Godavari river
-
గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ
కామెడీ, రియాలిటీ షోలతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. రాజమండ్రి గోదావరి నదిలో అస్థికలు కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి భావోద్వేగానికి గురైంది. జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటానని రాసుకొచ్చింది.సాధారణంగా సొంతవాళ్లు చనిపోతే వారి అస్థికలని కుటుంబ సభ్యులు.. పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. కానీ యాంకర్ రష్మీ మాత్రం తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలని రాజమండ్రి దగ్గరున్న గోదావరిలో కలిపింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోలని చిక్కుల్లో పడేసిన గుట్కా యాడ్)తాను ఎంతగానే ప్రేమించిన శునకానికి కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసింది. 'జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా. మరో జన్మంటూ ఉంటే నువ్వు బాధలేకుండా పుడతావని కోరుకుంటున్నాను. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. ప్రశాంతంగా వెళ్లు చుట్కీ గౌతమ్' అని రాసుకొచ్చింది.ఇకపోతే రష్మీకి కుక్కలంటే చాలా ఇష్టం. లాక్ డౌన్ లో వీధి కుక్కల తనవంతు సాయంగా ఆహారం పెట్టింది. పలు శునకాల్ని కూడా పెంచుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ కుక్కల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం
-
మహాజన సమ్మేళనానికి శ్రీకారం
విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి, అక్కడి నుండి శివుడి జటా జూటంలో పడి, హరిద్వార్ వద్ద దివి నుండి భువికి దిగి వచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్నదని భక్తుల నమ్మకం. అందుకే కుంభమేళా అక్కడ జరుపుతారు.12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమ యాన్ని ‘కుంభమేళా’ అనీ, ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అనీ, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ‘మాఘీమేళా’ అనీ పిలుస్తారు. ‘కుంభము’ అంటే బాండము అనీ, ‘కలశం’ అనీ మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభ మేళా జరుగుతుంది. ‘సూర్యుడు మకర రాశిలో, బృహ స్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా’, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్ధ కుంభమేళా జరుగుతుంది.కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు, రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగు తున్న సాంప్రదాయిక ఊరేగింపు జరుగుతుంది. ఈ సమయంలో నాగ సాధువులు, మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు, అఖాడాలు ముందు నడుస్తుండగా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా అను సరిస్తారు. అనంతరం ‘షాహిస్నాన్’ (పుణ్యస్నానాలు) ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు.వీరంతా ‘ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తుంటారు. పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. జనవరి 24, 25వ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం, 26 తేదీన దేశం నలు మూలల నుండి 128 ఆరాధన మార్గాలకు చెందిన ‘సంత్ సమ్మేళనం’, 27వ తేదీన ‘యువ సంత్’ (యువ సన్యా సుల) సమ్మేళనం జరుగబోతున్నది ప్రపంచంలోని 13వ వంతు ప్రజలు పాల్గొనే సన్ని వేశం కుంభమేళ. సగం దేశాల జనాభా కంటే ఎక్కువ. 2017లో అర్ధ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొ న్నట్లు, 2001వ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ఆధ్యా త్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్య్రం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు. అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన గరుత్మంతుడిని గుర్తు చేసుకొని భారతమాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకొని వెళుతుండేవారు. దేశవ్యాప్తంగా తిరు గుబాటు ఆందోళనలు జరగడానికి, స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి. నానా సాహెబ్ పీష్వా, ధుంధుపంత్, బాలాసాహెబ్ పేష్వా, తాంతియా తోపే, ఝాన్సీరాణి లక్ష్మిబాయి, రంగోజి బాపు, జగదీష్పూర్ జమీందార్ బాబు కున్వర్ సింగ్ మొదలైన వారు పాల్గొన్న ఈ ఉద్యమంలో సామాన్య ప్రజలను కూడా భాగస్వాములు కావాలనే సందేశాన్ని తెలియజేయడానికి తామర పువ్వును, రొట్టెలను ప్రసా దంగా పంచి పెట్టాలని ఇక్కడే నిర్ణయించారు. ఈ సంవత్సరం ప్రయాగరాజ్ ‘మహా కుంభమేళా’ జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగ బోతోంది. కుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్‌కు 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. భక్తులకు ఏర్పాట్లు సౌకర్యాల నిమిత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రూ. 2,100 కోట్లు విడు దల చేయాలని నిర్ణయించింది. అలాగే కుంభ మేళ్లా జరిగే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా భారీగా నిధులను కేటా యించి ఈ అద్భుత యజ్ఞాన్ని నిర్వహించ తలపెట్టడం ముదావహం. మహా కుంభమేళా జరిగే స్థలాలుగంగానదిలో (హరిద్వార్– ఉత్తరాఖండ్) క్షిప్రానదిలో (ఉజ్జయిని– మధ్యప్రదేశ్)గోదావరి నదిలో (నాసిక్– మహారాష్ట్ర)గంగా నదిలో (ప్రయాగ్‌రాజ్–ఉత్తరప్రదేశ్;గంగా, యమునా, అంతర్వాహినిగా ప్రవహి స్తున్న సరస్వతి నది సంగమం వద్ద.)ముఖ్యమైన రోజులు1. పౌష్య పూర్ణిమ: జనవరి 13 సోమవారం2. మకర సంక్రాంతి: జనవరి 14 మంగళవారం– మొదటి షాహిస్నానం.3. మౌని అమావాస్య (సోమవతి): జనవరి 29 బుధవారం– రెండవ షాహిస్నానం.4. వసంత పంచమి: ఫిబ్రవరి 3 సోమవారం– మూడవ షాహిస్నానం.5. మాఘీ పూర్ణిమ: ఫిబ్రవరి 12 బుధవారం6. మహాశివరాత్రి: ఫిబ్రవరి 26 బుధవారం – ఆకారపు కేశవరాజు ‘ వీహెచ్‌పీ కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ -
ప్రకృతి ప్రేమికులకు రా రమ్మని... స్వాగతం
గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించాలని అనుకుంటున్నారా? అయితే, మీరు పాపికొండలు యాత్రకు వెళ్లాల్సిందే. భద్రాచలం సమీపాన పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి నిత్యం బోట్లు నడిపిస్తుండగా.. క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవులు రానున్న నేపథ్యాన పర్యాటకుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యాన పాపికొండల అందాలు, యాత్ర మిగిల్చే తీయని అనుభవాలపై ప్రత్యేక కథనమిది.రెండు మార్గాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాపికొండల యాత్రను సందర్శించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటోది.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న పోచమ్మ గండి పాయింట్ వద్ద నుంచి బోట్లో ప్రారంభమై.. పేరంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. రెండోది.. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి ప్రారంభమయ్యే మార్గం. ఈ పాయింట్ తెలంగాణలోని భద్రాచలానికి సమీపాన ఉంటుంది. దీంతో పర్యాటకులు ఒకరోజు ముందుగానే చేరుకుని రామయ్యను దర్శించుకుని.. ఆపై పాపికొండలు యాత్రకు బయలుదేరుతారు.భద్రాచలం నుంచి ఇలా.. హైదరాబాద్ నుంచి పాపికొండల యాత్రకు రావాలనుకునే వారు ముందుగా భద్రాచలం చేరుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి విరివిగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గంలో వచ్చే వారు కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రావాలి. ఇక్కడ వీలు చూసుకుని సీతారాముల దర్శనం చేసుకున్న తర్వాత.. భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోటింగ్ పాయింట్ ఉన్న పోచవరం గ్రామానికి బయలుదేరవచ్చు. 70 కిలోమీటర్ల జలవిహారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి లేదా 5 గంటల మధ్యలో ముగుస్తుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద పర్యాటకులను ఎక్కించుకుని మళ్లీ అక్కడే దింపుతారు. సుమారు ఆరు గంటల పాటు 70 కిలోమీటర్లు గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుత అవకాశం ఈ యాత్రలో పర్యాటకులకు కలుగుతుంది. పేరంటాలపల్లి సందర్శన పాపికొండల యాత్రలో పేరంటాల పల్లి వద్ద నున్న ప్రాచీన శివాలయం వద్ద బోటు ఆపుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుడిని గిరిజనులే నిర్వహిస్తున్నారు. గుట్ట పైనుంచి జాలువారే నది జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటారు. యాత్ర ప్రారంభానికి ముందు లేదా తర్వాతైనా పోచవరానికి సమీపాన వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి రాముడి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. షెడ్యూల్, ధరలు ఇలా.. పోచవరం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాపికొండల యాత్రకు సంబంధించి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750గా ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. కళాశాల విద్యార్థులు గ్రూపుగా పర్యటనకు వస్తే.. వారికి రూ.850, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 ప్యాకేజీ ధరగా ప్రకటించారు. అయితే శని, ఆదివారం, సెలవు దినాల్లో.. దీనికి అదనంగా రూ.100 వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలోనే భోజన సౌకర్యాన్ని బోటు నిర్వాహకులు కల్పిస్తారు. భద్రగిరిలోని రామాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లు విక్రయిస్తారు. ఇసుక తిన్నెల్లో విడిది.. రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం, ఇసుక తిన్నెలు, వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే వెదురు హట్స్‌ల్లో రాత్రి వేళ బస చేయాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని సిరివాక అనే గ్రామం వద్ద పర్యాటకుల కోసం హట్స్ ఉన్నాయి. గుడారాలలో ఒక్కొక్కరికి రూ.4 వేలు, వెదురు కాటేజీల్లో అయితే రూ.5,500గా ధర నిర్ణయించారు. ఉదయం పోచవరం నుంచి వెళ్లి.. రాత్రికి సిరివాకలో బస చేయిస్తారు. అనంతరం మర్నాడు సాయంత్రానికి పోచవరానికి లాంచీలో చేరుస్తారు. రెండు రోజుల పాటు భోజన వసతి, ఇతర సౌకర్యాలను నిర్వాహకులే చూసుకుంటారు. ఈ టికెట్లు కూడా భద్రాచలంలో అందుబాటులో ఉంటాయి. పటిష్టమైన రక్షణ ఏపీలోని కచ్చలూరు లాంచీ ప్రమాదం అనంతరం పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని బోట్లకు అనుసంధానం చేసిన శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు, వాటిని నియంత్రించే బోటింగ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీసు, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు.. పర్యాటకుల ధ్రువీకరణ పత్రాలను సరిపోలి్చన తరువాతే బోటులోకి అనుమతిస్తారు. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నారు.ఆహారం ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అల్పాహారం, టీ అందిస్తారు. మధ్యాహ్న సమయాన బోటులోనే శాఖాహార భోజనంతో ఆతిథ్యాన్ని అందిస్తారు. సాయంత్రం యాత్ర ముగిసిన తరువాత మళ్లీ బోట్ పాయింట్ వద్ద స్నాక్స్, టీ అందజేస్తారు. పాపికొండల ప్రయాణంలో కొల్లూరు, సిరివాక, పోచవరం వద్ద ‘బొంగు చికెన్’ అమ్ముతారు. ఆకట్టుకునే వెదురు బొమ్మలు పేరంటాలపల్లి దగ్గర గిరిజనులు తయారు చేసిన వెదురు బొమ్మలు, వస్తువులు ఆకట్టుకుంటాయి. రూ.50 నుంచి రూ.300 వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.👉పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు) -
కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ బుధవారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ సరైన సమయంలో కాకపోవడం, పనులు ప్రారంభం కాకపోవడంతో కాంట్రాక్ట్ రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుంది. అదే ఖర్చుతో.. గోదావరి ఫేజ్ 2 స్కీమ్ ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని జలమండలి అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. -
గోదావరి నదిలో కనిపించని పులస చేపలు
-
AP: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కాకినాడ జిల్లా: గోదావరి నదిలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కొనసాగుతోంది. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కావడంతో గ్యాస్ నదిలో పొంగుతూ బుడగలుగా బయటకు వెళ్తుంది. లీకేజీని ఆపేందకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా లీకేజీ అదుపులోకి రావడం లేదు.యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది ముఖ ద్వారానికి సమీపంలో గ్యాస్ లీకేజీ కావడంతో గోదావరి, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకం కానుందని గ్యాస్ లీకేజీపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
నిలకడగా గోదావరి
పోలవరం రూరల్/ధవళేశ్వరం/విజయపురిసౌత్: గోదావరి నది ప్రవాహం శనివారం నిలకడగా సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.790 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 8.15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తూ, మిగిలిన 7,81,839 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాల విడుదలశ్రీశైలం నుంచి వచ్చే కృష్ణాజలాలు పెరగటంతో శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి కృష్ణానదిలోకి 32,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 77,496 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ కుడికాలువ ద్వారా 10 వేల క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 3,667, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 29,029, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
కృష్ణా, గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరిలలో వరద కూడా తగ్గుతోంది. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి.. వాటి ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి సోమవారం రాత్రి 7 గంటలకు 3.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు రెండు వేల క్యూసెక్కులను వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 3.46 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే, శ్రీశైలంలోకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. జూరాల, సుంకేశుల బ్యారేజీ నుంచి శ్రీశైలంలోకి 2.37 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2.14 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 206.5365 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 883.40 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్, పులిచింతలలోకి.. వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 588.30 అడుగుల వద్ద ఉండగా ఇది 306.9878 టీఎంసీలకు సమానం. కృష్ణాకు వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ కృష్ణాజిల్లాలోని తీరప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇక గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.79 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అదే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురిసిన వర్షాల ప్రభావంతో వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఏలేరు వరద ఉధృతి పెరిగింది. ఏలేరు రిజర్వాయర్‌లోకి 46,405 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 23.23 టీఎంసీలకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి 25,275 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంపా, తాండవ, సుబ్బారెడ్డిసాగర్తో పాటు ఏలేరు దానికి అనుబంధంగా సుద్దగడ్డ, దబ్బకాలువ, గొర్రికండి వంటి వాగులు, ఏరులు పోటెత్తాయి. గట్లకు గండ్లు పడి పలు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు సోమవారం గొల్లప్రోలు ముంపు ప్రాంతంలో పర్యటించారు. పెద్దాపురం మండలం కాండ్రకోటలో దబ్బ కాలువపై ఏలేరు ఉ«ధృతికి వంతెన కొట్టుకుపోయింది. మరోవైపు.. ఏలేరు వరద ముంచెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ సోమవారం నాగులాపల్లి పర్యటనలో సూచించారు.అల్లూరి జిల్లాలో వర్ష భీభత్సం..అల్లూరి జిల్లాలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా గిరిశిఖర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన గెడ్డలు, వాగులలో వరద ఉధృతి ప్రమాదకరంగా ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జోలాపుట్టు, డుడుమ, సీలేరులోని గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు వరద నీరు పోటెత్తడంతో దిగువకు భారీగా నీటిని విడిచి పెడుతున్నారు. చింతపల్లి నుంచి సిలేరు వరకు విస్తరించి ఉన్న అంతర్రాష్ట్ర రహదారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.వరద ముంపులో ‘మాచ్‌ఖండ్’ జల విద్యుత్కేంద్రంఇక ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలోకి వరద నీరు చేరింది. డుడుమ, జోలాపుట్టు జలాశయాల నుంచి 85 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో 2వ నంబర్ నుంచి సోమవారం విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. నీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రాజెక్టు మనుగడకే ముప్పు అని భావించిన అధికారులు విద్యుత్ ఉత్పాదనను నిలిపివేశారు. ప్రస్తుతం బ్యాక్ ఫీడింగ్ ద్వారా మూడు క్యాంపులకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
ఉగ్ర గోదావరి.. శాంతించిన కృష్ణ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం: ప్రశాంతంగా ఉన్న గోదావరి ఉగ్రరూపం దాలి్చతే.. మహోగ్ర రూపం దాలి్చన కృష్ణ శాంతిస్తోంది. పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండం, ప్రధాన పాయతోపాటు ఉప నదులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్దకు 8.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నీటి మట్టం 46.06 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరదకు శబరి తోడవడంతో కూనవరం వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటింది. పోలవరం ప్రాజెక్టులోకి వచి్చన వరదను వచి్చనట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు.ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు గురువారం రాత్రి 10 గంటల సమయానికి 10,06,328 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి 10,04,528 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అంతే స్థాయిలో దిగువకు వదలేస్తుండటంతో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. మరింత తగ్గిన కృష్ణా వరద కృష్ణా నదిలో వరద మరింత తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,39,744 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,39,244 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే వరద 1.36 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం నుంచి దిగువకు వదిలేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 1.26 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేస్తూ దిగువకు 38 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరే వరద శుక్రవారం మరింతగా తగ్గనుంది. -
ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
-
గోదావరి డేంజర్ బెల్స్.. ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.వాయుగుండం ఎఫెక్ట్‌తో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంది. వరద నీరు పెరగడంతో అలర్ట్ అయిన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే తాజాగా కురిసిన వర్షం కారణంగా ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి వరద కూడా పెరుగుతున్న క్రమంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.ఇక, తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో వరద పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 9.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, ఆరు లక్షల 61వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలవుతోంది. 1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరా అవుతోంది. వర్షాల కారణంగా వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
అనుసంధానమా? అపహరణమా?
గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు ఫైళ్ళు ఢిల్లీలో వేగంగా కదులుతున్నాయి. అప్పట్లో కేంద్ర జలవనరుల శాఖా మంత్రిగా వున్న నితిన్ గడ్కరీ 2017లో తొలిసారిగా ఈ ప్రాజె క్టును ప్రతిపాదించారు. 2019 జనవరిలో స్వయంగా అమరావతి వచ్చి, 60 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపడు తున్నట్టు ప్రకటించారు. నిజంగా ఉన్నాయో లేవో స్పష్టంగా తెలియని గోదా వరి అదనపు జలాలే కావేరి అనుసంధానం ప్రాజెక్టు రూపకల్పనకు ఆధారం. ప్రతి ఏటా 1,100 టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రం పాలవుతున్నదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. చెన్నై సభలో నితిన్ గడ్కరీ ఏకంగా ఏటా 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నదని వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాల్లో 90 శాతం నిధుల్ని అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే కనుక అప్పటి రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం ఆనందించిందేగానీ, దీని వెనుక నున్న వాటర్ హైజాక్ కుట్రను గమనించలేదు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే మాట నిజం. ఇందులో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అప్పట్లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో వుంది. దక్షణాదిలో ఆ ఒక్క రాష్ట్రాన్ని అయినా కాపాడుకోకుంటే ‘ఉత్తరాది హిందీ పార్టీ’ అనే నింద తప్పదు. గోదావరి నీటిని ఎరగా చూపి తమిళ నాడులోనూ కాలు మోపాలనే ఆశ బీజేపీలో చాలా కాలంగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడమే విచిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల వివాదాలు నడుస్తున్నాయి. కావేరి అనుసంధానం ఈ వివాదాల్ని పరిష్కరిస్తుందా? మరింతగా పెంచుతుందా? అనేది ఎవరికయినా రావలసిన ప్రశ్న. 1980 నాటి బచావత్ ట్రిబ్యునల్ గోదావరి నదిలో 3,565 టీఎంసీల నికర జలాలున్నట్టు తేల్చింది. అప్పట్లో గోదావరి నది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సాల మీదుగా ప్రవహించేది. ఇప్పుడు అదనంగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. గోదావరి నది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 1,495 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్ 85లో ఈ నీటిని జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు 64 శాతం, తెలంగాణకు 36 శాతం చొప్పున పంపిణీ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ. అయినప్పటికీ, బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ వాటా ఇచ్చింది. దానికి రెండు హేతువులు చెప్పింది. మొదటిది, కృష్ణానది మీద తొలి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడ్డాయి. రెండోది, నిర్మాణం పూర్తయి ఆయకట్టు కలిగున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపును ఇచ్చి తీరాలి. అయితే, దీనికో పరిష్కారం కూడా బచావత్ ట్రిబ్యునల్ సూచించింది. భవిష్యత్తులో గోదావరి బేసిన్ నుండి కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్ళిస్తే, అందులో 18 శాతం మహారాష్ట్రకు, 27 శాతం కర్ణాటకకు కృష్ణా నికర జలాల నుండి ఇవ్వాలని ఓ నియమం పెట్టింది. పోలవరం నుండి 80 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్ళిస్తే అందులో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందుతాయి. మిగిలిన 45 టీఎంసీల్లో 36 శాతం అంటే 16 టీఎంసీలు తమకు వస్తాయని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. పోలవరం నుండి మళ్ళించే 80 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు నికరంగా దక్కేది 29 టీఎంసీలే. కృష్ణా, గోదావరి నదుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నికర జలాలను జనాభా ప్రాతిపదికన కాకుండా, పరి వాహక ప్రాంతం ప్రాతిపదికన పంచాలని తెలంగాణ వాదిస్తోంది. గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో మూడు దశలున్నాయి. మొదటి దశలో ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ మధ్య గోదావరి–కృష్ణా నదుల్ని అనుసంధానం చేస్తారు. రెండో దశలో నాగార్జునసాగర్, సోమశిల ప్రాజెక్టుల మధ్య కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తారు. మూడవ దశలో సోమశిల నుండి కట్టలాయ్ మధ్య పెన్నా, కావేరి నదుల్ని అనుసంధానం చేస్తారు. పెన్నా– కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు 2022 కేంద్ర బడ్జెట్లోనే నిధుల్ని కేటాయించారు. ఈ నాలుగు నదుల అనుసంధానానికి ముందు, ఆ తరువాత కూడా మరో మూడు నదుల అనుసంధానాలు ఉన్నాయి. ఉత్తరాన మహానదిని గోదావరి నదితో అనుసంధానం చేస్తారు. దక్షిణాన కావేరి నదిని తమిళనాడులోని వాగాయ్, గుండార్ నదులతో అనుసంధానం చేస్తారు. కావేరి–గుండార్ ప్రాజెక్టును కర్ణాటక వ్యతిరేకిస్తున్నది. అయినప్పటికీ, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ఇప్ప టికే మొదలు పెట్టేసింది. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కన్నా చిన్న తరహా ప్రాజెక్టులే మేలనేది ఇప్పుడు బలపడుతున్న అభిప్రాయం. నీటి పారుదల ప్రాజెక్టుల్ని సమర్థంగా నిర్వహిస్తున్న ఉదా హరణ మనకు ఒక్కటీ కనిపించదు. తుంగభద్రా డ్యామ్ గేటు కొట్టుకొని పోవడం దీనికి తాజా ఉదాహరణ. స్టాప్ లాగ్ గేట్లు, కౌంటర్ వెయిట్ వ్యవస్థ, ఇతర పరికరాలు అదనంగా అందుబాటులో ఉంచుకోవాలనే ఆలోచన కూడ నీటిపారుదల శాఖ అధికారులకు రాలేదు. ఆ గేట్లకు కొన్నేళ్ళుగా కనీసం గ్రీజు కూడా పెట్టలేదట. నదుల అనుసంధానం వల్ల నాలుగు రకాల నష్టాలు ఉంటాయి. మొదటిది – పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుంది. రెండోది – నదులు, నీటి వనరుల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనికి పోతాయి. మూడోది – జల వనరులపై వాణిజ్య హక్కుల్ని మెగా కార్పొరేట్లకు అప్పగించడానికి దారులు తెరచుకుంటాయి. నాలుగోది – ప్రతి ఏటా నది నీళ్ళు సముద్రం లోనికి పారకపోతే సముద్రం నది వైపునకు దూసుకుని వచ్చి డెల్టా భూముల్ని చవిటి పర్రలుగా మార్చేస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గోదావరి – కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చింది. జూలై నెలలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ వర్చువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన చేసింది. గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుండి మొదలెట్టాలని కోరింది. తెలంగాణలోని ఇచ్చంపల్లి, సమ్మక్క–సారక్క ప్రాజెక్టుల కన్నా ఏపీలోని పోలవరం నుండి మొదలెడితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. నరసా రావుపేట సమీపాన బొల్లపల్లె వద్ద 300 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మిస్తే అక్కడి నుండి పెన్నా నదికి సులువుగా అనుసంధానం చేయవచ్చని సూచించింది. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో కొన్ని కొత్త చిక్కులున్నాయి. ఇందులో కీలకమైనది అసలు గోదావరి నదిలో వెయ్యి టీఎంసీల అదనపు జలాలున్నాయని ఎలా, ఎక్కడ, ఎప్పుడు నిర్ధారిస్తారు? గోదావరి నది మీద చివరి ప్రాజెక్టు ధవళేశ్వరం. అక్కడ తేల్చాలి అదనపు జలాలు ఉన్నాయో లేవో! సాధారణంగా గోదావరి నదిలో ఎక్కువ నీళ్ళు ఆగస్టు నెలలో వస్తాయి. ఆగస్టు నెలలో పోలవరం నుండి కావేరి ప్రాజెక్టుకు వెయ్యి టీఎంసీల నీళ్లు విడుదల చేసేస్తే, ఆ తరువాతి నెలల్లో నదిలోనికి అనుకున్నంత నీరు రాకపోతే ఏమిటీ పరిస్థితీ? గోదావరి డెల్టా ఆయకట్టుకు 175 సంవత్సరాలుగా ఉన్న లోయర్ రైపేరియన్ హక్కులు ఏం కావాలి? అంతేకాదు; ఎగువ రాష్ట్రాల నుండి ఇంకో సమస్య కూడా వస్తుంది. గోదావరి బేసిన్ నుండి కృష్ణా బేసిన్‌కు వెయ్యి టీఎంసీల నీటిని మళ్ళిస్తే ఎగువ రాష్ట్రాలు అందులో వాటా కోరకుండా వుంటాయా? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్ని సాగునీటి సంక్షోభంలోకి నెట్టే పథకం ఇది.డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు -
కృష్ణ గోదావరి నదులకు కొనసాగుతున్న వరద.. ప్రాజెక్టులకు జలకళ
-
లంక గ్రామాలను ముంచెత్తిన గోదావరి వరద
-
శాంతించిన గోదావరి..
-
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.కాగా, భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గోదావరిలో నీటి మట్టం పెరిగింది. దీంతో, రానున్న 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం అలాగే కొనసాగుతోంది. ఇక, భద్రాచలం వద్ద ఈరోజు ఉదయం ఆరు గంటలకు గోదావరి వరద 53.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులకు నేడు సెలవును రద్దు చేశారు. అధికారులందరూ నేడు విధుల్లోనే ఉండనున్నారు.మరోవైపు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. గోదావరి నీటి మట్టం 15 అడుగులు నమోదైంది. దీంతో, 14 లక్షల 83 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వెళ్తోంది. ఇక, అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, గోదావరి వరద రోజుల తరబడి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అప్పన రాముని లంక, గంటి పెదపూడి లంకల వద్ద అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన లంక ప్రాంతాల్లో ట్రాక్టర్లు, కాలినడకన లంకవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. -
గోదావరి దూకుడు..
-
వరదలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదికి వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. సోమవా రం మంత్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్య టించారు. గోదావరి తీరంలో కరకట్టలను పరిశీలించి, జిల్లా అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని.. వరద తగ్గేవరకు కూనవరం– భద్రాచలం– దుమ్ముగూడెం రోడ్ల మీదుగా రాకపోకలను నిలిపేయాలని సూచించారు. భద్రాచలంలోకి చేరే వరద నీటిని నదిలోకి ఎత్తిపోసేలా మోటార్లు సిద్ధం చేయాలన్నారు. అనంతరం బూర్గంపాడు మండలంలో పొలాలను పరిశీలించారు. ‘పెద్దవాగు’పై అధికారుల వైఫల్యం అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడటానికి ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని పొంగులేటి పేర్కొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారీ వరద వస్తుంటే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని.. ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేయించలేదని మండిపడ్డారు. అధికారులకు నోటీసులు ఇచ్చామని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం గత పదేళ్లుగా తగినంత శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు.ప్రాజెక్టు విషయంలో తప్పు జరిగిన విషయాన్ని అంగీకరిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని తిరిగి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తారని తెలిపారు. ఆలోగా ఫీడర్ చానల్ లేదా రింగ్‌బండ్ నిర్మించి ఆయకట్టు రైతులకు నీరు అందించేందుకు ప్రయతి్నస్తామన్నారు. ప్రాజెక్టు గండ్లు, వరదలతో నష్టపోయిన వారిని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వంతోపాటు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తామని ప్రకటించారు. వరద కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రెండు నెలల్లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ముగ్గురు ఇంజనీర్లపై చర్యలకు సిఫారసు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు ‘పెద్దవాగు’. 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా 1981లో దీనిని నిర్మించారు. 40,500 క్యూసెక్కుల వరదను విడుదల చేసేలా స్పిల్‌వేను డిజైన్ చేశారు. కానీ 1989లో 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో స్పిల్‌వేకు ఎడమవైపు 200 మీటర్ల వరకు కట్టకు గండిపడింది. ఇప్పుడు 75వేల క్యూసెక్కుల వరద రావడంతో మళ్లీ గండ్లు పడ్డాయి.దీనికి నిర్వహణ లోపమే కారణమని.. ఎగువ నుంచి భారీ వరద రానుందని సమాచారమున్నా ఇంజనీర్లు సకాలంలో గేట్లు ఎత్తలేదని.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలేవీ జారీ చేయకుండా నీటిని విడుదల చేశారని అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు నిర్వహణలో విఫలమైన డీఈఈ, ఏఈఈ, ఏఈలపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రాజెక్టుకు గండ్లు పడటంతో 16 గ్రామాలు నీట మునిగాయి. రూ.100 కోట్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. -
ఉగ్ర గోదావరి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలు, పోటెత్తుతున్న ఉప నదులు కలసి దిగువ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ గోదావరిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. దానికి దిగువన కడెం ప్రాజెక్టు నుంచి, వాగుల నుంచి వస్తున్న వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది.అయితే దాని దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ (లక్షి్మ) బరాజ్‌కు 9,54,130 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రవాహానికి ఇతర ఉప నదులు, వాగులు కలసి.. తుపాకులగూడెం (సమ్మక్క), దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌ల వద్ద మరింత ఎక్కువగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు 50.20 అడుగులుగా...భద్రాచలం వద్దకు వచ్చేసరికి గోదావరి ఉగ్ర రూపం దాల్చు తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 50.20 అడుగుల నీటిమట్టంతో 13 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. భద్రాచలం నుంచి వెళ్తున్న నీరంతా పోలవరం, ధవళేశ్వరం మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వరద ప్రమాదకర స్థాయికి పెరిగే చాన్స్ మధ్య గోదావరి సబ్ బేసిన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ నీళ్లన్నీ గోదావరిలోకి చేరేందుకు ఒక రోజు పడుతుంది. దీంతో మంగళవారం కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరవచ్చని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. భద్రాచలం వద్ద వరద 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయానికల్లా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన ములుగు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం పర్యటించారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి నది, సామాజిక ఆస్పత్రిని, పలు వరద ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలుమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వానలతో గోదావరి నది పోటెత్తుతోంది. కొన్ని నెలలుగా సరిగా వానల్లేక, నీటికి కటకటతో ఇబ్బందిపడగా.. ఇప్పుడు భారీగా వరదలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తేయడం, నీటి ఎత్తిపోతలు చేపట్టకపోవడంతో నీళ్లన్నీ వృధాగా వెళ్లిపోతున్నాయి. మరోవైపు ఎగువ గోదావరిలో పెద్దగా ప్రవాహాలు లేక ఎల్లంపల్లిలోకి నీటి చేరిక మెల్లగా కొనసాగుతోంది.మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే.. అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లిని నింపుకొని, అక్కడి నుంచి మిడ్‌మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ తదితర రిజర్వాయర్లను నింపుకొనే అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. కానీ గోదావరి నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేక వరద అంతా సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం.. గోదావరిలో ఈ నెల 17 నుంచి సోమవారం సాయంత్రం వరకు 200 టీఎంసీల మేర నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఎగువ నుంచి నీళ్లు రాక, కాళేశ్వరం లిఫ్టింగ్ లేక.. ఈసారి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమేనన్న చర్చ జరుగుతోంది. -
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
పోటెత్తుతున్న ‘గోదావరి’
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉప నదులు శబరి, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని కూడా పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి పోటెత్తుతోంది. గోదావరికి ఎగువున ప్రాణహిత తోడవ్వడంతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లోకి ఆదివారం సా.6 గంటలకు 5,52,600 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లు ఎత్తేసి, వచి్చంది వచి్చనట్లుగా దిగువకు వదిలేస్తున్నారు.ఈ ప్రవాహానికి ఇంద్రావతి వరద జత కలిసింది. దీంతో తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి 8,23,450 క్యూసెక్కులు చేరుతుండడంతో అంతేస్థాయిలో గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో దుమ్మగూడెం (సీతమ్మ సాగర్) బ్యారేజ్‌లోకి 9,01,989 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడా వ చి్చంది వచి్చనట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రవాహం కలుస్తోంది. ఫలితంగా.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది.ఆదివారం సా.6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసి.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక.. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. ఇక ఈ వరదలు విలీన మండలాల వాసుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కూనవరం వద్ద శబరి దూకుడు.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో శనివారం భారీ వర్షాలు కురవడంతో శబరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరి దూకుడుతో కూనవరం వద్ద నీటి మట్టం 36.74 మీటర్లకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసిన అధికారులు.. పరివాహక ప్రాంతంలో పల్లపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టులోకి 8,57,707 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే ఎగువన నీటిమట్టం 32 మీటర్లకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తేసి.. మొత్తం 8.60లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నేడు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ? ఇక ఆదివారం సా.6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,74,171 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 7,72,371 క్యూసెక్కులను 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 149.03 టీఎంసీలు సముద్రంలో కలిస్తే.. గతేడాది ఇదే సమయానికి 77.79 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఆదివారం కూడా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం.. ఇప్పటికే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో సోమవారం పేరూరు–ధవళేశ్వరం మధ్య గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. దీంతో సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి చేరే వరద పది లక్షల క్యూసెక్కులను దాటే అవకాశముందని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే.. సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఇళ్లలోకి వరదనీరు.. మరోవైపు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోని టోల్గేట్ సెంటర్‌తో పాటు సంతపాకలు, శబరిఒడ్డు ప్రాంతాల్లోని ఇళ్లలోకి క్రమక్రమంగా వరదనీరు ప్రవేశిస్తోంది. చింతూరు మెయిన్‌రోడ్ సెంటర్ నుండి శబరి ఒడ్డుకు వెళ్లే రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడున్న వివిధ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య.. చింతూరు మండలంలోని సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వంతెన వద్ద ఆదివారం రాత్రికి శబరినది నీటిమట్టం 40 అడుగులకు చేరుకుంది.కుయిగూరు వాగు ఉధృతితో కల్లేరు వద్ద రహదారి కోతకు గురైంది. దీంతో ఏపీ నుండి ఒడిశాకు రాకపోకలు రెండోరోజూ కూడా కొనసాగలేదు. అలాగే, చింతూరు మండలం చట్టి వద్ద వరదనీరు విజయవాడ, జగదల్పూర్ జాతీయ రహదారి–30 పైకి చేరడంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. వందలాది వాహనాలు సైతం నిలిచిపోయాయి. ఇక వీఆర్ మండలంలోని గోదవరి, శబరి ఉభయ నదుల పరివాహక గ్రామాల ప్రజలు వరదతో భయాందోళనకు గురవుతున్నారు. వడ్డిగూడెంతోపాటు మరికొన్ని చోట్ల కూడా గ్రామస్తులు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. జలదిగ్బంధంలో ‘వేలేరుపాడు’30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్.. మూడ్రోజులుగా అంధకారంలో పల్లెలుపొంగిపొర్లుతున్న వాగులు.. ఉగ్రరూపం దాలి్చన గోదావరి, శబరి నదులతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. వేలేరుపాడు మండలానికి దిగువనున్న మేళ్ల వాగు, ఎద్దుల వాగు, టేకూరు వాగుల వంతెనలు నీట మునగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. నార్లవరం, కన్నాయగుట్ట, జీలుగు చెరువు వద్ద రహదారంతా కూడా నీట మునిగింది.ఇక వేలేరుపాడు నుంచి రుద్రమకోట, తాట్కూర్ గొమ్ము, రేపాక గొమ్ము వెళ్లే రహదారులూ నీట మునిగాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. భారీ వర్షాలతో 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మూడ్రోజులుగా విద్యుత్ సరఫరాలేక ఆయా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. -
గోదా‘వడి’.. జింకల్లో అలజడి
సాక్షి అమలాపురం:చుట్టూ ఇసుక తిన్నెలు.. వాటి మధ్య ఒంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి.. అక్కడక్కడా నీటి చెలమలు.. ఆరు అడుగుల ఎత్తున పెరిగే గడ్డి దుబ్బులు.. వాటి కొసన తెల్లటి వింజామరల్లాంటి గడ్డి పువ్వులు. ప్రకృతి స్వర్గధామమైన కోనసీమలో గోదావరి లంకల్లో కనిపించే సహజ దృశ్యాలు ఇవి. చూసిన కనులదే భాగ్యం అన్నట్టు అప్పుడప్పుడూ చెంగుచెంగున గెంతే కృష్ణ జింకల సమూహాలు కనువిందు చేస్తాయి. గోదావరి నదీ పాయల్లోని మధ్య ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని లంకల్లో జనం నివాసముండరు. ఆ లంకల్లో కృష్ణ జింకలు నివాసముంటున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, కొత్తపేట, అయినవిల్లి, ఆత్రేయపురం, ఆలమూరు, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాల్లోని గౌతమీ గోదావరి లంకల్లో వీటి ఉనికి అధికం. ఇటీవల మొక్కజొన్న పట్టుబడికి వెళ్లిన రైతులు ఊబలంక, నారాయణలంక, రావులపాలెం, కేదార్లంక సమీపంలో కృష్ణ జింక గుంపులు ఉండటాన్ని గుర్తించారు. లంక రైతులకు ఇవి పెంపుడు జంతువులుగా మారిపోయాయి. వీటి ఆలనాపాలనా స్థానిక లంక రైతులే చూస్తుంటారు. వీటిని వేటాడేందుకు వచి్చన వారిని రైతులే అడ్డగిస్తారు. అవసరమైతే పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలి గోదావరిలో లంక భూములను రెవెన్యూ అధికారులు సొసైటీలకు అప్పగిస్తున్నారు. ఇక్కడ వరదలకు ఇసుక మేటలు వేస్తుంది. ఇది వ్యవసాయానికి యోగ్యం కాదంటూ ప్రజాప్రతినిధులతో కలిసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాల వల్ల ఇక్కడ ఉండే చీమచింత చెట్లు, తుమ్మ చెట్లు, రేగి చెట్లు, రెల్లు గడ్డి దుబ్బులు కనుమరుగవుతున్నాయి. దీంతో కృష్ణ జింకలకు సహజ సిద్ధమైన ఆవాసాలు లేకుండా పోతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇవి నివాసముంటున్న లంక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిలిపివేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. లంకలను అటవీ ప్రాంతాలుగా మార్పు చేయాలని, అప్పుడే ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుందని వారంటున్నారు. దీంతోపాటు వరదల సమయంలో వీటి రక్షణకు సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వరదలతో ముప్పు వేటగాళ్ల కన్నా గోదావరి వరద కృష్ణ జింకల ఉనికికి ప్రమాదంగా మారింది. ప్రస్తుతం గోదావరికి వరద పోటెత్తడంతో కృష్ణ జింకల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పోలవరం పరిసర ప్రాంతాల్లో కృష్ణ జింకలు వరదలు వచ్చిన సమయంలో అటవీ ప్రాంతాలకు వెళ్లిపోయేవి. కాని కోనసీమ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఇవి వరదల్లో కొట్టుకుపోవడం లేదా ఏటిగట్లలో సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందుతుంటాయి. 2022లో భారీ వరదలకు అధికంగా కృష్ణ జింకలు మృత్యువాత పడ్డాయని లంక రైతులు చెబుతున్నారు. వరదల సమయంలో రైతులను, పశువులను పడవల మీద మెరక ప్రాంతాలకు, ఏటిగట్ల మీదకు తరలిస్తుంటారు. అయితే జింకలను పట్టుకోవడం నేరం కావడం.. అవి వేగంగా పరుగు పెట్టడం వల్ల వీటిని మెరకకు తరలించడం ఇక్కడ రైతులకు అసాధ్యంగా మారింది. మంత్ర ముగ్ధులను చేసే కృష్ణ జింకలు కృష్ణ జింక అరుదైన జంతువు. మన రాష్ట్ర అధికార జంతువు కూడా. నలుపు.. తెలుపు.. గోధుమ వర్ణాల్లో మెలికలు తిరిగిన కొమ్ములతో... చెంగుచెంగున గెంతుతూ చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇవి మన దేశంతోపాటు పాకిస్తాన్, నేపాల్‌లో కూడా ఉంటాయి. పచ్చగడ్డితోపాటు పండ్లను ఆహారంగా తీసుకునే ఈ జింకలు 15 నుంచి 20 కలిసి మందగా తిరుగుతుంటాయి. వీటి కొమ్ములు మూడు నాలుగు మెలికలు తిరిగి 28 అంగుళాల పొడవు ఉంటాయి. మగ జింకలు పైభాగం నలుపు, లేదా గోధుమ రంగులో ఉంటుంది. దిగువన తెల్లరంగులో ఉంటుంది. ఆడజింకలు పూర్తిగా గోధుమ రంగులో ఆకట్టుకునేలా ఉంటాయి. లంకలను అటవీ ప్రాంతాలుగా గుర్తించాలి జింక రక్షణ కోసం అటవీ, జీవవైవిధ్య మండలిని, జిల్లా రెవెన్యూ అధికారులను పలు దఫాలుగా కోరుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. జింకలు నివాసముంటున్న లంకలను అటవీ ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ చట్టాలతో కొంత రక్షణ కలుగుతుంది. లేకపోతే భవిష్యత్ తరాలు కృష్ణ జింకలను కేవలం ఫొటోల్లోనే చూడాల్సి వస్తుంది. – పెదపూడి బాపిరాజు, వాడపాలెం, కొత్తపేట మండలం ప్రభుత్వానికి నివేదిస్తాం కృష్ణ జింకల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిస్తాం. వరదల సమయంలో కృష్ణ జింకలు అవి ఎంపిక చేసుకున్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతాయి. వరదలు తగ్గిన తరువాత తిరిగి తమ నివాస ప్రాంతాలకు వెళతాయి. – వరప్రసాద్, కోరంగి వైల్డ్ లైఫ్ రేంజ్, కాకినాడ జిల్లా -
పోటెత్తిన గోదావరి.. విస్తారంగా వర్షాలు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: గోదావరి పోటెత్తుతోంది. క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలతోపాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో.. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని, శబరి, కడెం ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ నీరంతా చేరుతూ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవాహాలు పెరుగుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. గత ఏడాది వరదలతో ప్రాజెక్టు దెబ్బతిన్న నేపథ్యంలో.. ఈసారి ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు పూర్తిగా నిండకముందే గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కడెం నుంచి వస్తున్న ఈ ప్రవాహాలు, ఇతర వాగులు గోదావరికి తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 42వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. మేడిగడ్డ దిగువ నుంచి ఉప్పొంగుతూ.. గోదావరి నదికి ప్రాణహిత తోడవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్ నుంచి భారీ వరద కొనసాగుతోంది. గేట్లన్నీ ఎత్తి ఉండటంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు దిగువకు వెళ్లిపోతున్నాయి. ఈ ప్రవాహానికి ఇంద్రావతి వరద కలసి.. తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్‌లోకి 8,23,450 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటికి దిగువకు వదిలేస్తున్నారు. మధ్యలో వాగులు, వంకల ప్రవాహం తోడై.. దుమ్మగూడెం (సీతమ్మ సాగర్) బరాజ్‌లోకి 9,01,989 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఆ తర్వాత తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రవాహాలు కలుస్తూ.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస శిబిరాలను సిద్ధం చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. రాత్రి 11 గంటలకల్లా నీటిమట్టం 44.8 అడుగులకు చేరింది. ఇది 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఏపీలో శబరి దూకుడు.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో భారీ వర్షాలతో ఏపీలోని శబరి ఉప నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద నీటిమట్టం 36.74 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి 8,57,707 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే ఎగువన నీటిమట్టం 32 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి.. వచ్చిన నీటిని అంతా దిగువకు వదిలేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బరాజ్‌లోకి 7,74,171 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను వదులుతూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే 149 టీఎంసీలు సముద్రం పాలు.. ప్రస్తుత నీటి సంవత్సరంలో.. అంటే ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ధవళేశ్వరం బరాజ్ నుంచి 149.03 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి ధవళేశ్వరం బరాజ్ నుంచి 77.79 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరీవాహక ప్రాంతాల్లో ఆదివారం కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మేడిగడ్డ అలా... అన్నారం ఇలా.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వానలతో ప్రాణహిత పోటెత్తి మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. అక్కడ గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరిలో దానికి ఎగువన ఉన్న అన్నారం (సరస్వతి) బరాజ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఎగువ నుంచి ప్రధాన నదిలో ఇన్‌ఫ్లో ఏమీ లేకపోగా.. మానేరు, ఇతర వాగుల నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. ఈ నీరంతా కిందికి వదిలేస్తున్నా.. గోదావరి చిన్న పాయలా ప్రవహిస్తోంది. -
గోదావరి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి మూసివేత
రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు: గోదావరి నదిపై రాజమహేంద్రవరం–కొవ్వూరు పట్టణాల మధ్య ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల నిమిత్తం నెల రోజుల పాటు మూసివేయనున్నారు. 1974 నవంబర్ 20న ఈ వంతెనను అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ ప్రారంభించారు. 49 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందించిన ఈ వంతెన పూర్తిగా పాడైంది. సెంట్రల్ క్యారేజ్ వే, వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లు సహా దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 27 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకూ ఈ బ్రిడ్జిని మూసివేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆదివారం ప్రకటించారు. మరమ్మతు పనులకు, తక్షణ పునరుద్ధరణ చేపట్టేందుకు వీలుగా ఈ వంతెనపై అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లు సహా బీటీ క్యారేజ్‌వే పునరుద్ధరణ, 4.473 కిలోమీటర్ల పొడవున దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్ గ్రిడ్ల ప్రత్యేక మరమ్మతులకు రూ.2.10 కోట్లు వెమరమ్మతుల స్తున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే మిల్లింగ్ మెషీన్‌తో బీటీ సర్ఫేస్ తొలగింపు తదితర పనులు చేపట్టారు. ఈ బ్రిడ్జి మీదుగా తిరిగే వాహనాలను గామన్ బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, రవాణా, ఆర్టీసీ అధికారులను కోరామని కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. బ్రిడ్జి మూసివేతపై జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. -
నమామీ గోదావరి..స్వచ్ఛ గోదావరే లక్ష్యంగా ఏపీ సర్కార్ కృషి
-
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్‌ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది. ‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా! పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు. శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్‌బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి. పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు. ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్‌లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే! శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు. రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి మద్రాస్‌లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్. ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది. సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్‌ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్‌తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం. చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్‌ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్‌ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్‌కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి. ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది. డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్‌కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది. అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు. సత్య శోధన శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ) ► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయి. ► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు. ► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్‌లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు. ► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు ► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్‌ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్‌లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్‌లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్‌ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్‌కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు. ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్‌కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు. వర్ధెల్లి మురళి -
ఇంటర్ విద్యార్థి విషాదాంతం.. చదవడం ఇష్టం లేక గోదావరిలో దూకాడు
దండేపల్లి: కాలేజీలో దింపేందుకు తీసుకెళ్లిన తండ్రి వద్దనుంచి కరీంనగర్ బస్టాండ్‌లో తప్పించుకున్న ఓ ఇంటర్ విద్యారి్థ...మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరినదిలో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దండేపల్లికి చెందిన నానవేని మల్లేశ్ కుమారుడు నానవేని ప్రశాంత్, అలియాస్ గట్టు(19) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. మంగళవారం అతన్ని కాలేజీలో దింపేందుకు తండ్రి మల్లేశ్ కరీంనగర్ బయల్దేరాడు. కరీంనగర్ బస్టాండులో దిగగానే ప్రశాంత్ తప్పించుకున్నాడు. కొద్దిసేపు బస్టాండులో అతనికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కాలేజీకి వెళ్లి ఆరా తీయగా, కాలేజీకి రాలేదని చెప్పారు. దీంతో ఇంటికే వచ్చాడేమో అని తండ్రి దండేపల్లికి రాగా..ఇంటికి కూడా రాలేదని కుటుంబసభ్యులు చెప్పడంతో ప్రశాంత్‌ను వెదికేందుకు బయటికి వెళ్లాడు. ఇంతలో సాయంత్రం గూడెం గోదావరినదిలో శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూడగా, అది ప్రశాంత్‌ది కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రశాంత్‌ను గతేడాది దండేపల్లి జూనియర్ కాలేజీలో చేరి్పంచగా ఫెయిల్ అయ్యాడు. అతన్ని ఆ కాలేజీ నుంచి తీసి, ఈయేడాది కరీంగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరి్పంచారు. చదవడం ఇష్టం లేకనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. -
రూ.200 కోట్లతో గ్రామాలకు రక్షణ గోడ
సాక్షి అమలాపురం: గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతినే ప్రాంతాల్లో గ్రోయెన్లు, రివిట్మెంట్ నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లంక గ్రామ వాసుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనలంక రామాలయంపేట, లంకాఫ్ ఠానేల్లంక రామాలయంపేట, అయినవిల్లి మండలం కొండుకుదురులంకలోని తొత్తరమూడివారిపేటలో నదీ కోత తీవ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ముమ్మిడివరం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబులు కోత తీవ్రత గురించి సీఎంకు వివరించారు. ఈ ప్రాంతంలో గ్రోయెన్లు, రివిట్మెంట్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో. బహిరంగంగా వారితో మాట్లాడినప్పుడు పలువురు ఇదే సమస్యను ప్రస్తావించారు. దీనిపై కూనలంకలో సీఎం జగన్.. అప్పటికప్పుడే స్పందిస్తూ ఆరు గ్రామాల్లో కోతకు పరిష్కారం చూపేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జనం నివాసముండే ఆవాస ప్రాంతాల్లో సుమారు 3.5 కిలోమీటర్ల మేర బిట్లు బిట్లుగా గ్రోయెన్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. పొట్టిలంకలో వెయ్యి మీటర్లు, కొండుకుదురులంక వద్ద 400 మీటర్లు, వివేకానంద వారధి వద్ద 300 మీటర్లు, లంకాఫ్ ఠానేల్లంకలో 400 మీటర్లు, కూనలంక వద్ద 800 మీటర్లు, గురజాపులంక వద్ద 600 మీటర్లు చొప్పున నిర్మిస్తామని చెప్పారు. ప్రజల సమక్షంలోనే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు సతీష్‌తో మాట్లాడారు. ఎప్పటికి పూర్తి స్థాయిలో అంచనాలు తయారు చేస్తారని ప్రశ్నించారు. అంచనాలు పూర్తి చేసి, నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి చేయాలని, ఆ తర్వాత నెల రోజులకు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనులు మొదలైన తర్వాత కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌లు తనకు ఫొటోలు పంపాలని ఆదేశించారు. -
కాటన్ బ్యారేజ్ 15.9 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
-
ధవళేశ్వరం వద్ద గోదావరి దూకుడు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి దూకుడు ప్రదర్శిస్తోంది. ఆదివారం సాయంత్రం బ్యారేజ్‌లోకి 16,43,480 క్యూసెక్కులు (142.02 టీఎంసీలు) చేరుతుండటంతో నీటిమట్టం 16 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చి న గరిష్ట ప్రవాహం ఇదే కావడం గమనార్హం. గోదావరి డెల్టాకు 10,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 16,32,780 క్యూసెక్కులను (141.09 టీఎంసీలను) సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 831.357 టీఎంసీల గోదావరి మిగులు జలాలు కడలిపాలవడం గమనార్హం. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం గంటగంటకు తగ్గుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు వస్తున్న ప్రవాహం 13.06 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 50.9 అడుగులకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి 13,80,216 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం స్పిల్ వేకు ఎగువన 34.28, దిగువన 26.21, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 35.43, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 25.47 మీటర్లకు చేరుకుంది. స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి 13.80 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజ్‌లలోకి చేరే ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టనుంది. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి, శబరి నదుల వరద తగ్గుముఖం పట్టింది. గోదావరి వరద శనివారం అర్థరాత్రి నుంచి తగ్గుతుండగా శబరినది వరద ఆదివారం మధ్యాహ్నం నుంచి తగ్గసాగింది. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులు ఇళ్లను ఖాళీచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. చింతూరు మండలంలో వరదనీరు జాతీయ రహదారులపై నిలిచిపోవడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా ప్రజలను, అధికారులను ఆందోళనకు గురిచేసిన వరద ప్రభావం ఆదివారం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరదతో ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో పలు ఇళ్లు నీట మునిగాయి. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి 833 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తోందని ఏఈఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా 20 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం 348.27 అడుగుల మట్టంలో నీరు ఉంది. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలోకి గంటకు 881 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఏలూరు మండలం కోమటిలంక గ్రామం వద్ద నాగరాజు కోడు (పోలరాజు డ్రెయిన్) వద్ద కాజ్‌వేపై వరద నీరు ప్రమాదకర పరిస్థితిలో ప్రవహిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి వద్ద గోదావరి నిలకడగానే ప్రవహిస్తోంది. నరసాపురం పట్టణంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికారులు ఏటిగట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఆచంట మండలంలో అయోధ్యలంక, మర్రిమూల, పెదమల్లంలంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 9 మండలాల్లోని 30 గ్రామాలు వరద బారిన పడ్డాయి. ఇక్కడ శనివారం కన్నా ఆదివారం ఒక అడుగు ఎత్తున ముంపు పెరిగింది. ముమ్మిడివరం మండలం గురజాపులంకలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. పి.గన్నవరం పాత అక్విడెక్టు, అన్నంపల్లి అక్విడెక్టుల వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే మూడుచోట్ల కాజ్‌వేలు మునిగిపోగా, కొత్తగా పలు కాజ్‌వేల మీదకు వరద నీరు చేరింది. పి.గన్నవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, అయినవిల్లి మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. -
వలంటీర్లే ‘రక్షణ’ కవచాలు
సాక్షి అమలాపురం: తమ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సేవలతోనే వలంటీర్లు బదులిస్తున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి ఏటిగట్లు తెంచుకుని ఊళ్లపై పడిపోకుండా తీసుకునే రక్షణ చర్యల్లో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటిగట్లను రేయింబవళ్లు పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నపుడు ఏటిగట్ల రక్షణ చాలా ముఖ్యం. ఆ ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించిన సందర్భాలు గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నో ఉన్నాయి. వరదల సమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 534.73 కి.మీల పొడవునా ఉన్న ఏటిగట్ల పరిరక్షణ గతంలో ప్రభుత్వ యంత్రాంగానికి తలకుమించిన భారంగా ఉండేది. తక్కువ మంది సిబ్బంది ఉండటంతో ఇంత పొడవున ఏటిగట్లను పర్యవేక్షించడం సాధ్యం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వందలాది మంది వలంటీర్లు ఏటిగట్లను పర్యవేక్షిస్తూ పైఅధికారులకు నిరంతరం సమాచారం అందిస్తున్నారు. సమాచారం తక్షణం చేరవేత గత ఏడాది భారీ వరదలకు రాజోలులోని నున్నవారిబాడవ వద్ద గట్టు దాటి నీరు ప్రవహిస్తున్న విషయాన్ని తొలిసారిగా గుర్తించింది వలంటీర్లే. వారిచ్చిన సమాచారంతో అధికారులు వేగంగా రక్షణ చర్యలు చేపట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది కూడా ఏటిగట్ల పర్యవేక్షణ బాధ్యతలను 740 మంది వలంటీర్లకు అప్పగించారు. ప్రతి అర కిలో మీటర్‌కు ఒక వలంటీర్‌ను నియమించారు. వీరు ఏటిగట్ల వద్ద రేయింబవళ్లు కాపలాగా ఉంటూ వరద ఉద్ధృతి, గట్ల పటిష్టతకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం పైఅధికారులకు అందిస్తున్నారు. ముంపు గ్రామాల్లో సేవలు ఏటిగట్ల పర్యవేక్షణ ఒక్కటే కాకుండా వరద ముంపుబారిన పడిన లంక గ్రామాల్లో వలంటీర్లు పలు రకాల సేవలందిస్తున్నారు. ముంపు బాధితులను గుర్తించి, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో సహాయపడుతున్నారు. వారికి భోజన సదుపాయల కల్పన, నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో చొరవ చూపుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం, అయినవిల్లి వంటి వరద ప్రభావం అధికంగా ఉన్న మండలాల్లోని లంక గ్రామాల్లో వీరు చురుగ్గా సేవలందిస్తున్నారు. కష్టసమయంలో ఆసరాగా నిలబడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. నాడు తక్కువగా సిబ్బంది గతంలో గోదావరి వరద సమయంలో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తరువాత ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సహాయంగా ఉండేవారు. ఒక హెడ్‌వర్క్స్ ఏఈ తన పరిధిలో సుమారు 10 నుంచి 15 కి.మీ.ల పొడవున ఏటిగట్టు బాధ్యత చూసేవారు. వీరికి లష్కర్లు సహాయం అందించేవారు. ఇరిగేషన్ శాఖలో కొన్నేళ్లుగా లష్కర్ల కొరత ఉంది. అప్పట్లో ఏటిగట్లకు కన్నాలు పడినా, కుంగిపోయినా, గండ్లు పడే అత్యవసర సమయాల్లో సమాచారం ఉన్నతాధికారులకు చేరడంలో ఆలస్యమయ్యేది. ఈ కారణంగానే 2006 గోదావరి వరదలకు అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడి స్థానికులు పెద్దఎత్తున నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. నిరంతరం అప్రమత్తంగా.. గోదావరి ఏటిగట్ల వద్ద వలంటీర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వారి పరిధిలోని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. గతేడాది వారిచ్చిన సమాచారంతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది కూడా వారు పర్యవేక్షణ పనిలో నిమగ్నమయ్యారు. – పువ్వాడ విజయ్ థామస్, డీడీవో, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
-
లంకల్ని ముంచెత్తిన వరద
సాక్షి నెట్వర్క్: గోదావరి నదిలో ప్రవాహం మహోగ్ర రూపం దాల్చడంతో లంక గ్రామాల్లో ముంపు తీవ్రత మరింత పెరిగింది. లంకలను పూర్తిస్థాయిలో వరద ముంచెత్తగా.. విలీన మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలైన వేలేరుపాడులో 10 గ్రామాలు, కుక్కునూరు మండలంలో 9 గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలేరు–బూర్గుంపాడు, వేలేరు–సీతానగరం రహదారులు నీట మునిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి ఉధృతికి శబరి నది ఎగపోటుకు గురికావడంతో చింతూరు మండలంలోనూ వరద పెరుగుతోంది. ముందుగా ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించిన అధికారులు ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధిత కుటుంబాలకు కేజీ చొప్పున కందిపప్పు పంపిణీ చేశారు. శుక్రవారం శబరి నది కొంత తగ్గడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు కొనసాగాయి. దిగువన లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్న వరద గోదావరికి దిగువన గల అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముంపు తీవ్రత మరింత పెరిగింది. నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను, రోడ్లను, కాజ్‌వేలను వరద ముంచెత్తుతోంది. పి.గన్నవరం మండలంలోని నాలుగు లంకలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా.. మరో నాలుగు లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఈ గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినవిల్లి మండలంలో ఎదురు బిడియం, మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై ముంపు తీవ్రత పెరగడంతో ట్రాక్టర్లు, పడవల మీద ప్రయాణికులు, రైతులను దాటిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని పది మండలాల పరిధిలోని 48 గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీరు వచ్చి చేరింది. సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు భోజనాలను అందిస్తున్నారు. అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద ముంపు మరింత పెరిగింది. 50 వరకు ఇళ్లు నీట మునిగాయి. ఎదురుబిడియం కాజ్వే వద్ద వరద తీవ్రతను గృహ నిర్మాణ శాఖమంత్రి జోగి రమేష్, బోడసకుర్రు వద్ద ముంపు ప్రాంతాలను రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పరిశీలించారు. ఏటిగట్ల పరిరక్షణకు ప్రతి అర కిలోమీటర్‌కు ఒక వలంటీర్ చొప్పున 740 మంది వలంటీర్లను రక్షణగా ఏర్పాటు చేశామని కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక, పుచ్చల్లంక వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగింది. యలమంచిలి మండలం కనకాయలంక, ఆచంట మండలం అయోధ్యలంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాగులో కొట్టుకుపోయి వృద్ధురాలి దుర్మరణం అల్లూరి జిల్లా కూనవరం మండలం దూగుట్టకు చెందిన మడకం భద్రమ్మ (65) అనే వృద్ధురాలు పశువులను మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. అదే జిల్లాలోని ఎటపాక మండలంలో రాయనపేట వద్ద ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిలో కారును దాటించేందుకు ప్రయత్నించగా.. ప్రవాహ ఉధృతికి కారు గల్లంతైంది. అందులో ప్రయాణిస్తున్న భద్రాచలం వాసులు ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సాయంతో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కాగా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో బలివే అడ్డరోడ్డు వద్ద తమ్మిలేరుపై గల రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. వరద విధుల్లో వలంటీర్లు అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో 873 మంది గ్రామ వలంటీర్లు ఉండగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో 550 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా వారి అవసరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నారు. ఐతవరం వద్ద రాకపోకలు పునరుద్ధరణ ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో మున్నేటి వరద ఉధృతి క్రమేపి తగ్గుముఖం పడుతోంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఐతవరం సమీపంలో విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను గురువారం సాయంత్రం నిలిపివేయగా.. శుక్రవారం 7 గంటల నుంచి వాటి రాకపోకలను అనుమతిస్తున్నారు. ముందుగా కేవలం విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను మాత్రమే పంపుతున్నట్టు ఏసీపీ జనార్ధన్ నాయుడు తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గిన తర్వాతే రెండు వైపులా అనుమతిస్తామన్నారు. -
మహోగ్ర గోదావరి!
సాక్షి, హైదరాబాద్/మంథని: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణలోని సీతమ్మసాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శుక్రవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద గోదా వరి వరద 14,32,336 క్యూసెక్కులకు, నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీనితో అధికారులు మూడో ప్రమాద హె చ్చరికను జారీ చేశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నీటి మ ట్టం 54.5 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దీనితో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాలు, కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు ఆర్మీ హెలికాప్టర్ భద్రాచలం చేరుకుంది. శనివారం మధ్యాహ్నం నాటికి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు.. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎగువన నుంచి శ్రీరాంసాగర్‌కు 1.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 58వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం నుంచి 25,517 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 6,44,871 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 6,94,482 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. లక్ష్మి బ్యారేజీ వద్ద 13,79,910 క్యూసెక్కులు, సమ్మక్కసాగర్‌కు 14,47,560 క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 13,48,091 క్యూసెక్కులు వరద నమోదైంది. ఆ నీరంతా దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతి బ్యారేజీలోకి భారీగా వరద చేరడంతో చందనాపూర్ వాగు బ్యాక్ వాటర్ సరస్వతి పంపుహౌస్ సమీపంలోకి చేరింది. పంపుçహౌస్ నుంచి బ్యారేజీ డెలివరీ వ్యవస్థ వరకు వేసిన పైపులైన్ల మీదుగా వరద ప్రవహించింది. బిరబిరా కృష్ణమ్మ పరుగులు సాక్షి, హైదరాబాద్/ గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువన విస్తారంగా వానలు పడుతుండటంతో కృష్ణా ప్రధాన నదిలో వరద పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజె క్టులు దాదాపు నిండటంతో లక్షన్నర క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి ద్వారా 1,58,277 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీనికి దిగువన ప్రవాహాలు తోడై.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.25లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయంలో నీటి మట్టం 826.5 అడుగులకు, నిల్వ 46.13 టీఎంసీలకు చేరాయి. ఇక నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. ఎనిమిది గేట్లు ఎత్తి 19,223 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహం పులిచింతలకు చేరుతోంది. అక్కడ నీటి నిల్వ 25.67 టీఎంసీలకు పెరిగింది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రపై ఉన్న డ్యామ్‌లోకి 1,07,118 క్యూసెక్కులు ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరింది. -
అఖండ గోదావరి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణ మీదుగా దిగువన ఏపీలోని ధవళేశ్వరం దాకా నిండుగా ప్రవహిస్తుండటం.. మొత్తం అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో.. అఖండ గోదావరిగా మారింది. బాబ్లీ బ్యారేజీ నుంచి 2,92,889 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తేసి 2.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 2,40,196 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు స్థానిక ప్రవాహాలు చేరి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 7,40,951 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడ 7,12,294 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. గోదావరిలో 12 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకులగూడెం), సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) బ్యారేజీలకు వస్తున్న నీటిని వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద అప్రమత్తం భద్రాచలం వద్ద గురువారం ఉదయం నీటి మట్టం 50.5 అడుగులకు పెరగడంతో ఆందోళన వ్యక్తమంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత వరద తగ్గి.. రాత్రి 9 గంటలకు 11,77,133 క్యూసెక్కుల వరదతో 48.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నదికి జలకళ మహారాష్ట్ర, కర్ణాటకలలో విస్తారంగా వానలతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఈ సీజన్లో తొలిసారి ఏడు గేట్లు ఎత్తారు. దీంతోపాటు విద్యుదుత్పత్తి కూడా చేస్తూ.. మొత్తం 70,422 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి స్థానిక ప్రవాహం కలసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 71 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 39.2 టీఎంసీలకు చేరింది. దిగువన మూసీ నుంచి వరదతో పులిచింతలలో నీటి నిల్వ 21.88 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యామ్‌కు 1,11,566 క్యూసెక్కుల వరద వస్తోంది. కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్! గురువారం అర్ధరాత్రి కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 లక్షల క్యూసెక్కులతో, 105.1 మీటర్లకు పెరగడం ఆందోళన రేపుతోంది. శుక్రవారం ఉదయానికి నీటి మట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది జూలై మూడో వారంలో గోదావరికి భారీ వరదలు వచ్చి.. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 108.19 మీటర్లకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజ్‌లు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో మేడిగడ్డకు ఏకంగా 26,79,260 క్యూసెక్కుల అతిభారీ వరద వచ్చి బ్యారేజీ గేట్లపై నుంచి పొంగిపొర్లింది. -
గోదావరి ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి ఉప నదులతోపాటు తాలి పేరు, కిన్నెరసాని, కడెం, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గోదావరిలోకి భారీగా వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 5,11,080, సమ్మక్క బ్యారేజీ నుంచి 7,54,470, సీతమ్మసాగర్ నుంచి 10,49,351 క్యూసెక్కులను వదులుతు న్నారు. దీనికి స్థానిక వాగుల ప్రవాహం తోడై.. భద్రాచలం వద్ద ప్రవాహం బుధవారం రాత్రి 9.30 గంటలకు పదకొండున్నర లక్షల క్యూసెక్కులు దాటింది. నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వరద 48.4 అడుగులు దాటింది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పోలవరం వద్ద అలర్ట్: భద్రాచలం నుంచి వస్తున్న నీళ్లు, స్థానిక ప్రవా హాలు కలసి పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్న అధికారులు.. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగు వకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి 8 గంటలకు 8,37,850 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇది గురువారం ఉదయం 10 గంటలకల్లా 12 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో: కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణలో ఉన్న తొలి జలాశయం జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రాజె క్టుకు 30వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యు దుత్పత్తితో 29,641 క్యూసెక్కులు వదులుతు న్నారు. ఈ నీరంతా శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. -
ఏపీలో కృష్ణా నదిలోకి ప్రారంభమైన వరద..ఇంకా ఇతర అప్డేట్స్
-
గోదావరి తగ్గుముఖం..మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/పోలవరం రూరల్/యలమంచిలి: నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం.. ఉప నదుల్లో వరద ఉధృతి తగ్గడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ఫలితంగా భద్రాచలం వద్దకు వస్తున్న వరద శుక్రవారం రాత్రి 7 గంటలకు 8.50 లక్షల క్యూసెక్కులకు.. వరద మట్టం 41 అడుగులకు తగ్గింది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. అలాగే, భద్రాచలం నుంచి అఖండ గోదావరి మీదుగా పోలవరం ప్రాజెక్టులోకి 7,75,079 క్యూసెక్కులు చేరుతోంది. వరద మట్టం స్పిల్ వేకు ఎగువన 32.5, దిగువన 24.22, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 33.35, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 23.65 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 7,75,079 క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 9,84,970 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 9,73,870 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరోవైపు.. ఎగువ నీటి మట్టాలు తగ్గుతుండడంతో ధవళేశ్వరం వద్ద రాత్రి 8గంటలకు కూడా నీటిమట్టం 11.70 అడుగులు ఉంది. వరద నీటిలో గండిపోచమ్మ గుడి దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం శుక్రవారం పూర్తిగా వరద నీటలో మునిగిపోయింది. విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ స్థానిక ఐటీడీఏలో ఉంటూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి నిత్యావసరాలు అందజేయాలని ఆయన ఆదేశించారు. నాలుగు మండలాల్లో 12 లాంచీలు, మర పడవలను సిద్ధంగా ఉంచారు. శబరి నది కూడా శాంతించింది. ఇక.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నదీపాయల మధ్య ఉన్న లంకలకు బాహ్య ప్రపంచంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లంకవాసులు పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. ఎగువున తగ్గినా దిగువున వరద పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక వద్ద కాజ్‌వేపై నుంచి నాలుగు అడుగుల వరద నీరు ప్రవహిస్తోంది. -
భద్రాద్రి గోదావరికి పోటెత్తిన వరద
-
ఏపీ: వానలే వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు (ఫొటోలు)
-
పోలవరం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు
-
గోదావరి నదికి పెరుగుతున్న వరద
-
సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులపై అభ్యంతరాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనుల పరిశీలనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన ద్విసభ్య కమిటీ నేడు జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు కమిటీ పర్యటనలకు అనుగుణంగా సీతమ్మ సాగర్ బ్యారేజీ ప్రభావిత ప్రాంతాల్లో ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3,600 ఎకరాలు అవసరం.. రాష్ట్ర ప్రభుత్వం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ‘సీతారామ’ను చేపడుతోంది. దీని ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంది. దీంతో పాటు 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్టులో కీలకమైన సీతమ్మ సాగర్ బ్యారేజీని అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం, బ్యాక్ వాటర్ ముంపు, నదికి ఇరువైపులా కరకట్టలు తదితర అవసరాల కోసం చర్ల, దుమ్మగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల పరిధిలో 3,600 ఎకరాల స్థలం అవసరమవుతోంది. ఇందులో ఇప్పటికే 3,100 ఎకరాలు సేకరించగా ఇంకా 500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం అందించే నష్టపరిహారంపై నిర్వాసిత రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరోవైపు భూసేకరణ పూర్తి స్థాయిలో జరగకపోయినా బ్యారేజీ నిర్మాణ పనులు మాత్రం చకచకా సాగుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఎంట్రీ.. తమకు తగినంత నష్టపరిహారం చెల్లించడం లేదంటూ సీతమ్మసాగర్ నిర్వాసిత రైతులు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళనలు పెరిగాయి. సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు సాగతున్నాయంటూ ప్రాజెక్టు బాధితుల్లో కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో అన్ని అనుమతులు వచ్చే వరకు బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్ గత ఏప్రిల్ 26న ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పనులు కొనసాగుతుండడంతో బాధితులు మే నెలలో మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులపై వస్తున్న అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని గ్రీన్ ట్రిబ్యునల్ మే 29న నియమించింది. ఇందులో తరుణ్ (రీజనల్ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, హైదరాబాద్), ప్రసాద్ (సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డు) సభ్యులుగా ఉన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వారు బుధవారం అశ్వాపురం, దుమ్ముగూడెం, మణుగూరు, చర్ల మండలాల పరిధిలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయి, నిర్వాసితులకు సరైన పరిహారం అందుతోందా, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో సంబంఽధిత ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీ ప్రతినిధులు, ప్రాజెక్టు నిర్వాసితులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలను కలిసి నేరుగా వివరాలు సేకరించనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో సేకరించిన అంశాలను క్రోడీకరించి జూలై 12లోగా ద్విసభ్య కమిటీ తన నివేదికను అందించాల్సి ఉంటుంది. పరిహారంపై పేచీ.. సీతమ్మ సాగర్ బ్యారేజీ ప్రభావిత ప్రాంత ప్రజలు, రైతులతో ప్రజాభిప్రాయ సేకరణను జూన్ 14న చేపట్టారు. ఈ సమావేశంలో సీతారామ ప్రాజెక్టును ప్రభావిత ప్రాంత రైతులు స్వాగతించినప్పటికీ.. నష్ట పరిహారం విషయంలో మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తుండగా, రైతులు రూ.30 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక బ్యారేజీ నిర్మాణ పనులు జరుగుతున్న అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం గ్రామాల్లోని రైతులు దాదాపుగా సర్వం కోల్పోయిన పరిస్థితి నెలకొంది. దీంతో జల విద్యుత్ కేంద్రంలో ఈ గ్రామాలకు చెందిన వారికి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నీళ్లు లేక బోసిపోయిన కందకుర్తి త్రివేణి సంగమం
-
భద్రాచలం ప్రజలకు ఒణుకు పుటిస్తున్నగోదావరి నది
-
స్వచ్ఛ అఖండ గోదావరి
సాక్షి, అమరావతి: ఒకప్పుడు కాలుష్యకాసారమైన అఖండ గోదావరి నది ఇప్పుడు స్వచ్ఛమైన జలాలతో కళకళలాడుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గోదావరి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు గోదావరి నీటిని నేరుగా తాగవచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. రాయనపేట నుంచి రాజమహేంద్రవరం వరకు అఖండ గోదావరి జలాలు స్వచ్ఛమైనవని సీపీసీబీ కూడా తేల్చింది. సీపీసీబీ గతేడాది నవంబర్‌లో గోదావరి జలాలపై అధ్యయనం చేసింది. జలాలు కాలుష్య రహితంగా మారినట్లు వెల్లడించింది. కాలుష్య కాసారాల జాబితా నుంచి అఖండ గోదావరిని తొలగించింది. మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో సముద్రానికి 1,067 మీటర్ల ఎత్తున మొదలైన గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,465 కి.మీ.ల దూరం ప్రవహించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇందులో తెలంగాణలో భద్రాచలం మండలం రాయనపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాజమహేంద్రవరం వరకూ ఉన్న గోదావరి నిత్యం ప్రవాహంతో నిండుగా కన్పించడం వల్ల అఖండ గోదావరి అని పిలుస్తారు. రాయనపేట నుంచి రాజమహేంద్రవరం వరకు నదీ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మురుగు నీటిని, వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేసేవి. పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే నదిలో కలిపేవారు. దాంతో గోదావరి జలాలు కలుషితమయ్యాయి. సీపీసీబీ 2018లో నిర్వహించిన అధ్యయనంలో అఖండ గోదావరి జలాల్లో పీహెచ్ 6.5 నుంచి 8.5, డీవో (డిజాల్వ్డ్ ఆక్సిజన్) లీటర్‌కు 5 మిల్లీ గ్రాములు, కోలీఫామ్ వంద మిల్లీలీటర్లకు 1742, నీటిలో కరిగిన ఘన పదార్థాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. దాంతో అఖండ గోదావరిని కాలుష్య కాసారాల జాబితాలో ఐదో విభాగంలో చేర్చింది. ఆ విభాగం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. నేడు స్వచ్ఛతకు చిరునామా వైఎస్ జగన్ సీఎం అయ్యాక గోదావరి పరిరక్షణకు ప్రణాళిక రచించారు. నదీ తీర ప్రాంతంలోని గ్రామాలు, రాజమహేంద్రవరంలో మురుగు నీటిని, పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేశాకే నదిలో కలపాలని ఆదేశించారు. దాంతో నదీ తీర ప్రాంతాల్లో వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే కలిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రాజమహేంద్రవరంలో రోజుకు 80.6 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేలా రెండు చోట్ల భారీ ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు)లను నిర్మించారు. వాటి ద్వారా రాజమహేంద్రవరం నగరం మురుగునీటిని శుద్ధి చేశాకే నదిలోకి వదులుతున్నారు. పరిశ్రమల వ్యర్థాలను కూడా ఎస్టీపీలలో శుద్ధి చేశాకే వదులుతున్నారు. దాంతో అఖండ గోదావరి జలాలు స్వచ్ఛంగా మారాయి. అఖండ గోదావరి పరిరక్షణకు సీఎం జగన్ తీసుకున్న చర్యలను పర్యావరణవేత్తలు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. -
నమామి.. గోదావరి!
బావరి.. బుద్ధుడిని బతికుండగా కలిసి, ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన భక్తుడు. ఆయన నివసించిన ప్రాంతం ప్రస్తుత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో ఉన్న బాదన్‌కుర్తి గ్రామం అని అంచనా. ఆయన మరికొందరితో కలిసి ఇక్కడి నుంచే బౌద్ధంపై ప్రచారం ప్రారంభించారని చెప్తుంటారు. గోదావరి నదిపై ఆదిలాబాద్–నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను అనుసంధానిస్తూ 1932లో నిర్మించిన రాతి వంతెన. నాడు ఆసియాలో ఈ తరహా తొలి వంతెన ఇదేనని చెప్తారు. 775 మీటర్ల పొడవైన ఈ వంతెన ప్రత్యేకతలకు మెచ్చి వెండితో దాని నమూనాను చేయించుకుని నిజాం తన నివాసంలో పెట్టుకున్నారు. పురానీ హవేలీలో అది ఇప్పటికీ ఉంది. ఈ వంతెన ఉన్న గ్రామం పేరు సోన్. అదో అగ్రహారం.. దాని వెనక చారిత్రక నేపథ్యమూ ఉంది. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే విదేశీ పక్షులు గోదావరి నదిని ఆలంబనగా చేసుకుంటున్నాయి. గుడ్లు పెట్టి, పిల్లలను పొదిగేందుకు గోదావరి తీర ప్రాంతాలను ఎంచుకున్నాయి. ..ఇలా గోదావరి నదీ తీరాన్ని తరిచి చూస్తే ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. స్థానికులకు తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికర, ఆశ్చర్యకర విశేషాలూ మరెన్నో ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తూ దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నదీ తీరంపై అధ్యయనం చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. – సాక్షి, హైదరాబాద్ నమామి గంగ స్ఫూర్తితో.. ప్రపంచంలోని పెద్ద నదుల్లో ఒకటి, భారతీయులకు పవిత్రమైనదీ అయిన గంగా నదిపై ‘ది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్)’నాలుగేళ్లపాటు విస్తృత అధ్యయనాన్ని నిర్వహించింది. గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమామి గంగ’ప్రాజెక్టులో భాగంగా.. కాలుష్య కోరల నుంచి నదిని రక్షించడం, నదీ తీరంలో విలసిల్లుతున్న ప్రత్యేకతలను ప్రపంచం దృష్టికి తేవడం కోసం ఈ అధ్యయనానికి ఆదేశించింది. ఇంటాక్ నిపుణులు బృందాలుగా విడిపోయి నదికి రెండు వైపులా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రత్యేకతలపై అధ్యయనం చేసి డాక్యుమెంటరీలు రూపొందించారు. అధ్యయనం ఆధారంగా నాలుగు పుస్తకాలను కూడా ప్రచురించారు. నది ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక, సహజ వారసత్వాలపై శోధించి ఎన్నో వివరాలు వెలుగులోకి తెచ్చారు. గంగా నది మలుపులు తిరిగే ప్రాంతంలో ఏర్పడిన పాయలు ఏకంగా 20 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తూ ప్రత్యేక వెట్‌ల్యాండ్‌గా మారి.. జీవ వైవిధ్యాన్ని ఎలా పెంచుతున్నాయో ప్రత్యేక డాక్యుమెంటరీగా రూపొందించారు. గంగా తీరం అంటేనే ఆధ్యాత్మిక పరిమళం. మహా భారత, రామాయణాలతో ముడిపెట్టి స్థానికులు ప్రచారం చేసుకునే కొన్ని ప్రాంతాల్లో పురాతన నిర్మాణ జాడలను గుర్తించారు. ఇప్పుడు వాటిపై పరిశోధనలకు అవకాశం ఏర్పడింది. ఇక బుద్ధుడి కాలం నాటి ప్రత్యేకతలతోపాటు ఆది మానవుల నాటి నిర్మాణాలనూ గుర్తించారు. బాదన్‌కుర్తి గ్రామం ఉన్న గోదావరి చీలిక ప్రాంతం గోదావరిపైనా అధ్యయనం కోసం.. దేశంలో గంగా నది తర్వాత పెద్ద నదిగా ఉన్న గోదావరిపై కూడా ఇలాంటి అధ్యయనం చేస్తే బాగుంటుందని ఇంటాక్ సంస్థ భావించింది. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించగా.. అనుమతిస్తూ, అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తర్వాత ఇంటాక్ ప్రతినిధులు ఇటీవల తెలంగాణ అధికారులను కలిసి చర్చించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నివేదించనున్నారు. త్వరలోనే అధ్యయనం తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ మా ప్రతిపాదనకు పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు. మేం గోదావరి తీరంలో రెండు కిలోమీటర్ల బఫర్ ప్రాంతాన్ని పరిశీలిస్తామని కోరితే.. గంగా నది అధ్యయనం తరహాలో ఐదు కిలోమీటర్ల బఫర్ ప్రాంతంలో నిర్వహించాలని ఆయనే సూచించారు. త్వరలో ప్రణాళిక సిద్ధం చేసుకుని అధ్యయనం ప్రారంభిస్తాం –అనురాధారెడ్డి, ఇంటాక్ తెలంగాణ ప్రతినిధి గంగానది తరహాలో చేస్తాం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మేం గంగా నది పరీవాహక ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు చేసిన విస్తృత అధ్యయనంతో ఎన్నో రహస్యాలను వెలుగులోకి తెచ్చాం. గంగా నది అంటే ఎన్ని వింతలో అని అబ్బురపడే వివరాలు వెలుగులోకి వచ్చాయి. అదే తరహాలో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కూడా సర్వే చేసేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం. త్వరలో ప్రారంభిస్తాం. – సుమేశ్ దుదాని, సైంటిస్ట్ ఆఫీసర్, ఇంటాక్ -
పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి!
సాక్షి, ఏలూరు: పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం.. శివరాత్రి పండుగ వేళ ఏలూరులో విషాదం నెలకొంది. గోదావరిలో ఏడుగురు స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా దోసపాడు వాసులుగా గుర్తించారు. మృతుల వివరాలు ఇవే.. - ఓలేటి అరవింద్ (20) - ఎస్కే లక్ష్మణ్ (19) - పెదిరెడ్డి రాంప్రసాద్ (18). -
యువకుడిని కాపాడిన ఎంపీ మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో దూకబోయిన యువకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ చాకచక్యంగా కాపాడారు. రాజమండ్రి రోడ్డుకం రైల్వే వంతెనపై మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పనిచేశాడు. మంగళవారం బైక్‌పై రోడ్డు కం రైలు వంతెనపైకి వచ్చాడు. మోటారు సైకిల్‌ను పక్కనపెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన ఎంపీ భరత్‌రామ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, కారులోంచి బయటకు దూకి, ఆ యువకుడిని పట్టుకుని రోడ్డు మీదుకు లాగారు. ఎంపీ అనుచరులు కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎంపీ వెంటనే రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ గణేష్‌కు ఫోన్‌చేసి విషయం తెలిపారు. ఆ యువకుడిని ఆటోలో రెండోపట్టణ పోలీసుస్టేషకు తీసుకువెళ్లారు. యువకుడిని కాపాడిన ఎంపీ భరత్‌రామ్‌ను పలువురు అభినందించారు. -
కోనసీమ జిల్లా : వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం (ఫొటోలు)
-
సూసైడ్ స్పాట్..! ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
సాక్షి, నిజామాబాద్: జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే వారికి యంచ గోదావరి బ్రిడ్జి స్పాట్‌గా మారిపోయింది. గలగల పారే గోదారమ్మలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం, జీవితంపై విరక్తి.. కారణాలు ఏవైనా సూసైడ్ స్పాట్ బాసర గోదావరే గుర్తుకువస్తుంది. చదువులమ్మ సరస్వతి మాత అనుగ్రహం పొందాల్సిన వారు గోదావరిలో దూకి కాటికి పోతున్నారు. గత మూడేళ్లలో 20 మంది దానిపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల కాలంలో.. గోదావరి నదిలో దూకి గత మూడేళ్లలో 20 మంది బలవన్మరణం చెందారు. సాయంత్రం, రాత్రి వేళలో బాధితులు అక్కడికి వెళ్లి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరిగేషన్ డీఈఈ వెంకటరమణారావ్ బలవన్మరణం చెందగా తాజాగా రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వ్యాపారి సందీప్ గోదావరి నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారికి జిల్లా సరిహద్దులోని గోదావరి నది బ్రిడ్జి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. ఆత్మహత్యకు పాల్పడిన సందీప్ వాహనం ఎత్తుపెంచాలని కలెక్టర్, సీపీలకు వినతి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన గోదావరి బ్రిడ్జి ఇరువైపులా రక్షణ గోడ ఎత్తును పెంచాలని, కంచెతో రక్షణ కల్పించాలని యంచ గ్రామస్తులు ఇటీవల కలెక్టర్, సీపీలకు వినతిపత్రం సమర్పించారు. బ్రిడ్జికి ఇరువైపులా.. గోదావరిపై నవీపేట మండలం యంచ నుంచి బాసర వరకు గల వంతెనపై రక్షణ గోడ ఎత్తుగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునే వారికి అనుకూలంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా ఎత్తయిన రక్షణ గోడ లేదంటే ఫెన్సింగ్ ఏర్పాటుతో ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంది. అధికారులు ఇందుకోసం ప్రత్యేక చొరవ తీసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బందోబస్తు ఏర్పాటు చేయాలి రాత్రి వేళలో జనసాంద్రత తక్కువగా ఉన్న యంచ గోదావరి బ్రిడ్జిపై పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలి. వంతెనపై రక్షణ గోడ ఎత్తు పెంచడంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయ డం వల్ల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. – వినోద్‌కుమార్, యంచ నిఘా ఏర్పాటు చేశాం వంతెనపై ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకుండా అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. యంచ గ్రామస్తులతో పాటు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నాం. బ్రిడ్జికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. – రాజారెడ్డి, ఎస్సై, నవీపేట ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
జల రవాణా ప్రాజెక్టు పట్టాలెక్కేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదితో బకింగ్ హామ్ కాలువను పునరుద్ధరించటం ద్వారా అనుసంధానించి జల రవాణా చేపట్టాలన్న ప్రణాళిక పట్టాలెక్కేలా లేదు. మహా రాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. నాలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ అద్భుత ప్రాజెక్టు ద్వారా సరుకు రవాణా ఖర్చును నాలుగో వంతుకు తగ్గించే గొప్ప అవకాశం చేజారిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నదుల అనుసంధానం ద్వారా జల రవాణాకు ఊతమివ్వనున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాతి క్రమంలో దీనిపై మౌనం దాల్చడమే ఇందుకు కారణం. డీపీఆర్ తయారీ కసరత్తు వరకు హడావుడిగా జరిగినా, ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో అడుగు ముందుకు పడలేదు. జలరవాణాకు, ముఖ్యంగా గోదావరి నదిలో కారిడార్ ఏర్పాటుకు విఘాతం లేని విధంగా, నదిపై నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పుడు దానితో ప్రమేయం లేకుండా పనులు జరుగుతున్నాయి. వీటివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు చేపడితే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కేంద్రం జోక్యం చేసుకోకపోవడంతో ఊరించిన జలరవాణా ప్రాజెక్టు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటీ ప్రాజెక్టు.. గోదావరి నదిలో సరుకు రవాణాకు వీలుగా ప్రత్యేక కారిడార్ ఏర్పాటును 2015లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర మీదుగా చెన్నై వరకు సరుకులు తరలించేలా ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు గోదావరి ప్రవహిస్తోంది. దీనిని అతిపురాతన బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా అతిపెద్ద ఓడ రేవు ఉన్న చెన్నైతో అనుసంధానిస్తే సరుకు రవాణాలో సరికొత్త విప్లవం వస్తుందని గడ్కరీ యోచించారు. నిపుణులతో సర్వే చేయించారు. బ్రిటిష్ పాలనలో కాకినాడ నుంచి తమిళ నాడులోని విల్లుపురం వరకు 796 కి.మీ. మేర బకింగ్‌హామ్ కెనాల్‌ను నిర్మించారు. అప్పట్లో ఈ కాలువను సరుకు రవాణాకు ముమ్మరంగా వాడారు. స్వాతంత్య్రానంతరం దీని ప్రాభవం క్రమంగా తగ్గిపోయింది. తాజాగా దీన్ని పునరుద్ధరించటం ద్వారా పులికాట్ సరస్సుకు అనుసంధానించి పుదుచ్చేరి వరకు విస్తరించాలన్న ప్రణాళిక రూపుదిద్దుకుంది. గోదావరిని ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం (గోదావరి చివరి బ్యారేజీ) నుంచి కృష్ణా కెనాల్ ద్వారా కృష్ణా నదికి, అక్కడి నుంచి కొమ్ముమూరు కెనాల్ (గుంటూరు జిల్లా దుగ్గిరాల) ద్వారా (ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద) బకింగ్‌హామ్ కెనాల్‌కు అనుసంధానించాలన్నది ప్రతిపాదన. ఈ మేరకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడ ఎలా అనుసంధానించాలో వివరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ ఇప్పుడు ఆ అంశం మరుగున పడిపోవడం సందేహాలకు తావిస్తోంది. సందేహాలకు తావిస్తున్న వంతెనల నిర్మాణం పడవలు నడవాలంటే నదిలో ఎప్పుడూ నీటి నిల్వ ఉండాలి. కానీ గోదావరిలో భద్రాచలం సహా చాలా ప్రాంతాల్లో వేసవిలో నీళ్లు ఇంకిపోతుంటాయి. అందువల్ల జల రవాణాకు వీలుగా ప్రత్యేకంగా కారిడార్‌ను నిర్ధారించి ఛానెల్ ఏర్పాటు ద్వారా అన్ని సమయాల్లో నిర్ధారిత పరిమాణంలో నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు నది దాటేందుకు నిర్మించే వంతెనలు పడవల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా ప్రత్యేక డిజైన్‌ను ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు ఆ డిజైన్‌తో సంబంధం లేకుండా పలుచోట్ల వంతెనల పనులు జరుగుతుండటం ఈ ప్రాజెక్టుపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జల రవాణాతో ఎంతో ఆదా.. ప్రస్తుతం సరుకు రవాణా సింహభాగం రోడ్డు మార్గాన జరుగుతోంది. రైల్వే లైన్ అందుబాటులో ఉన్న చోట ఎక్కువగా రైళ్ల ద్వారా సాగుతోంది. రోడ్డు మార్గాన సరుకు రవాణాకు నాలుగు రూపాయలు ఖర్చయితే, రైలు మార్గాన తరలించేందుకు మూడు రూపాయలు వ్యయం అవుతుంది. అదే జల రవాణా ద్వారా అయితే అర్ధ రూపాయితో సరిపోతుందన్నది నిపుణుల మాట. ఇటీవల ఆ ఊసెత్తని గడ్కరీ.. గతంలో జాతీయ రహదారుల విస్తరణ పనుల ప్రారంభం కోసం తెలంగాణకు వచ్చిన సందర్భంలో గడ్కరీ గోదావరి ఇన్లాండ్ వాటర్ వే గురించి మాట్లాడారు. నాటి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో దీనిపై చర్చించారు. కానీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం దీని ప్రస్తావన తేకపోవడం గమనార్హం. ‘గతంలో ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ గత నాలుగైదేళ్లుగా దీనిపై ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేవు. మేం మా పని చేసుకుపోతున్నాం. వంతెనలకు ప్రత్యేక డిజైన్ విషయంలో కూడా ఎలాంటి సూచనలు అందలేదు..’ అని జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
ఇరిగేషన్ డీఈఈ బలవన్మరణం
నవీపేట: ఆర్మూర్ ఇరిగేషన్ డీఈఈ జోరుపల్లి వెంకట రమణారావు (47) నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం మండలంలోని పోతంగల్ గ్రామంలో తల్లిదండ్రులను కలిసి బయటకు వెళ్లిన డీఈఈ శుక్రవారం గోదావరి నదిలో శవమై కనిపించారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. నిజామాబాద్‌లోని మారుతి నగర్లో వెంకట రమణారావు.. భార్య చందన, కూతురు మనస్వినిలతో కలిసి నివాసముంటున్నారు. ఆర్నెల్ల కిందట కూతురు చదువు కోసం నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చారు. మనస్విని ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రెండ్రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన రమణారావు తల్లిదండ్రులు చంద్రకళ, గంగాధర్‌రావు, తమ్ముడు మధుకర్‌రావుతో కాసేపు మాట్లాడి నిజామాబాద్ వెళ్తానని చెప్పి తన మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. అదే రోజు రాత్రి యంచ శివారులోని గోదావరి నది బ్రిడ్జి దగ్గరకు వెళ్లారు. అక్కడే వాహనాన్ని నిలిపి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అన్నయ్యకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని, ఆయన ఆచూకీ కనిపించడం లేదని మధుకర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నదిలో మృతదేహం దొరికిందంటూ యంచ గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లు శుక్రవారం పోలీసులకు సమాచారమందించారు. ఆ మృతదేహాన్ని రమణారావుగా గుర్తించారు. 11 నెలల నుంచి సెలవులో... నిజామాబాద్ డివిజన్లో డీఈఈగా పని చేసిన రమణారావు రెండేళ్ల కిందట ఆర్మూర్ డీఈఈగా బదిలీపై వెళ్లారు. దీనికంటే ముందే ఆయన కామారెడ్డి జిల్లాకు వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఆర్మూర్‌లో ఓ కీలక ప్రజాప్రతినిధి బలవంతంగా సంతకాలు పెట్టించినట్లు రమణారావు గతంలోనే పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ఆయన 11 నెలల నుంచి సెలవులో ఉన్నారు. హైదరాబాద్‌కు మకాం మార్చడంతో కామారెడ్డికి కాకుండా హైదరాబాద్‌కు బదిలీ కోసం ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తాను చదువుకున్న రోజుల్లో రూమ్మేట్ అయిన మంత్రి హరీశ్‌రావును కూడా ఈ విషయమై కలిసినట్లు తెలిసింది. రమణారావు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమీప బంధువు. ఆమె భర్త అనిల్‌కు బాబాయ్ వరుస అవుతారు. రమణారావు అంత్యక్రియల్లో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కవిత భర్త అనిల్, మామ రాంకిషన్‌రావు పాల్గొన్నారు. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. -
హంసవాహనంలో రామయ్య జల విహారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రగిరిపై కొలువైన వైకుంఠ రాముడు గోదావరి నదిలో జలవిహారం చేశారు. హంసవాహనంలో సీతాసమేతుడై జలవిహారం చేస్తున్న రామయ్యను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తర లివచ్చారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం నిర్వ హించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి తిరుప్పావై సేవాకాలం, మూలవర్లకు అభిషేకం, వేద పారాయణం, ప్రబంధ పాశుర పఠనం.. తదితర కార్యక్రమాలను ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం దర్బారు సేవ అనంతరం ప్రత్యేక పల్లకిలో సీతాసమేత రామచంద్రస్వామిని మేళతాళాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ హంసాకృతిలో అలంకరించిన పడవలో సీతారాములను వెంచేపు చేసి, ఆగమ శాస్త్ర పద్ధతి లో షోడశోపచార పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు హంస వాహనంలో స్వామివారి జలవిహారం ప్రారంభమైంది. ఒక్కో పరిక్రమణాని కి ఒక్కో రకమైన హారతి ఇస్తూ కనుల విందుగా వేడుకను నిర్వహించారు. రాత్రి 7:01 గంటలకు ఐదు పరిక్రమణాలతో తెప్పోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కా గా, భూలోక వైకుంఠంగా పేరొందిన భద్రాచలంలో సోమవారం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సూపర్ స్టార్ కృష్ణ మేకప్ లేకుండా నటించిన చిత్రం ఏమిటో తెలుసా?
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/అమలాపురం టౌన్/ఆత్రేయపురం/అన్నవరం/కొత్తపేట/కరప: సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా ‘సాహసమే ఊపిరి’గా వెండి తెరపై ఎన్నో రికార్డులను నెలకొల్పిన తమ నటశేఖరుడు.. మా ‘మాయదారి మల్లిగాడు’ ఇక లేడనే విషయం తెలుసుకుని కంటతడిపెట్టారు. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, అద్భుత విజయాలు ఆవిష్కరించి.. సినీ ‘సింహాసనం’పై మహానటుడిగా వెలుగొందిన కృష్ణతో తమ ప్రాంతానికి.. తమకు ఉన్న అనుబంధాన్ని స్మరణకు తెచ్చుకున్నారు. నటశేఖరుడు తన సినీ ప్రస్థానం ఆరంభంలోనే జిల్లాతో అనుబంధం ఏర్పరుచుకున్నారు. గోదావరిని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రాజమహేంద్రవరం ముుద్దుబిడ్డ. ఈయన 1965లో నిర్మించిన ‘తేనె మనసులు’ చిత్రం ద్వారా కృష్ణ సినీతెరకు హీరోగా పరిచయమై.. అందరి మనస్సుల్లో చోటు సంపాదించారు. ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన సుకన్య కూడా మన రాజమహేంద్రవరానికి చెందిన ఆరి్టస్టే. ఈ రకంగా ఆయన తొలి హిట్ వెనుక గోదావరి ప్రభావముంది. ‘సాక్షి’ ఓ టర్నింగ్ పాయింట్.. గోదావరి ప్రాంతానికి చెందిన బాపు తీసిన ‘సాక్షి’ చిత్రం కృష్ణ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఈ సినిమాలో కృష్ణ సినిమా పూర్తయ్యే వరకూ మేకప్ లేకుండానే నటించారు. మానవత్వం మీద నమ్మకం గల పల్లెటూరి అమాయకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. విజయనిర్మలతో నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ చిత్ర నిర్మాణం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20 రోజులకు పైగా సాగింది. తర్వాత వరుస విజయాలతో చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ దూసుకుపోయారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం షూటింగ్ రామచంద్రపురం పరిసరాల్లో ఎక్కువ కాలమే సాగిందని ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, భోగిమంటలు, దొరగారికి స్వాగతం, నేనంటే నేనే వంటి తదితర చిత్రాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే షూటింగ్ జరిగాయి. స్వాతంత్ర వీరుడా...స్వరాజ్య బాలుడా..! అల్లూరి సీతారామరాజు సినిమా చిత్రీకరణ ఈ ప్రాంతంపై చెరగని ముద్ర వేసుకుంది. 1974లో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీతో పాటు అన్నవరం పరిసరాలను తొలిసారిగా తెరకెక్కించారు కృష్ణ. తెలుగు వీర లేవరా ’ పాటలోని ‘స్వాతంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా! అనే చరణాన్ని సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో చిత్రీకరించారు. ఆ పాట కోసం రాజమహేంద్రవరం, కడియం నుంచి రెండు లారీల పూలు రత్నగిరికి తీసుకువచ్చి అల్లూరి సీతారామరాజు పాత్రధారి కృష్ణ మీద చల్లారు. 1980 నాయుడు గారి అబ్బాయి షూటింగ్ కూడా అన్నవరంలోనే జరిగింది. కృష్ణ, అంబిక మధ్య ఒక పాట సత్యదేవుని ఆలయ ప్రాంగణం, పంపా నది, మిస్సెమ్మ కొండ పరిసరాల్లో చిత్రీకరించారు. నాయుడు గారి అబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో పలువురు దేవస్థానం ఉద్యోగులు కృష్ణతో ఫొటో దిగారు. కృష్ణ అంటే అభిమానమే వేరు అభిమానులను నటశేఖరుడు గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు. రామచంద్రాపురంలోని రాజు గారి కోటలో ఊరికి మొనగాడు సినిమా షూటింగ్ సమయంలో ఎక్కడెక్కడి నుంచో అభిమానులు వచ్చి పడిగాపులు కాసేవారు. మనసున్న కృష్ణ వారందరికి భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేవారు. భోజనం చేశాక వెళ్లాలని చెప్పేవారని నాటి తరం అభిమానులు చెబుతారు. ఈ సినిమా విజయవంతమైనప్పుడు తమకు వాచీలు బహూకరించారని అభిమాన సంఘం నాయకులు మననం చేసుకుంటున్నారు. గలగల పారుతున్న గోదారిలా 1974లో కోనసీమలో ‘గౌరి’ చిత్రం షూటింగ్ 30 శాతం పచ్చని సీమలోనే సాగింది. కృష్ణ, జమున ఈ చిత్రానికి హీరో హీరోయిన్లు. పి.గన్నవరం వద్ద వైనతీయ నదీ పాయపై హీరోయిన్ జమునకు కృష్ణ సైకిల్ నేర్పిస్తుండగా ఓ పాట చిత్రీకరించారు. ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటను కూడా ఇక్కడి పరిసరాల్లోనే చిత్రీకరించారు. అప్పట్లో కృష్ణ కోనసీమలో దాదాపు 10 రోజుల బస చేశారు. డిగ్రీ విద్యారి్థగా 30 ఏళ్ల క్రితమే కృష్ణ చేతుల నుంచి వర్ధమాన కవిగా అవార్డు అందుకున్నానని అమలాపురానికి చెందిన కవి, రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కార గ్రహీత ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఆయనతో తనకున్న కొద్దిపాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పులిదిండిలోనే దండిగా షూటింగ్ 1967లో కృష్ణ హీరోగా తీసిన ‘సాక్షి’ సినిమాను ఆత్రేయపురం మండలంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. అవుట్ డోర్ షూటింగ్ పులిదిండిలో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు తమ ఊహలకు తగ్గ గ్రామం ఎంపిక చేయాలని తమ బాల్యమిత్రుడు బీవీఎస్ రామారావును కోరారు. ఆయన రాజమండ్రి వచ్చి ఇరిగేషన్ కాంట్రాక్టర్ కలిదిండి రామచంద్రరాజుకు సూచించారు. దీంతో బాపు, రమణల ఊహకు తగ్గట్టుగా పులిదిండిని ఎంపిక చేశారు. ఇక్కడే చాలా వరకు షూటింగ్ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు. ఎనలేని అభిమానం నాకు కృష్ణ అంటే ప్రాణం. జిల్లాలో ఎక్కడ షూటింగ్ జరుగుతోందని తెలిసినా వెళ్లిపోయేవాడిని. ఏటా మా గ్రామంలో ఆయన పుట్టిన రోజు వేడుక నిర్వహిస్తాను. మమ్మల్ని ఆప్యాయంగా పలకరించేవారు. పద్మాలయ స్టూడియోలో ఆయనను కలిసిన రోజు ఎప్పటికీ మరిచిపోను. కలిసిన ప్రతిసారీ అన్నవరం ప్రసాదం అందజేసేవాడిని. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. – సలాది కృష్ణ, అభిమాన సంఘ అధ్యక్షుడు, ప్రత్తిపాడు, కాకినాడ జిల్లా -
Polavaram Project Photos: నాడు అలా.. నేడు ఇలా (ఫొటోలు)
-
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం/కాళేశ్వరం/బాల్కొండ/దోమలపెంట(అచ్చంపేట): గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో ఉప నదులై న మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగుతున్నాయి. దీంతో గోదావరిలో వరద ఉదృతి పెరుగుతోంది. గోదావరిపై జైక్వాడ్ నుంచి బాబ్లీ వరకూ అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం, ఈ వరదకు మంజీర తోడవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగింది. వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తోంది. అలా దిగువకు వస్తు న్న వరద కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డకు.. అక్కడి నుంచి తుపాకులగూడెం బ్యారేజీలలోకి.. అక్కడి నుంచి సీతమ్మసాగర్‌లోకి వస్తోంది. అక్కడి నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరికి 10,36,818 క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటి మట్టం 45.6 అడుగులకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూస్కుపల్లి గ్రామంలో నీట మునిగిన పత్తిచేను అప్రమత్తంగా ఉండాలి... గోదావరి ఉధృతితో ప్రభుత్వం పరీవాహక జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు సహా ఇతర అధికారులను సన్నద్ధంగా ఉంచాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తక్షణమే సెక్రటేరియట్లో కంట్రో ల్ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. భద్రాచలం నుంచి పోలవరానికి వచ్చిన వరదను వచ్చినట్టుగా వదిలేస్తుండటంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,08,251 క్యూ సెక్కులు చేరుతుండగా, 7,05,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు గోదావరికి వరద కొనసాగనుంది. కాగా, ముంపు ప్రాంత ప్రజలు, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలో అధికారులతో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన వరదతో తీవ్ర ఇబ్బందులు పడిన భద్రాచలం ఏజెన్సీ ప్రజలు, రైతులు.. మరోమారు ఉధృతి పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మహదేవపూర్ మండలం అన్నారం, చండుప్రల్లి, నాగేపల్లి, పూస్కుపల్లి, కాళేశ్వరం గ్రామాల్లోని గోదావరి పరీవాహక పంటభూములు నీటమునిగాయి. శ్రీశైలంలో తొమ్మిది గేట్లు ఎత్తివేత శ్రీశైలం ఆనకట్ట వద్ద సోమవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువన సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,69,207 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. దీంతో 3,02,630 క్యూసెక్కుల నీటిని నాగర్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
ఐదు నదులూ ఒకే సమయంలో సముద్రం వైపు.. చరిత్రలో తొలిసారి
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ విజయపురి సౌత్: చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ప్రవహించే 5 నదులూ ఒకేసారి సముద్రంలో కలుస్తున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఈ నదుల జలాలు కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. ఐదు నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండి, మిగులు జలాలు ఒకేసారి సముద్రంలో కలవడం చరిత్రలో ఇదే తొలి సారి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3.33 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి 35 వేల క్యూసెక్కుల పెన్నా జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 18,702 క్యూసెక్కుల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట నుంచి 20 వేల క్యూసెక్కుల నాగావళి జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. కృష్ణా , ఉప నదులు తుంగభద్ర, వేదవతి, భీమా, హంద్రీలు ఉరకలు వేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,47,018 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 10 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1013, కల్వకుర్తి ద్వారా 800 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,014 క్యూసెక్కులు, స్పిల్ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 వెరసి 4,38,184 క్యూసెక్కును దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లోకి 3,94,058 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడి నుంచి కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 3,81,358 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 588.1 అడగుల్లో 306.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతలలో 4,18,247 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 3,42,136 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతలలో 168.5 అడగుల్లో 36.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,23,813 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 10,153 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,22,660 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ► బేసిన్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలోనూ వరద ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 3,39,015 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 5,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,33,915 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ► పెన్నాలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర సరిహద్దులోని అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకు పెన్నాపై ఉన్న ప్రాజెక్టులనీన నిండిపోవడంతో వాటి గేట్లను ఎత్తేసి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. నెల్లూరు బ్యారేజ్‌లోకి 38 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 3 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 35 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ► ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. గొట్టా బ్యారేజ్‌లోకి వంశధార నుంచి 20,675 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,973 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 18,702 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 20,600 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 20 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/ విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) వర్షాలు తెరపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద తగ్గుముఖం పడుతోంది. వర్షపాత విరామం వల్ల ఉపనదుల్లో వరద తగ్గడంతో ఆదివారం గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. భద్రాచలం వద్ద వరద మట్టం 30.9 అడుగులకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 8,50,469 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇందులో గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 8,39,469 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు వరద మట్టం 11.7 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గిన నేపథ్యంలో సోమవారం ధవళేశ్వరం వద్ద ప్రవాహం మరింత తగ్గనుంది. స్థిరంగా వంశధార, నాగావళి వంశధార, నాగావళి నదుల్లో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 40,602 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 1,186, ఎడమ కాలువకు 142 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 30,186 క్యూసెక్కులను బ్యారేజ్ 16 గేట్లను 0.6 మీటర్ల మేర ఎత్తి బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 11,462 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 6,979 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్ట మీదుగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి 2.16 లక్షల క్యూసెక్కులు కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,16,946 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేలు, కల్వకుర్తి ద్వారా 1,600, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,954, స్పిల్ వే నాలుగు గేట్లను పదడుగులు ఎత్తి 1,11,564.. మొత్తం 1,74,518 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.4 టీఎంసీల నీటిని నిల్వచేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 1,62,647 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 9,500, ఎడమ కాలువకు 8,108, ఏఎమ్మార్పీకి 1,800, వరద కాలువకు 400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,967, స్పిల్ వే 14 గేట్లను ఐదడుగులు ఎత్తి 1,09,872.. మొత్తం 1,42,839 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 585.6 అడుగుల్లో 305.86 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 1,36,192 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ 8వేలు, స్పిల్ వే 5 గేట్లను మూడడుగులు ఎత్తి 1,15,665.. మొత్తం 1,23,665 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.81 అడుగుల్లో 38.08 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,59,148 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 13,898 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిగిలిన 1,45,250 క్యూసెక్కులను 60 గేట్లను మూడడుగులు, 10 గేట్లను రెండడుగులు ఎత్తి çకడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని డ్యామ్‌లలోకి వరద తగ్గడంతోసోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత తగ్గనుంది. -
కడలి వైపు నదుల పరుగులు
సాక్షి, హైదరాబాద్: ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా నుంచి 4.02 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి 14.74 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలో కలసిపోతోంది. జూరాల నుంచి కృష్ణా.. సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. త్రివర్ణ కాంతుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి పరవళ్లు ప్రాజెక్టులో 884.3 అడుగుల వద్ద 211.47 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 32,845 క్యూసెక్కులను, 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 586.3 అడుగులవద్ద 301.87 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ►పులిచింతలలోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల వద్ద 35.59 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. అలాగే 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ►పులిచింతల, పాలేరు, మున్నేరుల ద్వారా ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,15,036 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా..4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ►ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి చేరుతున్న 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలోకి ఇదే రీతిలో వరద కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. గోదావరిలో నిలకడగా వరద.. గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,80,877 క్యూసెక్కులు చేరుతోంది. నీటి మట్టం 15 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతూ.. 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పెన్‌గంగ, ప్రాణహితలలో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా గోదావరికి వరద ఇదే రీతిలో వరద కొనసాగనుందని భావిస్తున్నారు. -
అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది జూలై రెండో వారంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. గోదావరి, ఉప నదుల వరద ఉధృతికి ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో గేట్లు ఎత్తేశారు. సాధారణంగా గోదావరిలో భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. దాంతో ఈ ప్రాంతాన్నే అఖండ గోదావరిగా పిలుస్తారు. కానీ.. ప్రస్తుతం గోదావరి జన్మించే ప్రాంతమైన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ నుంచి.. సముద్రంలో కలిసే ప్రాంతమైన డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వరకు భారీ వరద ప్రవాహంతో అఖండ గోదావరి మహా సముద్రాన్ని తలపిస్తోంది. గోదావరి బేసిన్లో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. 1,465 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, వార్ధా, ప్రాణహిత, మానేరు, ఇంద్రావతి, శబరి ప్రధాన ఉప నదులు. ఈ నదీ పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. గంగా నది తర్వాత దేశంలో అతి పెద్ద నది గోదావరి. ఆదిలోనే ఉగ్రరూపం ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ ఏడాది గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. జైక్వాడ్ నుంచి బాబ్లీలో అంతర్భాగమైన 11 బ్యారేజీ గేట్లను మహారాష్ట్ర సర్కార్ ఎత్తేసి.. దిగువకు వరద నీటిని విడుదల చేస్తోంది. వాటికి సింగూరు, నిజాంసాగర్ నుంచి విడుదల చేస్తున్న మంజీర ప్రవాహం తోడవుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. అక్కడి నుంచి వదులుతున్న వరదకు కడెం వాగు వరద తోడవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిన గేట్లను ఇప్పటిదాకా దించలేదు. దానికి దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన సుందిళ్ల, అన్నారం గేట్లు ఎత్తేసి.. దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ప్రాణహిత, మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి వస్తున్న వరద తోడవడంతో మేడిగడ్డ బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తేశారు. అక్కడి నుంచి ఇంద్రావతి జలాలు తోడవడంతో తుపాకులగూడెం, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేశారు. జూలై 8న పోలవరం ప్రాజెక్టు 48 గేట్లు, ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను ఎత్తేశారు. ఇప్పటిదాకా వాటిని దించలేదంటే గోదావరి వరద ఉధృతి ఇట్టే తెలుస్తోంది. భద్రాచలం వద్ద 55 అడుగులకు చేరే అవకాశం ఎగువ నుంచి 13,92,313 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో గురువారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద నీటి మట్టం 52.4 అడుగులకు చేరుకుంది. దాంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం రాత్రికి నీటి మట్టం 53 అడుగులు దాటనుంది. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 55 అడుగులకు చేరుకుంటుందని అంచనా. పోలవరం వద్ద హై అలర్ట్ భద్రాచలం నుంచి భారీ వరద వస్తుండటం.. వాటికి శబరి ప్రవాహం తోడవుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తూ.. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 34.050 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టులోకి 11.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,13,191 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 7,200 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14,05,991 క్యూసెక్కులను సముద్రంలోకి వదలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 14.60 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బిరబిరా కృష్ణమ్మ సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా ప్రధాన పాయపై ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడం, ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో గేట్లు ఎత్తేశారు. ప్రధాన ఉపనది తుంగభద్రపై కర్ణాటకలోని భద్ర, సింగటలూరు బ్యారేజ్, తుంగభద్ర డ్యామ్, ఆంధ్రప్రదేశ్‌లోని సుంకేశుల బ్యారేజ్ గేట్లు ఎత్తేశారు. మరో ఉప నది బీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఒకటి రెండు రోజుల్లో గేట్లు ఎత్తివేయనున్నారు. ఉప నదులైన ఘటప్రభ, మలప్రభలపై కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులు, వేదవతిపై కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఆంధ్రప్రదేశ్‌లోని భైరవానితిప్ప ప్రాజెక్టులు నిండిపోయాయి. మూసీ నదిపై హైదరాబాద్‌లోని జంట జలాశయాలు, మూసీ రిజర్వాయర్ నిండిపోయాయి. పాలేరుపై ఉన్న పాలేరు రిజర్వాయర్ కూడా నిండింది. కృష్ణా బేసిన్లో మొత్తం ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వాటి గేట్లు ఎత్తివేయడం చరిత్రలో ఇదే తొలిసారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో బేసిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ఉప నదులు ఉరకలెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. -
Heavy Rains-Telugu States: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చితే.. గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. వంశధారలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,81,246 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో బుధవారం మంత్రాలయం వద్ద ప్రమాదకర రీతిలో 312.04 మీటర్లు వద్ద తుంగభద్ర ప్రవహిస్తోంది. కర్నూలు వద్ద 272.76 మీటర్లకు చేరుకుంది. దాంతో మంత్రాలయం, కర్నూలు నగరాలలో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత ఎగువ నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల ద్వారా చేరుతున్న జలాలు తోడవడంతో శ్రీశైలంలోకి 3,60,436 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,17,460 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 29,833, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు సాగర్ గేట్లు ఎత్తివేత శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న జలాలతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. సాగర్‌లోకి 3,61,296 క్యూసెక్కులు వస్తున్నాయి. నీటి నిల్వ 583.5 అడుగుల్లో 293.4 టీఎంసీలకు చేరుకుంది. మరో 19 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండిపోతుంది. గురువారం ఉదయం 6 గంటలకు సాగర్ ఒక గేటును ఎత్తివేయనున్నారు. ఆ తర్వాత ప్రతి గంటకూ ఒక గేటు చొప్పున ఎత్తుతూ 2 లక్షల నుంచి 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయనున్నారు. గత మూడేళ్లుగా ఆగస్టులోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుతోంది. సాగర్ డ్యాం గేట్ల నిర్వహణ పనులను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. డ్యాం 26 క్రస్టు గేట్లకు కొత్త ఇనుప రోప్‌లను బిగించారు. గేట్లకు గ్రీజింగ్, ఇతర మరమ్మతులు పూర్తి చేశారు. వరద నియంత్రణపై అధికారుల దృష్టి ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వరద నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి 75,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నందన పులిచింతలలో నీటి నిల్వ 40 టీఎంసీల లోపు ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 80,737 క్యూసెక్కులు చేరుతోంది. ఆ నీటినంతా ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రమాదకరంగా గోదావరి బేసిన్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 11 లక్షల క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 50.6 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం 55 అడుగులకు చేరుతుందని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 10,10,387 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్‌వే ఎగువన 33.37 మీటర్లు, దిగువన 24.76 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి వచ్చిన వరదను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 10 గంటలకు నీటి మట్టం 13.40 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి లేపి 12,43,405 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతున్నారు. వంశధారలో వరద ఉద్ధృతి బేసిన్లో కురుస్తున్న వర్షాలతో వంశధార వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 24,124 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 2849 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 21,275 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి
-
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి
-
లక్ష్మీపంప్‌హౌస్‌లో పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్లు.. కొత్తవాటికి ఆర్డర్?
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంప్హౌస్లోకి గత నెల 14న వరద నీరు చేరి రక్షణ గోడ కూలి మోటార్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీవాటరింగ్ ప్రక్రియ పూర్తయింది. పంప్‌హౌస్‌లోకి తాత్కాలికంగా నిచ్చెనలు తయారు చేసి కూలీలు, ఇంజనీర్లు దిగుతున్నారు. దీంతో పంప్‌హౌస్‌లో మొత్తం 17 మోటార్లు, పంపులకు గాను ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. దీంతో ఫిన్లాండ్, ఆస్ట్రియా దేశాలకు ఆరు మోటార్ల కోసం సీడీఓ (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)కు డిజైన్స్ పంపినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ అధికారులంతా అదేపనిలో పడ్డట్లు సమాచారం. ఇక్కడి ఇంజనీర్లు మోటార్లకు సంబంధించిన కంపెనీలకు చెందిన విదేశాల్లోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. మిగతా మోటార్లలో ఐదు వరకు.. ఉన్న స్థానం నుంచి పక్కకు జరిగి వంగినట్లు చెబుతున్నారు. మరికొన్ని మోటార్లు పాక్షికంగా చెడిపోయినట్లు సమాచారం. రక్షణ గోడ పూర్తిగా నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోర్‌బేకు పంప్‌హౌస్ మధ్యలో పొడవునా మళ్లీ పూర్తిగా నిర్మాణం చేయడానికి డిజైన్స్ రెడీ చేసినట్లు తెలిసింది. కాగా, వర్షాకాలం కావడంతో గోడ నిర్మాణం సాధ్యం కాదని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత చేపట్టనున్నారని ఇంజనీర్లు చెబుతున్నారు. కాళేశ్వరంలో గోదావరి ఉధృతి తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి 11.70 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. 7.30 లక్షల క్యూసెక్కుల నీరు లక్ష్మీబ్యారేజీకి తరలిపోతోంది. ములుగు జిల్లా పేరూరు వద్ద సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరింది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. టేకులగూడెం గ్రామ చివరన 163 నంబర్ జాతీయ రహదారి మునిగిపోవడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
గంటా సన్నిహితుడి మిత్రుడు అదృశ్యం
దొండపర్తి (విశాఖ దక్షిణ), కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. విశాఖ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్ (60) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్కడున్న క్రేటా కారు (ఏపీ 39 ఈక్యూ 9999) వద్ద ఓ లేఖ లభ్యమైంది. చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు ఆయన గోదావరిలో దూకి చనిపోయాడా? లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఉదయం అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ కారు ఆగి ఉండటాన్ని గుర్తించి స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలు, గోదావరిలో గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. రూ.12 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి.. విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిర్లంపూడి లేఅవుట్ ‘ది పామ్స్’ అపార్ట్మెంట్లో చంద్రశేఖర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, ఇటీవల చనిపోయిన నలంద కిషోర్‌కు ఆయన స్నేహితుడని తెలుస్తోంది. చంద్రశేఖర్ సుమారు రూ.12 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇందులో రూ.6 కోట్లు మధ్యవర్తిగా ఇతరులకు ఇప్పించి ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్ అదృశ్యంపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆయన నివాసంలో ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది. -
భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి నీటిమట్టం
-
లంక గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
-
నరసపురం వద్ద ప్రమాదకరంగా గోదావరి ఉధృతి
-
మీడియాతో సీఎం కేసీఆర్
-
గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్
-
ఎగువన శాంతం.. దిగువన మహోగ్రం
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువ తెలంగాణలో గోదావరి నది శాంతించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరద 96,265 క్యూసెక్కులకు తగ్గింది. మధ్యలో వాగుల చేరికతో ఎల్లంపల్లికి 2,94,429 క్యూసెక్కుల వరద వస్తోంది. అయితే ప్రాణహిత, కడెం, ఇంద్రావతి ఇతర నదుల్లో భారీగా ప్రవాహం ఉండటంతో.. లక్ష్మీ బ్యారేజీ వద్ద 23,29,903 క్యూసెక్కుల భారీ వరద కొనసాగుతోంది. సమ్మక్క బ్యారేజీ, సీతమ్మ సాగర్ల నుంచీ దాదాపు ఇదేస్థాయి ప్రవాహం దిగువకు వెళుతోంది. దీనికి అదనంగా మధ్యలో చేరుతున్న నీటితో భద్రాచలానికి భారీ వరద కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవాహంతో భద్రాచలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద 71 అడుగుల మట్టంతో 24,29,246 లక్షల క్యూసెక్కుల వరద ముందుకు వెళుతోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ముంపు గోదావరి ఉగ్రరూపంతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. మొత్తం 28 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 6,800 మందిని తరలించారు. తెలంగాణ–మహారాష్ట్రలను కలిపే 353(సీ) జాతీయ రహదారిపై మహారాష్ట్ర వైపు అప్రోచ్ రోడ్డుకు భారీ గండి పడింది. అర కిలోమీటర్ మేర జాతీయ రహ దారి కోతకు గురికావడంతో.. తెలంగాణ–మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కాలనీల్లో ప్రవహిస్తున్న వరద నీరు నీటిలోనే లక్ష్మీ పంపుహౌస్ కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి పంపుహౌజ్ పూర్తిగా నీటిలోనే మునిగిపోయి ఉంది. వేగంగా వరద రావడంతో పంపుహౌజ్‌లోని ఫోర్‌బే బ్రెస్ట్ వాల్ 9వ బ్లాక్ వద్ద గోడ కూలి అక్కడక్కడా గండ్లు పడినట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 108 మీటర్లకుపైగా వరద నీరు ఉందని, ఇది 100 మీటర్లకన్నా తగ్గితేనే.. పంపుహౌజ్‌లోని నీటిని ప్రత్యేక మోటార్లతో డీవాటరింగ్ (తోడటం) చేయడానికి వీలవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. గోదావరి వరదతో మునిగిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతి పంపుహౌస్ చుట్టూ చేరిన నీరు తగ్గింది. దీనితో శుక్రవారం పంపుహౌజ్ నుంచి నీటిని తోడేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. -
గోదావరి ఉగ్రరూపం.. తీవ్ర హెచ్చరికలు జారీ
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల పుష్కర ఘాట్ల పైనుంచి గోదావరి నీరు ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఉత్తర తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచనలతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మొత్తం పదకొండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో భారీ వానలు ఉండొచ్చని తెలిపింది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకోవైపు భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతి కొనసాగుతోంది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్టు చేస్తున్నారు అధికారులు. సుమారు 55 అడుగులకు చేరింది నీటి మట్టం. ఎగువ నుంచి గోదావరిలోని 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అర్ధరాత్రి లోగా 63 అడుగులకు చేరొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏ క్షణం పరిస్థితి ఎలా మారుతుందో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం భద్రాచలంలోనే ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలోనే బస చేసి పరిస్థితి సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తక్షణ సహాయక చర్యల నిమిత్తం హెలికాప్టర్ సిద్ధం చేశారు. పర్యాటకం బంద్ నాన్ స్టాప్‌గా కురుస్తున్న వానలకు తెలంగాణలో పర్యాటకం బంద్ అయ్యింది. ఓరుగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముప్పు ముంగిట కడెం తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు ఎగువ నుంచి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. ప్రస్తుతం 17 గేట్లు ఎత్తి అధికారులు రెండు లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయినా అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దాంతో, కడెం ప్రాజెక్టు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు, ప్రాజెక్టు పరిధిలోని 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
ఎడతెరపి లేని వర్షాలతో ఉప్పొంగుతున్న గోదావరి
-
Telangana Rains: 11 గంటల ఉత్కంఠకు తెర.. హమ్మయ్య! ఆ తొమ్మిది మంది సేఫ్
సాక్షి, రాయికల్(జగిత్యాల): ఎప్పటిలాగానే చేనులో పత్తి పనులు చేసేందుకు వారం క్రితం 9మంది కౌలు రైతులు కుర్రులోకి వెళ్లారు.. పనులు ముగించుకుని మరో రెండుమూడ్రోరోజుల్లో తిరిగి రావాల్సి ఉంది.. కానీ, గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. నురగలు కక్కుతూ వరద పోటెత్తింది. అప్పటిదాకా ఎంతోనిబ్బరంగా ఉన్న రైతుల్లో ఒక్కసారిగా భయం చోటుచేసుకుంది.. ఇక తాము బతుకుతామో, లేక వరదలో చిక్కుకుని చనిపోతామోననే ఆందోళన మొదలైంది.. వెంటనే మొబైల్ఫోన్ల ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించారు.. కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ ఆగమేఘాలపై ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షితంగా కుర్రులోంచి బయటకు తీసుకురావడంతో 11గంటల ఉత్కంఠకు తెరపడింది. బాలుడిని కుర్రులోంచి బయటకు తీసుకొస్తున్న సహాయక సిబ్బంది అందరూ కౌలురైతులే.. రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన మూడు గిరిజన కుటుంబాలకు చెందిన 9మంది కౌలు రైతులు సమీప గోదావరి నదిలోని కుర్రు(పాయ)లో పత్తి చేనులో పనులు చేసేందుకు వెళ్లారు. ఇందులో వల్లె రఘునాథ్, రంగారావు, దేవిదాస్, సహేబ్రావు, కొమ్రె విజయ్, డొక్కె కార్తీక్, సత్యబామ, విజయ, సునీత తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు. చదవండి: ఫోన్ ఉన్నా సిగ్నల్స్ లేకపోవడంతో.. రాత్రంతా వాగులోనే.. మంత్రి కొప్పుల చొరవ.. ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిస్థితిని సమీక్షిస్తూ విషయాన్ని సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లారు. తొలుత బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్ పంపాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలించదనే సూచనతో నిజామబాద్‌లోని ఎన్డీఆర్ఎఫ్ బందాలకు రంగంలోకి దించారు. వారు బోర్నపల్లి ప్రాంతానికి రాత్రి 7 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. రెండు బోట్ల సాయంతో రైతులు ఉన్న కుర్రు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ బోట్లలో బాధితులను గోదావరి తీరానికి సురక్షితంగా చేర్చారు. సుమారు రెండు గంటలపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించాయి. గోదావరి ఉధృతి.. బోర్నపల్లికి చెందిన రవీందర్రావు అనే యజమానికి చెందిన కుర్రులోని వ్యవసాయ భూమిని తొమ్మిది మంది రైతులు కౌ లుకు తీసుకుని పత్తి పంట వేస్తున్నారు. ఇది నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల పరిధిలోకి వస్తుంది. భారీవర్షాలకు తోడు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రైతులు పనిచేస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు ఫలించిన అధికారుల కృషి.. ఉదయం 11గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ రవి, ఎస్పీ సిందూశర్మ అక్కడే మకాం వేశారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. చివరకు రాత్రి 7గంటలకు రైతులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు అందరిలో ఆనందం.. వరద ఉధృతికి ఇక తాము బతకలేమనే అభిప్రాయానికి వచ్చిన కౌలురైతులను 21 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకు రావడంతో ఆనందం వ్యక్తమైంది. కలెక్టర్, ఎస్పీతోపాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కసారిగా ఉప్పొంగింది దాదాపు పదిరోజులుగా కుర్రు ప్రాంతంలో సాగు పనులు చేసుకుంటున్నాం. గోదావరి నది ఒక్కసారిగా పొంగింది. ప్రాణాలు పోతాయనుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడాయి. – రఘునాథ్, కౌలురైతు భయమేసింది వ్యవసాయం కోసం కుర్రులోకి పోయినం. ఒక్కసారిగా గంగ పొంగడంతో భయపడ్డాం. అధికారుల కృషితో సురక్షితంగా బయటకు వచ్చాం. పడవలో మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చారు. అధికారులకు ధన్యవాదాలు. -జయంత, కౌలురైతు చలికి వణికినం వర్షానికి విపరీతమైన చలివేసింది. భయమైంది. అమ్మనాన్న దగ్గర ఉన్నా. గంగలోకి వరదనీరు బాగా వచ్చింది. చనిపోతనని భయమైంది. అమ్మనాన్న ఉండటంతో ధైర్యంగా ఉన్నా. సార్లు వచ్చి మమ్మల్ని బోటులో తీసుకొచ్చిండ్రు. – కార్తీక్, బాలుడు మాటలు రావడం లేదు వర్షం తీవ్రం కావడం, గోదావరి నది ఉప్పొంగడంతో ఏం చేయాలో మాటలు రాలేదు. అధికారుల కృషితో ప్రాణాలతో బయటపడ్డాం. అధికారులు అందరు కలిసి మమ్మల్ని రక్షించారు. అందరికీ పదివేల దండాలు. – దేవదాసు, కౌలురైతు రెండు గంటలు శ్రమించాం కౌలురైతులను కుర్రు నుంచి బయటకు తీసుకురావడానికి రెండుగంటల పాటు శ్రమించాం. మాది విజయవాడ బెటాలియన్. రెండుబోట్ల సాయంతో 21 మందిమి ఘటన స్థలానికి వెళ్లాం. రైతులను సురక్షితంగా తీసుకువచ్చాం. – ఉపేందర్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్కుర్రు ఆపరేషన్ ఇలా.. ►వారం క్రితం బోర్నపల్లి శివారులోని గోదావరి మధ్యలో గల కుర్రులోకి 9మంది రైతులు వెళ్లారు. ►మంగళవారం ఉదయం 9 గంటలు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ►10.00 : భయంతో వణికిపోయిన రైతులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ►10.30 : గ్రామస్తులకు తొలుత కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మకు సమాచారం చేరవేశారు. ►11.00 : స్పందించిన కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి సమీపంలోని గోదావరి తీరంలోకి చేరుకున్నారు. ►11.30 : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కలెక్టర్ సమాచారం ఇచ్చారు. ►మధ్యాహ్నం 12.00 : మంత్రి కొప్పుల ఈశ్వర్.. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ►12.30 : హెలికాప్టర్ పంపించి బాధితులను రక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► 01.00 : వాతావరణం అనుకూలించకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ► 01.15 : ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని నిర్ణయం ►మధ్యాహ్నం 2.30 : నిజామాబాద్‌లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం చేరవేత. ► 03.00 : నిజామాబాద్ నుంచి వాహనంలో బయలు దేరిన 21మంది సభ్యులు గల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ►రాత్రి 07.00 : సంఘటన స్థలానికి చేరుకున్న సహాయ బృందాలు ►08.15 : అన్నీ సిద్ధం చేసుకుని రెండు బోట్లతో గోదావరిలోని కుర్రులోకి బయలు దేరిన సహాయక బృందాలు ►రాత్రి 09.51 గంటలు : 9మంది కౌలురైతులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా నదీతారానికి చేరుకున్నారు. -
Godavari: వందేళ్లలో తొలిసారి
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూలైలో గోదావరికి ఇంత భారీ వరద రావడం వందేళ్లలో ఇదే ప్రథమం. నిండుకుండలా మారడంతో రాష్ట్రంలోని ఎస్సారెస్పీ నుంచి ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. ఉప నదుల పరవళ్లు: గోదావరి బేసిన్ పరిధిలో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురవడంతో కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసారి, పెద్దవాగు తదితర ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగైన పార్వతి (సుందిళ్ల), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బ్యారేజీల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. ఎస్సారెస్పీ గేట్లు తొమ్మిది ఎత్తారు. ఆయా ప్రాజెక్టులు, బ్యారేజీలకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. పార్వతి నుంచి 4,90,254 క్యూసెక్కులు, సరస్వతి నుంచి 4,30,110 క్యూసెక్కులు, లక్ష్మీ నుంచి 8,83,140 క్యూసెక్కులు వదులుతున్నారు. లక్ష్మీ బ్యారేజీ 81 గేట్లు, సరస్వతీ 54, ఎల్లంపల్లి 41 గేట్లు ఎత్తారు. దేవాదుల పంప్ హౌస్ వద్ద గోదావరి మట్టం 83.70 మీటర్లకు పైగా ఉంది. సమ్మక్క బ్యారేజీ (తుపాకులగూడెం)లోకి 9.31 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంగళవారం 2.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అప్రమత్తమైన అధికారులు 16 గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు వదిలారు. సీతమ్మసాగర్‌లోకి 13,42,030 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో 13,49,465 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గేజ్ వద్ద నీటి మట్టం 51.60 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ఎగువన భారీ వరద దిగువకు విడుదలైన నేపథ్యంలో భద్రాచలం వద్ద మళ్లీ నీటిమట్టం పెరుగుతోందని, 53 అడుగులకు చేరుకుంటే మళ్లీ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు వరద ఉధృతి గోదావరి పరీవాహక ప్రాంతంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది. మరో 36 గంటల్లో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం భారీగా పెరగనుందని హెచ్చరించింది. గరిష్టంగా 16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వరద ఉధృతి కనీసం వారం పాటు కొనసాగే అవకాశం ఉంది. -
పోటెత్తే.. గేట్లెత్తే!
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఎగువన మహారాష్ట్రతోపాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి నదిలో వరద పోటెత్తింది. ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదుల ప్రవాహాలు కూడా కలిశాక మహోగ్ర రూపంతో పరుగు పెడుతోంది. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో 53 అడుగుల మట్టంతో ఉరకలెత్తుతోంది. మొత్తంగా ఎగువన ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ దాకా గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. జూలై రెండో వారంలోనే ఈ స్థాయిలో గోదావరికి వరదలు రావడం, ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వారం రోజుల వానతోనే.. నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షా లు కురుస్తున్నాయి. దీనితో అటు మహారాష్ట్ర నుంచే గోదావరిలో వరద పోటెత్తి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. దానితో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు కడెం వాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెర సాని తదితర ఉప నదుల ప్రవాహాలూ చేరుతుండటంతో.. సోమవారం గోదావరిలో వరద పోటెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకుల గూడెం) బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎక్కడిక్కడ వాగులు, ఉప నదుల ప్రవాహాలు కలుస్తుండటంతో గోదావరిలో వరద పెరుగుతూ పోతోంది. లక్ష్మి బ్యారేజీ వద్ద నుంచి 8.68 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ నుంచి 11.82 లక్షల క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ నుంచి 14.30 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. భద్రాచలం గోదావరి మట్టం గంట గంటకూ పెరుగుతూ.. 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నదిలో ప్రవాహాలు మొదలు.. ఎగువన కర్ణాటకలో వర్షాలతో కృష్ణా నదిలో వరద మొదలైంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆది, సోమవారాల్లో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. మలప్రభ, ఘటప్రభ వంటి ఉప నదులపై ప్రాజెక్టులన్నీ నిండటంతో.. కృష్ణాలోకి భారీ వరద వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో ఆల్మట్టి డ్యామ్ నిండటానికి మరో 40 టీఎంసీలు అవసరమున్నా.. ముంపు ముప్పు తప్పించడానికి గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆ నీళ్లు నారాయణపూర్ రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. సోమవారం రాత్రి ఇక్కడి నుంచి 61.9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా జూరాల వైపు పరుగెడుతోంది. ఒకట్రెండు రోజుల్లో వరద జూరాలకు చేరనుంది. వరద రానుండటంతో జూరాలలో సోమవారం రాత్రి మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి 10,200 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద చేరుకోగానే జూరాల గేట్లు ఎత్తనున్నట్టు వెల్లడించారు. మరోవైపు భారీగా ప్రవాహం వస్తుండటంతో తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది. సోమవారం అర్ధరాత్రిగానీ, మంగళవారం ఉదయంగానీ తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీనితో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద మొదలవనుందని అధికారులు చెప్తున్నారు. చిన్న ప్రాజెక్టులూ నిండి.. ఎగువ నుంచి వరద వస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి 5,622 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు, పాలేరు, వైరా రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో అప్రమత్తం గోదావరి ఉగ్రరూపం దాల్చడం, తీరం దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్తగూడెం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మండలాల వారీగా గజ ఈతగాళ్లు, మరబోట్లను సిద్ధంగా ఉంచారు. 20 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం భద్రాచలం ఇప్పటికే చేరుకుంది. నేనూ వరద బాధితుడినే: మంత్రి పువ్వాడ గోదావరి వరదలు ఎలా ఉంటాయో, క్షణాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయో తెలుసని.. తానూ వరద బాధితుడినేనని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. భద్రాచలంలో సోమవారం వరద పరిస్థితిపై సమీక్షించిన ఆయన స్వీయ అనుభవాన్ని వివరించారు. ‘‘నేను పుట్టి పెరిగింది కూనవరంలో. ఆ గ్రామంలో మాకు రెండు అంతస్తుల ఇల్లు ఉండేది. సాధారణంగా మొదటి అంతస్తులోకి నీళ్లు వస్తే.. రెండో అంతస్తులోకి లేదా ఇంటి పైకప్పు మీదికి వెళ్లేవాళ్లం. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ అనుదీప్ తదితరులు ఓసారి గోదావరికి బాగా వరద వచ్చింది. మొదటి అంతస్తు ఖాళీ చేసి రెండో అంతస్తులోకి వెళ్లగా.. కొద్దిసేపట్లోనే రెండో అంతస్తులోకీ నీళ్లు రావడం మొదలైంది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో భయపడ్డాం. సహాయక బృందాలు పడవల్లో వచ్చి మమ్మల్ని రక్షించాయి.’’అని తెలిపారు. -
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
నదులకు జల కళ!
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఎడతెరిపిలేని వానలతో వాగులు, ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఆ నీళ్లన్నీ చేరుతుండటంతో తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ కృష్ణానదిలో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి 78,390 క్యూసెక్కులకు వరద వస్తోంది. ఒక్క రోజులో 7.14 టీఎంసీల వరద చేరడంతో.. నీటి నిల్వ 72.89 టీఎంసీలకు పెరిగింది. మూడు నాలుగు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండి దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మట్టి దిగువన ఉన్న జూరాలకు 1,725 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 7.097 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక తుంగభద్ర జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఏ సమయంలోనైనా నీటిని విడుదల చేస్తామని, అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. రెండు మూడు రోజుల్లో తుంగభద్ర నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద మొదలుకానుంది. ఇక మంజీరాలో పెద్దగా ప్రవాహాలు మొదలుకాలేదు. సింగూరు డ్యామ్‌కు 1,884 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యామ్ సామర్థ్యం 29.9 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 19.41 టీఎంసీల నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద మొదలైంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరికి వరద షురూ.. గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వానలు పడుతుండటంతో నదిలో ప్రవాహాలు పెరిగాయి. ఎగువన శ్రీరాంసాగర్‌కు శనివారం సాయంత్రానికి 1.25 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఒక్క రోజులోనే ప్రాజెక్టులోకి 3 టీఎంసీల నీరు చేరింది. ఇక ప్రాణహిత ఉప్పొంగుతుండటంతో దిగువ గోదావరికి భారీ వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 3,85,100 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గేట్లు ఎత్తి 4,27,930 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆ నీళ్లన్నీ దిగువన ఉన్న తుపాకులగూడెం బ్యారేజీ మీదుగా దిగువకు వెళ్లిపోతున్నాయి. నిండుకుండల్లా.. చిన్న రిజర్వాయర్లు ►నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలేస్తున్నారు. ►ఆసిఫాబాద్ జిల్లాలో వట్టివాగు, కుమురం భీం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టులు పూర్తిస్థాయి మట్టానికి చేరుకున్నాయి. ►ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. -
ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే మహానది–గోదావరి అనుసంధానం
సాక్షి, అమరావతి: మహానది జలాల వినియోగంలో ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య తలెత్తిన వివాదంపై ట్రిబ్యునల్ విచారణ నేపథ్యంలో మహానది–గోదావరి అనుసంధానానికి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే అనుసంధానంపై ముందుకెళ్లాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మహానది ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన తర్వాతే ఆ రెండు నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన, నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ సమగ్రంగా చర్చించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. మూడేళ్ల గడువులోగా ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేయలేదు. దాంతో గడువును కేంద్రం 2023 మార్చి వరకు పొడిగించింది. ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతుండగా అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాంతో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది. గోదావరికి మహానదిని జత చేసి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ గతేడాది ఏప్రిల్‌లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేసింది. దీనిపై ఆ నదుల పరిధిలోని రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. 247 టీఎంసీల గోదావరి జలాలకు 408 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది–గోదావరి–కావేరిలను అనుసంధానించి ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమింవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
కాలుష్య భూతంపై ప్రక్షాళన అస్త్రం
రాజమహేంద్రవరం సిటీ: పవిత్ర గోదావరి నదీ స్నానం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ నదీ తీరంలోని ప్రధాన నగరం రాజమహేంద్రవరంలోని ఘాట్లలో మాత్రం పరిస్థితులు పుణ్యస్నానానికి తగినట్టుగా ఉండవు. ఎగువన కోటిలింగాల నుంచి దిగువన గౌతమ ఘాట్ వరకూ ప్రతి చోటా ఈ పావన వాహిని మురికికూపాన్ని తలపిస్తుంది. దీంతో ఈ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నగరంలో ప్రధానంగా గోదావరి ఘాట్లు తొమ్మిది ఉన్నాయి. కొంతవరకూ పుష్కర ఘాట్ మినహా మిగిలినచోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు, మలినాలు, మురుగు, నాచు పేరుకుపోయి దుర్గంధభరితంగా మారాయి. అనేక ప్రసిద్ధ ఆలయాలకు నెలవుగా ఉన్న గౌతమ ఘాట్ వద్ద గోదావరిలో నాచు, వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోయాయి. ఇబ్బందికర పరిస్థితుల మధ్యనే స్నానాలకు దిగుతూ దుర్గంధంతో పాటు దురదలతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపోతున్నారు. దేశంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన కోటిలింగాల ఘాట్ రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇంత పొడవైన ఈ ఘాట్ వద్ద గోదావరిలో దిగేందుకు, స్నానం చేసేందుకు సైతం అవకాశం లేని దుస్థితి. అంతలా ఇక్కడ వ్యర్థాలు పేరుకుపోయాయి. కోటిలింగాల ఘాట్‌కు పుష్కర ఘాట్‌కు మధ్య నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఇన్‌టేక్ పాయింట్ ఉంది. ఇక్కడ విపరీతంగా ఉన్న వ్యర్థాల మధ్య నుంచే గోదావరి జలాలను సేకరించాల్సిన దుస్థితి. ఈ రెండు ఘాట్లకు దిగువన కూడా ప్రధాన రక్షిత మంచినీటి సరఫరా పథకం ఇన్‌టేక్ పాయింట్ ఉంది. వీటి నుంచి కలుషితమైన నీటినే నగర ప్రజలకు ఫిల్టర్ చేసి అందిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రక్షాళనకు కదిలిరావాలి గోదావరి నదీ కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంపై నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నగరంలోని ఘాట్ల వద్ద పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో చెత్తను తొలగించే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాకే తలమానికమైన గోదావరి నదీ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి స్ఫూర్తి నింపాలని కోరారు. ఈ నది పవిత్రతను కాపాడటంలో ఎవరికి వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో గోదావరి ప్రక్షాళనను ఉద్యమంలా చేపట్టాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో నగరాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు. నదీ జలాలు కలుషితం కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఇతరులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం అభినందనీయమని దినేష్‌కుమార్ అన్నారు. -
నలుపు రంగులోకి గోదావరి నీరు.. ప్రమాదం తప్పదు.. జాగ్రత్త!
బాల్కొండ/నిజామాబాద్: శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీరు కలుషితమవుతోంది. నీరు నలుపు రంగులోకి మారిందని, దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ అధికంగా ఉన్నప్పుడు ఎగువ నుంచి వదిలిన వ్యర్థాలు నీటిలో కలిసి పోయి దిగువకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం తక్కువగా ఉన్న నీటి నిల్వతో వ్యర్థాల ప్రభావం ఏర్పడుతోంది. ఎగువ భాగాన మహారాష్ట్రలో అధికంగా ఉన్న ఫ్యాక్టరీలు విడుదల చేసిన వ్యర్థాలు నదిలో కలిసి ఎస్సారెస్పీలోకి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీరు కలుషితమవుతుండటంతో ప్రాజెక్ట్‌లో చేపలకు ప్రమాదం పొంచి ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో పాప్లెట్ రకం చేపలు మాత్రమే లభిస్తున్నాయని, అక్కడక్కడా మధ్యలో పెద్ద పెద్ద చేపలు మృతి చెందుతున్నట్లు తెలిపారు. నీటి నిల్వ తగ్గి ప్రాజెక్ట్‌లో చేపలకు ఆక్సిజన్ అందక గతంలో అనేక చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ కోసం ప్రతి రోజు 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. నీరు కలుషితమైతే తాగు నీటికి కూడ ఇబ్బందే అవుతుంది. ఎంత ప్యూరిఫైడ్ చేసినా రసాయానాలు కలిసిన నీరు తాగడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. పరీక్షలకు పంపుతాం.. ప్రాజెక్ట్‌లోని నీరు ప్రస్తుతం అధికంగా దుర్వాసన వస్తోంది. కొద్దిగా రంగు కూడ మారుతోంది. ఉన్నతాధికారులకు ఇది వరకే నివేదించాం. నీటిని పరీక్షలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
హైదరాబాద్‌లో విషాదం.. విహారయాత్రకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల తరపున విహార యాత్రలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వివరాలు.. స్థానిక సరస్వతి స్కూల్‌కు చెందిన 60 మంది విద్యార్థులు బాసర విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో గోదావరి నది ఒడ్డున తోటివారితో ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి విశాల్ అనే విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి ఉదయం 5గంటలకు బాసరకు వెళ్లగా...12 గంటలకు మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం తలిదండ్రులు ఫోన్ చేసి చెప్పింది. అయితే మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన స్కూల్ యాజమాన్యం.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల వద్ద వదిలి వెళ్లింది. దీంతో విశాల్ మృతదేహంతో స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సరస్వతి స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చదవండి: Drugs Case: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ కాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సరస్వతి విద్యానికేతన్ తరఫునుంచి గత 30 సంవత్సరాలుగా పేద విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అందులో భాగంగానే బాసర క్షేత్రానికి తీసుకెళ్లిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి గోదావరి నదిలో మునిగి మృతి చెందారు. -
గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
సాక్షి, వరంగల్: ఉగాది పండుగ రోజున ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం రోహీర్ గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రోహీర్ గ్రామానికి చెందిన డోంగిరి సందీప్, ఆకుదారి సాయివర్దన్, సతీష్ బెడిక ముగ్గురు విద్యార్ధులు ఉగాది పండుగ రోజున గోదావరిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీటిలో దిగి ఈత కొడుతుండగా ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు గల్లంతైన వారి గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: అలాంటి వారు వెంటనే అన్‌ఫాలో కండి: కేటీఆర్ -
SRSP: ప్రమాదపు అంచుల్లో చారిత్రక కట్టడం
-
నదులకు జీవం పోశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నదులకు జీవం పోసిందని, అందుకు గోదావరే సాక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 కి.మీ. మేర గోదావరి నది నేడు సజీవంగా ఉందన్నారు. నదుల పరిరక్షణపై రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చారని గుర్తుచేశారు. నదులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ సదుపాయాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 8 ఏళ్లలో 3 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశానికి ఆదర్శనమని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు తప్ప ఇలాంటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నదులకూ హక్కులున్నాయి: వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారం నదులకు సైతం హక్కు లుంటాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత దేశపౌరులపై ఉందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరులకు బాధ్యత ఉన్న ట్లు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముం బైలోని ఐదు నదులు నామరూపాల్లేకుండా పోవడంతో ఆ స్థలాల్లో అక్కడి ప్రభుత్వం ప్రజలకు పట్టాలిచ్చిందన్నారు. తాము కేసు వేస్తే కోర్టు పట్టాలను రద్దు చేసి నదులను పరిరక్షించిందని చెప్పారు. దేశ ప్రజలు నదులను ఒకప్పుడు తల్లిగా పూజించగా, నేడు మురికి కూపాలుగా తయారుచేశారని రాజేంద్రసింగ్ దుయ్యబట్టారు. అత్యధిక అక్షరాస్యతగల ఢిల్లీలో యమునా, హైదరాబాద్‌లో మూసీ నదికి పట్టిన దుస్థితే నిదర్శనమని ఆయన అన్నారు. నదులపై అడ్డగోలుగా ఆనకట్టలు కడితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతిం టుందని ఆందో ళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా నదుల పరిరక్షణకు ఈ సదస్సులో ముసాయిదా మేనిఫెస్టో తయారు చేస్తామ న్నారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే దేశంలో నదులకు ఈ దుస్థితి ఏర్పడిందని న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్ పేర్కొ న్నారు. నదుల పరి రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకా‹శ్, కృష్ణా రివర్ ఫ్యామిలీ చైర్మన్ ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నీటిపారుదల శాఖ రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
లత చితాభస్మ నిమజ్జనం
నాసిక్: పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న రామ్‌కుండ్‌లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చితాభస్మాన్ని గురువారం నిమజ్జనం చేశారు. లత సోదరి ఉష, మేనల్లుడు అదినాథ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు నాసిక్ వాసులు కూడా లతకు నివాళి అర్పించేందుకు వచ్చారు. గాయని లతా మంగేష్కర్(92) ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసం ధానం చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ తేల్చిచెప్పింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశం బుధవారం వర్చువల్ విధానంలో జరి గింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నా గార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదు గా కావేరికి తరలించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేది కను (డీపీఆర్‌ను) రాష్ట్రాలకు అందజేశామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి గోదావరి–కావేరి అను సంధానంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకే గోదా వరి జలాలు సరిపోతాయని, నీటిలభ్యత ఎక్క డుందని జవహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు లను పరిగణనలోకి తీసుకోకుండానే డీపీఆర్ రూపొందించారని ఆక్షేపించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్‌కే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిం దని గుర్తుచేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే మిగిలి న జలాలను తరలించాలని స్పష్టం చేశారు. దీనిపై పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఆ తర్వాతే బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో అనుసంధానంపై చర్చించాలని చెప్పారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు. కొత్త రిజర్వాయర్లు లేకుండా అనుసంధానమా? ఇచ్చంపల్లి నుంచి తరలించే గోదావరి జలాలను నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లలో నిల్వ చేసి.. కావేరి బేసిన్‌కు తరలించేలా డీపీఆర్‌ను రూపొందించడంపై ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిలలో నిల్వచేసే జలాలు వాటి ఆయకట్టుకే సరి పోవడం లేదన్నారు. గోదావరి జలాల నిల్వకు కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యమని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ కొత్త రిజర్వాయర్ల నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏకు సూచించారు. నీటి లభ్యత తేల్చాకే చర్చించాలి : తెలంగాణ గోదావరిలో నీటిలభ్యతను శాస్త్రీయంగా తేల్చా కే, కావేరికి నీటి తరలింపుపై చర్చించాలని తెలంగాణ కూడా అభిప్రాయపడింది. గోదావ రి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌ఘడ్ స్పష్టం చేసింది. కావేరి బేసిన్లో కర్ణాటకలోనే కరవు పీడిత ప్రాంతాలు ఎక్కువని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందువల్ల గోదావరి జ లాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీ తో పోల్చితే కృష్ణా బేసిన్లో తమ రాష్ట్రంలోనే కరవు పీడిత ప్రాంతాలు అధికమైనందున కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకు బదులు కృష్ణాజలాల్లో అదనపు వాటా ఇవ్వాల ని కోరింది. మహారాష్ట్ర కూడా కృష్ణాజలాల్లో అద నపు వాటా ఇవ్వాలని కోరింది. కావేరి బేసి న్కు గోదావరి జలాలను తరలిస్తున్నందున, కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధా నంపై ఎలాంటి అభ్యంతరం లేదని ఒడిశా తెలిపింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని తమిళనాడు కోరింది. -
గోదావరి, కృష్ణా నదుల్లో రోశయ్య అస్థికల నిమజ్జనం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అస్థికలను బుధవారం గోదావరి, కృష్ణా నదుల్లో నిమజ్జనం చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిలో, అలాగే విజయవాడ మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న వీఐపీ ఘాట్‌లో కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఆయన కుమారులు కేఎస్ శివసుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా రోశయ్య వద్దకు వెళ్తే పరిష్కారమవుతుందనే బలమైన నమ్మకం ఉండేదన్నారు. సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, ఏపీ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్, విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి.. కావేరి కలిపేద్దాం
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియపై కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న కేంద్రం..ఇటీవల ఆ ప్రక్రియపై వేగం పెంచుతోంది. ముఖ్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని గాడిలో పెట్టే పనిలో పడింది. పరీవాహక రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఒక్కొక్కటీ పరిష్కరించి వారిని ఒప్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీ భేటీ జరగనుంది. కమిటీకి చైర్మన్‌గా ఉన్న కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. మరోవైపు జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నదుల అనుసంధానంపై తన తదుపరి సమావేశాన్ని ఈనెల 29న హైదరాబాద్‌లోని జలసౌధ కేంద్రంగా నిర్వహించనుంది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలను ఆహ్వానించింది. నీటి లభ్యత, రాష్ట్రాలకు దక్కే వాటాలు, ఆయకట్టు, ముంపు సమస్యలతో పాటు రాష్ట్రాలు లేవనెత్తే ఇతర అంశాలపై ఇందులో చర్చించనుంది. తమిళనాడు ఒత్తిడితో ముందుకు... నదుల అనుసంధానంలో భాగంగా మహానది–గోదావరి–కృష్ణా–కావేరి గ్రాండ్ ఆనకట్టల వరకు నీటిని తరలించే ప్రక్రియ ఉన్నప్పటికీ.. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం మహానది–గోదావరి అనుసంధానాన్ని రెండో దశలో చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని భావించింది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని పేర్కొంటూ, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలించేలా రూ.86 వేల కోట్లతో ప్రణాళిక రచించింది. అయితే ఇంద్రావతి నీటిపై ఛత్తీస్‌గఢ్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తాము కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ఇంద్రావతి నీరు సరిపోతుందని, అలాంటప్పుడు ఇంద్రావతిలో మిగులు జలాలు ఉండవని అంటోంది. దీనికి తోడు ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపడితే తమ ప్రాంతంలోని 4 గ్రామాలకు ముంపు సమస్య తలెత్తుతుందని పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాలు కూడా గోదావరి–కావేరి అనుసంధానంపై పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. అయితే దిగువ రాష్ట్రమైన తమిళనాడు మాత్రం ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని పట్టుబడుతోంది. తమ తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా 200 టీఎంసీల మేర నీటినైనా తమ సరిహద్దు వరకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దీనితో పాటు పూండీ రిజర్వాయర్‌ను ఆరనియార్ రిజర్వాయర్‌తో అనుసంధానించాలని, దీనిద్వారా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న 609 చెరువులు నింపేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలు ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్రం మొగ్గు చూపుతోంది. మిగులు స్వేచ్ఛను హరించొద్దన్న ఏపీ ఇక పోలవరం వద్ద నీటి లభ్యత విషయంలో ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ల లెక్కల మధ్య పొంతన లేదని ఏపీ అంటోంది. నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కోరుతోంది. నికర జలాలు వాడుకోగా మిగిలిన జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీ కి కేటాయించారని, మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఇచ్చారని, ఇప్పుడు నీటిని కావేరికి తరలించే క్రమంలో ఏపీ హక్కులు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తమ హక్కుల పరిరక్షణలో భాగంగా పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల తరలింపు, గోదావరి–పెన్నా లింకు ద్వారా 320 టీఎంసీలు తరలింపు ప్రణాళికలను పరిశీలించాలని కోరుతోంది. వీటిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. మహానది నీటిని తరలించాకే అంటున్న రాష్ట్రం గోదావరి–కావేరి అనుసంధాన డీపీఆర్ ఆమోదించేందుకు ముందుగా ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యత అంశాలపై రాష్ట్రాలు, కేంద్ర జలసం ఘం ఆమోదం తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. దీంతో పాటే మొత్తంగా తరలించే నీటిలో 50 శాతం నీటి వాటాను తెలంగాణకు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా భూసేకరణ అవసరం కానున్న దృష్ట్యా ఆ రాష్ట్రాలతో చర్చించాకే తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని అంటోంది. గోదావరి నీటిని కావేరికి తరలించే ముందు తెలంగాణలో ఇచ్చంపల్లి ఎగువన ఉన్న దేవాదుల, తుపాకులగూడెం అవసరాలు, దిగువన ఉన్న సీతారామ ఎత్తిపోతల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, డీపీఆర్‌ను ఆమోదించే ముందే ఆయా ప్రాజెక్టుల నెలవారీ అవసరాలను లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. గోదావరి–కావేరి అనుసంధానానికి ముందే మహానది–గోదావరి అనుసంధానాన్ని కేంద్రం చేపట్టాలని, అక్కడి నుంచి మిగులు జలాలను గోదావరికి తరలించాకే, గోదావరి జలాలు కావేరికి తరలించాలని కోరుతోంది. దీంతో పాటు నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్‌గా ప్రతిపాదించే ముందు బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ ప్రకారం ఉన్న కేటాయింపుల్లో కృష్ణా బేసిన్లో నీటి అవసరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇచ్చంపల్లి ప్రతిపాదన తుపాకులగూడెం ఫోర్‌షోర్‌లో ఉన్న నేపథ్యంలో దీనిద్వారా దేవాదుల, ఎస్సారెస్పీలపై పడే ప్రభావా న్ని అధ్యయనం చేయాలని కూడా కోరుతోంది. -
సెల్ఫీ తీసుకుంటూ.. గోదావరిలో పడి..
నందిపేట్(ఆర్మూర్): సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి ఇద్దరు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న మరో యువకుడిని స్థానికులు కాపా డారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మెడ శివారులో ఈ సంఘటన జరిగింది. రాజస్తాన్‌కు చెందిన దేవసి కేతారాం, దేవసి ఈరారాం, దేవసి సుజారాం, మోహన్‌లాల్, మీరారాం, జాంతారాం మూడేళ్లక్రితం నందిపేట్‌కు వలస వచ్చారు. ఇక్కడ వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం ఉమ్మెడ గ్రామ శివారులోని గోదావరి నదీతీరంలో సరదాగా గడిపేందుకు ఈ ఆరుగురు కలసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర ఆలయ సమీపంలో నది ఒడ్డు వద్ద కేతారాం, ఈరారాం, జాంతారాం సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ నదిలో పడిపోయారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో వీరు నదిలో కొట్టుకుపోయారు. దీంతో ఒడ్డున ఉన్న మిగతా ముగ్గురు సాయం కోసం కేకలు వేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఉమ్మెడకు చెందిన రామడ బుచ్చన్న, బుచ్చ శేఖర్ వీరి అరుపులువిని అక్కడికి చేరుకున్నారు. నదిలో కొట్టుకుపోతున్న జాంతారాం ను ఒడ్డుకు చేర్చారు. మిగతా ఇద్దరిని కాపాడే ప్రయ త్నం చేసినా ప్రవాహం దాటికి వారు గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. గల్లంతయిన ఈరారాం నందిపేటలోని ఓ ఎలక్ట్రికల్ షాప్‌లో పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కిరాణ దుకాణంలో పని చేసే కేతారాం అవివాహితుడు. యువకులు గల్లంతయింది ఈ ప్రాంతంలోనే.. -
ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి
భైంసా (ముధోల్)/ధరూరు: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయం నుంచి నది వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన హరిహర కాటేజ్ నీట మునిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గినా నదిలో వరద ప్రవాహం మాత్రం గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రి 12 తర్వాత బాసర ఆలయం వైపు వెళ్లే మార్గాన్ని సైతం ముంచెత్తింది. ఇదే మార్గంలో ఉన్న హరిహర కాటేజ్ నీట మునిగింది. అందులో ఉన్నవారంతా అప్రమత్తమై స్లాబుల పైకి వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. పడవల సాయంతో కాటేజ్ వద్దకు చేరుకుని 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరోవైపు వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతూ మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణ ఆలయానికి తాకింది. రైల్వే వంతెన నుంచి స్నానఘట్టాల వరకు ఉన్న పొలాలన్నీ నీటమునిగాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడించారు. జూరాలకు మళ్లీ వరద ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తింది. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి 1,27,930 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని 11యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 1,60,553 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.214 టీఎంసీలు ఉంది. -
నదులన్నీ కడలి వైపు ఉరకలు
సాక్షి, అమరావతి: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులు కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. శ్రీశైలంలోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1.64 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు చేరుతుండటంతో నీటి నిల్వ 168.63 టీఎంసీలకు పెరిగింది. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న నీటిలో 10,480 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతుండటంతో నీటి నిల్వ 305.86 టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల మూసీ ఉరకలెత్తుతుండటం.. దానికి కృష్ణా వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 45,608 క్యూసెక్కులు చేరుతోంది. నీటి నిల్వ 32.25 టీఎంసీలకు చేరుకుంది. సిŠప్ల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 52,513 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,10,191 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 7,991 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1,02,200 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదా‘వడి’ పెరుగుతోంది గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.32 లక్షల క్యూసెక్కులు వస్తోంది. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 3.27 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి వంశధార, నాగావళి పరవళ్లు ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా వంశధార, నాగావళిలో వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 7,133 క్యూసెక్కులు చేరుతుండగా.. 7వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి ప్రవాహంతో తోటపల్లి, నారాయణపురం ఆనకట్టల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల నాగావళి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. పెన్నా బేసిన్లో రిజర్వాయర్లు కళకళ పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగింది. గండికోట ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. సోమశిల ప్రాజెక్టులోకి 22,792 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 70.40 టీఎంసీలకు చేరుకుంది. మరో 8 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు నిండిపోతుంది. కండలేరులో నీటి నిల్వ 53.76 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 15 టీఎంసీలు అవసరం. నాతవరం: తాండవ జలాశయ నీటిమట్టం మంగళవారం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు స్పిల్‌వే గేట్ల ద్వారా వరద నీటిని తాండవ నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ సాధారణ నీటిమట్టం 380 అడుగులు కాగా.. మంగళవారం మధ్యాహ్నానికి 379.2 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరుతోంది. రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 1200 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేశారు. రైవాడ ప్రమాదస్థాయి నీటి మట్టం 114.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 108.25 మీటర్లకు చేరింది. కోనాం ప్రమాద స్ధాయి నీటిమట్టం 101.24 మీటర్లు కాగా.. ప్రస్తుతం 98.45 మీటర్లు, మేఘాద్రిగెడ్డ ప్రమాదస్థాయి నీటిమట్టం 61 అడుగులు కాగా.. 58 అడుగులకు చేరింది. పెద్దేరు ప్రమాదస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా మంగళవారం సాయంత్రానికి 136.60 మీటర్లకు చేరింది. -
ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియపై తమ అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ మరోసారి కేంద్రానికి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ అవసరాలు పోను, మరో 176 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, ఆ నీటిని అనుసంధాన ప్రక్రియలో వినియోగిస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్సారెస్పీ–ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవని, లభ్యత నీటిని వాడుకునేలా ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపింది. గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై మంగళవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్‌సింగ్ నేతృత్వంలోని గవర్నింగ్ బాడీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసింది. ఈ భేటీకి తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని కావేరీకి తరలించేలా చేసిన ప్రతిపాదనలపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోలేని 247 టీఎంసీల నీటిని అనుసంధానం ద్వారా తరలిస్తామని కేంద్రం చెబుతున్నా.. దీనికి ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని రాష్ట్ర ఇంజనీర్లు ఎత్తిచూపారు. భవిష్యత్తులో ఇంద్రావతి నీటిని ఛత్తీస్‌గఢ్ వినియోగిస్తే మిగులు జలాలు ఎలా ఉంటాయో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కాగా, గోదావరిలో మిగులు జలాలే లేవని పునరుద్ఘాటించారు. ఈ దృష్ట్యా గోదావరి–కావేరీ అనుసంధానం కన్నా ముందు మహానది–గోదావరి అనుసంధానం చేయాలని, మహానది నుంచి నీటిని తరలించాకే కావేరీకి నీటిని తీసుకెళ్లాలని వెల్లడించారు. దీంతోపాటు ఈ అనుసంధాన ప్రక్రియలో నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామన్న ప్రతిపాదనను తెలంగాణ తప్పుపట్టింది. సాగర్‌కు ఉన్న నీటి కేటాయింపులు, దాని ఆపరేషన్ ప్రొటోకాల్‌పై ఇంతవరకు స్పష్టత లేదని, దీనిపై ట్రిబ్యునల్ తేల్చాల్సి ఉందని, అది జరగకుండా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడం లేక అటు నుంచి నీటిని తరలించడం సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేసింది. -
నేడు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం
-
కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం
సాక్షి,హైదరాబాద్: గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సోమవారం సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరు కాగా, తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చించారు. రెండో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. అక్టోబర్ 14 నుంచి బోర్డులకు పూర్తి అధికారం ఇస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్ట్‌ల వివరాలపై గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈనెల 3న మొదటి సమావేశం నిర్వహించగా.. రెండో సమావేశానికి కూడా హాజరుకాబోమని తెలంగాణ లేఖ రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. మరొక రోజు ఈ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. -
గోదావరికి పోటెత్తిన వరద..
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): గోదావరికి వరద నీరు పొటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. 10.08 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి రేపటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు.. కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఇన్‌ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 31,784 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు (తెలంగాణ) కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. పూర్తిస్థాయి 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 117 టీఎంసీలు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 863.70 అడుగులకు నీరు చేరుకుంది. -
ఐదు గంటలు.. హైరిస్క్ ఆపరేషన్: 16 మంది సురక్షితం
మంథని: ఓ వైపు గోదావరి ఉగ్ర రూపం.. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆలయ నిద్ర కోసం వచ్చిన కొందరు.. పడవలు కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన జాలర్లు మరికొందరు.. కాసేపటికే ఒక్కసారిగా పెరిగిన వరద.. ఎటు చూసినా నీళ్లే.. ప్రాణాలు అరచేత పట్టుకుని రాత్రంతా గడిపారు.. పొద్దున్నే వారిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ఏమవుతుందోననే ఆందోళన పెరిగి పోయింది. ఐదు గంటలు కష్టపడ్డ అధికారులు చివరికి వారిని ఒడ్డుకు చేర్చారు. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం వద్ద జరిగిన ఘటన ఇది. ప్రమాదకర పరిస్థితుల్లో.. మంథని మండలం కాకర్లపల్లికి చెందిన బొపెల్లి శంకరమ్మ భర్త ఈ నెల 12న చనిపోయాడు. పెద్దకర్మ అనంతరం ఆలయం వద్ద నిద్ర చేసేందుకని.. ఆమె తన ఇద్దరు కూతుళ్లు, మరో నలుగురితో కలిసి గురువారం రాత్రి 11 గంటలకు గౌతమేశ్వర ఆలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమ యానికి వరద పెరిగిపోవడంతో అక్కడే చిక్కుకు పోయారు. ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన విలోచవరం గ్రామ జాలర్లు 9 మంది.. ఆలయం సమీపంలో నివాసం ఉండే రెండు కుటుంబాలకు చెందిన 15 మంది కూడా వరదలో ఉండిపోయారు. మంథని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. తాళ్లతో బాధితులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా సఫలం కాలేదు. సింగరేణి రెస్క్యూ టీం 9:30కు అక్కడికి చేరుకుని ట్యూబ్‌ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించింది. కానీ ప్రవాహం వేగంగా ఉండటంతో 50 మీటర్లు ముందుకెళ్లగానే.. ట్యూబ్‌లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడి, వెనక్కి వచ్చేశారు. చివరకు బోట్ తెప్పించి కాకర్లపల్లికి చెందిన ఏడుగురిని, తర్వాత 9 మంది జాలర్లను ఒడ్డుకు చేర్చారు. ఆలయం సమీపంలో ఉండే 15 మంది బయటికి రావడానికి నిరాకరించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటానికి వచ్చిన సింగరేణి రెస్క్యూ టీం పుస్తకాల కోసం వచ్చి.. వాంకిడి (ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లా వాంకిడి మండలం కనర్గాం, భీంపూర్ గ్రామాలకు చెందిన 20 మంది పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 17 మంది పాఠ్యపుస్తకాలు తీసుకొనేందుకు గురువారం వాంకిడిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలకు వచ్చా రు. పుస్తకాలు తీసుకుని మూడు ఆటోల్లో తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే దుబ్బగూడ గ్రామశివార్లలో రెండు వాగుల్లో ప్రవాహం పెరి గింది. కష్టం మీద ఒక వాగును దాటారు. మరో వాగు వద్దకు వెళ్లేసరికే వరద ఉధృతి ఎక్కువై.. అక్కడే ఆగిపోయారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందని పరిస్థితి. రాత్రి 12 గంటల సమయంలో ఓ ఆటోడ్రైవర్‌కు సెల్‌ఫోన్ సిగ్నల్ అందడంతో.. కమానా గ్రామ ఎంపీటీసీకి ఫోన్ చేసి చెప్పాడు. చివరకు పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. -
గోదావరి 'ఉగ్రరూపం'
సాక్షి, అమరావతి/కొవ్వూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు పొంగి గోదావరికి వరద పెరిగింది. తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి బ్యారేజీలు, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం జలాశయాల గేట్లన్నీ ఎత్తేసి దిగువకు భారీగా వరదను విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద గంటగంటకు పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 1.65 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. నీటిమట్టం 27.7 మీటర్లకు చేరింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఎగువనుంచి ఇంకా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం పోలవరం వద్దకు నాలుగు లక్షల క్యూసెక్కుల జలాలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 62,219 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మిగులుగా ఉన్న 63,608 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నేడు ప్రకాశం బ్యారేజీకి 30 వేల క్యూసెక్కులు? ఎగువ నుంచి వస్తున్న వరదకు తుంగభద్ర ప్రవాహం తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 21 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో శ్రీశైలం నీటిమట్టం పెరగడం లేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 846 అడుగుల్లో 72.05 టీఎంసీల నీరుంది. తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్ పర్వతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పశ్చిమ కనుమల్లో భారీవర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీశైలంలోకి మరో రెండు రోజుల్లో భారీవరద వచ్చే అవకాశం ఉందని అ«ధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 13 వేల క్యూసెక్కులు వస్తుండగా.. మూడువేల క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేస్తూ మిగిలిన పదివేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో భారీవర్షాలు కురిసిన నేపథ్యంలో మున్నేరు, కట్టలేరు నుంచి వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం 30 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరిలో వ్యక్తి గల్లంతు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన నెల్లూరి నగేష్ (50) అనే వ్యక్తి కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఎరువుల దుకాణం నడుపుకునే నగేష్ గురువారం నల్లజర్లలో రైతులకు ఎరువులు ఇచ్చేందుకు ఆటోలో వచ్చాడు. పని ముగిశాక అక్కడి నుంచి కొవ్వూరు చేరుకుని నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. -
గోదావరిలో నలుగురు విద్యార్ధుల గల్లంతు.. 3 మృతదేహాలు లభ్యం
సాక్షి, పి.గన్నవరం: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం సమీపాన ఆదివారం గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్ (15), యర్రంశెట్టి రత్నసాగర్ (15), పంతాల పవన్ (15), ఖండవిల్లి వినయ్ (15) గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం ముగ్గురు విద్యర్థుల మృతదేహాలు లభ్యం అయ్యాయి, మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహాల్లో బండారు నవీన్, రత్నసాగర్, పంతాల పవన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు లంకల గన్నవరానికి చెందిన పదో విద్యార్ధులుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనాలు చేసి ఆ నలుగురు విద్యార్థులు గోదావరి తీరానికి ఆడుకొనేందుకు వెళ్లారు. రాత్రి ఏడు గంటలవుతున్నా తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి తీరాన ఒక విద్యార్థి సైకిల్ ఉండటంతో అనుమానంతో ఇసుక తిన్నెల్లో గాలించారు. అక్కడ నలుగురు విద్యార్థుల దుస్తులు, మాస్కులు, రెండు సెల్ఫోన్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ నలుగురు విద్యార్థులూ గోదావరిలో స్నానానికి దిగి, గల్లంతైనట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. చదవండి: నీట మునిగి 8 మంది దుర్మరణం -
లంకల గన్నవరం గోదావరిలో నలుగురు విద్యార్థులు గల్లంతు
-
నదుల అనుసంధానానికి తొలి అడుగు
(రామగోపాలరెడ్డి ఆలమూరు – సాక్షి ప్రత్యేక ప్రతినిధి): దేశంలో దుర్భిక్షాన్ని తరిమికొట్టేందుకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన నదుల అనుసంధానాన్ని చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన రెండు దశాబ్దాల తర్వాత కేంద్రం తొలి అడుగు వేసింది. కెన్ – బెట్వా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. ఈ రెండు నదుల అనుసంధానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వర్చువల్ విధానంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ నదుల అనుసంధానికి రూ.37,611 కోట్లు వ్యయం అవుతుంది. మధ్యప్రదేశ్‌కు 82 టీఎంసీలను సరఫరా చేయడం ద్వారా 8.11 లక్షల హెక్టార్లు.. ఉత్తరప్రదేశ్‌కు 59.98 టీఎంసీలను సరఫరా చేయడం ద్వారా 2.51 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 62 లక్షల మందికి తాగు నీటిని అందించనున్నారు. 103 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడంలో భాగంగా 90 శాతం నిధులను వ్యయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మిగతా పది శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్దతిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు భరిస్తాయి. ఎనిమిదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరీ అనుసంధానాన్ని చేపట్టడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కావేరికి గో‘దారి’పై సమాలోచనలు ► గోదావరి – కృష్ణా(నాగార్జునసాగర్) – పెన్నా(సోమశిల) – గ్రాండ్ ఆనకట్ట(కావేరీ) అనుసంధానానికి 2019లో ఎన్‌డబ్ల్యూడీఏ రెండు ప్రతిపాదనలు చేసింది. ► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను మొదటి దశలో కావేరికి తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లా జానంపేట వద్ద నుంచి కావేరికి మొదటి దశలో 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని సూచించింది. ఇందులో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో.. జూలై 28న సంప్రదింపుల సమావేశంలో గోదావరి – కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్‌ఫోర్స్ కమిటీకి పంపింది. గత నెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇచ్చంపల్లి నుంచి గోదావరి – కావేరీ అనుసంధానాన్ని చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దిశా నిర్దేశం చేసింది. ► తమ అవసరాలు తీర్చాకే ఇతర రాష్ట్రాలకు గోదావరి జలాలను తరలించాలని ఏపీ, తెలంగాణలు స్పష్టం చేస్తుండగా.. తమ వాటా జలాలను వాడుకోవడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ తెగేసి చెబుతోంది. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ కర్ణాటక, మహారాష్ట్ర పట్టుపడుతున్నాయి. ఇదే రీతిలో కావేరీ జలాల్లో అదనపు వాటా కావాలంటే కేరళ, కర్ణాటకలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను ఒప్పించడం కేంద్రానికి సవాలే. ఐదు అడ్డంకులు.. ► నదుల అనుసంధానంపై ఇప్పటి వరకు స్పెషల్ కమిటీ 18 సార్లు, సబ్ కమిటీ (కాంప్రహెన్షివ్ ఎవల్యూషన్) ఎనిమిది సార్లు, సబ్ కమిటీ (నదుల అధ్యయనం) 15 సార్లు, సంప్రదింపుల కోసం ఏర్పాటైన సబ్ కమిటీ మూడు సార్లు, టాస్క్‌ఫోర్స్ 13 సార్లు, న్యాయపరమైన అంశాల కమిటీ పది సార్లు, ఆర్థిక అంశాల కమిటీ 13 సార్లు సమావేశాలను నిర్వహించింది. ► ఈ సమావేశాల్లో కేవలం కెన్ – బెట్వా నదుల అనుసంధానంపై మాత్రం రాష్ట్రాలను ఒప్పించగలిగింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఒక బేసిన్ (నదీ పరీవాహక ప్రాంతం) నుంచి మరో బేసిన్‌కు మళ్లించే నీటిలో వాటా కోసం ఆ బేసిన్‌లోని ఎగువ రాష్ట్రాలు పట్టుబడుతుండటం, బేసిన్లో మిగులు జలాలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాలు ఆ విషయాన్ని అంగీకరించకపోవడం జరుగుతోంది. ► దీనికితోడు నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్లు ఇచ్చిన తీర్పులు, అనుసంధానం వ్యయంలో 90 శాతం కేంద్రమే భరించాలని రాష్ట్రాలు ఒత్తిడి తెస్తుండటం లాంటి అంశాల కారణంగా దేశంలో నదుల అనుసంధానం కార్యరూపం దాల్చడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని ఎన్‌డబ్ల్యూడీఏ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. రూ.5.60 లక్షల కోట్ల వ్యయం ► దేశంలో ఏటా కురిసే వర్షపాతం పరిమాణం నాలుగు వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు. (1,41,260 టీఎంసీలు). గంగా, బ్రహ్మపుత్రా, గోదావరి, మహానది తదితర నదుల ద్వారా ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ► హిమాలయ, ద్వీపకల్పంలోని 37 నదులను అనుసంధానం చేయడం ద్వారా 6,144.81 టీఎంసీలను మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 14 లింక్‌ల ద్వారా హిమాలయ నదులను, 16 లింక్‌ల ద్వారా ద్వీపకల్ప నదులను అనుసంధానం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ► ఈ నదుల అనుసంధానం వల్ల కొత్తగా 8.65 కోట్ల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 34 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. జల రవాణాకు ఊతమిస్తుంది. ఈ పనులు చేపట్టడానికి 2002 – 03 ధరల ప్రకారం రూ.5.60 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ధరల ప్రకారం నదుల అనుసంధానానికి రూ.పది లక్షల కోట్ల మేర అవసరం అవుతాయని అంచనా. ► నదుల అనుసంధానానికి వెచ్చించే వ్యయం.. ఆయకట్టులో ఉత్పత్తయ్యే పంటలపై వేసే పన్నులు, జల విద్యుత్ ఉత్పత్తి తదితర రూపాల్లో కేవలం పదేళ్లలో ఖజానాకు ఆ మొత్తం వెనక్కి వస్తుందని ఆర్థిక నిపుణులు తేల్చిచెప్పారు. ► దేశంలో దుర్భిక్షాన్ని తరిమికొట్టడానికి.. పేదరికాన్ని నిర్మూలించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని.. ఆ పనులు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ 2002లో దాఖలైన రిట్ పిటిషన్‌పై 2002 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. ► సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014 జూలై 14న నదుల అనుసంధానాన్ని చేపట్టడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఇందుకోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 సెప్టెంబరు 23న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
భద్రాద్రి ప్లాంట్‌కు ‘సీతమ్మ’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి వరద గండం పొంచి ఉంది!. గోదావరిపై దుమ్ముగూడెం వద్ద 63 మీటర్ల ఎత్తుతో నిర్మించతలపెట్టిన సీతమ్మసాగర్ డ్యాంతో భవిష్యత్తులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వరద ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద గోదావరి తీరంలో 1,080 (270్ఠ4) మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. గత 100 ఏళ్లలో గోదావరికి వచ్చిన గరిష్ట వరదలను పరిగణనలోకి తీసుకుని ఈ విద్యుత్ కేంద్రం కోసం నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేశారు. 2015లో విద్యుత్ ప్లాంట్ నిర్మాణపనులు మొదలయ్యాయి. అప్పట్లో సీతమ్మసాగర్ డ్యాం నిర్మాణానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు. తాజాగా సీతమ్మసాగర్ జలాశయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పరిస్థితులు మారిపోయాయని ఉన్నతస్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును 63 మీటర్లకు పెంచి సీతమ్మసాగర్ జలాశయాన్ని నిర్మిస్తే ఎగువన ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఇన్‌టేక్ వెల్‌తో పాటు ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి సంస్థకు చెందిన ఇన్‌టేక్ వెల్స్.. బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురికానున్నాయని ఇప్పటికే నీటిపారుదల శాఖ నిర్థారించింది. అయితే, భవిష్యత్తులో గోదావరికి భీకర వరదలు పోటెత్తితే మాత్రం భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సైతం ముంపు ప్రమాదం తప్పదని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. వరద రక్షణ గోడలు నిర్మించి భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి రక్షణ కల్పిస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఈ విషయమై నీటిపారదుల శాఖ, జెన్కోల మధ్య గత కొంతకాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. త్వరలో ఈ అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది వణికించిన వరదలు గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో గోదావరిలో వరద పోటెత్తింది. ఆగస్టు 17న 20 లక్షల క్యూసెక్కుల భారీ వరద రాగా, భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 61.60 అడుగులకు ఎగబాకింది. విద్యుత్ కేంద్రం ఇన్‌టేక్ వెల్ పిల్లర్లు దాదాపు సగం వరకు మునిగిపోగా, భద్రాద్రి విద్యుత్ కేంద్రం ప్రహరిగోడ దగ్గరికి వరకు నీళ్లొచ్చాయి. విద్యుత్ కేంద్రం లోపల కురిసిన వర్షపు నీటిని గోదావరిలోకి తీసుకెళ్లేందుకు దాదాపు రెండు మీటర్ల లోతులో నిర్మించిన డ్రెయిన్స్ నుంచి వరద నీరు విద్యుత్ కేంద్రంలోకి రివర్స్‌ఫ్లోలో పోటెత్తింది. దీనికి తోడు లోపల కురిసిన వాననీరు సైతం బయటకు వెళ్లక దీనికి జతకావడంతో విద్యుత్ కేంద్రం ఆవరణలో భారీగా నీరు నిలిచింది. వరద తీవ్రత మరింత పెరిగితే విద్యుత్ కేంద్రం ముంపునకు గురి అవుతుందని అక్కడ విధులు నిర్వహించే ఇంజనీర్లు ఆందోళనకు గురయ్యారు. వారం పాటు విద్యుదుత్పత్తిని నిలిపివేసి వరద ఉధృతి తగ్గాక మళ్లీ పునరుద్ధరించాల్సి వచ్చింది. 20 లక్షల క్యూసెక్కుల సాధారణ వరదలకే థర్మల్ విద్యుత్ కేంద్రం కొంతవరకు ప్రభావానికి గురైందని, భవిష్యత్తులో వరదలు తీవ్రస్థాయిలో వస్తే ముంపునకు గురయ్యే అవకాశాలెక్కువ ఉంటాయనే ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. గోదావరికి 1986 ఆగస్టు 16న అత్యంత భీకరంగా 36 లక్షల క్యూసెక్కుల జల ప్రవాహంతో వరదలు పోటెత్తాయి. భద్రాచలం వద్ద 75.6 అడుగులకు నీటిమట్టం పెరిగింది. గత 100 ఏళ్లల్లో గోదావరికి వచ్చిన అతిభారీ వరదలు ఇవే. మళ్లీ అంతకు మించిన వరదలు వస్తే మాత్రం భద్రాద్రి విద్యుత్ కేంద్రం ముంపునకు గురవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో ముంపు ముప్పు మరింత పెరగనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. 1986 నాటి వరదల నేపథ్యంలో గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కులతో భవిష్యత్తులో వరదలు వచ్చే అవకాశముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గరిష్ట వరదలకు సంబంధించిన అంచనాలను సవరించింది. వరద గోడలు నిర్మించినా వాగులతో సమస్యే! భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి వరద రక్షణ గోడలు నిర్మిస్తే గోదావరి వరద పోటు తప్పినా.. పరిసర ప్రాంతాల్లోని వాగుల రూపంలో కొత్త ముంపు సమస్య తలెత్తనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్న స్థలంలోనే ఓ సీపేజీ వాగు ఉంది. రక్షణ గోడ నిర్మాణంతో దీని ప్రవాహం సైతం విద్యుత్ కేంద్రం లోపలి ప్రాంతంలోనే నిలిచిపోనుంది. ఇలా రక్షణ గోడలకు ఇవతల నిలిచిపోయే నీటిని పంపుల ద్వారా గోదావరిలో ఎత్తిపోయాలని నీటిపారుదల శాఖ మరో ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ప్లాంట్‌కు రక్షణ గోడలు భద్రాద్రి ప్లాంట్ చుట్టూ 7.76 కి.మీ నిడివితో వరద రక్షణ గోడల నిర్మించాలని జెన్కో, నీటిపారదుల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. వరద రక్షణ గోడలు నిర్మిస్తే సువిశాలమైన ప్లాంట్ లోపలి భాగంలోకురిసే వర్షపు నీటితో పాటు పరిసర ప్రాంతాల్లోని వాగుల్లోని ప్రవాహాలను ఎత్తిపోయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ప్లాంట్ నిర్మాణ ఖర్చుకు అదనంగా ఇందుకు రూ.వందల కోట్లలో ఖర్చు కానుందని అంచనా. లేనిపక్షంలో అనూహ్యంగా భారీ వరదలు పోటెత్తితే రూ.9962.32 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రానికి తీవ్ర నష్టంవాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ కేంద్రంలో చాలా వరకు ఎలక్ట్రో–మెకానికల్ యంత్రపరికరాలు ముంపునకు గురైతే మరమ్మతులు సాధ్యం కాదని, మళ్లీ కొత్తవి తెచ్చుకోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనూహ్యంగా ముంపునకు గురికావడంతోదాదాపు ఇలానే భారీ నష్టం వాటిల్లింది. చుట్టూ రక్షణ గోడలు నిర్మించినా సరే వరద పోటెత్తినప్పుడు ..రక్షణ గోడల చుట్టూ చేరిన నీటి ఉర్ద్వ పీడనం (అప్లిఫ్ట్ ప్రెషర్)తో పవర్ ప్లాంట్ పునాదులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌తో పాటు సీతారామ ఎత్తిపోతల పథకంలోని తొలి లిఫ్టునకు సైతం గోదావరి నుంచి వరద ముప్పు ఉందని అధికారుల్లో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో అనూహ్య వరదలు పోటెత్తవచ్చు తీవ్ర వాతావరణ మార్పులను చూడబోతున్నాం. ఉష్ణోగ్రతలకు తగ్గట్టు వర్షపాతం పెరుగుతోంది. నదుల గరిష్ట వరద ప్రవాహ మట్టాలు (ఫ్లడ్ లెవల్స్) మారిపోతున్నాయి. గత వందేళ్లలో వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులకు డిజైన్ చేస్తున్నారు. గతంలో వందేళ్లకొచ్చిన వరదలు ఇప్పుడు పదేళ్లలో, వెయ్యేళ్లలో వచ్చిన వరదలు వందేళ్లలోనే వస్తున్నాయి. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కట్టేటప్పుడే ఇవన్నీ చూసుకోవాల్సింది. 1986లో వచ్చిన 36 లక్షల క్యూసెక్కుల స్థాయి వరద మళ్లీ పునరావృతమైనా, లేక సీడబ్ల్యూసీ సవరించిన అంచనాల మేరకు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి ముప్పు పొంచి ఉంటుంది. - డాక్టర్ బాబూరావు, పర్యావరణ శాస్త్రవేత్త -
ఇక తనివి తీరా... పాపికొండల అందాల వీక్షణ
రాజమహేంద్రవరం సిటీ: దాదాపు పద్దెనిమిది నెలల విరామం అనంతరం గోదావరి నది పాపికొండల అందాలను వీక్షించే అవకాశం లభించనుండడంతో పర్యాటక ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 2019 సెప్టెంబర్ 15న తూర్పు గోదావరిజిల్లా కచ్చులూరు వద్ద ఘోర లాంచీ ప్రమాదం చోటు చేసుకుని ప్రాణనష్టం సంభవించడంతో.. గోదావరి నదిలో తిరిగే అన్ని రకాల మోటార్ బోట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే పర్యాటక ప్రేమికుల కోరిక మేరకు పాపికొండల అందాలను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ.. ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏసీ లగ్జరీ బోటు నడపనున్నారు. కాగా, రాజమహేంద్ర వరానికి చెందిన 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు గతంలో నడిచేవి. అలాగే భధ్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు పర్యాటకులను పాపికొండల విహారానికి తీసుకొచ్చేవి. అయితే కచ్చులూరు ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరిలో నడిచే అన్ని రకాల బోట్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని కాకినాడ పోర్ట్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తగిన ప్రమాణాలు పాటించిన ఏసీ లగ్జరీ బోట్లను మాత్రమే.. అదికూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన అనంతరమే విహారానికి అనుమతించాలని సూచించింది. అయితే పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు లగ్జరీ బోట్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజాగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత ఏసీ లగ్జరీ బోటుకు పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. దీంతో 18 నెలల విరామం అనంతరం పటిష్టమైన ప్రణాళిక, రక్షణ చర్యల మధ్య పాపికొండల విహారానికి పర్యాటక అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి పాపికొండల విహారానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలోని సింగన్నపల్లి రేవు నుంచి లగ్జరీ బోటు నడిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని టూరిజం శాఖ అధికారి టి.వీరనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.750 చార్జీగా నిర్ణయించాలని యోచిస్తున్నామన్నారు. కేవలం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాత్రమే ఒక బోటు నడుస్తుందని, ప్రైవేట్ ఆపరేటర్ల బోట్లకు ఇంకా అనుమతులు మంజూరు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఏపీటీడీసీ’ వెబ్సైట్లోకెళ్లి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. -
ఇచ్చంపల్లి నుంచే 'అనుసంధానం'!
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఆదేశించింది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 85 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేందుకు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలను తరలిస్తే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని నీటి పారుదల, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్) పరిధిలోని, అనుసంధానం వల్ల ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా టాస్క్ ఫోర్స్ కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ 2 ప్రతిపాదనలు ఇవీ.. ► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట)కు మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లా జానంపేట వద్ద నుంచి నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించే 247 టీఎంసీల్లో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్ ఫోర్స్ కమిటీకి పంపింది. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం.. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేస్తే టాస్‌్కఫోర్స్ కమిటీ పేర్కొన్న మేరకు ప్రయోజనం ఉండదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమై పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుందని పేర్కొంటున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. లోయర్ గోదావరి సబ్ బేసిన్(జీ–10)లో ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిరి్మంచడానికి 1975 డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ (మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 85 టీఎంసీలను మాత్రమే ఇచ్చంపల్లి నుంచి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వినియోగించుకోవాలి. ఇచ్చంపల్లిలో అంతర్భాగమైన జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో ఉమ్మడి ఏపీ 27 శాతం, మహారాష్ట్ర 35 శాతం, మధ్యప్రదేశ్ 38 శాతం చొప్పున భరించాలి. విద్యుత్‌ను ఇదే దామాషాలో పంచుకోవాలి. విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసిన జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఏపీకి ఉంటుంది. అభిప్రాయాలను తీసుకోకుండానే.. గత నెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్ కమిటీ జానంపేట నుంచి గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదనను తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జానంపేట పరిసర ప్రాంతాల నుంచి గోదావరి జలాలను తరలించడానికి ప్రాజెక్టులు చేపట్టిందని, వాటి ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని జానంపేట నుంచి చేపడితే తెలంగాణ ప్రాజెక్టుల ఆయకట్టు ఈ అనుసంధానం పరిధిలోకి వస్తుందని, దీనివల్ల ప్రజాధనం వృథా అవుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచే కావేరికి గోదావరి జలాలను తరలించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన మినిట్స్ ప్రతులను ఇటీవల ఎన్‌డబ్ల్యూడీఏకు పంపిన టాస్‌్కఫోర్స్ కమిటీ ఇచ్చంపల్లి నుంచే గోదావరి–కావేరీ అనుసంధానం పనులు చేపట్టేలా డీపీఆర్ రూపొందించాలని ఆదేశించింది. బేసిన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకల అభిప్రాయాలను తీసుకోకుండానే కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని నీటిపారుదలరంగ, న్యాయ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
గోదావరి తీరంలొ నాని సినిమా షూటింగ్
తాళ్లపూడి: తాళ్లపూడిలోని గోదావరి తీరంలో నాని హీరోగా, సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్ర షూటింగ్‌తో సందడి వాతావరణం నెలకొంది. చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను గోదావరి తీరం, గోదావరి నదిలో చిత్రీకరించారు. రెండో రోజూ సోమవారం హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి ఇతర నటులు రేవు వద్ద నుంచి పడవ దాటే సన్నివేశంతో పాటు పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా వెంకట్ బోయినపల్లి నిర్మాతగా బాబి ప్రాడక్షన్ మేనేజర్‌గా వ్యహరిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు అధిక సంఖ్యలో జనం గోదావరి తీరానికి చేరుకుంటున్నారు. -
శుక్రవారమని ఆపావు.. ఇప్పుడు నువ్వే లేకుండా పోయావు
సాక్షి, భద్రాచలం: శుభకార్యానికి వచ్చి ఆనందంగా గడిపిన వారిలో ముగ్గురు మృత్యువాత పడడంతో పెను విషాదం నెలకొంది. గోదావరి తీరం రోదనలతో మిన్నంటింది. స్నానానికి వచ్చిన వారిని నీలో కలుపుంటావా గోదారమ్మా..ఏందమ్మా ఇది! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. భద్రాచలం అయ్యప్ప కాలనీకి చెందిన మచ్చా శ్రీనివాసరావు కూతురు ఓణీల శుభకార్యానికి తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామానికి చెందిన వెలిదండి శ్రీను 20మందితో బుధవారం వచ్చారు. అంతా ఆనందంగా గడిపారు. శుక్రవారం అయ్యప్ప నగర్ కరకట్ట వద్ద గోదావరి వద్దకు తొమ్మిది మంది వెళ్లి బట్టలు ఉతికాక, స్నానం చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలం భగవాన్ దాస్ కాలనీకు చెందిన సొంతమూరి రాంచరణ్(08) మునిగిపోతుండటంతో అతడిని కాపాడేందుకు శ్రీను భార్య వెలిదండి వరలక్ష్మి(28), మేనకోడలు కొడవలి సురేఖ(14), రాంచరణ్ తల్లి సొంతమూరి భవాని, మండపేటకే చెందిన బంధువు వెలిదండి వీరవెంకటరమణలు వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోయి మునిగిపోయారు. ఒడ్డున ఉన్న వారి కేకలతో స్థానికులు, గజఈతగాళ్లు నీటిలోకి దిగి సురేఖ, భవాని, వీరవెంకట రమణలను రక్షించారు. వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ సురేఖ మృతి చెందింది. అనంతరం వరలక్ష్మి, రాంచరణ్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సొంతమూరి భవాని పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు. వెంకటరమణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెలిదండి శ్రీను గతంలో భద్రాచలంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడు. కొంతకాలం కిందట కుటుంబంతో తూర్పుగోదావరి జిల్లా మండపేటకు వలస వెళ్లాడు. శుభకార్యానికి రాగా..ఇలా విషాదం నెలకొందని బోరున ఏడుస్తున్నాడు. మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ టి.స్వామి ఆధ్వర్యంలో పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. శుక్రవారమని ఆపావు..ఇప్పుడు నువ్వే లేకుండా పోయావు ‘ఇంటికి వెళ్దామంటే శుక్రవారమని ఆపావు.. ఇప్పుడు నువ్వే లేకుండా పోయావా వరలక్ష్మీ..’ అంటూ మృతురాలి భర్త శ్రీను రోదించిన తీరు కలిచివేసింది. మరో మృతురాలు సురేఖకు మూడు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోతే ఆమెను, తమ్ముడిని మేనమామ, మేనత్తలు శ్రీను, వరలక్ష్మి దంపతులే పెంచుతున్నారు. ఇంకో మృతుడు రాంచరణ్‌కు మూడు నెలల క్రితమే గుండెకు సంబంధించి ఆపరేషన్ జరిగిందని, ఇంతలోనే మళ్లీ దేవుడు అన్యాయం చేశాడని సంఘటనా స్థలంలో ఉన్న సోదరి విలపించింది. కలెక్టర్ విచారం భద్రాచలం వద్ద గోదావరిలో మునిగి ముగ్గురు మృతి చెందిన ఘటన చాలా బాధాకరమని కలెక్టర్ ఎంవీ.రెడ్డి ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సురక్షిత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అప్రమత్తం చేయాలని ఆదేశించారు. -
పెను విషాదం: సరదాగా వెళ్లి.. శవాలై వచ్చారు..
అమలాపురం రూరల్(తూర్పుగోదావరి): గోదావరిలో స్నానం చేయాలన్న సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను తీసింది. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆ ముగ్గురు యువకులు తల్లిదండ్రులకు చేతికందొస్తున్న వేళ గోదావరి వారి నిండు ప్రాణాలను గాలిలో కలిపేసింది. స్నేహమేరా జీవితమనుకున్న యువకులను తిరిగి రాని లోకాలకు పంపేసింది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వారు.. మరణం విషయంలోనూ కలిసే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముమ్మిడివరం మండలం గేదెల్లంక గౌతమీ నదీ పాయలో బుధవారం జరిగిన ప్రమాదంలో అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి శివారు శెట్టిపేటకు చెందిన దంగేటి ఫణికుమార్ (19), కుడుపూడి ప్రేమ్‌సాగర్ (17), మామిడిశెట్టి బాల వెంకటరమణ (19) ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో కుటుంబానిదీ ఒక్కో కన్నీటి కథ ఫణికుమార్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తండ్రి కోటేశ్వరరావు దివ్యాంగుడు. పేపర్ ఏజెంట్‌గా శ్రమిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. ఫణికుమార్ రెండో కొడుకు. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశ పడుతున్న ఆ కుటుంబానికి ఫణి మృతి తీరని వ్యధ మిగిలింది. ప్రేమ్‌సాగర్ డిప్లమో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సంతానం లేకపోవడంతో మునేశ్వరరావు, సూర్యకుమారి దంపతులు ఈ కుర్రాడిని దత్తత తీసుకున్నారు. మూడేళ్ల కిందట సూర్యకుమారి చనిపోయింది. ఆరు నెలల కిందట మునేశ్వరరావు కరోనాతో కన్ను మూశాడు. దీంతో అనాథ అయిన ప్రేమ్‌సాగర్‌ను చిన్నాన్న రామకృష్ణ చేరదీసి పెంచుతున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురూ చనిపోయినట్లయింది. బాల వెంకటరమణ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాసరావు ఆటో నడుపుతాడు. తల్లి పార్వతి కిరాణా దుకాణంలో పని చేస్తోంది. వారికి వెంకటరమణ ఒక్కడే కొడుకు. చేతికందొచ్చే కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో బుధవారం మధ్యాహ్నం ఓ వేడుకకు ముగ్గురూ ఒకే మోటారు సైకిల్‌పై వెళ్లారు. మధ్యాహ్న భోజనాలు చేసి దగ్గరలోనే ఉన్న గేదెల్లంక గౌతమీ నది ఉత్తర వాహిన పుష్కర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురూ సరదాగా స్నానం చేద్దామని గోదావరిలోకి దిగారు. స్నానాలు చేస్తున్న సమయంలో ఒకరు తర్వాత ఒకరు గోదావరిలోకి మునిగి పోయి గల్లంతయ్యారు. చివరికి అయినవారికి గుండెకోత మిగిల్చుతూ గురువారం ఉదయం గేదెల్లంక గోదావరిలో శవాలై తేలారు. వారి మృత్యు వార్త విని ఆ మూడు కుటుంబాలే కాదు శెట్టిపేటే కన్నీరు మున్నీరయింది. చదవండి: అతి వేగానికి బ్రేకులు.. భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..! -
పడవెక్కి భద్రాద్రి పోదామా..!
భద్రాద్రి రామయ్యను దర్శించాలంటే.. నల్లని నునుపైన తారురోడ్డు మీద.. బస్సులు, కార్లు, వ్యాన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రయ్‌మంటూ దూసుకుపోవడమే ప్రస్తుతం చాలామందికి తెలుసు. ఏదో వెళ్లాం వచ్చాం అన్నట్టే తప్ప.. ఇటువంటి ప్రయాణం పూర్తి ఆనందాన్నిస్తుందని చెప్పలేం. కానీ.. అదే ప్రయాణం– మంద్రంగా వీచే గాలి తరగలు తనువును సుతారంగా స్పృశిస్తుండగా.. గోదావరి అలల తూగుటుయ్యాలపై.. ‘లాహిరి లాహిరి లాహిరి’లో అన్నట్టుగా.. కనులను కట్టిపడేసే ప్రకృతి అందాల నడుమ.. హాయిహాయిగా.. సాగితే.. ఆ అనుభూతి ఎప్పటికీ పదిలమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ‘పడవెక్కి భద్రాద్రి పోదామా.. భద్రాద్రి రాముడిని చూద్దామా..’ అని పాడుకుంటూ వెళ్లే ఆనంద క్షణాలు త్వరలోనే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా గోదావరిపై జల రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో లాంచీపై ప్రయాణం అంటే ఎవ్వరికైనా ఆనందదాయకమే. చిన్నారులకు, కుర్రాళ్లకైతే మరీ ఉత్సాహం. కానీ, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో లాంచీల్లో ప్రయాణమంటేనే వెనకడుగు వేయాల్సిన దుస్థితి. గతంలో కచ్చులూరు వద్ద పర్యాటక బోటు బోల్తా పడిన ఘోర ప్రమాదంలో 58 మంది మృత్యువాత పడిన విషయం ఇంకా కన్నుల ముందే కదలాడుతోంది. ఈ ప్రమాదం తరువాత రాష్ట్ర ప్రభుత్వం నదిలో ప్రమాద రహిత ప్రయాణానికి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు పర్యాటకానికి తెర పడుతుందని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, అటువంటి అనుమానాలకు తావు లేకుండా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ సంకల్పించింది. చదవండి: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఇందులో భాగంగానే నాలుగు దశాబ్దాల కిందట ఆగిపోయిన జలరవాణాను పునరుద్ధరించే దిశగా చర్యలు ఆరంభిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జల రవాణాను ప్రోత్సహించేందుకు ‘సాగరమాల’ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తోంది. అదే తరహాలోనే ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గిరిజన గ్రామాల్లో అటవీ ఉత్పత్తుల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం అఖండ గోదావరిపై జలరవాణా చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పోలవరం – పోచవరం మధ్య జలరవాణాకు అనువైన పరిస్థితులపై బాథ్ మెట్రిక్ సర్వేకు ఇటీవల ఆదేశించింది. ఇందుకు రూ.45 లక్షలు కేటాయించింది. దీంతో రాజమహేంద్రవరం – భద్రాచలం మధ్య జల రవాణాకు మొదటి అడుగు పడినట్టయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే భద్రాద్రి రాముడిని దర్శించుకోవాలనుకునే వారు కూడా త్వరలో మళ్లీ గోదావరిపై లాంచీల్లో వెళ్లి వచ్చే అవకాశం కలగనుంది. తెల్లవారకుండానే ప్రయాణం అప్పట్లో భద్రాచలం వెళ్లే లాంచీ రాజమహేంద్రవరంలో తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరేది. దేవీపట్నం మండలం కొండమొదలుకు మధ్యాహ్నం 12 గంటలకు, అక్కడి నుంచి భద్రాచలానికి సాయంత్రం ఆరు గంటలకు చేరుకునేది. ప్రారంభంలో రూపాయి, ఐదు రూపాయలు ఉండే చార్జీ జల రవాణా ముగిసిపోయే నాటికి రూ.100కు చేరింది. ఒక లాంచీలో ట్రిప్పునకు 70 నుంచి 80 మందిని తీసుకువెళ్లేవారు. అటు గోదావరిలో ప్రయాణం మాదిరే ఇటు ధవళేశ్వరం నుంచి కోనసీమలోని పంట కాలువల్లో కూడా లాంచీలు, పడవలపై ప్రయాణం సాగేది. అప్పట్లో రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్ సరిహద్దు వరకూ మొత్తం అంతా గోదావరి పైనే రవాణా. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి కుంట (ఛత్తీస్‌గఢ్) వరకూ మధ్యలో ఉన్న గిరిజన పల్లెలకు నిత్యావసర వస్తువులు, అటవీ ఉత్పత్తుల తరలింపునకు జల రవాణాయే ఆధారం. భద్రాచలం దాటిన తరువాత దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట పైనుంచి వెంకటాపురం వరకూ ఐదారు లాంచీలు తిరిగేవి. రాజమహేంద్రవరం నుంచి కూనవరం వరకూ లాంచీ ప్రయాణం చేస్తే.. అక్కడి నుంచి ప్రైవేటు బస్సులలో ప్రయాణించేవారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం నుంచి మహారాష్ట్ర వరకూ 10 లాంచీలు, రాజమహేంద్రవరం – ఛత్తీస్‌గఢ్‌లోని సాలాపూర్ మధ్య నాలుగు, పోలవరం, దేవీపట్నం, కొండమొదలు వరకూ రెండు లాంచీల చొప్పున నడిచేవి. భద్రాచలం సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ గ్రామాల నుంచి పడవల మీద వెదురు, పొగాకు, తునికాకు, పసుపు, మిర్చి వంటి సరకులు తరలింపు జల రవాణా పైనే జరిగేది. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో లాంచీపై 25 టన్నుల వరకూ రవాణా చేసేవా రు. ఇందుకు బస్తాకు 75 పైసల నుంచి రూపాయి వరకూ తీసుకునేవారు. గోదావరిపై రాజమహేంద్రవరం వద్ద రోడ్ కం రైలు బ్రిడ్జి, శబరి నదిపై చింతూరు – చట్టి మధ్య, గోదావరిపై భద్రాచలం – సారపాక మధ్య వంతెనల నిర్మాణం జరిగిన జలరవాణాకు క్రమంగా ఆదరణ తగ్గిపోయింది. 1978కి ముందే.. రాజమహేంద్రవరం నుంచి పోచవరం వరకూ రోడ్డు మార్గంలో దూరం160 కిలోమీటర్లు. అదే గోదావరి జల మార్గంలో 100 కిలోమీటర్లు మాత్రమే. అంటే 60 కిలోమీటర్లు తక్కువ. గతంలో రోడ్డు సౌకర్యం లేనప్పుడు గోదావరి జిల్లాల్లోని 100 గ్రామాలకు జల రవాణాయే దిక్కు. 1978కి ముందే గోదావరిలో జల రవాణా ఉంది. రాజమహేంద్రవరం నుంచి కూనవరం, భద్రాచలం, కుంట వరకూ ప్రతి రోజూ 80 నుంచి 100 లాంచీలపై ప్రజల రాకపోకలకు, నిత్యావసరాల తరలింపునకు జల రవాణా తప్ప ప్రత్యామ్నాయం ఉండేది కాదు. మారేడుమిల్లి రోడ్డు నిర్మించిన తరువాత ఆ మార్గంలో కలప, వెదురు రవాణా మాత్రమే జరిగేవి. 1986లో తారు రోడ్డు వేశాక రాజమహేంద్రవరం నుంచి బస్సు సర్వీసు ఏర్పాటుతో లాంచీ ప్రయాణాలు తగ్గాయి. అలా 80వ దశకం వరకూ జల రవాణా సాగింది. పూడికలు తెలుసుకునేందుకు.. నీటి లోపలి స్వరూపాన్ని అంచనా వేసేందుకు, ఇసుక, పూడిక ఎంతవరకూ ఉన్నయో తెలుసుకునేందుకు బాథ్ మెట్రిక్ సర్వే నిర్వహిస్తాం. ఎక్కడ లోతు ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందనే విషయాలు కూడా సర్వే ద్వారా తెలుస్తాయి. దీనివలన పడవల రాకపోకలకు ఏ మేరకు అనువుగా ఉందో అంచనా వేయవచ్చు. జల రవాణాకు ఇబ్బందులు లేకుండా ఈ సర్వే సహాయ పడుతుంది. – ఆర్.మోహనరావు, హెడ్‌వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం లాంచీ ఓనర్ అంటే ఆ రోజుల్లో ఎంతో గౌరవం 1983లో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. అప్పట్లో నాకు 16 సంవత్సరాలు. ఇప్పుడు 55 సంవత్సరాలు. జల రవాణాను మూడు దశాబ్దాలు చూశాను. లాంచీ ఓనర్ అంటే మండల ప్రెసిడెంట్, పంచాయతీ ప్రెసిడెంట్లా ప్రజల్లో మంచి గౌరవం, ఆదరణ ఉండేది. ప్రయాణికుడికి రూపాయి నుంచి రూ.100 చార్జీ వరకూ నేను చూశాను. తక్కువ చార్జీ చేసినప్పటికీ ప్రయాణంలో ఉచితంగా భోజనాలు పెట్టేవాళ్లం. అప్పట్లో తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ ఆ శాటిస్ఫేక్షన్ వేరుగా ఉండేది. ఇప్పుడు వేలు ఆర్జిస్తున్నా ఆ రోజుల్లో ఉన్న శాటిస్ఫేక్షన్ లేదు. – పాదం వెంకట రమణమూర్తి (బుల్లు), లాంచీల యజమాని, పట్టిసీమ -
పల్నాటి సీమ సుభిక్షంపై సర్కారు ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: గోదావరి నది, వరికపుడిశెల వాగు వరద జలాలతో దుర్భిక్ష పల్నాటి సీమను సుభిక్షం చేసే పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను, వరికపుడిశెల ఎత్తిపోతల ద్వారా వరికపుడిశెల వాగుల నుంచి వరద జలాలను ఎత్తిపోసే పనులను వేగంగా పూర్తి చేయడానికి వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుల సంస్థ పేరుతో ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్)ని ఏర్పాటు చేసింది. బడ్జెట్ కేటాయింపులకు తోడు.. ఎస్పీవీ పేరుతో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక రచించింది. వీటిద్వారా పల్నాడులో రెండు లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించడంతో పాటు ప్రజల దాహార్తి తీర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పోలవరం నుంచి గోదారమ్మ పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించే గోదావరి జలాల్లో కృష్ణా డెల్టాకు తరలించగా మిగులుగా ఉన్న ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80 కిమీ వద్దకు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి పల్నాడుకు గోదావరి జలాలను తరలిస్తారు. ఈ పనులకు వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పేరుతో రూ.6,020 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. వరికపుడిశెల వాగు వరద ఒడిసి పట్టి.. పల్నాడు నుంచి కృష్ణా నదిలో కలిసే వరికపుడిశెల వాగు వరదను ఒడిసి పట్టి.. ఆ ప్రాంతాన్ని సుభిక్షం చేసే పనులను ప్రభుత్వం చేపట్టింది. వరికపుడిశెల వాగు ఎత్తిపోతల తొలి దశ పనులకు రూ.340 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చింది. భూసేకరణను కొలిక్కి తెచ్చిన ప్రభుత్వం.. పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. మరోవైపు వరికపుడిశెల వాగు ఎత్తిపోతల రెండో దశ పనుల కోసం రూ.1,273 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
అయ్యో కొడుకా.. ఎంత పనాయె..!
సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్) : అయ్యో కొడుకా ఎంత పనాయే.. సెలవులకు రాకున్నా బతికేటోడివి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటావనుకుంటే అంతలోనే కన్నుమూశావా కొడుకా.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు గోదావరిలోకి వెళ్లి నాటు పడవ మునిగి చెన్నూర్ పట్టణానికి ఆర్మీ జవాన్ రాజ్‌కుమార్ మృతి చెందిన విషయం తెల్సిందే. పట్టణానికి చెందిన గుండమీది రాజన్న, సునీత దంపతులకు కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె ఉన్నారు. రాజ్‌కుమార్‌ను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ఉన్నత చదువులు చదివిన రాజ్‌కుమార్ 2017లో ఆర్మీలో ఉద్యోగం సాధించి.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని లేహ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజ్‌కుమార్‌కు సెలవులు మంజూరుకాగా.. మూడురోజుల క్రితం ఇంటికొచ్చాడు. సోమవారం ఉదయం స్నేహితులతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మండలంలోని ఎర్రాయిపేట గోదావరినదిలో నాటుపడవ మునిగి మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. హోటల్లో దినసరి కూలీగా పనిచేసే రాజన్న తన కుమారుడిని కష్టపడి చదివించిన ప్రయోజకుడిగా చూద్దామన్న కల నెరవేరకుండా పోయింది. నదితీరం వద్దే ప్రశాంత్ తల్లిదండ్రులు చెన్నూర్‌కే చెందిన బండి శంకర్, రాజేశ్వరికి ఇద్దరు కుమారులు. ప్రశాంత్ డ్రైవింగ్ చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం గోదావరిలో స్నానం చేద్దామని స్నేహితులతో కలిసి వెళ్లాడు. నాటుపడవ మునగడంతో ప్రశాంత్ గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. కొడుకు ఇంటి నుంచి వెళ్లి రెండు రోజులు గడిచినా ఇంతవరకు జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గోదావరి వద్దే నిరీక్షిస్తూ.. ‘ఎప్పుడొస్తావు కొడుకా..’ అంటూ ఏడుస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మంగళవారం రాత్రి వరకూ గోదావరిలో కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు గోదావరి నది వద్దే వేచిచూస్తున్నారు. ఆరుగురు స్నేహితులు కలిసి సోమవారం నాటుపడవలో గోదావరిలో ఈతకొట్టేందుకు బయల్దేరి సగం దూరం వెళ్లగానే ప్రమాదవశాత్తు బోల్తాపడింది. వీరిలో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరగా.. రాజ్‌కుమార్, ప్రశాంత్ గల్లంతయ్యారు. సంఘటన జరిగిన గంట తర్వాత బండి శ్రీనివాస్ అనే యువకుడు తన తండ్రి శంకర్‌కు ఫోన్లో విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ నాగరాజ్ సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో సోమవారం నుంచి మంగళవారం వరకూ గాలింపు చర్యలు చేపట్టగా.. రాజ్‌కుమార్ మృతదేహం లభించింది. ప్రశాంత్ జాడ మాత్రం ఇంకా తెలియడం లేదు. -
భార్య పుట్టింటికెళ్తే.. భర్త గోదావరిలో దూకి..
భార్య తన పక్కన లేకపోయేసరికి ఆ భర్త కంగారు పడ్డాడు. ఆమె కోసం తీవ్రంగా గాలించాడు. గోదావరి చెంత ఆమె చెప్పులు కనిపించేసరికి నదిలోకి దూకేసిందనుకున్నాడు. తాను కూడా వెంటనే ఆమె కోసం ఆవేశంగా ఆ నదిలోకి దూకేశాడు. అయితే అంతా అనుకున్నట్టే భార్య ఆమె పుట్టింటి వద్ద ప్రత్యక్షమైంది. భర్త మాత్రం గోదావరిలో గల్లంతయ్యాడు. సాక్షి, మామిడికుదురు: భార్య గోదావరి నదిలో దూకేసిందన్న బాధతో భర్త కూడా అదే గోదావరి నదిలో దూకి గల్లంతైన సంఘటన పెదపట్నం గ్రామంలో సోమవారం జరిగింది. చివరకు భార్య పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బంధువుల ఇంట క్షేమంగా ఉందన్న సమాచారంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గ్రామంలో తాపీ పనిచేసుకుంటూ జీవించే యర్రంశెట్టి వెంకటరవికుమార్(28) అనే యువకుడు పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. చదవండి: ('రమ్యశ్రీని కొట్టి చంపేశారు..') పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఆదివారం రాత్రి 11 గంటల వరకు టీవీ చూశారు. రాత్రి వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెల్లవారుజామున రెండు గంటలకు భర్త నిద్ర లేచి చూసే సరికి భార్య పుష్పశివ కనిపించలేదు. భార్య ఆచూకీ కోసం ఊరంతా గాలించాడు. మెడలో ఉండాల్సిన మంగళసూత్రాలు ఇంట్లో ఉండడం, గోదావరి నది ఒడ్డున భార్య వేసుకునే చెప్పు లు కనిపించడంతో భార్య నదిలో దూకేసిందని భావించాడు. వెంటనే చెప్పులు తీసుకుని ఇంటికి వచ్చి చెప్పులు తల్లికి చూపించి అవి తన భార్యవని నిర్ధారించుకుని, వెంటనే బైక్ తీసుకుని సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాశర్లపూడి బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అక్కడ బైక్ ఉంచి అమాంతంగా గోదావరి నదిలో దూకేశాడు. స్థానిక మత్య్సకారులు దీనిని గమనించారు. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..) పాశర్లపూడిలో వైనతేయ నది వద్ద గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న రాజోలు ఎస్సై కృష్ణమాచారి వెంకటరవికుమార్, పుష్పశివకు మూడేళ్ల కిత్రం వివాహమైంది. వారికి 11 నెలల బాబు ఉన్నాడు. జనవరి 20న తిరుపతి వెళ్లి బాబు పుట్టి వెంట్రుకలు మొక్కు తీర్చాలని టికెట్లు కూడా బుక్ చేయించుకున్నారు. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో అతడి∙కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పుష్పశివ గతంలో కూడా ఇలానే అదృశ్యమైందని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని భావించారు. అంతా అనుకున్నట్టే భార్య ప్రత్యక్ష కావడం, భర్త గల్లంతు కావడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై రాజోలు ఎస్సై డి.కృష్ణమాచారి ఆధ్వర్యంలో నగరం ఏఎస్సై టి.ప్రసాదరావు కేసు దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన యువకుడి కోసం వైనతేయ నదిలో గాలింపు చేపట్టారు. -
మహానదే ఫస్ట్
సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కొత్త అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. గోదావరి బేసిన్లో రాష్ట్ర అవసరాలు తీరాకే మిగులు నీటిని తరలించాలని మొదటినుంచీ గట్టిగా కోరుతున్న తెలంగాణ, ప్రస్తుతం మహానదిలో మిగులుగా ఉన్న నీటిని గోదావరికి తరలించాకే దిగువన అనుసంధాన ప్రక్రియ (గోదావరి– కావేరి) చేపట్టాలని బలంగా వాదిస్తోంది. గోదావరికి ఉపనదిగా ఉన్న ఇంద్రావతిలో మిగులు నీటిని చూపెట్టి వాటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... మొదట మహానది– గోదావరి అనుసంధానం చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది. మహానదిలో మిగులు నీరు గోదావరిలో కలిస్తే రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది రాదని, అప్పుడు గోదావరి–కావేరి అనుసంధానం చేస్తే తమకు అభ్యంతరమేమీ ఉండదని తెలిపింది. సోమవారం జరిగిన జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) భేటీలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. మహానదిలో మిగులు 100 టీఎంసీలే: ఒడిషా ఒకనదిలో అధిక లభ్యత ఉన్న నీటిని ఆ నది పరివాహక ప్రాంత అవసరాలకు తీరాక మరో నదికి తరలించే క్రమంలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియకు ఆదినుంచి ఇక్కట్లే ఎదురవుతున్నాయి. మొదటగా ఒడిషాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహానదిలో సుమారు 320 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. అయితే ఈ ప్రతిపాదనపై ఎగువన ఉన్న ఒడిషా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలతో ఒడిషా విబేధించింది. మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని వాదించింది. ఈ అనుసంధానంతో తమ రాష్ట్రంలోని 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని అభ్యంతరం తెలిపింది. తెలంగాణ సైతం గోదావరిలో లభ్యంగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో 350 టీఎంసీ అదనపు జలాలున్నాయనడం (తెలంగాణ రాష్ట్ర పరిధిలో) సరికాదని అంటోంది. అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాలోŠల్ కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహానది–గోదావరి ప్రతిపాదనను పక్కనపెట్టి, గోదావరి–కావేరి అనుసంధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చి నాలుగు రకాల ప్రతిపాదనలు రూపొందించింది. చత్తీస్‌గఢ్ కొర్రీ... ఇక గోదావరి– కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతుండటంతో వరంగల్ దగ్గర్లోని జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్‌న్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని కూడా తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మిగులు ఉన్నాయని చెబుతున్న ఇంద్రావతి నీళ్లను పూర్తిగా తామే ఉపయోగించుకుంటామని ఎన్‌డబ్ల్యూడీఏ ముందు చత్తీస్‌గఢ్ గట్టిగా వాదిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని పేర్కొంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీల వినియోగం చేస్తామని అంటోంది. దీంతో తెలంగాణ సైతం మహానదిలో మిగులు నీటిని గోదావరికి తరలించి, రాష్ట్ర అవసరాలు తీర్చుతూ మిగులు నీటిని కావేరికి తరలించాలని పట్టుబడుతోంది. దీంతో పాటే ఎగువన రాష్ట్రాలు వారి రాష్ట్రాల సరిహద్దు పరిధిలో అంతర్గత నదుల అనుసంధానాన్ని చేపడుతున్నాయని, దీనిద్వారా దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నీటి లభ్యత తగ్గుతుందని అభ్యంతరం తెలిపింది. అయితే దీనిపై రాష్ట్ర అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు తెలియజేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. -
దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం
(రామగోపాలరెడ్డి ఆలమూరు) పోలవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: గోదావరి నదిపై రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఆరున్నర దశాబ్దాలపాటు కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో కార్యరూపం ఇస్తే.. ప్రస్తుతం ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాలకు పోలవరం ప్రాజెక్టు ఫలాలను అందించడానికి నడుం బిగించారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాన్ని పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వెలుగులు పంచేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు పూర్తికి పక్కా ప్రణాళిక 2019 జూన్ 20న ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, 2022 జూలై కల్లా ఆయకట్టుకు నీళ్లందించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హెడ్ వర్క్స్ పనులను కొత్తగా మేఘా సంస్థకు అప్పగించారు. స్పిల్ వే పూర్తి చేసి, గోదావరి వరదను మళ్లించాక.. కాఫర్ డ్యామ్ పనులను పూర్తి చేయాలని, ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్‌ల మధ్య ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు పూర్తి చేసి.. వాటికి సమాంతరంగా అనుసంధానాలు, కాలువలు, పిల్ల కాలువలు, విద్యుత్ కేంద్రం పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించాలని నిర్ణయించారు. నెలాఖరులో గేట్ల బిగింపు రివర్స్ టెండరింగ్ ద్వారా హెడ్ వర్క్స్ పనులు దక్కించుకున్న మేఘా సంస్థ గతేడాది నవంబర్‌లో పనులు చేపట్టింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ చుట్టూ చేరిన వరద నీటిని తోడేందుకు రెండు నెలలు సమయం పట్టింది. ఈలోగా కరోనాతో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ సడలించేలోగా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. ఇప్పటివరకు స్పిల్ వే పనుల్లో 1.902 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసింది. 48 గేట్లను సిద్ధం చేసింది. వాటిని బిగించడానికి 96 హైడ్రాలిక్ హాయిస్ట్‌లు, సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇందులో ఇప్పటికే 46 హైడ్రాలిక్ హాయిస్ట్‌లు, సిలిండర్లను దిగుమతి చేసుకుంది. మిగిలిన 50 జనవరిలో రానున్నాయి. నెలాఖరు నుంచి గేట్ల బిగింపు పనులు ప్రారంభించి.. ఏప్రిల్ నాటికి 48 గేట్లను బిగించే పనులు పూర్తి చేయనున్నారు. ► నెలాఖరు నుంచి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో ఎడమ వైపు ఖాళీ ప్రదేశాలను భర్తీ చేసి, వాటిని 42 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసి.. గోదావరి డెల్టాకు నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి, కాఫర్ డ్యామ్‌ల కుడి వైపు ఖాళీలను భర్తీ చేసే పనులను ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నారు. జూన్‌లో వచ్చే వరదను స్పిల్ వే మీదుగా మళ్లిస్తారు. ► హెడ్ వర్క్స్ పనులకు సమాంతరంగా జలవిద్యుత్ కేంద్రం పనులు చేపడుతున్నారు. స్పిల్ చానల్ పనుల్లో 1.095 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, 7.451 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి. స్పిల్ ఛానల్లో చేరిన వరద నీటిని తోడివేసి, ఏప్రిల్‌లోగా స్పిల్ చానల్‌ను పూర్తి చేసేలా పనులను వేగవంతం చేశారు ► జలాశయాన్ని, కుడి కాలువను అనుసంధానం చేసే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఎడమ కాలువను అనుసంధానం చేసే పనులు పూర్తి కావొస్తున్నాయి. ఎడమ కాలువలో మిగిలిన పనులు, 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డి్రస్టిబ్యూటరీల పనులు జూన్, 2022 నాటికి పూర్తి చేసి, ఆయకట్టుకు నీటిని అందించేలా పనులను వేగవంతం చేశారు. వైఎస్ హయాంలోనే కాలువల పనులు పూర్తి 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడూ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచన చేయలేదు. 2004, మే 14న వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలనే లక్ష్యంతో జలయజ్ఞం చేపట్టారు. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. కుడి, ఎడమ కాలువల్లో అధిక శాతం పనులు పూర్తి చేశారు. ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే క్రమంలో మహానేత వైఎస్ అమరుడయ్యారు. చంద్రబాబు దోపిడీ పర్వం రాష్ట్ర విభజన నేపథ్యంలో పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం, వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని చెప్పినా.. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించాలంటూ ఒత్తిడి చేశారు. పోలవరం బాధ్యతను కేంద్రం రాష్ట్రానికి అప్పగించే వరకు, అంటే 2014 జూన్ 8 నుంచి 2016,సెపె్టంబర్ 8 వరకు ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. తర్వాత కమీషన్ల కోసం స్పిల్ వే, కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఒకేసారి చేపట్టారు. అయితే స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లు పునాది స్థాయిని దాటలేదు. ఎగువ దిగువ, కాఫర్ డ్యామ్ పనులను మధ్యలో వదిలేశారు. దాంతో గతేడాది, ఈ ఏడాది గోదావరి వరదలు ముంపు గ్రామాల్లోకి చేరాయి. కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీయే విమర్శించారంటే టీడీపీ ప్రభుత్వం ఎంత దోపిడీకి పాల్పడిందో అర్ధమవుతుంది. అవినీతిని ప్రక్షాళన చేయించిన సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.7,984.93 కోట్ల విలువైన పనులను చంద్రబాబు నామినేషన్ పద్ధతిలో కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇందులో ఒక్క హెడ్ వర్క్స్‌లోనే రూ.3,489.93 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై అప్పగించారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక.. నిపుణుల కమిటీతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు పాల్పడిన అవినీతిని ప్రక్షాళన చేయించారు. ఆ కమిటీ సూచనతో రివర్స్ టెండరింగ్ నిర్వహించి రూ.838.51 కోట్లను ఆదా చేశారు. మహానేత ప్రారంభిస్తే ఆయన తనయుడు పూర్తి చేస్తున్నారు 2004 వరకు పోలవరం ఊసెత్తడానికే ముఖ్యమంత్రులు భయపడ్డారు. 2004లో దివంగత మహానేత వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తర్వాత చంద్రబాబు.. పనులు చేయకుండానే ప్రాజెక్టు పూర్తయినట్లు పూటకో నాటకం, రోజుకు డ్రామా నడిపించారు. ప్రజాధనం అడ్డగోలుగా దోచుకుని ప్రజలకు పోలవరం ఇప్పటివరకు అందుబాటులోకి రాకుండా చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేశారు. మహానేత ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2021 డిసెంబర్‌కు పూర్తి చేసి, ఆయన తనయుడు జగన్ చేతుల మీదుగా జాతికి అంకితమిస్తాం. –పి.అనిల్‌కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి 2022 జూలైకి ఆయకట్టుకు నీళ్లు 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి..2022 జూలై నాటికి ఆయకట్టుకు నీళ్లందించేలా సీఎం వైఎస్ జగన్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను నిక్కచ్చిగా అమలు చేస్తున్నాం. ఏప్రిల్ నాటికి స్పిల్ వే పూర్తి చేస్తాం. ఆలోగా కాఫర్ డ్యామ్‌లు పూర్తవుతాయి. కాలువలు పూర్తి చేసి 2022 జూలై నాటికి 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తాం. కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టును స్థిరీకరిస్తాం. మొత్తం 38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టు ప్రపంచంలో ఒక్క పోలవరమే. – ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ నాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉభయగోదావరి జిల్లాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆయా గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలి. అప్పుడే జలాశయంలో గరిష్ట స్థాయిలో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 నాటికే పునరావాస కాలనీల్లో 3,110 గృహాలను నిర్మించారు. అప్పట్లోనే 2 వేల కుటుంబాలను ఆ కాలనీలకు తరలించారు. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు టీడీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఇంటిని నిర్మించలేదు. వైఎస్ హయాంలో నిర్మించిన 1,110 ఇళ్లల్లోకి ఆ సంఖ్య మేరకు కుటుంబాలను మాత్రమే తరలించి.. 73 శాతం ప్రాజెక్టు పూర్తయినట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ, ఓ వర్గం మీడియా సహకారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేసింది. నేడు ముంపు గ్రామాల్లోని మిగతా 1,02,491 కుటుంబాలకు రూ.24,249.14 కోట్లతో పునరావాసం కల్పించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు అంతే స్థాయిలో గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో అధిక శాతం ఇళ్లు పూర్తయ్యాయి. గోదావరికి వరదలు ప్రారంభమయ్యేలోగా అంటే జూన్ నాటికి ఆ కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేసింది. మిగిలిన 84,731 కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించనుంది. నాడు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఫొటో ఇది.. 2014 జూన్ 8 మొదలుకుని 2019 మే 29 వరకు టీడీపీ ప్రభుత్వం సగటున 22 మీటర్ల స్థాయికి స్పిల్ వే పనులను మాత్రమే చేయగలిగింది. స్పిల్ వేకు 25.72 మీటర్ల స్థాయిలో గేట్లను బిగిస్తారు. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో స్పిల్ వే పునాది పనులు మాత్రమే జరిగాయి. కానీ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిందన్నట్టుగా అబద్ధాలు వల్లె వేశారు. ఇప్పటికీ అవే అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. నేడు ఇది కూడా స్పిల్ వే ఫొటోనే.. గోదావరి వరదల ఉధృతి, కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ప్రతిబంధకాల మధ్య కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం స్వల్ప కాలంలోనే స్పిల్ వేను 52 మీటర్ల స్థాయికి పూర్తి చేసింది. అత్యంత క్లిష్టమైన 50 పియర్స్ (భారీ కాంక్రీట్ స్తంభాల) ఏర్పాటు ప్రక్రియను 30 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. వరద ఉధృతిలోనూ పియర్స్‌పై స్పిల్ వే బ్రిడ్జి పనులు చేపట్టింది. ఇప్పుడు ఆ బ్రిడ్జి కూడా పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నుంచి 48 గేట్లను బిగించే పనులను చేపట్టి, వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేసే దిశగా వేగంగా ముందుకు వెళుతోంది. ఆ క్రమంలోనే రేయింబవళ్లు (24్ఠ7) పనులు చేస్తోంది. -
ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి. తల్లి వరికూటి స్థాయి, పెద్ద కుమార్తె లాస్య లను కాపాడగా చిన్న కుమార్తె దర్శిని మాత్రం గోదావరిలో మునిగి గల్లంతయింది. భావిస్తున్నారు. తల్లి కుమార్తెలు ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా చిన్న కుమార్తె మృతదేహం కోసం పోలీసులు గోదావరిలో గాలిస్తున్నారు. 5 నెలల క్రితం వరికూటి సాయి భర్త ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా అత్త, మరిది కుటుంబ కలహాల నేపథ్యంలో వేధించడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత.. -
రోజంతా గోదావరి ఒడ్డున విజిల్ ఊదుతూ..
ఇష్టమైంది తిని, ఇష్టమొచ్చినట్లు బతికి, ఏదో ఒక రోజు వెళ్లిపోదాం అన్నట్లే ఉంటున్నారు మనుషులు. మంచి చెబితే అస్సలు సహించలేక పోతున్నారు. ‘మీరూ మనుషులే కదా, మీది మానవ జాతి కాదన్నట్లు మాకు మంచి చెబుతున్నారెందుకు?’ అన్నట్లే చూస్తున్నారు! ఇద్దరు చికాగో సిస్టర్స్ ఈమధ్య ఒక షూస్ స్టోర్ లో.. ‘మాస్క్ పెట్టుకోండమ్మా’ అని మంచి చెప్పిన సెక్యూరిటీ గార్డుని కసాబిసా 27 సార్లు కత్తితో పొడిచేశారు. ‘సాక్షి: టీవీ గరం గరం వార్తల్లో ఊరంతా తిరుగుతూ మొత్తుకుంటుండే ‘గోపి సర్’ గారి చిత్తూరు యాసలో చెప్పాలంటే ఆ కసాబిసా సిస్టర్స్‌లో ఒక పాపకు 21 ఏళ్లు, ఇంకొక పాపకు 18. గోపీ సర్ అందర్నీ ‘పాప’ అనే అంటాడు. వయసు చూసుకోబళ్ళా.. అది లేదు సర్ దగ్గర. ఆయనా అంతే. మంచి చెప్పబోయి ఈ నడుమ ఎవరితోనో అమాంతం పైకి లేపించుకున్నాడు. సర్ని కాలర్ పట్టి లేపి నేలకు కాళ్లందకుండా చేశాడు సర్ చేత మంచి చెప్పించుకున్న ఆ మనిషి. గోపీ సర్ లానే నాసిక్‌లో చంద్ర కిషోర్ పాటిల్ అనే ఒక మంచాయన ఒక రోజంతా గోదావరి నది బ్రిడ్జి మీద నిలబడి నదిలో చెత్త పారేయడానికి క్యారీ బ్యాగుల్ని మోసుకొచ్చేవాళ్లను అడ్డుకున్నాడు. (చదవండి: ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?!) చెత్త విసిరేయబోతుంటే పెద్దగా విజిల్ ఊదేవాడు. వాళ్లు వింతగా, విడ్డూరంగా చూసేవాళ్లు. ఇతడు వెళ్లి మంచి చెప్పేవాడు. నదిలోకి చెత్త విసరొద్దనే వాడు. విసిరితే నది కలుషితం అవుతుందని చెప్పేవాడు. విసిరిన చెత్తవల్ల ప్రవాహ వేగం తగ్గుతుందని దిగులుగా ముఖం పెట్టేవాడు. ‘నువ్వేమైనా మోదీవా? చెత్త గురించి స్పీచ్ ఇస్తున్నావ్’ అని వాళ్లు. ఎలాగో కన్విన్స్ చేసి బ్రిడ్జి పైనే ఓ పక్కకి చెత్త పెట్టించేవాడు.. నదిలోకి విసరకుండా. ఒక రోజంతా ఇలా గడిచింది. రెండో రోజు గోపీ సర్.. అదే.. చంద్ర కిశోర్ పాటిల్ సర్ కనిపించలేదు! ఏమైందో తెలీదు. తర్వాత ఒక రోజు ట్విట్టర్లో కనిపించాడు. ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ శ్వేత.. బ్రిడ్జి మీద ఉండగా ఎవరో తీసిన అతడి ఫొటోను టాగ్ చేస్తూ.. ‘ఇతడు రోజంతా గోదావరి బ్రిడ్జి పై విజిల్ ఊదుతూ నిలబడి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు’ అని ట్వీట్ చేశారు. ప్రజలకేమైనా పిచ్చా.. సాటి పౌరుడొకడు వచ్చి చెబితే చైతన్యవంతులు అవడానికి!! చంద్ర కిషోర్ పాటిల్ అనే ఆ మంచివాడు ఇప్పుడు ఏ నది ఒడ్డున ఉన్నాడో! నైస్ గై పాపం. -
కృష్ణాలో స్థిరంగా వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/ హొసపేటె/ శ్రీశైలం ప్రాజెక్ట్, విజయపురిసౌత్ (మాచర్ల): పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా.. పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చింది. ► సోమవారం సాయంత్రానికి తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లలో 30 గేట్లను ఎత్తి సుమారు 1,02,830 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ► శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 3,10,232 క్యూసెక్కులు చేరుతుండగా.. పది గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 2, 78,000 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 211.96 టీఎంసీల నిల్వతో నీటిమట్టం 884.40 అడుగులుగా నమోదైంది. ► నాగార్జునసాగర్ నుంచి మిగులుగా ఉన్న 2,38,624 క్యూసెక్కులను 16 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. జలాశయ నీటిమట్టం 589.50 అడుగుల్లో 310.55 టీఎంసీలకు సమానంగా ఉంది. ► పులిచింతల ప్రాజెక్టు 14 గేట్ల ద్వారా 2,80,716 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► ప్రకాశం 70 గేట్లు ఎత్తి.. మిగులుగా ఉన్న 3,07,918 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► ఉప నదులు పాపాఘ్ని, కుందూ ఉప్పొంగడంతో పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చింది. గండికోట, మైలవరం గేట్లు ఎత్తేయడంతో సోమశిలలోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి.. 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ► గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 3,36,958 క్యూసెక్కులు చేరుతుండగా, మిగులుగా ఉన్న 3,32,958 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. -
18న గోదావరి–కావేరి అనుసంధానంపై భేటీ
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై వాటి పరీవాహక ప్రాంతాల (బేసిన్) పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్య్లూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ అధ్యక్షతన ఈనెల 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో మరోసారి సమావేశమై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. గత నెల 24న ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పింది. రాష్ట్ర అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించాలని స్పష్టం చేసింది. 18న నిర్వహించే భేటీలోనూ అదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించాలని నిర్ణయించింది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు ఇవీ.. ► కర్ణాటక–తమిళనాడుల మధ్య తరచుగా కావేరీ జలాల విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ► గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా తమిళనాడుకు గోదావరి జలాలను తరలించి వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ► గోదావరి–కావేరీ అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ మూడు ప్రతిపాదనలు చేసింది. అవి.. ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట) అకినేపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి (గ్రాండ్ ఆనకట్ట) జానంపేట(గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట). ► గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొంది. జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ► గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,486.155 టీఎంసీలను కేటాయించింది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన మూడు ప్రత్యామ్నాయాల్లోనూ గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే తీసుకుంది. కానీ.. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరిలో మిగులు జలాలు లేవనీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. -
వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలంప్రాజెక్టు: పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుముఖం పడుతోంది. సోమవారం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 1.81 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలను సముద్రంలోకి వదులుతుంటే.. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 13.20 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలను కడలిలోకి వదులుతున్నారు. ► ఆల్మట్టి నుంచి లక్ష క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 68 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరద 2.65 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ► నాగార్జున సాగర్ నుంచి దిగువకు 89 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో వరుసగా రెండో ఏడాది గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ప్రకాశం బ్యారేజీలోకి 2.26 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు వదలగా మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 39.50 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 13.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. పది వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 13.20 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14 అడుగుల్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మంగళవారం నాటికి వరద మరింతగా తగ్గే అవకాశం ఉంది. -
మా అవసరాలు తీర్చాకే మళ్లింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చిన తరువాతే గోదావరి జలాలను కావేరి(గ్రాండ్ ఆనకట్ట) నదికి మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గోదావరిలో మిగులు జలాలపై సంపూర్ణ హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీదేనని గుర్తు చేసింది. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలే ఉండవని, అలాంటప్పుడు ఏ నీటిని కావేరికి మళ్లిస్తారని ప్రశ్నించింది. తాము ప్రస్తావించిన అంశాలకు వివరణ ఇస్తే అధ్యయనం చేసి గోదావరి – కావేరి అనుసంధానంపై అభిప్రాయం చెబుతామని పేర్కొంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశాన్ని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు(అంతరాష్ట్ర నదీ జలాలు) ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 247 టీఎంసీలను మళ్లించేలా.... ► గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ఎన్‌డబ్ల్యూడీఏ మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొంది. జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ► నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఏపీ అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించాలని కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తాజా సమావేశంలో సలహాదారు ఎం.వెంకటేశ్వరావుప్రస్తావించారు. తెలంగాణ వాదనపై అభ్యంతరం... ► గోదావరి జిలాల్లో తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా ఉందని.. వాటిని మినహాయించుకుని మిగులు జలాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ పేర్కొనడంపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులపై తనకు సమగ్ర అవగాహన ఉందని.. ఆ స్థాయిలో తెలంగాణకు కేటాయింపులు లేవని స్పష్టం చేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు వినియోగించుకోని జలాలే గోదావరిలో మిగులు జలాలుగా ఉన్నాయని గుర్తు చేశారు. ► గోదావరికావేరీ అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం కోరిన వివరణలను పంపుతామని.. ఇతర రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలను కూడా పంపుతామని.. వీటిపై అభిప్రాయం చెప్పాలని ఎన్‌డబ్ల్యూడీఏ ఛైర్మన్ భూపాల్ సింగ్ చేసిన సూచనకు ఏపీ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు అంగీకరించారు. -
గోదావరి మధ్యలో దుంగపై కూర్చొని..
రాజమహేంద్రవరం క్రైం: భార్యతో గొడవ పడి గోదావరిలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వృద్ధుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడిన సంఘటన టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక తాడితోటకు చెందిన జి.అప్పారావు (73) కొంత కాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అతడు గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఇస్కాన్ టెంపుల్ వద్ద రేవులోకి వచ్చి గోదావరిలో దూకాడు. అయితే ఈత రావడంతో అప్పారావు ప్రవాహానికి కొట్టుకు వెళ్లసాగాడు. గోదావరి గట్టున ఆల్కాట్‌తోట రైతుబజార్ వద్ద ఉన్న కేతావారిలంక వద్దకు వచ్చేసరికి దుంగ కనిపించడంతో దానిని పట్టుకుని కూర్చున్నాడు. అతడిని గమనించిన స్థానికులు హుటాహుటిన 100 నంబర్‌కు సమాచారం అందించారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు టూ టౌన్ మహిళా ఎస్సై జె.లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ దొర సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇన్చార్జ్ అగ్నిమాపక అధికారి ఉమామహేశ్వరరావు, డ్రైవర్ అండ్ ఆపరేటర్ వై.అనిల్‌కుమార్, ఫైర్ మెన్ ఎస్.రాంబాబు, జేబీ సాగర్, జీపీఎం కుమార్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. గోదావరి మధ్యలో దుంగపై ఉన్న అప్పారావు వద్దకు తాడుకు లైఫ్ జాకెట్ కట్టి విసిరారు. అతడు ఆ తాడు పట్టుకున్న తరువాత ఒడ్డుకు చేర్చారు. అప్పారావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఉగ్ర వేణి
సాక్షి, అమరావతి/ విజయవాడ/ మాచర్ల/ శ్రీశైలం ప్రాజెక్ట్/ పెదకూరపాడు/ కాకినాడ/ పోలవరం రూరల్: మూసీ, మున్నేరు, కట్టలేరు, వైరా, కొండ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చగా.. ఉప నదుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో గోదారమ్మ శాంతిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో 2.29 లక్షల క్యూసెక్కులు.. మున్నేరు, వైరా, కట్టలేరు వరద తోడవడంతో 4.10 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. దీంతో 70 గేట్ల ద్వారా 3.23 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 5 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత.. ► కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలంలో 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ► సాగర్ జలాశయం వద్ద ఆదివారం సాయంత్రానికి 12 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,51,695 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద పర్యాటకులు రాకుండా 144 సెక్షన్ విధించారు. కేవలం కొత్త బ్రిడ్జి మీదుగా వెళ్లి రేడియల్ క్రస్ట్‌గేట్ల నుంచి స్పిల్‌వే మీదుగా దుమికే కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గోదావరిలో మరింత తగ్గిన వరద ► గోదావరి నదిలో ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద వరద 9,68,666 క్యూసెక్కులకు తగ్గింది. నీటి మట్టం 45 అడుగులు ఉంది. ► మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తామని అధికారులు తెలిపారు. ► ఆదివారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 17,84,505 క్యూసెక్కులకు తగ్గింది. 175 గేట్ల ద్వారా 17,74,755 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు 17.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించే అవకాశం ఉంది. ► తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో ముంపునకు గురైన ఇళ్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. 36 గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరించలేదు. కోతకు గురవుతున్న నెక్లెస్ బండ్ ► పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గ్రామానికి వరద నుంచి రక్షణగా నిర్మించిన నెక్లెస్ బండ్ కోతకు గురవుతోంది. 6 మీటర్ల వెడల్పున నిర్మించిన బండ్ రెండు మీటర్లకు తగ్గిపోయింది. ► శనివారం అర్ధరాత్రి 12 గంటలకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హుటాహటిన పోలవరం చేరుకుని యుద్ధ ప్రాతిపదికన గట్టు పటిష్ట పరిచే పనులు చేపట్టారు. పడవలపై కరోనా రోగుల తరలింపు ► తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలంకలో శనివారం ఓ వ్యక్తి కరోనా సోకింది. రాత్రివేళ బాలాజీ అనే వ్యక్తి సాయంతో ట్రాక్టర్‌పై సఖినేటిపల్లి బోను వద్దకు చేర్చి అక్కడి నుంచి ఆంబులెన్స్‌లో అల్లవరం కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ► అప్పనరామునిలంక, మామిడికుదురు, అప్పనపల్లి, బి.దొడ్డవరం గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున పడవలపై తీసుకొచ్చి కోవిడ్ ఆస్పత్రులకు తరలించారు. -
'మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం'
సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి) : అమ్మాయికి టీసీఎస్‌లో మంచి ఉద్యోగం. నెలకు రూ.లక్ష జీతం. కొడుకు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇంకేముంది కూతురి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు రీ మోడలింగ్ కూడా చేయించారు. అంతలోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. కరోనా మహమ్మారి రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబాన్ని మింగేసింది. పశివేదల గ్రామానికి చెందిన పరిమి వెంకట నరసింహరావు (నరసయ్య) ఈనెల 16న కోవిడ్‌కు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజులుగా మనస్తాపానికి గురయ్యారు. భార్య సునీత(41), కుమారుడు ఫణికుమార్(25), కుమార్తె లక్ష్మి అపర్ణ(23) మంగళ వారం రాత్రి 11 గంటల సమయంలో గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. ఇంటి నుంచి ముగ్గురూ కారులో బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనపైకి చేరుకుని నదిలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు స్వాధీనం చేసుకున్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు, బంధువులు నది వెంబడి గాలిస్తున్నారు. అసలేం జరిగిందో..! ఈనెల 7న నరసయ్యకు జ్వరం వచ్చింది. స్థానిక ఆర్ఎంపీతో వైద్యం చేయించుకున్నారు. తొలుత సీజనల్ ఫీవర్‌గా భావించారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఈనెల 14న సీటీ స్కాన్ చేయించారు. కరోనా సోకినట్లు గుర్తించారు. రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అప్పటికే పరిస్థితి విష మించి నరసయ్య ప్రాణాలొదిలారు. దీంతో బంధువులెవరూ అంత్యక్రియలకు రాలేదు. అప్పటి నుంచి భార్య సునీత, ఇద్దరు పిల్లలు మనోవేదనకు గురయ్యారు. ఫణికుమార్ కర్ణాటకలో మైనింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మీఅపర్ణ టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ విద్యావంతులే. జీవితంలో స్థిరపడిన వారే. అయినా ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికులను కలచివేస్తోంది. నరసయ్య భార్య సునీత పుట్టినిల్లు కొవ్వూరు. దుర్ఘటనతో కొవ్వూరు, పశివేదలల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి సుమారు పదెకరాల పొలం, కొవ్వూరులో విలువైన స్థలాలు ఉన్నట్లు చెబుతున్నారు. నరసయ్య మృతి తర్వాత కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. ఒకవేళ వీరికి కరోనా లక్షణాలు కనిపించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్డీఓ డి.లక్ష్మారెడ్డి పశివేదల వెళ్లి ఘటనపై ఆరా తీశారు. మృతుడు నరసయ్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేవీ రమణ కేసు నమోదు చేశారు. ఇంటిలో లేఖ : నరసయ్య ఇంట్లోని లక్ష్మి అపర్ణ డైరీలో ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆ లేఖలో ‘మా అందరి కోరిక నిహారిక ఓణీల ఫంక్షన్ బాగా చేయాలి. దొరబాబు మావయ్య మమ్మల్ని క్షమించు. తాతయ్య, అమ్మమ్మల ఆరోగ్యం జాగ్రత్త. మా నాన్నని విడిచి మేం ఉండలేకపోతున్నాం.’ అంటూ లక్ష్మి అపర్ణ రాసినట్టు ఉన్న లేఖ లభ్యమైంది. -
ఇంటి పెద్ద మరణం తట్టుకోలేక..
-
ఆ కుటుంబం ఏకంగా ప్రాణాలే తీసేసుకుంది..
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద కరోనాతో చనిపోవడంతో కుటుంబసభ్యుల్ని కలిచి వేసింది. ఇక తమకు దిక్కెవరు అంటూ మనస్తాపంతో గోదావరిలో దూకేశారు. ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెబుతారు. మేమున్నామంటూ మాటలతోపైనా మానసిన స్థైర్యాన్ని ఇస్తారు. కానీ కరోనా వచ్చి ఆ మానవత్వాన్ని మటుమాయం చేసింది. సొంత వారు చనిపోయినా తిరిగి మళ్లి చూడకుండా చేసింది. ఆ మహమ్మారి వైరస్ తమకెక్కడ అంటుకుంటుందో అని బంధువులు కూడా దూరం జరుగుతున్నారు. కరోనాతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కూడా వెనకాడుతున్నారు. పలకరించే దిక్కు లేక బాధిత కుటుంబాలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి బాధను తట్టుకోలేకపోయిన ఆ కుటుంబం ఏకంగా ప్రాణాలే తీసేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన విషాద సంఘటన అందరినీ కలిచివేస్తోంది. కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నరసయ్య ఈనెల 16న కరోనాతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు భార్య, పిల్లలు. ఇంత బాధలో ఉన్న వారిని పలకరించేందుకు... బంధువులు, సన్నిహితులు కూడా రాలేదు. కరోనా భయంతో వారి ఇంటి గడప కూడా తొక్కలేదు. దీంతో తమను అంటరాని వారిగా చూస్తున్నారన్న భావన వారిలో పెరిగింది. ఆ బాధతోనే నరసయ్య భార్య సునీత, అమె కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని స్థానికులు చెప్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం వల్లే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు. రైల్వే బ్రిడ్జి పైనుంచి ఈ ముగ్గురూ గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వరద గోదావరి
-
ఉగ్ర గోదావరి..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. రికార్డు స్థాయి ప్రవాహాలను నమోదుచేస్తూ గంటగంటకూ వరద ఉధృతితో పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద ఏడేళ్ల తర్వాత గోదావరి 61.6 అడుగుల నీటి మట్టంతో ఉరకలెత్తుతోంది. ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి నదులతో పాటు చర్ల మండలంలోని తాలిపేరు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 20.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితిగా కేంద్ర జలవనరుల సంఘం ప్రకటించింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమ వారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాగా, గోదావరి ఉధృ తంగా ప్రవహిస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, మణు గూరు, అశ్వాపురం, బూర్గం పాడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని సుమారు 120 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. రహదారులు మునిగిపోవడంతో సుమారు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 39 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,036 కుటుంబాలకు చెందిన 3,387 మందిని ఆయా కేంద్రాలకు తరలించారు. వరద కారణంగా జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 5,630 మంది రైతులకు చెందిన 11,777 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో వరి, పత్తి అధికంగా ఉన్నాయి. 4,033 మంది రైతులకు చెందిన 8,055 ఎకరాల్లో వరి, 1,586 మంది రైతులకు చెందిన 3,703.54 ఎకరాల్లో పత్తి వరద పాలైంది. ఇక అశ్వాపురం మండలం సీతారామ ఎత్తిపోతల పథకం కాలువల్లోకి, బీజీకొత్తూరు వద్ద ఉన్న మొదటి పంప్‌హౌస్‌లోకి భారీగా నీళ్లు చేరాయి. మణుగూరు, పినపాక మండలాల మధ్య నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చుట్టూ గోదావరి నీటితో నిండింది. పరీవాహక మండలాల్లో ఎటుచూసినా జలమయమే. ప్రాజెక్టులకు జలకళ వరద ఉధృతి పెరగడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 64 వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో నిల్వ 90 టీఎంసీలకు 50.24 టీఎంసీలకు చేరింది. లోయర్ మానేరులోకి సైతం 19 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, నిల్వ 24.07 టీఎంసీలకు 17.67 టీఎంసీలకు చేరింది. 25.87 టీఎంసీల మిడ్‌మానేరులో నిల్వ 21.31 టీఎంసీలకు చేరగా, 14 వేల క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లిలో సైతం 20.18 టీఎంసీలకు 18.98 టీఎంసీల నిల్వ ఉంది. 2013 తర్వాత ఇప్పుడే భారీ ప్రవాహం భద్రాచలం వద్ద ఏడేళ్ల తర్వాత ఇంత ప్రమాదకర స్థాయిలో గోదావరి నీటిమట్టం నమోదు కావడం ఇదే ప్రథమం. 2013 ఆగస్టు 3న భద్రాచలం వద్ద 61.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. మళ్లీ ఇప్పుడు 61.6 అడుగులు వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరికి 1986 ఆగస్టు 16న 75.6 అడుగులు, 1990 ఆగస్టు 24న 70.8 అడుగులు, 2006 ఆగస్టు 6న 66.9 అడుగులు, 1976 జూన్ 22న 63.9 అడుగులు, 1983 ఆగస్టు 14న 63.5 అడుగులు, 2013 ఆగస్టు 3న 61.6 అడుగులు, 2016 జూలై 12న 52.4 అడుగులు నీటిమట్టాలు నమోదయ్యాయి. ప్రమాద హెచ్చరికలు ఇలా.. – 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక.. ఈ స్థాయి ప్రవాహం వచ్చినప్పుడు గోదావరి గట్టు దాటి ప్రవహిస్తుంది. లంక భూములు మునిగిపోతాయి. ఈ క్రమంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. – 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక.. గోదావరి వరద ఈ స్థాయిలో వచ్చినప్పుడు చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం మండలాల్లోని పంట భూములను వరద నీరు ముంచెత్తుతుంది. – 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక.. దీన్ని డేంజర్ లెవెల్‌గా ప్రకటిస్తారు. 53 అడుగుల నుంచి ఒక్కో అడుగు పెరుగుతున్నకొద్దీ మరింత ప్రమాదం పెరుగుతున్నట్లే. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఈ స్థాయికి వచ్చినప్పుడు పరీవాహక పినపాక, భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని సుమారు 120 గ్రామాల్లోకి నీరు చేరుతుంది. 60 గ్రామాలకు వెళ్లే రోడ్లు మునిగిపోయి రాకపోకలు బంద్ అవుతాయి. ముంపు బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ప్రస్తుతం ఉన్న 61.6 అడుగుల నుంచి నీటిమట్టం మరో అడుగు పెరిగితే బూర్గంపాడు మండల కేంద్రం సైతం ద్వీపంగా మారుతుంది. -
16 లక్షల క్యూసెక్కులు దాటిన వరద ఉధృతి
గోదారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఏజెన్సీని అతలాకుతలం చేస్తోంది. రహదారులపైకి వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు వంద గ్రామాలకు రవాణా స్తంభించింది. పంటలను వరద ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఆదివారం ఉదయం నుంచి గంటగంటకూ గోదావరి పెరుగుతుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బూర్గంపాడు/చర్ల: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలు గోదావరి వరదలకు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గ్రామాల్లోకి వరదనీరు చేరుతుండటంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలెక్టర్ ఎంవీ రెడ్డితో కలిసి భద్రాచలంలో వరద పరిస్థితిని సమీక్షించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులను పునరావాసకేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కలెక్టర్, అదనపు కలెక్టర్లు కర్నాటి వెంకటేశ్వర్లు, అనుదీప్, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్‌లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కేంద్ర జల సంఘం హెచ్చరికలు భద్రాచలంలో అర్ధరాత్రి వరకు నీటిమట్టం ప్రమాదస్థాయిని దాటవచ్చని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. సహాయక చర్యల కోసం రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం 040 423450624 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కూడా వరద ప్రవాహం అధికమైందని, గతంలో 1986 ఆగస్టు 16న ఇదే రోజు గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించిందని పేర్కొంది. స్తంభించిన రహదారులు ♦ దుమ్ముగూడెం: గంగోలు–లక్ష్మీనగరం, తూరుబాక–కన్నాయిగూడెం, తూరుబాక–నర్సాపురం, పర్నశాల క్రాస్‌రోడ్–పర్నశాల గ్రామాల మధ్య ప్రధాన రహదార్ల పైకి వరదనీరు చేరింది. ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న సున్నంబట్టి గ్రామంలోని 120 కుటుంబాలను మంగువాయిబాడువా ఆశ్రమ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు. గంగోలు డబుల్‌బెడ్ రూం ఇళ్లలో ఉన్న 45 కుటుంబాల వారిని లక్ష్మీనగరంలోని రేగుబల్లి ఆశ్రమ బాలికల పాఠశాలకు తరలించారు. ♦ చర్ల: దేవరాపల్లి–కుదునూరు, దుండుపేట–గుంపెన్నగూడెం, వీరాపురం–జీపీపల్లి, ఎదిరగుట్టలు–సుబ్బంపేట గ్రామాల్లోని ప్రధాన రహదార్లను వరదనీరు ముంచెత్తింది. దండుపేటలోని 23 కుటుంబాలను చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ♦బూర్గంపాడు: బూర్గంపాడు–నాగినేనిప్రోలు, నాగినేనిప్రోలు–సారపాకల మధ్య రాష్ట్రీయ రహదారిపైకి భారీగా వరదనీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట నీటమునక గోదావరి వరదలకు భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల్లో సుమారు 8వేల ఎకరాల పంటలు నీటమునిగాయి. వరి, పత్తి పంటలు, కూరగాయ తోటలు నీటి పాలయ్యాయి. పినపాక మండలంలో సుమారు పదిహేను వందల ఎకరాల పంట నీటమునిగింది. మణుగూరు మండలంలో మూడువందల ఎకరాల్లో వరి, రెండు వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. అశ్వాపురం మండలంలో ఐదువందల ఎకరాల్లో పత్తి, మరో వేయి ఎకరాల్లో వరి నీటమునిగింది. బూర్గంపాడు మండలంలో పదిహేను వందల ఎకరాల్లో వరి, వేయి ఎకరాల్లో పత్తి నీటమునిగాయి. దుమ్ముగూడెంలో 650 ఎకరాలు, చర్లలో 700 ఎకరాల్లో పంట నీటమునిగింది. కాపుదశలో ఉన్న పత్తి పంట గోదారి వరదలకు మునిగిపోవటంతో రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వరద వచ్చేదిలా... ♦ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి.. ♦ తూరుబాకవాగు, గుబ్బలమంగి, తాలిపేరు, పాలెంవాగు, గుండ్లవాగు, చీకుపల్లివాగు, లొట్టిపిట్లటగండి తదితర వాగుల నుంచి.. ♦కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి 9 లక్షల 70 క్యూసెక్కులు, ♦తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి 1,58,472 క్యూసెక్కులు ఇంద్రావతి నది నుంచి కూడా భారీగా వరదనీరు వస్తోంది. ♦కిన్నెరసాని నుంచి విడుదల చేస్తున్న 45 క్యూసెక్కుల నీరు భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తోంది. ప్రమాద హెచ్చరికలు.. నాలుగు రోజులుగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. శనివారం తెల్లవారుజామున 3.50 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఉదయం 5 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 1.50 గంటలకు 53 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
'మహోగ్ర' గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, కాకినాడ/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి, బళ్లారి/హొసపేటె/ఆదోని: నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు, కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 15,28,632 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కులను వదిలి, మిగులుగా ఉన్న 15,23,132 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 17 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. నిండుకుండలా మారిన రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ► భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 54 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ► 1986లో భద్రాచలం వద్ద గరిష్టంగా వరద నీటిమట్టం 55.66 అడుగులుగా నమోదైంది. మళ్లీ ఆదివారం రాత్రి 9 గంటలకు అక్కడ వరద నీటిమట్టం మరింత ప్రమాదకరంగా మారొచ్చని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ► పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 30 అడుగులకు చేరుకుంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెన మునిగిపోయింది. ► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోష్పాద క్షేత్రం నీటమునిగింది. ► తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో శబరి ఉధృతి కారణంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు రాకపోకలు ఆగాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్ర, జాతీయ విపత్తు దళ బృందాలను రంగంలోకి దించి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. ► టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం మధ్య ఎర్రకాలువ దాటుతూ ములకాల దుర్గారావు మృతి చెందాడు. ► శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 83.471 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 431.021 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. కృష్ణా నదిలో మళ్లీ పెరిగిన వరద ► కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 1.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 42,378 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 144.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 249.80 టీఎంసీలకు చేరుకుంది. ► పులిచింతలకు దిగువన మున్నేరు, కట్టలేరు, వైరా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 1.56 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో 70 గేట్లు ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి బ్యారేజీలోకి వరద మరింత పెరగనుంది. తుంగభద్ర డ్యామ్ నుంచి మువ్వన్నెల విద్యుద్దీపాల వెలుగుల్లో జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. -
ములుగు వద్ద గోదావరి ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు, వంకలూ, గోదావరి నది పొంగి పొర్లుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణాపురం వద్ద 163వ జాతీయ రహదారిపై చేరిన వరద నీరు చేరింది. చత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. పేరూరు వద్ద వరద నీటి మట్టం 15 మీటర్లకు చేడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలు వరదలతో ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట మద్యలో ఉన్న జీడి వాగు ఉప్పొంగుతోంది. (జల దిగ్బంధంలో మేడారం) కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క జీడి వాగు ఉదృతిని వీక్షించారు. వాగు పొంగుపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయని ప్రజలంతా ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ములుగు జిల్లా పాలంపేట గ్రామం రామప్ప తూర్పు ముఖద్వారం రోడ్డు పై నుంచి వరద నీరు భారీగా కిందకు ప్రవహిస్తోంది. మరి కొద్ది గంటలల్లో గణపురం, ములుగు, వెంకటపూర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. (జలదిగ్బంధంలో ఓరుగల్లు) -
గోదావరి ఉధృతి.. అధికారులు అప్రమత్తం
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం నియోజకవర్గంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలను పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో గోదావరి వరద ఉధృతి, ముందస్తు చర్యలపై ఐటీడీఏ, పీఓ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ, 3 మండలాల తహశీల్దార్, ఎంపీడీఓ, ఇతర మండల స్ధాయి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గోదావరి నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నందున ఇప్పటికే చాలా గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయని, తక్షణమే ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చాలని ఆదేశించారు. (పరవళ్లు తొక్కుతున్న గోదావరి) గర్భిణులు, బాలింతలు, ఇతర వైద్య అవసరాలు ఉన్న వృధ్ధులు ను తక్షణమే అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యం కలిగిన ప్రాంతాలలోని వైద్యుల పర్యవేక్షణకు తరలించాలని తెలిపారు. పై గ్రామాల ప్రజలకు సరిపడా నిత్యవసరాలు, ఆహార పదార్థాలు, మంచినీరు అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు. డయోరియా, అతిసార, మలేరియా, టైపాయిడ్ వంటి జబ్బలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని, తగినన్ని మందులు, వైద్య, ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. (గోదావరి, కృష్ణా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన) ముంపు గ్రామాలు, రాకపోకలు లేని గ్రామాలకు నోడల్ అధికారులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచార సేకరణ తో పాటు అన్ని వ్యవస్ధల పై పూర్తి పర్యవేక్షణ ఉంచాలన్నారు. తగినన్ని బొట్లు,ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకుని అత్యవసర పరిస్ధితుల్లో సంసిధ్ధులుగా ఉండాలన్నారు. అనుమతి లేని ప్రయాణికుల బోట్లు నిషేధించి ఎవరైన నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ వరద నష్టాన్ని తగ్గించాలన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 24 గంటలు పనిచేసే విధముగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే.. కరెంటు సరఫరా ఉండని ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రహదారి సౌకర్యం, కరెంటు సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో ని ఆసుపత్రులకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని, సరిపడా ఆయిల్ నిల్వలు కూడా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించి వరద నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నివరించాలన్నారు.ప్రజలకు సాధ్యమంత అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ అధికారులకు తోడ్పాటును అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బాలరాజు పిలుపునిచ్చారు. -
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
సాక్షి, వరంగల్ : గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల వరద నీరు కలుస్తుండటంతో మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం నుంచే క్రమేపీ పెరుగుతూ బుధవారానికి 5.300 మీటర్ల వేగంతో ఉరకలు వేస్తోంది. మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ ఇన్‌టేక్‌వెల్ వద్ద భుదవారం ఉదయం నుంచి గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. ఆరున్నర మీటర్ల మేర నీటి వరద సాయంత్రం వరకు పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం, తుపాకులగూడెం బ్యారేజీల వరద నీరు బొగత జలపాతం, వాగులు, ఒర్రెల నుంచి కలవడంతో క్రమేపీ గోదావరి పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదేవిధంగా మంగపేట గోదావరి పుష్కరఘాట్ వద్ద కూడా వరద నీరు పెరిగింది. (నీటి నిర్వహణ కత్తిమీద సామే!) రైతుల ఆనందం గోదవారి తీర ప్రాంతం ప్రజలు, రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తిమ్మంపేట- అబ్బాయిగూడెం గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువు మంగళవారం తెల్లవారుజాము నుంచి మత్తడి పడి పోస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు నిండడంతో తిమ్మంపేట, చెరుపల్లి, మల్లూరు, కొత్తమల్లూరు గ్రామాలు సుమారు 500 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరి గోదావరి క్రమేణా పెరుగుతోంది. పేరూరు దగ్గర 9.05 మీటర్ల నీటిమట్టానికి చేరుకుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. (మేం గిట్లా జేస్తే కేసీఆర్ సీఎం అయ్యేటోడా..!) మత్తడికి సిద్ధంగా లక్నవరం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మత్తడిపోసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం 33 ఫీట్లకు నీటిమట్టం చేరగా మరో అర ఫీటు నిండితే జలాలు మత్తడి దునకనున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. రెండు రోజుపాటు కురిసిన వర్షాలకు సరస్సులోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ఇప్పటికే ఆయకట్టులో వరినాట్లు పూర్తయ్యాయి. సరస్సు పూర్తిస్థాయిలో నిండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు. -
నీటి నిర్వహణ కత్తిమీద సామే!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింది కాల్వలన్నీ నిండుగా పారుతున్నా నీటి నిర్వహణ ‘కత్తిమీది సాములా’మారింది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నీటి నిర్వహణకు అవసరమైన వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు, లష్కర్లు లేరు. దీంతో నీటి నిర్వహణ ఇరిగేషన్ ఇంజనీర్లకు అగ్ని పరీక్షలా మారింది. సిబ్బందిలేమి.. నీటి పంపిణీకి ఇబ్బంది ఎగువ నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు మొదలయ్యాయి. కాళేశ్వరం మొదలు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలు ఆరంభమయ్యాయి. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపంపిణీ ఆటంకాల్లేకుండా సాగా లంటే ఆపరేటర్లు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్ప ర్లు, లష్కర్లు, ఎలక్ట్రీషియన్లు కీలకం. రాష్ట్రంలో మొత్తంగా ఈ తరహా సిబ్బంది 6 వేల మంది అవసరముండగా ప్రస్తుతం1,700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వల పరిధిలోని మెయిన్‌కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రు, బ్రాంచ్ కెనాల్ల పరిధిలో ప్రతి 6 కిలోమీటర్లకు ఒకరు చొప్పున లష్కర్ ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక్కరు కూడా లేరు. మొత్తం గా 3,800 మంది లష్కర్లు అవసరముండగా, 1,400 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వలకు గండ్లు పడుతున్నా... గోదావరి జలాల ద్వారా ఎస్సారెస్పీ పరిధిలోని 250 కిలోమీటర్ల మేర కాల్వలు పారుతున్నాయి. దీని పరిధిలో సుమారు 400 మంది లష్కర్లు అవసరముండగా 50, 60 మందితోనే నెట్టుకొస్తున్నారు. కనీసం 200 మంది లష్కర్లను అత్యవసరంగా నియమించాలని ఏడాదిగా ఇంజనీర్లు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాగార్జునసాగర్ పరిధిలోనూ ఇదే పరిస్థితి. కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ల కింద 400 మంది లష్కర్లు, 60 మంది ఆపరేటర్లు, 75 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎలక్ట్రీషియన్లు, 15 మంది ఫిట్టర్లు కావాలని ఏడాదిగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన సరిగాలేదు. దీంతో ఇక్కడ కాల్వలకు గండ్లు పడుతున్నా, కొన్నిచోట్ల అక్రమంగా కాల్వలను తెంచుతున్నా పట్టించుకునేవారులేరు. కిన్నెరసాని, కడెం, జూరాల, మూసీ, సింగూరు వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా సరిపడా సిబ్బంది లేరు. గత ఏడాది సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో మూసీ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
నది మధ్యలో నరకయాతన
సాక్షి, కాళేశ్వరం: గోదావరి దాటుతున్న ఓ యువకుడు వరదలో చిక్కుకున్నాడు. ఏడు గంటల పాటు నది మధ్యలోనే ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలోని కుంట్లం–3 ఇసుక క్వారీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొల్లూరు ఇసుక క్వారీలో పనిచేసే జీవన్‌లాల్ సింగ్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలోని క్వారీ వద్దకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కుంట్లం–3 క్వారీ నుంచి కొల్లూరుకు కాలినడకన గోదావరి మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో మధ్యలో చిక్కుకున్నాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వరదలో చిక్కుకున్న జీవన్‌లాల్.. అరుపులు, కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. చివరికి మధ్యాహ్నం అతని అరుపులు విన్న క్వారీ సిబ్బంది 100కు డయల్ చేశారు. కానిస్టేబుళ్లు సంజీవ్, మధుకర్ అక్కడికి చేరుకుని ఓ నాటు పడవలో ఇద్దరు గజ ఈతగాళ్లతో వెళ్లి జీవన్‌లాల్ సింగ్‌ను తీసుకువచ్చారు. (ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలి) -
ఆచితూచి ఎత్తిపోత!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో నదిలో ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు రెండువేల క్యూసెక్కుల మేర ఉన్న ప్రవాహాలు ఆదివారం ఐదు వేలకు పెరిగాయి. ఈసారి మంచి వర్షాలే పడతాయన్న అంచనాల నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆచితూచి, సమగ్ర ప్రవాహ అంచనాతో ఎత్తిపోతలు చేపట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. కడెం నుంచి ప్రవాహాలు మొదలైతే ఎత్తిపోతలు చేపట్టే అవసరం ఉండదని భావిస్తోంది. అన్నీ లెక్క చూసుకొనే ఎత్తిపోత గడిచిన రెండు మూడ్రోజులుగా ఎగువన మహారాష్ట్రలో మంచి వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద పెరిగింది. ఆదివారం ఉదయానికి మేడిగడ్డ వద్ద 5,200 క్యూసెక్కుల మేర వరద కొనసాగగా, సాయంత్రానికి 18 వేల క్యూసెక్కులకు చేరింది. మరిన్ని రోజులు మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే ప్రవాహాలు పెరిగే చాన్స్ ఉంది. రాష్ట్రంలోనూ ఈ ఏడాది మంచి వర్షాలుంటాయనే అంచనాలున్నాయి. దీంతో గోదావరి బేసిన్‌లోని కడెం ప్రాజెక్టుకు జూన్ చివరి వారం నుంచే ప్రవా హాలు నమోదవుతాయని భావిస్తున్నారు. ప్రస్తు తం కడెంలో 7.60 టీఎంసీలకు 3.14 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. దీనిలోకి గతేడాది గరిష్టంగా 40–50వేల క్యూసెక్కుల వరకు సైతం ప్రవాహాలు కొనసాగిన సందర్భాలున్నాయి. అదే జరిగితే ప్రాజెక్టు ఒక్కరోజులోనే నిండుతుంది. కడెం నుంచి దిగువకు ఏటా 15–20 టీఎంసీల మేర వరద దిగువకు వస్తుంటుంది. ఇది ఎల్లంపల్లికి చేరుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 5.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి సైతం నిండితే గ్రావిటీ ద్వారా నీరు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా మేడిగడ్డకు ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. గతేడాది మేడిగడ్డ ద్వారా నీటిని ఎత్తి మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల నింపాక కడెం, ఎల్లంపల్లి నుంచి భారీగా వరద ప్రవాహాలు వచ్చాయి. దీంతో చాలా నీరు తిరిగి నదిలో కలిసిపోయింది. గతానుభవాల దృష్ట్యా, ఈ ఏడాది వర్షపాతం, ఎగువ నుంచి వచ్చే అంచనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరైన అంచనా లేకుండా నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నడిపిస్తే కరెంట్ ఖర్చు అనవసరపు భారం కానుంది. మేడిగడ్డలో నీటి నిల్వ 0.6 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉండగా, అన్నారంలో 2టీఎంసీలు, సుందిళ్లలో 2టీఎంసీల మేర నిల్వలున్నాయి. వీటిని అంచనా వేసుకుంటూ దిగువన ఎల్లంపల్లి మొదలు, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి ఎత్తిపోతలను మొదలుపెట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. -
చేయి కోసుకున్నాడు.. అయినా కనికరించలేదు
సాక్షి, నిర్మల్ : తనకు జీవనాధారం అయిన ఆటోను బలవంతంగా లాక్కున్నాడని మనస్థాపంతో బాసర పట్టణానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. బాసరకు చెందిన రాము వృత్తిరిత్యా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం( మే 24న) రాములు ఆటో తోలుతూ నిజామాబాద్ జిల్లా ఫకీరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి బైక్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో తనకు రూ. 15 వేలు నష్టపరిహారం చెల్లించాలంటూ ఫకీరాబాద్ వ్యక్తి బలవంతంగా రాము ఆటోను ఎత్తుకెళ్లాడు. అయితే రాము తన ఆటోను విడిపించుకునేందుకు నిజామాబాద్ వ్యక్తికి రూ. 10 వేలు అందజేశాడు. అయితే మిగతా ఐదువేల రూపాయలు చెల్లిస్తే తప్ప ఆటోను విడిచేది లేదంటూ వ్యకి తెగేసి చెప్పాడు. (వైద్య విద్యార్థిని ఆత్మహత్య కలకలం) దీంతో తన జీవనాధారమైన ఆటో లేకపోతే తాను బతకటం కష్టమవుతుదంటూ రాము ఆ వ్యక్తి ఇంటి ముందే బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. చచ్చినా పర్వాలేదు.. కానీ పూర్తి డబ్బులు చెల్లిస్తేనే ఆటోను తిరిగి ఇచ్చేస్తానని మరోసారి తేల్చిచెప్పడంతో కలత చెందిన రాములు గోదావరి నదిలో మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా రాములు మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ అతని బంధువులు, స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. జరిగిన చిన్న యాక్సిడెంట్లో వ్యక్తికి సంబంధించిన వాహన ఇండికేటర్ మాత్రమే దెబ్బతింది.. దీనికే రాముపై దౌర్జన్యానికి దిగిన వ్యక్తి రూ.15 వేలు డిమాండ్ చేయడమే గాక ఆటోను లాక్కోవడం దారుణమని పేర్కొన్నారు. బాధితుని మృతికి కారణమైన వ్యక్తిపై కేసు పెట్టి అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
గోదారి తీరంలో విషాదం
సాక్షి, నిడదవోలు: సరదాగా గోదారిలో స్నానానికి దిగిన ఇద్దరు యవకులు గల్లంతైన విషాద ఘటన నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో ఆదివారం జరిగింది. పెండ్యాల గ్రామానికి చెందిన సింగులూరి వెంకటేష్ (19), పదో తరగతి చదువుతున్న అయినం సాయి గణేష్ (16)తో పాటు సింగులూరి బాబూరావు, నాయుడు రవీంద్ర, దాసరి అభిరామ్, పారేపల్లి వివేక వర్ధన్లు ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా నదిలో ఉన్న గోతుల్లో పడి వెంకటేష్, సాయిగణేష్ గల్లంతయ్యారు. గ్రామస్తులు బోట్లు ఏర్పాటు చేసి యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు, కొవ్వూరు ఆర్డీఓ డి.లక్ష్మారెడ్డి, సీఐ కె.స్వామి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద వివరాలను ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులలో ధైర్యాన్ని నింపారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు నదిలో రాత్రి కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన సింగులూరి నాగేశ్వరరావు కుమారుడు సింగులూరి వెంకటేష్ అయిన దానయ్య కుమారుడు సాయి గణేష్. ఐనం సాయి గణేష్ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సింగులూరు వెంకటేష్ కూలి పనికి వెళుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఘటనా స్థలంలో గాలింపు చర్యలు, ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు ఎమ్మెల్యే పరామర్శ గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు ఆదివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. స్నానానికి దిగి గల్లంతవడం చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. గాలింపు చర్యలకు ఆటంకం కలగకుండా నదిలో నీటిని క్రమబద్దీకరించాలని ఎమ్మెల్యే ఫోన్లో ఇరిగేషన్ అధికారులకు సూచించారు. -
రోహిణిలోనే గోదారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న గోదావరి నదీ జలాలతో వచ్చే వానాకాలంలో సాగును సంబరంచేసే దిశగా ప్రభుత్వం బృహత్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద రోహిణి కార్తెలోనే నారుమళ్లకు నీరు విడుదల చేయాలని యోచిస్తోంది. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులకు నీరు చేరే వరకు వేచిచూడకుండా జూన్ తొలి వారం నాటికే తాగునీటిని పక్కనపెట్టి, సాగుకు నీటిని విడుదలచేసే అంశంపై దృష్టిపెట్టింది. దీంతో పాటే వర్షాలు పుంజుకొని వరద మొదలయ్యే నాటికి వచ్చిన నీటిని వచ్చినట్టు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసి తరలించే ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. గోదావరి జలాల సమగ్ర వినియోగం, నీటి విడుదల వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం జరిగే విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. నికరం, మిగులు.. ఏదీ వదలొద్దు రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు గోదావరే ప్రధాన నీటి వనరు. గోదావరీ జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. ఇందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉంది. మరో 520 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా తెలంగాణ వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం (180 టీఎం సీలు), దేవాదుల (60), తుపాకులగూడెం (100), సీతారామ (60) వంటి ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా 520 టీఎంసీల మేర నీరు వినియోగంలోకి రానుంది. అయితే కాళేశ్వరం ద్వారా రోజుకు 3 టీఎంసీల మేర నీటిని 200 రోజుల పాటు తరలించి కనీసంగా 600 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం పదేపదే చెబుతున్నారు. నీటి కొరత ఉన్న కృష్ణాబేసిన్‌కు వీటినే తరలిద్దామని చెబుతూ వివిధ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ స్థాయిలో నీటిని తరలించాలంటే ప్రస్తుత నికర జలాల వాటాకు అదనంగా మరో 600 టీఎంసీల మిగులు వాటాను సాధించాలని ఇటీవలి సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి సూచించిన విషయం తెలిసిందే. మిగులు జలాల వాటా వినియోగంపైనా ఆదివారం ముఖ్యమంత్రి సమీక్షించి, ఈ వాటాల సాధనపై మార్గదర్శనం చేయనున్నారు. 35 లక్షల ఎకరాలకు నెలాఖరు నుంచే నీళ్లు ఈ వానాకాలంలో గోదావరి బేసిన్లో మేజర్, మీడియం, మైనర్ కింద కలిపి మొత్తంగా 35లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో ఎస్సారెస్పీ–1, 2 కింది ఆయకట్టే 13లక్షల ఎకరాలు ఉండగా, దేవాదుల కింద 2లక్షలు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి కింద లక్ష, కాళేశ్వరం కింద 2–3లక్షలు, వరద కాల్వ కింద మరో 2లక్షలు, కడెం కింద 40వేలు, కొమరంభీం, సాత్నాల, పెద్దవాగు వంటి మధ్యతరహా ప్రాజెక్టుల కింద 3లక్షలు, ఇక చెరువుల కింద ఉన్న 14లక్షల ఎకరాల్లో కనీసంగా 10లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు. ఇందులో ఎస్సారెస్పీలో ప్రస్తుతం 30 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇక్కడ ఉన్న నీటిలో తాగునీటికి 10 టీఎంసీలు పక్కనపెట్టి, మిగతా 20 టీఎంసీలను వానాకాలం నారుమళ్ల కోసం విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు రోహిణి కార్తె ఉన్నందున అప్పటిలోగా నారుమళ్లకు నీటిని విడుదలచేస్తే మంచిదనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు మిడ్‌మానేరులో 17.36, లోయర్ మానేరులో 9, కడెంలో 3.34 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇందులో తాగునీటిని పక్కనపెట్టి నారుమళ్లకు ముందే నీటిని విడుదలచేసే అంశమై ఆదివారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. వచ్చింది వచ్చినట్టే ఎత్తిపోత జూన్ మూడో వారం నుంచి గోదావరిలో ప్రవాహాలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్టుగా మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీలకు తగ్గకుండా ఎత్తిపోసే అంశం సీఎం సమావేశంలో కీలకం కానుంది. ఇప్పటికే 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు మోటార్లు సిద్ధంగా ఉండగా, ఆగస్టు 15 నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా పనులు కొనసాగుతున్నాయి. కనీసంగా ఈ ఏడాది కాళేశ్వరం ద్వారా 200–300 టీఎంసీలు ఎత్తిపోసేలా కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ నీటితో బ్యారేజీలు, రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ ప్రతి నీటిచుక్క సద్వినియోగమయ్యేలా పక్కా ప్రణాళికను రూపొందించనున్నారు. ఇక కొండపోచమ్మకు జూన్–2న స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని తరలించే మోటార్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనే అంశంపైనా సమావేశంలో చర్చిస్తారు. -
హృదయవిదారకం; అమ్మా.. నన్ను క్షమించు అంటూ
అమ్మా.. నన్ను క్షమించు... బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను, చెల్లిని బాగా చూసుకోవాలనుకున్నాను. చెల్లికి పెళ్లి కూడా చేయాలనుకున్నాను. ‘నీ ఒడిలో మొదలైన నా ప్రయాణం..ఈ గోదారి తల్లి ఒడిలో ఆత్మహత్యతో సమాప్తం..’ ఐ లవ్ యూ అమ్మా.. వెళ్లిపోతున్నా... గుడ్ బై అంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తల్లికి లేఖ రాసి.. వైనతేయ గోదావరిలో దూకేశాడు. ఈ ఘటన అందరినీ కదిలించి వేసింది. సాక్షి, అమలాపురం టౌన్/అల్లవరం: బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై ఉన్న వంతెనపై నుంచి ఇంజినీరింగ్ విద్యార్థి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హృదయ విదారకంగా ఉన్న ఆ విద్యార్థి.. అమ్మకు రాసిన ఆ ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. ఇక ఆ ఉత్తరాన్ని చదవి గుండె పగిలింది. ఉప్పలగుప్తం మండలం నంగవరం గ్రామానికి చెందిన అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం బీటెక్ చదువుతున్న మట్టపర్తి యశ్వంత్ సాయి వీరేంద్ర (19) చదువుపై ఆసక్తి లేక.. కళాశాలకు చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించలేక మనస్తాపంతో వైనతేయ నది వంతెనపై నుంచి దూకాడు. అతడి ఆచూకీ కోసం పడవలపై గాలిస్తున్నారు. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. వీరేంద్ర కోసం వైనతేయ నదిలో పడవపై గాలిస్తున్న ఎస్సై చిరంజీవి, పోలీసులు, గజ ఈతగాళ్లు అమ్మే నన్ను, చెల్లిని ఏ లోటూ తెలియకుండా పెంచుతోంది. చదువు ఎక్కనప్పుడు... కళాశాలకు కట్టాల్సిన డబ్బులు చెల్లించలేక బాధతో గతంలోనే కళాశాల భవనం పైనుంచి దూకి చనిపోవాలనుకున్నాను. అమ్మ, చెల్లి గుర్తుకు వచ్చి మానేశాను. అంత సొమ్ము అమ్మ వద్ద లేదు. అమ్మ కూలి పనికి వెళుతోంది. తీవ్ర మానసిక ఒత్తిడి, జీవితంలో స్థిరపడలేకపోయానన్న మనోవేదన అతడిని కుంగదీశాయి. గతంలోనే ఆత్యాహత్యా యత్నం చేసినప్పటికీ విఫలమైందని అతడు ఆ ఉత్తరంలో పేర్కొన్నాడు. అల్లవరం ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసు బృందం, ఈతగాళ్లు బోడసుకుర్రు వద్ద వైనతేయ నదిలో ఉదయం నుంచి రాత్రి వరకూ పడవలపై గాలించినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కళాశాలలో సర్టిఫికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించే ఆర్థిక స్థోమత లేక.. అమ్మకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో అతడు గోదావరిలోకి దూకాడని ఎస్సై తెలిపారు. యశ్వంత్ రాసిన ఉత్తరాన్ని చూసి తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. వైనతేయ వంతెన వద్దకు యశ్వంత్ సైకిల్‌పై వచ్చాడు. ముందే అమ్మకు రాసుకున్న సుసైడ్ నోటును సైకిల్‌పై పెట్టి నదిలో దూకేశాడని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. అతని చెప్పులు, సెల్‌ఫోను అక్కడ కనిపించలేదు. అయితే ఉత్తరంలో మాత్రం తన అమ్మ సెల్ ఫోన్ నంబర్‌ను రాశాడు. ఈ ఉత్తరాన్ని పలువురు స్మార్ట్ ఫోన్ల వాట్సాప్‌లకు పంపారు. ఆ ఉత్తరం చదివిన వారి మనసులను కలచివేసింది. అతని మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
తోటి వాళ్లంతా పని చేస్తున్నారు.. నీవు మాత్రం !
సాక్షి, జైపూర్(ఆదిలాబాద్) : జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన సౌదాని రాజశేఖర్(21)అనే యువకుడు తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఎస్సై గంగరాజాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..టేకుమట్లకు చెందిన లీల–మల్లేశ్ దంపతుల కుమారుడు రాజశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. రాజశేఖర్‌కు దేవుడి పూనకం రావడం.. తోటి వాళ్లు పని చేస్తున్నారు నీవు పని లేకుండా ఖాళీగా ఉంటున్నావు అని తండ్రి మల్లేశ్ ఈనెల 6న ఇంట్లో మందలించాడు. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి టేకుమట్ల సమీపంలో గోదావరి నదిలో దూకాడు. మూడు రోజులకి మృతదేహం టేకుమట్ల గోదావరి ఒడ్డుకు చేరుకోవడం స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్సై గంగరాజాగౌడ్ పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. (దారుణం: ఆగిన లిఫ్టు.. ఆ సమయంలో..) -
కాలువల ఆధునికీకరణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: కాలుష్యంతో నిండిన కాలువలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆధునీకరించడమే ప్రధాన ఉద్దేశమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సాగుకు, తాగుకు స్వచ్ఛమైన నీటిని అందించడంతో పాటు కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అన్ని నగర, గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలను శుద్ధిచేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కాలువలు, కాలువగట్లు ఇకపై ప్రజలకు ఉపయోగపడే వాకింగ్ ట్రాక్‌లుగా, పార్క్‌లుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వైబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కెనాల్స్ పొల్యూషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గోదావరి డెల్టా పరిధిలో 10 వేల కిలో మీటర్ల కాలువలు, కృష్ణా డెల్టా పరిధిలో 9,800 కాలువలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. ముందుగా 1344 కిలోమీటర్లు, 36 మేజర్ కెనాల్స్‌లో పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కెనాల్స్ బ్యూటిఫికేషన్ విషయంలో లైనింగ్ లేనిచోట గ్రీనింగ్ చేయాలని.. కాలువ కట్టలపై సిమెంట్, కాంక్రీట్ వినియోగించకుండా పాత్‌వేలు రాళ్లతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అన్ని మున్సిపాలిటీలు కవర్ అయ్యేలా చర్యలుండాని సీఎం జగన్ ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇరిగేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎన్జీవోలను భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఒక్కో కాలువలో ఎంత మురికినీరు కలుస్తుంది, దాన్ని నివారించేందుకు ఎంత ఖర్చవుతుంది, ఎస్టీపీల నిర్మాణం, మెయింటెనెన్స్ వివరాలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఔట్లెట్ పాయింట్ వద్ద అకౌంటబిలిటీ ఉండాలని అందుకవసరమైన చర్యలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారును ఆయన ఆదేశించారు. ప్రత్యామ్నాయ స్ధలాలు కేటాయించాలి విజయవాడ, విశాఖలో ముందుగా కాల్వల ఆధునికీకరణ పనులు చేయాలని సీఎం ఆదేశించారు. 18 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు నాలుగు జిల్లాల్లో కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. పులివెందులను కూడా కార్యక్రమంలో చేర్చాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ముందు కాలువ కట్టలపై ఉంటున్న వారికి ప్రత్యామ్నాయ స్ధలాలు కేటాయించి వారే ముందు ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాళ్లు ఇళ్లు కట్టుకోగానే అక్కడి నుంచి తరలించాలని సీఎం తెలిపారు. తాడేపల్లి మున్సిపాలిటిలో ముందుగా పనులు ప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. ఇళ్లు తరలించేటప్పుడు మానవత్వంతో వ్యవహరించాలని, ఎక్కడా వారిని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే తరలించాలన్నారు. ఒక్కసారి పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఎవరూ ఆక్రమించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లాలో రైవస్ కెనాల్, గుంటూరు జిల్లాలో కృష్ణా వెస్ట్రన్ కెనాల్, పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు కెనాల్, తూర్పుగోదావరి జిల్లాలో జీఈ మెయిన్ కెనాల్, పులివెందుల, విశాఖపట్నం పైలెట్ ప్రాజెక్ట్‌లుగా చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు తెలిపారు. నాడు నేడు కార్యక్రమం తరహాలో చేయాలన్నారు. దాతల పేర్లతో ఏర్పాటు ప్రజలకు తెలిసేలా ఫోటోలు తీసి ఇప్పుడున్న పరిస్ధితి, భవిష్యత్‌లో ఏలా తీర్చిదిద్దుతామో చూపాలని సీఎం జగన్ తెలిపారు. కాలువలపై ఏర్పాటు చేసే పార్క్‌లకు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి ముందుకొచ్చే దాతల పేర్లతో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. మిషన్‌కు అవసరమైన సహాయ సహకారాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. సాలిడ్‌వేస్ట్ కలెక్షన్, డిస్పోజల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ఇందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్‌తో రావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్ డైరెక్టర్ కాటమనేని భాస్కర్, ఆర్దిక, జలవనరులశాఖ, మున్సిపల్‌శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తండ్రి మరణం ..నదిలో దూకిన కూతురు
-
తండ్రి మరణం తట్టుకోలేక..
రామగుండంక్రైం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకి గల్లంతయింది. గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఆరవెల్లి వసంతం ద్విచక్రవాహనంపై వెళ్తూ సోమవారం జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద గేదెలు అడ్డురావడంతో బైక్ పైనుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో వసంతం మృతదేహాన్ని చెన్నూరుకు వాహనంలో తరలిస్తుండగా, కుటుంబ సభ్యులంతా కారులో ప్రయాణిస్తున్నారు. గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకోగానే మృతుడి కూతురు సాయిప్రియ (32) వాంతులు వస్తున్నాయని చెప్పడంతో కారుని డ్రైవర్ నిలిపివేశాడు. వెంటనే కిందకు దిగిన సాయిప్రియ కుటుంబ సభ్యులు చూస్తుండగానే హఠాత్తుగా బ్రిడ్జి పైనుంచి నదిలో దూకి గల్లంతయింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమె గల్లంతు కావడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. రివర్ పోలీసులు గమనించి తాడు సాయంతో ప్రయత్నించినా నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో అప్పటికే ఆమె మునిగిపోయింది. రోధిస్తున్న కుటుంబసభ్యులు వసంతం మృతదేహంతో చెన్నూరు వెళ్లిపోయారు. గాలింపు చర్యలు గోదావరి నదిలోని నీటిలో దూకి గల్లంతైన సాయిప్రియ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శవంపైకి తేలితే తప్ప చేసేదేమి లేదని పేర్కొంటున్నారు. నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు అనుకూలంగా లేదని పోలీసులు తెలిపారు. కా గా సాయిప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీగా పనిచేస్తోంది. ఘటనపై గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
సమ్మక్క బ్యారేజీ సిద్ధమవుతోంది!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నది జలాల సమర్థ వినియోగం, దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో చేపట్టిన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ ఖరీఫ్ సీజన్లోనే గోదావరి నీటిని నిలిపేలా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ పనుల పూర్తిపై మార్గదర్శనం చేస్తున్నారు. గేట్లు అమర్చే ప్రక్రియ ఆరంభం.. గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంగనర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించారు. అయితే కంతనపల్లితో 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చారు. ఇక్కడ నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుందని, ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1,132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. రూ.2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. ఈ పనుల్లో ఇప్పటికే రూ.1,100 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 59 గేట్లలో 58 గేట్ల తయారీ పూర్తయింది. ఆదివారం నుంచి వాటిని అమర్చే ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్ బ్రిడ్జి స్లాబ్‌లు సైతం 40 వరకు పూర్తయ్యాయి. 30 పియర్ నిర్మాణాలు పూర్తవ్వగా, వాటి మధ్యలోంచే ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహాలు దిగువకు వెళ్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇంజనీర్లను ఆదేశించారు. దీని ఎగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వలను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ చేసి పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ మరమ్మతులపై బ్యారేజీ గేట్లు ఎత్తిన పక్షంలో నీరు దిగువన తుపాకులగూడెం చేరుతుంది. మేడిగడ్డ నుంచి వచ్చే నీరంతా తుపాకులగూడెంలో నిల్వ ఉండేలా బ్యారేజీ స్లూయిస్ నిర్మాణం 70 నుంచి 71 మీటర్ల లెవల్ వరకు పూర్తి చేయాలని, ఈ లెవల్లో 2.90 టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని సీఎం గతంలోనే సూచించగా, ఈ పనులను ఇటీవలే ముగించారు. వరద మొదలయ్యే నాటికి ఒక్క టీఎంసీ నీటిని కూడా దిగువకు వదలొద్దన్న ఉద్దేశంతో జూలై, ఆగస్టు నాటికి బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్ల మేర నీటిని 6.94 టీఎంసీల నిల్వ చేసేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించగా, ఆ పనులు వేగిరమయ్యాయి. ఈ పనులు పూర్తయితే దేవాదుల ఎత్తిపోతలకు నీటి లభ్యత పెరగనుంది. దీనికింద నిర్ణయించి 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడం సులభతరం కానుంది. అయితే దేవాదులలోని మూడో దశ పనులు పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు నీరందించే అవకాశాలుండటంతో ఆ పనులను వేగిరం చేశారు. -
గంగానది తరహాలో గోదావరి, కృష్ణా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జీవనాడి.. గోదావరి, కృష్ణా నదుల పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. గంగానది తరహాలోనే దేశం లోని 9 జీవనదుల పరీవాహక ప్రాంతాల్లో అటవీ ప్రాంత అభివృద్ధి, పర్యావరణ సమతౌల్యత ద్వారా పునరుజ్జీవం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులకు ఇరువైపులా 5 కి.మీ., వాటి ఉప నదులకు ఇరువైపులా 2 కి.మీ.ల మేర ప్రాంతా న్ని అభివృద్ధి చేయనుంది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆ ప్రాంతంలో అటవీ క్షేత్రాలు, ఉద్యానతోటల పెంపకాన్ని చేపట్టనుంది. ఈ పరిధిలోని ప్రైవేటు భూముల్లోనూ ఇదే తరహా అభివృద్ధి జరగనుంది. వాటర్షెడ్లు, చెక్‌డ్యామ్‌లు నిర్మించడమే కాకుండా నదులు కోతకు గురికాకుండా చర్యలు తీసుకోనుంది. గోదావరి, కృష్ణా నదులు, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో సుమారు 52 లక్షల ఎకరాల పరిధిలో ఈ రకమైన అభివృద్ధి చేయనున్నట్లు అటవీశాఖ ఉన్నతాధికా రి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం రెవె న్యూ, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి శాఖలు మార్చి 10కల్లా ప్రతిపాదనలతో కూడిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. వాటిని క్రోడీకరించాక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికను పంపనుంది. ఈ ప్రక్రియ మార్చి నెలాఖరుకల్లా పూర్తి కానుంది. ఆ తర్వాత కేంద్రం తన పని ప్రారంభించనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఎందుకు చేస్తున్నారంటే...! దేశంలో ఏర్పాటైన మొదటి ఇరిగేషన్ కమిషన్ నది పరీవాహక ప్రాంతాల్లో ఉపరితల ప్రవాహం ఏడాదికి 116.76 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం)గా అంచనా వేసింది. 1949లో ఈ ప్రవాహాన్ని కోస్లా ఫార్ములాలో లెక్కించగా 125.529 బీసీఎంగా తేలింది. సగటు ప్రవాహాన్ని 11.54 బీసీఎంలుగా నిర్ధారించారు. అయితే నదుల్లో ఏటా 0.99 బీసీఎంల నీరు కాలుష్యం బారిన పడుతోందని పలు అధ్యయనాల్లో తేలింది. గోదావరిలో ఏటా 4.34 హెక్టార్ల నేల కోతకు గురవుతుండగా, 23.22 హెక్టార్ల నేల అవక్షేపాలతో నిండిపోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల్లో కృష్ణా 23 శాతం, 38 శాతం గోదావరి నది ఆక్రమించి ఉన్నాయి. ఇప్పుడేం జరుగుతోంది..? గంగా నదీ పునరుజ్జీవ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టగా ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక తయారీ ప్రక్రియ 2016లో మొదలైంది. ఆ సమయంలో ఈ నివేదిక తయారు చేస్తున్న డెహ్రడూన్‌లోని అటవీ అధ్యయన సంస్థ (ఎఫ్ఆర్ఐ) ద్వారా దేశంలోని ప్రధాన జీవనదులను పునరుద్ధరించేందుకు పూర్తిస్థాయి నివేదికలు తయారు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే ఎఫ్ఆర్ఐ తన ప్రాంతీయ సంస్థల ద్వారా యమున, గోదావరి, కృష్ణా, నర్మద, కావేరి, మహానది, సట్లెజ్, బ్రహ్మపుత్ర, లూనీ నదుల పునరుజ్జీవానికి నివేదికలు తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన కార్యాచరణ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులకు పునరుజ్జీవ ప్రణాళికపై ఇప్పటికే ఓ దఫా శిక్షణ కూడా పూర్తయింది. వారంతా ఎఫ్ఆర్ఐ నిర్దేశించిన పద్ధతిలో గోదావరి, కృష్ణా నదుల పునరుజ్జీవానికి సంబంధించిన నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పునరుజ్జీవం కోసం ఏం చేస్తున్నారంటే... సహజ పర్యావరణ వ్యవస్థ (అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలు)ను పరిరక్షించేందుకు నిర్దేశిత జోన్లలో భూమి, నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు కలుపు నియంత్రణ, మొక్కల పెంపకం లాంటి చర్యలు చేపడతారు. ఈ క్రమంలో పెంచాల్సిన మొక్కలను డెహ్రడూన్‌లోని ఎఫ్ఆర్ఐ ఆయా పరీవాహక ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తుంది. దీనినే నేచురల్ ల్యాండ్‌స్కేప్ అభివృద్ధిగా పరిగణిస్తారు. ఇందుకోసం రైతులు కూడా తమకు అనువైన మొక్క రకాలను ఎంచుకోవచ్చు. ఆవాస ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో వాటి పెంపకం చేపట్టవచ్చు. అయితే రైతు ఎంచుకున్న మొక్కలను ప్రభుత్వమే సరఫరా చేయడంతోపాటు సాగుకు అవసరమైన ప్రోత్సాహకాన్ని కూడా నగదు రూపంలో అందజేస్తుంది. అటవీ వ్యవసాయం కోసం నదీ పరీవాహక ప్రాంతం పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పంటల పెంపకాన్ని చేపడతారు. వ్యవసాయ, ఉద్యాన పంటలను పరీవాహక ప్రాంతాల్లోని ప్రైవేటు భూముల్లో రైతుల చేత పండిస్తారు. తద్వారా ఆ ప్రాంతంలో భూమి, నీటి సంరక్షణ చేపట్టడంతోపాటు ఆర్థిక ఫలాలనిచ్చే పంటలను ప్రోత్సహిస్తారు. మూడో పద్ధతిలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో జీవ పరిహారం, జీవ శుద్ధి కోసం మోడల్ సైట్స్ అభివృద్ధి చేస్తారు. నదీముఖ ప్రాంతం అభివృద్ధి చేయడం, ఎకో పార్కుల ఏర్పాటు, వ్యవస్థాగత, పారిశ్రామిక ప్రాంతాల్లో చెట్ల పెంపకం లాంటి చర్యలు చేపడతారు. గోదావరి, కృష్ణా నదుల స్వరూపం ఇది... మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌లో జన్మించే గోదావరి నది తూర్పు దిశగా 1,465 కి.మీ. ప్రయాణిస్తుంది. తెలంగాణలోని నిజామాబాద్ కందకుర్తిలో మంజీరా, హరిద్రా ఉప నదులతో కలసి త్రివేణి సంగమంగా ప్రవేశించే గోదావరి నది మొత్తం 509.7 కి.మీ. మేర ప్రయాణిస్తుంది. దీనికి ఐదు ఉప నదులు మానేరు (230.3 కి.మీ), మంజీరా (310.2 కి.మీ), పెన్‌గంగా (72.2 కి.మీ), ప్రాణహిత (108.5 కి.మీ), వార్దా (39.6 కి.మీ) మన రాష్ట్రంలో ప్రవహిస్తాయి. ఇక మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో జన్మించే కృష్ణమ్మ మొత్తం 1,435 కి.మీ. ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలో 7,420 చదరపు కి.మీ. పరీవాహక ప్రాంతం కలిగి ఉన్న ఈ నది భీమా, డిండి, హాలియా, కృష్ణా, మూసీ, మున్నేరు, పాలేరు, పెద్దవాగు, తుంగభద్ర ఉప నదులను కలిగి ఉంది. -
‘సీతమ్మ సాగర్’ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి సీతమ్మసాగర్‌గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.ఈ మేరకు సాగునీటి శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ఇది వరకే నిర్ణయం తీసుకోగా, దాని పేరుమార్చుతూ జీవోలు విడుదల చేయాలని ఇంజనీర్లకు సూచించారు. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో దీని పేరును సీతమ్మ సాగర్‌గా పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే గోదావరిపై చేపట్టిన తుపాకులగూడెం పేరుకు సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. -
జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. గోదావరి నీటిని వినియోగిస్తూ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్రతి బ్యారేజీ, రిజర్వాయర్‌లో నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూనే నిరంతరం అవి జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్ వేసింది. ఇప్పటికే ఖాళీ అయిన లోయర్‌మానేరు డ్యామ్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం... మరోపక్క ఎల్లంపల్లిని నింపేందుకు నిండుగా ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి పంపింగ్ మొదలుపెట్టింది. ఏప్రిల్‌లో మేడిగడ్డ మొదలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలను పూర్తిగా ఖాళీ చేసి ఆ నీటితో దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేలా ప్రణాళిక తయారు చేసింది. మొత్తంగా మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 100 టీఎంసీలు నిరంతరం లభ్యతగా ఉండేలా, జూన్‌లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి ఎస్సారెస్పీలో కనీసం 50 టీఎంసీల నీటి లభ్యత పెంచేలా భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఎల్ఎండీకి సాగుతున్న తరలింపు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా ఎల్ఎండీకి నీటి తరలింపు కొనసాగుతోంది. రాత్రి సమయంలో నంది, గాయత్రి పంపులను 8 గంటలపాటు నడుపుతూ ఎల్లంపల్లి నుంచి నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. రోజుకు అర టీఎంసీకి తగ్గకుండా సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2 టీఎంసీల మేర నీటిని తరలించగా ఎల్ఎండీలో ప్రస్తుతం 24 టీఎంసీలకుగాను 8.35 టీఎంసీల నిల్వలున్నాయి. మరో వారంపాటు ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి 13 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మిడ్‌మానేరులో నీటి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 25.87 టీఎంసీలకుగాను 24.63 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లికి మొదలైన ఎత్తిపోత... ఎల్ఎండీకి నీటిని తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను 10.98 టీఎంసీ ల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి మరో 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని గురువారం కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో నిండుకుండలా ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించేలా శుక్రవారం రాత్రి మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని మోటార్లను ప్రారంభించి ఎత్తిపోతల మొదలుపెట్టారు. ప్రస్తుతం మేడిగడ్డలో 16.12 టీఎంసీలకుగాను 14.80 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి 5 టీఎంసీలను అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించనున్నారు. మేడిగడ్డలో 11 మోటార్లు సిద్ధంగా ఉండగా ఎన్ని మోటార్లతో ఎంతమేర నీటిని, ఎన్ని రోజులపాటు నడపాలన్నది విద్యుత్ శాఖ సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఇక అన్నారంలో ఇప్పటికే 10.87 టీఎంసీలకుగాను 6 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4.5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఏప్రిల్‌లో మూడు బ్యారేజీలు ఖాళీ... ప్రస్తుతం మేడిగడ్డ మొదలు ఎల్ఎండీ వరకు 100 టీఎంసీలకుగాను సుమారు 70 టీఎంసీల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిని ఖాళీ చేస్తూ ఎల్ఎండీని నింపుతుండగా ఎల్లంపల్లిని నింపేందుకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండీ వరకు నీటి లభ్యత గణనీయంగా పెరగనుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైతే జూన్ 15 నుంచే మేడిగడ్డ వద్ద గోదావరి నీటి లభ్యత పెరుగుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రోజుకు కనీసం 2 టీఎంసీల మేర మొత్తంగా 530 టీఎంసీలను ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లభ్యతగా ఉండే నీటినంతా ఖాళీ చేసి దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు వదలాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాటిల్లో లభ్యతగా ఉన్న సుమారు 25 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలి మిగతా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయనున్నారు. బ్యారేజీలను ఖాళీ చేసి వాటిలో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉన్నా పగుళ్లు, లీకేజీలు వంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. జూన్‌లో మళ్లీ గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే నాటికి అన్ని పరిశీలనలు, మరమ్మతులు చేసి ఎత్తిపోతలకు వాటిని సిద్ధంగా ఉంచనున్నారు. జూన్‌లోనే ఎస్సారెస్పీ నుంచి సాగుకు నీళ్లు.. అయితే బ్యారేజీలను ఖాళీ చేసే సమయంలో నీటిని దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీలను నింపుతూనే మరోపక్క కొంత నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం దాని కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 62 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ప్రస్తుత యాసంగిలో మరో 25 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్‌లో బ్యారేజీలను ఖాళీ చేసే సమయానికి ఎస్సారెస్పీలో 36–37 టీఎంసీల మేర నిల్వ ఉంటుంది. బ్యారేజీల నుంచి వదిలే 24 టీఎంసీల్లో కనీసం 15–20 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తే అక్కడ 50 టీఎంసీల మేర లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత నీటితో జూన్ నుంచే ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. నిజానికి ఎస్సారెస్పీకి ఆగస్టు వరకు ఎగువ నుంచి ప్రవాహాలు రావు. కానీ ప్రస్తుతం కాళేశ్వరం నీటితో జూన్ నుంచే లభ్యత పెంచడంతోపాటు సాగుకు నీటి విడుదల సాధ్యమయ్యేలా ప్రణాళిక రచించారు. సమాంతరంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం.. కృష్ణా, గోదావరి నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా భారీగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపడుతుండటం తెలిసిందే. తొలి విడతగా ఈ ఏడాది 615 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించగా ఇందులో గోదావరి పరిధిలో 410, కృష్ణాలో 205 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని ఈ ఏడాది వర్షాలు కురిసే నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాళేశ్వరం కాల్వల పరిధిలోని 150 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించగా ఇందులో కరీంనగర్ జిల్లా పరిధిలోవే 32 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. కాళేశ్వరం పరిధిలోని చెక్‌డ్యామ్‌లను జూన్ నాటికి పూర్తి చేస్తే వాటి కింద నీటి కట్టడి సాధ్యం కానుంది.