
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి విచారణా ధికారిగా తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. బోటు ప్రమాదానికి గల కారణాలు, వైఫల్యాలు, అసలు ఏం జరిగిందనే దానిపై వాస్తవ పరిస్థితులు విచారణ చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment