దేవీపట్నం (రంపచోడవరం): తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొలిక్కి రావడం లేదు. ఆదివారం కూడా బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. తీరానికి అతి సమీపంలో బోటు ఉండటంతో డీప్ వాటర్ డ్రైవర్లతో బోటుకు యాంకర్లు బిగించి ధర్మాడి సత్యం బృందం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం నిన్న కూడా విఫలయత్నం చేసింది. బోటు ఆచూకీ గుర్తించి అయిదు రోజులు గడిచిపోగా.. గురు, శుక్ర, శనివారాల్లో బోటును ఒడ్డు వైపునకు 70 అడుగుల మేర చేర్చారు. శనివారం మూడుసార్లు వృత్తాకారంలో ఐరన్ రోప్‌ను బోటు ఉన్న ప్రాంతంలో నదిలోకి విడిచిపెట్టి ఉచ్చు మాదిరిగా బిగించి బయటకు లాగే ప్రయత్నం చేశారు.
అయితే, ఖాళీ రోప్ మాత్రమే బయటకు వచ్చింది. బోటు ఉన్న ప్రాంతంలో నదీగర్భం ‘వి’ ఆకారంలో ఉండటం వల్ల బోటు బయటకు రావటం కష్టంగా మారిందని చెబుతున్నారు. రోప్‌తో లంగరు వేసినప్పటికీ బోటుకు సరిగా తగులుకోకపోవడంతో జారిపోతోంది. శనివారం బోటుకు సంబంధించి లైఫ్‌బాయ్ (నీటిలో ప్రయాణికుల రక్షణకు ఉపయోగించే ట్యూబు లాంటి పరికరం) ఒకటి బయటకు వచి్చంది. ఐరన్ రోప్‌ను పొక్లెయిన్ సాయంతో లాగుతున్న సమయంలో బోటుకు తగిలించిన రెండు లంగర్లకు కట్టిన తాడు తెగిపోయి లంగర్లు గోదావరి పాలయ్యాయి.
38 అడుగుల లోతులో..
ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగులు లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉందని వెలికితీత పనులకు నాయకత్వం వహిస్తున్న పోర్టు అధికారి కెపె్టన్ ఆదినారాయణ చెప్పారు. బోటును మరో ఇరవై మీటర్లు మేర ఒడ్డు వైపునకు తీసుకొస్తే బోటును సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చని తెలిపారు. ఇదిలావుంటే.. బోటు వెలికితీత పనులు కొలిక్కి రాకపోవడంతో అండర్ వాటర్ సరీ్వస్ కారి్మకుల(దుబాస్)ను కచ్చులూరు తీసుకొచ్చేందుకు ధర్మాడి సత్యం విశాఖపట్నం వెళ్లారు. మరోవైపు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి బంధువులు నిన్న కచ్చులూరు చేరుకుని వారి ఆచూకీ కోసం ఎదురు చూశారు. ఇదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment