సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమించి బయటకు తీసిన సంగ తెలిసిందే. బోటు వెలికితీయగా అందులో 8 మృతదేహాలు లభించాయి. అందులో వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ, ప్రర్యాటకులు.. వరంగల్ జిల్లాకు చెందిన బసికి ధర్మారాజు, నల్గొండ జిల్లాకు చెందిన సురభి రవీందర్, వరంగల్ అర్బన్ జిల్లా కొమ్మల రవి, నంద్యాలకు చెందిన బసిరెడ్డి విఖ్యాత రెడ్డిల మృతదేహాలను కుటుంబీకులు గుర్తుపట్టారు. దీంతో 7 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
బోటులో దొరికిన మరో మృతదేహం ఎవరిదో గుర్తించాల్సి ఉంది. బోటు ప్రమాదంలో జల సమాధి అయిన మరో 5 గురు పర్యాటకుల మృతదేహాలు ఆచూకీ ఇంకా దొరకలేదు. కాగా, సెప్టెంబర్ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. అందులో ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు.
మొత్తంగా ఆచూకీ తెలియాల్సిన మృతుల వివరాలు..
1. తలారి గీతా వైష్ణవి(4), విశాఖపట్నం జిల్లా
2. తలారి ధాత్రి అనన్య(6), విశాఖపట్నం జిల్లా
3. మధుపాడ అఖిలేష్(6), విశాఖపట్నం జిల్లా
4. కారుకూరి రమ్యశ్రీ(25), మంచిర్యాల
5. కోడూరి రాజ్‌కుమార్, వరంగల్
6. కొండే రాజశేఖర్, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment