సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. గోదావరిలో వరద ఉధృతి తగ్గడంతో బోటు వెలికితీత పనులను ముమ్మరం చేసింది. ఇందుకోసం భారీ లంగరు, 3 వేల అడుగుల ఐరన్ రోప్‌ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం బోటు మునిగిన ప్రాంతంలో వేసిన ఐరన్ రోప్‌కు బలమైన వస్తువు తగలడంతో.. దానిని సత్యం బృందం బోటుగా భావించింది. భారీ నైలాన్ తాడుతో పొక్లెయిన్ సాయంతో బోటును వెలికితీసేందకు ప్రయత్నించారు. అయితే బలంగా లాగడంతో లంగరు జారిపోయినట్టగా సత్యం బృందం వెల్లడించింది.
ప్రమాదం జరిగిన చోటు నుంచి బోటు ముందకు వచ్చినట్టు సత్యం బృందం తెలిపింది. బోటుకు సంబంధించిన తెల్లని రంగు నీళ్లపై కి తేలిందని పేర్కొంది. కొద్ది రోజుల కిందట సత్యం బృందం బోటు వెలికితీత పనులు ప్రారంభించినప్పటికీ గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో పనులను నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment