పడవ ప్రమాదంలో 32 మంది మృతి! | 32 Dead as Boat Capsizes in Buriganga River in Bangladesh | Sakshi
Sakshi News home page

పడవ ప్రమాదంలో 32 మంది మృతి!

Published Mon, Jun 29 2020 7:22 PM | Last Updated on Mon, Jun 29 2020 9:08 PM

32 Dead as Boat Capsizes in Buriganga River in Bangladesh - Sakshi

ఢాకా: సోమవారం  బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బురిగాంగ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇప్పటివరకు 32 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలతో బయటపడిన వారు తెలిపిన వివరాల ప్రకారం, ఓల్డ్  ఢాకాలోని శ్యాంబజార్ ప్రాంతం వెంట సోమవారం ఉదయం 9:15 గంటలకు  యమ్‌ ఎల్‌ మార్నింగ్‌ బర్డ్ అనే పడవ మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. (కరోనా: బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ కార్యదర్శి మృతి)
 
"ఎంఎల్ మార్నింగ్ బర్డ్ మరొక పడవ మోయూర్ -2 ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని వల్ల నీరు పడవలోకి చేరుకుంది’ అని ఢాకా ట్రిబ్యూన్ అగ్నిమాపక సేవా ప్రధాన కార్యాలయం అధికారి రోజినా అఖ్టర్‌ తెలిపారు. “డిజైన్ ప్రకారం,  సామర్థ్యం కొద్ది ఆ పడవలో 45 మంది ప్రయాణికులను తీసుకెళ్లాలి కానీ మరికొంత మంది ప్రయాణికులను అధికంగా ఎక్కించుకోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. వేరొక పడవను ఢీ కొట్టడం వలన ఈ ఘటన చోటు చేసుకుంది ” అని కమాండర్‌ గోలం సాడేక్ తెలిపారు. మృతదేహాలను వెలికి తీసినందు వల్ల ఇప్పుడు పడవను పైకి తీసేందుకు ప్రయత్నింస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా విచారం వ్యక్తం చేశారు.  (బంగ్లాదేశ్‌లో కివీస్‌ పర్యటన వాయిదా)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement