
సాక్షి, రాజమండి: తూర్పుగోదావరిజిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిన లాంచి వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. రెండోరోజు ఉదయాన్నే బోటు మునిగిన ప్రాంతంలో మరోసారి ఐరన్ రోప్‌ను నదిలో దించారు. దానిని ప్రొక్లైయిన్‌కు కట్టి లాంచీ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి బోటు ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకుంటే బయటకు తీసుకురావచ్చని బాలాజీ మెరైన్ సంస్థ భావిస్తోంది. ఒకటి రెండురోజుల్లో లాంచి ఆచూకీ తెలుసుకున్నాక, బయటకు తీస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment