సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసం ధానం చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ తేల్చిచెప్పింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశం బుధవారం వర్చువల్ విధానంలో జరి గింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నా గార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదు గా కావేరికి తరలించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేది కను (డీపీఆర్‌ను) రాష్ట్రాలకు అందజేశామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి గోదావరి–కావేరి అను సంధానంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకే గోదా వరి జలాలు సరిపోతాయని, నీటిలభ్యత ఎక్క డుందని జవహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు లను పరిగణనలోకి తీసుకోకుండానే డీపీఆర్ రూపొందించారని ఆక్షేపించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్‌కే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిం దని గుర్తుచేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే మిగిలి న జలాలను తరలించాలని స్పష్టం చేశారు. దీనిపై పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఆ తర్వాతే బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో అనుసంధానంపై చర్చించాలని చెప్పారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు.
కొత్త రిజర్వాయర్లు లేకుండా అనుసంధానమా?
ఇచ్చంపల్లి నుంచి తరలించే గోదావరి జలాలను నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లలో నిల్వ చేసి.. కావేరి బేసిన్‌కు తరలించేలా డీపీఆర్‌ను రూపొందించడంపై ఈఎన్‌సీ నారాయణరెడ్డి అభ్యంతరం తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిలలో నిల్వచేసే జలాలు వాటి ఆయకట్టుకే సరి పోవడం లేదన్నారు. గోదావరి జలాల నిల్వకు కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యమని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ కొత్త రిజర్వాయర్ల నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏకు సూచించారు.
నీటి లభ్యత తేల్చాకే చర్చించాలి : తెలంగాణ
గోదావరిలో నీటిలభ్యతను శాస్త్రీయంగా తేల్చా కే, కావేరికి నీటి తరలింపుపై చర్చించాలని తెలంగాణ కూడా అభిప్రాయపడింది. గోదావ రి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌ఘడ్ స్పష్టం చేసింది. కావేరి బేసిన్‌లో కర్ణాటకలోనే కరవు పీడిత ప్రాంతాలు ఎక్కువని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందువల్ల గోదావరి జ లాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీ తో పోల్చితే కృష్ణా బేసిన్‌లో తమ రాష్ట్రంలోనే కరవు పీడిత ప్రాంతాలు అధికమైనందున కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకు బదులు కృష్ణాజలాల్లో అదనపు వాటా ఇవ్వాల ని కోరింది. మహారాష్ట్ర కూడా కృష్ణాజలాల్లో అద నపు వాటా ఇవ్వాలని కోరింది. కావేరి బేసి న్‌కు గోదావరి జలాలను తరలిస్తున్నందున, కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధా నంపై ఎలాంటి అభ్యంతరం లేదని ఒడిశా తెలిపింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని తమిళనాడు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment