ప్రమాద ఘటనపై విజయసాయిరెడ్డి ట్వీట్‌ | Vijaya Sai Reddy Tweet On Boat Capsizes At Devipatnam East Godavari | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం : విజయసాయిరెడ్డి

Published Mon, Sep 16 2019 9:59 AM | Last Updated on Mon, Sep 16 2019 10:09 AM

Vijaya Sai Reddy Tweet On Boat Capsizes At Devipatnam East Godavari - Sakshi

సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి  జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘గోదావరిలో దేవీపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలు రూపొందించి అమలు చేయాలి’అని పేర్కొన్నారు. 

ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’  అని ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement