
ప్రతీకాత్మకచిత్రం
గంగా నదిలో పడవ మునిగిన ఘటనలో ఆరుగురి మృతి
లక్నో : గంగా నదిలో పడవ మునిగిపోవడంతో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మరణించిన ఘటన యూపీలోని చందోలిలో వెలుగుచూసింది. శనివారం సాయంత్రం పడవ నీట మునిగిన సమాచారం అందడంతో వారణాసి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 40 మంది కూలీలతో ప్రయాణిస్తున్న పడవ తిరుగు ప్రయాణంలో గంగా నదిని దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుందని చందోలి ఎస్పీ హేమంత్ కుతియాల్ తెలిపారు. నది మధ్యలో పడవ బోల్తా పడటంతో ప్రమాదం జరిగిందని 35 మంది క్షేమంగా బయటపడగా ఐదుగురు మహిళలు సహా ఆరుగురి ఆచూకీ గల్లంతైందని ఎస్పీ వెల్లడించారు.