సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సభ్యులుగా ఉంటారు. బోటు ప్రమాదంపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కమిటీని ఆదేశించారు. 45 రోజుల్లో లాంచీ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో బోటు మునిగిపోయి పలువురు ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment