
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
బరైచ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సరయూ నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. స్థానిక గోపాల్‌పుర ప్రాంతానికి చెందిన వారు రామ్‌గావ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. బెహతా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని జిల్లా కలెక్టర్ అజయ్ దీప్ సింగ్ తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 9 మంది ఉండగా.. అందులో ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను బయటకు తీశారు. మృతులను రాజేష్(25), బ్రిజేష్(20), మగన్(17), విజయ్(16), తిరితి(12) షకీల్(12)లుగా గుర్తించారు.