
సాక్షి, తూర్పు గోదావరి : కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. బోటు వెలికితీతకు యత్నిస్తున్న ధర్మాడి సత్యం బృందం బోటు ఆచూకీని కనుగొంది. ఈ క్రమంలోనే సత్యం బృందం వేసిన యాంకర్‌కు బోటు రెయిలింగ్ తగిలింది. యాంకర్ లాగడంతో బోటు రెయిలింగ్ బయటకు వచ్చింది. దీంతో సత్యం బృందం మరోసారి తన ప్రయత్నించింది. దేవుడిగొంది ఇసుక తిన్నె వద్ద ఒడ్డు నుంచి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో బోటు ఉన్నట్టు గుర్తించామని సత్యం బృందం తెలిపింది.
అయితే చీకటి పడటంతో మూడో రోజు బోటు వెలికితీత పనులను నిలిపివేశారు. మరోవైపు కాకినాడు పోర్ట్ అధికారులు బోటు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ధర్మాడి సత్యం బృందాన్ని అడిగి బోటు ఆచూకీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment