క్‌కు వచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళ్లు పట్టుకున్నా కాపాడలేకపోయా! ‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా భర్త సుబ్రమణ్యం నన్ను నీటిలో నుంచి పైకి నెట్టి కాపాడారు. అదే సమయంలో నా కాళ్లు పట్టుకుని ఉన్న నా కుమార్తె హాసినిని కూడా పైకి నెట్టి రక్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. నన్ను కాపాడి నా కళ్లముందే ఆయన నీటిలో మునిగిపోయారు. నా బిడ్డ నా కాళ్లు పట్టుకున్నా.. నేను కాపాడుకోలేకపోయాను’’ – మధులత ప్రయాణం వాయిదా వేసుంటే.. సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు భార్య, కూతురితో ఈనెల 13వ తేదీ రాత్రి రాజమండ్రికి బయలుదేరారు. హాసిని చదువుతున్న పాఠశాల విద్యార్థులు 14వ తేదీ జూపార్కును సందర్శించారు. తోటి విద్యార్థులతో కలసి తాను కూడా వెళ్లాలనుకుంది. ఆ విషయం తన తండ్రితో చెప్పింది. అయితే ముందుగా రాజమండ్రికి వెళ్లాల్సిందేనని తండ్రి సుబ్రమణ్యం తేల్చి చెప్పారు. ఒకవేళ వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. హాసిని లాంటి ఓ మంచి విద్యార్థినిని కోల్పోవడం బాధాకరమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. బోటు యజమాని కోసం గాలింపు దేవీపట్నం నుంచి సాక్షిప్రతినిధి బృందం: నిబంధనలకు విరుద్ధంగా బోటును నిర్వహించి.. ఘోర ప్రమాదానికి కారణమైన యజమాని కోడిగుడ్ల వెంకటరమణ కోసం పోలీసులు వెతుకుతున్నారు. విశాఖపట్నానికి చెందిన వెంకటరమణపై దేవీపట్నం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అతనిపై సెక్షన్ 304ఏ కింద ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. దేవీపట్నం తహసీల్దార్ మహబూబ్ ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటరమణను మొదటి నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఘటన జరిగినప్పటినుంచి వెంకటరమణ పరారీలో ఉండగా.. అతని ఆచూకీ కోసం రెండు రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
అధైర్యపడకండి అండగా ఉంటాం
సాక్షి ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం: బోటు ప్రమాదం నుంచి బయటపడి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. 21 మంది బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తానున్నానని భరోసా ఇచ్చారు. ఒక్కో బాధితుడి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు, ఆసుపత్రిలో అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన కొంత మంది సీఎం జగన్‌ను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇళ్లకు పంపాలని మంత్రులకు సూచించారు. ఆస్పత్రిలో ఒక్కొక్కరినీ పలకరిస్తున్న సమయంలో వారి హృదయాల్లో నుంచి వస్తున్న ఆవేదనను చూసి సీఎం భావోద్వేగానికి గురయ్యారు. ధైర్యంగా ఉండమ్మా.. భర్త, కుమార్తెను కోల్పోయిన తిరుపతికి చెందిన మధులతను పలకరించిన సందర్భంలో ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు. కొద్దిసేపు అలానే ఉండిపోయారు. ‘భర్త, కూతుర్ని కోల్పోయి అనాథనయ్యాను. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను. నేను చనిపోతే నాకు ఎవరు తలకొరివి పెడతారని అడిగితే అమ్మా.. జగనన్నకు ఉన్నది కూడా ఇద్దరు కుమార్తెలు.. వాళ్లలాగనే నేనూ చూసుకుంటానని చెప్పింది. స్కూల్లో, అల్లరిలో ఫస్ట్. నాకు బతకాలని కూడా లేదు. కనీసం నా భర్తను, చిన్నారిని ఒక్కసారి కడసారి చూపు చూపించన్నా..’ అంటూ మధులత గద్గద స్వరంతో సీఎంను పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘మీరొస్తూనే కరప్షన్ కనపడదని చెప్పారన్నా.. పోలీసులను వదలకండి.. మూడు నాలుగు వేలకు కక్కుర్తిపడి పోలీస్‌స్టేషన్ వద్ద ఆపిన బోటును మళ్లీ పంపించేశారు. మరొకరికి ఈ పరిస్థితి రాకూడదన్నా.. ఎన్ని కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయో చూస్తున్నారు కదన్నా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను పరామర్శించిన సీఎం.. ధైర్యంగా ఉండాలంటూ సముదాయించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మీరు ఎక్కింది ఏ బోటు? ‘మీరు ప్రయాణించింది ఏపీ టూరిజం బోటా, ప్రైవేటు బోటా’ అని సీఎం జగన్.. ప్రాణాలతో బయటపడిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో పని చేస్తున్న నలుగురు ఏఈలు సాలేటి రాజేష్, శివ శంకర్, నార్లపురం సురేష్, మేడి కిరణ్ కుమార్‌లను ప్రశ్నించారు. ‘ప్రభుత్వ టూరిజం బోట్లు తిరగడం లేదని వెబ్సైట్ చూస్తే తెలిసింది. ప్రభుత్వ వెబ్సైట్లో డేంజర్ అని చూపించింది. దీంతో బోటు నిర్వాహకులను పర్యటనకు రావచ్చా.. అని అడిగాం. వరద తగ్గిపోయింది ఇబ్బంది లేదని చెప్పడంతో బయలుదేరి వచ్చాం. తీరా ఇక్కడ ఇలా జరుగుతుందని అనుకోలేదన్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ప్రైవేటు బోటు.. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ప్రాణాలు పోయాయన్నా.. అని శివశంకర్ కన్నీటిపర్యంతమయ్యాడు. మీరు గట్టి నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నా.. అని విన్నవించాడు. ఆరోగ్యం ఎలా ఉంది? వరంగల్ జిల్లా కడిపి కొండకు చెందిన బసికె దశరథు వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును బాధితుడు ముఖ్యమంత్రికి వివరించారు. ఆస్పత్రిలో అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. వరంగల్ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన దర్శనాల సురేష్‌ను సీఎం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన నుంచి తేరుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇదే గ్రామానికి చెందిన గొర్రె ప్రభాకర్‌నూ సీఎం పరామర్శించి.. బోటులో ఎంత మంది ప్రయాణించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కడిపికొండ గ్రామానికి చెందిన బసికె వెంకట స్వామి, యాదగిరిలు సీఎంకు సంఘటన గురించి వివరిస్తూ.. తాము 14 మందిమి బోటులో వెళ్లగా ఐదుగురం బయటపడ్డామని, ఇద్దరి మృతదేహాలు లభించాయని, మరో ఏడుగురి ఆచూకీ తెలియలేదని వివరించారు. త్వరలోనే అన్ని మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సీఎం పేర్కొన్నారు. మా వాళ్ల ఆచూకీ తెలపండి సార్.. హైదరాబాద్ హయత్ నగర్‌కు చెందిన కె.అర్జున్, జర్నికుమార్లను పరామర్శించిన సీఎం జగన్‌ను చూసి అర్జున్ తండ్రి బోరున విలపించారు. ఈ ప్రమాదంలో తమ బిడ్డలు భరత్ కుమార్, విశాల్ గల్లంతయ్యారని తెలిపారు. త్వరలోనే వారి ఆచూకీ లభిస్తుందని, ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన సి.హెచ్ జానకి రామారావుతో ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తనతో పాటు భార్య శివజ్యోతి, బావ పవన్ కుమార్, సోదరి వసుంధర, వారి కుమారుడు సుశీల్‌లు బోటులో ప్రయాణించామని, ఇప్పుడు తానొక్కడినే మిగిలానని కన్నీటిపర్యంతమయ్యారు. వారి ఆచూకీ త్వరగా కనుక్కోవాలని కోరారు. కాగా, ప్రమాద స్థలిలో ఏరియల్ సర్వే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శ, సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి 3.20 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. -
పునరావృతం కారాదు
భర్తను, 12 ఏళ్ల బిడ్డను పోగొట్టుకుని తానెందుకు బతికి ఉన్నానో తెలియడం లేదని ఒక మహిళ పడుతున్న బాధను చూసినప్పుడు మనసు కలచివేసింది. భవిష్యత్‌లో మరో కుటుంబానికి ఈ కడుపుకోత రాకూడదు అనిపించింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధుల బృందం, రాజమహేంద్రవరం: ‘భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదు. ఎవరింటిలోనూ ఇలాంటి కడుపు కోత ఉండకూడదు. నిబంధనలు ఉన్నా అమలు చేయకుండా జీవోలకు పరిమితం కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు ఆపరేటర్లపై ఎవరికీ అధికారం లేకపోతే ఎలా? అవసరమైతే ప్రైవేటు లాంచీలను ఆపేయండి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నాను. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలి. మరో మూడు వారాల్లో నివారణ చర్యలు చేపట్టాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం ఉదయం ఆయన రాజమహేంద్రవరం చేరుకుని హెలికాఫ్టర్ ద్వారా ప్రమాద స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ప్రమాదం ఎలా జరిగిందీ, తర్వాత ప్రభుత్వం నుంచి సేవలు ఎలా అందుతున్నాయన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. చాలా బాధనిపించింది.. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడ్డానని, బాధితులను పరామర్శించినప్పుడు వారు చెబుతున్న మాటలు విని ఇంకా బాధనిపించిందని సీఎం అన్నారు. ప్రమాదానికి గురైన బోట్లో ఎంత మంది ఉన్నారు.. అందులో తెలంగాణా వారు ఎంత మంది.. ఆంధ్రా వాళ్లు ఎంతమంది? వాళ్లలో ఎంత మంది బయటపడ్డారు.. ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది? రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోందని సీఎం కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ మురళీధరరెడ్డి సమాధానం చెబుతూ 73 మంది వెళ్లారని, అందులో 41 మంది తెలంగాణా వారు, 24 మంది ఆంధ్రపదేశ్‌కు చెందిన పర్యాటకులు ఉండగా, ఎనిమిది మంది బోట్ సిబ్బంది ఉన్నారన్నారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయ్యారని, అందులో ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయని కలెక్టర్ చెప్పారు. చనిపోయిన వారిలో ఐదుగురు తెలంగాణ వారున్నారని చెప్పారు. బోటు ప్రమాదానికి గురైన చోట 315 అడుగుల లోతు ఉన్నట్లు రెస్క్యూ టీమ్‌లు గుర్తించాయని, రెండువైపులా కొండలు ఉండటం వల్ల అక్కడికి ఏ విధమైన పరికరాలు తీసుకువెళ్లడానికి వీలు లేకుండా ఉందన్నారు. కాకినాడ పోర్టుకు చెందిన టీమ్ అక్కడికి చేరుకుందని, వారి సూచనల మేరకు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద కూడా లైటింగ్ ఏర్పాటు చేసి వెతికిస్తున్నామని, గేట్లను కూడా దించి వేశామని చెప్పారు. ప్రతి అంశాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటి వరకు ఎన్ని బోట్లకు అనుమతులు ఇచ్చారని కాకినాడ పోర్టు అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంకు సంబంధించి 81 బోట్లకు అనుమతి ఇవ్వగా, అందులో 68 బోట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయన్నారు. వాటికి ఏడాదికి ఒకసారి లైసెన్స్ ఇస్తున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ లైసెన్స్‌లు ఇచ్చేటప్పుడు ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఏడాదికోసారి కాకుండా పీరియాడిక్‌గా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎంత వరద వచ్చినప్పుడు బోటు తిరగకూడదన్న అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని సూచించారు. గతంలో మొదటి ప్రమాద హెచ్చరిక అంటే పది లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వరకూ బోట్‌కు అనుమతి ఇవ్వవచ్చని, కానీ ఇప్పుడు ఐదు లక్షల క్యూసెక్కులకే బోటు ప్రమాదానికి గురైనందున తగిన పరిశీలన అవసరమన్నారు. కంట్రోల్ రూమ్ లేకపోతే ఎలా? కంట్రోల్ రూమ్ ఉండాలని జీవోలలో ఉన్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2018 నవంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఈ బోటుకు అనుమతి ఉందని, అయితే వరద ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ బోట్లు ఆపి ఉన్నాయని తెలిసి కూడా పోలీసులు ఆ బోటులోకి వెళ్లి ప్రయాణికుల ఫొటోలు తీసుకుని, బోటు మంచిగా ఉందా లేదా అని తనిఖీలు చేసి ఎలా వదిలిపెట్టారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బోట్లు ఆగినప్పుడు ఈ బోట్లు ఎందుకు తిరుగుతున్నాయో పోలీసులు ప్రైవేటు బోటు వాళ్లు ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ‘ఇరిగేషన్, పోలీస్, టూరిజం కలిపిన కంట్రోల్ రూమ్ అన్నదే లేదు.. లైసెన్స్‌లు ఇచ్చేవారు లైసెన్స్‌లు ఇస్తారు.. కంట్రోల్ రూమ్ ఉండదు. ప్రభుత్వ బోట్లను నియంత్రించే పరిస్ధితి ఉంది గానీ, ప్రైవేటు బోట్లను నియంత్రించే పరిస్థితి మాత్రం లేదు.. లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ బోటు పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకోనక్కరల్లేదా?’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రైవేటు బోట్ల మీద అజమాయిషీ చేయలేం అనుకున్నప్పుడు ఈ కంట్రోల్ రూములు ఎందుకని ప్రశ్నించారు. ‘ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల కోసం, ప్రస్తుత ఘటనపై విచారణకు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నా. సభ్యులుగా రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ, కమిటీ కన్వీనర్‌గా తూర్పు గోదావరి కలెక్టర్ ఉంటారు’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఘటనపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, 45 రోజులలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాను మరోసారి జిల్లాకు వచ్చేటప్పటికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, దానిని తానే ప్రారంభిస్తానని సీఎం చెప్పారు. పోర్టులను కూడా ఈ కంట్రోల్ రూమ్ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే ప్రమాదం ఈ ప్రమాదం బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, ఇందులో గత ప్రభుత్వ నిర్వాకం కనిపిస్తోందని తెలంగాణా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చారని, చాలా వరకు మృతదేహాలు కూడా దొరకలేదన్నారు. ప్రైవేటు ఆపరేటర్లపై ఎవరికీ అధికారం లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు బావుందని ప్రశంసించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, హోం మంత్రి సుచరిత, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, గొట్టేటి మాధవి, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, చెల్లుబోయిన వేణు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ నాయకులు అనంతబాబు, దవులూరి దొరబాబు, బొంతు రాజేశ్వరరావు, కవురు శ్రీనివాస్, ఆకుల వీర్రాజు, రౌతు సూర్య ప్రకాశరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏఆర్ అనురాధ, అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మిన్ తదితరులు పాల్గొన్నారు. భర్తను, 12 ఏళ్ల బిడ్డను పోగొట్టుకుని తానెందుకు బతికి ఉన్నానో తెలియడం లేదని ఒక మహిళ పడుతున్న బాధను చూసినప్పుడు మనసు కలచివేసింది. భవిష్యత్‌లో మరో కుటుంబానికి ఈ కడుపుకోత రాకూడదు అనిపించింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు నాకు సంబంధం లేదనుకోవడం ఒక పద్ధతి అయితే, దానిని సరిదిద్దుకోవడం మరో పద్ధతి. నేను రెండో పద్ధతినే ఎంచుకుంటున్నా. అందుకే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, చిన్న చిన్న గాయాలైన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇంతమంది ప్రాణాలు పోయాయంటే దీనికి కారణం ఎవరు? 2018లో ఇచ్చిన జీవోను గత ప్రభుత్వం అమలు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇందులో మన బాధ్యత కూడా ఉంటుంది. మన తప్పు మనం తెలుసుకోవాలి. ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. నేను ఇంకోసారి జిల్లాకు వచ్చేటప్పటికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. దానిని నేనే ప్రారంభిస్తాను. ప్రతి బోటును చెక్ చేసిన తర్వాతే పంపించాలి. -
ఘోర విషాదం
ప్రకృతి అందాల్ని వీక్షించేందుకు ఎంతో ఉత్సాహంగా పాపికొండల యాత్రకు బయల్దేరిన పర్యాట కులు ఊహించనివిధంగా పెను విషాదంలో చిక్కుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 73మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఘటన జరిగిన సమీపంలో 8 మృతదేహాలు లభ్యంకాగా 27మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగలిగారు. మరో 38మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద ప్రాంతం గురించి స్థానికులు చెబుతున్న అంశాలు గమనిస్తే పడవ నడిపినవారికి దాన్ని గురించి కాస్తయినా అవగాహనలేదని అర్ధమవుతుంది. ప్రమాద స్థలి కచ్చులూరు వద్ద 315 అడుగుల లోతుండగా, అక్కడ నది వెడల్పు కేవలం 300 మీటర్లేనని అంటున్నారు. పైగా దానికి సమీపంలోనే కొండ ఉండటం వల్ల నీటి ఉరవడి అధికంగా ఉంటుంది. పర్యవసానంగా అక్కడ సుడులు ఎక్కు వుంటాయి. కనుకనే పడవ నడపడంలో అనుభవం ఉన్నవారెవరూ అటువంటి ప్రాంతానికి వెళ్లే సాహసం చేయరు. కానీ అందుకు భిన్నంగా ఈ పడవను నడిపిన సరంగులిద్దరూ అటువైపు తీసు కెళ్లారు. తీరా తప్పును సరిదిద్దుకుని, అక్కడినుంచి బయటకు రావడం కోసం ఇంజను వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో స్టీరింగ్‌కు ఉన్న తీగ తెగి ఇంజన్ ఆగిపోయి, పడవ నిలిచిపోయింది. చివరకు ఆ సుడుల్లో చిక్కుకుని తలకిందులైంది. గల్లంతైన చాలామంది పర్యాటకుల్లో అత్యధికులు ఈ తలకిందులైన పడవ కింద చిక్కుకుని ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ బృందం అంచనా వేసింది. పడవ నడిపిన ఇద్దరూ ఈ ప్రాంతానికి చెందినవారు కాకపోవడం వల్లనే ప్రమాదాన్ని పసిగట్ట లేకపోయారని స్థానికులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈసారి గోదావరి, కృష్ణా నదులు రెండింటిలోనూ వరద నీరు అత్యధికంగా ఉంది. ముఖ్యంగా గోదావరిలో దాదాపు అయిదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. పడవ ప్రయాణం ఆహ్లాదకరంగా, సురక్షితంగా సాగాలంటే ఏం చేయాలో, ఎలాంటి ప్రమా ణాలు పాటించాలో, ఏయే విభాగాలు ఎలాంటి విధులు నిర్వర్తించాలో వివరించే పుస్తకాన్ని రెండేళ్ల క్రితం జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) విడుదల చేసింది. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో జల రవాణా తక్కువే. చవగ్గా అయ్యేందుకు, కాలుష్యం తగ్గించేందుకు జల మార్గాల వినియోగాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది. కనుక పడవల వినియోగం మున్ముందు మరింత పెరుగుతుంది. దానికి అవసరమైన ప్రమాణాలు ఖరారు చేసేందుకు మరింత నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పడవల యజమానులు, సిబ్బంది మొదలుకొని పర్యాటకుల వరకూ ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడాలి. ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం పెంచాలి. అలాగే నదీ జలాల మార్గాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో, ఏయే ప్రాంతాలవైపు పడవలు వెళ్లకూడదో తెలిపేవిధంగా స్థానికుల సాయంతో మాన్యువల్ రూపొందించాలి. పడవ నడిపేవారికి ఆ మాన్యువల్ క్షుణ్ణంగా తెలుసో లేదో... ప్రయాణ సమయాల్లో వారు పర్యాటకులకు ఎలాంటి సూచనలిస్తున్నారో, అవి అందరూ పాటిం చేలా ఏం చర్యలు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు చూసేందుకు పర్యవేక్షక వ్యవస్థ ఉండాలి. పడవ ప్రయాణం చేసేవారు లైఫ్ జాకెట్లు ధరించాలన్న నిబంధన ఉన్నా పలు సందర్భాల్లో దీన్ని పట్టించుకునేవారుండరు. చాలా ప్రమాదాల్లో లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్లే మరణాలు సంభ విస్తున్నాయి. అలాగే ప్రయాణికులు ప్రకృతి అందాలు చూసేందుకు అవగాహన లేమితో ఒకేవైపు చేరతారు. అది కూడా ప్రాణాంతకమవుతోంది. అలాగే వినియోగంలో ఉన్న పడవల భద్రతా ప్రమాణాలెలా ఉన్నాయో, వాటి సామర్థ్యం ఏపాటో చూడాలి. నిబంధనలు పాటించనివారిపై కేసులు పెట్టాలి. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న పడవకు వచ్చే నవంబర్ వరకూ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నదంటున్నారు. అయితే నిబంధనల ప్రకారం 20కి మించి ప్రయాణించే పడవకు రెండో ఇంజన్ ఉండాలి. కానీ దీనికున్న రెండో ఇంజన్ కాస్తా చెడిపోయింది. వివిధ కోణాల్లో సమగ్రంగా అన్ని అంశాలను పరిశీలించి అనుమతులిచ్చే నిర్దిష్టమైన వ్యవస్థ ఉంటే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమల్లోకి తెస్తామంటున్న వ్యవస్థ ఈ లోటు తీరుస్తుంది. ఆయన ప్రతిపాదించిన కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థలో నీటిపారుదల, పర్యాటక శాఖ వగైరాల భాగస్వామ్యం ఉంటుంది. అలాగే పడవల రాకపోకలపై నిఘా పెట్టేందుకు గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి వ్యవస్థలు అందుబాటులో లేనందువల్ల ఇన్నాళ్లూ ఎవరు ఎందుకు అనుమతులిస్తున్నారో, ఎందుకు నిరాకరిస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది. ఇది పడవ యజమానులకు వరంగా మారుతోంది. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న పడవను దేవీపట్నం వద్ద పోలీసులు తనిఖీ చేసి నిలిపేస్తే, తమకు పోలవరం పోలీసుల అనుమతి ఉందని చెప్పి నిర్వాహకులు పడవను తీసుకెళ్లారని చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించడం, దాని ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షించదగ్గది. ప్రమాద సమయంలో కచ్చులూరులోని అడవిబిడ్డలు ప్రదర్శించిన మానవీయత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాన్ని గమనించిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా వారు నాటుపడవల్లో బయల్దేరారు. లైఫ్ జాకెట్లు ధరించి కొట్టుకుపోతున్న వారెందరినో రక్షించారు. ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులైనవారు ఎలా స్పందించాలో వారు ఆచరించి చూపారు. గత 30 ఏళ్లలో గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదాల్లో వందమందికిపైగా కన్నుమూశారు. మున్ముందు ఇలాంటి ప్రమాదాలకు తావీయని రీతిలో అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తారని, ఈ విషాద ఉదంతం అందుకు ఒక గుణపాఠం కావాలని ఆశిద్దాం. -
బోటు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
-
ముచ్చటైన కుటుంబం..తీరని విషాదం
సాక్షి, తిరుపతి : కచ్చలూరు పడవ ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలు లభ్యంకాగా.. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రమాదంలో భర్త, కుమార్తెను కోల్పోయి... తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డ మధులత ఆస్పత్రిలో రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం భార్యాబిడ్డతో కలిసి ఆనందంగా జీవించేవారు. పెట్రోలు బంకు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం.. తన తండ్రి అస్తికలను గోదావరిలో కలపడానికి కుటుంబంతో వెళ్లి ఊహించని ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన ముద్దుల కూతురు చిన్నారి హాసిని కూడా పడవ ప్రమాదంలో మృతి చెందగా...భార్య మధులత సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం స్కూల్ తరఫున ఫీల్డ్ ట్రిప్‌కు వెళ్లాల్సిన హాసిని ఇలా అర్ధాంతరంగా తమను వీడి పోయిందంటూ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడసారి చూపు కోసం తమ స్నేహితురాలు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా ‘పడవ ప్రమాదంలో నా భర్త సుబ్రహ్మణ్యం, పాప హాసిని కనిపించకుండా పోయారు. ఇక నేను ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎలా బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే ఎంత బావుండు..’’అంటూ మధులత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబం గతంలో ముచ్చటగా గడిపిన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూసిన నెటిజన్లు.. ‘అయ్యోం పాపం. మరణంలోనూ వీడని బంధం’ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
వారి మాటలు విని చాలా బాధనిపించింది : సీఎం జగన్
సాక్షి, దేవీపట్నం : తూగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. గల్లంతైన వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించిప్పుడు వారు చెబుతున్న మాటలు విని చాలా బాధ పడ్డానన్నారు. ప్రమాద ఘటనపై రాజమండ్రి సబ్ కలెక్డర్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. లాంచీ ప్రమాద ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ఏం చర్యలు తీసుకున్నారని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. లాంచీ ప్రమాదం ఎలా జరిగిందని, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. గోదావరి నది లోపల 300 అడుగుల లోతులో లాంచీ మునిగిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మునిగిన లాంచీని వెంటనే వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విచారణ కోసం ప్రత్యేక కమిటీ ప్రమాద ఘటనపై విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిటీ చైర్మన్‌గా ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ, సభ్యులుగా రెవెన్యూ ఛీఫ్ సెక్రటరీ, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అదనపు డిజీ, తూర్పుగోదావరి కలెక్టర్లు ఉన్నారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, 45 రోజుల్లో చర్యలు ఉండాలని ఆదేశించారు. సమీక్షలో తెలంగాణా మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, అజయ్ కుమార్, ఏపి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి సుచరిత, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మంత్రులు కబ్నబాబు, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, అవంతి శ్రీనివాస రావు, అనీల్ కుమార్ యాదవ్, శ్రీరంగనాధరాజు, ఎంపిలు భరత్, వంగా గీత, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఎం జగన్ ఎదుట కన్నీరుమున్నీరైన మధులత
సాక్షి, రాజమండ్రి : బోటు ప్రమాద బాధితులందరికీ.. మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యులను ఆదేశించారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే వాళ్లందరినీ ఇళ్లకు పంపించాలని సూచించారు. బోటు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరించి... బాధితుల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని.. అందిరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన మధులత సీఎం ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. తన భర్త సుబ్రహ్మణ్యంతో పాటు, కుమార్తె హాసిని మరణించారని..తాను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నన్ను డాక్టర్లు బతికించారు. నా భర్త ఎప్పుడూ మీ గురించే చెప్పేవారు. కష్టాల్లో గుండె ధైర్యం తెచ్చుకుని ఎలా బతకాలో.. చెప్తూ మీ గురించి తరచుగా ప్రస్తావించేవారు. ఇప్పుడు మీరొచ్చి నాలో ధైర్యాన్ని నింపారు’ అని సీఎం జగన్ ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు. కాగా తెలంగాణలోని చిట్యాల మండలం వన్నిపాకంకు చెందిన బాధితులను కూడా సీఎం జగన్ పరామర్శించారు. ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన జానకి రామారావుకు ధైర్యం చెప్పారు. వరంగల్ జిల్లా కరిపికొండెం బాధితులను కూడా పరామర్శించి.. అందరికీ మంచి వైద్యం అందించాలని వైదుల్యకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా ఆస్పత్రి వద్దే సీఎం కలిశారు. మృతదేహాలు గ్రామాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు కన్నబాబు, ఆళ్లనాని, పినిపె విశ్వరూప్, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎంపీ మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. (చదవండి: బాధితులకు సీఎం జగన్ పరామర్శ) -
బోటు ప్రమాదానికి ముందు..
-
గోదారి నా కొడుకును మింగేసింది
సాక్షి, గన్నవరం (కృష్ణా జిల్లా): ‘పిల్లల చిన్నతనంలోనే వారి తండ్రి మరణించాడు.. ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించా.. పెద్దకొడుకు ప్రయోజకుడై చేతి పని నేర్చుకొని కుటుంబాన్ని ఆదుకుంటున్న సమయంలో గోదావరి నా కొడుకును మింగేసింది’ అంటూ బోరున విలపిస్తుంది బోటు ప్రమాదంలో గల్లంతైన అబ్దుల్ సలీమ్ తల్లి గౌసియా బేగం. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరుకు చెందిన అబ్దుల్ సలీమ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా సలీమ్ తల్లి గౌసియా మాట్లాడుతూ.. ‘నా కొడుకు ఇప్పటికే ఎన్నో పర్యాటక ప్రదేశాలు తిరిగాడు. పాపి కొండలు చూడాలనే కోరికతో తన స్నేహితులతో కలిసి బయలు దేరాడు. హనుమాన్ జంక్షన్ నుంచి ఐదుగురు స్నేహితులతో కలిసి పాపికొండలు చూడ్డానికి వెళ్లిన అబ్దుల్ సలీమ్ నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో గల్లంతైనాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సలీమ్ మేనమామ, పెద్దనాన్న సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇంతవరకు నా బిడ్డ ఆచూకీ తెలయలేదు’ అంటూ సలీమ్ తల్లి గౌసియా కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘మా అన్నకు చిన్నప్పటి నుంచి ప్రకృతి అందాలు చూడాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే స్నేహితులతో కలిసి ఎన్నో ప్రదేశాల్లో తిరిగాడు. ఇప్పుడు పాపి కొండలు చూడ్డానికి వెళ్లి గల్లంతైనాడు. గోదావరి పర్యటన అంటే మా అమ్మ ఒప్పుకోదని.. రాజమండ్రిలో స్నేహితుడి పెళ్లి అని చెప్పి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు’ అంటూ సలీమ్ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు -
27 మంది బయటపడ్డారు: ఏపీఎస్డీఎమ్ఏ
సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన కచ్చలూరు బోటు ప్రమాద ఘటన ప్రస్తుత పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రకృతి విపత్తుల నివారణ శాఖ(ఏపీఎస్డీఎమ్ఏ)పత్రికా ప్రకటన విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద పడవ ప్రమాదానికి గురైన సమయంలో... అందులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనలో 27 మంది సురక్షితంగా బయటపడగా... గల్లంతైన మరో 24 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇక ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించింది. ఈ మేరకు దేవీపట్నం తహసీల్దార్, ఐటీడీఏ ఏపీవో నుంచి వివరాలు అందినట్లు తెలిపింది. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆరు ఫైర్ టీమ్‌లతో పాటు, ఎనిమిది ఐఆర్ బోట్లు, 13 ఆస్కా లైట్లు, ఒక సాటిలైట్ ఫోన్ ఆధారంగా గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏపీఎస్డీఎమ్ఏ పేర్కొంది. ఈ బృందాలతో పాటు 2 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపడుతున్నాయని వెల్లడించింది. అదే విధంగా గజ ఈతగాళ్ల బృందం, నావికా దళ అధికారులు కూడా రక్షణ చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీని త్వరగా కనిపెట్టేందుకు ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక సైడ్ స్కానర్ ఎక్విప్మెంట్ను తీసుకువచ్చామని, దీంతో పాటు ఉత్తరాఖండ్ నుంచి ఆరుగురితో కూడిన నిపుణుల బృందం కూడా కచ్చలూరుకు చేరుకుందని పేర్కొంది. ఇక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 27 మందిలో 16 మందికి రంపచోడవరంలోని ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స జరిగిందని..అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని రాజమండ్రి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఏపీఎస్డీఎమ్ఏ తెలిపింది. వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు రాజమండ్రి ఆస్పత్రిలో వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు వెల్లడించింది. -
బోటు నిర్వాహకుడిపై కేసు నమోదు
సాక్షి, దేవీపట్నం : నిబంధనలకు విరుద్ధంగా బోటు నడిపి.. ప్రమాదానికి కారణమైన ప్రయివేటు టూరిజానికి చెందిన రాయల్ వశిష్ట పున్నమి బోటు నిర్వాహకుడు కోడిగుడ్ల వెంకటరమణపై దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. నిబంధనలు పాటించకుండా బోటు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని విశాఖపట్నానికి చెందిన వెంకటరమణపై దేవీపట్నం తహసీల్దార్ మహబూబ్అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిబంధల ప్రకారం బోటులో 60 మంది పర్యటకులతో పాటు 5 మంది సిబ్బంది ప్రయాణించాల్సి ఉండగా.. 71 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. బోటు తరిఖీ జరిగే దేవీపట్నం పోలీస్‌స్టేషన్ వద్దకు రాగానే పర్యటకులు అందరూ లైఫ్‌జాకెట్లు ధరించి ఉన్నారు. స్టేషన్ దాటాక వాటిని తీసేశారు. ఇక్కడే సిబ్బంది పర్యాటకులను కట్టడిచేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని నిర్థారించారు. సంబంధిత కథనాలు : నిండు గోదారిలో మృత్యు ఘోష ముమ్మరంగా సహాయక చర్యలు 30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి -
బాధితులకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, దేవిపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు (లాంచీ) ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఒకొక్క బాధితుడి దగ్గరకు వెళ్లి పరామర్శించి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తదితరులు ఉన్నారు. -
ఖమ్మంలో ఉలికిపాటు..
సాక్షి, నేలకొండపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలురు సమీపంలో పర్యాటకుల బోటు ఆదివారం మునిగిన సంఘటనలో జిల్లా వాసి ఒకరు ఉండడంతో అతడి కుటుంబం విలవిలలాడుతోంది. ఈ ప్రమాదంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా..నేలకొండపల్లి వాసి రేపాకుల విష్ణుకుమార్ అనే 33ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేలకొండపల్లికి చెందిన రేపాకుల సూరయ్య, రాంబాయి అతడి తల్లిదండ్రులు. తండ్రి నేలకొండపల్లిలో చిన్న దుస్తుల వ్యాపారం చేస్తుంటారు. అతని సోదరుడు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాడు. విష్ణు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలంగో రాజధానిలోనే ఉంటున్నాడు. తన స్నేహితులతో కలిసి గోదావరిలో విహారయాత్రకు వెళ్లాడు. అయితే..తాను ప్రాజెక్ట్ పనిమీద విశాఖ పట్టణం వెళుతున్నట్లు భార్య శ్రీలక్ష్మికి శనివారం ఫోన్లో తెలిపాడు. అయితే..ఆదివారం ఉదయం లాంచీలో వెళుతున్నట్లు ఫొటోలు పంపాడు. ఆ తర్వాత..తాను పాపికొండల పర్యటనకు వెళుతున్నట్లు మెసేజ్ పెట్టాడు. మధ్యాహ్నం సమయంలో పడవ ప్రమాద విషయం తెలియడంతో శ్రీలక్ష్మి తండ్రి టీవీలో చూసి బిడ్డకు తెలపడంతో ఆమె విలపిస్తూ..నేలకొండపల్లిలోని విష్ణు కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. గల్లంతైన విష్ణుకుమార్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. స్థానికంగా వీరు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. విష్ణు గోదావరిలో గల్లంతు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అతడి తండ్రి ప్రస్తుతం వ్యాపార నిమిత్తం గుంటూరు వెళ్లాడు. రాత్రి వరకు విషయం తెలియదు. గల్లంతైన విష్ణు భార్య శ్రీలక్ష్మి ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరింది. కాకినాడకు మంత్రి అజయ్ పయనం.. లాంచీ మునిగిన దుర్ఘటనలో గల్లంతైన వారిలో వరంగల్ జిల్లా కడిపికొండ వాసులు అధిక సంఖ్యలో ఉండడం, ఖమ్మం జిల్లా నుంచి ఒకరు ఉండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయక చర్యలకు ఆదేశించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేసీఆర్ సూచనలతో ఆదివారం ఏపీలోని కాకినాడకు బయల్దేరి వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ముగ్గురు తహసీల్దార్లు సూపర్‌బజార్(కొత్తగూడెం): తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం వద్ద ఆదివారం జరిగిన లాంచీ ప్రమాద ఘటనలో బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు జిల్లా నుంచి ముగ్గురు తహసీల్దార్లను అక్కడికి పంపారు. ఈ మేరకు కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. మణుగూరు తహసీల్దార్ మంగీలాల్, ఇల్లెందు తహసీల్దార్ శ్రీనివాసరావు, సుజాతనగర్ తహసీల్దార్ ప్రసాద్ వెళ్లారని వివరించారు. లాంచీ ప్రమాద వివరాలకు హెల్ప్లైన్లు కొత్తగూడెంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు తెలుసుకునేందుకు జిల్లాలోని ఎస్పీ, ఏఎస్పీ కార్యాలయాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్ నుంచి వెళ్లి ప్రాణాలతో ఉన్న, మృతిచెందిన వారి వివరాల కొరకు వారి కుటుంబ సభ్యులు భద్రాద్రి జిల్లా కలెక్టర్ 9490636555, ఎస్పీ8332861100, భద్రాచలం ఏఎస్పీ, 94407 95319, సీఐ9440795320 నంబర్లలో సంప్రదించవచ్చుని పోలీస్ అధికారులు సూచించారు. -
బాధితులకు సీఎం వైఎస్ జగన్ పరామర్శ
-
బోటు ప్రమాదానికి 5 నిమిషాల ముందు..
సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మృత దేహాలను వెలికితీశారు. బోటు 315 అడుగుల లోతుకు మునిగిపోయినట్లుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా తీసుకున్న వీడియో ఒకటి ఇప్పడు బయటకు వచ్చింది. ప్రమాదాన్ని ఊహించని వారంతా సరదాగా డాన్స్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. అంతలోనే బోటు ఒక్కసారిగా కుదుపునకు గురై మునిగిపోయింది. క్షణాల్లో ఊహించని పరిణామం ఎదురై వారి ఆనంద క్షణాలను నీటిలో కలిపేశాయి. -
విహారం.. విషాదం
సాక్షి, మంచిర్యాల (హాజీపూర్): విహారయాత్ర తీవ్ర విషాదం నింపింది. విద్యుత్‌శాఖలో జరిగిన సమావేశానికి వరంగల్‌కు వెళ్లిన జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు అటు నుంచి అటే స్నేహితులతో కలిసి పశ్చిమగోదావరి జిల్లాలోని పాపికొండల యాత్రకు వెళ్లారు. అక్కడ పడవ మునిగిపోవడంతో వీరూ గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి కారుకూరి సుదర్శన్–భూమక్క దంపతుల కుమార్తె రమ్య, కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు రామయ్య–శాంతమ్మ కుమారుడు లక్ష్మణ్ ఇటీవల విద్యుత్‌శాఖలో సబ్ æఇంజినీర్లుగా ఉద్యోగాలు సాధించారు. ఆదివారం వరంగల్‌లో ఇతర స్నేహితులతో కలిసి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనలో విహార యాత్ర సాగిస్తున్న పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. చదువులో ఆదర్శం రమ్య నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి రమ్య తండ్రి సుదర్శన్ పాతమంచిర్యాల సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చదువులో చిన్ననాటి నుంచి రాణిస్తూ తోటి స్నేహితులకు చదువులో సహకరిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండేది. తండ్రి విద్యుత్‌శాఖలో ఉద్యోగం చేస్తుండటంతో తానూ విద్యుత్ శాఖలోనే కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కొత్తగా విద్యుత్‌శాఖలో జరిగిన నియామకాల్లో ఉద్యోగం సాధించిన రమ్య కుమురంభీం జిల్లాలో సబ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ తనదైన ముద్రతో ముందుకెళ్తున్న రమ్య నెలరోజుల్లోనే తగిన గుర్తింపు సాధించింది. మొదటి నెల వేతనం కూడా అందుకుంది. దీంతో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాతగా వినాయక విగ్రహాన్ని అందజేసి వినాయక పూజల్లో పాల్గొనడమే కాకుండా నిమజ్జన ఉత్సవంలో పాల్గొని స్థానికులతో కలిసి ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడింది. రమ్యకు ఒక సోదరుడు రఘు ఉన్నాడు. బీటెక్ పూర్తి చేసిన రఘు ఢిల్లీలో సివిల్స్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇరవై మూడేళ్ల తన సోదరి రమ్య గల్లంతు సమాచారంతో రఘు హుటాహుటినా బయలుదేరాడు. కష్టపడి ఉద్యోగం సాధించి... హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మణ్ తండ్రి రామయ్య సింగరేణి ఉద్యోగి కాగా పదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి శంకమ్మతోపాటు మొత్తంగా ముగ్గురు సంతానం కాగా పెద్ద సోదరుడు తిరుపతి సింగరేణిలో ఉద్యోగం చేస్తుండగా ఇద్దరు కవలలు ఉన్నారు. కవలలు అయిన రామ్–లక్ష్మణ్‌లలో రామ్ ప్రభుత్వ ఉద్యోగి కాగా ఇరవై ఆరేళ్ల లక్ష్మణ్ ఇటీవల విద్యుత్‌శాఖలో సబ్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి నిర్మల్ జిల్లా భైంసాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. లక్ష్మణ్ మృతదేహం ఆచూకీ లభ్యం బొడ్డు లక్ష్మణ్(26) మృతదేహం ఆచూకీ లభించింది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోదావరి తీరంలో గజ ఈతగాళ్ల గాలింపు చర్యలో భాగంగా ఈయన దేహం లభించినట్లు తెలుస్తోంది. క్షేమంగా వస్తాడు అనుకున్న గ్రామస్తులు, సభ్యులకు లక్ష్మణ్ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకోగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామాల్లో విషాదచాయలు నంనూర్ గ్రామానికి చెందిన రమ్య, కర్ణమామిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ పడవ ప్రమాదంలో గల్లంతు కావడంతో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రాత్రి వరకు గల్లంతైన ఇరువురి ఆచూకీ లభించకపోవడంతో గ్రామాల్లో వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. గల్లంతైన ఇరువురు ప్రాణాలతో బయటపడాలని గ్రామాల్లో పూజలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పడవ మునక సమాచారం తెలిసిన వెంటనే భద్రాచలం బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో బంధువులు, స్నేహితులు కంట్రోల్‌రూంకు పదేపదే ఫోన్ చేస్తూ వారి ఆచూకీ గురించి తెలుసుకుంటున్నారు. -
లాంచీలోనే చిక్కుకుపోయారా?
సాక్షి, దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో గోదావరిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో బోటు (లాంచీ) 315 అడుగుల లోతులో మునిగిపోయినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ గుర్తించింది. లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహం ఉధృతంగా ఉండటంతో లాంచీని వెలికితీసేందుకు ఎక్కువ సమయం పడుతోందని ఎన్డీఆర్ఎఫ్ వెల్లడించింది. గల్లంతైన వారిలో చాలా మంది లాంచీలో చిక్కుకుపోయి ఉండే అవకాశముందని ఎన్డీఆర్ఎఫ్ భావిస్తోంది. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తో ఓఎన్జీసీ చాప్టర్ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లు గాలింపు జరుపుతున్నారు. నల్గొండ యువ ఇంజినీర్లు గల్లంతు లాంచీ ప్రమాదంలో నల్గొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఇద్దరు యువ ఇంజినీర్లు గల్లంతయ్యారు. అనుముల మండలం హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్, రామడుగు గ్రామానికి చెందిన పాశం తరుణ్ రెడ్డి గల్లంతయ్యారు. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు స్నేహితులు కలిసి విహారాయాత్రకు వెళ్లారు. వీరిలో నలుగురు బయటపడ్డారు. ముగ్గురు గల్లంతయ్యారు. ముగ్గురిలో హేమంత్ అనే యువకుడిది వరంగల్ జిల్లా. విహారాయాత్రకు వెళ్లిన ఈ ఏడుగురు ఇంజినీర్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. తమ పిల్లలు బోట్ ప్రమాదంలో చిక్కుకున్నారనే వార్త తెలియగానే హాలియా, రామడుగులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన బిడ్డ ప్రాణాలతో తిరిగి రావాలని తల్లులు తల్లడిల్లిపోతున్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు రాజమండ్రి బయలుదేరారు. సంబంధిత కథనాలు.. గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం మేమైతే బతికాం గానీ.. తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి.. నిండు గోదారిలో మృత్యు ఘోష అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే -
సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే
-
‘ఇప్పటివరకు 8 మృతదేహాలకు పోస్టుమార్టం’
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం ఘటనపై మంత్రి ఆళ్లనాని మీడియాతో సోమవారం మాట్లాడారు. ప్రమాద ఘటనలో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రమాద ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారని.. అనంతరం బాధిత కుటుంబాలను కలుసుకుంటారని ఆయన చెప్పారు. ఇప్పటికే 8 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని తెలిపారు. బాధితుల బంధువులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. (చదవండి : బోటు ప్రమాదం: 315 అడుగుల లోతులో లాంచీ) ప్రమాదం నుంచి బయటపడ్డ 26 మందికి వైద్య సేవలందించామని తెలిపారు. ఒక వ్యక్తి కాలుకు ఫ్యాక్చర్ అయిందని, డాక్టర్లు సేవలందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సీఎం జగన్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గుర్తు చేశారు. బోటు ఓనరును విశాఖకు చెందిన కోడిగుడ్ల వెంకటరమణగా గుర్తించామని తెలిపారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని మంత్రి కన్నాబాబు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. (చదవండి : అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే) -
నేనెవరికోసం బతకాలి ?
-
రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టాం
-
నల్లగొండలో గోదా'వర్రీ'
సాక్షి, హాలియా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నదిలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో నల్లగొండకు చెందిన తరుణ్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇతని వివరాలు తెలియరాలేదు. అలాగే హాలియాకు చెందిన సురభి రవీందర్ ఉన్నాడు. చిట్యాల మండలం వనిపాకలకు చెందిన కిరణ్‌కుమార్, చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్ సురక్షితంగా బయటపడ్డారు. వీరిద్దరు రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా వీరంతా హైదరాబాద్‌లో పోలీస్‌శాఖలోని హౌసింగ్ కార్పొరేషన్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితులతో కలసి పాపికొండలు వెళ్లారు. కాగా లాంచీ నీట మునగడంతో వీరి విహారయాత్ర విషాదాంతమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక శాఖకు చెందిన లాంచీ మునిగిన ప్రమాదంలో ఉమ్మడి జిల్లా వాసులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ఉమ్మడి జిల్లా వాసులు ఉండగా ఇద్దరు గల్లంతు కాగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన లాంచి ప్రమాదంలో హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్(22) గల్లంతైనట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన సురభి వెంకటేశ్వర్లు, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడు సురభి రవీందర్ గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వరుసగా శని, ఆదివారాలు సెలవులు కావడంతో హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితులు రాజేష్, తరుణ్‌తో పాటు వరంగల్‌కు చెందిన సురేష్, రాజేందర్‌తో కలిసి టూరిస్టు బస్సులో భద్రాచలానికి బయలు దేరారు. అక్కడ దైవ దర్శనం చేసుకున్న అనంతరం గోదావరిలో లాంచీలో విహారయాత్ర చేసేం దుకు బస్సులో రాజమండ్రికి వెళ్లారు. అక్కడే సురభి రవీందర్ తన స్నేహితులతో కలిసి రాజమండ్రిలో లాంచీ ఎక్కారు. తన స్నేహితులతో కలిసి రాజమండ్రి నుంచి భద్రాచలం వస్తుండగా మార్గ మధ్యలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో ప్రమాదశాత్తు నదిలో మునిగిపోయింది. దాంతో రవీందర్‌తో పాటు తన వెంట వచ్చిన హైదరాబాద్, వరంగల్‌కు చెందిన ఆయన స్నేహితులు గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలిసిన రవీందర్ తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలా నికి బయలు దేరారు. అలాగే ఈ ప్రమాదంలో నల్లగొండకు చెందిన తరుణ్‌రెడ్డి కూడా గల్లం తైనట్లు సమాచారం. బయటపడిన గల్లా శివశంకర్ చింతలపాలెం: దేవీపట్నం వద్ద పర్యాటక లాంచీ నీట మునిగిన ప్రమాదం నుంచి ప్రాణా లతో బయటపడిన గల్లా శివశంకర్ చింతల పాలెం మండలం గుడి మల్కాపురం వాసి. శివశంకర్ గల్లా పెదలక్ష్మయ్య, ధనలక్ష్మి కుమారుడు. ఈ యన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏఈగా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు అదే డిపార్ట్మెంట్లో పని చేస్తున్న మరో ఏడుగురు స్నేహితులు కూడా అక్కడకు వెళ్లినట్లు సమాచారం. చిట్యాలవాసి సురక్షితం చిట్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పర్యాటక శాఖకు చెందిన లాంచీ మునిగిన ప్రమాదం నుంచి నల్లగొండ జిల్లా చిట్యాల మండలవాసి సురక్షితంగా బయటపడ్డాడు. చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన మేడి కిరణ్ కుమార్ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నివా సం ఉంటూ సరూర్‌నగర్‌లోని పోలీస్‌శాఖ హౌ సింగ్ ప్లానింగ్ విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన స్నేహితులతో కలిసి పాపికొండల విహారయాత్రకు వెళ్లాడు. కాగా అక్కడ పడవ మునక ప్రమాదం నుంచి ఆయన ప్రా ణాలతో బయటపడి రంపచోడవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ప్రస్తు తం క్షేమంగానే ఉన్నాడు. దాంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: నిండు గోదారిలో మృత్యు ఘోష -
బోటు ప్రమాదం
-
ప్రమాద ఘటనపై విజయసాయిరెడ్డి ట్వీట్
సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘గోదావరిలో దేవీపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలు రూపొందించి అమలు చేయాలి’అని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’ అని ప్రధాని మోదీ ట్విట్ చేశారు. -
కచ్చులూరుకు బయలు దేరిన సీఎం జగన్
-
విషాదంలో బాధితుల కుటుంబ సభ్యులు
-
బోటు ప్రమాదం: గోదావరికి భారీగా వరద ఉధృతి
సాక్షి, తూర్పుగోదావరి : బోటు ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న క్రమంలో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో సహాయ బృందాలకు తీవ్ర ఆటంకం ఏర్పడి, బోటు వెలికితీతకు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 8 మృతదేహాలను వెలికి తీసి ఆరు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే ఇంకా 38 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా 315 అడుగుల లోతులో మునిగిపోయిన బోటును ఎన్డీఆర్ఎఫ్ గుర్తించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టగా, వరద ఉధృతి పెరగడంతో మంగళవారం కొనసాగించనున్నారు. ఈ ఘటననపై కొనసాగుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లైంతైన వారిలో అధికశాతం లాంచీలోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు సీఎం జగన్ ఆదేశం: కన్నబాబు గతంలో జరిగిన తప్పిదాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. దీనికి తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, వీటి ఏర్పాటులో పోలీస్, ఇరిగేషన్, టూరిజం విభాగాలు భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. కచులూరు సమీపంలో జరిగిన బోటు ప్రమాదంపై మంత్రి కురసాల కన్నబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనపై చలించిపోయిన సీఎం జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. బోటు నిర్వహణపై జీవో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం.. బాధ్యులను గుర్తించలేదని కన్నబాబు మండిపడ్డారు. బోట్లకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలో ఇరిగేషన్ అధికారులు గుర్తించాలని, ప్రతి నెల ఫిట్నెస్ తనిఖీలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పర్యాటక బోట్ల స్థితిగుతలపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ ఘటన అనంతరం ఆదివారం నుంచి రాష్ట్రంలో లాంచీల అనుమతులు రద్దు చేస్తున్నట్లు, ఫిట్నెస్ అనుమతులు తీసుకున్నాకే వాటిని అనుమతించనున్నట్లు మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. బోటు నిర్వాహకుడు వెంకటరమణపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదమే కారణం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో జరిగిన బోటు దుర్ఘటనపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవేటు బోట్లపై ప్రభుత్వానికి ఆజమాయిషీ లేకుండా టీడీపీ ప్రభుత్వం జీవో ఎలా జారీ చేసిందని ప్రశ్నించారు. ప్రమాదానికి నూరు శాతం గత ప్రభుత్వ తప్పిదమే అని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం తప్పుడు జీవో ఇవ్వడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని, ఈ పాపమంతా గత ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించిందని, అన్ని శాఖల అధికారులు బాగా పనిచేశారని మంత్రి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా 33మందిని గుర్తించాల్సి ఉంది: పిల్లి సుభాష్ చంద్రబోస్ కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో ఇంకా 33 మందిని గుర్తించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన సీఎం జగన్..ఇక మీదట ప్రతినెల బోటు ఫిట్నెస్ చేయాలని ఆదేశించారన్నారు. భవిష్యత్తులో జరిగే ప్రమాదాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. 2017 నవంబర్ 16న టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో లోపభూయిష్టంగా ఉందని పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. గత ప్రభుత్వం ఫిట్నెస్ పోర్ట్‌ట్రస్ట్‌కు ఇచ్చి, బోటు అనుమతులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించలేదని పిల్లి చంద్రబోస్ మండిపడ్డారు. బోటు ప్రమాదంపై సీఎం జగన్ సీరియస్ బోటు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. గల్లంతైన వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై రాజమండ్రి సబ్ కలెక్డర్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. లాంచీ ప్రమాద ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ఏం చర్యలు తీసుకున్నారని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. లాంచీ ప్రమాదం ఎలా జరిగిందని, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. గోదావరి నది లోపల 300 అడుగుల లోతులో లాంచీ మునిగిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మునిగిన లాంచీని వెంటనే వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ పేర్కొంది. బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి ప్రకృతి విపత్తుల నివారణ శాఖ అధికారులు నివేదిక అందించారు. ఇప్పటి వరకు 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని, మిగిలినవారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని తెలిపారు. ‘బోటులో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలు దొరికాయి. 24 మంది గల్లంతయ్యారు. 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. గల్లంతైనవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6 ఫైర్ టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. శాటిలైట్ ఫోన్, 12 ఆస్కాలైట్లు, 8 బోట్లను ఉపయోగిస్తున్నాం. రెండు ఎన్డీఆర్ఎప్ బృందాలు, మూడు రాష్ట్ర బృందాలు పని చేస్తున్నాయి. ఇండియన్ నేవీ నుంచి ఒక డీప్ డైవర్స్ బృందం పని చేస్తోంది. రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్జీసీ ఛాపర్‌ను వాడుతున్నాం’ అని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ పెర్కొంది. బాధితులకు సీఎం జగన్ పరామర్శ బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఒక్కొక్క బాధితుడి దగ్గరకు స్వయంగా వెళ్లి ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తదితరులు ఉన్నారు. 315 అడుగుల లోతులో లాంచీ గోదావరిలో మునిగిన బోటును ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కనుగొంది. లాంచీ 315 అడుగుల లోతుకు మునిగిపోయినట్లుగా గుర్తించారు. ఎక్కువ లోతు, ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లాంచీ వెలికి తీసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ బృందం తెలిపింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. సీఎం జగన్ ఏరియల్ సర్వే బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. మరో నాలుగు మృతదేహాలు వెలికితీత ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మరో నాలుగు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12 కి చేరింది. తాజాగా వెలికి తీసిన మృతదేహాల్లో నెలల వయస్సున్న చిన్నారి కూడా ఉండటం పలువురిని కలిచివేస్తోంది. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బోట్లతో విస్రృతంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాల తరలింపుకు అంబులెన్స్‌ల ఏర్పాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని మంత్రి కన్నాబాబు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి బోటు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘గోదావరిలో దేవీపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలు రూపొందించి అమలు చేయాలి’అని పేర్కొన్నారు. కచ్చులూరుకు సీఎం జగన్ అమరావతి: సోమవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి బయలుదేరారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శిస్తారు.సీఎం జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, సుచరిత ఉన్నారు. ధవళేశ్వరం వద్ద కుండపోత వర్షం ధవళేశ్వరం వద్ద గేట్లు మూసివేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు బోట్లతో గోదావరిలో గాలింపు జరుపుతున్నారు. లాంచీ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం కాటన్ బ్రిడ్జి వద్ద వలల వేయించారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద కుండ పోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాద ప్రాంతాన్ని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మీ, వైఎస్సార్సీపీ నేత ఉదయ భాస్కర్ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టామని మంత్రి అవంతి తెలిపారు. ముమ్మరంగా సహాయక చర్యలు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్ బృందాలు, 12 ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక నావీ చాప్టర్, ఓఎన్జీసీ చాప్టర్ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. సంబంధిత కథనాలు నిండు గోదారిలో మృత్యు ఘోష ముమ్మరంగా సహాయక చర్యలు 30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి -
బోటులో వెళ్లినవారు వీరే..
సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో గోదావరిలో జరిగిన బోటు (లాంచీ) మునిగిపోయిన విషాద ఘటనలో 37 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వీరి కోసం సహాయ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తమ వారి కోసం బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన 23 మంది రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తక్షణమే స్పందించడంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం వద్ద గేట్లు మూసివేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు బోట్లతో గోదావరిలో గాలింపు జరుపుతున్నారు. లాంచీ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం కాటన్ బ్రిడ్జి వద్ద వలల వేయించారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద కుండ పోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. 12 మంది విశాఖ వాసుల గల్లంతు పాపికొండల్లో విహార యాత్ర, తర్వాత భద్రాచలం తీర్థయాత్ర రెండూ కలిసివస్తాయని బయలుదేరిన విశాఖకు చెందిన 13 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో లాంచీ ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిలో ఒక్కరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు చిన్నారులు సహా మిగతా 12 మంది ఆచూకీ తెలియక బాధితుల కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకెళ్తే.. అనకాపల్లి మండలంలోని గోపాలపురం సమీపంలోని చేనుల అగ్రహారానికి చెందిన పెద్దిరెడ్డి దాలమ్మ (45), భూసాల లక్ష్మి (45), బోనుల పూర్ణ (18), సుస్మిత (3)తోపాటు విశాఖ కేజీహెచ్ సమీపంలోని రామలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న దాలమ్మ కుమార్తె, అల్లుడు మధుపాడ అరుణ, మధుపాడ రమణబాబు, వారి పిల్లలు అఖిలేష్ (7), కుశాలి (5), అలాగే వారి బంధువులు వేపగుంటకు చెందిన బి.లక్ష్మి (30), ఆమె కుమార్తె పుష్ప (15), ఆరిలోవ దుర్గాబజారుకు చెందిన టి.అప్పలనర్సమ్మ (60), ఆమె మనవరాళ్లు గీతా వైష్ణవి (3), ధాత్రి అనన్య (1) ఆదివారం తెల్లవారు జామున విశాఖ నుంచి రైలులో రాజమహేం ద్రవరం వెళ్లారు. అక్కడి నుంచి గండిపోచమ్మ గుడి దగ్గరకు వెళ్లి లాంచీలో పాపికొండలకు బయల్దేరారు. లాంచీ ప్రమాదానికి గురవడంతో 13 మందిలో భూసాల లక్ష్మి మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. మిగతావారంతా గల్లంతయ్యారు. వారిలో రమణబాబు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తమ కుటుంబసభ్యుల జాడ తెలియకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోదావరి బోటు ప్రయాణ బాధితుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కాకినాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ : 18004253077కు వరంగల్, విశాఖ, హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. సంబంధిత వార్తలు... నిండు గోదారిలో మృత్యు ఘోష ముమ్మరంగా సహాయక చర్యలు మేమైతే బతికాం గానీ.. గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి.. కన్నీరు మున్నీరు అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే -
ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం ప్రాంతాన్ని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మీ, వైఎస్సార్సీపీ నేత ఉదయ భాస్కర్ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టామని మంత్రి అవంతి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బందాలు గల్లంతైన వారికోసం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని వెల్లడించారు. అనుమతుల్లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని అవంతి స్పష్టం చేశారు. హైవేపై పెట్రోలింగ్ జరిగినట్లే గోదావరిలో బోట్ పెట్రోలింగ్ జరగాలని అభిప్రాయపడ్డారు. (చదవండి : కచ్చులూరుకు సీఎం జగన్) (చదవండి : అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే) -
అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: వరదల సమయంలో దేవీపట్నం మండలం కచ్చులూరు మందం ప్రాంతాన్ని దాటడమంటే ప్రాణాలతో చెలగాటమే. ఎంతో అనుభవం గల సరంగులు సైతం అక్కడ సుడిగుండాలను దాటి వెళ్లడానికి వెన్నులో వణుకు పుడుతుంది. ఆదివారం బోటు ప్రమాదానికి గురైన ప్రాంతం కూడా అదే. వరద సమయంలో భద్రాచలం నుంచి వచ్చే వరద నీరు పాపికొండలు నుంచి కొండమొదలు వరకు వేగంగా ప్రవహిస్తూ.. కచ్చులూరు వద్ద కొండను తాకి సుడులు తిరుగుతుంది. ప్రమాదానికి గురైన బోటు నడిపిన సరంగులు సంగాడి నూకరాజు, సత్యనారాయణ ఆ ప్రాంతం వద్ద గోదావరి ఉధృతిని అంచనా వేయడంలో విఫలమయ్యారని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా సరంగులు మంటూరు నుంచి బోటును నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తూటుగుంట వైపునకు మళ్లించి.. గోదావరి ఒడ్డు వెంబడి నడుపుతారు. తరువాత తూర్పు గోదావరి జిల్లాలోని గొందూరు వైపు ప్రయాణం చేస్తారు. ప్రమాదానికి గురైన బోటు నడిపిన సరంగులు నేరుగా కచ్చులూరు మందం వైపు ప్రయాణించారు. దీనివల్ల బోటు ప్రమాదానికి గురై మునిగిపోయింది. గోదావరిపై పోశమ్మ గండి వద్ద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడంతో టూరిజం బోటు పాయింట్‌ను పశ్చిమ గోదావరి జిల్లా సింగన్నపల్లి కంపెనీ వద్ద, తూర్పు గోదావరి జిల్లా పోశమ్మ గండి వద్ద అనధికారికంగా ఏర్పాటు చేశారు. గతంలో ఈ బోటు పాయింట్లు పురుపోత్తపట్నం, పట్టిసీమ వద్ద ఉండేవి. దేవీపట్నం పోలీస్ స్టేషన్ మీదుగా పాపికొండలుకు వెళ్లే ప్రతి బోటును అక్కడి పోలీసులు తనిఖీ చేసేవారు. సింగన్నపల్లి నుంచి బయలుదేరిన ఈ బోటును తనిఖీ చేసేందుకు ఎక్కడా పోలీస్ స్టేషన్లు లేవు. సంబంధిత వార్తలు... నిండు గోదారిలో మృత్యు ఘోష ముమ్మరంగా సహాయక చర్యలు మేమైతే బతికాం గానీ.. గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి.. కన్నీరు మున్నీరు -
గోపాలపురంలో విషాద ఛాయలు
సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: పాపికొండలను వీక్షించేందుకు వెళ్లిన అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం పాపికొండలకు వెళ్లేందుకు బోటు ఎక్కిన గోపాలపురానికి చెందిన నలుగురిలో ముగ్గురు ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తమవారు క్షేమంగా ఇంటికి చేరాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మరోపక్క గ్రామంలో నిశ్శబ్ద వాతావరం నెలకొంది. గల్లంతయిన వారి యోగక్షేమాలు తెలియకపోవడంతో ఏం జరుగుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. గోపాలపురానికి చెందిన పెదిరెడ్డి దాలమ్మ(45), తన సోదరీమణి భూసాల లక్ష్మితో కలిసి పాపికొండలకు వెళ్లాలని భావించారు. వీరితో పాటు లక్ష్మి మనుమరాలు సుస్మిత(3)తో పాటు పక్కింటి అమ్మాయి భూసాల పూర్ణ(18)ను కూడా తీసుకువెళ్లారు. లక్ష్మి కుమార్తె అరుణకు చేనుల అగ్రహారానికి చెందిన రమణతో పెళ్లి అయ్యింది. చేనుల అగ్రహానికి చెందిన మధుపాడ రమణ, అరుణ దంపతులు ప్రస్తుతం విశాఖ పట్నంలోని ఆరిలోవలో ఉంటున్నారు. గోపాలపురానికి చెందిన నలుగురితో పాటు, ఆరిలోవలో ఉంటున్న రమణ, అరుణ దంపతులతో పాటు వారి పిల్లలు అఖిలోష్, కుషాలిలతో కలిపి ఎనిమిది మంది శనివారం సాయంత్రం రైలులో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లారు. అక్కడి నుంచి బోటులో పాపికొండలకు వెళ్తుండగా బోటు బోల్తాపడి అందులో ఉన్నవారు గల్లంతుకాగా, భూసాల లక్ష్మి సురక్షితంగా బయటపడింది. ఈమెను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మితో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఫోన్లో మాట్లాడి ఆమె పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గోపాలపురానికి వెళ్లి బాధిత కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబీకులను రంపచోడవరం ప్రాంతానికి తరలించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా గ్రామంలో విషాదఛాయలు ఏర్పడటంతో తహసీల్దార్ వైఎస్ వీవీ ప్రసాద్, ఎస్సై రామకృష్ణలు గోపాలపురానికి చేరుకున్నారు. మరోవైపు గోపాలపురంలోని బాధిత కుటుంబీకులు అంతా రోదనలో మునిగిపోయారు. వీరిని స్థానికుడైన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగన్‌లు పరామర్శించారు. లక్ష్మి సురక్షితంగా ఉన్నప్పటికీ పెదిరెడ్డి దాలమ్మ, పూర్ణ, సుశ్మితలు ఎక్కడున్నారనే ఆందోళనతో స్థానికులు ఉన్నారు. ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్ కూడా బాధిత కుటుంబీకుల్ని పరామర్శించారు. వేపగుంటలో విషాదం పెందుర్తి: బోటు ప్రమాదంలో వేపగుంట ప్రాంతానికి చెందిన తల్లీ కూతురు గల్లంతయ్యారన్న సమాచారంతో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. వేపగుంట ముత్యమాంబ కాలనీకి చెందిన బొండా శంకర్రావు, లక్ష్మి(37) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పాపికొండలకు వెళ్లేందుకు నగరంలోని బంధువులతో కలిసి ఆదివారం వేకువజామున లక్ష్మి, పెద్ద కుమార్తె పుష్ప బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో తల్లీ కుమార్తెలు గల్లంతుకావడంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి వీరితోపాటు శంకర్రావు, చిన్న కుమార్తె కూడా వెళ్లాల్సి ఉండగా ఇంటి వద్ద పని ఉండడంతో ఉండిపోయారు. అప్రమత్తమైన కలెక్టర్.. మహారాణిపేట(విశాఖ దక్షిణ): గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ జిల్లా వాసులు ఉండటంతో కలెక్టర్ వి.వినయ్‌చంద్ అప్రమత్తమయ్యారు. తక్షణం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్ ప్రకటించారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఆర్డీవో కిశోర్, టూరిజం అధికారులను పంపారు. అలాగే బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించాలని మహారాణిపేట తహసీల్దార్‌ను ఆదేశించారు. షాక్‌లో భూసాల లక్ష్మి.. అనకాపల్లి: పాపికొండలకు వెళ్తూ బోటు బోల్తా పడిన ఘటనలో సురక్షితంగా బయటపడిన భూసాల లక్ష్మి తీవ్ర షాక్‌లో ఉంది. పడవ మునిగిన తర్వాత ఎలా ఒడ్డుకు చేరానో తెలియలేదంటూ ఆమె సాక్షికి తెలిపింది. తన వారు ఏమయ్యారంటూ ఆందోళనగా ప్రశ్నిస్తోంది. రంపచోడవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను కుటుంబీకులు ఓదార్చే ప్రయత్నం చేశారు. మిగిలిన వారంతా మరో ఆస్పత్రిలో ఉన్నారని లక్ష్మి సర్దిచెప్పినప్పటికీ ఆమె షాక్ నుంచి కోలుకోలేదు. కాగా ఫోన్లో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబీకులకు వెన్నుదన్నుగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు లక్ష్మి చికిత్స పొందుతున్న ప్రాంతానికి ఎమ్మెల్యే వెళ్లనున్నారు. ప్రమాదం దురదృష్టకరం.. పాపికొండల్లో విహార యాత్రలో విషాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిని మంత్రులు పరామర్శించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ నగర అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ గతంలోనూ అదే చోట ప్రమాదాలు.. దురదుష్టవశాత్తూ జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ వాసులు గల్లంతవ్వడం బాధాకరం. మృతి చెందిన వారి కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. గతంలో అదే ప్రదేశంలో రెండు ప్రమాదాలు జరిగాయి. –కొయ్య ప్రసాదరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
ఏమయ్యారో?
సాక్షి, విశాఖపట్నం, పాతపోస్టాఫీసు : గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం విశాఖ నగరంతోపాటు ఆరిలోవ, వేపగుంట, అనకాపల్లిలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో నగరానికి 12 మంది గల్లంతుకాగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మహారాణిపేట, కొల్లూరు మేన్షన్ ప్రాంతం, రామలక్ష్మి కాలనీ డోర్ నెంబరు 14–33–37/ 9బి ఇంట్లో నివాసం ఉంటున్న ప్రైవేటు కారు డ్రైవరు మధుపాడ రమణబాబు (35), అతడి భార్య మధుపాడ అరుణ కుమారి (26), అఖిలేష్ (7), కమార్తె కుషాలి (5)లతో పాటు ఆరిలోవ ప్రాంతానికి చెందిన రమణబాబు పెద్ద అక్క తలారి అప్పలనర్సమ్మ(60), ఆమె మనవరాళ్లు గీత వైష్ణవి(3), అనన్య(1), వేపగుంటలో నివాసం ఉంటున్న రమణబాబు చిన్న అక్క బొండ పైడికొండ అలియాస్ లక్ష్మి(35), ఆమె కుమార్తె పుష్ప(15), అనకాపల్లి మండలం రేబాక కూడలి, గోపాలపురం ప్రాంతానికి చెందిన రమణబాబు పెద్ద అత్త బూసా లక్ష్మి(40), ఆమె పిల్లలు బోశాల సుస్మిత(3), పూర్ణ(18), చిన్న అత్త పెద్దిరెడ్డి దాలెమ్మ(45)లు శనివారం రాత్రి రమణబాబు ఇంటికి చేరుకుని ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు రైలులో రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. ఉదయం 8 గంటలకు రాజమండ్రి చేరుకున్నామని రామలక్ష్మినగర్లో నివాసముంటున్న రామకృష్ణకు, ఆరిలోవలో ఉన్న అప్పలనర్సమ్మ కుమారుడికి ఫోన్ చేసి చెప్పారు. అక్కడి నుంచి బోటు ఎక్కి భద్రాచలం వెళ్తున్నట్లు చెప్పారు. ఇంతలో టీవీల ద్వారా ప్రమాదం విషయం తెలుసుకున్న రామకృష్ణ, కుటుంబ సభ్యులు ఉలిక్కి పడ్డారు. ఆందోళన చెందుతూ రమణబాబుకు ఫోన్ చెయ్యగా పనిచెయ్య లేదు. ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్‌ని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. అసలు వారేమయ్యారు.. సురక్షితంగా ఉన్నారా..? ప్రమాదంలో చిక్కుకున్నారా.? ఊహకందని ప్రమాదంలో వీరికేమైనా జరిగుంటుందా..? అనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడాలంటూ విశాఖ ప్రార్థిస్తోంది. మాటలు కూడా రాని ఆ ఏడాది చిన్నారి.. ఏ పరిస్థితుల్లో ఉందోనని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. రమణబాబు పెద్ద అత్త బూసా లక్ష్మి రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బోటు యజమానిది పెందుర్తి.. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన కోడిగుడ్ల వెంకటరమణదిగా గుర్తించారు. నాలుగేళ్లుగా శ్రీ వశిష్ట పున్నమి రాయల్ పేరుతో బోటును పర్యాటకం కోసం నడుపుతున్నాడు. గోదావరిలో జల రవాణాకు అనుమతి లేకపోయినా విహార యాత్రలకు వినియోగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన రాజు ఈ సర్వీసు ప్రారంభమైనప్పటి నుంచి బోటు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయన మృతి చెందినట్లు సమాచారం. రాజు కుటుంబమంతా సరిపల్లి నుంచి దేవీపట్నం వలస వెళ్లిపోయారు. డ్రైవర్ రాజు ఆదివారం సెలవు పెట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ప్రమాదంలో మృతిచెందిన బోటు డ్రైవర్లు ఇద్దరి పేర్లూ రాజు కావడంతో ఆ రాజు ఇతనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వద్దన్నా.. వినకుండా.. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు... రమణబాబు కుటుంబ సభ్యులు గత ఆగస్టు 24న భద్రాచలం బయలుదేరాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా ఆ ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని తెలుసుకున్న బంధువులంతా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. అయినా వీరంతా వినిపించుకోలేదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది... ఎలాగైనా ఆదివారం వెళ్లిపోతామని చెప్పి బయలుదేరారు. ఈ ప్రయాణమే తీరని శోకం మిగులుస్తుందని అనుకోలేదని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గల్లంతుకావడంతో విశాఖ శోకసంద్రంలో మునిగిపోయింది. టీవీలో చూసి తెలుసుకున్నాం.. రామలక్ష్మీ కాలనీలో మా ఇంట్లో దిగువ పోర్షన్లో రమణబాబు తన కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. టీవీలో బోటు ప్రమాదం వార్త చూసిన వెంటనే నా కుమార్తె, అల్లుడు వారి స్నేహితులను సంప్రదించారు. అప్పుడే విషయం తెలుసుకున్నాం. ఒకేసారి ఇంతమంది గల్లంతవ్వడం బాధాకరం. అందరితో కలిసిమెలిసి ఉండే కుటుంబానికి ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం. – మధుపాడ లక్ష్మి, రామలక్ష్మీ కాలనీ (రమణబాబు ఒదిన) వార్తల ద్వారా తెలిసింది.. ఎలక్ట్రికల్ దుకాణంలో పనిచేస్తుండగా సాయంత్రం 6 గంటలకు వార్తల ద్వారా విషయం తెలిసింది. ఆదివారం ఉదయం 4 గంటలకు వీరంతా బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వారంతా ఎలా ఉన్నారన్న సమాచారం తెలియదు. వీరంతా బోటు ప్రమాదంలో గల్లంతయ్యారని, గోపాలపురం ప్రాంతానికి చెందిన బూసా లక్ష్మి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్న వార్త టీవీలో చూపించారు. – గొర్లె అప్పలరాజు, రామలక్ష్మీ కాలనీ, (రమణబాబు అన్న కొడుకు) తల్లడిల్లుతున్న హృదయాలు.. చిట్టితల్లుల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు: ఆరిలోవ(విశాఖ తూర్పు): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దరి పాపికొండల విహారయాత్రకు వెళ్తూ గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన వారు గల్లంతవడంతో విషాదం నెలకొంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డు పరిధి దుర్గాబజార్ దరి సాయినగర్‌కు చెందిన తలారి అప్పలనరమ్మ తన కొడుకు, కోడలుతో నివాసముంటోంది. ఆమె తన తమ్ముడైన రమణబాబు కుటుంబీకులతో కలిసి పాపికొండలు వెళ్లడానికి తన ఇద్దరు మనవరాళ్లు వైష్ణవి(3), అనన్య(1 సంవత్సరం మూడు నెలలు)తో కలిసి ఆదివారం వేకువన రైలులో బయలుదేరారు. రాజమండ్రిలో దిగి పాపికొండలు వెళ్లడానికి గోదావరిలో బోటు ఎక్కి ప్రమాదంలో చిక్కుకొన్నారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో అధికారులు గల్లంతైన వారి జాబితాలో వారి పేర్లును చేర్చారు. బోటు ప్రమాదం విషయం తెలిసినప్పటి నుంచి చిన్నారులు వైష్ణవి, అనన్య తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అప్పలరాజు కన్నీటిపర్యంతమవుతున్నారు. వారు విలపించిన తీరు స్థానికులను కంటతడిపెట్టిస్తోంది. చిన్న పిల్లలను నాన్నమ్మతో పంపించడమే మేము చేసిన తప్పా అంటూ విలపిస్తున్నారు. బోటు ప్రమాదంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారనే విషయం ఈ ప్రాంతమంతా దావానంలా వ్యాపాంచింది. చుట్టుపక్కల కాలనీవారంతా వారి నివాసానికి చేరుకొని విలపిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. తల్లి నుంచి పాలు మాన్పించాలనే ఆలోచనతో పిల్లలను నాన్నమ్మతో పంపించినట్లు స్థానికులు అంటున్నారు. దిగ్భ్రాంతికి గురయ్యా.. గోదావరిలో బోటు ప్రమాదం విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. గల్లంతైన వారిలో 12 మంది విశాఖ జిల్లాకు చెందిన వారున్నారన్న తెలిసి తీవ్రంగా కలతచెందా. వారి ఆచూకీ తెలుసుకునేందుకు పర్యాటక శాఖ తరఫున రక్షణ చర్యలు చేపడుతున్నాం. ప్రమాదానికి కారణమైన బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. గల్లంతైన వారి ఆచూకీ కోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లు సంఘటన స్థలానికి తీసుకొచ్చాం. – మంత్రి అవంతి శ్రీనివాసరావు -
కన్నీరు మున్నీరు
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో పలువురు హైదరాబాద్ నగర వాసులు గల్లంతు కావడంతో ఆయా కుటుంబాల వారు విషాదంలో మునిగిపోయారు. సరదాగా నీటిపై వెళ్లిన వారు గల్లంతు కావడాన్నితట్టుకోలేకపోతున్నారు. రామంతాపూర్/బోడుప్పల్: లాంచి ప్రమాదంలో బోడుప్పల్ శ్రీనివాస కాలనికి చెందిన చింతామణి శివజ్యోతి(50)మృతి చెందగా, ఆమె భర్త జానకి రామారావు(65) గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. జానకి రామారావు తన భార్య శివజ్యోతితో పాటు రామంతాపూర్ అర్టీసీ కాలనీకి చెందిన బావమరిది అంకెం పవన్‌కుమార్(50), అతని భార్య వసుంధర భవాని(45), వీరి కుమారుడు సుశీల్(22) కలిసి శనివారం ఉదయం దేవరపల్లిలోని సమీప బంధువుల ఇంటికి వెళ్లారు. చినతిరుపతి దర్శనం అనంతరం ఆదివారం ఉదయం 8.40 గంటలకు లాంచీలో షికారుకు వెల్లారు. కచ్చులూరు వద్ద జరిగిన లాంచి ప్రమాదం జరగడంతో అందరూ నీటిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో జానకి రామారావు గాయాలతో బయట పడ్డారు. ప్రస్తుతం ఆయన రంపచోడవరం అసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అతని భార్య జ్యోతి ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన ముగ్గురి ఆచూకీ లభించక పోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన జానకి రామారావు రైల్వేలో ఫుడ్ అండ్ హెల్త్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో స్థిరపడ్డారు. ఇతనికి మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె హిమబిందు ఆనారోగ్యంతో చనిపోగా రెండవ కుమార్తె నీలిమ అమెరికాలో స్థిరపడింది. మొదటి భార్య చనిపోయిన తరువాత రామంతాపూర్‌కు చెందిన శివజ్యోతిని రెండవ పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస కాలనీ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియోషన్‌కు జానకి రామారావు అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. జానకి రామారావు బావమరిది అంకెం పవన్‌కుమార్(50) స్థానికంగా కిరాణా షాపు నడిపిస్తుండగా, అతని భార్య వసుందర భవాని(45) అంబర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. వీరి కుమారుడు సుశీల్(22) బీటెక్ పూర్తి చేశాడు. మా పిల్లలు ఎప్పుడొస్తారు?: వృద్ధ తల్లిదండ్రుల విలవిల కొడుకు, కోడలు, మనుమడు క్షేమ సమాచారం కోసం రామంతాపూర్‌లోని ఆర్టీసీ కాలనీలో పవన్కుమాన్ తండ్రి శంకర్రావు తల్లి విలవిల్లాడుతున్నారు. క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. తమ పిల్లలు కళ్లముందే ఉన్నట్టున్నారని ఎప్పుడు వస్తారని స్థానికులను అడగడం అందిరినీ కంట తడి పెట్టించింది. పవన్ ఇంటికి ఇరుగు పొరుగు వారు చేరుకుని క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. సొంత మనుషుల్లా చూసుకునేవారు ఆదివారం ఉదయమే ప్రమాదం జరగిందని తెలుసుకుని బాధపడ్డా. జానకి రామారావు బంధువులను ఫోన్లో సంప్రదించి క్షేమ సమాచారాలు తెలుసుకున్నా.. కిరాయి దారులను సొంతమనుషుల్లా చూసుకునే వారు. – శ్రీనాథ్ క్షేమంగా తిరిగి రావాలి జానకి రామారావు కుటుంబసభ్యులు కాలనీలో అందరితో కలిసి మెలిసి ఉండేవారు. ఇలాంటి కష్టం వారి కుటుంబానికి రావడం దురదృష్టం. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా క్షేమంగా తిరిగి రావాలి. – రామంతాపూర్ అర్టీసీ కాలనీఅధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి అన్యోన్య దంపతులు జానకి రామారావు దంపతులు అన్యోన్యంగా ఉండటమే కాక అందరితో కలసి పోయే మనస్తత్వం వారిది. వారి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందంటే నమ్మలేక పోతున్నాం. –డా. కనకాచారి శ్రీనివాస కాలని వాసి కలిసిమెలిసి ఉండే జ్యోతి.. కాలనీలో జరిగే ప్రతి పండుగలో జ్యోతి అందరితో కలివిడిగా ఉండేది. శుక్రవారం రాత్రి టూర్‌కు వెళుతున్నామని చెప్పి వెళ్లింది. రెండు రోజుల్లో వస్తా అని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లడం బాధాకరం. – విష్ణుప్రియ,శ్రీనివాస కాలని వాసి కుటుంబ సభ్యుల విలవిల గచ్చిబౌలి: ప్రమాదంలో మాదాపూర్‌కు చెందిన ఈరన్ సాయికుమార్(24) గల్లంతయ్యారు. మాదాపూర్‌లోని లాష్ జిమ్‌లో సాయికుమార్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అతనితో పాటు ట్రైనర్లుగా టోలీచౌకికి చెందిన తలీబ్, అజర్, మియాపూర్‌కు చెందిన అక్బల్తో కలిసి శనివారం సాయంత్రం పాపి కొండలకు బయలుదేరారు. ఆదివారం గోదావరి నది ప్రవాహంలో లాంచీ బొల్తా పడటంతో సాయికుమార్, తలీబ్‌లు పటేల్ గల్లంతయ్యారు. అజర్ గాయాలతో బయటపడి రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోట్ ఎక్కక పోవడంతో అక్బల్ సురక్షితంగా బయటపడ్డాడు. మాదాపూర్‌కు చెందిన ఈరన్ చిన్న ముత్యాలు, కౌసల్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ప్రమాదంలో పెద్ద కొడుకు సాయి కుమార్ గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం తెలియలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ముగ్గురు సేఫ్... ఒకరు గల్లంతు హయత్‌నగర్: లాంచీ ప్రమాదంలో హయత్‌నగర్‌కు చెందిన నలుగురు యువకులు గల్లంతయ్యారనే సమాచారంతో హయత్‌నగర్‌లోని పోచమ్మ బస్తీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నలుగురు యువకుల్లో జరణి కుమార్, విశాల్, అర్జున్‌లు సుర క్షితంగా ఉన్నారని, భరణి ఆచూకీ తెలియలేదనే వార్తలు రావడంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం... పోచమ్మ బస్తీకి చెందిన పాడి రాజు కుమారులు భరణి(25), అతని సోదరుడు జరణి(23) కోదండ బాబూరావు కొడుకు విశాల్(27), కోదండ సత్యనారాయణ కొడుకు అర్జున్(22)లు స్నేహితులు. గత శుక్రవారం స్థానికంగా నెలకొల్పిన గణేశున్ని అబ్దుల్లాపూర్మెట్టులోని చెరువులో నిమజ్జనం చేశారు. నలుగురు కలిసి పాపికొండలను చూసేందుకు శనివారం రాత్రి బస్సులో రాజమండ్రికి బయలు దేరారు. ఆదివారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరారు. సంఘటన జరిగి 8 గంటలైనా సరైన సమాచారం లేక పోవడంతో స్థానికుల్లో ఉత్కంఠ నెలొంది. సరైన సమాచారంలేదు పోచమ్మ బస్తీకి చెందిన నలుగురు యువకుల గల్లంతు విషయమై తమకు పోలీసులు సరైన సమాచారం ఇవ్వడం లేదని భరణి సోదరి వాపోయారు. ముందుగా భరణి, జరణిలు మిస్సయినట్లు విశాల్, అర్జున్‌లు సేఫ్‌గా ఉన్నట్లు సమాచారం అందిందని. అనంతరం జరణి సురక్షితంగా ఉన్నాడని తెలిసిందని ఆమె తెలిపారు. భరణికూడా సేఫ్‌గా ఉన్నాడనే సమాచారం వస్తున్నా ఎవరూ ధృవీకరించడం లేదని చెప్పారు. మూడు కుటుంబాలకు చెందిన వారు హుగాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్ళారు. అంతా స్నేహితులే... పక్క పక్క ఇండ్లలో నివసించే భరణి, జరణి, అర్జున్, విశాల్ నలుగురు స్నేహితులు భరణి ఫోన్‌పే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండగా అతని సోదరుడు జరణి సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి జీఎస్ఐలో ఉద్యోగి. అర్జున్ ఆర్టీసీ కండక్టర్ కాగా విశాల్ డిగ్రీ చదువుతున్నాడు. ప్రాణాలతో బయటపడ్డ కిరణ్ అంబర్‌పేట: లాంచీ ప్రమాదంలో అంబర్‌పేట సీపీఎల్‌లో నివసించే కిరణ్‌కుమార్(24) ప్రాణాలను నుంచి బయపడ్డాడు. ఆయన ధరించిన లైఫ్ జాకెట్లు ప్రాణాలు కపాడాయి. పోలీస్ హౌసింగ్ బోర్డు విభాగంలో కాంట్రాక్ట్ విధానంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మిత్రులతో కలిసి శనివారం విహార యాత్రకు వెళ్లాడు. ఆదివారం జరిగిన పడవ ప్రమాద భాదితుల్లో ఇతను ప్రాణాల నుంచి బయటపడ్డారు. సహాయక బృందాలు రక్షించి సమీప ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. తాను క్షేమంగా ఉన్నట్లు నల్గొండ జిల్లా చిట్యాలలో ఉన్న కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
సుడిగుండాల వల్లే లాంచీ ప్రమాదం..?
-
బోటు ప్రయాణంలో పెను విషాదం
-
కన్నీటి గోదారి
-
కొండంత విషాదం
సాక్షి, కాజీపేట : వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ.. ఈ గ్రామానికి చెందిన పలువురు ఆరోగ్యం కోసం వాకింగ్ చేయడం వారికి అలవాటుగా మార్చుకున్నారు. ఈ బృందంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు చిరుద్యోగులు, చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు, టీఆర్ఎస్ నాయకులతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. వాకింగ్ చేసే క్రమంలో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారింది. వయస్సు బేధాలు మరిచిపోయి మంచీచెడ్డా మాట్లాడుతూ గ్రామ సమస్యలపై చర్చించే వారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కూడా ఆనవాయితీ. ఇదేక్రమంలో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆ యాత్రే వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుందని వారికి తెలియదు. గోదావరి జలాల్లో బోటుపై పయనిస్తూ ఆనందంగా గడపాలని భావించి పాపికొండలు చూడాలని బయలుదేరారు. కానీ వారి ప్రయాణం గమ్యాన్ని చేరలేదు. కడిపికొండ నుంచి 14 మంది విహారయాత్రకు వెళ్లగా.. అక్కడ తూర్పుగోదావరి జిల్లా తూర్పు దేవిపట్నం మండలం కచ్చలూరు సమీపంలో గోదావరి నదిలో బోట్ బోల్తా పడగా ఐదుగురే సురక్షితంగా బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది గల్లంతు కాగా, ఇద్దరు మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కడిపికొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురక్షితంగా బయటపడిన ఐదుగురు... 9 మంది గల్లంతు గోదావరిలో బోటు మునిగిపోవడంతో కడిపికొండ నుంచి 14 మందిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా తొమ్మిది మాత్రం గల్లంతైనట్లు ఇక్కడకు సమాచారం అందింది. సురక్షితంగా బయటపడిన వారిలో బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, ఆరెపల్లి యాదగిరి, దర్శనాల సురేష్, గొర్రె ప్రభాకర్ ఉన్నారు. ఆరు గంటల బోటు ప్రయాణం సుమారు ఆరుగంటల పాటు కొనసాగే బోటు ప్రయాణంలో నాలుగు గంటల పాటు ఆహ్లాదంగా గడిచింది. ఇంతలోనే గోదావరి ఒక్క సారిగా ఉగ్రరూపం దాల్చింది, దీంతో కచ్చలూరు వద్ద బోటు నీట మునిగింది. ఆ సమయాన లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాసింత ఏమరుపాటు.. ఇంకొద్ది జాప్యంతో లైఫ్ జాకెట్లు ధరించని 9 మంది గల్లంతయ్యారు. ఆరు గంటల విహార యాత్రలో నాలుగు గంటలు ముగియగా.. మరో రెండు గంటల మిగిలిన ఉండగానే ఆనందంగా గడుపుతున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. కుటుంబాల్లో అంతులేని ఆవేదన సంతోషంగా పాపికొండలు విహారయాత్రకు వెళ్లగా బోటు మునిగిపోయిన ఘటనలో గల్లంతైన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అందరూ పేద కుటుంబాల వారే కావడం.. వారి కుటుంబీకులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. గల్లంతైన వారిలో ఎక్కువ మంది రెక్కల కష్టం మీద బతుకుబండిని లాగుతున్న వారే ఉన్నారు. వీరంతా కుటుంబాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుండడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పెయింటర్లుగా, కూలీలుగా, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పని చేస్తున్న వారు కూడా ఉంవడడం గమనార్హం. భగవంతుడికి కోటి దండాలు గోదావరి నదిలో బోటు బోల్తా పడి తమ వారు గల్లంతైనట్లు గెలియగానే బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ‘భగవంతుడా మావోళ్లు సురక్షితంగా బయటపడేలా చూడు’ అంటూ కోటి దండాలు పెడుతున్నారు. పరామర్శించేందుకు వచ్చిన వారిని సైతం వివరాలు అడుగుతున్నారు. ఇద్దరు మృతి... గోదావరిలో గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందింది. పెయింటర్‌గా జీవనం కొనసాగిస్తున్న బస్కే రాజేందర్(42), డిగ్రీ చదువుతున్న విద్యార్ధి బస్కే అవినాష్(21) మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయని చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే.. అంతసేపు తమ వారు సురక్షితంగా బయటపడుతారనే భావనతో ఉన్న కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. పది రోజుల క్రితమే ప్రణాళిక పాపికొండలు టూర్‌కు వెళ్లాలని కడిపికొండ వాసులు పది రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని పత్రికలు, ఛానళ్ల ద్వారా తెలియడంతో వెనుకడుగు వేశారు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయనే సమాచారం అందడంతో బయలుదేరిన వారు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి మంత్రి, ఎమ్మెల్యే గోదావరిలో బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘటనా స్థలానికి బయలుదేరారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా వెళ్లారు. విహారయాత్రకు 14 మంది... కడిపికొండ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు కలిపి వాకింగ్ చేస్తుంటారు. వీరిలో ఎస్సీలైన పలువురు మాదిగ మహరాజ కుల సంక్షేమ సంఘంగా ఏర్పడ్డారు. ఇందులో నుంచి 14 మంది పాపికొండలు చూడాలని గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట నుంచి బయలుదేరారు. శుక్రవారం రాత్రి బయలుదేరిన వారు శనివారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ స్థానికంగా గోదావరి బ్రిడ్జి, కాటన్ మ్యూజియం ఇతరత్రా సందర్శనీయ ప్రదేశాలు చూడాక బస చేశారు. ఆదివారం ఉదయం బోటులో పాపికొండలు సందర్శనకు బయలుదేరారు. పాపికొండలు చూస్తూ భద్రాచలం వెళ్లి రామయ్యను దర్శించుకోవాలనేది ప్రణాళిక. అయితే, మధ్యలోనే బోటు మునిగిపోవడం గమనార్హం. కాపాడిన లైఫ్ జాకెట్లు కడిపికొండ వాసుల్లో ఐదుగురు సురక్షితంగా బయటపడడానికి లైఫ్ జాకెట్లే కారణమయ్యాయి. బోట్ ఎక్కగానే లాంచీ నిర్వాహకులు ఇచ్చిన లైఫ్ జాకెట్లను వెంటనే బస్కే దశరధం, బస్కే వెంకటస్వామి, దర్శనాల సురేష్, గొర్రె ప్రభాకర్, అరెపల్లి యాదగిరి ధరించారు. మిగతా తొమ్మిది మంది కొంత ఆలస్యం.. కొంత ఏమరుపాటు కారణంగా లైఫ్ జాకెట్లు ధరించలేదు. ఇంతలోనే గోదావరిలో బోట్ కుదుపునకు గురై బోల్తా పడడం గమనార్హం. నిర్వాహకులు ఇచ్చిన వెంటనే లైఫ్ జాకెట్లు ధరించి ఉంటే ఈ తొమ్మిది మంది కూడా సురక్షితంగా బయలపడేవారని చెబుతున్నారు. కాగా, లైఫ్ జాకెట్లు ధరించిన వారు బోట్ బోల్తా పడగానే నీటిపై తేలియాడుతూ గంటసేపటి వరకు నదిలో ఈత కొడుతూ ముందుకు సాగాక మరో లాంచీలో వచ్చినవారు కాపాడినట్లు తెలుస్తోంది. టీవీలకు అతుక్కుపోయిన కుటుంబ సభ్యులు బోటు బోల్తా పడిందని తెలియగానే కడిపికొండలోని 14 మంది కుటుంబాల వారు టీవీలకు అతుక్కుపోయారు. ఎవరెవరు గల్లంతయ్యారు, ఎవరెవరు సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకున్నారు. గల్లంతైన వారి పేర్లు ప్రకటించటగానే వారి కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక గ్రామంలోని యువత ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. -
తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి..
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: లాంచీలో సరదాగా నృత్యం చేస్తున్న తమ చిన్నారి హాసినీని చూస్తూ ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇంతలో లాంచీ ప్రమాదం రూపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు.. అప్పటివరకు ఆనందంగా సాగుతున్న వారి యాత్ర ఒక్కసారిగా ఆర్తనాదాలు, రోదనలతో నిండిపోయింది. సంతోషంగా నృత్యం చేస్తున్న తన కుమార్తె తన కాళ్లు పట్టుకుని వేలాడుతున్నా కాపాడుకోలేని పరిస్థితి ఆ మాతృమూర్తిది. ఎలాగైనా తనవారిని కాపాడుకోవాలనే బాధ ఆ తండ్రిది. వెరసి పాపికొండలు లాంచీ ప్రమాదంలో తిరుపతికి చెందిన ఓ కుటుంబం విషాద గాథ ఇది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం కుటుంబంతో కలిసి వినాయకసాగర్ రాధేశ్యామ్ అపార్ట్మెంట్లో నివశిస్తున్నారు. సుబ్రహ్మణ్యం (45) పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండగా మధులత (40) గృహిణి. చిన్నారి హాసిని (12) స్థానిక స్ప్రింగ్‌డేల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. మూడు నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం వచ్చారు. గోదావరిలో తండ్రి ఆఖరి క్రతువును నిర్వహించేందుకు వెళ్లిన సుబ్రహ్మణ్యం, హాసిని ప్రమాదంలో గల్లంతు కాగా మధులతను ప్రాణాలతో బయటపడింది. నేనెవరికోసం బతకాలి ? ‘‘ఆదివారం కదా సరదాగా గడుపుదామని కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికొచ్చాం. ఇదే మా జీవితంలో విషాదాన్ని నింపుతుందని అనుకోలేదు. ఈ ప్రమాదంలో నా భర్త సుబ్రహ్మణ్యం, పాప హాసిని కనిపించకుండా పోయారు. ఇక నేను ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎలా బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే ఎంత బావుండు..’’ – మధులత, తిరుపతి తల్లి పాలు మానిపించే ప్రయత్నంలో.. ఇద్దరు చిన్నారులతోపాటు నాయనమ్మ గల్లంతు ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంకు చెందిన అప్పలరాజుది మరో విషాద గాథ. తన తల్లి, భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు గీతా వైష్ణవి (3), ధాత్రి అనన్య (1)లతో కూడిన అన్యోన్య కుటుంబం ఆయనది. ఏడాది నిండిన చిన్నపాప ధాత్రి అనన్యతో తల్లి పాలు మానిపిద్దామని.. ఇందులో భాగంగా రెండు మూడు రోజులు తల్లికి దూరంగా ఉంచితే తల్లిపాలకు దూరం చేయొచ్చని అప్పలరాజు భావించాడు. విశాఖపట్నానికే చెందిన తన బంధువులు పాపికొండలు యాత్రకు వెళ్తున్నారని తెలుసుకుని వారితోపాటు తన తల్లిని ఇద్దరు పిల్లలను ఇచ్చి పంపాడు. లాంచీ ప్రమాదంలో ముగ్గురూ గల్లంతవడంతో అప్పలరాజు, ఆయన భార్య భాగ్యలక్ష్మి కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకటి రెండు రోజులు తనకు దూరంగా ఉంటే తల్లి పాలు మరిచిపోతారని అనుకుంటే ఇలా తనకు దూరమై తీవ్ర విషాదాన్ని నింపుతారని అనుకోలేదని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. స్నేహితుల్లో విషాదం నింపిన విహారం నరసాపురం: లాంచీ బోల్తా పడిన ఘటనలో నరసాపురంకు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇక్కడి నుంచి నలుగురు స్నేహితులు పాపికొండలు విహార యాత్రకు వెళ్లగా ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. పట్టణంలోని రుస్తుంబాదకు చెందిన వలవల రఘు (45), చెట్లపల్లి గంగాధర్ (36), టేలర్ హైస్కూల్ గ్రౌండ్ సమీప ప్రాంతానికి చెందిన గన్నాబత్తుల ఫణికుమార్ (28) గల్లంతయ్యారు. రాయిపేటకు చెందిన మండల గంగాధర్ (బిళ్లా) ప్రాణాలతో బయటపడ్డాడు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో అమరేశ్వరస్వామి ఆలయ ఈవో వలవల రఘు స్నేహితులతో కలిసి పాపికొండలు యాత్రకు నాలుగు టికెట్లు బుక్ చేశారు. నలుగురు స్నేహితులు కలిసి శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాజమండ్రి వెళ్లారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో లాంచీ ఎక్కి ప్రమాదానికి గురయ్యారు. -
ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు
(దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం): ప్రమాదం ఎవరికో జరిగింది కదా అని ఊరికే ఉండలేదు.. మనకెందుకులే అని వారి దారి వారు చూసుకోలేదు.. మానవత్వాన్ని చూపించారు కచ్చులూరులోని అడవి బిడ్డలు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం బారిన పడిన వారిని ఆలస్యం చేయకుండా హుటాహుటిన పలువురిని ఒడ్డుకు చేర్చి ఆపద్బాంధవులుగా నిలిచారు. పలువురి మృతదేహాలనూ వెలికితీశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో వీరందించిన సేవలు మానవత్వానికి నెలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. సాధారణంగా ప్రతీ ఆదివారం కచ్చులూరు గ్రామస్తులు మధ్యాహ్న సమయంలో గోదావరి ఒడ్డున కూర్చోవడం వారికి అలవాటు. అదే సమయంలో కళ్లేదుటే పర్యాటక లాంచి మునిగిపోవడంతో ఒక్క ఉదుటున కదిలారు. ఇంజన్ బోట్లు స్టార్‌చేసి ఒక్కసారిగా మునిగిపోతున్న లాంచి వద్దకు చేరుకున్నారు. లైఫ్ జాకెట్లు ధరించడంతో నీటిపై తేలుతున్న పలువురిని అడవి బిడ్డలు రక్షించి సురక్షితంగా మామిడిగొంది గ్రామం ఒడ్డుకు చేర్చారు. కాగా, ఈ దుర్ఘటనపై కచ్చులూరు గ్రామానికి చెందిన నేసిక లక్ష్మణరావు మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం గోదావరి ఒడ్డున కూర్చుని ఉన్నాను. గ్రామా నికి ఎదురుగా ఉన్న కొండ దగ్గర లాంచి వెనక్కి వెళ్తోంది. ఏం జరుగుతుందో అని చూస్తుండగానే లాంచి పక్కకు ఒరిగి నీటిలో మునిగిపోతోంది. దీంతో గ్రామస్తులందరం ఐదు పడవల్లో వేగంగా అక్కడకు చేరుకుని నీటిపై ఉన్న వారిని రక్షించాం’.. అని వివరించాడు. అలాగే, కచ్చులూరు గిరిజన మత్స్యకారులు మునిగిపోయిన బోటు నుంచి ఒక్కొక్కటిగా బయటపడే బ్యాగులను సేకరించి పోలీసులకు అందించారు. నాటు పడవలు వేసుకుని వెళ్లాం ప్రమాదం సంఘటన తెలిసిన వెంటనే నాటు పడవలు వేసుకుని అక్కడకు వెళ్లాం. వరదవల్ల తొందరగా అక్కడకు చేరుకోలేకపోయాం. లైఫ్‌జాకెట్లు వేసుకున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. – కె. వీరభద్రారెడ్డి, తూటుకుంట, పశ్చిమగోదావరి జిల్లా మా కళ్లెదుటే మునిగిపోయింది మధ్యాహ్నం ఫోన్ సిగ్నల్ కోసం గోదావరి ఒడ్డుకు వచ్చాను. ఈలోపు బోటు మునిగిపోవడం కంట పడింది. ఒడ్డున ఉన్న వారు వెంటనే పడవలతో కాపాడేందుకు వెళ్లి కొంతమందిని రక్షించారు. – చెదల దుర్గ, తూటుకుంట, పశ్చిమ గోదావరి జిల్లా -
30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి/సాక్షి అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న పడవ ప్రమాదాలు ఎంతోమందిని బలిగొంటున్నాయి. విధిలేని పరిస్థితుల్లో పడవ ప్రయాణాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా మూడు దశాబ్దాల కాలంలో వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆయా ప్రధాన ఘటనల వివరాలు.. - 1985లో.. వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలోని శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురై 40 మంది మృతిచెందారు. - 1990లో.. ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో పడవ మునిగి పది మంది చనిపోయారు. - 1992లో.. ఐ.పోలవరం మండలం పరిధిలోని గోగుళ్లంక–భైరవలంక మధ్య చింతేరుపాయ వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు. - 1996లో బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై పడవ దాటుతుండగా బలమైన గాలులకు పడవ బోల్తా పడి పదిమంది వరకు కూలీలు చనిపోయారు. - 2004లో.. యానాం–ఎదుర్లంక వారధి నిర్మించక ముందు గౌతమీ గోదావరి నదీ పాయపై జరిగిన పలు పడవ ప్రమాదాల్లో 10మంది వరకు మృతిచెందారు. - 2007లో.. ఓడలరేవు–కరవాక రేవు మధ్య ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఇంజ¯Œన్ చెడిపోవడంతో గాలికి సముద్రం వైపు కొట్టుకుపోతుండగా మరో పడవ ద్వారా అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. - 2008లో రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాదులు పాపికొండల విహారయాత్రకు వెళ్తూ పడవ ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందారు. - 2009లో.. అంతర్వేది–బియ్యపు తిప్ప మధ్యలో వశిష్ట సాగర సంగమం సమీపంలో ప్రయాణం చేస్తుండగా పడవ మునిగి పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు బలయ్యారు. - 2018లో.. మే 15న మంటూరు వద్ద 50 మందితో వెళ్తున్న లాంచీ బోల్తాపడిన ఘటనలో 19 మంది జలసమాధి అయ్యారు. మృతదేహాలను వెలికితీయడానికి మూడ్రోజులు శ్రమించాల్సి వచ్చింది. - 2018 జులైలో.. ఐ.పోలవరం మండలం పశువుల్లంకవద్ద పడవ బోల్తా ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు లభించలేదు. కాగా, అప్పట్లోనే 120మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తమై బోటును సమయస్ఫూర్తితో ఒడ్డుకు చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా ఆదివారం దేవీపట్నం మండలం కచ్చలూరులో సంభవించిన దుర్ఘటన ఇదే ప్రాంతంలో మూడోది కావడం గమనార్హం. రెండు పెనుప్రమాదాలు ఆదివారమే 2017 నవంబర్ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన, తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరగడం గమనార్హం. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విజయవాడ కృష్ణానదిలో బోటులో విహారానికి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు. శనిఆదివారాలు సెలవులు కావ డంతో తెలంగాణ, ఏపీకి చెందిన అనేక మంది పాపికొండల యాత్రకు వచ్చారు. -
మేమైతే బతికాం గానీ..
సాక్షి, కాకినాడ: పాపికొండల యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. గోదావరి అందాలను ఆనందంగా తిలకిస్తున్నాం. అంతలో ఏమైందో తెలీదు.. ఒక్కసారిగా పడవ కుదుపునకు గురైంది. బోటు పైభాగంలో ఉన్న 70 మంది ఒక్కసారిగా మాపై పడ్డారు. ఆ బరువుకు బోటు ఓ వైపునకు ఒరిగింది. ఇక బతకడం కష్టమనుకున్నాం. దేవుడా.. నువ్వే దిక్కని కళ్లు మూసుకున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదుగానీ.. కచ్చులూరు గ్రామస్తులు దేవుడిరూపంలో వచ్చి మమ్మల్ని ఒడ్డుకు చేర్చారు.. మా ప్రాణాలు నిలిపారు.. అంటూ బోటు ప్రమాద బాధితులు ఉద్వేగంతో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఆదివారం లాంచీ ప్రమాదం నుంచి బయటపడ్డ పలువురు బాధితులు.. ప్రమాదం జరిగిన క్షణాలను తలచుకుని వణికిపోతున్నారు. శవాసనమే.. శ్వాస నిలిపింది.. పైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఉక్కపోతగా ఉందని పలువురు లైఫ్ జాకెట్లు తీసేశారు. భోజన ఏర్పాట్లు కూడా జరుగుతుండటంతో లైఫ్ జాకెట్లను వేసుకోలేదు. మరికొద్దిసేపట్లో పాపికొండలొస్తాయని బోటు సిబ్బంది చెప్పారు. ‘ఇది డేంజర్ జోన్.. బోటు అటూఇటూ ఊగుతుంది.. భయపడొద్దు’ అని చెప్పారు. అలా చెబుతుండగానే బోటు ఊగడం మొదలైంది.. పైన ప్లాస్టిక్ కుర్చీలన్నీ కుడివైపునకు జరిగాయి.. ఆ బరువుకు బోటు కుడివైపునకు ఒరిగిపోయింది.. ముందు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. వెంటనే తేరుకుని నేను నేర్చుకున్న ‘శవాసనం’ వేశాను. కాసేపు అలాగే ఉండి ఈదుకుంటా వస్తున్నా. అంతలో ఒడ్డున ఉన్న గ్రామస్తులు తలోచెయ్యివేసి కాపాడారు. మా కుటుంబ సభ్యులం ఐదుగురం వస్తే.. నేనొక్కడినే మిగిలా.. నా భార్య, బావ, బావ భార్య, బావ కుమారుడు ఎక్కడున్నారో.. ఏమయ్యారో తెలియదు.. – జానకిరామయ్య, ఉప్పల్, హైదరాబాద్ 14 మందిలో ఐదుగురం మిగిలాం.. గోదావరి ఒడిలో కాసేపు సేదదీరుదామని చిన్నాన్న, పెదనాన్న కుటుంబ సభ్యులం కలిసి 14 మంది వచ్చాం. ఒక్కసారిగా బోటు నీళ్లలోకి వెళ్లిపోయింది. అంతే గుండె ఆగినంత పనైంది. దేవుడిపై భారం వేశా. అంతలో గ్రామస్తులొచ్చి గట్టుకు చేర్చారు. చివరికి మేం ఐదుగురిమే మిగిలాం. మా వాళ్లు ఏమయ్యారో.. అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో.. – బసికె దశరథం, కడిపికొండ, వరంగల్ జిల్లా ఆ తొమ్మిది మంది ఏమయ్యారో.. గోదావరి అందాలు తిలకిద్దామని మా అన్నదమ్ముల కుటుంబాలు 14 మంది నెల ముందే ప్లాన్ చేసుకున్నాం. ఎంతో ఆనందంగా లాంచీ ఎక్కాం. అప్పటి వరకు విహారయాత్ర ప్రశాంతంగా సాగుతోంది. అంతలోనే సుడిలో బోటు కూరుకుపోతూ వచ్చింది. ఎలాగైనా గండం నుంచి గట్టెక్కించు దేవుడా అని ప్రార్థించాం. లైఫ్ జాకెట్లు ఉన్నవాళ్లు కొందరు ఈదుకుంటూ వెళ్లిపోయారు. మొత్తం ఐదుగురిమే బయటపడ్డాం. మిగతా తొమ్మిది మంది ఆచూకీ తెలియడం లేదు.. – గొర్రె ప్రభాకర్, కడిపికొండ, వరంగల్ జిల్లా ఆ రోజే యాత్రను రద్దు చేసుకోనుంటే.. వాళ్లు బతికేవాళ్లే.. అన్నదమ్ముల కుటుంబ సభ్యులం గత నెలలో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం. కానీ వరద ప్రభావం ఎక్కువగా ఉందని టీవీ, పేపర్లలో చూసి ప్రయాణాన్ని రద్దు చేసుకుందామని బోటు తాలూకు ఆన్లైన్లో నంబర్‌కు ఫోన్ చేశాం. ఏం కాదులే వచ్చేయండని వారు చెప్పడంతో వచ్చి లాంచీ ఎక్కాం. 14 మంది వస్తే.. చివరికి ఐదుగురం మిగిలాం. మిగిలిన వారు ఏమయ్యారో తెలీడం లేదు. ఆ రోజు యాత్ర రద్దు చేసుకున్నా బాగుండేది.. – సురేష్, కడిపికొండ, వరంగల్ జిల్లా నలుగురిలో ఇద్దరం మిగిలాం.. సరదాగా గడుపుదామని నలుగురు స్నేహితులం వచ్చాం. మేం ప్రాణ స్నేహితులం.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవాళ్లం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించనే లేదు. చివరికి ఇద్దరం మిగిలాం. మా స్నేహితులు భరణికుమార్, విశాల్ ఆచూకీ తెలియలేదు.. వారు బతికి ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.. – అర్జున్ కోదండ, హైదరాబాద్ -
నిండు గోదారిలో మృత్యు ఘోష
‘అన్నా.. అటు చూడు.. ఆ కొండ ఎంత బావుందో.. అక్కా.. ఇటు చూడు ఎన్ని నీళ్లో..’ అంటూ బంధు మిత్రులతో కలిసి పాపికొండల అందాలను వీక్షిస్తూ కేరింతలు కొట్టిన పర్యాటకులు అంతలోనే కాపాడండంటూ హాహాకారాలు చేశారు. రెప్పపాటులో నీట మునగడంతో ప్రాణ భయంతో గావు కేకలు పెట్టారు. భర్త ఒక వైపు.. భార్య మరో వైపు.. కొట్టుకుపోతుంటే అవే వారికి చివరి చూపులయ్యాయి.. మాటలకందని ఈ విషాద ఘటనలో 12 మంది విగతజీవులవ్వగా, 27 మంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన దాదాపు 37 మంది కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ‘దేవుడా.. మా నాన్నను మా వద్దకు ప్రాణాలతో చేర్చు.. స్వామీ మా అమ్మను బతికించు.. భగవంతుడా.. మా అన్నను సజీవంగా మా ఇంటికి చేర్చు.. ఈ జీవితానికి ఇదే మా ఆఖరు కోరిక..’ అంటూ వారు గోదారి ఒడ్డున గుండెలవిసేలా పొగిలి పొగిలి ఏడుస్తున్నారు. నా భర్త, బిడ్డ వెళ్లిపోయారు.. ఇక నేనెందుకు బతకాలి దేవుడా.. అంటూ మామ అస్థికలను గోదావరిలో కలపడానికి తిరుపతి నుంచి వచ్చిన మాధవీలత కన్నీరుమున్నీరుగా విలపించింది. వీరందరినీ ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. దేవీపట్నం నుంచి సాక్షి బృందం : ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్న వారి ఆశ అడియాస అయింది. పాపికొండలు చూసొద్దామని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గోదావరమ్మ ఒడిలో జల సమాధి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం మధ్యాహ్నం 71 మందితో వెళ్తున్న బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, 32 మంది గల్లంతయ్యారు. భోజనాల కోసం లైఫ్ జాకెట్లు తీసేసిన సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. గోదావరి నది చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద ప్రమాదాలలో ఇది రెండోది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశించారు. హెలికాఫ్టర్లు, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలను రంగంలోకి దించారు. రాత్రి సైతం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన వశిష్ట బోటు అనుమతి లేదని ఆపేసినా.. గోదావరిలో వరద కారణంగా నెల రోజులుగా పాపికొండలకు బోటు ప్రయాణాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరి వరద కొద్దిగా నెమ్మదించింది. ఆదివారం కావడంతో పాపికొండలు చూడటం కోసం పర్యాటకులు గండిపోశమ్మ గుడి వద్దకు వచ్చారు. రాయల్ వశిష్ట అనే రెండు అంతస్తుల ప్రైవేట్ బోటులో వివిధ ప్రాంతాలకు చెందిన 63 మంది పర్యాటకులు, 8 మంది సిబ్బందితో కలిసి మొత్తం 71 మంది ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆక్కడి నుంచి బయలుదేరారు. దేవీపట్నం వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. అనుమతి లేదంటూ దేవీపట్నం ఎస్ఐ నాగదుర్గాప్రసాద్ బోటును నిలిపివేశారు. అయితే తమకు పోలవరం పోలీసుల నుంచి అనుమతులు వచ్చాయంటూ బోటు నిర్వాహకులు బోటును తీసుకుని ముందుకు సాగారు. బోటు అక్కడి నుంచి బయలుదేరిన మూడు గంటల తర్వాత 1.45 గంటల ప్రాంతంలో కచ్చులూరు మందం వద్దకు చేరుకుంది. అక్కడ కొండ మలుపు ఉండటం వల్ల గోదావరి కొండను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. సాధారణంగా బోట్ నిర్వాహకులు ఆ వైపుగా కాకుండా పశ్చిమగోదావరి జిల్లా వైపుగా తీసుకువెళ్తుంటారు. అయితే బోట్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి వడి ఉధృతంగా ఉన్న వైపుగా బోటును తీసుకెళ్లారు. ఆ సమయంలో బోటు పై అంతస్తులో ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చున్న పర్యాటకులు అక్కడ జరుగుతున్న వినోద కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారు. మరికొందరు కింది అంతస్తులో భోజనాలు చేస్తున్నారు. అంతలో బోటు ఒక్కసారిగా కుదుపునకు లోనవడంతో పైన ఉన్న పర్యాటకులు అందరూ ఒక్కసారిగా వెనక్కి పడిపోయారు. వారిలో కొంతమంది కుర్చీలతో సహా బోట్లో నుంచి నదిలోకి పడిపోయారు. అదే సమయంలో బోటును ముందుకు తీసుకువెళ్లేందుకు డ్రైవర్ ఇంజన్‌ను ఒక్కసారిగా రైజ్ చేయడంతో ఒక్కసారిగా వెనక్కి ముందుకు ఊగింది. దీంతో మరికొందరు నదిలో పడిపోయారు. అంతలో బోటు నీట మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు అందరూ వేసుకుని ఉండుంటే.. బోటు నీట మునిగిన సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకున్నవారు మాత్రమే మృత్యువు నుంచి తప్పించుకున్నారు. మిగిలిన వారు నీట మునిగారు. భోజన సమయం కావడంతో ఎక్కువ మంది లైఫ్ జాకెట్లు వేసుకోలేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. బోటు మునిగిపోతుండటం చూసిన పశ్చిమగోదావరి జిల్లా తూటు కుంట గ్రామస్తులు, దేవీపట్నం మండలం కచ్చులూరు గిరిజనులు ఐదు ఇంజన్ బోట్లలో సంఘటనా స్థలానికి చేరుకుని 27 మందిని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గల్లంతైనవారిలో ఎక్కువ మంది తెలంగాణాకు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖాజీపేట, హయత్‌నగర్, ఎల్బీనగర్, కృష్ణాజిల్లా బాపులపాడు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, విశాఖపట్నం జిల్లా వేపగుంట, అరిలోవ, గుంటూరుజిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. తమతోపాటు వచ్చినవారు తమ కళ్లముందే నీట మునిగి పోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్న వారు కన్నీటి పర్యంతమయ్యారు. రక్షించిన వారిలో 16 మందిని రంపచోడవరం ఏరియా అసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో మొబైల్ ఫోన్లు పనిచేయక పోవడంతో సమాచారం అందడంలో జాప్యం చోటు చేసుకుంది. రంపచోడవరం ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు యుద్ధప్రాతిపదికన కదిలిన యంత్రాంగం ప్రమాదం విషయం తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించారు. మంత్రులను, అధికారులను సంఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. హెలికాఫ్టర్లను, వివిధ బృందాలను వెంటనే రంగంలోకి దింపారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధరరెడ్ది, రేవు ముత్యాలరాజు, ఎస్పీలు నయీమ్, నవదీప్‌సింగ్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి ఇతర అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఉప ముఖ్యమంత్రులు ఆళ్లనాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు తెల్లంబాలరాజు, నాగులపల్లి ధనలక్ష్మి, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారు ఉండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా జరిగిన సంఘటనపై ఆరా తీశారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణాకు చెందిన క్షతగాత్రుల పరిస్థితిని వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబుతో తెలంగాణా మంత్రులు కేటీఆర్, ఎర్రబల్లి దయాకరరావు మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ ప్రమాద ఘటనపై ట్విటర్లో సంతాపం తెలిపారు. చదవండి : 10 లక్షల పరిహారం గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం మేమైతే బతికాం గానీ.. ముమ్మరంగా సహాయక చర్యలు ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి.. -
ముమ్మరంగా సహాయక చర్యలు
సాక్షి, అమరావతి, విశాఖపట్నం, గుంటూరు రూరల్ : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడంతో ఎక్కువ మంది ప్రాణాలు కాపాడగలిగారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో మాట్లాడి సహాయ చర్యలను వేగవంతం చేశారు. మంత్రి కన్నబాబు, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ తదితర మంత్రులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడి సహాయక చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్ బృందాలు, 12 ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక నావీ చాప్టర్, ఓఎన్జీసీ చాప్టర్ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. మరో రెండు నేవీ గజ ఈతగాళ్ల బృందాలను రప్పిస్తున్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా సైడ్ స్కాన్ సోనార్ పరికరాలను వినియోగిస్తున్నారు. ప్రమాదంలో గల్లంతైన వారు గోదావరి ఉధృతికి కొట్టుకుపోకుండా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నెట్ (వల) ఏర్పాటు చేశారు. కాగా, తక్షణ సహాయక చర్యలు చేపట్టడంతో 27 మందిని కాపాడగలిగామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా మరో 37 మందికి పైగా గల్లంతైనట్టు ఆ శాఖ పేర్కొంది. గాలింపు కోసం సోమవారం ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్టు ప్రకటించింది. గాలింపులో నేవీ హెలికాఫ్టర్లు లాంచీ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యల్లో భారత నావికాదళం పాలుపంచుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు జెమిని బోట్, గాలింపు చర్యలకు ఉపకరించే సామగ్రితో పాటు 20 మంది సుశిక్షితులైన డీప్ సీ డ్రైవర్స్‌ను నేవీ డోర్నియర్లో పంపించారు. ఇది నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా నుంచి బయల్దేరి ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకుంది. సోమవారం రెండు నేవీ హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ లాంచీ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి సుచరిత స్పష్టీకరించారు. బోటు అనుమతులు, ఇతర విషయాలపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. బోటు ప్రమాదంపై సీఎస్ సమీక్ష బోటు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, విపత్తుల నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబు, ఇతర అధికారులతో టెలిఫోన్లో సమీక్షించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితోనూ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ప్రతీ క్షణం అప్రమత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై ఇప్పటికే రెండు సార్లు అధికారులతో సమీక్ష జరిపారని, ప్రతీ క్షణం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. ఆదివారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సమీప జిల్లాల్లోని అధికారులందరూ ప్రమాద స్థలానికి చేరుకుని గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారని వివరించారు. రాత్రి సమయంలో గాలింపు చర్యలకు ఆటంకం కలుగకుండా ప్రత్యేక లైట్లు, నేవీ ప్రత్యేక లైటింగ్ బోట్లు, హెలికాప్టర్లను ఏర్పాటు చేశామన్నారు. గ ల్లంతైన వారి కోసం నదీ పరీవాహక ప్రాంతాల్లో సముద్రం వరకు అక్కడక్కడ సహాయక, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి క్షణం అప్రమత్తతతో వేలాది మందితో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని మంత్రి వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో సిబ్బందితో కలిపి 71 మందికి పైగా ఉన్నారని, వారిలో ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు 27 మందిని ప్రాణాలతో కాపాడాయని చెప్పారు. 12 మంది మృతదేహాలను వెలికి తీశారని తెలిపారు. -
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల వద్ద జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల్లో తెలంగాణవాసులు ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పడవ ప్రమాదంపై గవర్నర్ విచారం సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిలో పడవ ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాగర్–శ్రీశైలం బోటు టూరు రద్దు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య నిర్వహించే బోటు టూర్ ను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నీటి ప్రవాహ వేగం పెరగటంతో శని,ఆదివారాల్లో నిర్వహించే బోటు టూర్‌ను రద్దు చేసుకుంది.