బోటు యజమాని.. జనసేనాని! | Godavari Boat Accident : Many Cases Registered On Boat Owner in Past | Sakshi
Sakshi News home page

బోటు యజమానిపై గతంలోనూ కేసులు

Published Thu, Sep 19 2019 10:41 AM | Last Updated on Thu, Sep 19 2019 4:56 PM

Godavari Boat Accident : Many Cases Registered On Boat Owner in Past - Sakshi

సాక్షి, విశాఖ సిటీ: గోదావరి నదిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై గతంలోనూ అనేక కేసులున్న విషయం వెలుగుచూసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తొలి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. ముఖ్యంగా స్వగ్రామంలో భూ దందాలకు సంబంధించి 2009 నుంచి 2017 వరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సరిపల్లి గ్రామంలో సర్వేనం. 148/15లో 400 గజాల స్థలంపై తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు అమ్మిన ఘటనపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో 308/2017 చీటింగ్‌ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది.

అలాగే 238/2009లో పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో కొట్లాట కేసు నమోదు కాగా 2013 మే నెలలో కోర్టులో రాజీ పడ్డారు. గ్రామంలో సర్వే నెంబర్‌ 267లోని ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నారన్న ఆరోపణలపై 117/2011లో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా మరో కేసులో ఇదే పోలీస్‌స్టేషన్‌లో 147/2019 ద్వారా వెంకటరమణతో పాటు మరి కొందరిపై బైండోవర్‌ నమోదుచేశారు.
 
నిబంధనలంటే లెక్కలేదు..
2012 నుంచి రాజమండ్రిలో బోటు ద్వారా జలరవాణా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వెంకటరమణ కొద్దిరోజులకే కుటుంబంతో సహా అక్కడికి మకాం మార్చాడు. గోదావరి నదిలో కేవీఆర్‌ ట్రావెల్స్‌ పేరుతో రెండు లాంచీలు నడుపుతున్నాడు. అయితే రెండింటికీ ప్రభుత్వ శాఖల తరపున ఎలాంటి అనుమతులూ లేవు. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో అంటకాగడంతో వెంకటరమణ వ్యాపారానికి అడ్డే లేకుండా పోయింది. కాగా గత ఎన్నికల్లో జనసేన క్రియాశీల సభ్యుడిగా వెంకటరమణ ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. రాజమండ్రితో పాటు సొంత ప్రాంతం విశాఖలో కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

సంబంధిత కథనాలు :
నిండు గోదారిలో మృత్యు ఘోష
30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత
కన్నీరు మున్నీరు
అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే

కృష్ణా నదిలో బోట్లు నడిపితే కఠిన చర్యలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement