
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గార మండలం బందరువానిపేట తీరంలో విషాదం చోటుచేసుకుంది. వేకువజామున చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడింది. పడవలో మొత్తం ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ముగ్గురు మత్స్యకారులు గల్లంతు అవ్వగా, ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment